🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 548 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀
🌻 548. 'విమర్శరూపిణీ’ - 3 🌻
విమర్శరూపిణిగ మనలో వుండి మనకు సదసద్వివేకము గావించునది శ్రీమాతయే. సత్యము-అసత్యము, శాశ్వతము-అశాశ్వతము, ధర్మము-అధర్మము ఇత్యాది విచక్షణ, వివేకము స్వయం విమర్శ వలననే తెలియును. స్వయం విమర్శ కలవాడు దారి మళ్ళక జీవితమున పయనించి జీవన గమ్యమును చేరును. ఇట్లు విమర్శ రూపిణిగా శ్రీమాత జీవులలో నుండియే జీవులను సంరక్షించుకొను చుండును.
ఆత్మజ్ఞానము కూడ ఆత్మవిచారముచే జరుగును. ఆత్మవిచారము నకు ఊహ అవసరము. ఊహ విమర్శ యందలి భాగమే. ఊహ లేనివారు ఉన్నతి చెందుట దుస్సాధ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻
🌻 548. 'Vimarsharupini' - 3 🌻
It is Sri Mata who is the form of reflection within us and gives us wisdom. Truth and falsehood, eternity and impermanence, righteousness and unrighteousness, etc., are known only through self-reflection. A self-critic will not deviate from his path and will reach the goal of life. In this form of reflection, Sri Mata protects living beings being among them.
Self-awareness also happens through self-enquiry. Self-reflection requires imagination. Imagination is part of reflection. It is impossible for those without imagination to rise.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹