1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 12, శనివారం, సెప్టెంబరు 2022 ఇందు వాసరే MONDAY 🌹
2) 🌹 కపిల గీత - 69 / Kapila Gita - 69 🌹 సృష్టి తత్వము - 25
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 108 / Agni Maha Purana - 108 🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 243 / Osho Daily Meditations - 243 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 6 🌹
🌹Something is missing 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹12, September 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : తృతీయ శ్రద్ధ Tritiya Shraddha 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం 🍀*
*శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం*
*శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహన్తం |*
*నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం చాంకుశం వామభాగే*
*నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : జ్ఞాన అనుష్ఠానం - నీవు తెలుసుకొన్న దానిని ఆచరణలో పెట్టి, అదే నీవై పోవడం నేర్చుకో. అప్పుడు, ఆ జ్ఞానమే నీ లోపల ప్రత్యక్ష దైవంగా నీకు భాసిస్తుంది.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, వర్ష ఋతువు,
దక్షిణాయణం, భాద్రపద మాసం
తిథి: కృష్ణ విదియ 11:37:06
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: ఉత్తరాభద్రపద 07:00:53
వరకు తదుపరి రేవతి
యోగం: దండ 09:31:25 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: గార 11:40:05 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 12:36:51 - 13:26:00
మరియు 15:04:19 - 15:53:28
రాహు కాలం: 07:35:47 - 09:07:57
గుళిక కాలం: 13:44:26 - 15:16:36
యమ గండం: 10:40:07 - 12:12:16
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36
అమృత కాలం: 02:24:24 - 03:56:16
సూర్యోదయం: 06:03:37
సూర్యాస్తమయం: 18:20:55
చంద్రోదయం: 19:54:32
చంద్రాస్తమయం: 07:39:12
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మీనం
గద యోగం - కార్య హాని , చెడు
07:00:53 వరకు తదుపరి మతంగ
యోగం - అశ్వ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 69 / Kapila Gita - 69🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 25 🌴*
*25. సహస్ర శిరసం సాక్షాద్యమనన్తం ప్రచక్షతే*
*సఙ్కర్షణాఖ్యం పురుషం భూతేన్ద్రియమనోమయమ్*
*మహత్ తత్వమునకు వాసుదేవుడు అధిష్టాత అయినట్లు, అహంకారానికి అధిష్టాత సంకర్షణుడు (ఈయననే అనంతుడనీ, ఆది శేషుడనీ, సహస్ర పడగలు కలవాడు). సంకర్షణుడే భూత (పంచ భూతాలు), ఇంద్రియ (పది ఇంద్రియాలు), మనో మయుడు. అహంకారం వలననే మనసూ, ఇంద్రియాలు, పంచభూతములూ పుట్టాయి.*
*ఈ అహంకారము దేవతా రూపమున కర్తృత్వము,ఇంద్రియ రూపమున కరణత్వము, పంచ మహాభూతముల రూపముస కార్యత్వము అను లక్షణములను కలిగి యుండును.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 69 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 25 🌴*
*25. sahasra-śirasaṁ sākṣād yam anantaṁ pracakṣate*
*saṅkarṣaṇākhyaṁ puruṣaṁ bhūtendriya-manomayam*
*The threefold ahaṅkāra, the source of the gross elements, the senses and the mind, is identical with them because it is their cause. It is known by the name of Saṅkarṣaṇa, who is directly Lord Ananta with a thousand heads.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 108 / Agni Maha Purana - 108 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 34*
*🌻. హోమ విధి - అగ్ని కార్య కథనము - 2🌻*
'ఫట్' అను అస్త్రమంత్రమును ఉచ్చరించుచు (పుష్పములు చల్లి విఘ్నములను తొలగించిన పిదప మండలములోనికి ప్రవేశించవలెను. భూతశుద్ధి, న్యాసము, ముద్రలు చేసి, శిఖకు ('వషట్'కు) చివర 'ఫట్' చేర్చి జపించుచు నాలుగు దిక్కులందును ఆవాలు చల్లవలెను. పిమ్మట వాసుదేవ మంత్రముతో గోమూత్రమును, సంకర్షణమంత్రముతో గోమయమును, ప్రద్యుమ్నమంత్రముతో గోదుగ్ధమును, అని రుద్ధమంత్రముతో పెరుగును, నారాయణమంత్రముతో ఘృతమును గ్రహించి, వాటి నన్నింటిని ఘృతపాత్రమునందు కలపవలెను. ఇతరవస్తువుల భాగములు నేతికంటె ఎక్కువ ఉండవలెను.
వీటి నన్నింటిని కలుపగా పంచగవ్య మేర్పడును, పంచగవ్యమును ఒక పర్యాయము, రెండు పర్యాయములు, లేదా మూడు పర్యాయములు వేరు వేరుగ చేయవలెను. వీటిలో ఒకటి మండపప్రోక్షణమున కుపయోగింపవలెను. రెండవది తినుటకును, మూడవది స్నానమునందును ఉయోగింపవలెను. పది కలశలును స్థాపించి వాటిపై ఇంద్రాదిలోకపాలులను పూజింపవలెను. పూజ చేసి వారికి శ్రీహరి అజ్ఞను వినిపింపవలెను. ''ఓ లోకపాలులారా! శ్రీహరి అజ్ఞ ప్రకారము మీరు ఈ యజ్ఞమును రక్షించుటకై ఎల్లపుడును ఇచట నుండవలెను. ''
యాగద్రవ్యాదులను సంరక్షించుకొని వికిరద్రవ్యములను (విఘ్ననివారణముకొరకై నాలుగు వైపులను చల్లు ఆవాలు మొదలుగువాటికి విరము లనిపేరు) చల్లవలెను. అస్త్రమూలమంత్రమును (అస్త్రాయ ఫట్ ) ఏడు సార్లు జపించుచు ఈ వికిరములను చల్లవలెను. మరల అదే విధముగ అస్త్రమంత్రమును జపించుచు కుశనిర్మితకూర్పమును తీసికొనవలెను.
వాటిని ఊశానకోణము నందుంచి వాటి పైన కలశములను వర్ధనిని ఉంచవెను. కలశముపై సాంగముగ శ్రీహరి పూజ చేసి, వర్ధనిలో అస్త్రపూజ చేయవలెను. అచ్ఛిన్నమగు వర్ధనీధారచే యాగమండపములను ప్రదక్షిణక్రమమున తడుపుచు కలశమును దానికి ఉపయుక్త మగు స్థానమున చేర్చి, ఆసనముపై ఉంచి, దాని పూజ చేయవలెను.
కలశలో పంచరత్నము లుంచవలెను, దానిపై వస్త్రము చుట్టవలెను. దానిపై గంధాద్యుపచారమలతో శ్రీహరిని పూజింపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 108 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 34*
*🌻 Mode of performing oblation - 2 🌻*
9-10. Having recited the mystic syllable ending with phaṭ. one should scatter mustard seeds in different directions. (One should sanctify) the cow’s urine with Vāsudeva, cow’s dung with Saṅkarṣaṇa, the milk with Pradyumna and the curd. got from it with Nārāyaṇa. The ghee should be one part and the others respectively one part more.
11. When these are mixed in a vessel of ghee it is known as the pañcagavya[6] (the five products got from a cow). A part of it is for the sprinkling of the temple building and the other for eating.
12. One should worship Indra and other guardian deities of the world in ten pitchers which have been brought. Having worshipped them one has to make them hear command. They must be installed by the command of Hari.
13. Having kept the articles of sacrifice well-protected, one must scatter those which must be scattered. Having recited. the basic mystic syllable eight hundred times one should take kuśa grass.
14. Then one should place there a pitcher and (the vessel) vardhanī at the north-east. Having worshipped Hari along with the attendant gods in the pitcher one should worship weapons in the (vessel) vardhanī.
15. (Having made) a circumambulation of the sacrificial place, water is sprinkled in broken streams by the vardhanī. Then the pitcher should be taken and worshipped at a fixed place.
16. Hari should be worshipped with perfumes etc. in the pitcher adorned with five gems and cloth and the weapons (should be worshipped) at the left in the Vardhanī in which gold has been placed.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 243 / Osho Daily Meditations - 243 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 243. కాంతి 🍀*
*🕉. మరింత ఎక్కువ కాంతితో నిండిన అనుభూతిని పొందండి. అసలు మూలానికి దగ్గరగా రావడానికి ఇది మార్గం. 🕉*
*మరింత ఎక్కువ కాంతితో నిండిన అనుభూతిని పొందండి. మీరు కళ్ళు మూసుకున్నప్పుడల్లా, మీ జీవి అంతటా ప్రసరించే కాంతిని చూడండి. ప్రారంభంలో ఇది కల్పనగా ఉంటుంది, కానీ ఊహ చాలా సృజనాత్మకంగా ఉంటుంది. కాబట్టి కేవలం గుండె దగ్గర ఒక మంటను ఊహించుకోండి మరియు మీరు కాంతితో నిండి ఉన్నారని ఊహించుకోండి. ఆ కాంతిని పెంచుతూ ఉండండి. ఇది దాదాపు అబ్బుర పరుస్తుంది! మరియు మీరు అనుభూతి చెందడం మాత్రమే కాదు; ఇతరులు కూడా అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. మీరు వారికి దగ్గరగా ఉన్నప్పుడు, వారు దానిని అనుభవించడం ప్రారంభిస్తారు, ఎందుకంటే అది కంపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జన్మహక్కు, కానీ దానిని సాధించుకోవాలి. ఇది హక్కు కోసం దావా చేయని నిధి. మీరు దానిపై అధికారం పొందక పోతే, అది చనిపోయి, భూమి కింద ఖననం చేయబడి ఉంటుంది.*
*మీరు దానిని సాధించినట్లయితే, మీరు మీ స్వంత అంతరంగాన్ని సొంతం చేసుకున్నారు. కాబట్టి మీరు ఎక్కడ వెలుతురును చూసినా, లోతైన గౌరవాన్ని అనుభవించండి. సాధారణమైనది - ఒక దీపం మండుతోంది, మరియు మీరు లోతైన భక్తిని, ఒక నిర్దిష్ట విస్మయాన్ని అనుభవిస్తారు. రాత్రిపూట నక్షత్రాలు ఉన్నాయి - వాటిని చూసి, వాటితో అనుసంధానం అయిన అనుభూతిని పొందండి. ఉదయం, సూర్యుడు ఉదయిస్తాడు. దాన్ని చూడండి మరియు దానితో మీ లోపలి సూర్యుడు ఉదయించనివ్వండి. మీరు వెలుతురును చూసినప్పుడల్లా, వెంటనే దానితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి - ఇలా చేస్తూ వుంటే త్వరలో మీరు చేయగలరు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 243 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 243. LIGHT 🍀*
*🕉. Feel more and more full of light. That's the way to come closer to the original source. 🕉*
*Feel more and more full of light. Whenever you close your eyes, just see light streaming all over your being. In the beginning it will be imagination, but imagination is very creative. So just imagine a flame near the heart and imagine that you are full of light. Keep increasing that light. It becomes almost dazzling! And not only you will start feeling it; others will start feeling it too. Whenever you are close to them, they will start feeling it, because it vibrates. It is everybody's birthright, but one has to claim it. It is an unclaimed treasure. If you don't claim it, it remains dead, buried under the ground.*
*Once you claim it, you have claimed your own inner being. So wherever you see light, feel deep reverence. Just something ordinary--a lamp is burning, and you feel a deep reverence, a certain awe. In the night there are stars-just watch them and feel connected to them. In the morning, the sun rises. Watch it and let the inner sun rise with it. Whenever you see light, immediately try to make contact with it--and soon you will be able to.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 6🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।*
*మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*
*🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 6 🌻*
*'కుముద' అను పదమునకు కూడ మరియొక అర్థ మున్నది. 'ముద' అనగా మోదము. కుముద అనగా హరింపబడిన మోదము. దుఃఖము కారణముగ మోదము హరింపబడును. దుఃఖితులైన భక్తులు కుముదములవంటి వారు. వారికి ఆహ్లాదము కలిగించి మహా కామేశుని వద్దకు దివ్యకాంతుల మార్గమున శ్రీమాత గొనిపోవునని ఈ నామార్ధము.*
*సంసారబద్ధులైన భక్తులకు ఈ అర్థము సమంజసమై యున్నది. భక్తుల దుఃఖములను పోగొట్టి ఆహ్లాదమును కూర్చి దివ్య మార్గమున గొనిపోయి పరమశివుని చెంతకు చేర్చు శ్రీమాతను ఎంత శ్లాఘించిననూ అల్పమే.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 6 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini*
*Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*
*🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 6 🌻*
*The word 'Kumuda' also has another meaning. 'Muda' means bliss. Kumuda means drained bliss, meaning sorrow. Sadness is the cause of sorrow. Sorrowful devotees have their bliss drained from them. Srimata, by reinvigorating bliss in them, shall take those devotees on the path of light to the Lord Shiva.*
*This meaning seems reasonable for the uncelibate devotees. It is not enough to praise Sri Mata who removes the sorrows of the devotees and gathers happiness and leads them on the divine path and brings them to the side of Lord Shiva.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹Something is missing 🌹*
*Prasad Bharadwaj*
*Unless a tree blossoms, it knows no blissfulness. It goes on feeling something is missing.*
*You may have all the pleasures and comforts and luxuries of the world, but unless you know yourself, unless your inner lotus opens, you will go on missing something. You may not be certain what you are missing but a feeling... that something is being missed, that ”I am not complete,” that ”I am not whole,” that ”I am not what existence wanted me to be."*
*This ”missing” feeling goes on nagging everybody. Only the expansion of your consciousness will help you to get rid of this feeling, of this nagging, of this anguish, this angst.*
🌹🌹🌹🌹🌹
*Prasad Bharadwaj*
*Unless a tree blossoms, it knows no blissfulness. It goes on feeling something is missing.*
*You may have all the pleasures and comforts and luxuries of the world, but unless you know yourself, unless your inner lotus opens, you will go on missing something. You may not be certain what you are missing but a feeling... that something is being missed, that ”I am not complete,” that ”I am not whole,” that ”I am not what existence wanted me to be."*
*This ”missing” feeling goes on nagging everybody. Only the expansion of your consciousness will help you to get rid of this feeling, of this nagging, of this anguish, this angst.*
🌹🌹🌹🌹🌹