Showing posts with label Rajarajeshwari. Show all posts
Showing posts with label Rajarajeshwari. Show all posts

శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం - SRI RAJA RAJESWARI STOTRAM - Prasad Bharadwaj


https://www.youtube.com/watch?v=I8cln0YdzA8


🌹 శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం - SRI RAJA RAJESWARI STOTRAM - Prasad Bharadwaj 🌹


🌻అంతర్గత శాంతి మరియు రక్షణ కొరకు నిత్యం మూడుసార్లు 🌻
🌻For inner peace and protection recite three times daily 🌻


ప్రసాద్‌ భరధ్వాజ  Prasad Bharadwaj

Like, Share and Subscribe

🌹🌹🌹🌹🌹

ఇంద్రకీలాద్రిపై "శ్రీ రాజరాజేశ్వరీ దేవి" గా దర్శనం - 10వ రోజు 12/10/2024 (Darshan as "Shri Rajarajeshwari Devi" on Indrakiladri)

_శ్రీ దేవి శరన్నవరాత్రులు 10వ రోజు 12/10/2024 ఇంద్రకీలాద్రిపై "శ్రీ రాజరాజేశ్వరీ దేవి" గా దర్శనం_

🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒


_శ్లో𝕝𝕝 అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ._

శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. "అపరాజితాదేవి" గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి.


_నైవేద్యం:_


ఈ రోజున నైవేద్యంగా కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నం సమర్పిస్తారు.


_శ్రీ రాజరాజేశ్వరీదేవ్యై నమః_

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗

రాజరాజేశ్వరిగా Rajarajeshwari


ఇంద్రకీలాద్రిపై రేపు(11.10.24) మధ్యాహ్నం సకల లోకాలకు ఆరాధ్యదేవత రాజరాజేశ్వరిగా దుర్గమ్మ అలంకరణ

🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓

నవరాత్రి ఉత్సవాలలో అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ దేవి. సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’ గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా , జ్ఞాన , క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.

పొదుపు చెయ్యడం నేటితరం ఆలోచన.ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరకుగడ , ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది. చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను , దురహంకారులను , శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు , చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి.

సమున్నతమైన దైవికశక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగిఉండటం , ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తి. లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ , బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా , చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ శ్లోకం పఠించాలి. నైవేద్యంగా సేమ్యా పాయసం , కొబ్బరి పాయసం , కొబ్బరన్నం , పరమాన్నం సమర్పిస్తారు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸