🌹 04, JULY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 04, JULY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 04, JULY 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 393 / Bhagavad-Gita - 393 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 21 / Chapter 10 - Vibhuti Yoga - 21 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 239 / Agni Maha Purana - 239 🌹 
🌻. స్నానతర్పణాది విధి కధనము - 5 / Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 5 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 105 / DAILY WISDOM - 105 🌹 
🌻 14. అజ్ఞానుల విశ్వాసం చెదర కొట్టకూడదు. / 14. The Faith of the Ignorant is not to be Shaken🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 371 🌹*
6) 🌹. శివ సూత్రములు - 107 / Siva Sutras - 107 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 10 / 2-07. Mātrkā chakra sambodhah   - 10 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 04, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 10 🍀*

*20. శ్రీరామరూపః కృష్ణస్తు లంకాప్రాసాదభంజనః |*
*కృష్ణః కృష్ణస్తుతః శాంతః శాంతిదో విశ్వభావనః*
*21. విశ్వభోక్తాఽథ మారఘ్నో బ్రహ్మచారీ జితేంద్రియః |*
*ఊర్ధ్వగో లాంగులీ మాలీ లాంగూలాహతరాక్షసః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సామాన్య సాధనక్రమం
కోశ విశుద్ధికి పూర్వమే కొందరికి నిక్కమైన అనుభూతి' కలగ వచ్చు. కాని, అది స్థిరంగా వుండదు. మరల తిరోహితమై కోశవిశుద్ధి కొరకు నిరీక్షిస్తుంది. అయినా ఇది ఎల్లరికీ వర్తించే విషయం కాదు. సామాన్యంగా సాధన ఆత్మ యందలి ఆకాంక్షతోనే ప్రారంభం అవుతుంది. పిమ్మట ఆలయం సిద్ధం కావడానికి ప్రకృతిలో సంఘర్షణ, అనంతరం విగ్రహావిష్కరణ, అటు తర్వాత పవిత్ర గర్భాలయంలో నిత్యసన్నిధి.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 13:39:55
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: పూర్వాషాఢ 08:26:44
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ఇంద్ర 11:49:22 వరకు
తదుపరి వైధృతి
కరణం: కౌలవ 13:37:55 వరకు
వర్జ్యం: 15:30:40 - 16:55:36
దుర్ముహూర్తం: 08:23:49 - 09:16:23
రాహు కాలం: 15:37:31 - 17:16:05
గుళిక కాలం: 12:20:23 - 13:58:57
యమ గండం: 09:03:15 - 10:41:49
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 04:09:24 - 05:34:56
మరియు 24:00:16 - 25:25:12
సూర్యోదయం: 05:46:07
సూర్యాస్తమయం: 18:54:40
చంద్రోదయం: 20:07:17
చంద్రాస్తమయం: 06:19:21
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 08:26:44 వరకు తదుపరి
మానస యోగం - కార్య లాభం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 393 / Bhagavad-Gita - 393 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 21 🌴*

*21. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |*
*మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ||*

🌷. తాత్పర్యం :
*నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై యున్నాను.*

🌷. భాష్యము :
*ఆదిత్యులు పన్నెండురు కలరు. వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు. అకాశమునందు ప్రకాశించువానిలో సూర్యుడు ముఖ్యమైనవాడు. అతడు దేవదేవుని సముజ్జ్వలనేత్రముగా బ్రహ్మసంహిత యందు అంగీకరింపబడినాడు. ఆకాశమున ఏబదిరకముల వాయువులు వీచుచుండును. వాటికి అధిష్టానదేవతయైన మరీచి శ్రీకృష్ణుని ప్రతినిధి.*

*రాత్రి సమయమున నక్షత్రములందు ప్రదానుడైన చంద్రుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. చంద్రుడు ఒకానొక నక్షత్రమని ఈ శ్లోకము ద్వారా గోచరించుచున్నది. అనగా ఆకాశమునందు మెరయు నక్షత్రములు కూడా సూర్యునికాంతినే ప్రతిబింబించుచున్నవి. విశ్వమునందు అనేక సూర్యులు కలరనెడి సిద్ధాంతమును వేదవాజ్మయము అంగీకరింపదు. సూర్యుడొక్కడే. సూర్యునికాంతిని ప్రతిబింబించుట ద్వారా చంద్రుడు వెలుగునట్లు, నక్షత్రములు కూడా వెలుతురును ప్రసరించుచున్నవి. చంద్రుడు నక్షత్రములలో ఒకడని భగవద్గీత ఇచ్చట తెలుపుచున్నందున ఆకాశమున మొరయు నక్షత్రములు చంద్రుని పోలినవే గాని సూర్యులు కానేరవు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 393 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 21 🌴*

*21. ādityānām ahaṁ viṣṇur jyotiṣāṁ ravir aṁśumān*
*marīcir marutām asmi nakṣatrāṇām ahaṁ śaśī*

🌷 Translation : 
*Of the Ādityas I am Viṣṇu, of lights I am the radiant sun, of the Maruts I am Marīci, and among the stars I am the moon.*

🌹 Purport :
*There are twelve Ādityas, of which Kṛṣṇa is the principal. Among all the luminaries shining in the sky, the sun is the chief, and in the Brahma-saṁhitā the sun is accepted as the glowing eye of the Supreme Lord. There are fifty varieties of wind blowing in space, and of these winds the controlling deity, Marīci, represents Kṛṣṇa. Among the stars, the moon is the most prominent at night, and thus the moon represents Kṛṣṇa.*

*It appears from this verse that the moon is one of the stars; therefore the stars that twinkle in the sky also reflect the light of the sun. The theory that there are many suns within the universe is not accepted by Vedic literature. The sun is one, and as by the reflection of the sun the moon illuminates, so also do the stars. Since Bhagavad-gītā indicates herein that the moon is one of the stars, the twinkling stars are not suns but are similar to the moon.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 240 / Agni Maha Purana - 240 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 72*

*🌻. స్నానతర్పణాది విధి కధనము - 5 🌻*

*పిమ్మట అఘమర్షణము చేయవలెను. కుడిచేతిలో బోధరూప శివమయ మగు ఉదకము పోసికొని, ముక్కు దగ్గరకు తీసికొనిపోయి, (వామ) ఇడానాడి ద్వారా శ్వాస పీల్చి లోపల నిలిపి, లోపలినుండి నల్లని పాప పురుషుని (దక్షిణ) పింగళానాడి ద్వారా బైటకు తీసికొని వచ్చి ఆ జలమునందు స్థాపించవలెను. ఆ పాపపురుషునితో కూడిన జలమును, ఒక వజ్రమయ శిలను భావన చేసి, దానిపై పడవేసి చంపవలెను. దీనితో అఘమర్షణము సంపన్న మగును. పిమ్మట కుశ - పుష్ప - అక్ష తలతో కూడిన జలముతో అర్ఘ్యాంజలి పట్టి దానిని ''ఓం నమః శివాయ స్వాహా'' అను మంత్రముతో శివునకు సమర్పించి యథాశక్తిగ గాయత్రీ మంత్రము జపింపవలెను.*

*ఇపుడు తర్పణవిధిని చెప్పెదను. దేవతలకు వారి నామ మంత్రముల నుచ్చరించుచు, దేవతీర్థము ద్వారా తర్పణము చేయవలెను. ''ఓం హూం శివాయ స్వాహా'' అని చెప్పి శివునకు తర్పణమీయవలెను. ఇతర దేవతలకు కూడ ఈ విధముగనే వారి వారి పేర్లకు ''స్వాహా'' చేర్చి తర్పణము లీయవలెను. ''ఓం హాం హృదయాయ నమః, ఓం హీం శిరసే స్వాహా; ఓం హూం శిఖాయై వషట్‌; ఓం హై కవచాయ హుం; ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్‌; ఓం హః అస్త్రాయ ఫట్‌'' అను వాక్యము లుచ్చరించుచు క్రమముగ హృదయ - శిరః - శిఖా - కవచ - నేత్ర - అస్త్రన్యాసములు చేయవలెను. ఎనిమిది దేవగణములకు వారి పేర్ల చివర నమః అను పదము చేర్చి తర్పణము చేయవలెను. ''ఓం హాం ఆదిత్యేభ్యో నమః; ఓం హాం వసుభ్యో నమః; ఓం హాం రుద్రేభ్యో నమః; ఓం హాం విశ్వేభ్యో దేవేభ్యో నమః; ఓం హాం మరుద్భ్యో నమః; ఓం మాం భృగుభ్యో నమః, ఓం హాం అంగిరోభ్యో నమః'' - ఈ విధముగ చేయవలెను. పిమ్మట యజ్ఞోపవీతమును కంఠమునందు మాల వలె ధరించి (ఉపవతి) ఋషితర్పణము చేయవలెను. ''ఓం హాం అత్రయే నమః; ఓం హాం విశ్వామిత్రాయ నమః; ఓం హాం ప్రచేతసే నమః; ఓం హాం మరీచయే నమః'' అను మంత్రములు పఠించుచు అత్ర్యాది ఋషులకు ఋషితీర్థము ద్వారా తర్పణములు చేయవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 240 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 72*
*🌻 Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 5🌻*

37. That water should then be ejected into the right palm after having conceived it as black in colour because of the redemption of one’s sins. It should be thrown on a stone slab. This is known to be the aghamarṣaṇa (redeeming from sin) rite.

38. Then one should repeat the gāyatrī mantra as many times as possible after having offered the respectful arghya consisting, of kuśa, flowers and unbroken rice to Śiva with the mantras of Śiva ending with (the syllable) svāhā (oblation).

39. I shall describe the offering of water oblations to the god. One should utter the mantra Śivāya svāhā (oblations to Śiva) and offer water. (The syllable) svāhā should be repeated in all cases.

40. (The nyāsa should be done as) hrāṃ, to the heart; hrīṃ, to the head; hrūṃ, to the tuft of hair; hraiṃ, to the armour and the weapons, (or in the alternative), the eight gods (can be located) in the heart and other limbs).

41-44. (The water oblations should be performed for the following gods)—hrāṃ, to the Vasus, Rudras, Viśve (devas), (to the sages)—hāṃ to Bhṛgus, Aṅgirās, Atri; salutation to Vasiṣṭha, Pulastya, Kratu, Bhāradvāja; salutations to Viśvāmitra, to Pracetas; vaṣaṭ to Sanaka; hāṃ vaṣaṭ to Sananda, vaṣaṭ to Sanātana, vaṣaṭ to Sanatkumāra; vaṣaṭ to Kapila, to Pañcaśikha, (the ceremony being done) with the fingers of the right hand placed at the elbow joint of the left.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 105 / DAILY WISDOM - 105 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 14. అజ్ఞానుల విశ్వాసం చెదర కొట్టకూడదు. 🌻*

*విద్య వెనుక ఉన్న ప్రాథమిక తత్వం ఏమిటంటే 'అనుభవ స్థితిలో ఉన్న ఆ స్థాయి వాస్తవికతకి భంగం కలిగించకూడదు.' అని. భగవద్గీత ఇలా ఉద్బోధిస్తుంది: “అజ్ఞానుల విశ్వాసం చెదర కొట్టకూడదు” అయితే జ్ఞాని అజ్ఞానులకు జ్ఞానాన్ని అందించే పనిని చేస్తాడు. విద్య యొక్క ఏ దశలోనూ విద్యార్థి యొక్క స్థాయిని విస్మరించలేము. అయితే ఇది ఉన్నత స్థాయి జ్ఞానంతో పోల్చితే సరిపోని స్థాయి అని పరిగణించవచ్చు.*

*విద్య అనేది ఒక పూల మొగ్గ వికసించే కళాత్మక ప్రక్రియను పోలి ఉంటుంది. ఇది క్రమంగా మరియు అందంగా ఉంటుంది. ఏదైనా అనవసరమైన శక్తిని ప్రయోగించడం ద్వారా మొగ్గ అకస్మాత్తుగా తెరవబడదు; అలా చేస్తే అది వికసించదు, విరిగిపోతుంది. అటువంటి విరిగిన నిర్మాణం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ విద్యార్థి వెనుక దాగి ఉంటాడు, అయినా అతను ఎల్లప్పుడూ విద్యార్థితోనే ఉన్నాడు. ఆ విద్యార్థి ఏర్పరచుకునే భావజాలలో అతను భాగస్వామి కాకూడదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 105 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 14. The Faith of the Ignorant is not to be Shaken 🌻*

*The basic psychology behind education should be “not to disturb the degree of reality involved in any state of experience.” The Bhagavadgita exhorts: “The faith of the ignorant is not to be shaken” while the wise one performs the function of imparting knowledge to the ignorant. The standpoint of the student in any stage of education cannot be ignored, though it may be regarded as an inadequate standpoint in comparison with a higher level of knowledge.*

*Education is similar to the artistic process of the blossoming of a flower bud, gradually and beautifully. The bud is not to be opened suddenly by exerting any undue force; else, it would not be a blossom, but a broken structure serving no purpose. The teacher is always to be hidden behind the student, though he is with the student at all times. He is not to come to the forefront, either as a superior or an unpleasant ingredient among the constituents that go to form the feelings, aspirations and needs of the student at any particular level.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 371 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. విశ్వం శాశ్వతమైతే మనము శాశ్వతమే. అందుకనే ప్రాచ్యంలో 'అహం బ్రహ్మస్మి' అన్నారు.అంటే నేనే దేవుణ్ణి అని అర్థం. నేనే సత్యం' అని అర్థం. ఇవన్నీ అద్భుతమయిన తీర్మానాలు. వాటిని అనుభూతి చెందు. 🍀*

*విశ్వం విశాలమైంది. హద్దులు లేనిది. దాంట్లో భాగాలం కనక మనమూ సరిహద్దులు లేని వాళ్ళమే. అనంత విశ్వంలోని అపూర్వ లక్షణాలు మనలోనూ వున్నాయి. చిన్ని ఫార్ములాని గమనించు. సమస్తం శాశ్వతమయితే భాగాలు ఎప్పటికీ అశాశ్వతం కావు. అట్లాగే విశ్వం శాశ్వతమైతే మనము శాశ్వతమే. అందుకనే ప్రాచ్యంలో 'అహం బ్రహ్మస్మి' - అంటే నేనే దేవుణ్ణి అని అర్థం. నేనే సత్యం' అని అర్థం. ఇవన్నీ అద్భుతమయిన తీర్మానాలు. అవి మానవజాతి తరపున తీర్మానాలు. ఇవి అహంకార పూరితాలు కావు. అవి వాస్తవ ప్రకటనలు. వాటిని అనుభూతి చెందు. ఆద్యంతాలు లేని అనంతంలో నువ్వు భాగం. అపుడు నువ్వు తెలికపడతావు. నీ అల్పమయిన కష్టాలు, బాధలు వదిలిపెడతావు. నీ వైశాల్యంలో అవి అతి అల్పమైనవి. అవి లెక్కించాల్సినవి కావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 107 / Siva Sutras - 107 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 10 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*పైన చర్చించిన చివరి నాలుగు దశలు ప్రతి మనిషిలో కూడా జరుగుతాయి. ఇప్పటివరకు, శివ పది కదలికలు చేసాడు, దాని ఫలితంగా పది అచ్చులు వెల్లడయ్యాయి. అతని చైతన్యం యొక్క అంతర్గతీకరణ అంటే మొత్తం విశ్వం అతని అత్యున్నత స్థాయి చైతన్యం మరియు ఆనందంతో గుర్తించబడుతుందని అర్థం. ఈ దశల ముగింపులో, సృష్టి ఆవిర్భవించదు. ఈ సూత్రం చాలా సుదీర్ఘమైన వివరణను కలిగి ఉంది. పై వివరణ మొదటి భాగాన్ని పూర్తి చేస్తుంది. ఇక మిగిలిన భాగాలు అనుసరించబడతాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 107 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07.  Mātrkā chakra sambodhah   - 10 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*The last four stages that have been discussed above also happen within every human being. So far, Śiva has made ten movements, as a result of which ten vowels have been revealed. The internalisation of His consciousness means that the entire universe is being identified with His highest levels of consciousness and bliss. At the end of these stages, the creation as such does not unfold. This aphorism has a very lengthy explanation. The above interpretation completes the first part and rest of the parts will follow.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 462. ‘సురనాయికా’ - 3 🌻


దేహము అసుర ప్రజ్ఞలతోను, అందు పనిచేయు ప్రజ్ఞలు సుర ప్రజ్ఞలతోను నిండియుండును. దేహాత్మ భావన గల జీవుని యందు సహజముగ అసుర ప్రజ్ఞలే ఎక్కువగ వర్తించు చుండును. వారి యందలి సుర ప్రజ్ఞలు మేల్కాంచి జీవునికి వికాసము కలిగించవలె నన్నచో శ్రీమాత నారాధించుట నిజమగు ఉపాయము. దైవమును ఆరాధన చేయని వారియందు స్థూల ప్రజ్ఞలే మెండుగ బలము కలిగి యుండును. పురాణము లందు తెలుపబడిన దేవాసుర యుద్ధము లన్నియూ జీవుని యందు నిత్యమూ సాగుచునే యున్నవి. జ్ఞానము, అజ్ఞానముల ఘర్షణముల నుండి జీవుడు ఉత్తీర్ణుడగుటకు దేవతారాధనము ప్రధానము. అంతర్యామి యగు దైవము నిత్యమారాధించు వారి యందు దేవతా ప్రజ్ఞలు క్రమముగ మేల్కాంచి అసుర ప్రజ్ఞలను హద్దులలో నుంచును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 462. 'Suranaeika' - 3 🌻


The body is full of asura prajnas and its working powers are full of suraprajnas. In a body-conscious being, natural demon powers are more applicable. It is a great idea to pray to Srimata so that their internal sura prajna awakens and makes the living being flourish. Among those who do not worship God, gross wisdom has the power of enlightenment. All the Devasura war described in the Puranas are going on forever in the life. Deity worship is essential for the living being to overcome the conflicts of knowledge and ignorance. Antaryami is eternally slaying those who gradually awaken the divine powers and keep the asura powers out of bounds.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


ఓషో రోజువారీ ధ్యానాలు - 07. నవ్వు / Osho Daily Meditations - 07. LAUGHTER


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 07 / Osho Daily Meditations - 07 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 07. నవ్వు 🍀

🕉. నవ్వడానికి కారణాల కోసం ఎందుకు వేచి ఉండాలి? జీవితమే నవ్వడానికి తగినంత కారణం కావాలి. ఇది చాలా అసంబద్ధమైనది, చాలా హాస్యాస్పదమైనది. ఇది చాలా అందంగా ఉంటుoది, చాలా అద్భుతంగా ఉంటుంది! ఇది అన్ని రకాల విషయాలు కలిసి ఉంటుంది. ఇది గొప్ప విశ్వ హాస్యం. 🕉


మీరు అనుమతిస్తే నవ్వు అనేది ప్రపంచంలో అత్యంత సులభమైన విషయం, కానీ అది కష్టంగా మారింది. ప్రజలు చాలా అరుదుగా నవ్వుతారు మరియు వారు నవ్వినప్పుడు కూడా అది నిజం కాదు. వారు ఎవరిపట్లో బాధ్యత వహిస్తున్నట్లు, ఎదో కర్తవ్యం నిర్వర్తి స్తున్నట్లు నవ్వుతారు. నవ్వు సరదాగా ఉంటుంది. మీరు ఎవరికీ బాధ్యత వహించడం లేదు! మరొకరిని సంతోషపెట్టడానికి మీరు నవ్వకూడదు, ఎందుకంటే మీరు సంతోషంగా లేకుంటే, మీరు మరొకరిని సంతోషపెట్టలేరు.

నవ్వడానికి కారణాల కోసం ఎదురు చూడకుండా మీరు మీ ఇష్టానుసారంగా నవ్వాలి. మీరు విషయాన్ని చూడటం మొదలుపెడితే, మీరు నవ్వు ఆపుకోలేరు. ప్రతిఒక్కటి నవ్వుకి తగినదే - ఏమీ లోటు లేదు - కాని మనం ఒప్పుకోము. నవ్వు గురించి, ప్రేమ గురించి, జీవితం గురించి మనం చాలా లోభత్వం. ఆ లోభత్వాన్ని వదులుకోవచ్చని మీకు తెలిసిన తర్వాత, మీరు వేరే కోణంలోకి వెళతారు. నవ్వడమే అసలైన మతం. మిగతావన్నీ మెటాఫిజిక్స్ మాత్రమే.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 7 🌹

📚. Prasad Bharadwaj

🍀 07. LAUGHTER 🍀

🕉 . Why wait for reasons to laugh? Life as it is should be reason enough to laugh. It is so absurd, it is so ridiculous. It is so beautiful,so wonderful! It is all sorts of things together. It is a great cosmic joke. 🕉


Laughter is the easiest thing in the world if you allow it, but it has become hard. People laugh very rarely, and even when they laugh it is not true. People laugh as if they are obliging somebody, as if they are fulfilling a certain duty. Laughter is fun. You are not obliging anybody! You should not laugh to make somebody else happy, because if you are not happy, you cannot make anybody else happy.

You should simply laugh of your own accord, without waiting for reasons to laugh. If you start looking into things, you will not be able to stop laughing. Everything is simply perfect for laughter-nothing is lacking-but we won't allow it. We are very miserly ... miserly about laughter, about love, about life. Once you know that miserliness can be dropped, you move into a different dimension. Laughter is the real religion. Everything else is just metaphysics.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 753 / Sri Siva Maha Purana - 753


🌹 . శ్రీ శివ మహా పురాణము - 753 / Sri Siva Maha Purana - 753 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 15 🌴

🌻. దేవజలంధర సంగ్రామము - 2 🌻


శుక్రడిట్లు పలికెను -


జలంధరా! మహావీరా! రాక్షసులందరికీ సహాయమును చేయువాడా! జరిగిన వృత్తాంతము నంతనూ యథాతథముగా చెప్పెదను. వినుము (9). పూర్వము బలవంతుడు, వీరుడు, విరోచనుని కూమారుడు, హిరణ్యకశిపుని మునిమనుమడు, గొప్ప ధర్మవేత్త అగు బలి యనువాడు ఒకడు ఉండెను (10). స్వార్థ సంపాదనలో ఘనులగు దేవతలు వానిచే ఓడింపబడి ఇంద్రునితో గూడి లక్ష్మీ పతిని శరణు జొచ్చి తమ వృత్తాంతమును చెప్పిరి (11). తరువాత ఆయన ఆజ్ఞచే రాక్షసులు దేవతలతో సంధిని కుదుర్చుకొనిరి. మోసపుచ్చుటలో పండితులగు దేవతలు తమ కార్యమును చక్కబెట్టుకొనుట కొరకై అట్లు చేసిరి. వత్సా! (12) అపుడు విష్ణువు యొక్క సాహాయ్యము గల దేవతలందరు రాక్షసులతో గూడి అమృతము కొరకు సముద్రమును శ్రద్ధతో మథించిరి (13).

తరువాత రాక్షసులకు శత్రువులగు దేవతలు యోజన చేసి శ్రేష్ఠవస్తువులను గొని పోయిరి. మరియు మోసము చేసి అమృతమును త్రాగిరి (14). మరియు విష్ణువు యొక్క సాహాయ్యముతో అమృతమును త్రాగి బలమును పొందిన ఆ దేవతలు రాక్షసులను పరాభవించిరి. విఫ్ణవు యొక్క చమ్రు వారికి సహాయపడెను (15). నిత్యము ఇంద్రుని పక్షమును వహించు విష్ణువు, దేవతల ప్రక్కన చేరి అమృతమును త్రాగుచున్న రాహువు యొక్క శిరస్సును నరికివేసెను (16).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 753🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 15 🌴

🌻 The fight between the gods and Jalandhara - 2 🌻



Bhārgava said:—

9. O Jalandhara, O great hero, O benefactor of the Asuras, listen to the account. I shall relate everything exactly as it had happened.

10. Once there was a strong hero Bali, the son of Virocana and great-grandson of Hiraṇyakaśipu. He was foremost among the virtuous.

11. The gods including Indra being defeated by him sought refuge in Viṣṇu. Eager to gain their ends they told him all details.

12. O dear, at his bidding, the gods, very clever in deception, made an alliance with the Asuras, to further their own interest.

13. All those gods, the assistants of Viṣṇu churned the ocean eagerly for the gain of nectar, along with the Asuras.

14. The enemies of the Asuras extracted jewels from the ocean. The gods seized the nectar and drank it deceitfully.

15. Then the gods including Indra increased in strength and prowess by the drinking of the nectar and harassed the Asuras with the assistance of Viṣṇu.

16. This Viṣṇu who is always a partisan of Indra, cut off the head of Rahu as he was drinking the nectar along with the gods.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 792 / Vishnu Sahasranama Contemplation - 792


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 792 / Vishnu Sahasranama Contemplation - 792🌹

🌻792. సున్దః, सुन्दः, Sundaḥ🌻

ఓం సున్దాయ నమః | ॐ सुन्दाय नमः | OM Sundāya namaḥ


సుష్ఠూనత్తీతి సున్దోఽయముచ్యతే పరమేశ్వరః ।
ఉన్దీధాతో క్లేదనార్థాద్ ఆర్ద్రీభావస్యవాచకః ॥

కరుణాకర ఇత్యర్థో పచాద్యచి కృతే సతి ।
వృషోదరాదిగతత్వాత్ పరరూపమిషేష్యతే ॥


చక్కగా ఆర్ద్రత నందును. ఈ 'సుంద' శబ్దము కూడ ఆర్ద్రీభావమును తెలుపును. అనగా 'కరుణాకరః' - కరుణకు ఆకారము వంటివాడు; దయకు గని వంటివాడు. చాల దయ కలవాడు అని అర్థము.


('ఉందీ - క్లేదనే' అనగా 'ఆర్ద్రత - తడిగానుండును' అను ధాతువు నుండి పచాది ధాతువులనుండి రాదగు 'అచ్‍' ప్రత్యయము రాగా, ఉంద్ + అ 'ఉందః' అగును. సు + ఉంద కలియగా సవర్ణములగు రెండు ఉకారముల కలయికచే దీర్ఘమురాగా 'సూంద' అని కావలసియుండగా పరరూపము - అనగా రెండవ పదముయొక్క మొదటనున్న 'ఉ' ఆదేశము అయి 'సుందః' అగుట. ఇది వృషోదరాది గణమునందలి శబ్దము కాగా జరిగినది.)


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 792🌹

🌻792. Sundaḥ🌻

OM Sundāya namaḥ


सुष्ठूनत्तीति सुन्दोऽयमुच्यते परमेश्वरः ।
उन्दीधातो क्लेदनार्थाद् आर्द्रीभावस्यवाचकः ॥

करुणाकर इत्यर्थो पचाद्यचि कृते सति ।
वृषोदरादिगतत्वात् पररूपमिषेष्यते ॥


Suṣṭhūnattīti sundo’yamucyate parameśvaraḥ,
Undīdhāto kledanārthād ārdrībhāvasyavācakaḥ.

Karuṇākara ityartho pacādyaci kr‌te sati,
Vr‌ṣodarādigatatvāt pararūpamiṣeṣyate.


He who gets moistened (out of mercy). The word 'Sunda' also means merciful. 'Karuṇākaraḥ' - embodiment of compassion. His empathy is limitless. The One who is ever merciful.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr‌ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹

కపిల గీత - 200 / Kapila Gita - 200


🌹. కపిల గీత - 200 / Kapila Gita - 200 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 10 🌴

10. కర్మనిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణమ్|
యజేద్యష్టవ్యమితి వా పృథగ్భావః స సాత్త్వికః॥


తాత్పర్యము : పాపక్షయము కొరకై కర్మ ఫలములను అన్నింటిని భగవంతునకు అర్పించుటయే తన కర్తవ్యము అని భావించుచు, ప్రతిఫలాపేక్ష లేకుండా స్వామి - సేవక భావముతో సేవించువాడు "సాత్త్విక భక్తుడు" అనబడును.

వ్యాఖ్య : బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు, బ్రహ్మచారిలు, గృహస్థులు, వానప్రస్థులు మరియు సన్యాసిలతో పాటు, వర్ణాల యొక్క ఎనిమిది విభాగాలలో సభ్యులు మరియు ఆశ్రమ ధర్మాలను నిర్వహించడం కోసం వారు తమ సత్సంబంధాలను కలిగి ఉంటారు. అటువంటి కార్యకలాపాలు నిర్వహించి, వాటి ఫలితాలను భగవంతుడికి సమర్పించినప్పుడు, వాటిని కర్మార్పణం అంటారు, భగవంతుని సంతృప్తి కోసం చేసే విధులు. ఏదైనా అసమర్థత లేదా దోషం ఉన్నట్లయితే, ఈ సమర్పణ ప్రక్రియ ద్వారా అది పరిహరింప బడుతుంది. కానీ ఈ నైవేద్య ప్రక్రియ స్వచ్ఛమైన భక్తితో కాకుండా మంచి అనే పద్ధతిలో ఉంటే, అప్పుడు ఆసక్తి భిన్నంగా ఉంటుంది. నాలుగు ఆశ్రమాలు మరియు నాలుగు వర్ణాలు తమ వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా కొంత పనిచేస్తాయి. అందువల్ల అటువంటి కార్యకలాపాలు మంచితనం యొక్క రీతిలో ఉంటాయి; వాటిని స్వచ్ఛమైన భక్తి వర్గంలో లెక్కించలేము. స్వచ్ఛమైన భక్తి సేవ భౌతిక కోరికల నుండి విముక్తి పొందింది. వ్యక్తిగత లేదా వస్తుపరమైన ఆసక్తికి ఎటువంటి సాకు ఉండదు. భక్తి కార్యకలాపాలు ఫలప్రదమైన కార్యకలాపాలకు మరియు అనుభావిక తాత్విక ఊహలకు అతీతంగా ఉండాలి. స్వచ్ఛమైన భక్తి సేవ అన్ని భౌతిక గుణాలకు అతీతమైనది.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 200 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 10 🌴

10. karma-nirhāram uddiśya parasmin vā tad-arpaṇam
yajed yaṣṭavyam iti vā pṛthag-bhāvaḥ sa sāttvikaḥ

MEANING : When a devotee worships the Supreme Personality of Godhead and offers the results of his activities in order to free himself from the inebrieties of fruitive activities, his devotion is in the mode of goodness.

PURPORT : The brāhmaṇas, kṣatriyas, vaiśyas and śūdras, along with the brahmacārīs, gṛhasthas, vānaprasthas and sannyāsīs, are the members of the eight divisions of varṇas and āśramas, and they have their respective duties to perform for the satisfaction of the Supreme Personality of Godhead. When such activities are performed and the results are offered to the Supreme Lord, they are called karmārpaṇam, duties performed for the satisfaction of the Lord. If there is any inebriety or fault, it is atoned for by this offering process. But if this offering process is in the mode of goodness rather than in pure devotion, then the interest is different. The four āśramas and the four varṇas act for some benefit in accordance with their personal interests. Therefore such activities are in the mode of goodness; they cannot be counted in the category of pure devotion. Pure devotional service is free from all material desires. There can be no excuse for personal or material interest. Devotional activities should be transcendental to fruitive activities and empiric philosophical speculation. Pure devotional service is transcendental to all material qualities.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 03, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

🌹. గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు మరియు అందరికి Good Wishes On Guru pournami to you and All 🌹

🍀. విశ్వగురువు మరియు అఖండ గురుసత్తా యొక్క దివ్య అనుగ్రహం మనందరి మీదా ఉండాలని, మనమందరం సత్య ధర్మములకు ప్రతీకగా నిలబడే శక్తిని గురు చైతన్యం మనలో ప్రేరేపించాలని ప్రార్థనతో సర్వస్వ శరణాగతి గురుపాదార విందములకు.......🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : గురుపౌర్ణమి, వ్యాసపూజ, Guru Purnima, Vyasa Puja 🌻

🍀. శ్రీ గురు ప్రార్థనా స్తోత్రం 🍀

గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక: అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : తెర తొలగాలంటే - తొలుత సాధకుడే భగవానుని అన్వేషించాలి, ప్రేమించాలి, అన్వేషణను కొనసాగిస్తూ భగవానుని కొరకు ఉద్విగ్న హృదయుడు కావాలి. ఆది జరిగినప్పుడే, తెర ప్రక్కకు తొలగుతుంది, వెలుగు ద్యోతకమవుతుంది. ధగన్ముఖారవింద దర్శనమై మరుభూమి యందింత కాలమూ సంచరించు చుండిన ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. 🍀

🌻. గురుపౌర్ణమి విశిష్టత 🌻

ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. మానవుల మనసులో అష్టమదాలూ, అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి.


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

ఆషాడ మాసం

తిథి: పూర్ణిమ 17:09:49 వరకు

తదుపరి కృష్ణ పాడ్యమి

నక్షత్రం: మూల 11:02:48 వరకు

తదుపరి పూర్వాషాఢ

యోగం: బ్రహ్మ 15:45:18 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: విష్టి 06:47:29 వరకు

వర్జ్యం: 19:35:36 - 21:01:12

దుర్ముహూర్తం: 12:46:30 - 13:39:05

మరియు 15:24:15 - 16:16:51

రాహు కాలం: 07:24:24 - 09:03:00

గుళిక కాలం: 13:58:48 - 15:37:24

యమ గండం: 10:41:36 - 12:20:12

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46

అమృత కాలం: 05:14:32 - 06:41:24

మరియు 28:09:12 - 29:34:48

సూర్యోదయం: 05:45:48

సూర్యాస్తమయం: 18:54:36

చంద్రోదయం: 19:05:37

చంద్రాస్తమయం: 05:11:52

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: ధనుస్సు

యోగాలు: లంబ యోగం - చికాకులు,

అపశకునం 11:02:48 వరకు తదుపరి

ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




గురు పౌర్ణమి శుభాకాంక్షలు - Good Wishes On Guru pournami


🌹. గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు మరియు అందరికి Good Wishes On Guru pournami to you and All 🌹

🍀. విశ్వగురువు మరియు అఖండ గురుసత్తా యొక్క దివ్య అనుగ్రహం మనందరి మీదా ఉండాలని, మనమందరం సత్య ధర్మములకు ప్రతీకగా నిలబడే శక్తిని గురు చైతన్యం మనలో ప్రేరేపించాలని ప్రార్థనతో సర్వస్వ శరణాగతి గురుపాదార విందములకు.......🍀

🙏. ప్రసాద్‌ భరద్వాజ

గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక:
అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:


🌻. గురుపౌర్ణమి విశిష్టత 🌻

ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసునూ, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు. మానవుల మనసులో అష్టమదాలూ, అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి.

మానవ జీవితానికి మార్గనిర్దేశం చేస్తూ భగవంతుని సాక్షాత్కారమే మానవ జీవిత లక్ష్యం గా దారి చూపి, నడిపించే దేవుడు గురువు. గురుపౌర్ణమి నాడు వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. అలాగే గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠుల వారిని, శక్తి మునిని, పరాశరుడిని, వ్యాసుల వారిని, శుకమహామునిని, ఇత్యాది వారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. "గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరించాలి అంటారు. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువే కదా" అన్నారు భక్త కబీర్. ఈ మాట సదా స్మరణీయం. ఈ మాట అందించిన వారు మనకు గురువే. మంచిని చెప్పినవాడు, నేర్పినవాడు, చూపినవాడు మనకి గురువే అని చెప్తున్న మన సనాతన ధర్మానికి వందనాలు.

🌹 🌹 🌹 🌹 🌹