🌹 26, APRIL 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 26, APRIL 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 26, APRIL 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 361 / Bhagavad-Gita - 361 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 23 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 208 / Agni Maha Purana - 208 🌹 
🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 3 / Consecration of doors of the temple and the erection of banner - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 073 / DAILY WISDOM - 073 🌹 
🌻 13. వస్తువులను కలిగి ఉండాలనే కోరిక / 13. The Desire to Possess Objects 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 338 🌹
6) 🌹. శివ సూత్రములు - 75 / Siva Sutras - 75 🌹 
🌻2-01. చిత్తం మంత్రః - 2 / 2-01. Cittaṁ mantraḥ - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 26, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*

*🍀. శ్రీ గణేశ హృదయం - 20 🍀*

*20. చిత్తస్య ప్రోక్తా మునిభిః పృథివ్యో*
*నానావిధా యోగిభిరేవ గంగే |*
*తాసాం సదా ధారక ఏష వందే చాహం హి ధరణీధరమాదిభూతమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అంతరాత్మతో ప్రేమ - మానవ ప్రేమలో పలురకాలున్నాయి. వాటిలో, అంతరాత్మతో ప్రేమించేది దివ్యప్రేమకు సన్నిహితం, అంతస్స త్తకు దివ్యానందానుభవ బోధకమైన దానితో సమాగమం వాటిల్లినప్పుడు ఈ ప్రేమ ఉదయిస్తుంది. ఇది స్థిరమైనది. బాహ్యపరిస్థితులపైన ఆధారపడనిది, ఎదుటినుండి ఏమియూ ఆపేక్షింపక తననుదానే సమర్పించుకొనునట్టిది. కోపతాపాది విక్షేపాలకు లోనుగాక అవ్యాహతంగా కొనసాగునట్టిది 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల షష్టి 11:29:46
వరకు తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: పునర్వసు 31:00:13
వరకు తదుపరి పుష్యమి
యోగం: సుకర్మ 08:06:37 వరకు
తదుపరి ధృతి
కరణం: తైతిల 11:29:46 వరకు
వర్జ్యం: 17:40:30 - 19:27:06
దుర్ముహూర్తం: 11:48:39 - 12:39:25
రాహు కాలం: 12:14:02 - 13:49:13
గుళిక కాలం: 10:38:51 - 12:14:02
యమ గండం: 07:28:28 - 09:03:39
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:39
అమృత కాలం: 28:20:06 - 30:06:42
మరియు 26:42:52 - 28:30:24
సూర్యోదయం: 05:53:16
సూర్యాస్తమయం: 18:34:47
చంద్రోదయం: 10:41:38
చంద్రాస్తమయం: 00:21:50
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: గద యోగం - కార్య హాని ,
చెడు 31:00:13 వరకు తదుపరి మతంగ
యోగం - అశ్వ లాభం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 361 / Bhagavad-Gita - 361 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 23 🌴*

*23. యేప్యన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితా: |*
*తేపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపుర్వకమ్ ||*

🌷. తాత్పర్యం :
*ఓ కౌంతేయా! అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు.*

🌷. భాష్యము :
*“దేవతార్చనమునందు నియుక్తులైనవారు చేసెడి అర్చనము నాకే పరోక్షముగా అర్పింపబడినాడు వారు నిజమునకు మందబుద్దులై యున్నారు” అని శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. ఉదాహరణకు ఒకడు కొమ్మలకు, ఆకులకు నీరుపోసి చెట్టు మొదలుకు నీరుపోయనిచే తగినంత జ్ఞానము లేనివాడుగా (నియమపాలనము లేనివాడు) పరిగణింపబడును. అదేవిధముగా ఉదరమునకు ఆహారము నందించుటయే దేహేంద్రియములన్నింటిని సేవించుట లేదా పోషించుట కాగలదు. వాస్తవమునకు దేవతలు భగవానుని ప్రభుత్వమున వివిధ అధికారులు మరియు నిర్దేశకుల వంటివారు.*

*జనులు ప్రభుత్వముచే ఏర్పరచబడిన శాసనములనే అనుసరించవలెను గాని, దాని యందలి అధికారులు లేదా నిర్దేశకుల వ్యక్తిగత శాసనములకు కాదు. అదేవిధముగా ప్రతియొక్కరు భగవానునే అర్చించవలెను. తద్ద్వారా అతని వివిధ అధికారులు మరియు నిర్దేశకులు ప్రభుత్వ ప్రతినిధులుగా తమ కార్యములందు నియుక్తులై యున్నందున వారికి లంచమివ్వజూచుట వాస్తవమునకు చట్టవిరుద్ధము. ఈ విషయమే ఇచ్చట “అవిధిపూర్వకమ్” అని తెలుపబడినది. అనగా అనవసరమైన అన్యదేవతార్చనమును శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ఆమోదించుట లేదు.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 361 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 23 🌴*

*23. ye ’py anya-devatā-bhaktā yajante śraddhayānvitāḥ*
*te ’pi mām eva kaunteya yajanty avidhi-pūrvakam*

🌷 Translation : 
*Those who are devotees of other gods and who worship them with faith actually worship only Me, O son of Kuntī, but they do so in a wrong way.*

🌹 Purport :
*“Persons who are engaged in the worship of demigods are not very intelligent, although such worship is offered to Me indirectly,” Kṛṣṇa says. For example, when a man pours water on the leaves and branches of a tree without pouring water on the root, he does so without sufficient knowledge or without observing regulative principles. Similarly, the process of rendering service to different parts of the body is to supply food to the stomach. The demigods are, so to speak, different officers and directors in the government of the Supreme Lord. One has to follow the laws made by the government, not by the officers or directors.*

*Similarly, everyone is to offer his worship to the Supreme Lord only. That will automatically satisfy the different officers and directors of the Lord. The officers and directors are engaged as representatives of the government, and to offer some bribe to the officers and directors is illegal. This is stated here as avidhi-pūrvakam. In other words, Kṛṣṇa does not approve the unnecessary worship of the demigods.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 208 / Agni Maha Purana - 208 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 61*

*🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 3 🌻*

*పాషాణాదులలో నున్న జలము పార్థివజలము దానిలో పృథీవీగుణ మగు గంధ ముండును. ప్రతిధ్వనిరూప శబ్దమే అచటి శబ్దము. స్పృశింపగా కనబడు కఠోరత్వాదికమే స్పర్శ. శుక్లాదీవర్ణములు రూపము. ఆహ్లాదమును కలిగించు రసమే రసము ధూపాదిగంధమే గంధము భేర్యాదులలో ప్రకట మగు నాదమేవాక్కు. అది వాగింద్రియము వంటిది అందుచే వాగింద్రియము అచటనే ఉన్నదిని భావించవలెను. నాసిక శుకనాసయం దుండను, దాని రథకములు భుజములు. శిఖరముపై అండాకారము నున్నది శిరస్సు. కలశ కేశపాశము. ప్రాసాదకంఠభాగము కంఠము. వేది భుజము. రెండు నాళికలు గుదోపస్థులు . సున్నము త్వక్కు. ద్వారము ముఖము. ప్రతిమయే దేవాలయజీవాత్మ. పిండిక జీవశక్తి. దాని ఆకారము ప్రకృతి. నిశ్చలత దాని గర్భము. నారాయణుడు దాని అధిష్ఠాత. ఈ విధముగ మహావిష్ణులే దేవాలయరూపమున నిలచియున్నాడు. శివుడు కాళ్ళు; బ్రహ్మ స్కంధముపైన నున్నాడు.(

*ఊర్థ్వభాగమున సాక్షాత్తు విష్ణువే ఉండును. ఈ విధముగ నున్న ప్రాసాదమున ప్రతిష్ఠింపబడు ధ్వజమును గూర్చి వినుము. శస్త్రాదిచిహ్నములతో కూడిన ధ్వజమును నిలబెట్టి దేవతలు దైత్యులను జయించిరి. అండముపై కలశము నుంచి, దానిపైన ధ్వజమును స్థాపింపవలెను. ధ్వజమానము బింబమానములో సగ ముండవలెను. ద్వజదండము పొడవులో మూడవ వంతుతో చక్రము నిర్మింపవలెను. ఆ చక్రమునందు ఎనిమిది కాని పండ్రెండు గాని ఆకు లుండవలెను. దాని మధ్య నృసింహుని మూర్తి గాని, గరుడుని మూర్తి గాని ఉండవలెను. ధ్వజదండము విరిగినదిగాని, రంధ్రాదు లున్నది గాని కాకూడదు. దండము పొడవు ప్రాసాదము వెడిల్పుతో సమముగా నుండవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 208 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 61*
*🌻Consecration of doors of the temple and the erection of banner - 3 🌻*

21. The earthly waters found in the stone slabs (of the temple) (represent) the earthly attributes. Its echo stands for the principles of sound. Its touch represents roughness.

22. Its colour which may be white or otherwise stands for the subtle principle of colour. The food (and other eatables) offered (to the deity) stand for the sense of taste. The perfumes represent the sense of smell. The sense of speech lies in the down (used in the temple).

23. The keystone is the nose (of the temple). The two apertures (on either side) represent the two hands. The arched terrace above is to be taken for its head and the pitcher on the head.

24. Its neck should be known as the neck. The platform over the fault is spoken as the shoulder. The outlets for water are the anus and genitals. The lime-plaster is spoken as the skin.

25. The door would be the mouth. The image (installed in the temple) is said to be its life. The pedestal should be known as its energy. Its shape should likewise be known as its animation.

26. Its cavity is its inertia. Lord Keśava is its controller. In this way Lord Hari Himself remains in the form of the temple.

27. God Śiva should be known as the shank. God Brahman is located in the shoulder. Lord Viṣṇu remains in the upper portion of a temple as it is.

28. Listen to me. I shall describe the consecration of a temple by means of a banner. The demons were defeated by the celestial gods by erecting banners impressed with the signs of divine weapons.

29. The pitcher (shaped part of the temple) should be placed over the top and the flag should be placed over the same. The post should be made to measure a half or one third of the height of the image.

30. The flag should have a mark of a circle of eight or twelve radii. (There should be the figure) of the man-lion (form of Viṣṇu) or the Garuḍa (Tārkṣya) (inside the circle) in the middle. The staff of the flag should not have any cut.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 73 / DAILY WISDOM - 73 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 13. వస్తువులను కలిగి ఉండాలనే కోరిక 🌻*

*ఒక నిర్దిష్ట వస్తువుని కోసం మనస్సు వాంచించడం అంటే ఆ వస్తువు యొక్క ఉనికితో ఐక్యం కావాలనే బలమైన కోరిక. కాబట్టి, సొంతం చేసుకోవాలనే ఆలోచన చాలా బలమైనది. ఇది వాస్తవానికి వస్తువుతో ఐక్యం కావాలనే కోరిక, తద్వారా మీరు కేవలం బాహ్యంగా కాక, మానసికంగా కూడా సంపూర్ణులౌతారు.*

*అయితే ఇది సాధ్యం కాదు, ఎందుకంటే మీరు ఏ వస్తువు యొక్క ఉనికిలోకి ప్రవేశించలేరు. అందువల్ల, కోరిక నెరవేరిన తర్వాత కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు. ఏ కోరిక అయినా శాశ్వతంగా నెరవేరదు ఎందుకంటే మీరు ఏ ప్రయత్నం చేసినా, ఆ వస్తువు యొక్క ఉనికిలోకి ప్రవేశించడం మీకు సాధ్యం కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 73 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 13. The Desire to Possess Objects 🌻*

*The desire of the mind for a particular desirable object is a desire to get united with that object in its being. So, the idea of possession is something very strong, indeed. It is actually a desire to get united with the object, so that you become physically, psychologically whole in being, and not merely in an external relation.*

*This condition is however not possible, as you cannot enter into the being of any object. Therefore, there is not such satisfaction even after the fulfilment of a desire. No desire can be fulfilled eternally, whatever be the effort that you put forth, because it is not possible for you to enter into the being of that object.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 338 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితం శాశ్వతమైంది. మనం ఎప్పుడు యిక్కడే వున్నాం. ఎప్పుడూ యిక్కడే వుంటాం. మనం మరణం లేని వాళ్ళం. శరీరం మారుతూ పోతూ వుంటుంది. మనం శరీరం కాము, మనసూ కాము. గాఢమయిన ధ్యానం ఆ విషయం కనిపెడుతుంది. 🍀*

*ఆధునిక మానవుడు ఎంత హడావుడిగా వున్నాడంటే అతనికి కూర్చునే సమయం కూడా లేదు. విశ్రాంతికి అతనికి సమయం లేదు. నీకు విశ్రాంతి తీసుకునే సమయం లేకపోతే నువ్వు విలువైన దానికి అర్హుడు కావు. వాస్తవమేమిటంటే మనం దేన్ని గురించీ మరీ ఎక్కువగా బాధపడాల్సిన పన్లేదు. జీవితం శాశ్వతమైంది. మనం ఎప్పుడు యిక్కడే వున్నాం. ఎప్పుడూ యిక్కడే వుంటాం.*

*మనం మరణం లేని వాళ్ళం. శరీరం మారుతూ పోతూ వుంటుంది. మనం శరీరం కాము, మనసూ కాము. గాఢమయిన ధ్యానం ఆ విషయం కనిపెడుతుంది. మనం చైతన్యం, మెలకువ, మనం ఈ ఆటకు సాక్షీభూతులం. నువ్వొకసారి ఆ సాక్షీభూతాన్ని అనుభవానికి తెచ్చుకుంటే తేనె మాధుర్యాన్ని చవి చూస్తావు. రసవాదులు పరిశోధించే తేనె అదే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 075 / Siva Sutras - 075 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 01. చిత్తం మంత్రః - 2 🌻*
*🌴. స్వీయ-సాక్షాత్కారమైన యోగి యొక్క చైతన్యమే (చిత్తం) మంత్రం. శక్తిని ఆవాహన చేసే మరియు వ్యక్తీకరించే సిద్ధి.🌴*

*ఇది ఒక వ్యక్తి యొక్క అవగాహన అతని ఇంద్రియాల నుండి విడదీయబడే దశ. ఈ సమయంలో అతని మనస్సులో ఇంద్రియ జ్ఞానం ఉండదు. మనస్సున ఇంద్రియ జ్ఞానం లేకున్నపుడే ఉన్నత స్థాయి చైతన్యానికి చేరుకోగలం. స్వచ్ఛమైన చైతన్య రూపంలో మాత్రమే పరమ సత్యాన్ని గ్రహించగలం. ఇంద్రియ భావనల నుంచి మనసును విడదీయడమే కాకుండా ఇంద్రియ ముద్రలను కూడా అధిగమించాలి. ఇంద్రియ ముద్రలు భావనల కంటే ఎక్కువ హానికరం. చంచలమైన మనస్సును నియంత్రించే సాధనాలలో మంత్రం ఒకటి. ఏదైనా మంత్రాన్ని పదేపదే పఠించడం వల్ల వ్యక్తి ఏకాగ్రతను పెంపొందించుకుంటాడు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 075 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 01. Cittaṁ mantraḥ - 2 🌻*
*🌴. The consciousness (chitta) of a self-realized yogi is mantra, with the power to invoke and manifest the shaktis.🌴*

*This is the stage, where one’s awareness is disconnected from his senses. His mind at this point becomes devoid of sensory perceptions. Only if the mind becomes devoid of sensory perceptions, the higher level of consciousness can be reached. Only in the purest form of consciousness, Supreme Reality can be realised. Apart from delinking the mind from sensory perceptions, one has to get over sensory impressions also. Sensory impressions are more harmful than perceptions. Mantra is one of the tools, by which one can control the wavering mind. The repeated recitation of any mantra makes a person to develop concentration.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment