🌹 . శ్రీ శివ మహా పురాణము - 667 / Sri Siva Maha Purana - 667 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴
🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 5 🌻
అపుడు దేవతలు, గణములు మరియు అప్సరసలు ఆనందముతో వాద్యములను మ్రోగించి ఆడి పాడిరి (33). అపుడు మహాత్ముడు, మంగళకరుడు అగు శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఆ గణేశునకు మరల వరము నిచ్చెను (34). ఓ గణేశా! నీవు భాద్రపద కృష్ణ చతుర్థి నాడు చంద్రోదయ శుభకాలమున జన్మించితివి (35). పవిత్ర మనస్కురాలగు గిరిజ నుండి మొదటి జాములో నీ రూపము ఆవిర్భవించెను గాన, నీ వ్రతము ఉత్తమమైనది (36).
కావున సర్వము సిద్దించుట కొరకై అదే తిథినాడు ఆరంభించి శుభకరమగు వ్రతమును ఆనందములో శ్రద్ధతో అనుష్ఠించవలెను (37). నా ఆజ్ఞచే, మరల సంవత్సరము తరువాత చతుర్థీ తిధి వచ్చువరకు నీ ఈ వ్రతమును చేయవలెను (38). సంసారము నందు సాటిలేని అనేక సుఖములను ఎవరు గోరెదరో, వారు నిన్ను చవితి నాడు భక్తితో యథావిధిగా పూజించవలెను (39). మార్గశీర్ష కృష్ణ చతుర్థినాడు ఉదయమే స్నానము చేసి వ్రతమునాచరించి బ్రాహ్మణులకు భోజనము నిడవలెను (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 667🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴
🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 5 🌻
33. The gods, the Gaṇas and the celestial damsels sang songs joyously, danced and played on instruments.
34. Another boon was granted to Gaṇeśa by the delighted Śiva of great soul.
35-37. O Gaṇeśa, you are born in the first Prahara on the fourth day in the dark half of the Bhādra mouth at the auspicious hour of the moonrise. Since your form manifested itself from the good mind of Pārvatī, your excellent Vrata shall be performed on that Tithi itself or beginning from that day. It will be very auspicious and conducive to the achievement of all Siddhis.
38. At the bidding of us both the Vrata shall be performed till the fourth day at the end of a year.
39. Let those who yearn for unequalled happiness in the world worship you devoutly in various ways on the fourth day in accordance with the rules.
40. On the fourth day of Lakṣmī in the month of Mārgaśīrṣa he shall perform early morning ablution and entrust the Vrata to the brahmins.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment