🌹 గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) 🌹
30 వ భాగము
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
🍃 చిత్తము ఒక మాయా చక్రము 2 🍃
201. చిత్తము ఉన్నచో మూడు లోకములు ఉండును. చిత్తము నశించిన జగత్తు నశించును. రాగద్వేషములే చిత్త సంస్కారములు. ఆ సంస్కారములే సంసారము. లోకములు, లోకేశులు, లోకస్థులు, అన్నీ చిత్తభ్రాంతియే. వీటి మిథ్యాభావమే చిత్త శాంతి.
202. శరీరాభిమానము గల యోగి ఇతరుల అభిప్రాయములను గ్రహించలేడు. అందుకు యోగ సాధన అవసరము.
203. యోగాగ్నిలో పూర్వ సంస్కారములను భస్మం గావించుచూ, చిత్త శుద్ధి ద్వారా నూతన సంస్కారములు ఏర్పడకుండా చూడాలి. చిత్తములో విషయాకార వృత్తులు నశించి, ఆత్మాకార వృత్తులేర్పడవలెను. అద్వైత సిద్ధిలో అన్ని వృత్తులు నశించును.
204. కర్మ రాహిత్యము పొందినప్పుడు చిత్తము సమాధి స్థితి నొందుచున్నది. దానినే చిత్తలయము అంటారు.
205. అనేక వాంఛలు, విషయాల, కోరికల సంయోగమైన చిత్తము పురుషుని (ఆత్మ) కొరకు ఏర్పడినది. పురుషుడు లేనిచో చిత్తము లేదు. చిత్తము లేనిచో పురుషుడుండడు. ఇంద్రియాలు చిత్తానికి ప్రేరణ కలిగిస్తాయి. బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను జయించాలి. చిత్త శాంతి కలిగితే పురుషుడే బ్రహ్మము.
206. చిత్తము శుద్ధ సాత్వికమైనప్పటికి దాని చుట్టూ రజోగుణములు, తమోగుణములు కప్పి ఉంటాయి.
207. ప్రకృతిలో గల అనేక శక్తులను గ్రహించే శక్తి చిత్తానికి మాత్రమే ఉంది.
208. చిత్త స్త్థెర్యము లభించాలంటే ఆత్మ జ్యోతిని ధ్యానించాలి. విషయ వాసనలు త్యజించాలి.
209. అనన్య చిత్తుడైనవాడు చిత్తమునందు నిరంతర బ్రహ్మ చింతన, సంకల్పములు లేకుండా అనంత భావంతో నిరంతరం ఆత్మ చింతన చేసిన అనన్యత సిద్ధించును.
210. మనస్సు కేవలము విషయములను సేకరించిన, బుద్ధి వాటిని గ్రహించి విశ్లేషణ చేయగా, చిత్తము ఆ విషయములను తనలో నిక్షిప్తము చేస్తుంది. అదే చిత్రగుప్తుని ఖాతా. దాన్ని బట్టి మనం తిరిగి కర్మలు చేస్తుంటాము. సంఘటనలన్నీ విషయాలుకాదు. విషయీకరించుకొన్నవి మాత్రమే విషయాలు. ఉదాసీన చిత్తము నిర్విషయ మగును.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్