మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 99


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 99 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భాగవత రహస్యము - 1 🌻


పండితులు, కవులు, విమర్షకులు సామాన్య ప్రజలను పామరులని, అజ్ఞానులని భావించుట‌ మదమును తెలియజేయును. సామాన్య ప్రజలే అసామాన్య ప్రజలు. వారి స్వభావము సార్వకాలికము. వారి ధర్మములు శాశ్వతములు.

విజ్ఞానము, నాగరికత మారుచుండవచ్చును. అవి కేలండర్లలోని ‌పేజీల వంటివి. అవసరము తీరినంతనే చింపి పారవేయ వలసినవి. ఈ పుటలు చింపబడక తప్పదు. కాని సంవత్సరము వర్తించుచునే ఉండును. ఇట్లు లక్షల సంవత్సరములు జరుగును.

సామాన్య ప్రజల స్వభావ ధర్మములు, వారు వెలుగు బాటలలో ఆరోహించి తరించునట్టి సోపాన క్రమము శాశ్వతములు. ఆ సోపానములపై ధూళి రేణువుల వలె పండితులు; సంఘ సంస్కర్తలు, విమర్షకులు, కవులును ఎగురుచుందురు. ఇది నరజాతి శాశ్వత కథలో ఒక భాగము.

ఈ పండిత విమర్షకాదులు, సంఘ సంస్కర్తలు ‌సామాన్య ప్రజలకు ఏమియును చేయలేరనుటకు కారణమైన రహస్యము ఒకటి ఉన్నది.

లోకవైఖరి ఒక మహాసముద్రము. ఈ వైఖరిలో, ఈ సామూహిక స్వభావములో ఎవనికి వాడు‌ ఈదులాడుచు, ఈ సముద్రమును‌ ఒక మార్గము పట్టింపగలనను‌ భ్రాంతిలో చనిపోవుచుందురు.

వ్యక్తులలో ప్రత్యేకముగా ఆదర్శములు, ఆశయములు ఉన్నను, అవి సంఘమను రథమునకు దీపముల వంటివే గాని, సారథుల వంటివి‌ కావు...

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


06 Nov 2021

No comments:

Post a Comment