శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -3🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀

🌻 343-3. 'క్షేత్రక్షేత్రజ్ఞ పాలినీ' 🌻


ఆమె అనుగ్రహముతో దేహమందలి సప్త ఋషి ప్రజ్ఞలను, ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను, అష్టవసువు లను, అశ్వినీదేవతలను, అష్ట దిక్పాలకులను, సమస్త దేవతా ప్రజ్ఞలను, అసుర ప్రజ్ఞలను, పశుప్రవృత్తిని దేహముననే దర్శించవచ్చును. మానవ శరీరము మొత్తము సృష్టికి ప్రతీక. అందు మానవుడు జ్ఞానియై వ్యాప్తి చెంది శ్రీమాతను కూడ అనుగ్రహవశమున తెలియుటకు శ్రీమాత ఆరాధనము ముఖ్యము. భగవద్గీత యందు పదిహేనవ అధ్యాయముగ పురుషోత్తమ ప్రాప్తి తెలుపబడినది. అందు క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనుచూ ఒకే యజ్ఞపురుషుని మూడు తత్త్వములు తెలిపిరి.

అందు క్షర పురుషుడు క్షేత్రము. అది వచ్చుచు పోవుచు నుండును. శాశ్వతముగ ఒక స్థితి యందుండదు. అందు వసించు క్షేత్రజ్ఞుడు అక్షర పురుషుడు. అతడు నశింపడు. శాశ్వతుడు. కాని క్షేత్రమున చిక్కుకొన గలడు. క్షేత్రమును, క్షేత్రజ్ఞుని లేక క్షర పురుషుని, అక్షర పురుషుని మూలమై యున్నవాడు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడే మిగిలిన రెండు తత్త్వములకు పాలకుడు. శ్రీవిద్య పరముగ ఆ పురుషోత్తమ తత్త్వమే శ్రీమాత. ఆమెయే క్షేత్రమును, క్షేత్రజ్ఞులను కూడ పాలించును. మనయందు పురుషోత్తమ తత్త్వము మూలమై యున్నది. దాని వ్యక్తరూపము మనమే. మన వ్యక్త రూపము మన శరీరము. మనకూ మన శరీరమునకు స్వామి దైవమే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 343-3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻


🌻 343-3. Kṣetra-kṣetrajña-pālinī क्षेत्र-क्षेत्रज्ञ-पालिनी (343) 🌻


The protector of both kṣetra and Kṣetrajña. She protects both viz. the gross body and the soul. Kṣetrajña-pālinī could mean the protector of the soul or the protector of Śiva. Being Śiva’s wife She has to necessarily protect Him. Being Śrī Mātā or the divine Mother, She has to protect Her children. That is why Śiva is called as the universal father and Śaktī as the universal mother. (Poet Kālidāsa says in his Raghuvaṃśa “jagataḥ pitarau vande pārvati parameśvarau जगतः पितरौ वन्दे पार्वति परमेश्वरौ ।“)


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


30 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 142


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 142 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీకష్ణావతారము 🌻


కృష్టావతార తత్త్వమున అనేక కళలున్నవి. శ్రీకృష్ణుడు పాండవులకు ఆదర్శపురుషుడు. ధర్మరాజునకు గురువు, దైవము, ద్రౌపదికి‌ రక్షకుడు. కుంతీ దేవికి దిక్కు. కౌరవులకు రాజకీయ విజ్ఞానవేత్త. రాజలోకము దృష్టిలో ఆదర్శ రాయబారి. అర్జునునకు దేహమునకు, ఆత్మకు సారధి. కాని తనకు తాను మాత్రము క్రీడాపరుడైన శిశువు.

కురు‌పాండవ‌ యుద్ధమును గాని, యాదవుల వినాశమును గాని వారించుటకు తనకు ప్రయోజనం లేదు. వారింపవలసిన మమకారము లేదు. తాను‌ కావలయును అని అనుకొన్నవారికి‌ కావలసినవాడు. జీవితమున సన్నివేశములను క్రీడగా నడిపి, దేహపరిత్యాగ క్రీడలో జగత్తునకు వెలుగుగా మైత్రేయునందు ప్రవేశించినవాడు.

....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


30 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 512


🌹 . శ్రీ శివ మహా పురాణము - 512 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 43

🌻. శివుని అద్భుత లీల - 4 🌻


అపుడు మేనక యొక్క ఆ మాటను విని ఆమెను ఒక ఆట ఆడించదలచిన నీవు ఇట్లు పలకితివి: పార్వతీ పతి ఈతడు కాడు. ఈతడు కేశవుడు, హరి (37). ఈయన శంకరుని సర్వకార్యములకు అధికారి, శంకరునకు ప్రియుడు. కావున పార్వతీ పతియగు శివుడు ఈయనకంటె అధికుడు, శ్రేష్ఠుడు అని ఎరుంగుము (38). ఆయన యొక్క శోభను వర్ణించుటకు నాకు శక్తి లేదు. ఓ మేనా!ఆయనయే బ్రహ్మాండములన్నింటికి ప్రభువు, సర్వేశ్వరుడు, స్వరాట్‌ (39) నారదుని ఈ మాటను విని మేనా దేవి పార్వతిని గురించి శుభకరురాలు, మహాభాగ్యవతి, గొప్ప సంపద గలది, మూడు కులములకు సుఖమును కలిగించునది అగునని తలపోసెను(40) ప్రసన్నమగు ముఖము గలదై ఆమె ఆనందముతో నిండిన మనస్సుతో తన భాగ్యము అధిక మని అనేక పర్యాయములు వర్ణిస్తూ ఇట్లు పలికెను(41)

మేన ఇట్లు పలకెను-

పార్వతి పుట్టుటచే నేనీనాడు అన్ని విధములా ధన్యురాలనైతిని. ఈనాడు పర్వత రాజు కూడ ధన్యుడైనాడు, నా సర్వము మిక్కిలి ధన్యమైనది (42) నేను గొప్ప కాంతి గల దేవనాయకుల నెవరెవరిని చూచితినో, వారందరికీ ప్రభువగు శివుడు ఈమెకు భర్త కాగలడు(43) ఆ ప్రభువును ఈమె పొందుటను చూడగలిగిన భాగ్యమును గాని, ఈమె యొక్క భాగ్యమును గాని వర్ణించుటకు వంద సంవత్సరముల లైననూ చాలదు(44).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ప్రేమతో నిండిన మనస్సు గల ఆ మేన ఇట్లు పలుకుచుండగానే, అద్భుతమగు లీలలను ప్రకటించే రుద్ర ప్రభుడు విచ్చేసెను (45). వత్సా! ఆయన యొక్క అద్భుతములగు గణములు మేన యొక్క గర్వము నడంచగలవి.ఆయన మాయాలేపము లేనిది, వికారములు లేనిది యగు తన స్వరూపమును ప్రదర్శించెను (46). ఓ నారదమునీ! ఆయన వచ్చుటకు గాంచిన నీవు అపుడు మిక్కిలి ప్రీతితో మేనకు ఆ పార్వతీ పతిని చూపించి ఇట్లు పలికితివి ( 47).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


30 Jan 2022

గీతోపనిషత్తు -314


🌹. గీతోపనిషత్తు -314 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -3 📚


🍀 22-3. అభియుక్తుడు - సచేతనముల యందు, అచేతనములందు కూడ ఉన్నది ఈశ్వరుడే. ఇట్టి భావన స్థిరపడ వలెను. ఈశ్వరుడు కాని దేదియు సృష్టియం దేమియు లేదని నిశ్చయముగ తెలియవలెను. పని ఈశ్వరుడు, పనిముట్టు ఈశ్వరుడు. తనతో సహకరించువాడు ఈశ్వరుడు. సహకరించని వాని రూపమున గూడ ఈశ్వరుడే యున్నాడు. 🍀

22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||

తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.

వివరణము : ఉన్నదీశ్వరుడే అయినను, జీవులు దానిని ఈశ్వరునిగ చూడక మరొక దృష్టితో చూచుదురు. తల్లి, తండ్రి, గురువు, తాత, తాతమ్మ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు, తెలిసినవారు, తెలియనివారు- అందరి యందు ఉన్నదీశ్వరుడే. సచేతనముల యందు, అచేతనములందు కూడ ఉన్నది ఈశ్వరుడే. ఇట్టి భావన స్థిరపడ వలెను. ఈశ్వరుడు కాని దేదియు సృష్టియం దేమియు లేదని నిశ్చయముగ తెలియవలెను.


తన యందు, తన పరిసరముల యందు ఈశ్వరుడే అనేక రూపములతోను, నామములతోను ఉన్నాడని తెలియవలెను. దినచర్య అంతయు ఈశ్వర దర్శనమున సాగిపోవలెను. పని ఈశ్వరుడు, పనిముట్టు ఈశ్వరుడు. తనతో సహకరించువాడు ఈశ్వరుడు. సహకరించని వాని రూపమున గూడ ఈశ్వరుడే యున్నాడు. ఇట్లు దినమంతయు ఈశ్వర దర్శనమునకే ప్రయత్నించవలెను. కనపడిన పురుగు, పాము, పక్షి, వృక్షము, జంతువు, మనిషి- ఇట్లేమీ కనిపించినను ఈశ్వరుడే ఇట్లున్నాడని తెలియవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


30 Jan 2022

30-JANUARY-2022 ఆదివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 30, ఆదివారం, జనవరి 2022 భాను వాసరే 🌹 
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 22-3 - 314 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 512🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -142🌹  
5) 🌹 Osho Daily Meditations - 131🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 343-3 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 30, జనవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 4 🍀*

*🌟 4. వరుణః –*
*వసిష్ఠో హ్యరుణో రంభా సహజన్యస్తథా హుహుః |*
*శుక్రశ్చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయంత్యమీ *
*సూర్యస్యందనమారూఢ అర్చిర్మాలీ ప్రతాపవాన్ |*
*కాలభూతః కామరూపో హ్యరుణః సేవ్యతే మయా*

🌻 🌻 🌻 🌻 🌻

*పండుగలు మరియు పర్వదినాలు :*
*ప్రదోషవ్రతం, మాస శివరాత్రి*
*Pradosh Vrat, Masik Shivaratri*

*🍀. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 17:30:55 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: పూర్వాషాఢ 24:23:32 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
సూర్యోదయం: 06:48:26
సూర్యాస్తమయం: 18:10:15
వైదిక సూర్యోదయం: 06:52:11
వైదిక సూర్యాస్తమయం: 18:06:31
చంద్రోదయం: 04:54:59
చంద్రాస్తమయం: 16:11:39
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగం: హర్షణ 14:16:02 వరకు
తదుపరి వజ్ర
 కరణం: గార 07:04:18 వరకు
వర్జ్యం: 11:27:12 - 12:53:24
దుర్ముహూర్తం: 16:39:20 - 17:24:47
రాహు కాలం: 16:45:01 - 18:10:15
గుళిక కాలం: 15:19:47 - 16:45:01
యమ గండం: 12:29:20 - 13:54:34
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 20:04:24 - 21:30:36
శుభ యోగం - కార్య జయం 24:23:32
వరకు తదుపరి అమృత యోగం - కార్య సిధ్ది

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -314 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -3 📚*
 
*🍀 22-3. అభియుక్తుడు - సచేతనముల యందు, అచేతనములందు కూడ ఉన్నది ఈశ్వరుడే. ఇట్టి భావన స్థిరపడ వలెను. ఈశ్వరుడు కాని దేదియు సృష్టియం దేమియు లేదని నిశ్చయముగ తెలియవలెను. పని ఈశ్వరుడు, పనిముట్టు ఈశ్వరుడు. తనతో సహకరించువాడు ఈశ్వరుడు. సహకరించని వాని రూపమున గూడ ఈశ్వరుడే యున్నాడు. 🍀*

*22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |*
*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||

*తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.*

*వివరణము : ఉన్నదీశ్వరుడే అయినను, జీవులు దానిని ఈశ్వరునిగ చూడక మరొక దృష్టితో చూచుదురు. తల్లి, తండ్రి, గురువు, తాత, తాతమ్మ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు, తెలిసినవారు, తెలియనివారు- అందరి యందు ఉన్నదీశ్వరుడే. సచేతనముల యందు, అచేతనములందు కూడ ఉన్నది ఈశ్వరుడే. ఇట్టి భావన స్థిరపడ వలెను. ఈశ్వరుడు కాని దేదియు సృష్టియం దేమియు లేదని నిశ్చయముగ తెలియవలెను.*

*తన యందు, తన పరిసరముల యందు ఈశ్వరుడే అనేక రూపములతోను, నామములతోను ఉన్నాడని తెలియవలెను. దినచర్య అంతయు ఈశ్వర దర్శనమున సాగిపోవలెను. పని ఈశ్వరుడు, పనిముట్టు ఈశ్వరుడు. తనతో సహకరించువాడు ఈశ్వరుడు. సహకరించని వాని రూపమున గూడ ఈశ్వరుడే యున్నాడు. ఇట్లు దినమంతయు ఈశ్వర దర్శనమునకే ప్రయత్నించవలెను. కనపడిన పురుగు, పాము, పక్షి, వృక్షము, జంతువు, మనిషి- ఇట్లేమీ కనిపించినను ఈశ్వరుడే ఇట్లున్నాడని తెలియవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 512 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 43

*🌻. శివుని అద్భుత లీల - 4 🌻*

అపుడు మేనక యొక్క ఆ మాటను విని ఆమెను ఒక ఆట ఆడించదలచిన నీవు ఇట్లు పలకితివి: పార్వతీ పతి ఈతడు కాడు. ఈతడు కేశవుడు, హరి (37). ఈయన శంకరుని సర్వకార్యములకు అధికారి, శంకరునకు ప్రియుడు. కావున పార్వతీ పతియగు శివుడు ఈయనకంటె అధికుడు, శ్రేష్ఠుడు అని ఎరుంగుము (38). ఆయన యొక్క శోభను వర్ణించుటకు నాకు శక్తి లేదు. ఓ మేనా!ఆయనయే బ్రహ్మాండములన్నింటికి ప్రభువు, సర్వేశ్వరుడు, స్వరాట్‌ (39) నారదుని ఈ మాటను విని మేనా దేవి పార్వతిని గురించి శుభకరురాలు, మహాభాగ్యవతి, గొప్ప సంపద గలది, మూడు కులములకు సుఖమును కలిగించునది అగునని తలపోసెను(40) ప్రసన్నమగు ముఖము గలదై ఆమె ఆనందముతో నిండిన మనస్సుతో తన భాగ్యము అధిక మని అనేక పర్యాయములు వర్ణిస్తూ ఇట్లు పలికెను(41)

మేన ఇట్లు పలకెను-

పార్వతి పుట్టుటచే నేనీనాడు అన్ని విధములా ధన్యురాలనైతిని. ఈనాడు పర్వత రాజు కూడ ధన్యుడైనాడు, నా సర్వము మిక్కిలి ధన్యమైనది (42) నేను గొప్ప కాంతి గల దేవనాయకుల నెవరెవరిని చూచితినో, వారందరికీ ప్రభువగు శివుడు ఈమెకు భర్త కాగలడు(43) ఆ ప్రభువును ఈమె పొందుటను చూడగలిగిన భాగ్యమును గాని, ఈమె యొక్క భాగ్యమును గాని వర్ణించుటకు వంద సంవత్సరముల లైననూ చాలదు(44).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ప్రేమతో నిండిన మనస్సు గల ఆ మేన ఇట్లు పలుకుచుండగానే, అద్భుతమగు లీలలను ప్రకటించే రుద్ర ప్రభుడు విచ్చేసెను (45). వత్సా! ఆయన యొక్క అద్భుతములగు గణములు మేన యొక్క గర్వము నడంచగలవి.ఆయన మాయాలేపము లేనిది, వికారములు లేనిది యగు తన స్వరూపమును ప్రదర్శించెను (46). ఓ నారదమునీ! ఆయన వచ్చుటకు గాంచిన నీవు అపుడు మిక్కిలి ప్రీతితో మేనకు ఆ పార్వతీ పతిని చూపించి ఇట్లు పలికితివి ( 47).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 142 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

 *🌻. శ్రీకష్ణావతారము 🌻*

*కృష్టావతార తత్త్వమున అనేక కళలున్నవి. శ్రీకృష్ణుడు పాండవులకు ఆదర్శపురుషుడు. ధర్మరాజునకు గురువు, దైవము, ద్రౌపదికి‌ రక్షకుడు. కుంతీ దేవికి దిక్కు. కౌరవులకు రాజకీయ విజ్ఞానవేత్త. రాజలోకము దృష్టిలో ఆదర్శ రాయబారి. అర్జునునకు దేహమునకు, ఆత్మకు సారధి. కాని తనకు తాను మాత్రము క్రీడాపరుడైన శిశువు.*

*కురు‌పాండవ‌ యుద్ధమును గాని, యాదవుల వినాశమును గాని వారించుటకు తనకు ప్రయోజనం లేదు. వారింపవలసిన మమకారము లేదు. తాను‌ కావలయును అని అనుకొన్నవారికి‌ కావలసినవాడు. జీవితమున సన్నివేశములను క్రీడగా నడిపి, దేహపరిత్యాగ క్రీడలో జగత్తునకు వెలుగుగా మైత్రేయునందు ప్రవేశించినవాడు.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 131 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 131. NOISE 🍀*

*🕉 Life is noisy, and the world is too crowded. But to fight with noise is not the way to get rid of it; the way to get rid of it is to accept it totally. 🕉*
 
*The more you fight, the more nervous you will be, because the more you fight, the more it will disturb you. Open up, accept it; noise too is part of life. And once you start accepting it, you will be surprised: it will no longer disturb you. Disturbance does not come from the noise; it comes from our attitude toward the noise. The noise is not the disturbance; it is the attitude that is the disturbance. If you are antagonistic to it, you are disturbed; if you are not antagonistic to it, you are not disturbed. And where will you go? Wherever you go some kind of noise is bound to be there; the whole world is noisy.*

*Even if you can find a cave in the Himalayas and sit there, you will miss life. Noise will not be there, but all the growth possibilities that life makes available will not be there, either, and soon the silence will look dull and dead. I am not saying don't enjoy silence. Enjoy silence; but know that silence is not against noise. Silence can exist in noise. In fact, when it exists in noise-only then is it real silence. The silence that you feel in the Himalayas is not your silence; it belongs to the Himalayas. But if in the marketplace you can feel silence, you can be utterly at ease and relaxed, it is yours. Then you have the Himalayas in your heart, and that's the true thing!*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -3🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

*🌻 343-3. 'క్షేత్రక్షేత్రజ్ఞ పాలినీ' 🌻* 

*ఆమె అనుగ్రహముతో దేహమందలి సప్త ఋషి ప్రజ్ఞలను, ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను, అష్టవసువు లను, అశ్వినీదేవతలను, అష్ట దిక్పాలకులను, సమస్త దేవతా ప్రజ్ఞలను, అసుర ప్రజ్ఞలను, పశుప్రవృత్తిని దేహముననే దర్శించవచ్చును. మానవ శరీరము మొత్తము సృష్టికి ప్రతీక. అందు మానవుడు జ్ఞానియై వ్యాప్తి చెంది శ్రీమాతను కూడ అనుగ్రహవశమున తెలియుటకు శ్రీమాత ఆరాధనము ముఖ్యము. భగవద్గీత యందు పదిహేనవ అధ్యాయముగ పురుషోత్తమ ప్రాప్తి తెలుపబడినది. అందు క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనుచూ ఒకే యజ్ఞపురుషుని మూడు తత్త్వములు తెలిపిరి.*

*అందు క్షర పురుషుడు క్షేత్రము. అది వచ్చుచు పోవుచు నుండును. శాశ్వతముగ ఒక స్థితి యందుండదు. అందు వసించు క్షేత్రజ్ఞుడు అక్షర పురుషుడు. అతడు నశింపడు. శాశ్వతుడు. కాని క్షేత్రమున చిక్కుకొన గలడు. క్షేత్రమును, క్షేత్రజ్ఞుని లేక క్షర పురుషుని, అక్షర పురుషుని మూలమై యున్నవాడు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడే మిగిలిన రెండు తత్త్వములకు పాలకుడు. శ్రీవిద్య పరముగ ఆ పురుషోత్తమ తత్త్వమే శ్రీమాత. ఆమెయే క్షేత్రమును, క్షేత్రజ్ఞులను కూడ పాలించును. మనయందు పురుషోత్తమ తత్త్వము మూలమై యున్నది. దాని వ్యక్తరూపము మనమే. మన వ్యక్త రూపము మన శరీరము. మనకూ మన శరీరమునకు స్వామి దైవమే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 343-3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*

*🌻 343-3. Kṣetra-kṣetrajña-pālinī क्षेत्र-क्षेत्रज्ञ-पालिनी (343) 🌻*

*The protector of both kṣetra and Kṣetrajña. She protects both viz. the gross body and the soul. Kṣetrajña-pālinī could mean the protector of the soul or the protector of Śiva. Being Śiva’s wife She has to necessarily protect Him. Being Śrī Mātā or the divine Mother, She has to protect Her children. That is why Śiva is called as the universal father and Śaktī as the universal mother. (Poet Kālidāsa says in his Raghuvaṃśa “jagataḥ pitarau vande pārvati parameśvarau जगतः पितरौ वन्दे पार्वति परमेश्वरौ ।“)*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹