శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-3



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 357-3. 'తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా' 🌻


అంతయూ భగవదర్పితము చేయుచు జీవించుట. పై తెలిపిన సమర్పణ మార్గమును శరణాగతి మార్గ మందురు. “నాకు కలుగు భావములు, నేను పలికెడు పలుకులు, నా చేతలు, నేను, నావి అనుకొనుచున్నవి అన్నియూ నీకే సమర్పితము. నన్ను అనుగ్రహించి ఉద్ధరించుకొనుము.” అని ప్రార్థించుట, తప్పు ఒప్పులతో సంబంధము లేక తన నుండి నిర్వర్తింపబడుచున్న సమస్తమును దైవము నకు సమర్పణ చేయుట ఇందలి ముఖ్య సూత్రము.

అట్టి వానికి కష్ట నష్టములు కలుగుచున్ననూ దైవానుగ్రహముగనే స్వీకరించును. శరణాగతి మార్గము చాల ధైర్య సాహసములతో కూడినది. తనను, తన వారిని, తన సమస్త సంపదను తన యందలి స్వభావమును అన్నింటినీ దైవమునకు సమర్పించుట ధీరులు చేయు పని. మహా భక్తు లిట్లే నిర్వర్తించి దైవ సమానులై వెలుగుచున్నారు. మార్గదర్శకులై నిలబడి యున్నారు. అట్టివారి మనస్సులు పూర్ణ చంద్రుని వలె వెన్నెలను, కాంతిని ప్రసరింప జేయుచుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 357-3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 357-3. Tāpatrayāgni-santapta-samāhlādana-candrikā तापत्रयाग्नि-सन्तप्त-समाह्लादन-चन्द्रिका 🌻


Ancient scriptures talk about three types of afflictions, pertaining to body, elements and deities. These three are compared to three types of fires. These three types of fires cause serious damage to the one who undergoes the sufferings of bondage called saṁsāra. She is like the moon light (grace) that gives happiness to those affected by the said three afflictions. The meaning of the nāma is that by Her sheer grace She destroys the miseries caused by these three afflictions and showers happiness to Her devotees.

The three types of miseries are: 1. ādhyātmika – this comprises of the four components of antaḥkaraṇa, five karmendriya-s and five jñānendriya-s. 2. ādhibhautika – comprises of five basic elements and sense organs. 3. ādhidaivata – influence of super human powers. All the three are called afflictions because they function on the basis of data provided by the sense organs.

Bṛhadāraṇyaka Upaniṣad (IV.iv.25) says, “That great birthless Self is un-decaying, immortal, undying, fearless...”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


23 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 157. హింస / Osho Daily Meditations - 157. VIOLENCE


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 157 / Osho Daily Meditations - 157 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 157. హింస 🍀

🕉. ఎవరూ హింసాత్మకంగా పుట్టరు; ఒకరు దానిని నేర్చుకుంటారు. ఒకరు హింసాత్మక సమాజం బారిన పడి, హింసాత్మకంగా మారతారు. లేకపోతే, ప్రతి బిడ్డ పూర్తిగా అహింసాత్మకంగా పుడతాడు. 🕉

నీ స్వీయ ఉనికిలో హింస అనేది లేదు. కానీ మనం పరిస్థితుల ద్వారా నియంత్రణ చేయబడతాము. అనేక విషయాలకు వ్యతిరేకంగా మనల్ని మనం రక్షించుకోవాలి. అందుకనే రక్షించుకోవడం కంటే ముందే దాడికి దిగడం ఉత్తమమైన పద్ధతి అంటారు. ఒక వ్యక్తి తనను తాను చాలాసార్లు రక్షించుకోవలసి వచ్చినప్పుడు, అతను అభ్యంతరకరంగా ఉంటాడు, అతను హింసాత్మకంగా ఉంటాడు, ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని కొట్టే వరకు వేచి ఉండటం కంటే మొదట కొట్టడం మంచిది, ముందుగా కొట్టిన వ్యక్తి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మాకియవెల్లి తన ప్రసిద్ధ పుస్తకం, ది ప్రిన్స్‌లో ఇలా చెప్పాడు. రక్షణ కోసం దాడి ఉత్తమమైన పద్ధతి అని అతను చెప్పాడు. వేచి ఉండకండి; ఎవరైనా మీపై దాడి చేసే ముందే, మీరు దాడి చేయాలి. మాకియవెల్లి అంటాడు, మీరు దాడి చేయ వలసి వచ్చిందంటేనే, అప్పటికే చాలా ఆలస్యమైందని. మీరు ఈ సరికే ఓడిపోయిన వారి వైపు ఉన్నారు అని. ఈ రకమైన ఆలోచన వల్లనే ప్రజలు మరింతగా హింసాత్మకంగా మారతారు. అతి త్వరలో వారు దాడి చేయ లేకుంటే భాదింప బడతామని, జీవించడానికి ఏకైక మార్గం పోరాడటం అని నిర్ధారణకు వస్తారు. దీనితో వారి స్వభావం పూర్తిగా విషపూరితం అవుతుంది. కానీ ఇది సహజం కాదు కనుక తక్షణం వదిలేయ వచ్చు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 157 🌹

📚. Prasad Bharadwaj

🍀 157. VIOLENCE 🍀

🕉 Nobody is born violent; one learns it. One is infected by a violent society, and one becomes violent. Otherwise every child is born absolutely nonviolent. 🕉


There is no violence in your being itself. Rather, we are conditioned by situations. We .have to defend ourselves against so many things, and offense is the best method of defending. When a person has to defend himself many times, he becomes offensive, he becomes violent, because it is better to hit first than to wait for somebody to hit you. The one who hits first has more chances of winning.

That's what Machiavelli says in his famous book, The Prince. He says that attack is the best method of defense. Don't wait; before somebody attacks you, you should attack. When you are attacked, Machiavelli says that it is already too late. You are already on the loser's side. Hence people become violent. Very soon they come to understand that otherwise they will be crushed. The only way to survive is to fight, and once they learn this trick, by and by their whole nature becomes poisoned by it. But it is not natural, so it can be dropped.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


23 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 168


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 168 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 3 🌻


దౌర్భాగ్య వశమున, మన నరులలో 98% మంది, ఉద్వేగమునందే బ్రతుకుచు, ఉద్వేగమను మాలిన్యము నుండియే తలంపులను ఉద్భవింప జేయుచున్నారు. ఫలితమెప్పుడును, తిరిగి ఉద్వేగముతోడి స్పందనయే గదా. అధిక రుచికరమైనది ఏదయిన, ఉద్వేగము యొక్క స్థానమున వెలయ కున్నచో ఈ విపత్తు నుండి బయటపడుట సాధ్యము కాదు. మనలో ఉద్వేగము యొక్క స్థానము గొనవలసినది ఏది? పెద్దలు దీనినే స్పూర్తి అనుచున్నారు.

మనము ఉదాత్తమైన దాని నుండి స్పూర్తి నందినచో మన ఉద్వేగములు క్రమముగా క్షాళితములగును మట్టి రేణువులు, అడుగున నిలిచి, నిర్మల జలములు బయటపడుటకు అవకాశము కలుగును. స్వర్ణ రసాయన శాస్త్రవేత్త దీనినే పరిశుద్ధీకరణ విధానమని పేర్కొనెను. మన యందు ఈ విధానము అమలు జరిగినచో అవతలి వారి స్పందనయు పరిశుద్ధముగానే ఉండును.


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


23 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 538 / Sri Siva Maha Purana - 538


🌹 . శ్రీ శివ మహా పురాణము - 538 / Sri Siva Maha Purana - 538 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴


🌻. కన్యాదానము - 3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! జ్ఞాని, శివుని ఇచ్ఛననుసరించి పనులను చక్కబెట్టువాడు అగు నీవు ఇట్లు పలికి పర్వతరాజునకు నీ మాటలచే ఆనందమును కలిగిస్తూ మరల ఇట్లు పలికితివి (25).

నారదుడిట్లు పలికెను -

వత్సా! మహాపర్వతరాజా! పార్వతీ జనకా! నా మటను వినుము. విని నీ కుమార్తె యగు పార్వతీ దేవిని నీవు శంకరునకిమ్ము (26). సుగుణుడు, లీలా రూపధారి అగు హహేశ్వరుని కులగోత్రములు కేవలము నాదము మాత్రమేనని యెరుంగుము (27). శివుడు నాదస్వరూపుడు. నాదము శివ స్వరూపము. ఇది సత్యము. నాద శివులకు ఇద్దరికీ భేదము లేదు. (28). ఓ పర్వతరాజా! లీలచే సగుణ రూపమును స్వీకరించిన శివుని నుండి మున్ముందుగా నాదము సృష్టింపబడుటచే, అది సృష్టిలో సర్వశ్రేష్ఠమై యున్నది

(29). అందువలననే, నేనీనాడు మనస్సులో సర్వేశ్వరుడగు శివునచే ప్రేరితుడనై వీణను వాయించితిని. ఓ హిమాలయా! తెలుసు కొనుము (30).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! నీ యొక్క ఈ మాటనున వినిన పిమ్మట పర్వతరాజగు హిమవంతుడు గర్వమును వీడి మనస్సులో ఆనందమును పొందెను (31). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు తొలగిన గర్వము గలవారై 'బాగు బాగు' అని పలికిరి (32). పండితులగు వారందరు మహేశ్వరుని మహిమను ఎరింగి ఆశ్చర్మయమును, మహానందమును పొంది, వారిలో వారు ఒట్లు అను కొనిరి (33).

ఎవని ఆజ్ఞచే ఈ విశాలమగు జగత్తు పుట్టినదో అట్టి శర్వుడు సర్వమునకు అతీతుడు, ఆత్మ జ్ఞానరూపుడు. మోక్షమునిచ్చువాడు ఆయనయే. ముల్లోకములకు పతియగు ఆయన బ్రహ్మ జ్ఞానముచే మాత్రమే పొందబడును. ఈనాడు ఆయనను మనము చూడగల్గితిమి (34).

అపుడు మేరువు మొదలగు ఆ పర్వత శ్రేష్ఠులు ఆశ్చర్యపడిన వారై ఏకకంఠముతో పర్వతరాజగు హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికిరి (35).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 538 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴

🌻 The ceremonious entry of Śiva - 3 🌻



Brahmā said:—

25. O sage, after saying this, you, of perfect wisdom, who carried out the will of Śiva replied again to the mountain after delighting him with your words.


Nārada said'.—

26. O dear, O great mountain, O father of Pārvatī, listen to my words. After hearing them, give your daughter to Śiva.

27. Know that the divine sound alone is the gotra, and family of Śiva in His divine form, who assumes forms in His divine sport.

28. Śiva is identical with Nāda.[2] And Nāda is identical with Śiva. There is no difference between the two—Nāda and Śiva.

29. O lord of mountains, Nāda being prior to Śiva in His sportive, attributive form, Nāda is the most excellent of all.

30. Hence, O Himācala, mentally urged by Śiva, the lord of all, I played upon my lute.


Brahmā said:—

31. O sage, on hearing your words, Himavat, the lord of mountains was satisfied and the bewilderment in his mind vanished.

32. Then Viṣṇu, the other gods and the sages said “Well done, Well done”. They were freed of all bewilderment.

33. The shrewd people realised the majesty of lord Śiva. They were pleasantly surprised and began to say to one another.

34. “Śiva is of the form of knowledge. He is greater than the greatest. It is at His bidding that the vast universe is born. He is of independent movement. He can be realised by the greatest concentration. He, the lord of the three worlds, is now seen by us.”

35. Then Meru and the excellent mountains became agitated and simultaneously spoke to Himavat, the lord of mountains.


Continues....

🌹🌹🌹🌹🌹


23 Mar 2022

గీతోపనిషత్తు -340


🌹. గీతోపనిషత్తు -340 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 29-3 📚


🍀 29-3. అతీత స్థితి - అతడు 'సమోహం' అని పలికినపుడు అతని అతీత స్థితిని ఆవిష్కరించు చున్నాడు. కాలమును బట్టి, దేశమును బట్టి వివిధ వ్యూహములలో వర్తించుచు, ఎప్పటికప్పుడు సృష్టియందు ధర్మమును వర్తింప జేయును. సృష్టి కతీతముగను, సృష్టియందు కూడ ఏకకాలమున వర్తించు తత్త్వదర్శనమే కృష్ణ దర్శనము. దైవమును విశ్వ చైతన్య పరముగ చూచుట, అవగాహన చేసుకొనుట శక్యమేగాని తదతీతమై సత్యస్థితిని తెలుయుట అరుదు. అట్లు తెలిసినపుడు దైవమునకు ఇష్టులు అయిష్టులు ఉండరని తెలుయును. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహములలో అతడు చరించుచు అతీతముగను, సృష్టి యందు ధర్మస్వరూపుడుగను, జ్ఞాన బోధకుడుగను, నిర్వాహకుడుగను- నాలుగు విధములుగను చరించును. 🍀

సమో హం సర్వభూతేషున మే ద్వేష్యో స్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ II 29

తాత్పర్యము : సమస్త భూతములయందు నేను సమముగ నున్నాను. నాకు ద్వేషింపతగు వారుగాని, ప్రేమింపతగు వారు గాని ప్రత్యేకముగ నెవ్వరును లేరు. వారియందున్న నన్ను సేవించు వారిని నేనునూ సేవింతును.

వివరణము : దైవమును విశ్వ చైతన్య పరముగ చూచుట, అవగాహన చేసుకొనుట శక్యమేగాని తదతీతమై సత్యస్థితిని తెలుయుట అరుదు. అట్లు తెలిసినపుడు దైవమునకు ఇష్టులు అయిష్టులు ఉండరని తెలుయును. సత్యస్థితిలో శ్రీ కృష్ణునికి పాండవ కౌరవులు ఇరువురును సములే. చైతన్యస్థితిలో ధర్మస్వరూపులైన పాండవులనిన ఇష్టము. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ కృష్ణుడు చతుర్వ్యూహముల యందు చతుర్విధములుగ వర్తించుచుండును. ఎప్పుడెట్లు వర్తించునో ఎవ్వరునూ తెలియలేరు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహములలో అతడు చరించుచు అతీతముగను, సృష్టి యందు ధర్మస్వరూపుడుగను, జ్ఞాన బోధకుడుగను, నిర్వాహకుడుగను- నాలుగు విధములుగను చరించును.

అతడు 'సమోహం' అని పలికినపుడు అతని అతీత స్థితిని ఆవిష్కరించు చున్నాడు. కాలమును బట్టి, దేశమును బట్టి వివిధ వ్యూహములలో వర్తించుచు, ఎప్పటికప్పుడు సృష్టియందు ధర్మమును వర్తింప జేయును. సృష్టి కతీతముగను, సృష్టియందు కూడ ఏకకాలమున వర్తించు తత్త్వదర్శనమే కృష్ణ దర్శనము. ఎవరెంత మాత్రము తలచిన వారి కంతమాత్రముగనే గోచరించువాడు కృష్ణుడు. అతడే 'సమోహం' అని పలుకగలడు. గోవులకాచు గోపబాలకులను, గోలోక మందుండు సిద్ధపురుషులను ఒకే విధముగ ఆదరించిన వాడు శ్రీకృష్ణుడు. పరాక్రమవంతులను, పామరులను కూడ సమముగ ఆదరించిన వాడు కృష్ణుడు. అంతయు తానే అగుట వలన, తనయందు తానెప్పుడు యుండుటవలన అట్టి పరమోత్కృష్ట స్థితితో 126 సం||లు జీవించినవాడు శ్రీకృష్ణుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

23 Mar 2022

23 - MARCH - 2022 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 23, బుధవారం, మార్చి 2022 సౌమ్య వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 29-3 - 340 - అతీత స్ధితి🌹 
3) 🌹. శివ మహా పురాణము - 538 / Siva Maha Purana - 538 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -168 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 157 / Osho Daily Meditations - 157🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-3🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 23, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*పండుగలు మరియు పర్వదినాలు : లేవు.*

*🍀. శ్రీ గణేశ అష్టకం - 4 🍀*

*4. దురితగజమమన్దం వారణీం చైవ వేదం*
*విదితమఖిలనాదం నృత్యమానన్దకన్దమ్ ।*
*దధతి శశిసువక్త్రం చాఽఙ్కుశం యో విశేషం*
*గణపతిమభివన్దే సర్వదాఽఽనన్దకన్దమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని అర్ధం చేసుకొని పరమార్ధాన్ని సాధించడమే భగవద్గీత ప్రధాన ఉద్ధేశ్యము. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ షష్టి 26:17:32 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: అనూరాధ 18:53:10 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: వజ్ర 10:20:12 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: గార 15:19:24 వరకు
వర్జ్యం: 00:00:30 - 01:31:06 
మరియు 24:09:38 - 25:40:06
దుర్ముహూర్తం: 11:58:28 - 12:47:06
రాహు కాలం: 12:22:47 - 13:53:59
గుళిక కాలం: 10:51:36 - 12:22:47
యమ గండం: 07:49:14 - 09:20:25
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:46
అమృత కాలం: 09:04:06 - 10:34:42
సూర్యోదయం: 06:18:02
సూర్యాస్తమయం: 18:27:32
చంద్రోదయం: 23:32:01
చంద్రాస్తమయం: 09:57:10
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 18:53:10
వరకు తదుపరి ధ్వాo క్ష యోగం 
- ధన నాశనం, కార్య హాని

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -340 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 29-3 📚*
 
*🍀 29-3. అతీత స్థితి - అతడు 'సమోహం' అని పలికినపుడు అతని అతీత స్థితిని ఆవిష్కరించు చున్నాడు. కాలమును బట్టి, దేశమును బట్టి వివిధ వ్యూహములలో వర్తించుచు, ఎప్పటికప్పుడు సృష్టియందు ధర్మమును వర్తింప జేయును. సృష్టి కతీతముగను, సృష్టియందు కూడ ఏకకాలమున వర్తించు తత్త్వదర్శనమే కృష్ణ దర్శనము. దైవమును విశ్వ చైతన్య పరముగ చూచుట, అవగాహన చేసుకొనుట శక్యమేగాని తదతీతమై సత్యస్థితిని తెలుయుట అరుదు. అట్లు తెలిసినపుడు దైవమునకు ఇష్టులు అయిష్టులు ఉండరని తెలుయును. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహములలో అతడు చరించుచు అతీతముగను, సృష్టి యందు ధర్మస్వరూపుడుగను, జ్ఞాన బోధకుడుగను, నిర్వాహకుడుగను- నాలుగు విధములుగను చరించును. 🍀*

*సమో హం సర్వభూతేషున మే ద్వేష్యో స్తి న ప్రియః |*
*యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ II 29*

*తాత్పర్యము : సమస్త భూతములయందు నేను సమముగ నున్నాను. నాకు ద్వేషింపతగు వారుగాని, ప్రేమింపతగు వారు గాని ప్రత్యేకముగ నెవ్వరును లేరు. వారియందున్న నన్ను సేవించు వారిని నేనునూ సేవింతును.*

*వివరణము : దైవమును విశ్వ చైతన్య పరముగ చూచుట, అవగాహన చేసుకొనుట శక్యమేగాని తదతీతమై సత్యస్థితిని తెలుయుట అరుదు. అట్లు తెలిసినపుడు దైవమునకు ఇష్టులు అయిష్టులు ఉండరని తెలుయును. సత్యస్థితిలో శ్రీ కృష్ణునికి పాండవ కౌరవులు ఇరువురును సములే. చైతన్యస్థితిలో ధర్మస్వరూపులైన పాండవులనిన ఇష్టము. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ కృష్ణుడు చతుర్వ్యూహముల యందు చతుర్విధములుగ వర్తించుచుండును. ఎప్పుడెట్లు వర్తించునో ఎవ్వరునూ తెలియలేరు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహములలో అతడు చరించుచు అతీతముగను, సృష్టి యందు ధర్మస్వరూపుడుగను, జ్ఞాన బోధకుడుగను, నిర్వాహకుడుగను- నాలుగు విధములుగను చరించును.*

*అతడు 'సమోహం' అని పలికినపుడు అతని అతీత స్థితిని ఆవిష్కరించు చున్నాడు. కాలమును బట్టి, దేశమును బట్టి వివిధ వ్యూహములలో వర్తించుచు, ఎప్పటికప్పుడు సృష్టియందు ధర్మమును వర్తింప జేయును. సృష్టి కతీతముగను, సృష్టియందు కూడ ఏకకాలమున వర్తించు తత్త్వదర్శనమే కృష్ణ దర్శనము. ఎవరెంత మాత్రము తలచిన వారి కంతమాత్రముగనే గోచరించువాడు కృష్ణుడు. అతడే 'సమోహం' అని పలుకగలడు. గోవులకాచు గోపబాలకులను, గోలోక మందుండు సిద్ధపురుషులను ఒకే విధముగ ఆదరించిన వాడు శ్రీకృష్ణుడు. పరాక్రమవంతులను, పామరులను కూడ సమముగ ఆదరించిన వాడు కృష్ణుడు. అంతయు తానే అగుట వలన, తనయందు తానెప్పుడు యుండుటవలన అట్టి పరమోత్కృష్ట స్థితితో 126 సం||లు జీవించినవాడు శ్రీకృష్ణుడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 538 / Sri Siva Maha Purana - 538 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴*

*🌻. కన్యాదానము - 3 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! జ్ఞాని, శివుని ఇచ్ఛననుసరించి పనులను చక్కబెట్టువాడు అగు నీవు ఇట్లు పలికి పర్వతరాజునకు నీ మాటలచే ఆనందమును కలిగిస్తూ మరల ఇట్లు పలికితివి (25).

నారదుడిట్లు పలికెను -

వత్సా! మహాపర్వతరాజా! పార్వతీ జనకా! నా మటను వినుము. విని నీ కుమార్తె యగు పార్వతీ దేవిని నీవు శంకరునకిమ్ము (26). సుగుణుడు, లీలా రూపధారి అగు హహేశ్వరుని కులగోత్రములు కేవలము నాదము మాత్రమేనని యెరుంగుము (27). శివుడు నాదస్వరూపుడు. నాదము శివ స్వరూపము. ఇది సత్యము. నాద శివులకు ఇద్దరికీ భేదము లేదు. (28). ఓ పర్వతరాజా! లీలచే సగుణ రూపమును స్వీకరించిన శివుని నుండి మున్ముందుగా నాదము సృష్టింపబడుటచే, అది సృష్టిలో సర్వశ్రేష్ఠమై యున్నది

(29). అందువలననే, నేనీనాడు మనస్సులో సర్వేశ్వరుడగు శివునచే ప్రేరితుడనై వీణను వాయించితిని. ఓ హిమాలయా! తెలుసు కొనుము (30).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! నీ యొక్క ఈ మాటనున వినిన పిమ్మట పర్వతరాజగు హిమవంతుడు గర్వమును వీడి మనస్సులో ఆనందమును పొందెను (31). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు తొలగిన గర్వము గలవారై 'బాగు బాగు' అని పలికిరి (32). పండితులగు వారందరు మహేశ్వరుని మహిమను ఎరింగి ఆశ్చర్మయమును, మహానందమును పొంది, వారిలో వారు ఒట్లు అను కొనిరి (33). 

ఎవని ఆజ్ఞచే ఈ విశాలమగు జగత్తు పుట్టినదో అట్టి శర్వుడు సర్వమునకు అతీతుడు, ఆత్మ జ్ఞానరూపుడు. మోక్షమునిచ్చువాడు ఆయనయే. ముల్లోకములకు పతియగు ఆయన బ్రహ్మ జ్ఞానముచే మాత్రమే పొందబడును. ఈనాడు ఆయనను మనము చూడగల్గితిమి (34).

అపుడు మేరువు మొదలగు ఆ పర్వత శ్రేష్ఠులు ఆశ్చర్యపడిన వారై ఏకకంఠముతో పర్వతరాజగు హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికిరి (35).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 538 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴*

*🌻 The ceremonious entry of Śiva - 3 🌻*

Brahmā said:—

25. O sage, after saying this, you, of perfect wisdom, who carried out the will of Śiva replied again to the mountain after delighting him with your words.
Nārada said'.—

26. O dear, O great mountain, O father of Pārvatī, listen to my words. After hearing them, give your daughter to Śiva.

27. Know that the divine sound alone is the gotra, and family of Śiva in His divine form, who assumes forms in His divine sport.

28. Śiva is identical with Nāda.[2] And Nāda is identical with Śiva. There is no difference between the two—Nāda and Śiva.

29. O lord of mountains, Nāda being prior to Śiva in His sportive, attributive form, Nāda is the most excellent of all.

30. Hence, O Himācala, mentally urged by Śiva, the lord of all, I played upon my lute.
Brahmā said:—

31. O sage, on hearing your words, Himavat, the lord of mountains was satisfied and the bewilderment in his mind vanished.

32. Then Viṣṇu, the other gods and the sages said “Well done, Well done”. They were freed of all bewilderment.

33. The shrewd people realised the majesty of lord Śiva. They were pleasantly surprised and began to say to one another.

34. “Śiva is of the form of knowledge. He is greater than the greatest. It is at His bidding that the vast universe is born. He is of independent movement. He can be realised by the greatest concentration. He, the lord of the three worlds, is now seen by us.”

35. Then Meru and the excellent mountains became agitated and simultaneously spoke to Himavat, the lord of mountains.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 168 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. భావ బలము - 3 🌻* 

*దౌర్భాగ్య వశమున, మన నరులలో 98% మంది, ఉద్వేగమునందే బ్రతుకుచు, ఉద్వేగమను మాలిన్యము నుండియే తలంపులను ఉద్భవింప జేయుచున్నారు. ఫలితమెప్పుడును, తిరిగి ఉద్వేగముతోడి స్పందనయే గదా. అధిక రుచికరమైనది ఏదయిన, ఉద్వేగము యొక్క స్థానమున వెలయ కున్నచో ఈ విపత్తు నుండి బయటపడుట సాధ్యము కాదు. మనలో ఉద్వేగము యొక్క స్థానము గొనవలసినది ఏది? పెద్దలు దీనినే స్పూర్తి అనుచున్నారు.*

*మనము ఉదాత్తమైన దాని నుండి స్పూర్తి నందినచో మన ఉద్వేగములు క్రమముగా క్షాళితములగును మట్టి రేణువులు, అడుగున నిలిచి, నిర్మల జలములు బయటపడుటకు అవకాశము కలుగును. స్వర్ణ రసాయన శాస్త్రవేత్త దీనినే పరిశుద్ధీకరణ విధానమని పేర్కొనెను. మన యందు ఈ విధానము అమలు జరిగినచో అవతలి వారి స్పందనయు పరిశుద్ధముగానే ఉండును.*

...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 157 / Osho Daily Meditations - 157 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 157. హింస 🍀*

*🕉. ఎవరూ హింసాత్మకంగా పుట్టరు; ఒకరు దానిని నేర్చుకుంటారు. ఒకరు హింసాత్మక సమాజం బారిన పడి, హింసాత్మకంగా మారతారు. లేకపోతే, ప్రతి బిడ్డ పూర్తిగా అహింసాత్మకంగా పుడతాడు. 🕉*
 
*నీ స్వీయ ఉనికిలో హింస అనేది లేదు. కానీ మనం పరిస్థితుల ద్వారా నియంత్రణ చేయబడతాము. అనేక విషయాలకు వ్యతిరేకంగా మనల్ని మనం రక్షించుకోవాలి. అందుకనే రక్షించుకోవడం కంటే ముందే దాడికి దిగడం ఉత్తమమైన పద్ధతి అంటారు. ఒక వ్యక్తి తనను తాను చాలాసార్లు రక్షించుకోవలసి వచ్చినప్పుడు, అతను అభ్యంతరకరంగా ఉంటాడు, అతను హింసాత్మకంగా ఉంటాడు, ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని కొట్టే వరకు వేచి ఉండటం కంటే మొదట కొట్టడం మంచిది, ముందుగా కొట్టిన వ్యక్తి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.*

*మాకియవెల్లి తన ప్రసిద్ధ పుస్తకం, ది ప్రిన్స్‌లో ఇలా చెప్పాడు. రక్షణ కోసం దాడి ఉత్తమమైన పద్ధతి అని అతను చెప్పాడు. వేచి ఉండకండి; ఎవరైనా మీపై దాడి చేసే ముందే, మీరు దాడి చేయాలి. మాకియవెల్లి అంటాడు, మీరు దాడి చేయ వలసి వచ్చిందంటేనే, అప్పటికే చాలా ఆలస్యమైందని. మీరు ఈ సరికే ఓడిపోయిన వారి వైపు ఉన్నారు అని. ఈ రకమైన ఆలోచన వల్లనే ప్రజలు మరింతగా హింసాత్మకంగా మారతారు. అతి త్వరలో వారు దాడి చేయ లేకుంటే భాదింప బడతామని, జీవించడానికి ఏకైక మార్గం పోరాడటం అని నిర్ధారణకు వస్తారు. దీనితో వారి స్వభావం పూర్తిగా విషపూరితం అవుతుంది. కానీ ఇది సహజం కాదు కనుక తక్షణం వదిలేయ వచ్చు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 157 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 157. VIOLENCE 🍀*

*🕉 Nobody is born violent; one learns it. One is infected by a violent society, and one becomes violent. Otherwise every child is born absolutely nonviolent. 🕉*
 
*There is no violence in your being itself. Rather, we are conditioned by situations. We .have to defend ourselves against so many things, and offense is the best method of defending. When a person has to defend himself many times, he becomes offensive, he becomes violent, because it is better to hit first than to wait for somebody to hit you. The one who hits first has more chances of winning.*

*That's what Machiavelli says in his famous book, The Prince. He says that attack is the best method of defense. Don't wait; before somebody attacks you, you should attack. When you are attacked, Machiavelli says that it is already too late. You are already on the loser's side. Hence people become violent. Very soon they come to understand that otherwise they will be crushed. The only way to survive is to fight, and once they learn this trick, by and by their whole nature becomes poisoned by it. But it is not natural, so it can be dropped.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*

*🌻 357-3. 'తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా' 🌻* 

*అంతయూ భగవదర్పితము చేయుచు జీవించుట. పై తెలిపిన సమర్పణ మార్గమును శరణాగతి మార్గ మందురు. “నాకు కలుగు భావములు, నేను పలికెడు పలుకులు, నా చేతలు, నేను, నావి అనుకొనుచున్నవి అన్నియూ నీకే సమర్పితము. నన్ను అనుగ్రహించి ఉద్ధరించుకొనుము.” అని ప్రార్థించుట, తప్పు ఒప్పులతో సంబంధము లేక తన నుండి నిర్వర్తింపబడుచున్న సమస్తమును దైవము నకు సమర్పణ చేయుట ఇందలి ముఖ్య సూత్రము.*

*అట్టి వానికి కష్ట నష్టములు కలుగుచున్ననూ దైవానుగ్రహముగనే స్వీకరించును. శరణాగతి మార్గము చాల ధైర్య సాహసములతో కూడినది. తనను, తన వారిని, తన సమస్త సంపదను తన యందలి స్వభావమును అన్నింటినీ దైవమునకు సమర్పించుట ధీరులు చేయు పని. మహా భక్తు లిట్లే నిర్వర్తించి దైవ సమానులై వెలుగుచున్నారు. మార్గదర్శకులై నిలబడి యున్నారు. అట్టివారి మనస్సులు పూర్ణ చంద్రుని వలె వెన్నెలను, కాంతిని ప్రసరింప జేయుచుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 357-3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*

*🌻 357-3. Tāpatrayāgni-santapta-samāhlādana-candrikā तापत्रयाग्नि-सन्तप्त-समाह्लादन-चन्द्रिका 🌻*

*Ancient scriptures talk about three types of afflictions, pertaining to body, elements and deities. These three are compared to three types of fires. These three types of fires cause serious damage to the one who undergoes the sufferings of bondage called saṁsāra. She is like the moon light (grace) that gives happiness to those affected by the said three afflictions. The meaning of the nāma is that by Her sheer grace She destroys the miseries caused by these three afflictions and showers happiness to Her devotees.*

*The three types of miseries are: 1. ādhyātmika – this comprises of the four components of antaḥkaraṇa, five karmendriya-s and five jñānendriya-s. 2. ādhibhautika – comprises of five basic elements and sense organs. 3. ādhidaivata – influence of super human powers. All the three are called afflictions because they function on the basis of data provided by the sense organs.*

*Bṛhadāraṇyaka Upaniṣad (IV.iv.25) says, “That great birthless Self is un-decaying, immortal, undying, fearless...”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹