🌹 26, APRIL 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 26, APRIL 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 26, APRIL 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 361 / Bhagavad-Gita - 361 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 23 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 208 / Agni Maha Purana - 208 🌹 
🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 3 / Consecration of doors of the temple and the erection of banner - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 073 / DAILY WISDOM - 073 🌹 
🌻 13. వస్తువులను కలిగి ఉండాలనే కోరిక / 13. The Desire to Possess Objects 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 338 🌹
6) 🌹. శివ సూత్రములు - 75 / Siva Sutras - 75 🌹 
🌻2-01. చిత్తం మంత్రః - 2 / 2-01. Cittaṁ mantraḥ - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 26, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*

*🍀. శ్రీ గణేశ హృదయం - 20 🍀*

*20. చిత్తస్య ప్రోక్తా మునిభిః పృథివ్యో*
*నానావిధా యోగిభిరేవ గంగే |*
*తాసాం సదా ధారక ఏష వందే చాహం హి ధరణీధరమాదిభూతమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అంతరాత్మతో ప్రేమ - మానవ ప్రేమలో పలురకాలున్నాయి. వాటిలో, అంతరాత్మతో ప్రేమించేది దివ్యప్రేమకు సన్నిహితం, అంతస్స త్తకు దివ్యానందానుభవ బోధకమైన దానితో సమాగమం వాటిల్లినప్పుడు ఈ ప్రేమ ఉదయిస్తుంది. ఇది స్థిరమైనది. బాహ్యపరిస్థితులపైన ఆధారపడనిది, ఎదుటినుండి ఏమియూ ఆపేక్షింపక తననుదానే సమర్పించుకొనునట్టిది. కోపతాపాది విక్షేపాలకు లోనుగాక అవ్యాహతంగా కొనసాగునట్టిది 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల షష్టి 11:29:46
వరకు తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: పునర్వసు 31:00:13
వరకు తదుపరి పుష్యమి
యోగం: సుకర్మ 08:06:37 వరకు
తదుపరి ధృతి
కరణం: తైతిల 11:29:46 వరకు
వర్జ్యం: 17:40:30 - 19:27:06
దుర్ముహూర్తం: 11:48:39 - 12:39:25
రాహు కాలం: 12:14:02 - 13:49:13
గుళిక కాలం: 10:38:51 - 12:14:02
యమ గండం: 07:28:28 - 09:03:39
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:39
అమృత కాలం: 28:20:06 - 30:06:42
మరియు 26:42:52 - 28:30:24
సూర్యోదయం: 05:53:16
సూర్యాస్తమయం: 18:34:47
చంద్రోదయం: 10:41:38
చంద్రాస్తమయం: 00:21:50
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: గద యోగం - కార్య హాని ,
చెడు 31:00:13 వరకు తదుపరి మతంగ
యోగం - అశ్వ లాభం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 361 / Bhagavad-Gita - 361 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 23 🌴*

*23. యేప్యన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితా: |*
*తేపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపుర్వకమ్ ||*

🌷. తాత్పర్యం :
*ఓ కౌంతేయా! అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు.*

🌷. భాష్యము :
*“దేవతార్చనమునందు నియుక్తులైనవారు చేసెడి అర్చనము నాకే పరోక్షముగా అర్పింపబడినాడు వారు నిజమునకు మందబుద్దులై యున్నారు” అని శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. ఉదాహరణకు ఒకడు కొమ్మలకు, ఆకులకు నీరుపోసి చెట్టు మొదలుకు నీరుపోయనిచే తగినంత జ్ఞానము లేనివాడుగా (నియమపాలనము లేనివాడు) పరిగణింపబడును. అదేవిధముగా ఉదరమునకు ఆహారము నందించుటయే దేహేంద్రియములన్నింటిని సేవించుట లేదా పోషించుట కాగలదు. వాస్తవమునకు దేవతలు భగవానుని ప్రభుత్వమున వివిధ అధికారులు మరియు నిర్దేశకుల వంటివారు.*

*జనులు ప్రభుత్వముచే ఏర్పరచబడిన శాసనములనే అనుసరించవలెను గాని, దాని యందలి అధికారులు లేదా నిర్దేశకుల వ్యక్తిగత శాసనములకు కాదు. అదేవిధముగా ప్రతియొక్కరు భగవానునే అర్చించవలెను. తద్ద్వారా అతని వివిధ అధికారులు మరియు నిర్దేశకులు ప్రభుత్వ ప్రతినిధులుగా తమ కార్యములందు నియుక్తులై యున్నందున వారికి లంచమివ్వజూచుట వాస్తవమునకు చట్టవిరుద్ధము. ఈ విషయమే ఇచ్చట “అవిధిపూర్వకమ్” అని తెలుపబడినది. అనగా అనవసరమైన అన్యదేవతార్చనమును శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ఆమోదించుట లేదు.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 361 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 23 🌴*

*23. ye ’py anya-devatā-bhaktā yajante śraddhayānvitāḥ*
*te ’pi mām eva kaunteya yajanty avidhi-pūrvakam*

🌷 Translation : 
*Those who are devotees of other gods and who worship them with faith actually worship only Me, O son of Kuntī, but they do so in a wrong way.*

🌹 Purport :
*“Persons who are engaged in the worship of demigods are not very intelligent, although such worship is offered to Me indirectly,” Kṛṣṇa says. For example, when a man pours water on the leaves and branches of a tree without pouring water on the root, he does so without sufficient knowledge or without observing regulative principles. Similarly, the process of rendering service to different parts of the body is to supply food to the stomach. The demigods are, so to speak, different officers and directors in the government of the Supreme Lord. One has to follow the laws made by the government, not by the officers or directors.*

*Similarly, everyone is to offer his worship to the Supreme Lord only. That will automatically satisfy the different officers and directors of the Lord. The officers and directors are engaged as representatives of the government, and to offer some bribe to the officers and directors is illegal. This is stated here as avidhi-pūrvakam. In other words, Kṛṣṇa does not approve the unnecessary worship of the demigods.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 208 / Agni Maha Purana - 208 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 61*

*🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 3 🌻*

*పాషాణాదులలో నున్న జలము పార్థివజలము దానిలో పృథీవీగుణ మగు గంధ ముండును. ప్రతిధ్వనిరూప శబ్దమే అచటి శబ్దము. స్పృశింపగా కనబడు కఠోరత్వాదికమే స్పర్శ. శుక్లాదీవర్ణములు రూపము. ఆహ్లాదమును కలిగించు రసమే రసము ధూపాదిగంధమే గంధము భేర్యాదులలో ప్రకట మగు నాదమేవాక్కు. అది వాగింద్రియము వంటిది అందుచే వాగింద్రియము అచటనే ఉన్నదిని భావించవలెను. నాసిక శుకనాసయం దుండను, దాని రథకములు భుజములు. శిఖరముపై అండాకారము నున్నది శిరస్సు. కలశ కేశపాశము. ప్రాసాదకంఠభాగము కంఠము. వేది భుజము. రెండు నాళికలు గుదోపస్థులు . సున్నము త్వక్కు. ద్వారము ముఖము. ప్రతిమయే దేవాలయజీవాత్మ. పిండిక జీవశక్తి. దాని ఆకారము ప్రకృతి. నిశ్చలత దాని గర్భము. నారాయణుడు దాని అధిష్ఠాత. ఈ విధముగ మహావిష్ణులే దేవాలయరూపమున నిలచియున్నాడు. శివుడు కాళ్ళు; బ్రహ్మ స్కంధముపైన నున్నాడు.(

*ఊర్థ్వభాగమున సాక్షాత్తు విష్ణువే ఉండును. ఈ విధముగ నున్న ప్రాసాదమున ప్రతిష్ఠింపబడు ధ్వజమును గూర్చి వినుము. శస్త్రాదిచిహ్నములతో కూడిన ధ్వజమును నిలబెట్టి దేవతలు దైత్యులను జయించిరి. అండముపై కలశము నుంచి, దానిపైన ధ్వజమును స్థాపింపవలెను. ధ్వజమానము బింబమానములో సగ ముండవలెను. ద్వజదండము పొడవులో మూడవ వంతుతో చక్రము నిర్మింపవలెను. ఆ చక్రమునందు ఎనిమిది కాని పండ్రెండు గాని ఆకు లుండవలెను. దాని మధ్య నృసింహుని మూర్తి గాని, గరుడుని మూర్తి గాని ఉండవలెను. ధ్వజదండము విరిగినదిగాని, రంధ్రాదు లున్నది గాని కాకూడదు. దండము పొడవు ప్రాసాదము వెడిల్పుతో సమముగా నుండవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 208 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 61*
*🌻Consecration of doors of the temple and the erection of banner - 3 🌻*

21. The earthly waters found in the stone slabs (of the temple) (represent) the earthly attributes. Its echo stands for the principles of sound. Its touch represents roughness.

22. Its colour which may be white or otherwise stands for the subtle principle of colour. The food (and other eatables) offered (to the deity) stand for the sense of taste. The perfumes represent the sense of smell. The sense of speech lies in the down (used in the temple).

23. The keystone is the nose (of the temple). The two apertures (on either side) represent the two hands. The arched terrace above is to be taken for its head and the pitcher on the head.

24. Its neck should be known as the neck. The platform over the fault is spoken as the shoulder. The outlets for water are the anus and genitals. The lime-plaster is spoken as the skin.

25. The door would be the mouth. The image (installed in the temple) is said to be its life. The pedestal should be known as its energy. Its shape should likewise be known as its animation.

26. Its cavity is its inertia. Lord Keśava is its controller. In this way Lord Hari Himself remains in the form of the temple.

27. God Śiva should be known as the shank. God Brahman is located in the shoulder. Lord Viṣṇu remains in the upper portion of a temple as it is.

28. Listen to me. I shall describe the consecration of a temple by means of a banner. The demons were defeated by the celestial gods by erecting banners impressed with the signs of divine weapons.

29. The pitcher (shaped part of the temple) should be placed over the top and the flag should be placed over the same. The post should be made to measure a half or one third of the height of the image.

30. The flag should have a mark of a circle of eight or twelve radii. (There should be the figure) of the man-lion (form of Viṣṇu) or the Garuḍa (Tārkṣya) (inside the circle) in the middle. The staff of the flag should not have any cut.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 73 / DAILY WISDOM - 73 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 13. వస్తువులను కలిగి ఉండాలనే కోరిక 🌻*

*ఒక నిర్దిష్ట వస్తువుని కోసం మనస్సు వాంచించడం అంటే ఆ వస్తువు యొక్క ఉనికితో ఐక్యం కావాలనే బలమైన కోరిక. కాబట్టి, సొంతం చేసుకోవాలనే ఆలోచన చాలా బలమైనది. ఇది వాస్తవానికి వస్తువుతో ఐక్యం కావాలనే కోరిక, తద్వారా మీరు కేవలం బాహ్యంగా కాక, మానసికంగా కూడా సంపూర్ణులౌతారు.*

*అయితే ఇది సాధ్యం కాదు, ఎందుకంటే మీరు ఏ వస్తువు యొక్క ఉనికిలోకి ప్రవేశించలేరు. అందువల్ల, కోరిక నెరవేరిన తర్వాత కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు. ఏ కోరిక అయినా శాశ్వతంగా నెరవేరదు ఎందుకంటే మీరు ఏ ప్రయత్నం చేసినా, ఆ వస్తువు యొక్క ఉనికిలోకి ప్రవేశించడం మీకు సాధ్యం కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 73 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 13. The Desire to Possess Objects 🌻*

*The desire of the mind for a particular desirable object is a desire to get united with that object in its being. So, the idea of possession is something very strong, indeed. It is actually a desire to get united with the object, so that you become physically, psychologically whole in being, and not merely in an external relation.*

*This condition is however not possible, as you cannot enter into the being of any object. Therefore, there is not such satisfaction even after the fulfilment of a desire. No desire can be fulfilled eternally, whatever be the effort that you put forth, because it is not possible for you to enter into the being of that object.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 338 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితం శాశ్వతమైంది. మనం ఎప్పుడు యిక్కడే వున్నాం. ఎప్పుడూ యిక్కడే వుంటాం. మనం మరణం లేని వాళ్ళం. శరీరం మారుతూ పోతూ వుంటుంది. మనం శరీరం కాము, మనసూ కాము. గాఢమయిన ధ్యానం ఆ విషయం కనిపెడుతుంది. 🍀*

*ఆధునిక మానవుడు ఎంత హడావుడిగా వున్నాడంటే అతనికి కూర్చునే సమయం కూడా లేదు. విశ్రాంతికి అతనికి సమయం లేదు. నీకు విశ్రాంతి తీసుకునే సమయం లేకపోతే నువ్వు విలువైన దానికి అర్హుడు కావు. వాస్తవమేమిటంటే మనం దేన్ని గురించీ మరీ ఎక్కువగా బాధపడాల్సిన పన్లేదు. జీవితం శాశ్వతమైంది. మనం ఎప్పుడు యిక్కడే వున్నాం. ఎప్పుడూ యిక్కడే వుంటాం.*

*మనం మరణం లేని వాళ్ళం. శరీరం మారుతూ పోతూ వుంటుంది. మనం శరీరం కాము, మనసూ కాము. గాఢమయిన ధ్యానం ఆ విషయం కనిపెడుతుంది. మనం చైతన్యం, మెలకువ, మనం ఈ ఆటకు సాక్షీభూతులం. నువ్వొకసారి ఆ సాక్షీభూతాన్ని అనుభవానికి తెచ్చుకుంటే తేనె మాధుర్యాన్ని చవి చూస్తావు. రసవాదులు పరిశోధించే తేనె అదే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 075 / Siva Sutras - 075 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 01. చిత్తం మంత్రః - 2 🌻*
*🌴. స్వీయ-సాక్షాత్కారమైన యోగి యొక్క చైతన్యమే (చిత్తం) మంత్రం. శక్తిని ఆవాహన చేసే మరియు వ్యక్తీకరించే సిద్ధి.🌴*

*ఇది ఒక వ్యక్తి యొక్క అవగాహన అతని ఇంద్రియాల నుండి విడదీయబడే దశ. ఈ సమయంలో అతని మనస్సులో ఇంద్రియ జ్ఞానం ఉండదు. మనస్సున ఇంద్రియ జ్ఞానం లేకున్నపుడే ఉన్నత స్థాయి చైతన్యానికి చేరుకోగలం. స్వచ్ఛమైన చైతన్య రూపంలో మాత్రమే పరమ సత్యాన్ని గ్రహించగలం. ఇంద్రియ భావనల నుంచి మనసును విడదీయడమే కాకుండా ఇంద్రియ ముద్రలను కూడా అధిగమించాలి. ఇంద్రియ ముద్రలు భావనల కంటే ఎక్కువ హానికరం. చంచలమైన మనస్సును నియంత్రించే సాధనాలలో మంత్రం ఒకటి. ఏదైనా మంత్రాన్ని పదేపదే పఠించడం వల్ల వ్యక్తి ఏకాగ్రతను పెంపొందించుకుంటాడు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 075 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 01. Cittaṁ mantraḥ - 2 🌻*
*🌴. The consciousness (chitta) of a self-realized yogi is mantra, with the power to invoke and manifest the shaktis.🌴*

*This is the stage, where one’s awareness is disconnected from his senses. His mind at this point becomes devoid of sensory perceptions. Only if the mind becomes devoid of sensory perceptions, the higher level of consciousness can be reached. Only in the purest form of consciousness, Supreme Reality can be realised. Apart from delinking the mind from sensory perceptions, one has to get over sensory impressions also. Sensory impressions are more harmful than perceptions. Mantra is one of the tools, by which one can control the wavering mind. The repeated recitation of any mantra makes a person to develop concentration.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 450 / Sri Lalitha Chaitanya Vijnanam - 450


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 450 / Sri Lalitha Chaitanya Vijnanam - 450 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀

🌻 450. 'తేజోవతి' 🌻


తేజస్సు గలది శ్రీమాత అని అర్థము. ఎచ్చట తేజస్సు గోచరించిననూ అది శ్రీమాతయే అని తెలియ వలెను. సూర్యుని యందు వెలుగు, చంద్రుని యందు వెన్నెల, అగ్ని యందలి తేజస్సు, కన్నుల యందలి కాంతి ఇత్యాది వన్నియూ శ్రీమాత దర్శనమే. ఆమె సహజమగు వెలుగు. రాళ్ళయందు రత్నమునకు విలువ కాంతిని బట్టియే. అట్లే లోహములందు వెండి, బంగారము. వృక్షముల యందు దేవదారు, రావి. పుష్పముల యందు మల్లెలు, కమలములు. అట్లే జంతువుల యందు తెల్లని ఏనుగు, గుఱ్ఱము, పావురము, హంస, కుక్క, నాగుపాము. అదే విధముగ మానవుల యందు విద్యావంతులు, సాత్త్వికులు. ఇట్లు కాంతి దర్శనము లన్నియూ శ్రీమాత దర్శనములే అని భావింపవలెను. పంచభూతములలో ఆకాశము, రంగులలో తెలుపు, అక్షరము లలో 'అ', అంకెలలో పది ఇత్యాదివి పూర్ణ ప్రకాశములు. ఇట్లుతెల్లని స్వచ్ఛమైన కాంతిని గుర్తించుచూ శ్రీమాత భావమున నిలచుట ఆరాధనలో భాగము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 450 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻

🌻 450. 'Tejovati' 🌻


It means that Srimata is the radiant one. Wherever there is radiance, that is of Srimata. The light of the sun, the light of the moon, the brightness of fire, the light of the eyes, etc., are all Srimata's vision. She is the natural radiance. The value of the gem in the stones depends on it's light. Such are the metals silver and gold. Among the trees are cedar and raavi. Among the flowers are jasmine and lotus. Among such animals are white elephant, horse, pigeon, swan, dog and cobra. Among human beings are the educated and the sattviks(pious). All these visions of light should be considered as visions of Sri Mata. Sky in Panchabhutas, white in colors, 'A' in letters, ten in numbers etc. are full luminous. Recognizing the white pure light and standing with the thought of Sri Mata is part of worship.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 340. DRUGS / ఓషో రోజువారీ ధ్యానాలు - 340. మత్తు మందులు



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 340 / Osho Daily Meditations - 340 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 340. మత్తు మందులు 🍀

🕉. మత్తు మందులు వాడకపోవడమే మంచిది, ఎందుకంటే కొన్నిసార్లు అవి మీకు కొన్ని అనుభవాలను అందించగలవు మరియు అదే సమస్య. ఒకసారి మీరు ఈ విధంగా అనుభవాలను పొంది నట్లయితే, వాటిని సహజంగా-మత్తుపదార్థాలు లేకుండా చేరుకోవడం చాలా కష్టం. ప్రాథమిక విషయం అనుభవం పొందడం కాదు ; దాని ద్వారా పెరగడం. 🕉


మీరు మందు ద్వారా అనుభవాన్ని పొందవచ్చు, కానీ మీరు ఎదగలేరు. అనుభవం మీకు వస్తుంది; మీరు అనుభవంలోకి వెళ్లరు. మీరు హిమాలయాలను ఒక దర్శనంలో చూసినట్లుగా ఉంటుంది. అది వెళ్ళినంత వరకు అందంగా ఉంటుంది, కానీ అది చాలా దూరం వెళ్ళదు. మీరు అలాగే ఉండండి. క్రమంగా, దృష్టి మీ వాస్తవికతగా మారితే, మీరు ఏదో కోల్పోతారు, ఎందుకంటే మీరు దానికి బానిస అవుతారు. లేదు, హిమాలయాలకు వెళ్లడం మంచిది. అది కష్టం; అది సుదీర్ఘ ప్రయాణం. డ్రగ్స్ దానిని చాలా చిన్నదిగా చేస్తాయి. వారు దాదాపు హింసాత్మకంగా ఉంటారు; వారు అకాలంగా ఏదో బలవంతం చేస్తారు. ప్రయాణంలో చాలా దూరం వెళ్ళడం మంచిది, ఎందుకంటే పోరాటం ద్వారా మాత్రమే మీరు పెరుగుతారు. మీలో ఏకీకరణ పుడుతుంది మరియు మీరు స్ఫటికీకరించ బడతారు. అది అసలు విషయం-- అనుభవం అప్రస్తుతం. అసలు విషయం ఎదుగుదల.

నా దృష్టి అంతా ఎదుగుదలకు మాత్రమేనని, అనుభవాలపై కాదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మనసు ఎప్పుడూ కొత్త అనుభవాల కోసం అడుగుతోంది; ఇది అనుభవాలతో వ్యామోహం కలిగి ఉంది-మరియు మనం మనస్సును దాటి వెళ్ళాలి. కాబట్టి నిజమైన ఆధ్యాత్మిక కోణం అనుభవం యొక్క పరిమాణం కాదు. నిజానికి, అనుభవించడానికి ఏమీ లేదు. మీరు మాత్రమే - మీరు కూడా కాదు, పరిమితి లేని స్వచ్ఛమైన స్పృహ, దానికి ఎటువంటి వస్తువు లేకుండా - కేవలం స్వచ్ఛమైన ఆత్మాశ్రయత, కేవలం ఉండటం. మీరు అందమైన విషయాలను అనుభవించడం కాదు. మీరు అందంగా ఉన్నారు, కానీ మీరు అందమైన విషయాలను అనుభవించలేరు. మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ ఏమీ జరగదు. చుట్టూ విపరీతమైన శూన్యం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 340 🌹

📚. Prasad Bharadwaj

🍀 340. DRUGS 🍀

🕉. It is better not to use drugs, because sometimes they can give you certain experiences, and that's the problem. Once you have the experiences this way, it is very difficult to reach them naturally-without drugs. And to have an experience is not the basic thing; to grow through it is. 🕉


You can have an experience through a drug, but you don't grow. The experience comes to you; you don't go to the experience. It is as if you have seen the Himalayas in a vision-beautiful as far as it goes, but it does not go very far. You remain the same. By and by, if the vision becomes your reality, you are losing something, because you will become addicted to it. No, it is better to -go to the Himalayas. It is hard; it is a long journey. Drugs make it too short. They are almost violent; they force something premature. It is better to go the long way, because only through struggle do you grow. An integration arises in you, and you become crystallized. That's the real thing-- experience is irrelevant. The real thing is growth.

Always remember that my whole emphasis is on growth, not on experiences. The mind is always asking for more and new experiences; it is infatuated with experiences-and we have to -go beyond the mind. So the real spiritual dimension is not the dimension of experience. In fact, there is nothing to experience. Only you-not even you, just pure consciousness with no limit, with no object to it--just pure subjectivity, just being. Not that you experience beautiful things. You are beautiful, but you don't experience beautiful things. You are tremendously beautiful, but nothing happens. All around is tremendous emptiness.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 721 / Sri Siva Maha Purana - 721


🌹 . శ్రీ శివ మహా పురాణము - 721 / Sri Siva Maha Purana - 721 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 08 🌴

🌻. రథ నిర్మాణము - 1 🌻



వ్యాసుడిట్లు పలికెను -

తండ్రీ! సనత్కుమారా! నీవు సర్వమునెరింగిన వాడవు. శివభక్త శిఖామణివి. ఈశ్వరుని యందు లగ్నమైన మనస్సు గలవాడువు. పరమేశ్వరుని ఈ అద్భుత గాథను వినిపించితివి (1). బుద్ధిమంతుడగు విశ్వకర్మ శివుని కొరకు నిర్మించిన దేవాత్మకమగు పరమదివ్యరథము యొక్క నిర్మాణమును గూర్చి ఇపుడు వివరించుము (2).


సూతుడిట్లు పలికెను -

ఆ వ్యాసుని ఈ మాటను విని మహర్షి శ్రేష్ఠుడగు ఆ సనత్కుమారుడు శివుని పాదపద్మములను స్మరించి ఇట్లు పలికెను (3).


సనత్కుమారుడిట్లు పలికెను -

వ్యాసా! నీవు గొప్ప బుద్ధిశాలివి. ఓ మునీ! రథము మొదలగు వాటి నిర్మాణమును గురించి వినుము. నేను శివుని పాదపద్మములను స్మరించి నా బుద్ధికి తోచిన విధముగా చెప్పెదను (4).

అపుడు రుద్రుదేవుని కొరకు విశ్వకర్మ శ్రద్ధతో ప్రయత్న పూర్వకముగా సర్వలోకములను తనలో కలిగియున్న దివ్యరథతమును నిర్మించెను (5). సర్వభూతములు ఆ రతము నందు గలవు. ఆ బంగరు రథము అందరి ప్రశంసల నందుకొనెను. దాని కుడి చక్రము సూర్యుడు కాగా, చంద్రుడు ఎడమ చక్రమాయెను (6). కుడి చక్రమునకు పన్నెండు, ఎడమ చక్రమునకు పదహారు కమ్మీలు ఉండెను. ఓ బ్రాహ్మాణ శ్రేష్ఠా! ఆ కమ్మీల యందు ద్వాదశాదిత్యులు అధిష్టించి యుండిరి (7).

గొప్ప వ్రతము గలవాడా! చంద్రుని పదునారు కళలు ఎడమ చక్రము యొక్క కమ్మీలు అయినవి. నక్షత్రములు ఆ ఎడమ చక్రమునకు ఆభరణములైనవి (8). ఓ విప్రశ్రేష్ఠా! ఆరు ఋతువులు ఆ చక్రములను చుట్టి యుండు బద్దీలైనవి. అంతరిక్షము రథమునకు ముందు భాగము ఆయెను. మందర పర్వతము రథములో కూర్చుండు స్థానమాయెను (9). అస్తాచల, ఉదయాచలములు రథమునకు ముందు ఉండు స్తంభములాయెను. మహమేరువు మూలాధిష్ఠానము కాగా, మేరు శిఖరములు అధిష్టానములోని ఇతర భాగములాయెను (10).



సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 721🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 08 🌴

🌻 The detailed description of the chariot etc. - 1 🌻


Vyāsa said:—

1. O Sanatkumāra, of good intellect, O omniscient one, O foremost among the devotees of Śiva, this wonderful story of lord Śiva has been narrated to us.

2. Now please mention the structure of the chariot[1] which consisted of all the gods and which had been made by the intelligent Viśvakarman.


Sūta said:—

3. On hearing these words of Vyāsa, Sanatkumāra the great sage remembered the lotus-like feet of Śiva and spoke thus.


Sanatkumāra said:—

4. O sage Vyāsa, of great intellect, listen to the description of the structure of the chariot etc which I shall give to the extent of my intellect after remembering the lotus-like feet of Śiva.

5. The divine chariot of lord Śiva consisting of all the worlds was built by Viśvakarman with devoted effort.

6. It was appreciated by all. It was golden in colour and all the elements had gone into its making. The right wheel was the sun and the left wheel was the moon.

7-8. The right wheel had twelve spokes. O great brahmin, the twelve Ādityas presided over them. The left wheel had sixteen spokes. O you of excellent rites, the sixteen spokes of the left side wheel consisted of the sixteen digits of the moon. All the asterism? embellished the left side.

9. The six seasons constituted the rims of the wheels of the chariot, O great Brahmin. The Puṣkara of the chariot was the sky. The inner side of the chariot was Mandara.

10. The rising and the setting mountains constituted the poleshafts. Mahāmeru was the support and the Keśara mountains the sharp sides.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 760 / Vishnu Sahasranama Contemplation - 760


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 760 / Vishnu Sahasranama Contemplation - 760🌹

🌻760. ప్రగ్రహః, प्रग्रहः, Pragrahaḥ🌻

ఓం ప్రగ్రహాయ నమః | ॐ प्रग्रहाय नमः | OM Pragrahāya namaḥ

ప్రగృహ్ణాతి హరిః పత్ర పుష్పాదికముపాహృతమ్ ।
భక్తైరితి ప్రగ్రహ ఇత్యుచ్యతే విబుధోత్తమైః ॥

ధావతో విషయారణ్యే దుర్ధాన్తేన్ద్రియ వాజినః ।
తత్ప్రసాదేన బధ్నాతి రశ్మినేవేతి వా హరిః ॥

మిక్కిలిగా గ్రహించువాడు ప్రగ్రహః. భక్తులచే తనకు ఉపహారముగా సమర్పింపబడు పత్ర పుష్పాదికమును కూడ గొప్ప పదార్థముగా గ్రహించువాడు.

అరణ్యమునందు అదుపులోనుంచుటకు అలవికానటువంటి అశ్వములు పరుగెత్తుచున్నట్లు అదుపు తప్పిన విషయ సుఖములు, విషయసుఖ వాంఛలను తన అనుగ్రహమనబడెడి పగ్గముతో కట్టివేయును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 760🌹

🌻760. Pragrahaḥ🌻

OM Pragrahāya namaḥ


प्रगृह्णाति हरिः पत्र पुष्पादिकमुपाहृतम् ।
भक्तैरिति प्रग्रह इत्युच्यते विबुधोत्तमैः ॥

धावतो विषयारण्ये दुर्धान्तेन्द्रिय वाजिनः ।
तत्प्रसादेन बध्नाति रश्मिनेवेति वा हरिः ॥

Pragr‌hṇāti hariḥ patra puṣpādikamupāhr‌tam,
Bhaktairiti pragraha ityucyate vibudhottamaiḥ.

Dhāvato viṣayāraṇye durdhāntendriya vājinaḥ,
Tatprasādena badhnāti raśmineveti vā hariḥ.


The One who receives greatly. He receives offerings made by devotees even like a leaf or flower in great abundance is Pragrahaḥ.

He controls, by the reins dowered by His grace, the horses that are the sense organs which caper in the forest of sense objects.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr‌ṣo dyutidharassarvaśastrabhr‌tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr‌ṅgo gadāgrajaḥ ॥ 81 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹




కపిల గీత - 168 / Kapila Gita - 168


🌹. కపిల గీత - 168 / Kapila Gita - 168 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 22 🌴
 

22. యచ్ఛౌచనిస్సృతసరిత్ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్న్యధికృతేన శివః శివోఽభూత్|
ధ్యాతుర్మనశ్శమలశైలనిసృష్టవజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందమ్॥



తాత్పర్యము : బ్రహ్మదేవుడు కడిగిన విష్ణుపాదములనుండి ప్రవహించిన పవిత్ర గంగాజలములను స్వయముగా శ్రీహరి పాదములను ఈశ్వరుడు తన శిరమున దాల్చి, మరింతమంగళ స్వరూపుడాయెను. ధ్యానించువారి మనస్సుల యందలి పాపములనెడి పర్వతములను ఛేదించుటలో అవి (ఆ పాదములు) వజ్రాయుధమువంటివి. అనగా ఆ పుణ్యపాదములను స్మరించిన వారియొక్క పాపరాశి వెంటనే రూపుమాసిపోవును. అట్టి సర్వేశ్వరుని చరణకమలములను చిరకాలము ధ్యానింపవలెను.


వ్యాఖ్య : ఈ శ్లోకంలో శివుని స్థానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పరమ సత్యానికి రూపం లేదని, అందువల్ల విష్ణువు లేదా శివుడు లేదా దుర్గాదేవి లేదా వారి కుమారుడు గణేశుడి రూపాన్ని సమానంగా ఊహించవచ్చని అపురూపవాది సూచిస్తాడు. కానీ నిజానికి పరమేశ్వరుడే అందరికీ అధిపతి. శివుడు ముఖ్యమైనవాడు, ఎందుకంటే అతను పవిత్ర గంగా జలాన్ని తన శిరస్సుపై ఉంచుకుంటున్నాడు, ఇది విష్ణు భగవానుడి పాదాలను కడగడం ద్వారా ఉద్భవించింది. సనాతన గోస్వామి రచించిన హరిభక్తి విలాసలో, శివుడు మరియు బ్రహ్మ భగవానుడు సహా పరమేశ్వరులను మరియు దేవతలను ఒకే స్థాయిలో ఉంచే ఎవరైనా వెంటనే పాశీశ్వరుడు లేదా నాస్తికుడు అవుతారని చెప్పబడింది. సర్వోన్నతుడైన విష్ణువు, దేవతలు సమాన స్థాయిలో ఉన్నారని మనం ఎన్నడూ భావించకూడదు.

ఈ శ్లోకంలోని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కండిషన్ చేయబడిన ఆత్మ యొక్క మనస్సు, అనాదిగా భౌతిక శక్తితో అనుబంధం కారణంగా, భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలనే కోరికల రూపంలో మురికి కుప్పలను కలిగి ఉంటుంది. ఈ మురికి పర్వతం లాంటిది, కానీ పిడుగు పడినప్పుడు పర్వతం ఛిన్నాభిన్నమవుతుంది. భగవంతుని తామర పాదాలను ధ్యానించడం వల్ల యోగి మనస్సులోని మురికి పర్వతంపై పిడుగులా పనిచేస్తుంది. ఒక యోగి తన మనస్సులోని మురికి పర్వతాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే, అతను భగవంతుడి తామర పాదాలపై దృష్టి పెట్టాలి.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 168 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 22 🌴

22. yac-chauca-niḥsṛta-sarit-pravarodakena tīrthena mūrdhny adhikṛtena śivaḥ śivo 'bhūt
dhyātur manaḥ-śamala-śaila-nisṛṣṭa-vajraṁ dhyāyec ciraṁ bhagavataś caraṇāravindam



MEANING : The blessed Lord Śiva becomes all the more blessed by bearing on his head the holy waters of the Ganges, which has its source in the water that washed the Lord's lotus feet. The Lord's feet act like thunderbolts hurled to shatter the mountain of sin stored in the mind of the meditating devotee. One should therefore meditate on the lotus feet of the Lord for a long time.


PURPORT : In this verse the position of Lord Śiva is specifically mentioned. The impersonalist suggests that the Absolute Truth has no form and that one can therefore equally imagine the form of Viṣṇu or Lord Śiva or the goddess Durgā or their son Gaṇeśa. But actually the Supreme Personality of Godhead is the supreme master of everyone. Lord Śiva is important because he is holding on his head the holy Ganges water, which has its origin in the foot-wash of Lord Viṣṇu. In the Hari-bhakti-vilāsa, by Sanātana Gosvāmī, it is said that anyone who puts the Supreme Lord and the demigods, including Lord Śiva and Lord Brahmā, on the same level, at once becomes a pāṣaṇḍī, or atheist. We should never consider that the Supreme Lord Viṣṇu and the demigods are on an equal footing.

Another significant point of this verse is that the mind of the conditioned soul, on account of its association with the material energy from time immemorial, contains heaps of dirt in the form of desires to lord it over material nature. This dirt is like a mountain, but a mountain can be shattered when hit by a thunderbolt. Meditating on the lotus feet of the Lord acts like a thunderbolt on the mountain of dirt in the mind of the yogī. If a yogī wants to shatter the mountain of dirt in his mind, he should concentrate on the lotus feet of the Lord.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

25 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 25, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

🍀. శంకరాచార్య జయంతి, సూరదాసు జయంతి, స్కంద షష్టి, రామానుజ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Shankaracharya Jayanti, Surdas Jayanti Skanda Sashti, Ramanuja Jayanti to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : శంకరాచార్య జయంతి, సూరదాసు జయంతి, స్కంద షష్టి, రామానుజ జయంతి, Shankaracharya Jayanti, Surdas Jayanti Skanda Sashti, Ramanuja Jayanti 🌻

🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం -1 🍀

01. హనూమాన్ శ్రీప్రదో వాయుపుత్రో రుద్రో నయోఽజరః |
అమృత్యుర్వీరవీరశ్చ గ్రామవాసో జనాశ్రయః

02. ధనదో నిర్గుణాకారో వీరో నిధిపతిర్మునిః |
పింగాక్షో వరదో వాగ్మీ సీతాశోకవినాశనః

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : దివ్యప్రేమోపలబ్ధి - మానవ ప్రేమ వలె గాక దివ్యప్రేమ పరమ గంభీరము, సువిశాలము. ప్రశాంత లక్షణో పేతము. నీవు దానిని తెలుసుకుని దాని చేత ప్రభావితుడవు కావాలంటే నీవు కూడా ప్రశాంతతను చిక్కబట్టుకుని సువిశాలుడవు కావడం అవసరం. సర్వ సమర్పణ భావం ఇందుకు ముఖ్యసాధనం. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

వైశాఖ మాసం

తిథి: శుక్ల పంచమి 09:41:21 వరకు

తదుపరి శుక్ల షష్టి

నక్షత్రం: ఆర్ద్ర 28:21:28

వరకు తదుపరి పునర్వసు

యోగం: అతిగంధ్ 07:44:05 వరకు

తదుపరి సుకర్మ

కరణం: బాలవ 09:42:21 వరకు

వర్జ్యం: 11:18:33 - 13:03:25

దుర్ముహూర్తం: 08:26:00 - 09:16:43

రాహు కాలం: 15:24:22 - 16:59:27

గుళిక కాలం: 12:14:12 - 13:49:17

యమ గండం: 09:04:02 - 10:39:07

అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:39

అమృత కాలం: 17:25:35 - 19:10:27

మరియు 28:20:06 - 30:06:42

సూర్యోదయం: 05:53:52

సూర్యాస్తమయం: 18:34:32

చంద్రోదయం: 09:48:05

చంద్రాస్తమయం: 23:32:42

సూర్య సంచార రాశి: మేషం

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: చర యోగం - దుర్వార్త శ్రవణం

28:21:28 వరకు తదుపరి స్థిర యోగం -

శుభాశుభ మిశ్రమ ఫలం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹