జీవుల కర్మఫలప్రధాత - శనీశ్వరుడు / The Bestower of the Fruits of Karma - Lord Shani


🌹 జీవుల కర్మఫలప్రధాత - శనీశ్వరుడు 🌹

The Bestower of the Fruits of Karma - Lord Shani


కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. దీనిని అందజేసేది శనీశ్వరుడు

According to the theory of karma, a person must inevitably experience the consequences of their actions. Good deeds yield good results, and bad deeds yield bad results. This is administered by Lord Shani.

భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు

ఒడిదొడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు.

సూర్యభగవానుడు, ఛాయా సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ అంటారు.

నవ గ్రహాల్లో కీలకమైన శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది. అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు.

అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. అయితే, శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.

స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటివారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడి.. ‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అని అన్నాడు.

ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు. 'నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’ అని చెప్పిన శని.. పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానని అన్నాడు.శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థంకాక, మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.

మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసిన శివుడు ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు. దీనికి శని 'ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు. శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు.. ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరఢవిల్లుతావని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.


శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం,

ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరం

అర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనీశ్వరా! నీకు నమస్కారము.

ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒకవారాన్ని, ఒక హోరాకాలన్ని ,కొన్ని ప్రీతికర వస్తువులని పెద్దలు నిర్దేశించారు. ఆయా సమయాలలో ఆయాగ్రహాలకి పూజ చేసినా దానం ఇచ్చినా జపంచేసినా ఆయా గ్రహాలా పీడ పరిహరించ తగ్గుతుంది.

అలాగే శని గ్రహానికి కూడా కొన్ని చెప్పబడ్డాయి.

శనికి త్రయోదశి తిథి, శనిహోరాకాలం, తిలాతైలాదుల దానం, ఇలాంటివి చెప్పబడ్డాయి.


శనిపీడాఫలాలు

డబ్బు దుబారా, అపనింద, నపుంసకత్వం, మాటవిలువ తగ్గటం,జీర్ణ సంబంధరోగాలు, వెన్నినొప్పు, పొట్టరావడం, కొవ్వుబద్దకం, అలసట, అతినిద్ర, పైవారిఒత్తిడి, నీచస్త్రీపురుషులతో సాంగత్యం, వ్యసనాల అలవాటుపడటం, ఉద్యోగం పోవటం, ఉద్యోగం దొరకకపోవటం, అందం తగ్గటం, వంటివి ముఖ్య ఫలాలు.

ఈసారి విశేషంగా ఒకే నెలలో రెండుసార్లు శనిత్రయోదశి వచ్చింది.

శనివారం రోజు పుణ్యకాలం,

ప్రతీ శనివారం శని హోరాకాలలలో చేస్తేమంచిది. ఉదయం 6-7మధ్యకాలం, మధ్యాహ్నం 1-2 మధ్యకాలం, రాత్రి 8-9 మధ్యకాలంమంచిది. ఐతే శనిత్రయోదశి నాడు రోజంతా పుణ్యకాలమే.


శనిత్రయోదశి నాడు మనం చేయదగ్గవి

నూనె ఒంటికి అంటుకొని, తలస్నానంచేయడం, ప్రాణాయమం చేయడం, శనికోసం చెప్పిన మంత్రాలు, శ్లోకాలు చదవటం. ఉపవాసం.


శనికి చేయదగ్గ పూజలు

శనికి తైలాభిశేకం, శనికిరుద్రాభిశేకం, నవగ్రహాలలో శనికి అష్టోత్తరనామాలు చదువుతూ పూలతో పూజించడం. శని ప్రదక్షిణలు చేయడం.


చదవదగ్గవి

శని అష్టోత్తర శతనామాలు, దశరథకృత శనిస్తోత్రం, విష్ణు సహస్రనామస్తోత్రం, శివపురాణం నలున్ని శని పీడించిన కథ మంచివి.

శనికి ప్రీతిగా ఇవ్వదగ్గదానాలు

నువ్వులు, నువ్వుల ఉండలు, అన్నిరకాల నూనెలు నీలంరంగు పంచెలు (శని ఆలయ అర్చకులు కు) ఇనుప వస్తువులు, పనివారికి, యాచకులకి - పాతబట్టలు దానంచేయాలి. నేరేడు పండ్లు, సిమెంట్‌ ఇనుము వంటివి, తగినవారికి తగినరీతిలో శక్తి వంచన లేకుండా చేయడం మంచిది.


శనికి సంబంధించి శాంతి చేసుకోవలసినవారు

మామూలుగా సింహం ధనుస్సు, కుంభ, మీనా, మేష రాశులవారు చేసుకోవాలి. విశేషంగా జాతకంలో శని పాప సంబంధంగా ఉన్నవారు, పాప స్థానాలలో ఉండేవారు, శనిదశ నడుస్తున్నవారు, చేయాలి.

🌹 🌹 🌹 🌹 🌹

పుష్య పౌర్ణమి (జనవరి 3, 26): ఈ ఐదు ప్రదేశాలలో దీపాలు వెలిగిస్తే కష్టాలు తొలగిపోయి, నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి! Pushya Pournami (Jan 3, 26): Lighting lamps in these five places will solve troubles and complete pending tasks!



🌹 పుష్య పౌర్ణమి ( జనవరి 3): ఈ ఐదు ప్రదేశాల్లో దీపారాధన.. కష్టాలు మటుమాయం.. పెండింగ్ పనులు ఇట్టే పూర్తవుతాయి..! 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Pushya Pournami (January 3): Lighting lamps in these five places will make your troubles disappear and pending tasks will be completed instantly! 🌹

Prasad Bharadwaj



పుష్య మాసం పౌర్ణమి రోజున ( జనవరి 3) హిందు పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ..

సుఖ సంతోషాలు కూడా మీ సొంతం అవుతాయి. పుష్య మాసం పూర్ణిమ నాడు ఏయే ప్రదేశాలలో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పుష్యమాసం శనిభగవానుడికి శనీశ్వరుడికి చాలా ఇష్టం. పౌర్ణమి తిథి శని వారం.. పుష్య మాసం లో వచ్చిదంటే పురాణాల ప్రకారం ఆరోజుకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ ఏడాది ( 2026) జనవరి 3 వ తేది శనివారం పుష్య పౌర్ణమి తిథి వచ్చింది. ఆ రోజున శని భగవానుడి పూజించి నల్లనువ్వులు దానంతో పాటు శ్రీ మహా విష్ణువు, లక్ష్మిని పూజించడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో ఆనందం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

1. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర: పుష్యమాసం పౌర్ణమి తిథి రోజున ( జనవరి3) ఇంట్లో దేవుడి దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన ఇప్పటి వరకు కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్​ ఎనర్జీ తొలగి.. లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

2. తులసి మొక్క దగ్గర : హిందువులు.. తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. పుష్యమాసం పూర్ణిమ రోజున తులసి మొక్క దగ్గర ఉదయం ( సూర్యోదయానికి ముందు) .. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఆవునెయ్యితో దీపారాధ చేయాలి. ఆ తరువాత లక్ష్మీ దేవి అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ చేయాలి. మహాలక్ష్మి అమ్మవారికి పండ్లు.. పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక కష్టాలు తొలగి.. పెండింగ్​పనులు త్వరగా పూర్తవుతాయి.

3. రావి చెట్టు దగ్గర దీపం: ఈ చెట్టులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు నివసిస్తారు. పుష్యమాసం సూర్యభగవానుడి చాలా ఇష్టమైన నెల. అందుకే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున ( 2026 జనవరి 3) ఇక్కడ రెండు కుందుల్లో దీపారాధన చేయాలి. ఒకదానిలో ఆవునెయ్యి దీపారాధన.. మరొక దానిలో నువ్వుల నూనె దీపారాధన చేయాలి. తరువాత అగర్​ బత్తీలు వెలిగించి.. బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన త్రిమూర్తుల ఆశీస్సులు కలగడమే కాకుండా... పూర్వీకులు కూడా సంతోషించి.. పితృదోషాలు తొలగిపోతాయి.

4. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర: పుష్యమాసం.. పౌర్ణమి తిథి రోజున (2026 జనవరి 3) ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన ఇంట్లోకి నెటివ్​ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంటి గుమ్మాన్ని పసుపు, కుంకుమతో అలంకరించాలి. గుమ్మానికి పైన పూలదండ కడితే మరీ మంచిది. ఇలా చేయడం వలన అన్ని రకాల సమస్యలకు పరిష్కారం కలుగుతుంది.

5. శని భగవానుడి దగ్గర : శని భగవానుడి దగ్గర నువ్వులనూనె దీపారాధన చేయాలి. పుష్యమాసం శనీశ్వరుడికి ఇష్టమైన నెల. పౌర్ణమి తిథి రోజున శనీశ్వరుడి తైలాభిషేకం చేసి.. నువ్వులతో అర్చించాలి. ధూపం.. దీపం.. తరువాత శనీశ్వరునికి బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డు సమర్పించాలి. పేదలకు వస్త్రదానం చేయాలి. ఇలా చేయడం వలన శనిభగవానుడు సంతోషించి.. కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని పండితులు చెబుతున్నారు.


ఇంకా ఏమేమి చేయాలంటే..


లక్ష్మీదేవిని పసుపు రంగు పువ్వులతో పూజించడం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు.

పుష్యమాసం పౌర్ణమి రోజున పవిత్రమైన నదిలో పవిత్ర స్నానం చేసి... దీపదానం చేయడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి ... కోరిన కోరికలు నెరవేరడం.

ఆహారం, డబ్బు, బట్టలు దానం దానం చేయడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.. వ్యాపారంలో లాభం.

ఓం సోమాయ నమః... 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి చంద్రునికి అర్ఘ్యం ఇస్తే మంచి జరుగుతుంది.

తెల్లటి వస్తువులను దానం చేయడం ఉత్తమం. బియ్యం, పాలు, చక్కెర, తెల్లటి వస్త్రాలు, వెండి వస్తువులు వంటివి పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం జాతకంలో చంద్రదోషం తొలగిపోయి.. మేలు జరుగుతుంది.

పవిత్ర నదుల్లో స్నానం.. మోక్షానికి మార్గం

ఏది ఎలా చేసినా భక్తి పూర్వకంగా శ్రద్దతో చేయాలి

🌹🌹🌹🌹🌹

జనవరి 03 ఆకాశంలో అద్భుతం... A spectacular event in the sky on January 3rd...


🌹 జనవరి 03 ఆకాశంలో అద్భుతం.. 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 A spectacular event in the sky on January 3rd... 🌹
Prasad Bharadwaj


ముక్కోటి + ఆరుద్ర నక్షత్రం + శనివారం ఇలాంటి రోజు మళ్లీ మళ్లీ రాదు.. ముఖ్యంగా ఆడవాళ్లు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలా దీపం పెట్టి,పూజ చేస్తే ద్విపుష్కరయోగం పడుతుంది..

ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తోంది. ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వలే శివుడికి శివ ముక్కోటి కూడా అంత విశిష్టమైనదిగా పండితులు చెబుతారు.

ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటిగా చెబుతారు. ఈ ఏడాది ఈ శివ ముక్కోటి 2026 జనవరి 3వ తేదీన వచ్చింది. శనివారం పౌర్ణమి తిథితో రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శివ ముక్కోటి గురించిన విషయాలు తెలుసుకుందాం..

నూతన సంవత్సరం 2026 జనవరి 3వ తేదీ శనివారం. ఈరోజున ఆర్ద్ర నక్షత్రం లేదా ఆరుద్ర నక్షత్రం (Arudra Nakshatra) ఉంటుంది. ఇది శివుడి (Lord Shiva) జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ నక్షత్రానికి విశిష్టత ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం శివుడి రుద్రరూపం, వినాశన, పునరుత్పత్తి శక్తులకు, భావోద్వేగ తీవ్రత, పరివర్తనకు ప్రతీక. ఇది కన్నీటి చుక్కగా సూచించబడుతుంది. అయితే ఈ జనవరి 3వ తేదీ ధనుర్మాసంలో వస్తుంది. ఈ మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం రోజున శివుని నక్షత్రంగా.. ఆరుద్రోత్సవంగా జరుపుకుంటారు. దీనిని శివ ముక్కోటి అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువుకు సంబంధించి వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టమైనదిగా చెబుతారో.. శివుడికి శివ ముక్కోటి కూడా అంతే విశిష్టమైనది.


జనవరి 3 శనివారం

అయితే ఈ ఏడాది ఈ శివ ముక్కోటి జనవరి 3వ తేదీన శనివారం రోజు అందులోనూ పౌర్ణమి తిథితో కలిసి రావడం ఈ శివ ముక్కోటి విశేషమైన ప్రాధాన్యత నెలకొంది. ఈరోజున శివారాధనకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజున పూర్వకాలం సంప్రదాయంగా కంచి పీఠాధిపతులు ఏర్పాటు చేసినటువంటి ఒక విశేషం ఏమిటంటే.. ఆరోజున తెల్లవారుజాము 3 గంటల నుంచి 5 గంటల లోపు పవిత్ర స్నానం ఆచరించి ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి. ఈ ఆరుద్ర నక్షత్రం శివుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపిస్తుందట. అలాగే చాలా కాంతివంతంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుందట. కాబట్టి ఈరోజున తెల్లవారుజామునే శివ రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని.. సాక్షాత్తు శివుడిని దర్శించుకున్న ఫలితమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు.


పూజా విధానం

ఈ రోజున శివుడిని నెయ్యితో అభిషేకం చేయడం, అర్చన చేయడం శుభప్రదం. ఆరోగ్యం కోసం మృత్యుంజయ స్తోత్రం చదవడం, సంపద కోసం శివ పంచాక్షరి పఠించడం, శివ నామస్మరణ చేయడం, ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి పఠించడం, శివ స్తోత్రాలు వంటివి పఠించడం ఎంతో శుభప్రదం. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కోరుకునే వారు గరికను నానబెట్టిన జలంతో శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. అలాగే పౌర్ణమి తిథి కాబట్టి తెల్లటి పూలతో శివార్చన చేయడం ఎంతో మంచిది. అంతే కాకుండా శనివారం వచ్చింది కాబట్టి నీలం రంగు పుష్పాలతో అర్చన చేయడం కూడా శుభప్రదం. ఇలా చేయడం వల్ల శని గ్రహ అనుకూలత కలుగుతందని కూడా చెబుతారు. ఇక నివేదనలో పరమాన్నం నివేదన చేసి.. ఇతరులకు పంచడం చేయడం మంచిది.

🌹 🌹 🌹 🌹 🌹


19వ పాశురం Part - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 19 / Pasuram - Part 2 - Tiruppavai Pasuras Bhavartha Gita



https://youtube.com/shorts/PaUPZSKzjl4


🌹 19వ పాశురం Part - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 19 Pasuram - Part 2 - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 19వ పాశురం - నీళాదేవి శయనలీలా – శరణాగతి గీతం -2 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 19వ పాశురంలో, గోపికలు లోకరక్షకునే తన వక్షస్థలంపై నిదుర పుచ్చగల భాగ్యశాలి నీళాదేవిని నిదుర లేచి పతిని తమ వ్రతానికి పంపించమని అభ్యర్థిస్తున్నారు. 🍀


Like, Subscribe and Share

తప్పకుండా వీక్షించండి


🌹🌹🌹🌹🌹


19వ పాశురం Part 1- తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 19 Pasuram - Part 1 - Tiruppavai Pasuras Bhavartha Gita



https://youtube.com/shorts/ML15f2oByr0


🌹 19వ పాశురం Part 1- తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 19 Pasuram - Part 1 - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 19వ పాశురం - నీళాదేవి శయనలీలా – శరణాగతి గీతం. 🍀


రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 19వ పాశురంలో, గోపికలు లోకరక్షకునే తన వక్షస్థలంపై నిదుర పుచ్చగల భాగ్యశాలి నీళాదేవిని నిదుర లేచి పతిని తమ వ్రతానికి పంపించమని అభ్యర్థిస్తున్నారు. 🍀

Like, Subscribe and Share

తప్పకుండా వీక్షించండి

🌹🌹🌹🌹🌹


పౌష పౌర్ణమి, శాకంబరి పౌర్ణమి, శివముక్కోటి, అన్వధన శుభాకాంక్షలు / Happy Pausha Pournami, Shakambari Pournami, Shivamukkoti, and Anvadhan



🌹 పౌష పౌర్ణమి, శాకంబరి పౌర్ణమి, శివముక్కోటి, అన్వధన శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



🌹 Happy Pausha Pournami, Shakambari Pournami, Shivamukkoti, and Anvadhan to everyone 🌹

Prasad Bharadwaj



పుష్య పౌర్ణమి, శాంకంబరీ పౌర్ణమి, శ్రీ శాకాంబరి దేవి జయంతి, శివ ముక్కోటి, అన్వధన శుభాకాంక్షలు! Happy Pushya Pournami, Shakambari Pournami, Sri Shakambari Devi Jayanti, Shiva Mukkotri, and Anvadhan!


🌹 పుష్య పౌర్ణమి, శాంకంబరీ పౌర్ణమి, శ్రీ శాకాంబరి దేవి జయంతి, శివ ముక్కోటి, అన్వధన శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Pushya Poornami, Shankambari Poornami, Shri Shakambari Devi Jayanti, Shiva Mukkoti, Anvadhana Wishes to all 🌹

Prasad Bhardwaj



పుష్య పూర్ణిమ ని శాంకంబరీ పౌర్ణమి అంటారు. ఈ రోజును శాకాంబరి జయంతిగా జరుపుకుంటారు. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటిగా చెబుతారు. అందువల్ల ఈ పౌర్ణమిని శివ ముక్కోటిగా కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శాకాంబరి దేవిని దుర్గా అవతారంగా భావిస్తారు. పుష్యపౌర్ణమికే పౌషీ అనే పేరు. అన్వధన అని కూడా అంటారు. ఈ రోజున వస్త్రదానం చేయడం మంచిది అని పండితులు చెబుతారు.

🌹 శాకంబరి మూల మంత్రం 🌹

"ఓం అం శాం శాకంభరీ-దేవ్యై నమః."

శాకంభరీ దేవి మంత్రం, పోషణ మరియు మొత్తం శ్రేయస్సును అందిస్తుంది మరియు అడ్డంకులు మరియు బాధలను తొలగిస్తుందని నమ్ముతారు. ఒకరు మనుగడ భయాన్ని దాటి, జీవితంలో ఉన్నతమైన లక్ష్యం కోసం ప్రయత్నించవచ్చు, శాకంభరీ దేవి ఆధ్యాత్మిక శక్తితో ఆనందకరమైన ఆత్మ స్థితిని సాధించడం సాధ్యం అవుతుంది.

మంత్రాలకు తార్కిక మనస్సును ఆకర్షించే అర్థాలు మాత్రమే ఉండవు, కానీ ప్రతి అక్షరం యొక్క శబ్దం కూడా మన శరీరంలో కొన్ని ప్రతిధ్వనులను సృష్టిస్తుంది. శాకంభరీ దేవి మంత్రాన్ని పఠించడం వల్ల మనలో ఒక రకమైన ప్రతిధ్వని కలుగుతుంది, దాని ద్వారా మనం ఆధ్యాత్మిక పోషణను పొందుతాము.

🍀 శాకంబరి దేవి ఆశీర్వాదం కోసం మరొక మంత్రం 🍀

"ఓం అం శం శాకంభరీ-దేవ్యై సకల-స్థావరా జంగమ-రక్షకీ ధన-ధాన్య వృత్తి-కారిణ్యై నమః."

🙌 శాకంభరి దేవత అనుగ్రహం 🙌


తంత్ర-మంత్రాన్ని కోరుకునే వారు సాధనకు శాకంభరి దేవత అనుగ్రహం కోరుకుంటారు. తల్లి శాకంభరి తన శరీరం నుండి ఉత్పత్తి చేయబడిన కూరగాయలు, పండ్లు, మూలాలు మొదలైన వాటితో ప్రపంచాన్ని పోషించింది. ఈ కారణంగా, మాతా 'శాకంభరి' పేరుతో ప్రసిద్ది చెందింది. తంత్ర-మంత్ర నిపుణుల దృష్టిలో తంత్ర-మంత్ర సాధనకు శాకంబరి నవరాత్రి చాలా అనుకూలంగా భావిస్తారు. పౌష్య మాసం యొక్క ప్రకాశవంతమైన పక్షం ఎనిమిదవ రోజున శాకంభరి నవరాత్రి పండుగ ప్రారంభమవుతుందని గ్రంథాల ప్రకారం. మాతా శాకంభరి జయంతిని పౌర్ణమి తేదీన జరుపుకుంటారు. దుర్గా అవతారాలలో శకభరి ఆదిశక్తి దేవత ఒకటి. దుర్గా యొక్క అన్ని అవతారాలలో, రక్తదంతిక, భీముడు, భ్రమరి, శకంభరి ప్రసిద్ధి చెందారు. శాకాంబరి దేవి యొక్క వివరణ శ్రీ దుర్గసప్తశతిలో వస్తుంది. శాకాంబరి దేవిని పూజించే వారి ఇళ్లలో ఆహారం నిండి ఉంటుందని చెబుతారు.

🍓 శాకంబరి దేవి అవతారం కథ 🍓

పురాతన కాలంలో భూమి ఎండిపోయినప్పుడు మరియు వంద సంవత్సరాలు వర్షాలు లేనప్పుడు, చుట్టూ కరువు కారణంగా గందరగోళం ఏర్పడింది. భూమి యొక్క అన్ని జీవులు నీరు లేకుండా దాహంతో చనిపోవడం ప్రారంభించాయి మరియు అన్ని మొక్కలు మరియు వృక్షాలు ఎండిపోయాయి. ఈ సంక్షోభ సమయంలో, అందరూ కలిసి భగవతిదేవిని ఆరాధించారు. ఆమె భక్తుల పిలుపు విన్న దేవత భూమిపై శాకంభరిగా అవతరించి భూమిని వర్షపునీటితో తడిపింది. ఇది భూమిపై జీవితాన్ని తిరిగి పుంజుకుంది. చుట్టూ పచ్చదనం ఉంది. అందువల్ల, ఈ దేవత యొక్క అవతారాన్ని శాకంభరిగా పూజిస్తారు మరియు ఈ రోజును శాకంభరి పూర్ణిమ లేదా శాకంభరి జయంతిగా జరుపుకుంటారు.

పుష్యమాసం శనిభగవానుడికి శనీశ్వరుడికి చాలా ఇష్టం. పౌర్ణమి తిథి శని వారం.. పుష్య మాసం లో వచ్చిదంటే పురాణాల ప్రకారం ఆరోజుకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ ఏడాది ( 2026) జనవరి 3 వ తేది శనివారం పుష్య పౌర్ణమి తిథి వచ్చింది. ఆ రోజున శని భగవానుడి పూజించి నల్లనువ్వులు దానంతో పాటు శ్రీ మహా విష్ణువు, లక్ష్మిని పూజించడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో ఆనందం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹