శ్రీ లలితా సహస్ర నామములు - 144 / Sri Lalita Sahasranamavali - Meaning - 144

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 144 / Sri Lalita Sahasranamavali - Meaning - 144 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 144. భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా ।
రోగపర్వత దంభోళి, ర్మృత్యుదారు కుఠారికా ॥ 144 ॥ 🍀

🍀 745. భాగ్యాబ్ధిచంద్రికా :
సంపద అనెడి సముద్రమునకు వెన్నెల వంటిది

🍀 746. భక్తచిత్తకేకిఘనాఘనా :
భక్తుల మనస్సులు అనే నెమళ్ళకు వర్షాకాలపు మేఘము వంటిది

🍀 747. రోగపర్వతదంభొళి :
పర్వతములవంతి రోగములకు వజ్రాయుధము వంటిది

🍀 748. ర్మృత్యుదారుకుఠారికా :
మృత్యువనెడి వృక్షమునకు గొడ్డలి వంటిది

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 144 🌹

📚. Prasad Bharadwaj

🌻 144. Bhagyabhi chandrika bhakta chittakeki ghanaghna
Rogaparvatadan bholi rmrutyudaru kutarika ॥ 144 ॥ 🌻

🌻 745 ) Bhagyabdhi chandrika -
She who is the full moon to the sea of luck

🌻 746 ) Bhaktha Chitta Keki Ganagana -
She who is the black cloud to the peacock which is he devotees mind

🌻 747 ) Roga parvatha Dhambola -
She who is the Vajra weapon which breaks the sickness which is like the mountain

🌻 748 ) Mrutyu Dharu Kudarika -
She who is like the axe which fells the tree of death

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

29 Oct 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 96

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 96 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 12 🌻

ఎవరయితే సేవ కావాలని కోరుతున్నారో ఆధ్యాత్మ విద్య వాళ్ళ కోసం కాదు. ఎవరికయితే సేవ చేద్దామని ఉందో, వారి కోసమే ఆధ్యాత్మ విద్య. తరించేది వాళ్ళే. మోక్షం వచ్చేది వాళ్ళకే.

అంతేకాని ఈ సృష్టిలో నాకు మోక్షం కావాలి అని కోరిన వాడికి ఏనాడూ మోక్షం రాలేదు. ఎందులకనగా ముందు "నాకు" అనే శత్రువున్నది. అది ఉన్నవాడికి మోక్షం ఎలా వస్తుంది? చివర "కావాలి" అనే శత్రువు ఉన్నది. మధ్యన ఉన్న మోక్షం అనే పదానికి "నాకు" అనే ఒక శత్రువు "కావాలి" అనే శత్రువు ఉన్నాయి.

నాకిది కావాలి అనే కోరేవాడికి మోక్షం ఇప్పించడానికి భగవంతుడేమన్నా తెలివి తక్కువ వాడా? ఎన్ని కోటానుకోట్ల సృష్టి చూశాడు. ఎంతమంది లౌక్యుల్ని చూశాడు? ఇవన్నీ వాడిలోంచి పుట్టి, వాడిలో పెరిగి, వాడిలోకి వెళ్ళిపోతున్నవే గదా! నాకు, కావాలి అనే ఈ "రెండూ" తీసివేయనంత కాలము మోక్షము రాదు. మోక్షం అనేది వచ్చేది కాదు.

ఒకాయన ఒకమాటు రమణమహర్షి గారి దగ్గరకు వెళ్ళి అడిగాడు. "స్వామీ నాకు మోక్షం ఎలా వస్తుంది?" ఆయన "నీకు రాదురా అప్పా" అని అన్నాడు. వాడు నాకు మోక్షం రాదు కామోసు అనుకున్నాడు నేనంత పొరపాటు చేశానేమో అని కూడా అనుకున్నాడు పాపం. చాలా బాధపడి వారి ప్రసంగం అయిపోయాక మళ్ళీ వచ్చి "స్వామీ మోక్షం రావాలంటే ఏం చేయాలి?" ఆయన "చెప్పాను కదురా అప్పా మోక్షం రాదని. వాడు బాధపడ్తూనే మర్నాడు మళ్ళీ అంతే నంటారా? ఇంక లాభం లేదంటారా? అని అడిగాడు"..

..✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

29 Oct 2021

వివేక చూడామణి - 144 / Viveka Chudamani - 144

🌹. వివేక చూడామణి - 144 / Viveka Chudamani - 144🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 30. బ్రహ్మమును పొందాలంటే -2 🍀

474. పూర్తి ఆత్మ స్థితితో కూడిన బ్రహ్మానందమును పొందాలంటే, వ్యక్తి తను తన బంధనాల నుండి పూర్తి విముక్తి పొంది, అజ్ఞానమును తొలగించుకొని, సృతుల ద్వారా, విచారణ ద్వారా మరియు గురు బోధల ద్వారాను, వాటితో పాటు స్వయం అనుభవముల ద్వారాను మనస్సును ఏకాగ్రము చేయుట ద్వారా సమాధి స్థితిని చేరవలెను.

475. బంధనాలు, విముక్తి, తృప్తి, ఆతురత, రోగముల నుండి విముక్తి, ఆకలి మొదలగు వస్తువులన్నియూ వాటికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే వర్తిస్తవి. వాటి యొక్క జ్ఞానము ఇతరులకు కేవలము ఊహలు, గుర్తులు మాత్రమే.

476. గురువులు మరియు సృతులు శిష్యులకు దూరముగా ఉండి మాత్రమే బోధిస్తారు. కాని విముక్తి పొందిన వ్యక్తి అవిద్యను వాటి ఊహలలో, భగవంతుని కృపతో మాత్రమే విముక్తిని సాధించగలరు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 144 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 30. To Achieve Brahmam - 2 🌻

474. In the realisation of the Atman, the Existence-Knowledge-Bliss Absolute, through the breaking of one’s connection with the bondage of Avidya or ignorance, the Scriptures, reasoning and the words of the Guru are the proofs, while one’s own experience earned by concentrating the mind is another proof.

475. Bondage, liberation, satisfaction, anxiety, recovery from illness, hunger and other such things are known only to the man concerned, and knowledge of these to others is a mere inference.

476. The Gurus as well as the Shrutis instruct the disciple, standing aloof; while the man of realisation crosses (Avidya) through Illumination alone, backed by the grace of God.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

29 Oct 2021

శ్రీ శివ మహా పురాణము - 467

🌹 . శ్రీ శివ మహా పురాణము - 467 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 33

🌻. సప్తర్షుల ఉపదేశము - 4 🌻

ఆమె మరియొక కల్పములో దక్షుని భార్య యొక్క గర్భము నుండి పుట్టి సతియను పేరును గాంచి శివుని వివాహమాడెను. దక్షుడు ఆమెను ఆయనకిచ్చి వివాహము చేసెను (44). ఆమె భర్తను నిందించుటను విని, యోగ మహిమచే దేహమును త్యజించెను. ఆమెయే నీ వలన మేనా గర్భము నందు జన్మించి పార్వతీ రూపములో నున్నది (45).

ఓ పర్వతరాజా ! ఈశివాదేవి జన్మజన్మల యందు, సర్వకాలములయందు శివుని అర్ధాంగి. ఈ తల్లి సర్వోత్కృష్టురాలు. జ్ఞానులయందు ఈమె బుద్ధి రూపమున నుండును (46). సదా సిద్ధిని ఇచ్చునది, సిద్ధి స్వరూపురాలు, స్వయంసిద్ధ అగు ఈ దేవి ఇచట జన్మించి యున్నది. శివుడు సతీదేవి యొక్క అస్థికలను, చితాభస్మను భక్తితో స్వయముగా ధరించును (47). కావున నీవు మంగళ స్వరూపురాలగు నీకన్యను సంతోషముతో శివునకు ఇమ్ము. లేనిచో నీవు ఈయనిచో, ఆమెయే తన భర్త ఉండు స్థానమునకు స్వయముగా వెళ్లగలదు (48).

నీ కుమార్తె యొక్క తీవ్రమగు తపస్సులోని క్లేశములను చూచి, దేవతలకు ప్రతిజ్ఞనుచేసి, దేవదేవుడగు శివుడు బ్రాహ్మణ వేషములో నీకుమార్తె తపస్సు చేయు స్థలమునకు వచ్చినాడు (49). ఓ పర్వతరాజా ! ఆ శంభుడు ఆమెను ఓదార్చి, వరము నిచ్చి, తన నివాసమునకు వెళ్లి, ఆమె కోర్కె మేరకు నిన్ను పార్వతిని ఇమ్మని యాచించినాడు (50).

శివభక్తి యందభిరుచితో గూడిన మనస్సుగల మీరిద్దరు అంగీకరించి యున్నారు. ఓ పర్వతరాజా! కాని మీకు ఇప్పుడు తద్విరుద్ధమగు మనస్సుకలుగుటకు కారణమేమి? చెప్పుము (51). అపుడు దేవతలు శివుని వద్దకు వెళ్లి ప్రార్థించగా, ఆయన సప్తర్షులగు మమ్ములను, అరుంధతిని వెనువెంటనే నీ వద్దకు పంపించినాడు (52).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

29 Oct 2021

గీతోపనిషత్తు -268

🌹. గీతోపనిషత్తు -268 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 9-1

🍀 9. సాక్షీభూతుడు -1 - జీవుల కర్మలన్నియు వారి యందలి గుణ సముదాయముచే నిర్వర్తింపబడి, సుఖదుఃఖముల నిచ్చును. సుఖమువలన, దుఃఖమువలన కూడ జీవులు బంధింపబడు చున్నారు. అట్టి కర్మములకు, బంధములకు అతీతుడైన ఈశ్వరుడు తటస్థుడై సర్వమును చూచుచు నుండును. అందే కర్మ యందును అతని కాసక్తి లేదు. అట్టి ఈశ్వరుడు సాక్షీ భూతుడు. మన యందు కూడ ఈశ్వరుడున్నాడు. మన ప్రకృతి ననుసరించి మన కర్మ లుండును. మన కర్మను బట్టి మనకు బంధ మోక్షము లుండును. కర్మలు నిర్వర్తించు తీరు తెలియనపుడు బంధనముండును. తెలిసినపుడు బంధముండదు. 🍀

నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవ దాసీన మసక్తం తేషు కర్మసు II 9

తాత్పర్యము : ప్రకృతి కారణముగ జీవులాచరించు కర్మల యందు నేను తగులుకొనను. తటస్థునివలె యుందును. జీవుల కర్మలు నన్ను బంధింపవు, బంధింపలేవు.

వివరణము : ఈశ్వరుడు ప్రకృతికతీతుడు. తన నుండి ఏర్పడిన ప్రకృతి నుండి మూడు గుణము లేర్పడుచున్నవి. అవియే సత్వ రజస్తమస్సులు. ఆ గుణములనుండి జీవులేర్పడుచున్నారు. జీవుల కర్మలన్నియు వారి యందలి గుణ సముదాయముచే నిర్వర్తింపబడి, సుఖదుఃఖముల నిచ్చును. సుఖమువలన, దుఃఖమువలన కూడ జీవులు బంధింపబడు చున్నారు. అట్టి కర్మములకు, బంధములకు అతీతుడైన ఈశ్వరుడు తటస్థుడై సర్వమును చూచుచు నుండును. అందే కర్మ యందును అతని కాసక్తి లేదు. అట్టి ఈశ్వరుడు సాక్షీ భూతుడు.

మన యందు కూడ ఈశ్వరుడున్నాడు. అతడాధారముగ ప్రకృతి యున్నది. మన గుణ సమ్మేళనమునుబట్టి, ప్రకృతి మన ప్రకృతివలె తయారగును. మన ప్రకృతి ననుసరించి మన కర్మ లుండును. మన కర్మను బట్టి మనకు బంధ మోక్షము లుండును. కర్మలు నిర్వర్తించు తీరు తెలియనపుడు బంధనముండును. తెలిసినపుడు బంధముండదు. బంధములు ద్వంద్వములుగ నుండును. సుఖ బంధము, దుఃఖ బంధము. మన యందలి ఈశ్వరుడు మనలను, మన ప్రకృతిని, మన కర్మల నిర్వహణ మందలి జానాథానములను తటస్థుడై చూచుచుండును. అందే కర్మముతోను అతడు తగులుకొనడు. తగులుకొను ఆసక్తి కూడ లేదు. ప్రతి జీవుడు మూలముగ ఈశ్వరుడున్నాడు. అతడు తటస్థుడు. జీవకర్మల యందు అనాసక్తుడు. అతడిని ఏ కర్మలు బంధింపవు.

సూర్యోదయము వేళలో జీవులు క్రమశః మేల్కాంచి, అనేకానేకమగు కార్యములు దినమంతయు నిర్వర్తించుచు నుందురు. పశుపక్ష్యాదులు, మానవులు మేల్కాంచి వైవిధ్యమగు కార్యములలో నిమగ్న మగుదురు. మధ్యాహ్నము వేళకు పనులు వేడెక్కును. వేగము పెరుగును. సూర్యాస్తమయ సమయమునకు పనుల వేగము తగ్గును. రాత్రి మొదటి జాము గడచిన తరువాత జీవులు నిద్రలోనికి జారుదురు. ఇవియన్నియు సూర్యుడు ఆధారముగ జరుగుచున్నవి. జరుగుచున్న పనులకు కర్తలు జీవులేగాని సూర్యుడు కాదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

31 Oct 2021

29-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 29, శుక్ర వారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 268   🌹  
3) 🌹. శివ మహా పురాణము - 467🌹 
4) 🌹 వివేక చూడామణి - 144 / Viveka Chudamani - 144🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -96🌹  
6) 🌹 Osho Daily Meditations - 85 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 144 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 144🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*29, అక్టోబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం-4 🍀*

*మాంగల్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితే |*
*తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజే || 5 ||*
*పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే |*
*ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః || 6 ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: కృష్ణ అష్టమి 14:09:59 వరకు తదుపరి కృష్ణ నవమి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: పుష్యమి 11:39:50 వరకు తదుపరి ఆశ్లేష
యోగం: శుభ 25:59:20 వరకు తదుపరి శుక్ల 
కరణం: కౌలవ 14:05:02 వరకు
వర్జ్యం: 25:05:56 - 26:46:48
దుర్ముహూర్తం: 08:31:50 - 09:18:01 మరియు
12:22:43 - 13:08:54
రాహు కాలం: 10:33:03 - 11:59:38
గుళిక కాలం: 07:39:53 - 09:06:28
యమ గండం: 14:52:48 - 16:19:23
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 04:44:04 - 06:27:48
పండుగలు : లేదు
సూర్యోదయం: 06:13:19, సూర్యాస్తమయం: 17:45:58
వైదిక సూర్యోదయం: 06:16:57
వైదిక సూర్యాస్తమయం: 17:42:18
చంద్రోదయం: 00:43:37, చంద్రాస్తమయం: 13:15:37
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: కర్కాటకం
ఆనందాదియోగం: ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
11:39:50 వరకు తదుపరి మృత్యు యోగం - మృత్యు భయం 
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -268 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 9-1
 
*🍀 9. సాక్షీభూతుడు -1 - జీవుల కర్మలన్నియు వారి యందలి గుణ సముదాయముచే నిర్వర్తింపబడి, సుఖదుఃఖముల నిచ్చును. సుఖమువలన, దుఃఖమువలన కూడ జీవులు బంధింపబడు చున్నారు. అట్టి కర్మములకు, బంధములకు అతీతుడైన ఈశ్వరుడు తటస్థుడై సర్వమును చూచుచు నుండును. అందే కర్మ యందును అతని కాసక్తి లేదు. అట్టి ఈశ్వరుడు సాక్షీ భూతుడు. మన యందు కూడ ఈశ్వరుడున్నాడు. మన ప్రకృతి ననుసరించి మన కర్మ లుండును. మన కర్మను బట్టి మనకు బంధ మోక్షము లుండును. కర్మలు నిర్వర్తించు తీరు తెలియనపుడు బంధనముండును. తెలిసినపుడు బంధముండదు. 🍀*

నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవ దాసీన మసక్తం తేషు కర్మసు II 9

*తాత్పర్యము : ప్రకృతి కారణముగ జీవులాచరించు కర్మల యందు నేను తగులుకొనను. తటస్థునివలె యుందును. జీవుల కర్మలు నన్ను బంధింపవు, బంధింపలేవు.* 

వివరణము : ఈశ్వరుడు ప్రకృతికతీతుడు. తన నుండి ఏర్పడిన ప్రకృతి నుండి మూడు గుణము లేర్పడుచున్నవి. అవియే సత్వ రజస్తమస్సులు. ఆ గుణములనుండి జీవులేర్పడుచున్నారు. జీవుల కర్మలన్నియు వారి యందలి గుణ సముదాయముచే నిర్వర్తింపబడి, సుఖదుఃఖముల నిచ్చును. సుఖమువలన, దుఃఖమువలన కూడ జీవులు బంధింపబడు చున్నారు. అట్టి కర్మములకు, బంధములకు అతీతుడైన ఈశ్వరుడు తటస్థుడై సర్వమును చూచుచు నుండును. అందే కర్మ యందును అతని కాసక్తి లేదు. అట్టి ఈశ్వరుడు సాక్షీ భూతుడు. 

మన యందు కూడ ఈశ్వరుడున్నాడు. అతడాధారముగ ప్రకృతి యున్నది. మన గుణ సమ్మేళనమునుబట్టి, ప్రకృతి మన ప్రకృతివలె తయారగును. మన ప్రకృతి ననుసరించి మన కర్మ లుండును. మన కర్మను బట్టి మనకు బంధ మోక్షము లుండును. కర్మలు నిర్వర్తించు తీరు తెలియనపుడు బంధనముండును. తెలిసినపుడు బంధముండదు. బంధములు ద్వంద్వములుగ నుండును. సుఖ బంధము, దుఃఖ బంధము. మన యందలి ఈశ్వరుడు మనలను, మన ప్రకృతిని, మన కర్మల నిర్వహణ మందలి జానాథానములను తటస్థుడై చూచుచుండును. అందే కర్మముతోను అతడు తగులుకొనడు. తగులుకొను ఆసక్తి కూడ లేదు. ప్రతి జీవుడు మూలముగ ఈశ్వరుడున్నాడు. అతడు తటస్థుడు. జీవకర్మల యందు అనాసక్తుడు. అతడిని ఏ కర్మలు బంధింపవు. 

సూర్యోదయము వేళలో జీవులు క్రమశః మేల్కాంచి, అనేకానేకమగు కార్యములు దినమంతయు నిర్వర్తించుచు నుందురు. పశుపక్ష్యాదులు, మానవులు మేల్కాంచి వైవిధ్యమగు కార్యములలో నిమగ్న మగుదురు. మధ్యాహ్నము వేళకు పనులు వేడెక్కును. వేగము పెరుగును. సూర్యాస్తమయ సమయమునకు పనుల వేగము తగ్గును. రాత్రి మొదటి జాము గడచిన తరువాత జీవులు నిద్రలోనికి జారుదురు. ఇవియన్నియు సూర్యుడు ఆధారముగ జరుగుచున్నవి. జరుగుచున్న పనులకు కర్తలు జీవులేగాని సూర్యుడు కాదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 467 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 33

*🌻. సప్తర్షుల ఉపదేశము - 4 🌻*

ఆమె మరియొక కల్పములో దక్షుని భార్య యొక్క గర్భము నుండి పుట్టి సతియను పేరును గాంచి శివుని వివాహమాడెను. దక్షుడు ఆమెను ఆయనకిచ్చి వివాహము చేసెను (44). ఆమె భర్తను నిందించుటను విని, యోగ మహిమచే దేహమును త్యజించెను. ఆమెయే నీ వలన మేనా గర్భము నందు జన్మించి పార్వతీ రూపములో నున్నది (45).

ఓ పర్వతరాజా ! ఈశివాదేవి జన్మజన్మల యందు, సర్వకాలములయందు శివుని అర్ధాంగి. ఈ తల్లి సర్వోత్కృష్టురాలు. జ్ఞానులయందు ఈమె బుద్ధి రూపమున నుండును (46). సదా సిద్ధిని ఇచ్చునది, సిద్ధి స్వరూపురాలు, స్వయంసిద్ధ అగు ఈ దేవి ఇచట జన్మించి యున్నది. శివుడు సతీదేవి యొక్క అస్థికలను, చితాభస్మను భక్తితో స్వయముగా ధరించును (47). కావున నీవు మంగళ స్వరూపురాలగు నీకన్యను సంతోషముతో శివునకు ఇమ్ము. లేనిచో నీవు ఈయనిచో, ఆమెయే తన భర్త ఉండు స్థానమునకు స్వయముగా వెళ్లగలదు (48).

నీ కుమార్తె యొక్క తీవ్రమగు తపస్సులోని క్లేశములను చూచి, దేవతలకు ప్రతిజ్ఞనుచేసి, దేవదేవుడగు శివుడు బ్రాహ్మణ వేషములో నీకుమార్తె తపస్సు చేయు స్థలమునకు వచ్చినాడు (49). ఓ పర్వతరాజా ! ఆ శంభుడు ఆమెను ఓదార్చి, వరము నిచ్చి, తన నివాసమునకు వెళ్లి, ఆమె కోర్కె మేరకు నిన్ను పార్వతిని ఇమ్మని యాచించినాడు (50). 

శివభక్తి యందభిరుచితో గూడిన మనస్సుగల మీరిద్దరు అంగీకరించి యున్నారు. ఓ పర్వతరాజా! కాని మీకు ఇప్పుడు తద్విరుద్ధమగు మనస్సుకలుగుటకు కారణమేమి? చెప్పుము (51). అపుడు దేవతలు శివుని వద్దకు వెళ్లి ప్రార్థించగా, ఆయన సప్తర్షులగు మమ్ములను, అరుంధతిని వెనువెంటనే నీ వద్దకు పంపించినాడు (52). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 144 / Viveka Chudamani - 144🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 30. బ్రహ్మమును పొందాలంటే -2 🍀*

474. పూర్తి ఆత్మ స్థితితో కూడిన బ్రహ్మానందమును పొందాలంటే, వ్యక్తి తను తన బంధనాల నుండి పూర్తి విముక్తి పొంది, అజ్ఞానమును తొలగించుకొని, సృతుల ద్వారా, విచారణ ద్వారా మరియు గురు బోధల ద్వారాను, వాటితో పాటు స్వయం అనుభవముల ద్వారాను మనస్సును ఏకాగ్రము చేయుట ద్వారా సమాధి స్థితిని చేరవలెను.

475. బంధనాలు, విముక్తి, తృప్తి, ఆతురత, రోగముల నుండి విముక్తి, ఆకలి మొదలగు వస్తువులన్నియూ వాటికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే వర్తిస్తవి. వాటి యొక్క జ్ఞానము ఇతరులకు కేవలము ఊహలు, గుర్తులు మాత్రమే. 

476. గురువులు మరియు సృతులు శిష్యులకు దూరముగా ఉండి మాత్రమే బోధిస్తారు. కాని విముక్తి పొందిన వ్యక్తి అవిద్యను వాటి ఊహలలో, భగవంతుని కృపతో మాత్రమే విముక్తిని సాధించగలరు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 144 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 30. To Achieve Brahmam - 2 🌻*

474. In the realisation of the Atman, the Existence-Knowledge-Bliss Absolute, through the breaking of one’s connection with the bondage of Avidya or ignorance, the Scriptures, reasoning and the words of the Guru are the proofs, while one’s own experience earned by concentrating the mind is another proof.

475. Bondage, liberation, satisfaction, anxiety, recovery from illness, hunger and other such things are known only to the man concerned, and knowledge of these to others is a
mere inference.

476. The Gurus as well as the Shrutis instruct the disciple, standing aloof; while the man of realisation crosses (Avidya) through Illumination alone, backed by the grace of God.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 96 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. చేయవలసినది- చేయదలచినది - 12 🌻*

*ఎవరయితే సేవ కావాలని కోరుతున్నారో ఆధ్యాత్మ విద్య వాళ్ళ కోసం కాదు. ఎవరికయితే సేవ చేద్దామని ఉందో, వారి కోసమే ఆధ్యాత్మ విద్య. తరించేది వాళ్ళే. మోక్షం వచ్చేది వాళ్ళకే.* 

*అంతేకాని ఈ సృష్టిలో నాకు మోక్షం కావాలి అని కోరిన వాడికి ఏనాడూ మోక్షం రాలేదు. ఎందులకనగా ముందు "నాకు" అనే శత్రువున్నది. అది ఉన్నవాడికి మోక్షం ఎలా వస్తుంది? చివర "కావాలి" అనే శత్రువు ఉన్నది. మధ్యన ఉన్న మోక్షం అనే పదానికి "నాకు" అనే ఒక శత్రువు "కావాలి" అనే శత్రువు ఉన్నాయి.* 

*నాకిది కావాలి అనే కోరేవాడికి మోక్షం ఇప్పించడానికి భగవంతుడేమన్నా తెలివి తక్కువ వాడా? ఎన్ని కోటానుకోట్ల సృష్టి చూశాడు. ఎంతమంది లౌక్యుల్ని చూశాడు? ఇవన్నీ వాడిలోంచి పుట్టి, వాడిలో పెరిగి, వాడిలోకి వెళ్ళిపోతున్నవే గదా! నాకు, కావాలి అనే ఈ "రెండూ" తీసివేయనంత కాలము మోక్షము రాదు. మోక్షం అనేది వచ్చేది కాదు.* 

*ఒకాయన ఒకమాటు రమణమహర్షి గారి దగ్గరకు వెళ్ళి అడిగాడు. "స్వామీ నాకు మోక్షం ఎలా వస్తుంది?" ఆయన "నీకు రాదురా అప్పా" అని అన్నాడు. వాడు నాకు మోక్షం రాదు కామోసు అనుకున్నాడు నేనంత పొరపాటు చేశానేమో అని కూడా అనుకున్నాడు పాపం. చాలా బాధపడి వారి ప్రసంగం అయిపోయాక మళ్ళీ వచ్చి "స్వామీ మోక్షం రావాలంటే ఏం చేయాలి?" ఆయన "చెప్పాను కదురా అప్పా మోక్షం రాదని. వాడు బాధపడ్తూనే మర్నాడు మళ్ళీ అంతే నంటారా? ఇంక లాభం లేదంటారా? అని అడిగాడు"..*

..✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 85 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 85. SIBLING RIVALRY 🍀*

*🕉 The mother may love one child more, another a little less. You cannot expect that she should love absolutely equally; it is not possible. 🕉*

Children are very perceptive. They can immediately see that somebody is liked more and somebody is liked less. They know that this pretension of the mother's loving them equally is just bogus. 

So an inner conflict, fight, ambition arises. Each child is different. Somebody has a musical talent, somebody does not. Somebody has. a mathematical talent and somebody has not. Somebody is physically more beautiful than another or one has a certain charm of personality and the other is lacking it. Then more and more problems arise, and we are taught to be nice, never to be true. If children are taught to be true, they will fight it out, and they will drop it by fighting. They will be angry, they will fight and say hard things to one another, and then they will be finished, because children get rid of things very easily. If they are angry, they will be angry, hot, almost volcanic, but the next moment they will be holding each other's hands and everything will be forgotten. 

Children are very simple, but often they are not allowed that simplicity. They are told to be nice, whatever the cost. They are prohibited from being angry at each other: "She is your sister, he is your brother. How can you be angry?" These angers, jealousies, and a thousand and one wounds go on collecting. But if you can face each other in true anger, jealousy, if you can fight it out, immediately afterward, in the wake of the fight, a deep love and compassion will arise. And that will be the real thing.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 144 / Sri Lalita Sahasranamavali - Meaning - 144 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 144. భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా ।*
*రోగపర్వత దంభోళి, ర్మృత్యుదారు కుఠారికా ॥ 144 ॥ 🍀*
 
🍀 745. భాగ్యాబ్ధిచంద్రికా :
 సంపద అనెడి సముద్రమునకు వెన్నెల వంటిది 

🍀 746. భక్తచిత్తకేకిఘనాఘనా : 
భక్తుల మనస్సులు అనే నెమళ్ళకు వర్షాకాలపు మేఘము వంటిది 

🍀 747. రోగపర్వతదంభొళి :
 పర్వతములవంతి రోగములకు వజ్రాయుధము వంటిది 

🍀 748. ర్మృత్యుదారుకుఠారికా :
 మృత్యువనెడి వృక్షమునకు గొడ్డలి వంటిది 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 144 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 144. Bhagyabhi chandrika bhakta chittakeki ghanaghna*
*Rogaparvatadan bholi rmrutyudaru kutarika ॥ 144 ॥ 🌻*

🌻 745 ) Bhagyabdhi chandrika -   
She who is the full moon to the sea of luck

🌻 746 ) Bhaktha Chitta Keki Ganagana -   
She who is the black cloud to the peacock which is he devotees mind

🌻 747 ) Roga parvatha Dhambola -   
She who is the Vajra weapon which breaks the sickness which is like the mountain

🌻 748 ) Mrutyu Dharu Kudarika -   
She who is like the axe which fells the tree of death

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹