శ్రీ లలితా సహస్ర నామములు - 147 / Sri Lalita Sahasranamavali - Meaning - 147

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 147 / Sri Lalita Sahasranamavali - Meaning - 147 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 147. స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః ।
ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా ॥ 147 ॥ 🍀

🍀 763. స్వర్గాపవర్గదా :
స్వర్గమును, మోక్షమును కూడా ఇచ్చునది

🍀 764. శుద్ధా : 
పరిశుద్ధమైనది

🍀 765. జపాపుష్ప నిభాకృతి: :
జపాపుష్పములవలె ఎర్రని ఆకృతి కలది

🍀 766. ఓజోవతీ : 
తేజస్సు కలిగినది

🍀 767. ద్యుతిధరా : 
కాంతిని ధరించినది

🍀 768. యఙ్ఞరూపా :
యఙ్ఞము రూపముగా కలిగినది

🍀 769. ప్రియవ్రతా :
ప్రియమే వ్రతముగా కలిగినది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 147 🌹

📚. Prasad Bharadwaj

🌻 147. Svargapavargada shudha japapushpa nibhakrutih
Ojovati dyutidhara yagynarupa priyavrata ॥ 147 ॥ 🌻

🌻 763 ) Swargapavargadha -
She who gives heaven and the way to it

🌻 764 ) Shuddha -
She who is clean

🌻 765 ) Japapushpa nibhakrithi -
She who has the colour of hibiscus

🌻 766 ) Ojovathi -
She who is full of vigour

🌻 767 ) Dhyuthidhara -
She who has light

🌻 768 ) Yagna roopa -
She who is of the form of sacrifice

🌻 769 ) Priyavrudha -
She who likes penances.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

06 Nov 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 99

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 99 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భాగవత రహస్యము - 1 🌻

పండితులు, కవులు, విమర్షకులు సామాన్య ప్రజలను పామరులని, అజ్ఞానులని భావించుట‌ మదమును తెలియజేయును. సామాన్య ప్రజలే అసామాన్య ప్రజలు. వారి స్వభావము సార్వకాలికము. వారి ధర్మములు శాశ్వతములు.

విజ్ఞానము, నాగరికత మారుచుండవచ్చును. అవి కేలండర్లలోని ‌పేజీల వంటివి. అవసరము తీరినంతనే చింపి పారవేయ వలసినవి. ఈ పుటలు చింపబడక తప్పదు. కాని సంవత్సరము వర్తించుచునే ఉండును. ఇట్లు లక్షల సంవత్సరములు జరుగును.

సామాన్య ప్రజల స్వభావ ధర్మములు, వారు వెలుగు బాటలలో ఆరోహించి తరించునట్టి సోపాన క్రమము శాశ్వతములు. ఆ సోపానములపై ధూళి రేణువుల వలె పండితులు; సంఘ సంస్కర్తలు, విమర్షకులు, కవులును ఎగురుచుందురు. ఇది నరజాతి శాశ్వత కథలో ఒక భాగము.

ఈ పండిత విమర్షకాదులు, సంఘ సంస్కర్తలు ‌సామాన్య ప్రజలకు ఏమియును చేయలేరనుటకు కారణమైన రహస్యము ఒకటి ఉన్నది.

లోకవైఖరి ఒక మహాసముద్రము. ఈ వైఖరిలో, ఈ సామూహిక స్వభావములో ఎవనికి వాడు‌ ఈదులాడుచు, ఈ సముద్రమును‌ ఒక మార్గము పట్టింపగలనను‌ భ్రాంతిలో చనిపోవుచుందురు.

వ్యక్తులలో ప్రత్యేకముగా ఆదర్శములు, ఆశయములు ఉన్నను, అవి సంఘమను రథమునకు దీపముల వంటివే గాని, సారథుల వంటివి‌ కావు...

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

06 Nov 2021

వివేక చూడామణి - 147 / Viveka Chudamani - 147

🌹. వివేక చూడామణి - 147 / Viveka Chudamani - 147🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 31. ఆత్మ దర్శనం -2 🍀

484. బ్రహ్మమనే సముద్రంలో బ్రహ్మానందమనే అమృతము నిండి ఉన్నది. అదంతా కేవలము బ్రహ్మము మాత్రమే. అదంతా తానే అయి ఉన్నది. అందులో ఏ భేదము లేదు.

485. సత్యాన్ని తెలుసుకొన్న ఈ క్షణములో నేనేది వినుట లేదు, చూచుట లేదు, నాకు ఏది తెలియదు, అంతా బ్రహ్మమే, శాశ్వతమైన ఆనందము, అన్నింటికి అది వేరుగా ఉన్నది.

486. ఓ ఉన్నతమైన బోధకుడా నీకు మరల మరల నమస్కరించు చున్నాను. మీరు అన్ని బంధనాలకు అతీతులు. మంచి ఆత్మలన్నింటిలో ఉన్నతమైన వాడవు. శాశ్వతానంద సారానికి ప్రతీకైన నీకు మించి రెండవది ఏదీ లేదు. మీరు శాశ్వతమైన, ఎల్లపుడు హద్దులు లేని దయా సముద్రులు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 147 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 31. Soul Realisation - 2 🌻

484. In the ocean of Brahman filled with the nectar of Absolute Bliss, what is to be shunned and what accepted, what is other (than oneself) and what different ?

485. I neither see nor hear nor know anything in this. I simply exist as the Self, the eternal Bliss, distinct from everything else.

486. Repeated salutations to thee, O noble Teacher, who art devoid of attachment, the best among the good souls and the embodiment of the essence of Eternal Bliss, the One without a second – who art infinite and ever the boundless ocean of mercy:

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

05 Nov 2021

శ్రీ శివ మహా పురాణము - 470

🌹 . శ్రీ శివ మహా పురాణము - 470 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 34

🌻. అనరణ్యుడు - 2 🌻

ఒకనాడు ఆ మునీశ్వరుడు పుష్పభద్రా నదియందు స్నానము చేయుటకు వెళ్లుచూ, లక్ష్మివలె మనోరమ, ¸°వనవతి యగు పద్మను చూచెను (12).

ఆ మహర్షి సమీపములో నున్న జనులను 'ఈ కన్య ఎవరు?' అని ప్రశ్నించెను. శాపభీతులగు జనులు నమస్కరించి ఇట్లు నివేదించిరి (13).

జనులిట్లు పలికిరి |

అపర లక్ష్మీదేవి యనదగిన ఈ సుందరి అనరణ్యుని కుమార్తె. ఈమె పేరు పద్మ. సద్గుణములకు నిలయమగు ఈమెను వివాహమాడ వలెనని శ్రేష్ఠులగు రాజకుమారులు గోరుచున్నారు (14).

బ్రహ్మ ఇట్లు పలికెను -

సత్యమును పలికే జనుల ఆ మాటలను విని ఆ మహర్షి మనస్సునందు చాల క్షోభను పొంది, ఆమెను పొందగోరినాడు (15). ఓశైలరాజా! కామియగు ఆ మహర్షి స్నానముచేసి ఇష్టదైవమగు శివుని యథావిధిగా పూజించి భిక్షకొరకై అనరణ్యుని సభకు వెళ్లెను (16). రాజు మునిని చూచి భయముతో కంగాపడిన వెంటనే నమస్కరించెను. మరియు మధుపర్కాదులనిచ్చి భక్తితో పూజించెను (17). ఆ మహర్షి సత్కార ద్రవ్యములలో తనకు నచ్చిన వాటిని స్వీకరించి కన్యను తనకిమ్మని కోరెను. రాజు ఏమియూ చెప్పజాలక మౌనముగా నుండి పోయెను (18).

' ఆ కన్యను నాకిమ్ము. లేనిచో, క్షణకాలములో సర్వమును భస్మము చేసెదను' అని ఆ ముని మహారాజును కోరెను (19). ఓ మహర్షీ! రాజపరివారమంతయూ ఆ మునియొక్క తేజస్సుచే దిగ్భ్రాంతులైరి. రాజు ఆముదుసలి బ్రాహ్మణుని చూచి బంధువులతో సహా రోదిల్లెను (20). ఆతని భార్యలందరు ఏమి చేయుటకు తోచక ఏడ్చిరి. కన్యయొక్క తల్లియగుమహారాణి దుఃఖపీడితురాలై మూర్ఛిల్లెను (21). కుమారులందరు శోకారులందరు శోకావిష్టమగు మనస్సు గల వారైరి. ఓ పర్వతరాజా! రాజ సంబంధి జనులందరూ శోకమును పట్టజాలకపోయిరి (22).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

05 Nov 2021

గీతోపనిషత్తు -271

🌹. గీతోపనిషత్తు -271 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 11-1

🍀 11-1. దైవానుగ్రహము - పరమాత్మ మహతత్త్వమునకు కూడ పరుడు, ఈశ్వరుడు. తన నుండియే సంకల్పము, కాలము, ప్రకృతి ఉద్భవించి చోటుగ ఏర్పడినది. అట్టి చోటునే మహత్తందురు. అట్టి మహత్తుకు కూడ ఈశ్వరుడు అగుటచే అతనిని మహేశ్వరు డనిరి. తాను లేని చోటులేదు. తాను లేని కాలము లేదు. తానులేని రూపము లేదు. అణువు నుండి బ్రహ్మాండము వరకు అన్నిటి యందు తానున్నాడు. నిజమునకు అన్నియు తనలో పుట్టి, తనలో పెరిగి, తనలో వర్తించుచు, తన లోనికే లయమగు చుండును. ఇది పరమాత్మయొక్క భూత మహేశ్వర స్థితి. 🍀

అవజావంతి మాం మూఢా మానుషీం తమమాశ్రితమ్ |
పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11

తాత్పర్యము : సమస్త భూతములకు ఈశ్వరుడగు నన్ను మూఢులు తెలియలేకున్నారు. శరీరము ధరించి యున్నను కూడ నన్ను తెలియలేక అలక్ష్యము చేయుచున్నారు.

వివరణము : పరమాత్మ మహతత్త్వమునకు కూడ పరుడు, ఈశ్వరుడు. తన నుండియే సంకల్పము, కాలము, ప్రకృతి ఉద్భవించి చోటుగ ఏర్పడినది. అట్టి చోటునే మహత్తందురు. అట్టి మహత్తుకు కూడ ఈశ్వరుడు అగుటచే అతనిని మహేశ్వరు డనిరి. మహత్తు నుండియే మహదహంకారము పుట్టినది. అందుండియే మూడు విధములగు అహంకారములు, పంచభూతములు, పంచ ప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు పుట్టినవి. అవి ఆధారముగ భూతములు పుట్టినవి. అనగా సృష్టి మండలములు, వాని యందు జీవులు ఏర్పడినారు.

అన్నిటి యందు తానే బలముగ నున్నాడు. తాను లేని చోటులేదు. తాను లేని కాలము లేదు. తానులేని రూపము లేదు. అణువు నుండి బ్రహ్మాండము వరకు అన్నిటి యందు తానున్నాడు. నిజమునకు అన్నియు తనలో పుట్టి, తనలో పెరిగి, తనలో వర్తించుచు, తన లోనికే లయమగు చుండును. ఇది పరమాత్మయొక్క భూత మహేశ్వర స్థితి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

05 Nov 2021

5-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 05, శుక్ర వారం, నవంబర్ 2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 271  🌹  
3) 🌹. శివ మహా పురాణము - 470🌹 
4) 🌹 వివేక చూడామణి - 147 / Viveka Chudamani - 147🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -99🌹  
6) 🌹 Osho Daily Meditations - 88 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 147 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 147🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*05, నవంబర్‌ 2021, శుక్రవారము - భృగు వారము*  
*కార్తీక మాసం ప్రారంభం*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 1వ రోజు 🍀*

*నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు.*
*దానములు:- నెయ్యి, బంగారం*
*పూజించాల్సిన దైవము: స్వథా అగ్ని*
*జపించాల్సిన మంత్రము: ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, కార్తీక మాసం
తిథి: శుక్ల పాడ్యమి 23:15:36 వరకు తదుపరి శుక్ల విదియ
పక్షం: శుక్ల-పక్ష, శుక్రవారము - భృగు వారము
నక్షత్రం: విశాఖ 26:23:25 వరకు తదుపరి అనూరాధ
యోగం: ఆయుష్మాన్ 07:12:51 వరకు తదుపరి సౌభాగ్య
కరణం: కింస్తుఘ్న 12:59:54 వరకు
వర్జ్యం: 10:05:30 - 11:30:30 మరియు 29:55:40 - 31:20:44
దుర్ముహూర్తం: 08:33:28 - 09:19:16 
మరియు 12:22:25 - 13:08:12
రాహు కాలం: 10:33:40 - 11:59:31
గుళిక కాలం: 07:41:58 - 09:07:49
యమ గండం: 14:51:14 - 16:17:05
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 18:35:30 - 20:00:30
పండుగలు : గోవర్ధన పూజ, అన్నాకుట్‌, బలి ప్రతిపాద, ద్యూతక్రీడ, Gowardhan Puja, Annakut, Bali Pratipada, Dyuta Krida
సూర్యోదయం: 06:16:07, సూర్యాస్తమయం: 17:42:56
వైదిక సూర్యోదయం: 06:19:48
వైదిక సూర్యాస్తమయం: 17:39:14
చంద్రోదయం: 06:29:58
చంద్రాస్తమయం: 18:13:31
సూర్య సంచార రాశి: తుల, చంద్ర సంచార రాశి: తుల
ఆనందాదియోగం: మతంగ యోగం - అశ్వ లాభం 26:23:25 
వరకు తదుపరి రాక్షస యోగం - మిత్ర కలహం
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -271 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 11-1
 
*🍀 11-1. దైవానుగ్రహము - పరమాత్మ మహతత్త్వమునకు కూడ పరుడు, ఈశ్వరుడు. తన నుండియే సంకల్పము, కాలము, ప్రకృతి ఉద్భవించి చోటుగ ఏర్పడినది. అట్టి చోటునే మహత్తందురు. అట్టి మహత్తుకు కూడ ఈశ్వరుడు అగుటచే అతనిని మహేశ్వరు డనిరి. తాను లేని చోటులేదు. తాను లేని కాలము లేదు. తానులేని రూపము లేదు. అణువు నుండి బ్రహ్మాండము వరకు అన్నిటి యందు తానున్నాడు. నిజమునకు అన్నియు తనలో పుట్టి, తనలో పెరిగి, తనలో వర్తించుచు, తన లోనికే లయమగు చుండును. ఇది పరమాత్మయొక్క భూత మహేశ్వర స్థితి. 🍀*

*అవజావంతి మాం మూఢా మానుషీం తమమాశ్రితమ్ |*
*పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11*

*తాత్పర్యము : సమస్త భూతములకు ఈశ్వరుడగు నన్ను మూఢులు తెలియలేకున్నారు. శరీరము ధరించి యున్నను కూడ నన్ను తెలియలేక అలక్ష్యము చేయుచున్నారు.*

*వివరణము : పరమాత్మ మహతత్త్వమునకు కూడ పరుడు, ఈశ్వరుడు. తన నుండియే సంకల్పము, కాలము, ప్రకృతి ఉద్భవించి చోటుగ ఏర్పడినది. అట్టి చోటునే మహత్తందురు. అట్టి మహత్తుకు కూడ ఈశ్వరుడు అగుటచే అతనిని మహేశ్వరు డనిరి. మహత్తు నుండియే మహదహంకారము పుట్టినది. అందుండియే మూడు విధములగు అహంకారములు, పంచభూతములు, పంచ ప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు పుట్టినవి. అవి ఆధారముగ భూతములు పుట్టినవి. అనగా సృష్టి మండలములు, వాని యందు జీవులు ఏర్పడినారు.* 

*అన్నిటి యందు తానే బలముగ నున్నాడు. తాను లేని చోటులేదు. తాను లేని కాలము లేదు. తానులేని రూపము లేదు. అణువు నుండి బ్రహ్మాండము వరకు అన్నిటి యందు తానున్నాడు. నిజమునకు అన్నియు తనలో పుట్టి, తనలో పెరిగి, తనలో వర్తించుచు, తన లోనికే లయమగు చుండును. ఇది పరమాత్మయొక్క భూత మహేశ్వర స్థితి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 470 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 34

*🌻. అనరణ్యుడు - 2 🌻*

ఒకనాడు ఆ మునీశ్వరుడు పుష్పభద్రా నదియందు స్నానము చేయుటకు వెళ్లుచూ, లక్ష్మివలె మనోరమ, ¸°వనవతి యగు పద్మను చూచెను (12).

ఆ మహర్షి సమీపములో నున్న జనులను 'ఈ కన్య ఎవరు?' అని ప్రశ్నించెను. శాపభీతులగు జనులు నమస్కరించి ఇట్లు నివేదించిరి (13).

జనులిట్లు పలికిరి |

అపర లక్ష్మీదేవి యనదగిన ఈ సుందరి అనరణ్యుని కుమార్తె. ఈమె పేరు పద్మ. సద్గుణములకు నిలయమగు ఈమెను వివాహమాడ వలెనని శ్రేష్ఠులగు రాజకుమారులు గోరుచున్నారు (14).

బ్రహ్మ ఇట్లు పలికెను -

సత్యమును పలికే జనుల ఆ మాటలను విని ఆ మహర్షి మనస్సునందు చాల క్షోభను పొంది, ఆమెను పొందగోరినాడు (15). ఓశైలరాజా! కామియగు ఆ మహర్షి స్నానముచేసి ఇష్టదైవమగు శివుని యథావిధిగా పూజించి భిక్షకొరకై అనరణ్యుని సభకు వెళ్లెను (16). రాజు మునిని చూచి భయముతో కంగాపడిన వెంటనే నమస్కరించెను. మరియు మధుపర్కాదులనిచ్చి భక్తితో పూజించెను (17). ఆ మహర్షి సత్కార ద్రవ్యములలో తనకు నచ్చిన వాటిని స్వీకరించి కన్యను తనకిమ్మని కోరెను. రాజు ఏమియూ చెప్పజాలక మౌనముగా నుండి పోయెను (18).

' ఆ కన్యను నాకిమ్ము. లేనిచో, క్షణకాలములో సర్వమును భస్మము చేసెదను' అని ఆ ముని మహారాజును కోరెను (19). ఓ మహర్షీ! రాజపరివారమంతయూ ఆ మునియొక్క తేజస్సుచే దిగ్భ్రాంతులైరి. రాజు ఆముదుసలి బ్రాహ్మణుని చూచి బంధువులతో సహా రోదిల్లెను (20). ఆతని భార్యలందరు ఏమి చేయుటకు తోచక ఏడ్చిరి. కన్యయొక్క తల్లియగుమహారాణి దుఃఖపీడితురాలై మూర్ఛిల్లెను (21). కుమారులందరు శోకారులందరు శోకావిష్టమగు మనస్సు గల వారైరి. ఓ పర్వతరాజా! రాజ సంబంధి జనులందరూ శోకమును పట్టజాలకపోయిరి (22).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 147 / Viveka Chudamani - 147🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 31. ఆత్మ దర్శనం -2 🍀*

484. బ్రహ్మమనే సముద్రంలో బ్రహ్మానందమనే అమృతము నిండి ఉన్నది. అదంతా కేవలము బ్రహ్మము మాత్రమే. అదంతా తానే అయి ఉన్నది. అందులో ఏ భేదము లేదు. 

485. సత్యాన్ని తెలుసుకొన్న ఈ క్షణములో నేనేది వినుట లేదు, చూచుట లేదు, నాకు ఏది తెలియదు, అంతా బ్రహ్మమే, శాశ్వతమైన ఆనందము, అన్నింటికి అది వేరుగా ఉన్నది. 

486. ఓ ఉన్నతమైన బోధకుడా నీకు మరల మరల నమస్కరించు చున్నాను. మీరు అన్ని బంధనాలకు అతీతులు. మంచి ఆత్మలన్నింటిలో ఉన్నతమైన వాడవు. శాశ్వతానంద సారానికి ప్రతీకైన నీకు మించి రెండవది ఏదీ లేదు. మీరు శాశ్వతమైన, ఎల్లపుడు హద్దులు లేని దయా సముద్రులు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 147 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 31. Soul Realisation - 2 🌻*

484. In the ocean of Brahman filled with the nectar of Absolute Bliss, what is to be shunned and what accepted, what is other (than oneself) and what different ?

485. I neither see nor hear nor know anything in this. I simply exist as the Self, the eternal Bliss, distinct from everything else.

486. Repeated salutations to thee, O noble Teacher, who art devoid of attachment, the best among the good souls and the embodiment of the essence of Eternal Bliss, the One without a second – who art infinite and ever the boundless ocean of mercy: 
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 99 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. భాగవత రహస్యము - 1 🌻*

పండితులు, కవులు, విమర్షకులు సామాన్య ప్రజలను పామరులని, అజ్ఞానులని భావించుట‌ మదమును తెలియజేయును. సామాన్య ప్రజలే అసామాన్య ప్రజలు. వారి స్వభావము సార్వకాలికము. వారి ధర్మములు శాశ్వతములు. 

విజ్ఞానము, నాగరికత మారుచుండవచ్చును. అవి కేలండర్లలోని ‌పేజీల వంటివి. అవసరము తీరినంతనే చింపి పారవేయ వలసినవి. ఈ పుటలు చింపబడక తప్పదు. కాని సంవత్సరము వర్తించుచునే ఉండును. ఇట్లు లక్షల సంవత్సరములు జరుగును. 

సామాన్య ప్రజల స్వభావ ధర్మములు, వారు వెలుగు బాటలలో ఆరోహించి తరించునట్టి సోపాన క్రమము శాశ్వతములు. ఆ సోపానములపై ధూళి రేణువుల వలె పండితులు; సంఘ సంస్కర్తలు, విమర్షకులు, కవులును ఎగురుచుందురు. ఇది నరజాతి శాశ్వత కథలో ఒక భాగము. 

ఈ పండిత విమర్షకాదులు, సంఘ సంస్కర్తలు ‌సామాన్య ప్రజలకు ఏమియును చేయలేరనుటకు కారణమైన రహస్యము ఒకటి ఉన్నది. 

లోకవైఖరి ఒక మహాసముద్రము. ఈ వైఖరిలో, ఈ సామూహిక స్వభావములో ఎవనికి వాడు‌ ఈదులాడుచు, ఈ సముద్రమును‌ ఒక మార్గము పట్టింపగలనను‌ భ్రాంతిలో చనిపోవుచుందురు.

వ్యక్తులలో ప్రత్యేకముగా ఆదర్శములు, ఆశయములు ఉన్నను, అవి సంఘమను రథమునకు దీపముల వంటివే గాని, సారథుల వంటివి‌ కావు...

.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 88 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 88. WORK IN BALANCE 🍀*

*🕉 The best arrangement is to work in the world but not to be lost in It. Work for five or six hours, and then forget all about it. Give at least two hours to your inner growth, a few hours to your relationship, to love, to your children, to your friends, to society. 🕉*

Your profession should only be one part of life. It should not overlap into every dimension of your life, as ordinarily it does. A doctor becomes almost a twenty-four-hour doctor. He thinks about it, he talks about it. Even when he is eating, he is a doctor. While he is making love, he is a doctor. Then it is madness; it is insane. 

To avoid this kind of madness, people escape. Then they become twenty-fourhour seekers. Again they are making the same mistake-the mistake of being in anything for twenty-four hours. My whole effort is to help you to be in the world and yet to be a seeker. Of course this is difficult, because there will be more challenge and situations. It is easier to be either a doctor or a seeker. It will be difficult to be both, because that will give you many contradictory situations. But a person grows in contradictory situations.

In the turmoil, in that clash of the contradictions, integrity is born. My suggestion is that you work for five or six hours. Use the remaining hours for other things: for sleep, for music, for poetry, for meditation, for love, or for just fooling around. That too is needed. If a person becomes too wise and cannot fool around, he becomes heavy, somber, serious. He misses life.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 147 / Sri Lalita Sahasranamavali - Meaning - 147 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 147. స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః ।*
*ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా ॥ 147 ॥ 🍀*

🍀 763. స్వర్గాపవర్గదా : 
స్వర్గమును, మోక్షమును కూడా ఇచ్చునది 

🍀 764. శుద్ధా : పరిశుద్ధమైనది 

🍀 765. జపాపుష్ప నిభాకృతి: : 
జపాపుష్పములవలె ఎర్రని ఆకృతి కలది 

🍀 766. ఓజోవతీ : తేజస్సు కలిగినది 

🍀 767. ద్యుతిధరా : కాంతిని ధరించినది 

🍀 768. యఙ్ఞరూపా : 
యఙ్ఞము రూపముగా కలిగినది 

🍀 769. ప్రియవ్రతా : 
ప్రియమే వ్రతముగా కలిగినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 147 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 147. Svargapavargada shudha japapushpa nibhakrutih*
*Ojovati dyutidhara yagynarupa priyavrata ॥ 147 ॥ 🌻*

🌻 763 ) Swargapavargadha -   
She who gives heaven and the way to it

🌻 764 ) Shuddha -   
She who is clean

🌻 765 ) Japapushpa nibhakrithi -   
She who has the colour of hibiscus

🌻 766 ) Ojovathi -   
She who is full of vigour

🌻 767 ) Dhyuthidhara -   
She who has light

🌻 768 ) Yagna roopa -   
She who is of the form of sacrifice

🌻 769 ) Priyavrudha -   
She who likes penances.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹