శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 342-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 342 -1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 342-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 342 -1🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀
🌻 342-1. 'క్షేత్రేశీ' 🌻
క్షేత్రములకు ఈశ్వరి శ్రీమాత అని అర్థము. సృష్టి క్షేత్రములకు, జీవుల క్షేత్రములకు ఈశ్వరి శ్రీమాతయే. పంచభూతాత్మక మగు సృష్టి క్షేత్రమును, జీవుల క్షేత్రములను త్రిగుణములతో వర్తింపజేయుచు అష్ట ప్రకృతులను అధిష్ఠించి సమస్తమును నిర్వర్తించుచునుండును. ఆమె నుండియే క్షేత్రము లన్నియూ యేర్పడినవి కనుక ఆమెయే వానికి ఈశ్వరి. జీవులు కూడ ఆమె ఈశ్వరీతత్త్వము నెరిగి ఆమెను ఆశ్రయించినచో క్రమముగ అష్ట ప్రకృతులు సహకరించ గలవు.
జీవులు స్వతహాగ ప్రకృతి అధీనులు. ప్రకృతిపై స్వామిత్వమునకు వారు ప్రయత్నించుట అహంకరించుటయే. ప్రకృతితో సహకరించి స్నేహ సంబంధ మేర్పరచుకొన్నచో ప్రకృతి అనుకూలింప గలదు. అజ్ఞాన అహంకారముతో విఱ్ఱవీగు వారికి ప్రకృతి ప్రతికూలించును. అపుడు పరిసరములు, తమ తమ దేహములు కూడ తమకు ప్రతికూలమై నిలచును. ప్రకృతిని జీవులు ఎదురించి నిలువలేరు. ప్రకృతి సహకారముతో ఈశ్వర జ్ఞానము నిలచి ఈశ్వర సాన్నిధ్యమున స్థిరపడగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 342-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻
🌻 342-1. Kṣtreśī क्ष्त्रेशी (342) 🌻
Wife of Kṣetrajña (Śiva) is Kṣtreśī (Śaktī). It is like Bhairava and Bhairavī. It must always be remembered that there is no difference between Śiva and Śaktī. Or it may also be said that She is the Īśvarī of all kṣetra-s (possible extension of the previous nāma).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
22 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment