🍀 06, JANUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🍀

🌹🍀 06, JANUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 06, JANUARY 2023 FRIDAY, శుక్రవారం, బృగు వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 307 / Bhagavad-Gita -307 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -27వ శ్లోకము.
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 154 / Agni Maha Purana - 154 🌹 🌻. చతుర్వింశతి మూర్తి స్తోత్రము - 1 / Adoration of twenty-four forms of Viṣṇu - 1🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 019 / DAILY WISDOM - 019 🌹 🌻 19. అనంత భూమా ఒక్కడే సర్వోత్కృష్టుడు / 19. The Infinite Bhuma Alone Hails Supreme🌻  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 284 🌹
6) 🌹. శివ సూత్రములు - 21 / Siva Sutras - 21 🌹 🌻 7. జాగ్రత్ స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః. - 1 / 7. Jāgrat svapna suṣupta bhede turyābhoga sambhavaḥ. - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹06, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : పౌష్య పౌర్ణమి, శాకంబరి పౌర్ణమి, Paush Purnima, Shakambhari Purnima
🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -26 🍀*

26. ప్రణతాఖిల దేవ పదాబ్జయుగే 
భువనాఖిల పోషణ శ్రీవిభవే ।
నవపఙ్కజహార విరాజగలే
శరణం శరణం గజలక్ష్మి నమః ॥

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : శాంతి సాధనోపాయం - అంతరంగపు ఆగాధ తలాలలో నివసించడం నేర్చుకొని, బాహ్య ప్రవృత్తులు కేవలం తన ఉపరితలం లోనివిగా దర్శించ గల అనుభవం మానవుడు సంపాదించు కోవాలి. అంతవరకూ ఈ ప్రపంచంలో శాంతి అనేది దొరకడం దుర్ఘటం. ఒక వేళ దొరికినా అది స్థిరంగా వుండదు.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: పూర్ణిమ 28:38:06 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి 
నక్షత్రం: ఆర్ద్ర 24:14:16 వరకు
తదుపరి పునర్వసు
యోగం: బ్రహ్మ 08:11:16 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: విష్టి 15:25:53 వరకు
వర్జ్యం: 06:48:48 - 08:36:00
దుర్ముహూర్తం: 09:01:13 - 09:45:46
మరియు 12:43:57 - 13:28:30
రాహు కాలం: 10:58:09 - 12:21:41
గుళిక కాలం: 08:11:05 - 09:34:37
యమ గండం: 15:08:45 - 16:32:17
అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:43
అమృత కాలం: 13:04:00 - 14:51:12
మరియు 24:26:36 - 26:14:12
సూర్యోదయం: 06:47:33
సూర్యాస్తమయం: 17:55:49
చంద్రోదయం: 17:24:27
చంద్రాస్తమయం: 06:15:10
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య 
ప్రాప్తి 24:14:16 వరకు తదుపరి 
లంబ యోగం - చికాకులు, అపశకునం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 307 / Bhagavad-Gita - 307 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 27 🌴*

*27. ఇచ్చాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత |*
*సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప ||*

🌷. తాత్పర్యం :
*ఓ భరతవంశీయుడా! పరంతపా! కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులైన జీవులందరును మోహమునందే జన్మించుచున్నారు.*

🌷. భాష్యము :
శుద్ధజ్ఞానస్వరూపుడైన శ్రీకృష్ణభగవానుని అధీనమున ఉండుటయే జీవుని సహజస్థితియై యున్నది. అట్టి శుద్ధజ్ఞానము నుండి జీవుడు మోహముచే విడివడినప్పుడు మాయాశక్తి అధీనమునకు వచ్చి దేవదేవుని అవగతము చేసికొనజాల కుండును. 

అట్టి మాయాశక్తి కోరిక, ద్వేషములనెడి ద్వంద్వ రూపమున వ్యక్తమగుచుండును; అటువంటి కోరిక మరియు ద్వేషముల వలన మూర్ఖమానవుడు భగవానునితో ఏకము కావలెనని కోరి, శ్రీకృష్ణుడు భగవానుడన్న విషయమున ఈర్ష్యను పొందును. 

కోరిక, ద్వేషములచే అంటబడని మోహరహిత శుద్ధభక్తులు శ్రీకృష్ణభగవానుడు తన అంతరంగశక్తిచే ఆవిర్భవించునని తెలిసియుండగా, ద్వంద్వములు మరియు అజ్ఞానకారణముగా మోహరహితులైనవారు ఆ భగవానుడు భౌతికప్రకృతిచే సృజింపబడునని భావింతురు. అది వారి దురదృష్టము. 

భ్రాంతులైన అట్టి మానవులు “ ఈమె నా భార్య, ఇది నా ఇల్లు, నేను ఈ ఇంటికి యజమానిని, నేనీమెకు భర్తను” అని భావించుచు మానావమానములను, సుఖదుఃఖములు, స్త్రీపురుషులు, శుభాశుభములు అనెడి ద్వంద్వములలో మునిగియుందురు. 

ఇవియే మోహకారక ద్వంద్వములు. అటువంటివాటిచే మోహితులగువారు పూర్ణముగా మూఢులగుదురు. తత్కారణముగా వారు దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసికొనజాలరు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 307 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Yoga - 27 🌴*

*27. icchā-dveṣa-samutthena dvandva-mohena bhārata*
*sarva-bhūtāni sammohaṁ sarge yānti paran-tapa*

🌷 Translation : 
*O scion of Bharata, O conqueror of the foe, all living entities are born into delusion, bewildered by dualities arisen from desire and hate.*

🌹 Purport :
The real constitutional position of the living entity is that of subordination to the Supreme Lord, who is pure knowledge. 

When one is deluded into separation from this pure knowledge, he becomes controlled by the illusory energy and cannot understand the Supreme Personality of Godhead. 

The illusory energy is manifested in the duality of desire and hate. Due to desire and hate, the ignorant person wants to become one with the Supreme Lord and envies Kṛṣṇa as the Supreme Personality of Godhead. 

Pure devotees, who are not deluded or contaminated by desire and hate, can understand that Lord Śrī Kṛṣṇa appears by His internal potencies, but those who are deluded by duality and nescience think that the Supreme Personality of Godhead is created by material energies. This is their misfortune. 

Such deluded persons, symptomatically, dwell in dualities of dishonor and honor, misery and happiness, woman and man, good and bad, pleasure and pain, etc., thinking, “This is my wife; this is my house; I am the master of this house; I am the husband of this wife.” 

These are the dualities of delusion. Those who are so deluded by dualities are completely foolish and therefore cannot understand the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 154 / Agni Maha Purana - 154 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 48*

*🌻. చతుర్వింశతి మూర్తి స్తోత్రము - 1🌻*

హయగ్రీవుడు చెప్పెను. బ్రహ్మదేవా! ఓంకార రూపుడగు కేశవుడు తన హస్తములో (క్రింది కుడి చెయ్యి, పై కుడి చెయ్యి, పై ఎడమ చెయ్యి, క్రింద ఎడమ చెయ్యి అనుక్రమమున అని ఒక మతము, పై కుడి చెయ్యి మొదలు క్రింద కుడి చెయ్యి వరకును అని మరొక మతము) పద్మ-శంఖ-చక్ర-గదలను ధరించి యుండును. నారాయణుడు అదే వరుసలో శంఖ-పద్మ-గదా-చక్రములను ధరించును. ప్రదక్షిణ పూర్వకముగా ఆ భగవంతుని పాదములకు నమస్కరించుచున్నాను. 

మాధవుడు గదా-చక్ర-శంఖ-పద్మములను ధరించును. నే నాతనికి నమస్కరించుచున్నాను. గోవిందుడు చక్ర-గదా-పద్మ-శంఖములను ధరించును. బలశాలియై యుండును. శ్రీ విష్ణువు గదా- పద్మ-శంఖ-చక్రములను ధరించును. ఆతడు మోక్షప్రదాత మధుసూదనుడు శంఖ-చక్ర-పద్మ-గదలను ధరించును. నేనాతని ఎదుట భక్తితో వంగి నమస్కరించుచున్నాను. త్రివిక్రముడు పద్మ-గదా-చక్ర-శంఖములను ధరించును వామనుడు శంఖ-చక్ర-గదా-పద్మములతో ప్రకాశించుచుండును. అతడు సర్వాదా నన్ను రక్షించుగాక. 

శ్రీధరుడు కమల-శంఖ-చక్ర-శార్జధనస్సులను ధరించి యుండును. ఆతడు అందరికిని సద్గతి ఇచ్చువాడు. హృషీకేశుడు గదా-చక్ర -పద్మ-శంఖములను ధరించును. అతడు మనల నందరిని రక్షించుగాక. వరదాతయగు పద్మ నాభుడు శంఖ-పద్మ-చక్ర-గదలను ధరించును. దామోదరుడు పద్మ-శంఖ-గదా-చక్రములు ధరించి విరాజిల్లు చుండును. ఆతనికి నమస్కరించుచున్నాను. 

గదా-శంఖ-చక్ర-పద్మ ధారియైన వాసుదేవుడు సంపూర్ణ జగమును సృజించెను. గదా. శంఖ-పద్మ-చక్రములను ధరించిన సంకర్షణుడు క్షమ్ముల నందరిని రక్షించుగాక.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 154 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 48
*🌻Adoration of twenty-four forms of Viṣṇu - 1 🌻*

The Lord said:

1. Keśava of the form of (syllable) Oṃ bears the lotus, conch, disc and mace. Nārāyaṇa (bears) the conch, lotus, mace and disc. Circumambulation to Him.

2. Then I salute Madhava, who bears the mace, disc, conch and lotus. Govinda wields the disc, the Kaumodakī (name of a mace), lotus and conch.

3. Viṣṇu, the bearer of the disc, the mace, lotus and conch is the bestower of emancipation. I salute Madhusūdana, who bears the conch, disc, lotus and mace.

4. (I prostrate) with devotion (at the feet of) Trivikrama who bears the lotus, mace, disc and conch. May Vāmana, the bearer of the conch, disc, mace and lotus protect me always.

5. Śrīdhara who holds a lotus, disc, bow and also the conch yields emancipation. Hṛṣīkeśa wields the mace, disc, lotus and conch. May He protect us.

6. And Padmanābha (is one) who yields boons and who holds the conch, lotus, disc and mace, (I salute him). Dāmodara (is one) who holds a lotus, conch, mace and disc. I salute him.

7. May Vāsudeva, who wields a mace, conch, disc and lotus (protect) the universe. May Saṅkarṣaṇa, who holds a mace, conch, lotus and disc protect us.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 19 / DAILY WISDOM - 19 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 19. అనంత భూమా ఒక్కడే సర్వోత్కృష్టుడు 🌻*

*ఉపనిషత్తులు బహుత్వం మరియు ద్వంద్వత్వం ఉన్న వాస్తవికతలను తిరస్కరించాయి. వాటి ప్రకారం, అద్వైత బ్రాహ్మణం తప్ప, మరేమీ లేదు. విశ్వం వారిచే భగవంతుని యొక్క ఊహగా వివరించబడింది. ఈ వివరణ కేవలం అలంకారికమే. మానవులకు అర్థం కావడం కోసం ఇలా వివరించారే తప్ప నిజంగా ఇలాగే ఉందని కాదు.*

*అనంత భూమా ఒక్కడే సర్వోన్నతుడు. ఇది దాని స్వంత గొప్పతనంపై స్థాపించబడింది. ఇది దేనిపైనా ఆధారపడదు, ఎందుకంటే మరేదీ లేదు. పరమాత్మలో కల్పన ఉండే ఆస్కారమే లేదు. కల్పన యొక్క గాఢతలో తేడా ఉండవచ్చు, కానీ ఈ వ్యత్యాసాలు కూడా ఊహలే. అటువంటి వ్యత్యాసాలు ఉన్నాయని భావించడం కూడా తప్పు. వస్తువులు బాహ్యంగా ఉన్నాయని బలంగా భావించడం వల్ల అవి ఉన్నట్లు గోచరిస్తాయి.*

కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 19 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 19. The Infinite Bhuma Alone Hails Supreme 🌻*

*The Upanishads deny the reality of the form of the world of plurality and duality. According to them, except the non-dual Brahman, nothing is. The universe is explained by them as the imagination of the Absolute-Individual. We can only understand that this Absolute imagination is merely figurative and it can have meaning only with reference to individuals in the world, and not in itself.*

*The infinite Bhuma alone hails supreme. It is established on its own Greatness. It is not dependent on anything else, for anything else is not. There cannot be imagination in the Absolute. Imagination may differ in degree or intensity, but even these degrees are but imagination. Even the acceptance of such a difference is ultimately invalid. The experience of external objects depends on the strong belief that they exist.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 284 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నవ్వుతూ, ఆడుతూ పాడుతూ వుండు. సాధారణ జీవితం గడుపు, వినయ మార్గంలో సాగు. ఎట్లాంటి కోరికలూ లేకుండా, ఏదో కావాలని అనుకోకుండా వుండు. ఏదో సాధించాలనుకోకు. ఎందుకంటే జీవితం దాని సాధారణ స్థాయిలో ఎంతో అద్భుతమైంది. 🍀*

*ఆనందించ గలిగిన వ్యక్తికి టీ తాగడం కూడా ప్రార్థనలాంటిదే. ఉత్సాహం నూతన దృష్టి నిస్తుంది. కొత్త కోణాన్ని చూపుతుంది. అది సమస్త ప్రపంచాన్ని రూపాంతం చెందిస్తుంది. కట్టెలు కొట్టడం. నీళ్ళు తోడడం చాలా గొప్ప పనులతో సమానమయినవే. కాబట్టి దిగులుగా వుండకు, సీరియస్ గా వుండకు.*

*నవ్వుతూ, ఆడుతూ పాడుతూ వుండు. సాధారణ జీవితం గడుపు, వినయ మార్గంలో సాగు. ఎట్లాంటి కోరికలూ లేకుండా, ఏదో కావాలని అనుకోకుండా వుండు. ఏదో సాధించాలనుకోకు. ఎందుకంటే జీవితం దాని సాధారణ స్థాయిలో ఎంతో అద్భుతమైంది. అక్కడ ఎట్లాంటి అభివృద్ధి అయినా దాని సాధారణ సౌందర్యాన్ని నాశనం చేస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 021 / Siva Sutras - 021 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 7. జాగ్రత్ స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః. - 1 🌻*
*🌴. మెలకువ (జాగ్రత్), స్వప్న (స్వప్న), గాఢమైన నిద్ర (సుషుప్త) వంటి విభిన్న స్థితులలో కూడా నాల్గవ స్థితి తుర్య యొక్క పారవశ్యం, ఆనందం ఉంది. 🌴*

*చైతన్యం యొక్క మూడు దశలు ఉన్నాయి, జాగ్రత్, (సాధారణ క్రియాశీల దశ, లేదా మేల్కొలుపు దశ) స్వప్న (కలల దశ) మరియు సుషుప్తి (గాఢ నిద్ర దశ). ఈ మూడు దశలు మనిషి యొక్క సాధారణ చైతన్య స్థాయి. సాధారణ చైతన్యం యొక్క ఈ మూడు స్థాయిలకు మించి, చైతన్యం యొక్క మరో రెండు స్థాయిలు ఉన్నాయి.*

*ఈ రెండింటిలో, ఈ సూత్రం తుర్య అని పిలువబడే నాల్గవ స్థాయి చైతన్యం గురించి చర్చిస్తుంది. అభోగ అంటే పారవశ్య దశ. (అభోగ అంటే భోగము లేనిది). సంభవః అంటే ఉన్నది. ఈ సూత్రం చైతన్యం యొక్క మొదటి మూడు దశలలో, నాల్గవ దశ చైతన్యం కూడా, అంటే పారవశ్యపూరితమైన తుర్యము సైతం ఉనికిలో ఉందని చెబుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 021 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻7. Jāgrat svapna suṣupta bhede turyābhoga sambhavaḥ. - 1 🌻*
*🌴. During different states of consciousness as waking (jāgrat), dreaming (svapna), profound sleep (suṣupta), there is the delight and enjoyment of the Fourth State Turya 🌴*

*There are three stages of consciousness, jāgrat, (normal active stage, or stage of awakening) svapna (dream stage) and suṣupti (deep sleep stage). These three stages are the normal level consciousness of a man. Bheda means difference. Beyond these three levels of normal consciousness, there are two more levels of consciousness.*

*Out of these two, this sūtrā discusses about the fourth level of consciousness known as turya. Ābhoga (आभोग) means ecstatic stage (abhoga अभोग means non-enjoyment). Sambhavaḥ means existing. This sūtrā says that even during the first three stages of consciousness, the fourth stage of consciousness, the ecstatic turya exists.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀

🌻 422. 'సంధ్యా' - 3🌻


ద్రౌపతి స్వయంవరమునకు పూర్వ ఘట్టమున పాండవులు ఏకఛత్రపురము నుండి పాంచాల రాజధాని కేగుచుండగ సాయంసంధ్య సమీపించినది. పాంచాలము చేరవలెనను ఆతురతలో వారు సాయం సంధ్యాదికములను గావింపక సాగుచుండిరి. అపుడు గంధర్వుడొకడు విల్లును ధరించి అర్జునుని యుద్దమునకై రెట్టించెను. అర్జునుడు అనుపమానమగు ధనుర్విద్యా పారంగతుడైననూ యుద్ధమున ఓడిపోయెను. అతడు అవమానముతో క్రుంగెను. అపుడు గంధర్వుడు అర్జునుని సమీపించి యిట్లనెను. “నీవు నిజమునకు అజేయుడవు. విజయుడవు. నీవు యుద్ధమున ఓడుటకు కారణము సాయం సంధ్యయందు ఆరాధన గావించక పోవటమే. అందువలన బలహీనుడవైతివి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻

🌻 422. 'Sandhya' - 3🌻

On the eve of Draupadi's Swayamvara, the Pandavas were approaching the capital of the Panchalas, from Ekachhatrapuram in the evening. In their haste to reach Panchala, they ignored the dusk rituals and continued travel. Then, one Gandharva called on Arjuna for a one on one battle. Even though Arjuna was an expert in archery, he was defeated in the battle. He was disappointed and ashamed. Then Gandharva approached Arjuna and said. 'You are, infact, invincible. The reason why you lost the battle was because you did not perform the dusk salutations( sandhyavandana). Therefore, you became weak.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 288. వదిలి పెట్టడం / Osho Daily Meditations - 288. LETTING GO


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 288 / Osho Daily Meditations - 288 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 288. వదిలి పెట్టడం 🍀

🕉. ఎలా వదిలేయాలో తెలిసిన తర్వాత, మొదటిసారి జీవితం జరగడం ప్రారంభమవుతుంది. మనం దేనినైనా సాధించాలని అనవసరంగా ప్రయత్నిస్తున్నాము, వాస్తవానికి, దానిని సాధించడానికి చేసే ప్రయత్నమే ఆటంకం. 🕉


జీవితం సంభవిస్తుంది - దానిని సాధించలేము. దాని కోసం ఎంత ఎక్కువ కష్టపడతాడో అంత తక్కువ జరుగుతుంది. దానికి ఎక్కడకి వెళ్లవలసిన అవసరం లేదు; అది దానికదే వస్తుంది. కావలసిందల్లా గ్రహణశక్తి, బహిరంగత యొక్క మొత్తం స్థితి. జీవితానికి ఆతిథ్యమివ్వాలి. జీవితాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు. వెంబడించడంలో దుఃఖం ఉంది; మీరు దానిని ఎంత ఎక్కువగా వెంబడిస్తే, అది అంత దూరం వెళుతుంది. జీవితం అన్నింటినీ కలిగి ఉంటుంది. అందులో భగవంతుడు ఉన్నాడు, అందులో ఆనందం ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది, అందం, మంచి, నిజం, మీరు దేనిని పిలవాలనుకున్నా-అన్నీ దానిలో ఉన్నాయి; జీవితం తప్ప మరొకటి లేదు. జీవితం అనేది ఉనికి యొక్క సంపూర్ణత పేరు.

ఓపికగా విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోండి. ఆపై అద్భుతాల ఆవిష్కరణ జరుగుతుంది: ఒకరోజు మీరు నిజంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఏదో మార్పు వస్తుంది. ఒక తెర అదృశ్యమవుతుంది మరియు మీరు అన్నింటినీ ఉన్నట్లుగా చూస్తారు. మీ కళ్ళు చాలా ఆశయాలు, నిరీక్షణలు, కోరికలతో నిండి ఉంటే, సత్యాన్ని చూడలేరు. కళ్ళు కోరికల ధూళితో కప్పబడి ఉన్నాయి. అన్వేషణ అంతా వ్యర్థం. శోధన అనేది మనస్సు యొక్క ఉప ఉత్పత్తి. అన్వేషణ లేని స్థితిలో ఉండటం పరివర్తన యొక్క గొప్ప క్షణం. ధ్యానాలన్నీ ఆ క్షణం కోసం సన్నాహాలు మాత్రమే. అవి నిజమైన ధ్యానాలు కావు, కేవలం సన్నాహాలు కాబట్టి సాధ్యం అవడానికి ఒక రోజు మీరు ఏమీ చేయకుండా, ఏమీ కోరుకోకుండా కూర్చోవాలి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 288 🌹

📚. Prasad Bharadwaj

🍀 288. LETTING GO 🍀

🕉. Once one knows how to let go, for the first time life starts happening. We are unnecessarily striving to attain something, in fact, the very effort to attain it is the hindrance. 🕉


Life happens-it cannot be attained. The more one strives for it, the less one has it. One need not go to it; it comes on its own. All that is needed is a total state of receptivity, of openness. One has to become a host to life. Life need not be chased. In chasing is misery; the more you chase it, the farther away it goes. And life contains all. It contains God, it contains bliss, it contains benediction, it contains beauty, good, truth, whatever you want to call it-it contains all; there is nothing other than life. Life is the name of the totality of existence. One has to learn to be patiently relaxed, and then the miracle of miracles happens.

One day when you are really relaxed, something suddenly changes. A curtain disappears, and you see things as they are. If your eyes are too full of desires, expectation, longing, they cannot see the truth. The eyes are covered with the dust of desire. All search is futile. Search is a byproduct of the mind. To be in a state of nonsearch is the great moment of transformation. All the meditations 'are just preparations for that moment. They are not real meditations but just preparations so that one day you can simply sit, doing nothing, desiring nothing.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 667 / Sri Siva Maha Purana - 667


🌹 . శ్రీ శివ మహా పురాణము - 667 / Sri Siva Maha Purana - 667 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴

🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 5 🌻

అపుడు దేవతలు, గణములు మరియు అప్సరసలు ఆనందముతో వాద్యములను మ్రోగించి ఆడి పాడిరి (33). అపుడు మహాత్ముడు, మంగళకరుడు అగు శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఆ గణేశునకు మరల వరము నిచ్చెను (34). ఓ గణేశా! నీవు భాద్రపద కృష్ణ చతుర్థి నాడు చంద్రోదయ శుభకాలమున జన్మించితివి (35). పవిత్ర మనస్కురాలగు గిరిజ నుండి మొదటి జాములో నీ రూపము ఆవిర్భవించెను గాన, నీ వ్రతము ఉత్తమమైనది (36).

కావున సర్వము సిద్దించుట కొరకై అదే తిథినాడు ఆరంభించి శుభకరమగు వ్రతమును ఆనందములో శ్రద్ధతో అనుష్ఠించవలెను (37). నా ఆజ్ఞచే, మరల సంవత్సరము తరువాత చతుర్థీ తిధి వచ్చువరకు నీ ఈ వ్రతమును చేయవలెను (38). సంసారము నందు సాటిలేని అనేక సుఖములను ఎవరు గోరెదరో, వారు నిన్ను చవితి నాడు భక్తితో యథావిధిగా పూజించవలెను (39). మార్గశీర్ష కృష్ణ చతుర్థినాడు ఉదయమే స్నానము చేసి వ్రతమునాచరించి బ్రాహ్మణులకు భోజనము నిడవలెను (40).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 667🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴

🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 5 🌻


33. The gods, the Gaṇas and the celestial damsels sang songs joyously, danced and played on instruments.

34. Another boon was granted to Gaṇeśa by the delighted Śiva of great soul.

35-37. O Gaṇeśa, you are born in the first Prahara on the fourth day in the dark half of the Bhādra mouth at the auspicious hour of the moonrise. Since your form manifested itself from the good mind of Pārvatī, your excellent Vrata shall be performed on that Tithi itself or beginning from that day. It will be very auspicious and conducive to the achievement of all Siddhis.

38. At the bidding of us both the Vrata shall be performed till the fourth day at the end of a year.

39. Let those who yearn for unequalled happiness in the world worship you devoutly in various ways on the fourth day in accordance with the rules.

40. On the fourth day of Lakṣmī in the month of Mārgaśīrṣa he shall perform early morning ablution and entrust the Vrata to the brahmins.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 706 / Vishnu Sahasranama Contemplation - 706


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 706 / Vishnu Sahasranama Contemplation - 706🌹

🌻706. సంనివాసః, संनिवासः, Saṃnivāsaḥ🌻

ఓం సన్నివాసాయ నమః | ॐ सन्निवासाय नमः | OM Sannivāsāya namaḥ


యస్సతామాశ్రయో విష్ణుః సన్నివాస ఇతీర్యతే

'సత్‍' అనబడు తత్త్వజ్ఞులకు, విద్వాంసులకు ఆశ్రయము గనుక విష్ణువు సంనివాసః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 706🌹

🌻706. Saṃnivāsaḥ🌻

OM Sannivāsāya namaḥ


यस्सतामाश्रयो विष्णुः सन्निवास इतीर्यते / Yassatāmāśrayo viṣṇuḥ sannivāsa itīryate

Since Lord Viṣṇu is the refuge of those who are sat i.e., the learned - He is called Saṃnivāsaḥ.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr‌tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

కపిల గీత - 114 / Kapila Gita - 114


🌹. కపిల గీత - 114 / Kapila Gita - 114🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 70 🌴

70. చిత్తేన హృదయం చైత్యః క్షేత్రజ్ఞః ప్రావిశద్యదా|
విరాట్తదైవ పురుషః సలిలాదుదతిష్ఠత॥

కాని, చిత్తము యొక్క అధిష్ఠాన దేవతయైన వాసుదేవుడు క్షేత్రజ్ఞ రూపములో చిత్తముతో గూడి హృదయము నందు ప్రవేశించినంతనే విరాట్ పురుషుడు జలము నుండి బహిర్గతుడై వచ్చి నిలబడెను.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 114 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 70 🌴


70. cittena hṛdayaṁ caityaḥ kṣetra-jñaḥ prāviśad yadā
virāṭ tadaiva puruṣaḥ salilād udatiṣṭhata

However, when the inner controller, the deity presiding over consciousness, entered the heart with reason, at that very moment the Cosmic Being arose from the causal waters.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

05 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹05, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺

🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 22 🍀


22. త్వత్కింకరాలం కరణోచితానాం
త్వయైవ కల్పాంతర పాలితానాం

మంజుప్రణాదం మణినూపురం తే
మంజూషికాం వేదగిరాం ప్రతీమః ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : గాయత్రీ మంత్రాన్ని అర్థభావన సహితంగా ధ్యానం చెయ్యి. మనస్సును నిశ్చల మొనర్చుకొని నీకిష్టమైన దేవతా స్వరూపాన్ని స్మరించు. సత్య తేజస్సును భరించే సామర్థ్యం నీ కలవరచు నట్లుగా ఆ ఇష్టదేవతను ప్రార్థించు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్, హేమంత ఋతువు,

దక్షిణాయణం, పౌష్య మాసం

తిథి: శుక్ల చతుర్దశి 26:15:09

వరకు తదుపరి పూర్ణిమ

నక్షత్రం: మృగశిర 21:26:59

వరకు తదుపరి ఆర్ద్ర

యోగం: శుక్ల 07:34:18 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: గార 13:07:14 వరకు

వర్జ్యం: 01:01:38 - 02:48:06

మరియు 30:48:48 - 32:36:00

దుర్ముహూర్తం: 10:29:55 - 11:14:27

మరియు 14:57:06 - 15:41:37

రాహు కాలం: 13:44:44 - 15:08:14

గుళిక కాలం: 09:34:16 - 10:57:45

యమ గండం: 06:47:16 - 08:10:46

అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:43

అమృత కాలం: 11:40:26 - 13:26:54

సూర్యోదయం: 06:47:16

సూర్యాస్తమయం: 17:55:13

చంద్రోదయం: 16:33:13

చంద్రాస్తమయం: 05:22:15

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: మృత్యు యోగం - మృత్యు

భయం 21:26:59 వరకు తదుపరి

కాల యోగం - అవమానం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹