1) 🌹 24, APRIL 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 360 / Bhagavad-Gita - 360 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 22 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 207 / Agni Maha Purana - 207 🌹
🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 2 / Consecration of doors of the temple and the erection of banner - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 072 / DAILY WISDOM - 072 🌹
🌻 12. ధ్యానం యొక్క మొత్తం మనస్తత్వ శాస్త్రం / 12. The Entire Psychology of Meditation 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 337 🌹
6) 🌹. శివ సూత్రములు - 74 / Siva Sutras - 74 🌹
🌻2-01. చిత్తం మంత్రః - 1 / 2-01. Cittaṁ mantraḥ - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 24, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 29 🍀*
*57. మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానభాక్ |*
*మహావక్షా మహోరస్కో హ్యంతరాత్మా మృగాలయః*
*58. లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః |*
*మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : దివ్యపరివర్తనం - పరమాత్మను ప్రేమించాలంటే అందుకు వస్తుతః కావలసినది దివ్య ప్రేమయే. కాని దాని అభివ్యక్తికి మానవ స్వభావమే తొలుత ఉపకరణం కనుక, ప్రారంభ దశతో అది మానవ ప్రేమ, భ క్తిరూపాలను ధరించక తప్పదు. నీ చేతన గాంభీరౌన్నత్యాలను సంతరించుకొన్నమీదట గాని సత్య ప్రేమావిర్భావమై మానవప్రేమకు దివ్యపరివర్తనం కలిగింప జాలదు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల చవితి 08:26:08 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: మృగశిర 26:09:13 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: శోభన 07:47:59 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: విష్టి 08:26:59 వరకు
వర్జ్యం: 06:26:34 - 08:09:18
దుర్ముహూర్తం: 12:39:42 - 13:30:21
మరియు 15:11:39 - 16:02:18
రాహు కాలం: 07:29:28 - 09:04:26
గుళిక కాలం: 13:49:21 - 15:24:19
యమ గండం: 10:39:24 - 12:14:22
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:39
అమృత కాలం: 16:42:58 - 18:25:42
సూర్యోదయం: 05:54:30
సూర్యాస్తమయం: 18:34:16
చంద్రోదయం: 08:55:52
చంద్రాస్తమయం: 22:39:26
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ఆనంద యోగం - కార్య సిధ్ధి
26:09:13 వరకు తదుపరి కాలదండ యోగం
- మృత్యు భయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 360 / Bhagavad-Gita - 360 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 22 🌴*
*22. అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనా: పర్యుపాసతే |*
*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||*
🌷. తాత్పర్యం :
*నా దివ్యరూపమును ధ్యానించుచు అనన్యభక్తిచే నన్ను సదా అర్చించువారి యోగక్షేమములను నేనే వహింతును (వారికి లేనివి సమకూర్చి, ఉన్నవి సంరక్షింతును).*
🌷. భాష్యము :
*కృష్ణభక్తిరసభావన లేకుండా క్షణకాలమును జీవింపలేనివాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదపద్మ సేవనము, ఇతర సేవలను గూర్చుట, సఖ్యము, ఆత్మనివేదనముల ద్వారా భక్తియుక్తసేవ యందు నియుక్తుడై ఇరువదినాలుగు గంటలు శ్రీకృష్ణుని చింతించుట కన్నను అన్యమును కావింపడు. అట్టి కర్మలు సర్వమంగళదాయకములు మరియు ఆధ్యాత్మిక శక్తిపూర్ణములు. అవి ఆత్మానుభవమునందు భక్తుని పూర్ణుని కావింపగలదు. తద్ద్వారా శ్రీకృష్ణభగవానుని సాహచార్యము పొందుటయే అతని ఏకైక కోరిక కాగలదు. అట్టివాడు నిస్సందేహముగా ఆ భగవానుని ఎట్టి కష్టము లేకుండా చేరగలడు. వాస్తవమునకు ఇదియే యోగమనబడును.*
*భగవానుని కరుణచే అట్టి భక్తుడు ఎన్నడును ఈ భౌతికజీవనమునకు తిరిగిరాడు. ఈ శ్లోకమునందలి “క్షేమము” అను పదము శ్రీకృష్ణ భగవానుని కృపాపూర్ణరక్షణమును సూచించుచున్నది. అనగా యోగము ద్వారా కృష్ణభక్తిరసభావనను పొందుటకు భక్తునకు తోడ్పడు శ్రీకృష్ణభగవానుడు, అతడు సంపూర్ణ కృష్ణభక్తిరసభావితుడైన పిమ్మట దుఃఖభూయిష్టమైన బద్ధజీవనమునకు తిరిగి పతనము చెందకుండా రక్షణము నొసగును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 360 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 22 🌴*
*22. ananyāś cintayanto māṁ ye janāḥ paryupāsate*
*teṣāṁ nityābhiyuktānāṁ yoga-kṣemaṁ vahāmy aham*
🌷 Translation :
*But those who always worship Me with exclusive devotion, meditating on My transcendental form – to them I carry what they lack, and I preserve what they have.*
🌹 Purport :
*One who is unable to live for a moment without Kṛṣṇa consciousness cannot but think of Kṛṣṇa twenty-four hours a day, being engaged in devotional service by hearing, chanting, remembering, offering prayers, worshiping, serving the lotus feet of the Lord, rendering other services, cultivating friendship and surrendering fully to the Lord. Such activities are all auspicious and full of spiritual potencies, which make the devotee perfect in self-realization, so that his only desire is to achieve the association of the Supreme Personality of Godhead. Such a devotee undoubtedly approaches the Lord without difficulty. This is called yoga.*
*By the mercy of the Lord, such a devotee never comes back to this material condition of life. Kṣema refers to the merciful protection of the Lord. The Lord helps the devotee to achieve Kṛṣṇa consciousness by yoga, and when he becomes fully Kṛṣṇa conscious the Lord protects him from falling down to a miserable conditioned life.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 207 / Agni Maha Purana - 207 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 61*
*🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 2 🌻*
*సురేశ్వరా! ఆ ప్రాసాదకలశమును విరాడ్రూపముగా భావింపవెలను. మొత్తము ప్రాసాదమును పురుషునిగా భావన చేయవలెను. క్రింద సువర్ణ ముంచి, సువర్ణకలశను స్థాపింపవలెను. గురువు మొదలైనవారికి దక్షిణ లిచ్చి బ్రహ్మణులకు భోజనములు పెట్టవలెను. దానిపైన కంఠభాగమునందు దారము గాని మాల గాని చుట్టవలెను. దానిపైన కూడ 'విమలామలసార' అను పుష్పమాలను దేవాలయము నాల్గువైపుల కట్టవలెను. దానిపైన వృకలము, దానిపైన సుదర్శనచక్రము నిర్మింపవలెను. అచటనే వాసుదేవాలయమూర్తి గ్రహగుప్త యని తెలుపవలెను. లేదా మొదట కలశమును, దానిపైన సుదర్శనచక్రమును ఏర్పాటు చేయవలెను. బ్రహ్మదేవా! వేదికి నలువైపుల ఎనమండ్రు విఘ్నేశ్వరులను స్థాపించవలెను. లేదా నాలుగు దిక్కులందు నలుగురు విఘ్నేశ్వరులను స్థాపించవలెను. ఇపుడు భూతాదినినాశ గరుడధ్వజారోపణవిధానము చెప్పెదను.*
*దేవాలయమును నిర్మించినవాడు, ప్రాసాదబింబద్రవ్యములలో ఎన్ని పరమాణువు లున్నవో అన్ని వేల సంవత్సరములు విష్ణులోకములో నుండను. పాపరహితుడ వైన బ్రహ్మదేవా! వాయువుచే కదల్చబడిన ధ్వజపటము కలశమును, వేదిని, ప్రాసాదబింబకంఠమును ఎప్పుడు చుట్టుకొనునో అపుడు ప్రాసాదకర్తకుధ్వజారోపణముకంటె కోటిరెట్లు అధిర మగు ఫలము లభించు నని తెలిసికొనవలెను. వాతాక ప్రకృతి; దండము పురుషుడు; ప్రాసాదము వాసుదేవస్వరూపము. ప్రాసాదము భగవంతని ధరించుచున్నది గాన అదియే దానిలోని ధరణీతత్త్వము, దేవాలయము నందలి ఏ శూన్యావకాశ మున్నదో అదియే అకాశతత్త్వము. దానిలోని ప్రకాశ##మే అగ్నితత్త్వము. దానిలో కలుగు వాయుస్పర్శయే వాయుతత్త్వము.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 207 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 61*
*🌻Consecration of doors of the temple and the erection of banner - 2 🌻*
11. (That lord) who is the life of the temple should be contemplated (as) “O Lord of celestials”. Then a wise man has to imagine the temple as the god himself.
12. (A piece of) gold should be placed below the golden pitcher. The priests and others should be paid their fees and the brahmins should be fed.
13-14. Threads should be wound round the altar, neck, top and the globe of the temple after that. Then the metallic ring known as the sudarśana disc should be placed. It should be known as the form of (Lord) Vāsudeva offering protection from fear.
15. Alternatively a pitcher should be placed (in the place of a globe) and the disc above that. O birthless one! eight lords of obstacles (Vighneśvara) should be placed around the altar in the temple.
16. Or four images of Garuḍa (vehicle of Lord Viṣṇu) should be placed in the four quarters. I shall describe now the erection of the flagstaff which destroys the evil spirits.
17. One who performs this remains in the regions of Viṣṇu for so many thousands of years as the number of atoms in the image of the god in the temple.
18. O sinless! It should be known that (a man gets) a crore times more merit by erecting the flag-staff,since it surrounds the neck of the temple and it wafts the wind around the globe, altar and image.
19. The flag should be known as the prakṛti and the staff as the puruṣa and you know that the temple is another form of image of Vāsudeva (Viṣṇu).
20. (In a temple) the dharaṇī (earth) is so called from its ability to hold, its internal cavity stands for the sky, the illumination inside represents the fire, and its touch represents the wind.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 72 / DAILY WISDOM - 72 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 12. ధ్యానం యొక్క మొత్తం మనస్తత్వ శాస్త్రం 🌻*
*ధ్యానం యొక్క మొత్తం శాస్త్రం ఆలోచనలో లోపాలను సరిదిద్దడం తప్ప మరొకటి కాదు. ఈ పద్ధతుల వివరాలను మనము మరింత ముందుకు సాగేటప్పుడు పరిశీలిద్దాము. కాబట్టి, విషయానికి వస్తే, వ్యక్తి యొక్క దుఃఖాన్ని తొలగించే ఉద్దేశ్యంతో వ్యక్తిగత జీవుడు మరియు విశ్వపదార్ధం మధ్య ఉన్న ఈ వేర్పాటు వాదాన్ని తొలగించాలి. ధ్యానం అనేది వ్యక్తిని దుఃఖం నుంచి బయటకు తీసుకు రాగల సాధనం. ఈ దుఃఖం తన వ్యక్తిగత అస్తిత్వం లోనుంచి ప్రపంచాన్ని వేరు చేయడం వల్ల వచ్చింది.*
*ఈ ప్రయోజనం కోసం, ధ్యానం లోకి సాధకుడు ప్రవేశిస్తాడు. ఇక్కడ చెప్పబడిన విషయం త్యాగ సంబంధమైనది. కాబట్టి ఇక్కడ ఆ ఉద్దేశానికి కర్మ సంబంధంగా అశ్వమేధ యాగం చెప్పబడింది. అశ్వమేధ యాగంలో భౌతికంగా ఒక యాగాశ్వం ఉన్నపటికీ, మానసిక తలంలో ఆ అశ్వం మన విశ్వంలో ఏ జీవి అయినా కావచ్చు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 72 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 12. The Entire Psychology of Meditation 🌻*
*The entire psychology of meditation is nothing but a setting right of errors in thought; and the details of these methods we shall be considering as we proceed further. So, to come to the point, this distinction between the individual unit and the Universal Substance is to be abolished for the purpose of the removal of the sorrow of the individual. Meditation is the technique of the removal of sorrow in the sense that sorrow is caused by the segregation of the individual from the world outside.*
*For this purpose, one enters into the technique of meditation. Now, here, the context being sacrifice, we are given a method which is ritualistic in its nature, and thus the ritualistic horse of the Asvamedha Sacrifice becomes an object of contemplation, literally, liturgically as an animal in the sacrifice, but psychologically and spiritually as an element like any other element in creation as a whole.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 337 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. జీవితం ప్రతిక్షణం కొత్తదే. అది పాతది కారు. అస్తిత్వమన్నది యిప్పుడు యిక్కడ వున్నదేదయితే వుందో అది. దాని గతంలో, భవిష్యత్తుతో సంబంధం లేదు. ఈ క్షణానికి నువ్వు అక్కడ వుంటావు. అక్కడ కలయిక వుంటుంది. అదే సత్యం. 🍀*
*జనం అనుకూలాల్లో జీవిస్తారు. వాళ్ళకు సత్యమక్కర్లేదు. వాళ్ళకు ఓదార్పు కావాలి. అందువల్ల వాళ్ళు మూఢ నమ్మకాలకు, సంప్రదాయాలకు, నిర్ణయాలకు కట్టుబడి వుంటారు. ఎందుకంటే మార్కెట్లో పాత'కు ఒకరకమయిన గౌరవం, గిట్టుబాటు వుంటుంది. వాళ్ళు పాతది బంగారంతో సమానమంటారు. అది నిజం కాదు. బుద్ధిహీనులకు, పిరికివాళ్ళకు పాతది బంగారంలా కనిపిస్తుంది. జీవితం ప్రతిక్షణం కొత్తదే. అది పాతది కారు.*
*అస్తిత్వమన్నది యిప్పుడు యిక్కడ వున్నదేదయితే వుందో అది. దాని గతంలో, భవిష్యత్తుతో సంబంధం లేదు. ఈ క్షణానికి నువ్వు అక్కడ వుంటావు. అక్కడ కలయిక వుంటుంది. అదే సత్యం. నేను సత్యాన్ని ప్రనేమతో కలవమంటాను. సత్యం ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వెళ్ళమంటాను. అక్కడ ఏదయినా వదిలేయాల్సి వస్తే వదిలెయ్యాలి. అది సత్యం పట్ల ప్రేమ వున్నపుడే వీలవుతుంది. ప్రేమ ఏమయినా చేస్తుంది. ప్రేమ దేన్నయినా త్యాగం చేస్తుంది. సత్యం సంపూర్ణ త్యాగాన్ని కోరుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 074 / Siva Sutras - 074 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-01. చిత్తం మంత్రః - 1 🌻*
*🌴. స్వీయ-సాక్షాత్కారమైన యోగి యొక్క చైతన్యమే (చిత్తం) మంత్రం. శక్తిని ఆవాహన చేసే మరియు వ్యక్తీకరించే సిద్ధి.🌴*
*మొదటి విభాగంలో శాంభవోపాయ గురించి చర్చించిన తర్వాత, పది సూత్రాలతో కూడిన రెండవ విభాగం ఇప్పుడు శాక్తోపాయతో వ్యవహరిస్తుంది.*
*చిత్త అనేది షరతులు లేని స్వీయ-అవగాహన, ఇది స్వీయ-ఆందోళనతో కూడిన అహంకారానికి (అహం) వ్యతిరేకంగా ఉంటుంది. ఈ సందర్భంలో మంత్రం కేవలం మంత్రాలను సూచించదు. వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో అనుసంధానించడానికి మంత్రం ముఖ్యమైన సాధనం. మంత్రం యొక్క సాధారణ ఉద్దేశ్యం సంబంధిత దేవతతో తన అవగాహనను దృఢంగా ఏర్పాటు చేసుకోవడం. కానీ, ఈ సూత్రంలో, మనస్సునే మంత్రం అని శివుడు చెప్పాడు. ఈ సూత్రానికి సంబంధించినంతవరకు, చిత్తాన్ని కేవలం మనస్సు అని వివరించలేము. ఇది, లోపల దృష్టి కేంద్రీకరించడం ద్వారా అత్యున్నత చైతన్య దశను పొందిన మనస్సు యొక్క మార్పు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 074 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-01. Cittaṁ mantraḥ - 1 🌻*
*🌴. The consciousness (chitta) of a self-realized yogi is mantra, with the power to invoke and manifest the shaktis.🌴*
*After having discussed Śāmbhavopāya in the first section, the second section consisting of ten aphorisms now deals with Śāktopāya.*
*Citta is unconditioned self awareness as opposed to ahaṃkāra (ego) that is conditioned by self-concern. Mantra in this context does not merely refer to mantra-s. Mantra is the essential tool to connect individual consciousness with cosmic consciousness. The general purpose of mantra is to establish his awareness firmly with the concerned deity. But, in this aphorism, Śiva says that mind itself is mantra. As far as this sūtra is concerned, citta cannot be simply explained as mind. It is the modification of the mind where the stage of supreme consciousness is attained by focusing within.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama