శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 342-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 342 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 342-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 342 -1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀


🌻 342-1. 'క్షేత్రేశీ' 🌻


క్షేత్రములకు ఈశ్వరి శ్రీమాత అని అర్థము. సృష్టి క్షేత్రములకు, జీవుల క్షేత్రములకు ఈశ్వరి శ్రీమాతయే. పంచభూతాత్మక మగు సృష్టి క్షేత్రమును, జీవుల క్షేత్రములను త్రిగుణములతో వర్తింపజేయుచు అష్ట ప్రకృతులను అధిష్ఠించి సమస్తమును నిర్వర్తించుచునుండును. ఆమె నుండియే క్షేత్రము లన్నియూ యేర్పడినవి కనుక ఆమెయే వానికి ఈశ్వరి. జీవులు కూడ ఆమె ఈశ్వరీతత్త్వము నెరిగి ఆమెను ఆశ్రయించినచో క్రమముగ అష్ట ప్రకృతులు సహకరించ గలవు.

జీవులు స్వతహాగ ప్రకృతి అధీనులు. ప్రకృతిపై స్వామిత్వమునకు వారు ప్రయత్నించుట అహంకరించుటయే. ప్రకృతితో సహకరించి స్నేహ సంబంధ మేర్పరచుకొన్నచో ప్రకృతి అనుకూలింప గలదు. అజ్ఞాన అహంకారముతో విఱ్ఱవీగు వారికి ప్రకృతి ప్రతికూలించును. అపుడు పరిసరములు, తమ తమ దేహములు కూడ తమకు ప్రతికూలమై నిలచును. ప్రకృతిని జీవులు ఎదురించి నిలువలేరు. ప్రకృతి సహకారముతో ఈశ్వర జ్ఞానము నిలచి ఈశ్వర సాన్నిధ్యమున స్థిరపడగలరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 342-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻


🌻 342-1. Kṣtreśī क्ष्त्रेशी (342) 🌻


Wife of Kṣetrajña (Śiva) is Kṣtreśī (Śaktī). It is like Bhairava and Bhairavī. It must always be remembered that there is no difference between Śiva and Śaktī. Or it may also be said that She is the Īśvarī of all kṣetra-s (possible extension of the previous nāma).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


22 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 138


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 138 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సదవగాహన - 2 🌻


విచిత్రమేమనగా, ఇతరుల యందు, తాను తెలివి గల వాడననుకొను మానవుడు ఏ దోషమును గమనించు చుండునో, ఆ దోషము తన యందే దృఢముగా దాగి యుండును.

జుగుప్స వలన, మానవుడు వివేకమను చూపును కోల్పోయి, గ్రుడ్డి వాడగును. తనకు, ఒరులకు అడ్డుగోడలను కట్టుకొని వారితో సంఘర్షణకు తలపడును. దానితో భయభ్రాంతుడై, వినాశమును గొని‌ తెచ్చుకొను వాడగును.

ఒకసారి మనస్సు నందు ఇతరులపై దోషారోపణ చేయు తలంపు జనింపగనే, దానిని కొనసాగనీయక, వారిపై ప్రేమ, దయలను అనుభవించి, వారిని సదవగాహన చేసికొనుటకు యత్నింప వలెను. దానితో జుగుప్స క్రమముగా అదృశ్యమగును.


....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


22 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 508


🌹 . శ్రీ శివ మహా పురాణము - 508 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 42

🌻. పెళ్లి వారికి ఎదురేగుట - 3 🌻


ఓ నారదా! మునులు, దేవతలు, ఇతరులు సర్వులు శివునితో బాటు వెళ్లు చున్నవారై, హిమవంతుని నగరమునకు పెక్కు భంగుల కొనియాడ జొచ్చిరి (20).

హిమవంతుడు దేవతలను, ఇతరులను తీర్చిదిద్దిన సుందరమగు శిఖరముపై నిలిపి, వివాహ వేదిక ఉన్న స్థలమునకు వెళ్లెను (21). నాల్గు స్తంభములతో తోరణములతో కూడి యున్న ఆ వేదికను పరీక్షించెను (22). మరియు పర్వతశ్రేష్టుడగు హిమవంతుడు తన పుత్రులను విష్ణువు మొదలగు వారందరితో కూడియున్న శివుని సమీపమునకు పంపెను (23). మహానందముతో కూడియున్న వాడు, బంధువులందరితో కలసి యున్నవాడు అగు పర్వతరాజు వరుని ఆహ్వానించే కార్యమును మహోత్సవముగా చేయదలంచెను (24).

అపుడా హిమవంతుని పుత్రులు అచటకు వెళ్లి తన వారితో కూడి యున్న శివునకు ప్రణమిల్లి హిమవంతుని ఆ ప్రార్థనను గురించి చెప్పిరి (25). అపుడా హిమవంతుని పుత్రులు శివుని ఆజ్ఞను బొంది తమ గృహమునకు వెళ్లి శివుడు, ఇతరులు వచ్చుచున్నారని ఆనందముతో పర్వత రాజగు హిమవంతునకు చెప్పిరి (26). ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలు, మరియు శివుడు హిమవంతుని ఆ ప్రార్థనను విని మిక్కిలి ఆనందించిరి (27). దేవతలు, మునులు, గణములు అందరు చక్కని వేషములను ధరించి శివునితో కలిసి హిమవంతుని గృహమునకు వెళ్లిరి (28).

ఆ సమయములోమేన శివుని చూడ గోరెను. ఓ మునీ! ఆమె హిమవంతుని సేవకుని చే మహర్షి శ్రేష్ఠుడవగు నిన్ను పిలిపించెను (29). ఓ మునీ! శివుడు వెళ్లుమని నిన్ను ప్రేరేపించెను. శివుని హృదయములోని ఆకాంక్షను పూర్ణము చేయగోరి నీవు వెళ్లితివి (30). శంకర ప్రభుని గర్వాపహారకమగు రూపమును చూడగోరినది, విస్మయమును పొందిన మనస్సు గలది అగు మేన నీకు నమస్కరించి ఇట్లు పలికెను (31).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో దేవగిరుల కలయిక అనే నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


22 Jan 2022

గీతోపనిషత్తు -310


🌹. గీతోపనిషత్తు -310 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -3 📚

🍀 21-3. జనన మరణ చక్రము - పుణ్య వ్యయమునకు కాలము శీఘ్రమై యున్నది. పుణ్యమార్జించుటకు కాలము అతి నెమ్మదిగ గోచరించును. ఆరు గంటలు వరుసగ పని చేయుటకును, ఆరు గంటలు నిద్రించుటకును గల వ్యత్యాసమే పుణ్యమార్జించుటకును, వెచ్చించుటకును గల వ్యత్యాసము. వంద సంవత్సరముల శ్రమకు మూడు నెలల పదిరోజుల అనుభూతి! ఇది తెలియక స్వర్గసుఖములు కోరువారు అనంత కాలము శ్రమపడుచు నుందురు. ఇది నిజమునకు లాభసాటి వ్యాపారము కాదు. కామ్యకర్మ మార్గమిట్లే యుండును. 🍀


21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||

తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించుచున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.

వివరణము : వంద సంవత్సరముల శ్రమకు మూడు నెలల పదిరోజుల అనుభూతి! ఇది తెలియక స్వర్గసుఖములు కోరువారు అనంత కాలము శ్రమపడుచు నుందురు. ఇది నిజమునకు లాభసాటి వ్యాపారము కాదు. కామ్యకర్మ మార్గమిట్లే యుండును. భోగమున మార్గమిట్లే యుండును. నిజమునకు సుఖము నందు కాలము త్వరితగతిని సాగు చున్నట్లుండును. దుఃఖమునందు నిదానముగ సాగుచున్నట్లు వుండును. సుఖముగ కూర్చుండి పరిహాసముతో భాషణము సాగు చున్నపుడు కాలము క్షణములో అయిపోయినట్లుండును.

విషయాసక్తితో భాషణమున పడినవారికి కాలము తెలియదు. కాని వేదనతో బాధ పడుచున్న వారికి ప్రతి నిమిషము ఒక జామువలె నుండును. సరస సంభాషణము లందు జాము ఒక క్షణముగ గడచిపోవును. పుణ్య వ్యయమునకు కాలము శీఘ్రమై యున్నది. పుణ్యమార్జించుటకు కాలము అతినెమ్మదిగ గోచరించును. ఆరు గంటలు వరుసగ పనిచేయుటకును, ఆరు గంటలు నిద్రించుటకును గల వ్యత్యాసమే పుణ్యమార్జించుటకును, వెచ్చించుటకును గల వ్యత్యాసము. కనుక దివ్య భోగములు కోరుట అవివేకమని తెలిసిన యోగులు, ఋషులు దైవయోగము నాశ్రయించిరి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


22 Jan 2022

22-JANUARY-2022 శనివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 22, శనివారం, జనవరి 2022 స్థిర వాసరే 🌹 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 310 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 508🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -138🌹  
5) 🌹 Osho Daily Meditations - 127🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 342-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 342-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 22, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ వేంకటేశ్వర ద్వాదశ మంజరికా స్తోత్రం - 9 🍀*

*14. సర్వపాపహరం ప్రాహుః వేంకటేశ స్తదోచ్యతే |*
*త్వన్నామకో వేంకటాద్రిః స్మరతో వేంకటేశ్వరః |*
*సద్యః సంస్మరణాదేవ మోక్ష సామ్రాజ్యమాప్నుయాత్*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ చవితి 09:15:39 వరకు తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 10:38:23 వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: శోభన 14:07:57 వరకు తదుపరి అతిగంధ్
కరణం: బాలవ 09:13:39 వరకు 
సూర్యోదయం: 06:49:27
సూర్యాస్తమయం: 18:05:44
వైదిక సూర్యోదయం: 06:53:14
వైదిక సూర్యాస్తమయం: 18:01:57
చంద్రోదయం: 21:57:49
చంద్రాస్తమయం: 09:52:06
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: సింహం
వర్జ్యం: 17:59:36 - 19:37:44
దుర్ముహూర్తం: 08:19:37 - 09:04:42
రాహు కాలం: 09:38:31 - 11:03:03
గుళిక కాలం: 06:49:27 - 08:13:59
యమ గండం: 13:52:08 - 15:16:40
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:49
అమృత కాలం: 03:59:36 - 05:39:12 మరియు 27:48:24 - 29:26:32
లంబ యోగం - చికాకులు, అపశకునం 10:38:23 వరకు తదుపరి ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం 
పండుగలు : లేదు.
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -310 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -3 📚*
 
*🍀 21-3. జనన మరణ చక్రము - పుణ్య వ్యయమునకు కాలము శీఘ్రమై యున్నది. పుణ్యమార్జించుటకు కాలము అతి నెమ్మదిగ గోచరించును. ఆరు గంటలు వరుసగ పని చేయుటకును, ఆరు గంటలు నిద్రించుటకును గల వ్యత్యాసమే పుణ్యమార్జించుటకును, వెచ్చించుటకును గల వ్యత్యాసము. వంద సంవత్సరముల శ్రమకు మూడు నెలల పదిరోజుల అనుభూతి! ఇది తెలియక స్వర్గసుఖములు కోరువారు అనంత కాలము శ్రమపడుచు నుందురు. ఇది నిజమునకు లాభసాటి వ్యాపారము కాదు. కామ్యకర్మ మార్గమిట్లే యుండును. 🍀*

*21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |*
*ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||*

*తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించుచున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.*

*వివరణము : వంద సంవత్సరముల శ్రమకు మూడు నెలల పదిరోజుల అనుభూతి! ఇది తెలియక స్వర్గసుఖములు కోరువారు అనంత కాలము శ్రమపడుచు నుందురు. ఇది నిజమునకు లాభసాటి వ్యాపారము కాదు. కామ్యకర్మ మార్గమిట్లే యుండును. భోగమున మార్గమిట్లే యుండును. నిజమునకు సుఖము నందు కాలము త్వరితగతిని సాగు చున్నట్లుండును. దుఃఖమునందు నిదానముగ సాగుచున్నట్లు వుండును. సుఖముగ కూర్చుండి పరిహాసముతో భాషణము సాగు చున్నపుడు కాలము క్షణములో అయిపోయినట్లుండును.*

*విషయాసక్తితో భాషణమున పడినవారికి కాలము తెలియదు. కాని వేదనతో బాధ పడుచున్న వారికి ప్రతి నిమిషము ఒక జామువలె నుండును. సరస సంభాషణము లందు జాము ఒక క్షణముగ గడచిపోవును. పుణ్య వ్యయమునకు కాలము శీఘ్రమై యున్నది. పుణ్యమార్జించుటకు కాలము అతినెమ్మదిగ గోచరించును. ఆరు గంటలు వరుసగ పనిచేయుటకును, ఆరు గంటలు నిద్రించుటకును గల వ్యత్యాసమే పుణ్యమార్జించుటకును, వెచ్చించుటకును గల వ్యత్యాసము. కనుక దివ్య భోగములు కోరుట అవివేకమని తెలిసిన యోగులు, ఋషులు దైవయోగము నాశ్రయించిరి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 508 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 42

*🌻. పెళ్లి వారికి ఎదురేగుట - 3 🌻*

ఓ నారదా! మునులు, దేవతలు, ఇతరులు సర్వులు శివునితో బాటు వెళ్లు చున్నవారై, హిమవంతుని నగరమునకు పెక్కు భంగుల కొనియాడ జొచ్చిరి (20). 

హిమవంతుడు దేవతలను, ఇతరులను తీర్చిదిద్దిన సుందరమగు శిఖరముపై నిలిపి, వివాహ వేదిక ఉన్న స్థలమునకు వెళ్లెను (21). నాల్గు స్తంభములతో తోరణములతో కూడి యున్న ఆ వేదికను పరీక్షించెను (22). మరియు పర్వతశ్రేష్టుడగు హిమవంతుడు తన పుత్రులను విష్ణువు మొదలగు వారందరితో కూడియున్న శివుని సమీపమునకు పంపెను (23). మహానందముతో కూడియున్న వాడు, బంధువులందరితో కలసి యున్నవాడు అగు పర్వతరాజు వరుని ఆహ్వానించే కార్యమును మహోత్సవముగా చేయదలంచెను (24).

అపుడా హిమవంతుని పుత్రులు అచటకు వెళ్లి తన వారితో కూడి యున్న శివునకు ప్రణమిల్లి హిమవంతుని ఆ ప్రార్థనను గురించి చెప్పిరి (25). అపుడా హిమవంతుని పుత్రులు శివుని ఆజ్ఞను బొంది తమ గృహమునకు వెళ్లి శివుడు, ఇతరులు వచ్చుచున్నారని ఆనందముతో పర్వత రాజగు హిమవంతునకు చెప్పిరి (26). ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలు, మరియు శివుడు హిమవంతుని ఆ ప్రార్థనను విని మిక్కిలి ఆనందించిరి (27). దేవతలు, మునులు, గణములు అందరు చక్కని వేషములను ధరించి శివునితో కలిసి హిమవంతుని గృహమునకు వెళ్లిరి (28). 

ఆ సమయములోమేన శివుని చూడ గోరెను. ఓ మునీ! ఆమె హిమవంతుని సేవకుని చే మహర్షి శ్రేష్ఠుడవగు నిన్ను పిలిపించెను (29). ఓ మునీ! శివుడు వెళ్లుమని నిన్ను ప్రేరేపించెను. శివుని హృదయములోని ఆకాంక్షను పూర్ణము చేయగోరి నీవు వెళ్లితివి (30). శంకర ప్రభుని గర్వాపహారకమగు రూపమును చూడగోరినది, విస్మయమును పొందిన మనస్సు గలది అగు మేన నీకు నమస్కరించి ఇట్లు పలికెను (31).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో దేవగిరుల కలయిక అనే నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 138 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. సదవగాహన - 2 🌻*

*విచిత్రమేమనగా, ఇతరుల యందు, తాను తెలివి గల వాడననుకొను మానవుడు ఏ దోషమును గమనించు చుండునో, ఆ దోషము తన యందే దృఢముగా దాగి యుండును.*

*జుగుప్స వలన, మానవుడు వివేకమను చూపును కోల్పోయి, గ్రుడ్డి వాడగును. తనకు, ఒరులకు అడ్డుగోడలను కట్టుకొని వారితో సంఘర్షణకు తలపడును. దానితో భయభ్రాంతుడై, వినాశమును గొని‌ తెచ్చుకొను వాడగును.*

*ఒకసారి మనస్సు నందు ఇతరులపై దోషారోపణ చేయు తలంపు జనింపగనే, దానిని కొనసాగనీయక, వారిపై ప్రేమ, దయలను అనుభవించి, వారిని సదవగాహన చేసికొనుటకు యత్నింప వలెను. దానితో జుగుప్స క్రమముగా అదృశ్యమగును.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 127 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 127. PREPARING THE WAY 🍀*

*🕉 There is nothing you can do. Enlightenment happens when it happens, but by your doing you prepare the way. 🕉*
 
*You cannot force enlightenment to happen. It is not a cause and effect thing. But you do something; you prepare the way for it. You can do something that can hinder the way-it happens when it happens, but if you are not ready, you may bypass it, and you may not even recognize it. Many people come near the first glimpses of satori, Samadhi, enlightenment, in the natural course of life, but they cannot recognize it because they are not ready for it. It is as if a very great diamond is given to someone who has never heard of diamonds. He will think it is a stone, because he has no way to recognize it.*

*One has to become a sort of jeweler so that one can recognize. When it happens, it happens only then. There is no way to force or manipulate it. You cannot make it happen, but if it happens you will be ready to recognize it. If you stop meditations your readiness will disappear. Continue meditations so that you are ready, you are throbbing, waiting, so that when it passes by your side you are open to receive it.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 342-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 342 -1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

*🌻 342-1. 'క్షేత్రేశీ' 🌻* 

*క్షేత్రములకు ఈశ్వరి శ్రీమాత అని అర్థము. సృష్టి క్షేత్రములకు, జీవుల క్షేత్రములకు ఈశ్వరి శ్రీమాతయే. పంచభూతాత్మక మగు సృష్టి క్షేత్రమును, జీవుల క్షేత్రములను త్రిగుణములతో వర్తింపజేయుచు అష్ట ప్రకృతులను అధిష్ఠించి సమస్తమును నిర్వర్తించుచునుండును. ఆమె నుండియే క్షేత్రము లన్నియూ యేర్పడినవి కనుక ఆమెయే వానికి ఈశ్వరి. జీవులు కూడ ఆమె ఈశ్వరీతత్త్వము నెరిగి ఆమెను ఆశ్రయించినచో క్రమముగ అష్ట ప్రకృతులు సహకరించ గలవు.*

*జీవులు స్వతహాగ ప్రకృతి అధీనులు. ప్రకృతిపై స్వామిత్వమునకు వారు ప్రయత్నించుట అహంకరించుటయే. ప్రకృతితో సహకరించి స్నేహ సంబంధ మేర్పరచుకొన్నచో ప్రకృతి అనుకూలింప గలదు. అజ్ఞాన అహంకారముతో విఱ్ఱవీగు వారికి ప్రకృతి ప్రతికూలించును. అపుడు పరిసరములు, తమ తమ దేహములు కూడ తమకు ప్రతికూలమై నిలచును. ప్రకృతిని జీవులు ఎదురించి నిలువలేరు. ప్రకృతి సహకారముతో ఈశ్వర జ్ఞానము నిలచి ఈశ్వర సాన్నిధ్యమున స్థిరపడగలరు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 342-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*

*🌻 342-1. Kṣtreśī क्ष्त्रेशी (342) 🌻*

*Wife of Kṣetrajña (Śiva) is Kṣtreśī (Śaktī). It is like Bhairava and Bhairavī. It must always be remembered that there is no difference between Śiva and Śaktī. Or it may also be said that She is the Īśvarī of all kṣetra-s (possible extension of the previous nāma).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹