మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 96


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 96 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 12 🌻


ఎవరయితే సేవ కావాలని కోరుతున్నారో ఆధ్యాత్మ విద్య వాళ్ళ కోసం కాదు. ఎవరికయితే సేవ చేద్దామని ఉందో, వారి కోసమే ఆధ్యాత్మ విద్య. తరించేది వాళ్ళే. మోక్షం వచ్చేది వాళ్ళకే.

అంతేకాని ఈ సృష్టిలో నాకు మోక్షం కావాలి అని కోరిన వాడికి ఏనాడూ మోక్షం రాలేదు. ఎందులకనగా ముందు "నాకు" అనే శత్రువున్నది. అది ఉన్నవాడికి మోక్షం ఎలా వస్తుంది? చివర "కావాలి" అనే శత్రువు ఉన్నది. మధ్యన ఉన్న మోక్షం అనే పదానికి "నాకు" అనే ఒక శత్రువు "కావాలి" అనే శత్రువు ఉన్నాయి.

నాకిది కావాలి అనే కోరేవాడికి మోక్షం ఇప్పించడానికి భగవంతుడేమన్నా తెలివి తక్కువ వాడా? ఎన్ని కోటానుకోట్ల సృష్టి చూశాడు. ఎంతమంది లౌక్యుల్ని చూశాడు? ఇవన్నీ వాడిలోంచి పుట్టి, వాడిలో పెరిగి, వాడిలోకి వెళ్ళిపోతున్నవే గదా! నాకు, కావాలి అనే ఈ "రెండూ" తీసివేయనంత కాలము మోక్షము రాదు. మోక్షం అనేది వచ్చేది కాదు.

ఒకాయన ఒకమాటు రమణమహర్షి గారి దగ్గరకు వెళ్ళి అడిగాడు. "స్వామీ నాకు మోక్షం ఎలా వస్తుంది?" ఆయన "నీకు రాదురా అప్పా" అని అన్నాడు. వాడు నాకు మోక్షం రాదు కామోసు అనుకున్నాడు నేనంత పొరపాటు చేశానేమో అని కూడా అనుకున్నాడు పాపం. చాలా బాధపడి వారి ప్రసంగం అయిపోయాక మళ్ళీ వచ్చి "స్వామీ మోక్షం రావాలంటే ఏం చేయాలి?" ఆయన "చెప్పాను కదురా అప్పా మోక్షం రాదని. వాడు బాధపడ్తూనే మర్నాడు మళ్ళీ అంతే నంటారా? ఇంక లాభం లేదంటారా? అని అడిగాడు"..


..✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


29 Oct 2021

No comments:

Post a Comment