శ్రీ శివ మహా పురాణము - 538 / Sri Siva Maha Purana - 538


🌹 . శ్రీ శివ మహా పురాణము - 538 / Sri Siva Maha Purana - 538 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴


🌻. కన్యాదానము - 3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! జ్ఞాని, శివుని ఇచ్ఛననుసరించి పనులను చక్కబెట్టువాడు అగు నీవు ఇట్లు పలికి పర్వతరాజునకు నీ మాటలచే ఆనందమును కలిగిస్తూ మరల ఇట్లు పలికితివి (25).

నారదుడిట్లు పలికెను -

వత్సా! మహాపర్వతరాజా! పార్వతీ జనకా! నా మటను వినుము. విని నీ కుమార్తె యగు పార్వతీ దేవిని నీవు శంకరునకిమ్ము (26). సుగుణుడు, లీలా రూపధారి అగు హహేశ్వరుని కులగోత్రములు కేవలము నాదము మాత్రమేనని యెరుంగుము (27). శివుడు నాదస్వరూపుడు. నాదము శివ స్వరూపము. ఇది సత్యము. నాద శివులకు ఇద్దరికీ భేదము లేదు. (28). ఓ పర్వతరాజా! లీలచే సగుణ రూపమును స్వీకరించిన శివుని నుండి మున్ముందుగా నాదము సృష్టింపబడుటచే, అది సృష్టిలో సర్వశ్రేష్ఠమై యున్నది

(29). అందువలననే, నేనీనాడు మనస్సులో సర్వేశ్వరుడగు శివునచే ప్రేరితుడనై వీణను వాయించితిని. ఓ హిమాలయా! తెలుసు కొనుము (30).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! నీ యొక్క ఈ మాటనున వినిన పిమ్మట పర్వతరాజగు హిమవంతుడు గర్వమును వీడి మనస్సులో ఆనందమును పొందెను (31). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు తొలగిన గర్వము గలవారై 'బాగు బాగు' అని పలికిరి (32). పండితులగు వారందరు మహేశ్వరుని మహిమను ఎరింగి ఆశ్చర్మయమును, మహానందమును పొంది, వారిలో వారు ఒట్లు అను కొనిరి (33).

ఎవని ఆజ్ఞచే ఈ విశాలమగు జగత్తు పుట్టినదో అట్టి శర్వుడు సర్వమునకు అతీతుడు, ఆత్మ జ్ఞానరూపుడు. మోక్షమునిచ్చువాడు ఆయనయే. ముల్లోకములకు పతియగు ఆయన బ్రహ్మ జ్ఞానముచే మాత్రమే పొందబడును. ఈనాడు ఆయనను మనము చూడగల్గితిమి (34).

అపుడు మేరువు మొదలగు ఆ పర్వత శ్రేష్ఠులు ఆశ్చర్యపడిన వారై ఏకకంఠముతో పర్వతరాజగు హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికిరి (35).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 538 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴

🌻 The ceremonious entry of Śiva - 3 🌻



Brahmā said:—

25. O sage, after saying this, you, of perfect wisdom, who carried out the will of Śiva replied again to the mountain after delighting him with your words.


Nārada said'.—

26. O dear, O great mountain, O father of Pārvatī, listen to my words. After hearing them, give your daughter to Śiva.

27. Know that the divine sound alone is the gotra, and family of Śiva in His divine form, who assumes forms in His divine sport.

28. Śiva is identical with Nāda.[2] And Nāda is identical with Śiva. There is no difference between the two—Nāda and Śiva.

29. O lord of mountains, Nāda being prior to Śiva in His sportive, attributive form, Nāda is the most excellent of all.

30. Hence, O Himācala, mentally urged by Śiva, the lord of all, I played upon my lute.


Brahmā said:—

31. O sage, on hearing your words, Himavat, the lord of mountains was satisfied and the bewilderment in his mind vanished.

32. Then Viṣṇu, the other gods and the sages said “Well done, Well done”. They were freed of all bewilderment.

33. The shrewd people realised the majesty of lord Śiva. They were pleasantly surprised and began to say to one another.

34. “Śiva is of the form of knowledge. He is greater than the greatest. It is at His bidding that the vast universe is born. He is of independent movement. He can be realised by the greatest concentration. He, the lord of the three worlds, is now seen by us.”

35. Then Meru and the excellent mountains became agitated and simultaneously spoke to Himavat, the lord of mountains.


Continues....

🌹🌹🌹🌹🌹


23 Mar 2022

No comments:

Post a Comment