నిర్మల ధ్యానాలు - ఓషో - 327


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 327 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. శరీరంలో వుండడం బంధమే. అది పరిమితం, నువ్వు అపరిమితానివి. పెద్ద ప్రపంచాన్ని చిన్ని శరీరంలో ఒదిగించడం. అందువల్లే నిరంతర ఆందోళన, అసహనం. 🍀


అన్ని కోరికలూ అదృశ్యమయ్యాకా నువ్వు శరీరానికి తిరిగి రావు. నువ్వు అనంత చైతన్యంలో భాగమవుతావు. దాన్ని తూర్పు దేశాల్లో నిర్వాణమంటారు. విశ్వ చైతన్య మంటారు. అప్పుడు ఏ శరీరంలోనూ అవసరముండదు. ఎట్లాంటి జైలుతో పని వుండదు. అది అంతిమ స్వేచ్ఛ. శరీరంలో వుండడం బంధమే. అది పరిమితం, నువ్వు అపరిమితానివి. పెద్ద ప్రపంచాన్ని చిన్ని శరీరంలో ఒదిగించడం. అందువల్లే నిరంతర ఆందోళన, అసహనం. మనిషి స్పష్టంగా ఆ స్పృహతో వుండడు.

కానీ ప్రతి ఒక్కరిలో ఏదో పొరపాటు జరిగిందన్న భావన కనిపిస్తుంది. కారణం మనం అనంతం. మన శరీరం అల్పం. చైతన్యం నీకు శరీరం నించీ విముక్తి కలిగిస్తుంది. నువ్వు శరీరం కాదని నువ్వు గుర్తించిన మరుక్షణం నీ కోరికలు మాయమై నీ శరీరం కూడా అదృశ్యమవుతుంది. చైతన్యం కాంతిలా పని చేస్తుంది. కోరికలు చీకటిలా మాయమవుతాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment