🌹 05, APRIL 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 05, APRIL 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 05, APRIL 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 158 / Kapila Gita - 158 🌹 
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 12 / 4. Features of Bhakti Yoga and Practices - 12 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 750 / Vishnu Sahasranama Contemplation - 750 🌹 
🌻750. లోకస్వామీ, लोकस्वामी, Lokasvāmī🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 710 / Sri Siva Maha Purana - 710 🌹
🌻. శివస్తుతి - 2 / Prayer to Śiva - 2 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 330 / Osho Daily Meditations - 330 🌹 
🍀 330. అతుక్కుపోవడం / 330. CLINGING 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 445-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 445-1 🌹 
🌻 445. ‘శాంతిః'- 1 / 445. 'Shantih'- 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 05, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : పూర్ణిమ ఉపవాసం, ఫల్గుణి ఉత్తీరం, ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణం, Purnima Upavas, Panguni Uthiram. 🌺*

*🍀. శ్రీ గణేశ హృదయం - 17 🍀*

*17. మనోరథాన్ పూరయతీహ గంగే చరాచరాణాం జగతాం పరేషామ్ |*
*అతో గణేశం ప్రవదంతి చాశాప్ర పూరకం తం ప్రణమామి నిత్యమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : బ్రహ్మనిష్ఠ - బాహ్యకర్మ - అంతరమున చైతన్యం ఏకాగ్రమైవున్న తరుణంలోనే బాహ్య కర్మ నాచరించడం మొదట్లో సాధ్యం కాకపోయినా క్రమేణా తుదకు సాధ్యమే. చైతన్యం అట్టి సందర్భాలలో ద్విధావిభక్తమై ఒకటి అంతరమున బ్రహ్మనిష్ఠమై వుండగా రెండవది బాహ్యకర్మ నాచరించవచ్చు. లేదా, చైతన్యమంతా బ్రహ్మ నిష్ఠమై వుండి నిమిత్తమాత్రమైన ఉపకరణం ద్వారా దాని శక్తి బాహ్య కర్మాచరణ మొనర్పవచ్చు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: శుక్ల చతుర్దశి 09:20:53
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 
11:23:39 వరకు తదుపరి హస్త
యోగం: ధృవ 27:16:21 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: వణిజ 09:17:52 వరకు
వర్జ్యం: 20:14:39 - 21:55:55
దుర్ముహూర్తం: 11:54:15 - 12:43:43
రాహు కాలం: 12:18:59 - 13:51:44
గుళిక కాలం: 10:46:14 - 12:18:59
యమ గండం: 07:40:44 - 09:13:29
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:42
అమృత కాలం: 03:39:30 - 05:22:30
మరియు 30:22:15 - 32:03:31
సూర్యోదయం: 06:07:58
సూర్యాస్తమయం: 18:30:00
చంద్రోదయం: 17:54:56
చంద్రాస్తమయం: 05:34:57
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 11:23:39 వరకు తదుపరి ఆనంద
యోగం- కార్య సిధ్ధి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 158 / Kapila Gita - 158 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 12 🌴*

*12. యదా మనః స్వం విరజం యోగేన సుసమాహితమ్|*
*కాష్ఠాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రావలోకనః॥*

*తాత్పర్యము : యోగాభ్యాసము చేయగా చేయగా చిత్తము నిర్మలమై ఏకాగ్రమగును. అప్పుడు యోగి తన నాసికాగ్రమున దృష్టిని నిలిపి, భగవత్స్వరూపమును ఈ విధముగా ధ్యానించవలెను.*

*వ్యాఖ్య : విష్ణువు యొక్క విస్తరణ గురించి ధ్యానం చేయాలని ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడింది. కష్ఠం అనే పదం పరమాత్మను సూచిస్తుంది, ఇది విష్ణువు యొక్క విస్తరణ యొక్క విస్తరణ. భాగవతం భగవంతుడు విష్ణువును, భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తిని సూచిస్తుంది. సర్వోన్నత దేవుడు కృష్ణుడు; అతని నుండి మొదటి విస్తరణ, బలదేవ, మరియు బలదేవ నుండి సంకర్షణ, అనిరుద్ధ మరియు అనేక ఇతర రూపాలు, తరువాత పురుష-అవతారాలు వస్తాయి. మునుపటి శ్లోకాలలో (పురుషార్చనం) పేర్కొన్నట్లుగా, ఈ పురుషుడు పరమాత్మ లేదా పరమాత్మగా సూచించబడ్డాడు. పరమాత్మ యొక్క వర్ణన, ఎవరిపై ధ్యానం చేయాలి, ఈ క్రింది శ్లోకాలలో ఇవ్వబడుతుంది. ఈ శ్లోకంలో, ముక్కు కొనపై దృష్టిని ఉంచడం మరియు విష్ణువు యొక్క కాల స్వరూపం లేదా విస్తరణపై మనస్సును కేంద్రీకరించడం ద్వారా ధ్యానం చేయాలని స్పష్టంగా చెప్పబడింది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 158 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 4. Features of Bhakti Yoga and Practices - 12 🌴*

*12. yadā manaḥ svaṁ virajaṁ yogena susamāhitam*
*kāṣṭhāṁ bhagavato dhyāyet sva-nāsāgrāvalokanaḥ*

*MEANING : When the mind is perfectly purified by this practice of yoga, one should concentrate on the tip of the nose with half-closed eyes and see the form of the Supreme Personality of Godhead. *

*PURPORT : It is clearly mentioned here that one has to meditate upon the expansion of Viṣṇu. The word kaṣṭhām refers to Paramātmā, the expansion of the expansion of Viṣṇu. Bhagavataḥ refers to Lord Viṣṇu, the Supreme God. The Supreme Godhead is Kṛṣṇa; from Him comes the first expansion, Baladeva, and from Baladeva come Saṅkarṣaṇa, Aniruddha and many other forms, followed by the puruṣa-avatāras. As mentioned in the previous verses (puruṣārcanam), this puruṣa is represented as the Paramātmā, or Supersoul. A description of the Supersoul, upon whom one must meditate, will be given in the following verses. In this verse it is clearly stated that one must meditate by fixing the vision on the tip of the nose and concentrating one's mind on the kalā, or the plenary expansion, of Viṣṇu. *

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 750 / Vishnu Sahasranama Contemplation - 750🌹*

*🌻750. లోకస్వామీ, लोकस्वामी, Lokasvāmī🌻*

*ఓం లోకస్వామినే నమః | ॐ लोकस्वामिने नमः | OM Lokasvāmine namaḥ*

*చతుర్దశానాం లోకానామీశ్వరత్వాజ్జనార్దనః ।*
*లోకస్వామీత్యుచ్యతే స పురాణైర్విద్వదుత్తమైః ॥*

*చతుర్దశ లోకాలకును ఈశ్వరుడగు జనార్దనుడు లోకాలకు స్వామి కనుక లోకస్వామీ అని చెప్పబడును.*

:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::
*వ. వినుము. చతుర్దశలోకంబులందు మీఁది యేడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటిప్రదేశంబున నుండి యూర్ద్వదేహ మనియును, గ్రింది యేడు లోకంబులు జఘనంబునుండి యధోదేహ మనియునుం బలుకుదురు. ప్రపంచ శరీరుండగు భగవంతుని ముఖంబువలన బ్రహ్మకులంబును, బాహువులవలన క్షత్రియకులంబును, నూరువుల వలన వైశ్యకులంబును, బాదంబులవలన శూద్రకులంబును జనియించెనని చెప్పుదురు; భూలోకంబు గటి ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు, సనాతనంబును బ్రహ్మనివాసంబును నైన సత్యలోకంబు శిరము, జఘన ప్రదేశంబతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు తలాతలంబు, గుల్ఫంబులు మహీతలంబు, పదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబు నని (లోకమయుంగా) భావింతురు... (89)*

*ఈ పదునాలుగు లోకాలలోనూ పై యేడు లోకాలును శ్రీ మహావిష్ణువునకు నడుమునుండి పై శరీరము. క్రింది యేడు లోకములును నడుము నుండి క్రింది శరీరము. ప్రపంచమే భగవంతుని శరీరము. ఆయన ముఖమునుండి బ్రహ్మ కులము, బాహువులనుండి క్షత్రియ కులము, తొడల నుండి వైశ్యకులము, పాదముల నుండి శూద్ర కులము పుట్టినవని వర్ణించెదరు.*

*ఆ మహా విష్ణువునకు కటి స్థలము భూలోకము (1), నాభి భువర్లోకము (2), హృదయము సువర్లోకము (3), వక్షము మహర్లోకము (4), కంఠము జనలోకము (5), స్తనములు తపోలోకము (6), శిరస్సు సనాతనమైన బ్రహ్మ నివసించెడి సత్య లోకము (7), జఘనము అతలము (8), తొడలు వితలము (9), మోకాళ్ళు సుతలము (10), పిక్కలు తలాతలము (11), చీలమండలము మహాతలము (12), కాలి మునివేళ్ళు రసాతలము (13), అరికాలు పాతాళము (14). ఈ కారణముగా ఆయనను లోకమయుడు అని భావించెదరు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 750🌹*

*🌻750. Lokasvāmī🌻*

*OM Lokasvāmine namaḥ*

चतुर्दशानां लोकानामीश्वरत्वाज्जनार्दनः ।
लोकस्वामीत्युच्यते स पुराणैर्विद्वदुत्तमैः ॥

Caturdaśānāṃ lokānāmīśvaratvājjanārdanaḥ,
Lokasvāmītyucyate sa purāṇairvidvaduttamaiḥ.

*As Lord Janārdana is the Lord of fourteen worlds, He is aptly called Lokasvāmī.*

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 5 - 36 to 41

*Great philosophers imagine that the complete planetary systems in the universe are displays of the different upper and lower limbs of the universal body of the Lord.*

*The brāhman‌as represent His mouth, the ks‌atriyas His arms, the vaiśyas His thighs, and the śūdras are born of His legs.*

*The lower planetary systems, up to the limit of the earthly stratum (1), are said to be situated in His legs. The middle planetary systems, beginning from Bhuvarloka (2), are situated in His navel. And the still higher planetary systems, occupied by the gods (3) and emancipated sages and saints (4), are situated in the chest of the Supreme Lord.*

*From the forefront of the chest up to the neck of the universal form of the Lord are situated the planetary systems named Janaloka (5) and Tapoloka (6), whereas Satyaloka (7), the topmost planetary system, is situated on the head of the form. The spiritual planets, however, are eternal.*

*My dear son Nārada, know from me that there are seven lower planetary systems out of the total fourteen. The first planetary system, known as Atala (8), is situated on the waist; the second, Vitala (9), is situated on the thighs; the third, Sutala (10), on the knees; the fourth, Talātala (11), on the shanks; the fifth, Mahātala (12), on the ankles; the sixth, Rasātala (13), on the upper portion of the feet; and the seventh, Pātāla (14), on the soles of the feet. Thus the virāt‌ form of the Lord is full of all planetary systems.*

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 711 / Sri Siva Maha Purana - 711 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 06 🌴*
*🌻. శివస్తుతి - 2 🌻*

*దేవతలిట్లు పలికిరి-*

*సర్వాత్మకుడు, మంగళకరుడు, కష్టములను పారద్రోలువాడు, నీలకుంఠుడు, చైతన్య స్వరూపుడు, జ్ఞానఘనుడు అగు నీకు నమస్కారము (10). ఆపదలనన్నిటినీ నివారించే నీవే మాకు సర్వకాలములలో శరణు అగుచున్నావు. దేవశత్రువలను సంహరించు వాడా! సర్వకాలములలో మాచే తెలియదగిన వాడవు నీవే (11). నీవు సర్వకారణుడవు. నీకు కారణము లేదు. నీవు ఆనందఘనుడవు, వినాశములేని ప్రభుడవు. ప్రకృతి పురుషులనిద్దరినీ సృష్టించిన జగదీశ్వరుడవు నీవే (12). రజస్సత్త్వ తమోగుణములను స్వీకరించి క్రమముగా బ్రహ్మ విష్ణు రుద్రరూపములను దాల్చి జగత్తులను సృష్టించి పాలించి సహరించు వాడవు నీవే (13).*

*ఈ లోకములో రక్షకుడవు, సర్వేశ్వరుడవు, నాశము లేనివాడవు, వరముల నిచ్చువాడవు, శబ్దస్వరూపుడవు, శబ్దప్రమాణముచే నిరూపింపబడెడివాడవు, వాచ్యవాచక భావమునకు అతీతుడవు నీవే (14). యోగవిశారదులగు యోగులు ముక్తి కొరకు ఈశానుడవగు నిన్ను ప్రార్థించెదరు. నీవు యోగుల హృదయపుండరీకము నందలి ఆకాశములో స్థిరముగా నుండెదవు (15). పరమబ్రహ్మ స్వరూపుడు, తేజోనిధి, ప్రకృతి కంటె పరుడు అగు నిన్ను పవిత్రములగు వేదములు తత్త్వమసి ఇత్యాది మహా వాక్యములతో ప్రతిపాదించు చున్నవి (16). హే విభో! ఈ జగత్తులోని సర్వము నీవే. పరమాత్ముడవు నీవేనని ఋషులు చెప్పెదరు. హే శర్వా! భవా! సర్వము నీ స్వరూపమే. ముల్లోకములకు ప్రభువు నీవే (17).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 711🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 06 🌴*

*🌻 Prayer to Śiva - 2 🌻*

The gods said:—

10. Obeisance to you, the soul of all, obeisance to Śiva the remover of distress, obeisance to the blue-necked Rudra, obeisance to the knowledge-formed Śiva of great mind.

11. You are our ultimate goal for ever. You are the remover of all adversities. O destroyer of the enemṃs of the gods, you alone are to be respected by us always.

12. You are the beginning. You are the primordial being. You are self-bliss. You are the everlasting lord. You are the lord of the universe, the direct creator of Prakṛti and Puruṣa.

13. You alone are the creator, sustainer and the annihilator of the worlds. Assuming the Guṇas of Rajas, Sattva, and Tamas you are Brahmā, Viṣṇu and Śiva.

14. In this universe, you enable people to cross the ocean of Existence. You are the undecaying lord of all. You are the granter of boons. You are the subject and not the object of speech and contents.

15. You shall be requested for salvation by the Yogins, the formost among those who know the theory of Yoga. You are stationed inside the lotus like heart of the Yogins.

16. The Vedas and the saintly men speak of you as the supreme Brahman. You are a heaped mass of splendour and greater than the greatest. They call you the great principle.

17. What they call the great soul in the universe, O lord, are you yourself, O Śiva soul of all, ruler of the three worlds.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 330 / Osho Daily Meditations - 330 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 330. అతుక్కుపోవడం 🍀*

*🕉. మనస్సు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటుంది - ఈ అతుక్కొని ఉండటాన్ని వదిలివేయటం మంచిది. ప్రతి రోజు కొత్తది, ప్రతి క్షణం కొత్తదే. ప్రతి క్షణానికీ మనం వేరే ప్రపంచంలో తిరుగుతాము, మరియు పై ఏదీ పట్టుకోకుండా సిద్ధంగా ఉండాలి. 🕉*

*బుద్ధుడు తన శిష్యులకు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండకూడదని చెప్పేవాడు, ఎందుకంటే నాల్గవ రోజుకి ఇంట్లో ఉన్న అనుభూతి ప్రారంభమవుతుంది. ఇంతలూఉన్నట్లు భావించే ముందు, ఒకరు ముందుకు సాగాలి. మనస్సు ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉంటుంది - మరియు ఈ అతుక్కొని ఉండటాన్ని వదిలివేయడ0 మంచిది. ప్రతి రోజు కొత్తది, ప్రతి క్షణం కొత్తది, మరియు ప్రతి క్షణా నికీ మనం వేరే ప్రపంచంలోకి వెళతాము మరియు ఏదీ పట్టుకోకుండా సిద్ధంగా ఉండాలి. గతం అలవోకగా అదృశ్యం కావాలి; మీరు గతానికి నిరంతరం మరణించాలి.*

*కాబట్టి సమయాన్ని వృథా చేయకండి. పోయిన దానికి మరణించండి; అది ఇక లేదు. లేకపోతే, మీరు ఇప్పుడు లేనిదానిని అంటి పెట్టుకుని ఉంటే, కొత్తది వచ్చినప్పుడు కూడా మీరు పాతదానిని పట్టుకుని ఉంటారు. ఇలా మనసు కోల్పోతూ ఉంటుంది. వర్తమానానికి విస్వాసంగా ఉండండి. ఈ క్షణానికి కట్టుబడి ఉండండి - మరే ఇతర నిబద్ధత లేదు. ఒక్క నిబద్ధత సరిపోతుంది: ఈ క్షణానికి, ఇప్పుడు ఇక్కడ.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 330 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 330. CLINGING 🍀*

*🕉. Mind always clings--and it is good to drop this clinging. Each day is new, each moment is new. And after each moment we move in a different world, and one should be prepared so that nothing has a hold on one. 🕉*

*Buddha used to tell his disciples to never stay in a house for more than three days, because by the fourth day one starts feeling at home. Before one feels at home, one should move on. Mind always clings--and it is good to drop this clinging. Each day is new, each moment is new, and after each moment we move in a different world, and one should be prepared so that nothing has a hold on one. The past should simply disappear; you should die continually to the past.*

*So don't waste time. Die to what is gone; it is no more. Otherwise, as you are clinging to that which is no more, even when a new thing arrives you will be clinging to the old. This is how the mind goes on missing. Always remain true to the present. Remain committed to this moment--there is no other commitment. One commitment is enough: commitment to this moment, to here now.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 445 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 445 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।*
*శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀*

*🌻 445. ‘శాంతిః'- 1 🌻* 

*శాంతము కలిగించునది శ్రీమాత అని అర్థము. శమమే గమ్యముగా కలది శాంతి. 'శం' అనగా శమము. శమము గమ్యముగా నుండుట ఒక సిద్ధి. సంకల్పమున, కార్యమున, కర్మమున శాంతముండుట అద్భుతమగు సిద్ధి. తొట్రుపాటు యున్నచోట శాంత ముండదు. శాంత మనస్కులకు సంకల్పములు కూడ శాంతి కలిగించునవే కలుగును. వాని నిర్వహణమున కూడ శాంతి యుండును. ఫలముల యందు కూడ శాంతియే వికసించును. ఇట్లు సమస్తము శాంతిమయముగ నుండుట అసామాన్యము. తుష్టి, పుష్టి, మతి, ధృతి కలవారికి మాత్రమే యిట్టి శాంతి లభ్యము కాగలదు. కోరిక యున్నచోట శాంతి లేదు. కర్తవ్యమున ప్రియము కలవారు, కర్తవ్యోన్ముఖులై మాత్రమే జీవించినచో వారిని శాంతి వరించును. నిష్కామ కర్మము, యజ్ఞార్థ జీవనము, దానము, తపస్సు ఇత్యాది విషయముల యందు నిమగ్నులై యున్నవారికి శాంతి లభించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 445 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih*
*Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻*

*🌻 445. 'Shantih'- 1 🌻*

*It means it is Srimata who gives peace. Tranquility (Samam) is the goal of Peace. 'Sham' means Sama. Having tranquility as the goal is a siddhi. Being calm in intention, action and karma is a wonderful Siddhi. There is no peace where there is conflict. Peaceful minds have intentions that bring peace. There will be peace in their performance. Peace blossoms in the fruits of their performance too. It is unusual that everything is so peaceful. Only those who have Tushti, Pushti, Mati and Dhruti can attain this peace. Where there is desire there is no peace. If those who love duty live only for the duty, Peace will embrace them. Those who are engaged in nishkama karma, yajnartha life, charity, penance etc. get Peace.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

Siva Sutras - 064 - 20. Bhūta sandhāna bhūta pṛthaktva viśva saṃghaṭṭāḥ - 3 / శివ సూత్రములు - 064 - 20. భూత సంధాన భూత పృథక్త్వా విశ్వ సంఘటః - 3


🌹. శివ సూత్రములు - 064 / Siva Sutras - 064 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻. 20. భూత సంధాన భూత పృథక్త్వా విశ్వ సంఘటః - 3 🌻

🌴.సంకల్ప శక్తి ద్వారా యోగి తన అవగాహనను కేంద్రీకరించి మూలకాలను తన శరీరం నుండి మరియు ఇతరుల నుండి వేరు చేయగలడు. అతను స్థలం మరియు సమయం యొక్క పరిమితుల నుండి విముక్తి పొందగలడు. 🌴


ఒక యోగి తన శరీరాన్ని తన చైతన్యం నుండి వేరు చేయగలిగినప్పుడు, అతను దాహం, ఆకలి, అనారోగ్యాలు మొదలైనవాటిని అనుభవించడు ఎందుకంటే ఇవి భౌతిక శరీరానికి సంబంధించినవి మాత్రమే. అతను తన శుద్ధి చేయబడిన చైతన్యంలో నివసిస్తున్నాడు, ఇది స్థూల రూపాలతో ఏ విధంగానూ సంబంధం కలిగి ఉండదు. విశ్వసంఘటతని ఉపయోగించడం ద్వారా, అటువంటి యోగి కాలాన్ని మరియు స్థలాన్ని అధిగమించగలడని సూచించడానికి శివుడు ఎంచుకున్నాడు. అతను గతాన్ని అన్వేషించగలడు, వర్తమానాన్ని అనుభవించగలడు మరియు భవిష్యత్తును అంచనా వేయగలడు.

రోగనిర్ధారణ చేసిన సమస్యతో ఎవరైనా అతనిని సంప్రదించినట్లయితే, ఒక యోగి ఆ సమస్యపై ఏకాగ్రతతో దానిని పరిష్కరించ గలుగుతాడు. దాని విషయంలో భవిష్యత్తు గురించి తెలుసుకుని, తదనుగుణంగా, అతను విపత్తును నివారించడానికి నివారణలను సూచిస్తాడు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 064 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 20. Bhūta sandhāna bhūta pṛthaktva viśva saṃghaṭṭāḥ - 3 🌻

🌴. By will power the yogi can concentrate his awareness and separate the elements from his own body and that of others. He can become free from the limitations of space and time. 🌴


When a yogi is able to segregate his body from his consciousness, he does not experience thirst, hunger, ailments, etc as these pertain only to the physical body. He lives in his purified form of consciousness, which in no way gets associated with gross forms. By using viśvasaṃghaṭṭāḥ, Shiva has chosen to indicate that such a yogi can transcend time and space. He can explore past, feel the present and predict the future.

If someone approaches him, with an prognosticated issue, a yogi is able to fix his concentration on that issue and come to know of the future and accordingly, he suggests remedies to avoid catastrophe.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 327


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 327 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. శరీరంలో వుండడం బంధమే. అది పరిమితం, నువ్వు అపరిమితానివి. పెద్ద ప్రపంచాన్ని చిన్ని శరీరంలో ఒదిగించడం. అందువల్లే నిరంతర ఆందోళన, అసహనం. 🍀


అన్ని కోరికలూ అదృశ్యమయ్యాకా నువ్వు శరీరానికి తిరిగి రావు. నువ్వు అనంత చైతన్యంలో భాగమవుతావు. దాన్ని తూర్పు దేశాల్లో నిర్వాణమంటారు. విశ్వ చైతన్య మంటారు. అప్పుడు ఏ శరీరంలోనూ అవసరముండదు. ఎట్లాంటి జైలుతో పని వుండదు. అది అంతిమ స్వేచ్ఛ. శరీరంలో వుండడం బంధమే. అది పరిమితం, నువ్వు అపరిమితానివి. పెద్ద ప్రపంచాన్ని చిన్ని శరీరంలో ఒదిగించడం. అందువల్లే నిరంతర ఆందోళన, అసహనం. మనిషి స్పష్టంగా ఆ స్పృహతో వుండడు.

కానీ ప్రతి ఒక్కరిలో ఏదో పొరపాటు జరిగిందన్న భావన కనిపిస్తుంది. కారణం మనం అనంతం. మన శరీరం అల్పం. చైతన్యం నీకు శరీరం నించీ విముక్తి కలిగిస్తుంది. నువ్వు శరీరం కాదని నువ్వు గుర్తించిన మరుక్షణం నీ కోరికలు మాయమై నీ శరీరం కూడా అదృశ్యమవుతుంది. చైతన్యం కాంతిలా పని చేస్తుంది. కోరికలు చీకటిలా మాయమవుతాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 62 - 2. Things Cannot be Possessed by Anyone / నిత్య ప్రజ్ఞా సందేశములు - 62 - 2. వస్తువులను ఎవ్వరూ స్వాధీనం చేసుకోలేరు


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 62 / DAILY WISDOM - 62 🌹

🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 2. వస్తువులను ఎవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. 🌻


నశ్వరమైన ఈ జగత్తులో వస్తువులు ఎలా ఉన్నాయంటే వాటిని ఎవరూ స్వాధీనం చేసుకోలేరు. ఈ యజమాని అనే భావన మనస్సులో ఒక విచిత్రమైన భావన. ఈ భావన ఎంత అబద్ధమో మనకు బాగా తెలుసు. మీరు ఆలోచనలో తప్ప మీరు దేనికీ యజమానులు కారు. కాబట్టి, మనం ఆస్తి యొక్క యాజమాన్యం అని దేనినైతే పిలుస్తామో, ఇది కేవలం మనస్సు యొక్క స్థితి. నేను మీకు చాలా చిన్న స్థూల ఉదాహరణ ఇవ్వగలను: అక్కడ ఒక పెద్ద విస్తీర్ణంలో ఒక భూమి ఉందనుకుందాం. దానిలోనే వ్యవసాయ ఆధారితమైన విస్తారమైన పొలం ఉంది అనుకుందాం.

ఈ రోజు అది ఒకరి యాజమాన్యంలో ఉంది, మరియు రేపు అది ఆస్తి బదిలీ ద్వారా వేరొకరి యాజమాన్యంలో ఉంటుంది. ఇప్పుడు, ఈ ఆస్తి బదిలీ అంటే ఏమిటి? నిజానికి, ఇది ఎప్పుడూ ఎక్కడికీ బదిలీ చేయబడలేదు. ఇది దాని స్వంత స్థలంలోనే ఉంది. ఇది ప్రజల ఆలోచనలలో ఒకరి నుంచి ఇంకొకరికి బదిలీ చేయబడింది అంతే. కాబట్టి, మీకు నచ్చినా, నచ్చకపోయినా మనం యాజమాన్యం అని, నాది అని పిలుచుకునే విషయం అప్పటి సమూహం అందరూ కలిసి ఒప్పుకున్న ఒక మానసిక ఒప్పందం తప్ప మరొకటి కాదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 62 🌹

🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻2. Things Cannot be Possessed by Anyone 🌻


The arrangement of things is such, in the temporal realm, that things cannot be possessed by anyone. The idea of possession is a peculiar notion in the mind. You know very well how false the idea of possession is. You cannot possess anything except in thought. So, what we call ownership of property, is a condition of the mind. I can give you a very small gross example: There is a large expanse of land, a vast field which is agricultural in itself.

Today you say, it is owned by ‘A’, and tomorrow it is owned by ‘B’, by transfer of property. Now, what do you mean by this transfer of property? It has never been transferred. It is there in its own place. It has been transferred in the ideas of people. The whole question of ownership, or psychologically put—like or dislike, is a condition of the mind which is an arrangement of psychological values, agreed upon by a group of people who have decided that this should be the state of affairs.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 197 / Agni Maha Purana - 197


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 197 / Agni Maha Purana - 197 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 59

🌻. అధివాసనము - 4 🌻


ఓ సురశ్రేష్ఠా! దానిపై ప్రణవసహితకార (హం) న్యాసము చేయవలెను. "ఓం ఆం నమ! పరమేష్ఠ్యాత్మనే" ఓం ఆం నమః పురుషాత్మనే, ఓం వాం నమో నిత్యాత్మనే, ఓం నాం నమో విశ్వాత్మనే ఓం వం నమః సర్వాత్మనే" అనునవి ఐదు శక్తులు. ప్రథమ శక్తిని స్నానమునందును-ఆసకర్మయందు, ద్వితీయశక్తిని, శయనమునందు తృతీయ శక్తిని, యానకర్మయందు చతుర్థశక్తిని, అర్చనాకాలమునందు పంచమశక్తిని వినియోగించవలెను. ఈ ఐదును ఉపనిషత్తులు. వీటి మధ్యయందు మంత్రమయు డగు శ్రీహరిని ధ్యానించి క్షకారము (క్షం)ను న్యాసము చేయవలెను.

ఏ మూర్తి స్థాపింపబడుచున్నదో ఆ మూర్తికి సంబంధించిన మూలమంత్రము న్యాసము చేయవలెను. "విష్ణు స్థాపన చేసినపుడు) "ఓం నమో బగవతే వాసుదేవాయ" అనునది మూలమంత్రము. ఈ మూలమంత్రముయొక్క ఒక్కొక్క అక్షరమును శిరస్సు, నాసిక, లలాటము, ముఖము, కంఠము, హృదయము, భుజములు, పిక్కలు, పాదములు-వీటియందు క్రమముగ న్యాసము చేయవలెను. పిమ్మట శిరస్సుపై కేశవుని, ముఖముపై నారాయణుని, కంఠముపై మాధవుని, భుజములపై గోవిందుని, హృదయముపై విష్ణువును, పృష్ఠభాగమున మధుసూదనుని, జఠరమున వామనుని, కటిపై త్రివిక్రముని, పిక్కలపై శ్రీధరుని, దక్షిణభాగమున హృషీకేశుని, చీలమండలపై పద్మనాభుని, పాదములపై దామోదరుని న్యాసము చేసి, పిమ్మట హృదయాదిషడంగన్యాసములు చేయవలెను. సత్ఫురుషులలో శ్రేష్ఠుడ వైన బ్రహ్మదేవా! ఇది ఆదిమూర్తి విషయమున చెప్పిన సాధారణన్యాసము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 197 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 59

🌻Preliminary consecration of an image (adhivāsana) - 4 🌻


29. Oṃ, Vāṃ, salutations to the eternal being! Nāṃ, salutations to the soul of the universe! Oṃ, vāṃ, salutations to the soul of all beings! Thus the five forms of energies have been described.

30. The first one (of the above five syllables) should be used for the place, the second one for the seat, the third one for the bed, and the fourth one for the drink.

31. The fifth one is used at every worship. These (five mystic syllables) are known as the five upaniṣads. The syllable huṃ should be placed in the middle after having contemplated on Hari, composed of mystic syllables.

32. Whichever form of the deity is being installed one should assign the particular principal mystic syllable of that form afterwards. The principal syllable of Vāsudeva is Oṃ, salutations to Lord Vāsudeva!

33. (The different forms of the god) should be (mentally) assigned to (the different parts of the body such as) the head, nose, forehead, face, neck, heart, arms, shanks and feet in order. (The manifestation known as) Keśava should be assigned to the head (of the image).

34. Nārāyaṇa should be assigned to the face, Madhava to the neck, Govinda to the arms, (and) Viṣṇu to the heart.

35. Madhusūdana should be assigned to the hinder part, Vāmana to the belly, Trivikrama to the hip (and) Śrīdhara to the shank.

36. Hṛṣīkeśa (should be assigned) on the right side, Padmanābha on the ankle, Dāmodara on the feet.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 350: 09వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 350: Chap. 09, Ver. 12

 

🌹. శ్రీమద్భగవద్గీత - 350 / Bhagavad-Gita - 350 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 12 🌴

12. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతస: |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిమ మోహినీం శ్రితా: ||


🌷. తాత్పర్యం :

ఆ విధముగా మోహపరవశులైన వారు దానవ, నాస్తికభావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతస్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞానసముపార్జన లన్నియును వ్యర్థములగును.

🌷. భాష్యము :

తమను తాము కృష్ణభక్తిభావన యందు మరియు భక్తియుతసేవ యందు నిలిచియున్నవారిగా భావించుచునే అంతరంగమున మాత్రము దేవదేవుడైన శ్రీకృష్ణుని పరతత్త్వముగా అంగీకరింపని భక్తులు పెక్కురు గలరు. భగవద్ధామప్రాప్తి యను భక్తియోగఫలమును అట్టి వారెన్నడును రుచిచూడలేరు.

అదే విధముగా కామ్యకర్మలందు, పుణ్యకర్మలందు మగ్నులైనవారు మరియు భౌతికబంధముల నుండి ముక్తిని వాంచించువారు సైతము దేవదేవుడైన శ్రీకృష్ణుని నిరసించు కారణముగా కృతకృత్యులు కాజాలరు. వేరుమాటలలో శ్రీకృష్ణుని యెడ అపహాస్య భావముతో వర్తించువారే దానవస్వభావులు లేదా నాస్తికస్వభావులు అయినట్టివారు. భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు అట్టి దానవప్రవృత్తి కలవారు కృష్ణుని శరణునొందరు. కనుక పరతత్త్వమును అవగాహన చేసికొన యత్నించు వారు మానసికకల్పనలు సాధారణజీవుడు మరియు శ్రీకృష్ణుడు ఏకమే, సమానమే అనెడి మిథ్యానిర్ణయమునకు వారిని చేర్చును.

అట్టి మిథ్యాభావనలో వారు ప్రస్తుతము దేహము ప్రక్రుతిచే కప్పబడియున్నదనియు, భౌతికదేహము నుండి ముక్తిని బడసినంతనే భగవానుడు మరియు తమ నడుమ భేదముండదనియు భావింతురు. కాని శ్రీకృష్ణునితో ఏకము కావలెననెడి వారు ప్రయత్నము భ్రాంతి కారణముగా వ్యర్థమగును. అట్టి దానవ, నాస్తికప్రవృత్తితో కూడియున్న జ్ఞానము వ్యర్థమని ఈ శ్లోకమున సూచించబడినది. అనగా వేదాంతసూత్రములు, ఉపనిషత్తులు వంటి వేదవాజ్మయమునందలి జ్ఞానసముపార్జనము దానవ, నాస్తికప్రవృత్తి గలవారికి సదా వ్యర్థమే కాగలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 350 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 12 🌴

12 . moghāśā mogha-karmāṇo mogha-jñānā vicetasaḥ
rākṣasīm āsurīṁ caiva prakṛtiṁ mohinīṁ śritāḥ


🌷 Translation :

Those who are thus bewildered are attracted by demonic and atheistic views. In that deluded condition, their hopes for liberation, their fruitive activities, and their culture of knowledge are all defeated.

🌹 Purport :

There are many devotees who assume themselves to be in Kṛṣṇa consciousness and devotional service but at heart do not accept the Supreme Personality of Godhead, Kṛṣṇa, as the Absolute Truth. For them, the fruit of devotional service – going back to Godhead – will never be tasted. Similarly, those who are engaged in fruitive pious activities and who are ultimately hoping to be liberated from this material entanglement will never be successful either, because they deride the Supreme Personality of Godhead, Kṛṣṇa.

In other words, persons who mock Kṛṣṇa are to be understood to be demonic or atheistic. As described in the Seventh Chapter of Bhagavad-gītā, such demonic miscreants never surrender to Kṛṣṇa. Therefore their mental speculations to arrive at the Absolute Truth bring them to the false conclusion that the ordinary living entity and Kṛṣṇa are one and the same.

With such a false conviction, they think that the body of any human being is now simply covered by material nature and that as soon as one is liberated from this material body there is no difference between God and himself. This attempt to become one with Kṛṣṇa will be baffled because of delusion. Such atheistic and demoniac cultivation of spiritual knowledge is always futile.

🌹 🌹 🌹 🌹 🌹


04 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 04, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

🍀. మహావీర జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Mahavir Jayanti to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహావీర జయంతి Mahavir Jayanti🌻

🍀. అపరాజితా స్తోత్రం - 12 🍀

25. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

26. యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : అంతర్ముఖ బహిర్ముఖత్వాలు - ఏకాంతంగా ప్రశాంత చిత్తుడపై ఉన్నప్పుడే అంతర్ముఖుడవై లోనికి చొరబారి ఏకాగ్రతాసాధన చెయ్యి. బయటి శబ్దాలు నీ ఏకాగ్రతకు భంగం కలిగించ రాదు. ఆ ఏకాగ్రత నుండి హఠాత్తుగా బహిర్ముఖుడవయ్యే యెడల, కొంచెము సేపు ఒక విధమైన గుండెదడ మొదలైనవి నీకు కలుగవచ్చు. అందుచే బహిర్ముఖుడవై కనులు తెరిచేముందు కొలది క్షణాలు ప్రశాంతుడవై వుండడం మంచిది. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

చైత్ర మాసం

తిథి: శుక్ల త్రయోదశి 08:06:47

వరకు తదుపరి శుక్ల చతుర్దశి

నక్షత్రం: పూర్వ ఫల్గుణి 09:37:56

వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: వృధ్ధి 27:39:27 వరకు

తదుపరి ధృవ

కరణం: తైతిల 08:04:48 వరకు

వర్జ్యం: 17:20:48 - 19:03:52

దుర్ముహూర్తం: 08:36:57 - 09:26:21

రాహు కాలం: 15:24:32 - 16:57:10

గుళిక కాలం: 12:19:16 - 13:51:54

యమ గండం: 09:14:00 - 10:46:38

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:43

అమృత కాలం: 02:37:48 - 04:22:36

మరియు 27:39:12 - 29:22:16

సూర్యోదయం: 06:08:45

సూర్యాస్తమయం: 18:29:47

చంద్రోదయం: 17:05:38

చంద్రాస్తమయం: 05:01:12

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: ధూమ్ర యోగం - కార్య

భంగం, సొమ్ము నష్టం 09:37:56 వరకు

తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹