మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 138


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 138 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సదవగాహన - 2 🌻


విచిత్రమేమనగా, ఇతరుల యందు, తాను తెలివి గల వాడననుకొను మానవుడు ఏ దోషమును గమనించు చుండునో, ఆ దోషము తన యందే దృఢముగా దాగి యుండును.

జుగుప్స వలన, మానవుడు వివేకమను చూపును కోల్పోయి, గ్రుడ్డి వాడగును. తనకు, ఒరులకు అడ్డుగోడలను కట్టుకొని వారితో సంఘర్షణకు తలపడును. దానితో భయభ్రాంతుడై, వినాశమును గొని‌ తెచ్చుకొను వాడగును.

ఒకసారి మనస్సు నందు ఇతరులపై దోషారోపణ చేయు తలంపు జనింపగనే, దానిని కొనసాగనీయక, వారిపై ప్రేమ, దయలను అనుభవించి, వారిని సదవగాహన చేసికొనుటకు యత్నింప వలెను. దానితో జుగుప్స క్రమముగా అదృశ్యమగును.


....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


22 Jan 2022

No comments:

Post a Comment