శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 462. ‘సురనాయికా’ - 3 🌻


దేహము అసుర ప్రజ్ఞలతోను, అందు పనిచేయు ప్రజ్ఞలు సుర ప్రజ్ఞలతోను నిండియుండును. దేహాత్మ భావన గల జీవుని యందు సహజముగ అసుర ప్రజ్ఞలే ఎక్కువగ వర్తించు చుండును. వారి యందలి సుర ప్రజ్ఞలు మేల్కాంచి జీవునికి వికాసము కలిగించవలె నన్నచో శ్రీమాత నారాధించుట నిజమగు ఉపాయము. దైవమును ఆరాధన చేయని వారియందు స్థూల ప్రజ్ఞలే మెండుగ బలము కలిగి యుండును. పురాణము లందు తెలుపబడిన దేవాసుర యుద్ధము లన్నియూ జీవుని యందు నిత్యమూ సాగుచునే యున్నవి. జ్ఞానము, అజ్ఞానముల ఘర్షణముల నుండి జీవుడు ఉత్తీర్ణుడగుటకు దేవతారాధనము ప్రధానము. అంతర్యామి యగు దైవము నిత్యమారాధించు వారి యందు దేవతా ప్రజ్ఞలు క్రమముగ మేల్కాంచి అసుర ప్రజ్ఞలను హద్దులలో నుంచును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 462. 'Suranaeika' - 3 🌻


The body is full of asura prajnas and its working powers are full of suraprajnas. In a body-conscious being, natural demon powers are more applicable. It is a great idea to pray to Srimata so that their internal sura prajna awakens and makes the living being flourish. Among those who do not worship God, gross wisdom has the power of enlightenment. All the Devasura war described in the Puranas are going on forever in the life. Deity worship is essential for the living being to overcome the conflicts of knowledge and ignorance. Antaryami is eternally slaying those who gradually awaken the divine powers and keep the asura powers out of bounds.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment