అద్భుత సృష్టి - 2

🌹. అద్భుత సృష్టి - 2 🌹
✍. రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 2 🌻

🌟 మూల చైతన్యం మూడు విధాలుగా విభజించబడింది.

1. కాంతి
2. శబ్దం
3. శక్తి

(మూలకాంతి, మూలశక్తి, మూలశబ్దం) గా సృష్టించబడ్డాయి. ఇవి అన్నీ ఆది చైతన్యంలోని విభాగాలే.

మూలశక్తికి మరోపేరే - " ఆదిపరాశక్తి"

ఆదిశక్తి నుండి సృష్టి, స్థితి, లయలు సృష్టించబడ్డాయి.

1. సృష్టి - సన్ ఎనర్జీ - బ్రహ్మ - సృష్టికారకుడు -సృష్టికర్త -(సృష్టిప్రదాత)

2. స్థితి - మదర్ ఎనర్జీ - విష్ణు - స్థితికారకుడు - పోషణకర్త - (స్థితి ప్రదాత)

3. లయ - ఫాదర్ ఎనర్జీ - మహేశ్వర - లయకారకుడు - జ్ఞానకర్త (జ్ఞాన ప్రదాత)

1. యూనివర్సల్ ఫాదర్ ఎనర్జీ (తండ్రి ) - కాన్షియస్ నెస్ (ఎరుక)

2. యూనివర్సల్ మదర్ ఎనర్జీ (తల్లి) - లైఫ్ ఫోర్స్ (ప్రాణశక్తి)

3. యూనివర్సల్ సన్ ఎనర్జీ (కొడుకు) -మెటీరియల్ ఎనర్జీ (పదార్థం)

ఈ మూడు శక్తులతోనే ఎన్నో యూనివర్సలనూ, గెలాక్సీలనూ, సోలార్ సిస్టమ్ లనూ మరి గ్రహాలనూ సృష్టించడం జరిగింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 25

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 25 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 13 🌻

ఒకరికి విద్యయందు ఆసక్తి వుంది. వరసగా చేస్తూనే పోతుంటాడు జీవితకాలం. ఎం ఎ లు, పిహెచ్ డి లు, ఎం ఫిల్ లు, ఎం ఎ లు, బి ఎ లు వాడికి తోచిన డిగ్రీలన్నీ చేస్తూ పోతుంటాడు. కొంతమంది వున్నారు.

16 ఎం ఎ లు చేశానండీ అని చెప్పుకుంటాడు జీవితంలో. సత్యమే. కాని అది ప్రేయోమార్గము కదా. కొంతమంది ఏం చెప్పుకుంటారు? నేను సైకిల్ తొక్కుతూ ఈ వూరొచ్చానండి. ఇప్పుడు నేను 40 అంతస్థుల మేడ కట్టానండీ అంటాడు.

అంటే ఆయన జీవితంలో ఆయన సాధించింది ఏమిటీ అని ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసినట్లయితే... మనం కూడా ప్రతిరోజూ ఏం చేయాలిట ఇప్పుడు. ఈ సింహావలోకనం చెయ్యాలి.

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలిట. నాకు పుట్టి బుద్ధి ఎరిగినప్పటినుంచీ, ఊహ వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకూ గత 30 ఏళ్ళలో, గత 40 ఏళ్ళలో, గత 50,60,70,80,100 ఏళ్ళల్లో సాధించినది ఏమిటి? అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన దగ్గర ఏమేమి కనబడుతున్నాయో, అవన్నీ కూడా భౌతికమైనటువంటి అంశములయినట్లయితే, అవన్నీ ఏమిటవీ? ప్రేయోమార్గములు. బంధదాయకములు.

సుఖాన్ని ఇస్తుంది. బంధదాయకం అయినప్పటికీ కూడా సుఖాన్ని ఇస్తుంది. ఇందాక చెప్పా. శ్లేష్మములో పడిన ఈగ సుఖాన్ని పొందుతోంది. ఆహారాన్ని తింటోంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తోంది. కాని అందులోనే ప్రాణాన్ని కోల్పోయింది.

శరీరము నేనుగా వున్నప్పుడు జర మరణ దుఃఖములు తప్పవు. ఆ జరామరణదుఃఖము శరీరానికే గాని నాకు కాదు అనేటటువంటి వివేకం పొందాలి అంటే ఆత్మవిచారణ చెయ్యాలి.

ఈ బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యములు నావికావు, శరీరానివి అనేటటువంటి, శరీరంలోనే వుండి శరీరమునకు విలక్షణముగా వుండేటటువంటి స్థితిని సంపాదించాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Twelve Stanzas from the Book of Dzyan - 12

🌹 Twelve Stanzas from the Book of Dzyan - 12 🌹
🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴 

🌻 STANZA III - The Sowing of Love - 3 🌻

24. A Time to blossom and a Time to bear fruit. Were not bounteous fruits being borne by those that had been blooming so luxuriantly, in accord with the Periods established for them? 

Yes, their fruits were fresh and fragrant. But at first they could be seen only by the Creator — the One who had sown the Seeds. His was the Hand that had generously scattered the Divine Seeds on the Earth. 

But some of them fell among thorns and were choked. Many fell in stony places... God was waiting for the harvest. He longed to see the Divine Fruit, for like would bear like unto Him, as an apple tree would bear an apple and a pear tree a pear. 

Thus, in everything, His Law would be obeyed. The Seed germinated and hastened to bear fruit. All the shoots were by now firmly established, showing strong stems. 

Only their fruit was still in question. And only as the fruit ripened was it possible to judge the results. But for that the Periods had not yet come. 

In the meantime, the fruit was absorbing everything granted to it by a generous world. And the roots, whether they were sunk into the darkness or into the Light, served to determine the fruit’s true value... 

Thus the Gods directed the Motion of the Wheel towards the New Period. 

And that was the Season of Reaping, designed to effect the final calculation of the ripened Divine Harvest.
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 177

🌹 . శ్రీ శివ మహా పురాణము - 177 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴

39. అధ్యాయము - 14

🌻. శివపూజ - 10 🌻

యదా చోచ్చాటనం దేహే జాయతే కారణం వినా || 75

యత్ర కుత్రాపి వా ప్రేమ దుఃఖం చ పరివర్థితమ్‌ | స్వగృహే కలహో నిత్యం యదా చైవ ప్రజాయతే || 76

తద్ధారాయాం కృతాయాం వై సర్వం దుఃఖం విలీయతే | శత్రూణాం తాపనార్థం వై తైలాధారా శివోపరి || 77

కర్తవ్యా సుప్రయత్నేన కార్య సిద్ధిర్ధ్రువం భవేత్‌ | వాసితేనైవ తైలేన భోగవృద్ధిః ప్రజాయతే || 78

శరీరములో కారణము లేకుండా ఉద్వేగము కలిగినప్పుడు (75),

ఏదో ఒక వస్తువుపై లేక వ్యక్తిపై ప్రేమ కలిగి దుఃఖము పెరిగినప్పుడు, ఇంటిలో నిత్యము కొట్లాటలు బయలుదేరినప్పుడు (76),

అట్టి ధారతో అభిషేకించినచో దుఃఖములన్నియు తొలగిపోవును. శత్రువులను తపింపజేయ గోరు వ్యక్తి శివునిపై తైలధారతో (77)

ప్రయత్నపూర్వకముగా అభిషేకించినచో, తప్పక కార్యసిద్ధి కలుగను. సువాసన నూనెతో అభిషేకించినచో భోగములు వర్ధిల్లును (78).

సార్షపేనైవ తైలేన శత్రునాశో భవేద్ధ్రువమ్‌ | మధునా యక్ష్మరాజో వై గచ్ఛేచ్చ శివపూజనాత్‌ || 79

ధారా చేక్షురసస్యాపి సర్వానందకరీ శివే | ధారా గంగాజలసై#్యవ భుక్తిముక్తి ఫలప్రదా || 80

ఏతాస్సర్వాశ్చ యాః ప్రోక్తా మృత్యుంజయ సముద్భవాః | తత్రాయుత ప్రమాణం హి కర్తవ్యం తద్విధానతః || 81

కర్తవ్యం బ్రాహ్మణానాం చ భోజ్యం వై రుద్ర సంఖ్యయా | ఏతత్తే సర్వమాఖ్యాతం యత్‌ పృష్టోsహం మునీశ్వర|| 82

ఏతద్వై సఫలం లోకే సర్వకామహితావహమ్‌ |

ఆవాల నూనెతో అభిషేకించినచో, శత్రువులు నిశ్చయముగా నశించెదరు. తేనెతో శివుని అభిషేకించి పూజించినచో, దీర్ఘవ్యాధి తొలగిపోవును (79).

శివునకు చెరుకురసముతో అభిషేకించినచో సర్వా నందములు కలుగును. గంగా జలధారతో అభిషేకించినచో భుక్తి, ముక్తి కలుగును (80).

ఈ అభిషేకములనన్నిటినీ పదివేల మృత్యుంజయ జపము పూర్తియగు వరకు చేయవలెనని విధి (81).

అభిషేకానంతరము పదకొండు మంది బ్రాహ్మణులకు భోజనమునడవలెను. ఓమునిశ్రేష్ఠా! నీవు అడిగిన దానిని అంతయూ నీకు చెప్పితిని (82).

ఈ జ్ఞానమును విన్న మానవుడు ఈ లోకములో సర్వకామనలను, హితములను పొందును.

స్కందోమాసహితం శంభుం సంపూజ్య విధినా సహ || 83

యత్ఫలం లభతే భక్త్యా తద్వదామి యథాశ్రుతమ్‌ | అత్ర భుక్త్వాఖిలం సౌఖ్యం పుత్ర పౌత్రాభిశ్శుభమ్‌ || 84

తతో యాతి మహేశస్య లోకం సర్వసుఖావహమ్‌ | సూర్యకోటి ప్రతీకాశైర్విమానై స్సర్వకామగైః || 85

రుద్ర కన్యాసమాకీర్ణైర్గేయవాద్య సమన్వితైః | క్రీడతే శివభూతశ్చ యావదాభూతసంప్లవమ్‌ || 86

తతో మోక్షమవాప్నోతి విజ్ఞానం ప్రాప్య చావ్యయమ్‌ || 87

ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రథమ ఖండే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సృష్ట్యుపాఖ్యానే శివపూజా విధాన వర్ణనం నామ చతుర్దశోsధ్యాయః (14).

స్కందునితో, పార్వతితో కూడియున్న శంభుని యథావిధిగా భక్తితో పూజించిన వానికి కలుగు ఫలమును నేను విన్న మేరకు చెప్పెదను. అట్టివాడు ఈ లోకములో పుత్రులతో, పౌత్రులతో కూడిన మంగళకరములగు సౌఖ్యములనన్నిటినీ అనుభవించి (84),

ఆ తరువాత సర్వసుఖముల నొసగు మహేశుని లోకమును పొందును. అచట శివస్వరూపుడై, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే, యథేచ్ఛా సంచారము గల (85),

రుద్ర కన్యలతో నిండియున్న గానముతో వాద్యములతో అలరారే విమానములనధిష్ఠించి, మహా ప్రలయము వరకు క్రీడించును (86).

తరువాత వినాశరహితమగు విజ్ఞానమును పొంది, మోక్షమును పొందును (87).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సృష్ట్యుపాఖ్యానమనే మొదటి ఖండమునందు శివపూజావర్ణనమనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 62

🌷. శ్రీ శివ మహా పురాణము - 62 🌷

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. విద్యేశ్వర సంహితా 🌴

అధ్యాయము - 17

🌻. ప్రణవ, పంచాక్షరీ మంత్రముల మహిమ - శివలోక వైభవము - 9 🌻

సాధకః పంచలక్షాంతే శివప్రీత్యర్థమేవ హి || 129

మహాభిషేకం నైవేద్యం కృత్వా భక్తాంశ్చ పూజయేత్‌ | పూజయా శివభక్తస్య శివః ప్రీతతరో భవేత్‌ || 130

శివస్య శివభక్తస్య భేధో నాస్తి శివో హి సః | శివస్వరూప మంత్రస్య ధారణాచ్ఛివ ఏవ హి || 131

శివభక్త శరీరే హి శివే తత్పరమో భవేత్‌ | శివభక్తాః క్రియాస్సర్వా వేద సర్వక్రియాం విదుః || 132

యావద్యావ చ్ఛివం మంత్రం యేన జప్తం భ##వేత్‌ క్రమాత్‌ | తావద్వై శివసాన్నిధ్యం తస్మిన్‌ దేహే న సంశయః || 133

సాధకుడు శివుని ప్రీతి కొరకు మాత్రమే అయిదు లక్షల జపమును పూర్తి చేసి (129),

మహాభిషేకమును, నైవేద్యమును చేసి, భక్తులను పూజించవలెను. శివభక్తుని పూజించినచో, శివుడు మిక్కిలి సంతసించును (130).

శివునకు, శివభక్తునకు తేడా లేదు. శివభక్తుడు శివుని స్వరూపమగు మంత్రమును జపించుట వలన శివుడే యగును (131).

శివభక్తుని శరీరములో శివుడు ఉండును. కాన, శివభక్తుని శ్రద్ధతో ఆరాధించవలెను. శివభక్తులకు లౌకిక, వైదిక క్రియలన్నియూ జ్ఞాతములే (132).

భక్తుడు ఎంత అధికముగా శివమంత్రమును జపించునో, అంత అధికముగా అతని దేహములో శివుని సన్నిది ఉండుననుటలో సందియము లేదు (133).

దేవీలింగం భ##వేద్రూపం శివభక్తి స్త్రియస్తథా | యావన్మంత్రం జపే ద్దేవ్యాస్తావత్సాన్నిధ్యమస్తి హి || 134

శివం సంపూజయేద్దీమాన్స్వయం వై శివరూపభాక్‌ | స్వయం చైవ శివో భూత్వా పరాం శక్తిం ప్రపూజయేత్‌ || 135

శక్తిం బేరం చ లింగం చ హ్యాలేఖ్యా మాయయా యజేత్‌ | శివలింగం శివం మత్వా స్వాత్మానం శక్తిరూపకమ్‌ || 136

శివలింగం నాదరూపం బిందురూపం తు శక్తికమ్‌ | ఉపప్రధాన భావేన అన్యోన్యసక్త లింగకమ్‌ || 137

పూజయేచ్చ శివం శక్తిం స శివో మూలభావనాత్‌ |

శివభక్తురాలగు స్త్రీ దేవీ స్వరూప యగును. ఆమె ఎంత అధికముగా శివమంత్రమును జపించునో, ఆమె యందు దేవీసాన్నిధ్యము అంత అధికముగా నుండును (134).

బుద్ధిమంతుడు స్వయముగా శివరూపుడై శివుని పూజించవలెను. భక్తుడు తనను తాను శివునిగా భావన చేసి పరాశక్తిని పూజించవలెను (135).

దేవిని, శివుని మూర్తిని, లింగమును, మరియు శివుని చిత్రపటమును నిష్కపట భావనతో ఆరాధించవలెను. భక్తుడు తనను శక్తిరూపముగా భావన చేసి, శివలింగము నందు శివుని పూజించవలెను (136).

శివలింగము నాదరూపము. శక్తి బిందురూపము. శివశక్తులు రెండు, పరస్పరము ప్రధాన, గుణ (అప్రధాన) భావముతో కలసి యుందురు (137).

ఇట్లు శివుని, శక్తిని పుజించు భక్తుడు, మూలమును భావన చేయుట వలన, శివస్వరూపుడగును.

శివభక్తాన్‌ శివమంత్ర రూపకాన్‌ శివరూపకాన్‌ || 138

షోడశైరుపచారైశ్చ పూజయే దిష్టమాప్నుయాత్‌ | యేన శుశ్రూషణాద్యైశ్చ శివభక్తస్య లింగినః || 139

ఆనందం జనయే ద్విద్వాన్‌ శివః ప్రీతతరో భ##వేత్‌ | శివభక్తాన్‌ సపత్నీకాన్‌ పత్న్యా సహ సమాదరాత్‌ || 140

పూజయే ద్భోజనాద్యైశ్చ పంచ వా దశ వా శతరమ్‌ | ధనే దేహే చ మంత్రే చ భావనాయా మవంచకః || 141

శివశక్తి స్వరూపేణ న పునర్జాయతే భువి| శివమంత్ర భావనచే శివస్వరూపులైన శివభక్తులను (138),

షోడశోపచారములతో పూజించు భక్తుడు అభీష్టమును పొందును. విద్వాంసుడు శివస్వరూపుడగు శివభక్తునకు శుశ్రూష చేసి (139),

ఆనందమును కలిగించవలెను. అట్లు చేయుట వలన శివుడు మిక్కిలి సంతసించును. భక్తుడు భార్యతో గూడి భార్యాసమేతులగు శివభక్తులను ఆదమరముతో (140),

అయిదుగురిని, గాని, పదిమందిని గాని, లేక వందమందిని గాని భోజనాదులతో పూజించవలెను. ధనములో గాని, కాయకష్టములో గాని, మంత్రములో గాని, భావన యందు గాని లోటు రానీయకూడదు (141).

అట్టి భక్తుడు శివశక్తి స్వరూపుడై భూలోకము నందు మరల జన్మించడు.
నాభేరధో బ్రహ్మ భాగమాకంఠం విష్ణుభాగకమ్‌ || 142

ముఖం లింగమితి ప్రోక్తం శివభక్త శరీరకమ్‌ | మృతాన్‌ దాహాది యుక్తాన్వా దాహాది రహితాన్మృతాన్‌ || 143

ఉద్దిశ్య పూజయే దాది పితరం శివమేవ హి | పూజాం కృత్వాది మాతుశ్చ శివభక్తాంశ్చ పూజయేత్‌ || 144

పితృలోకం సమాసాద్య క్రమాన్ముక్తో భ##వేన్మృతః |

శివభక్తుని శరీరములో పాదము నుండి నాభి వరకు బ్రహ్మభాగమనియు, నాభి నుండి కంఠము వకరు విష్ణుభాగమనియు (142),

ముఖము లింగమనియు చెప్పబడినది. మరణించిన వాని దేహమును దహించినా, లేక ఖననాదులను చేసినా (143),

అది పిత యగు శివుని, ఆది మాత యగు శక్తిని, శివభక్తులను పూజించవలెను (144).

అపుడు మరణించిన జీవుడు పితృలోకమును పొంది, క్రమముగా మోక్షమును పొందును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 22

🌹. శ్రీ శివ మహా పురాణము - 22 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
సేకరణ 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. విద్యేశ్వర సంహితా 🌴

అధ్యాయము - 9

🌻. శివరాత్రి - అరుణాచలము - 3 🌻

తదజ్ఞానేన వాం వృత్తం ఈశమానం మహాద్భుతమ్‌ | తన్నిరాకర్తు మత్రైవముత్థితోsహం రణక్షితౌ || 33

త్యజతం మానమాత్మీయం మయీశే కురు తం మతిమ్‌ | మత్ర్పసాదేన లోకేషు సర్వోsప్యర్థః ప్రకాశ##తే || 34

గురూక్తి ర్వ్యంజకం తత్ర ప్రమాణం వా పునః పునః | బ్రహ్మ తత్త్వ మిదం గూఢం భవత్ర్పీత్యా భణామ్యహమ్‌ || 35

అహమేవ పరం బ్రహ్మ మత్స్వరూపం కలాకలమ్‌ | బ్రహ్మత్వా దీశ్వరశ్చాహం కృత్యం మేనుగ్రహాదికమ్‌ || 36

బృహత్త్వాద్బృంహణత్వాచ్చ బ్రహ్మాహం బ్రహ్మకేశవౌ | సమత్వా ద్వ్యాపకత్వాచ్చ తథైవాత్మహ మర్భకౌ || 37

కాన మీ ప్రవర్తన అజ్ఞాన జనితము.'నేను ఈశుడను' అను గర్వము మీకు కలుగుటయే గొప్ప ఆశ్చర్యము. ఈ గర్వమును తొలగించుట కొరకై నేనిచట రణరంగము నందు ఆవిర్భవించితిని (33).

మీరీ గర్వమును వీడి, ఈశుడనగు నన్ను ధ్యానించుడు. ఈ లోకములో సర్వ పదార్థములు నా అనుగ్రహము చేతనే ప్రకాశించుచున్నవి (34).

గురువచనము ఈ సత్యమునే బోధించుచున్నది. ఇదియే ప్రామాణిక వచనము. ఈ బ్రహ్మతత్త్వము రహస్యము. నేను దీనిని మీయందలి ప్రీతి వలన చెప్పుచున్నాను (35).

పరబ్రహ్మ నేనే. నాస్వరూపము సాకారము, నిరాకారము కూడా. పరబ్రహ్మను నేనే; ఈశ్వరుడను నేనే. అనుగ్రహము, సృష్టి ఇత్యాది జగత్కార్యమును చేయునది నేనే (36).

బ్రహ్మ విష్ణువులారా! సర్వము కంటె పెద్దవాడను అగుటచేతను, సర్వమును వ్యాపించుట చేతను, నాకు బ్రహ్మ అని పేరు. కుమారులారా! సర్వులలో ఏకరూపముగ వ్యాపించియుండటచే నాకు ఆత్మ యని పేరు (37).

అనాత్మనః పరే సర్వే జీవా ఏవన సంశయః | అనుగ్రహాంతం సర్గాద్యం జగత్‌ కృత్యం చ పంచకమ్‌ || 38

ఈశత్వాదేవ మే నిత్యం న మ దన్యస్య కస్య చిత్‌ | అదౌ బ్రహ్మత్వ బుద్ధ్యర్థం నిష్కలం లింగముత్థితమ్‌ || 39

తస్మాదజ్ఞాతమీశత్వం వ్యక్తం ద్యోతయితుం హి వామ్‌ | సకలోsహమతో జాతస్సాక్షాదీశస్తు తత్‌ క్షణాత్‌ || 40

సకలత్వమతో జ్ఞేయ మీశత్వం మయి సత్వరమ్‌ | యదిదం నిష్కలం స్తంభం మమ బ్రహ్మత్వ బోధకమ్‌ || 41

ఇతరులందరు అనాత్మలు, జీవులు అనుటలో సందియము లేదు. సృష్టి మొదలు అనుగ్రహము వరకు గల పంచ విధి జగత్కార్యము (38).

ఈశుడనగు నా యందు నిత్యముగ నుండును. నాకంటె వేరుగా మరియొకనికి ఈ ఐదు కర్మలే లేవు. ముందుగా బ్రహ్మభావనను బుద్ధియందు కలిగించుటకై నేను నిరాకార లింగరూపముగా ఆవిర్భవించితిని (39).

కాని, లింగదర్శనము వలన మీకు నా ఈశ్వరభావము తెలియకుండును గాన, సాక్షాత్తుగా ఈశుడనగు నేను వెనువెంటనే మీ ముందు సాకారముగా ప్రత్యక్షమైతిని (40).

సాకారుడనగు నేను ఈశుడనని తెలియుడు. ఈ నిరాకారస్తంభము నా బ్రహ్మభావమును బోధించును (41).

లింగలక్షణ యుక్తత్వాన్మమ లింగం భ##వేదిదమ్‌ | తదిదం నిత్యమభ్యర్చ్యం యువాభ్యామత్ర పుత్రకౌ || 42

మదాత్మక మిదం నిత్యం మమ సాన్నిధ్య కారణమ్‌ | మహత్పూజ్యమిదం త్యమభేదాల్లింగలింగినోః || 43

యత్ర ప్రతిష్ఠితం యేన మదీయం లింగమీదృశమ్‌ | తత్ర ప్రతిష్ఠితస్సోsహ మప్రతిష్ఠోsపి వత్సకౌ || 44

మత్సామ్యమేక లింగస్య స్థాపనే ఫలమీరితమ్‌ | ద్వితీయే స్థాపితే లింగే మదైక్యం ఫలమేవ హి || 45

లింగం ప్రాధాన్యతః స్థాప్యం తథా బేరం తు గౌణకమ్‌ | లింగాభావే న తత్‌ క్షేత్రం సబేరమపి సర్వతః || 46

ఇతి శ్రీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహితాయాం నవమోsధ్యాయః || (9)

ఈ స్తంభము లింగాకారముగా నున్నది గనుక, లింగమే యగును. పుత్రులారా! మీరిద్దరు దీనిని నిత్యము అర్చించుడు (42).

లింగము నా స్వరూపమే. లింగ సన్నిధి నా సన్నిధియే. ఈ మహాలింగమును నిత్యము పూజించవలెను. నాకు, లింగమునకు భేదము లేదు (43).

వత్సలారా! నేను నిరాశ్రయుడనే, అయిననూ, ఇట్టి లింగము ప్రతిష్ఠింబడినచోట నేను కూడ స్థిరముగ నుందును (44).

ఒక లింగమును స్ధాపించిన వానికి సారూప్యము అను మోక్షము ఫలము. అదే వ్యక్తి రెండవ లింగమును కూడ స్థాపించినచో, సాయుజ్యమను మోక్షమును పొందును (45).

సర్వత్రా లింగమును ప్రధానముగను, మూర్తిని అప్రధానముగను స్థాపించవలెను. మూర్తి ఉన్ననూ, లింగము లేనిచో, అది క్షేత్రము కానేరదు (46).

శ్రీ శివ మహా పురాణములోని విద్యేశ్వర సంహిత యందు తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

గీతోపనిషత్తు - సాంఖ్య యోగము : 1. మనోవిజయము - మనసు వ్యాకులము చెందకుండటయే స్థితిప్రజ్ఞత్వము

🌹 1. మనోవిజయము - మనసు వ్యాకులము చెందకుండటయే స్థితిప్రజ్ఞత్వము 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 1 📚

భగవంతుని మొట్టమొదటి శాసనము కశ్మలమును వీడమని. ''కుతస్త్వా కశ్మలమ్‌ ఇదమ్‌'' అని శ్రీకృష్ణుని ప్రశ్నించుచు తన దివ్యోపదేశమును అందించినాడు. 

శ్రీభగవా నువాచ :
 *కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితమ్‌ |* 
 *అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున || 2* 

కశ్మలం అనగా మనో వ్యాకులత్వము. అది మోహముచే కలుగును. దాని వలన శోకమేర్పడును. పిరికితన మావరించును. 

మనస్సు మలినము చెందినదై సమస్తమును గజిబిజి చేయును. అనాచార్యము నాదరించుట జరుగును. స్వర్గము అనగా సువర్గము. అనగా వైభవము నుండి పద్రోయును. అపకీర్తిని కట్టబెట్టును. ఎట్టి విపత్కర పరిస్థితుల యందును మనసు వ్యాకులము చెందకుండటయే స్థితి ప్రజ్ఞత్వము. 

భాగవతుల జీవితమున దీనిని ప్రస్పుటముగ గమనించ వచ్చును. సులభముగ, త్వరితగతిని మనసు చెదరువారు బలహీనులు. వారిచే ఎట్టి ఘనకార్యములు నిర్వర్తింపబడవు.

''అనార్యము, నరకము, అపకీర్తి కట్టబెట్టు మనోవ్యాకులము నిన్నెట్లా వరించినది?'' అని భగవంతుడు అర్జునుని (నరుని అనగా మనలను) ప్రశ్నించుచున్నాడు. 

మనోవ్యాకులము నుండి విముక్తి చెందుటకు మార్గమును బోధించుచున్నాడు. కనుకనే భగవద్గీతకు మనో విజయమని కూడ పేరు కలదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శివగీత - 27 / The Siva-Gita - 27 🌹

🌹. శివగీత - 27 / The Siva-Gita - 27 🌹
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము
*🌻. శివ ప్రాదుర్భావము - 3 🌻*

రౌద్రం పాశుపతం బ్రాహ్మం - కౌబేరం కులిశా నిలమ్,
భార్గవాది బహున్యప్త్రా - ణ్యయం ప్రాయుజ్క్త రాఘవః 17
తస్మిం స్తే జపి శస్త్రాణి - చాస్త్రాణ్య స్య మహీ పతే;,
విలీ నాని మహాభ్రస్య - కరకా ఇవ నీ రధౌ 18
తతః క్షణేన జజ్వాల - ధనుస్త స్య కారా చ్చ్యుతమ్,
తూణీ రం చాంగుళీ త్రాణం - గోది కాపి మహీ పతే: 19

శ్రీరాముడు వదలిన మహాస్త్రము లన్ని ఆ గొప్ప తేజస్సులో మహా సముద్ర మనబడిన వడ గండ్ల మాదిరి కరిగి పోయినట్లుగా లీనము లైన ఆ మీదట తృటి కాలములో శ్రీ రామ చంద్రుని ధనస్సు కూడా జారి (క్రింద నేలపై ) బడి భస్మ మైనది ,(బూడిద ) మరియు అమ్ముల పొదియు, హస్త కవచము ,గోదికము నేలపై బడి దగ్ధమైనవి.

తద్ద్రుష్ట్యా లక్ష్మణో భితై- పపాత భువి మూర్చితః,
అధాకిం చిత్కరో రామో - జానుభ్యా మవనిం గతః 20
మీలితాక్షో భయా విష్ట -శ్శంకరం శరణం గతః,
స్వరేణా ప్యుచ్చ రన్నుచ్చై - శ్శంభో ర్నామ సహస్రకమ్ 21
శివంచ దండవ ద్భూమౌ - ప్రణ నామ పునః పునః,
పునశ్చ పూర్వ వచ్చాసీ - చ్చబ్దో దిజ్మండలం స్వనన్ 22
చచాల వసుధా ఘోరం - పర్వతాశ్చ చ కంపిరే,
అధ క్షణేన శీతాంశు - శ్శీతలం తేజ ఆదదత్ 23
ఉన్మీలి తాక్షో రామస్తు - యావద్యా వత్ప్ర పశ్యతి,
తావద్ద దర్శ వృషభం - సర్వాలంకార సంయుతమ్ 24
పీయూష మధనో ద్భూత - నవనీత స్య పిండ వత్,
ప్రోత స్వర్ణం మరకత - చ్చాయా శృంగ ద్వాయాంచితమ్ 25
నీల రత్నేక్షణం - హ్రస్వ - కంట కంబల భూషితమ్,
రత్న పల్యాణ సంయుక్తం -నిబద్దం శ్వేత చామరై: 26

అది గాంచి సౌమిత్రి లక్ష్మణుడు భయపడి నేలబడి మూర్చిల్లెను. 

తరువాత శ్రీరాముడు దిగ్భ్రాంతుడై యేమియు తోచక భూమిపై మొకాళ్ళూని (మోకరిల్లి ) భయకంపితుడై కనులు మూసికొని ఉమాపతే నన్ను కాపాడు వాడని యెంచి గొంతెత్తి గట్టిగా వేద సార శివ సహస్రనామములను పటించుచు ముమ్మాటికి దీర్ఘ దండ నమస్కారములు సల్పెను.

ఇంతలోనే మొదటి మాదిరిగా దిక్కులు మారు మ్రోగ మహాధ్వని కలిగెను. ఆ ధ్వనికి భూమి మరియు పర్వతములు కూడా కదలినవి . రల తృటి కాలములోనే చంద్రుని శీతలము తేజస్సు అగుపడెను.

 శ్రీరాముడు తేరుకొని చూచులోపున, పాల సముద్రమును జిలుకు (తరచు ) చుండగా అందుండి ఉద్భవించిన వెన్న ముద్ద మాదిరి తెల్లగాను, బంగారు వన్నె గల తోక గలది,మరకత మణుల ననుకరించు కొమ్ములు కలది . ఇంద్రనీలము - మణులు కన్నులు గలది కారుచ కంటమున కంబలము కలది గంటారావలములతో దశ దిశలను బూరించు నది యగు నందీశ్వరుని చూచెను .
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 𝑻𝒉𝒆 𝑺𝒊𝒗𝒂-𝑮𝒊𝒕𝒂 - 27 🌹*
*🌴. 𝑫𝒊𝒂𝒍𝒐𝒈𝒖𝒆 𝒃𝒆𝒕𝒘𝒆𝒆𝒏 𝑹𝒂𝒎𝒂 𝒂𝒏𝒅 𝑳𝒐𝒓𝒅 𝑺𝒊𝒗𝒂 🌴*
✍️ 𝑨𝒚𝒂𝒍𝒂𝒔𝒐𝒎𝒂𝒚𝒂𝒋𝒖𝒍𝒂. 
📚. 𝑷𝒓𝒂𝒔𝒂𝒅 𝑩𝒉𝒂𝒓𝒂𝒅𝒘𝒂𝒋

𝑪𝒉𝒂𝒑𝒕𝒆𝒓 04 : 
*🌻 𝑺𝒉𝒊𝒗𝒂 𝑷𝒓𝒂𝒂𝒅𝒖𝒓𝒃𝒉𝒂𝒂𝒗𝒂𝒎 - 3 🌻*

𝑾𝒉𝒂𝒕𝒆𝒗𝒆𝒓 𝒎𝒊𝒔𝒔𝒊𝒍𝒆𝒔 𝑺𝒓𝒊 𝑹𝒂𝒎𝒂 𝒑𝒓𝒐𝒋𝒆𝒄𝒕𝒆𝒅 𝒊𝒏 𝒕𝒉𝒂𝒕 𝒃𝒓𝒊𝒍𝒍𝒊𝒂𝒏𝒕 𝒍𝒊𝒈𝒉𝒕, 𝒂𝒍𝒍 𝒕𝒉𝒐𝒔𝒆 𝒎𝒊𝒔𝒔𝒊𝒍𝒆𝒔 𝒗𝒂𝒏𝒊𝒔𝒉𝒆𝒅 𝒊𝒏𝒕𝒐 𝒕𝒉𝒂𝒕 𝒃𝒓𝒊𝒍𝒍𝒊𝒂𝒏𝒄𝒆 𝒂𝒔 𝒍𝒊𝒌𝒆 𝒂𝒔 𝒊𝒄𝒆 𝒄𝒖𝒃𝒆𝒔 𝒎𝒆𝒍𝒕 𝒊𝒏 𝒐𝒄𝒆𝒂𝒏𝒔. 

𝑰𝒏 𝒂𝒏𝒐𝒕𝒉𝒆𝒓 𝒇𝒆𝒘 𝒔𝒆𝒄𝒐𝒏𝒅𝒔 𝑹𝒂𝒎𝒂'𝒔 𝒃𝒐𝒘 𝒇𝒆𝒍𝒍 𝒅𝒐𝒘𝒏 𝒐𝒏 𝒊𝒕𝒔 𝒐𝒘𝒏 𝒂𝒏𝒅 𝒈𝒐𝒕 𝒓𝒆𝒅𝒖𝒄𝒆𝒅 𝒕𝒐 𝒂𝒔𝒉𝒆𝒔. 𝑨𝒍𝒔𝒐, 𝒉𝒊𝒔 𝒉𝒂𝒏𝒅 𝒔𝒉𝒊𝒆𝒍𝒅 𝒂𝒏𝒅 𝒐𝒕𝒉𝒆𝒓 𝒂𝒄𝒄𝒆𝒔𝒔𝒐𝒓𝒊𝒆𝒔 𝒕𝒐𝒐 𝒇𝒆𝒍𝒍 𝒅𝒐𝒘𝒏 𝒂𝒏𝒅 𝒈𝒐𝒕 𝒊𝒏𝒄𝒊𝒏𝒆𝒓𝒂𝒕𝒆𝒅.

𝑺𝒆𝒆𝒊𝒏𝒈 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆𝒔𝒆 𝒅𝒊𝒔𝒂𝒔𝒕𝒆𝒓𝒔 𝒉𝒂𝒑𝒑𝒆𝒏𝒊𝒏𝒈 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝑹𝒂𝒎𝒂, 𝑳𝒂𝒌𝒔𝒉𝒎𝒂𝒏𝒂 𝒕𝒓𝒆𝒎𝒃𝒍𝒆𝒅 𝒂𝒏𝒅 𝒇𝒆𝒍𝒍 𝒅𝒐𝒘𝒏 𝒖𝒏𝒄𝒐𝒏𝒄𝒊𝒐𝒖𝒔. 

𝑨𝒇𝒕𝒆𝒓 𝒕𝒉𝒂𝒕 𝑹𝒂𝒎𝒂 𝒊𝒏 𝒂 𝒄𝒐𝒏𝒇𝒖𝒔𝒆𝒅 𝒔𝒕𝒂𝒕𝒆 𝒖𝒏𝒂𝒃𝒍𝒆 𝒕𝒐 𝒕𝒉𝒊𝒏𝒌 𝒐𝒇 𝒂𝒏𝒚𝒕𝒉𝒊𝒏𝒈, 𝒌𝒏𝒆𝒍𝒕 𝒅𝒐𝒘𝒏 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒈𝒓𝒐𝒖𝒏𝒅 𝒘𝒊𝒕𝒉 𝒕𝒓𝒆𝒑𝒊𝒅𝒂𝒕𝒊𝒐𝒏, 𝒄𝒍𝒐𝒔𝒆𝒅 𝒉𝒊𝒔 𝒆𝒚𝒆𝒔 𝒂𝒏𝒅 𝒕𝒉𝒐𝒖𝒈𝒉𝒕 𝒕𝒉𝒂𝒕 𝒐𝒏𝒍𝒚 𝒕𝒉𝒆 𝒍𝒐𝒓𝒅 𝒐𝒇 𝑼𝒎𝒂 𝒘𝒐𝒖𝒍𝒅 𝒃𝒆 𝒄𝒂𝒑𝒂𝒃𝒍𝒆 𝒐𝒇 𝒑𝒓𝒐𝒕𝒆𝒄𝒕𝒊𝒏𝒈 𝒉𝒊𝒎. 

𝑾𝒊𝒕𝒉 𝒂𝒏 𝒖𝒑𝒓𝒊𝒔𝒆𝒅 𝒗𝒐𝒊𝒄𝒆 𝒉𝒆 𝒄𝒉𝒂𝒏𝒕𝒆𝒅 𝒕𝒉𝒆 𝒕𝒉𝒐𝒖𝒔𝒂𝒏𝒅 𝒏𝒂𝒎𝒆𝒔 𝒐𝒇 𝑺𝒉𝒊𝒗𝒂 𝒃𝒚 𝒐𝒇𝒇𝒆𝒓𝒊𝒏𝒈 𝒑𝒓𝒐𝒔𝒕𝒓𝒂𝒕𝒊𝒐𝒏𝒔 𝒊𝒏𝒕𝒆𝒓𝒎𝒊𝒕𝒕𝒆𝒏𝒕𝒍𝒚. 𝑰𝒏 𝒂 𝒘𝒉𝒊𝒍𝒆 𝑹𝒂𝒎𝒂 𝒉𝒆𝒂𝒓𝒅 𝒕𝒉𝒆 𝒔𝒂𝒎𝒆 𝒇𝒆𝒂𝒓𝒔𝒐𝒎𝒆 𝒔𝒐𝒖𝒏𝒅 𝒆𝒄𝒉𝒐𝒊𝒏𝒈 𝒊𝒏 𝒂𝒍𝒍 𝒅𝒊𝒓𝒆𝒄𝒕𝒊𝒐𝒏𝒔. 

𝑬𝒂𝒓𝒕𝒉 𝒂𝒏𝒅 𝒉𝒊𝒍𝒍𝒔 𝒂𝒍𝒔𝒐 𝒕𝒓𝒆𝒎𝒃𝒍𝒆𝒅 𝒅𝒖𝒆 𝒕𝒐 𝒕𝒉𝒂𝒕 𝒕𝒆𝒓𝒓𝒊𝒃𝒍𝒆 𝒏𝒐𝒊𝒔𝒆. 𝑻𝒉𝒆𝒏 𝒘𝒊𝒕𝒉𝒊𝒏 𝒂 𝒔𝒑𝒍𝒊𝒕 𝒔𝒆𝒄𝒐𝒏𝒅 𝑹𝒂𝒎𝒂 𝒐𝒃𝒔𝒆𝒓𝒗𝒆𝒅 𝒂 𝒄𝒐𝒐𝒍 𝒎𝒐𝒐𝒏𝒔𝒉𝒊𝒏𝒆 𝒆𝒗𝒆𝒓𝒚𝒘𝒉𝒆𝒓𝒆. 

𝑩𝒆𝒇𝒐𝒓𝒆 𝑹𝒂𝒎𝒂 𝒄𝒐𝒖𝒍𝒅 𝒖𝒏𝒅𝒆𝒓𝒔𝒕𝒂𝒏𝒅 𝒘𝒉𝒂𝒕 𝒊𝒕 𝒘𝒂𝒔, 𝒉𝒆 𝒇𝒐𝒖𝒏𝒅 𝒔𝒐𝒎𝒆𝒐𝒏𝒆 𝒘𝒉𝒐 𝒘𝒂𝒔 𝒂𝒔 𝒘𝒉𝒊𝒕𝒆 𝒂𝒔 𝒕𝒉𝒆 𝒄𝒓𝒆𝒂𝒎 𝒐𝒃𝒕𝒂𝒊𝒏𝒆𝒅 𝒅𝒖𝒓𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒄𝒉𝒖𝒓𝒏𝒊𝒏𝒈 𝒐𝒇 𝒎𝒊𝒍𝒌𝒚 𝒐𝒄𝒆𝒂𝒏, 

𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂 𝒈𝒐𝒍𝒅 𝒐𝒓𝒏𝒂𝒎𝒆𝒏𝒕𝒆𝒅 𝒕𝒂𝒊𝒍, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂 𝒑𝒂𝒊𝒓 𝒐𝒇 𝒉𝒐𝒓𝒏𝒔 𝒅𝒆𝒄𝒌𝒆𝒅 𝒘𝒊𝒕𝒉 𝒅𝒊𝒂𝒎𝒐𝒏𝒅𝒔, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒃𝒍𝒖𝒆 𝒈𝒆𝒎𝒔 𝒌𝒊𝒏𝒅 𝒐𝒇 𝒆𝒚𝒆𝒔, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂𝒏 𝒆𝒍𝒆𝒈𝒂𝒏𝒕 𝒄𝒐𝒗𝒆𝒓 𝒐𝒏 𝒊𝒕𝒔 𝒃𝒂𝒄𝒌, 

𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂 𝒈𝒆𝒎 𝒅𝒆𝒄𝒌𝒆𝒅 𝒓𝒐𝒑𝒆 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝒕𝒉𝒆 𝒏𝒆𝒄𝒌, 𝒂𝒏𝒅 𝒘𝒉𝒊𝒄𝒉 𝒘𝒂𝒔 𝒓𝒆𝒏𝒕𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒔𝒌𝒊𝒆𝒔 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝒔𝒘𝒆𝒆𝒕 𝒋𝒊𝒏𝒈𝒍𝒊𝒏𝒈 𝒏𝒐𝒊𝒔𝒆 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒃𝒆𝒍𝒍𝒔 𝒑𝒓𝒆𝒔𝒆𝒏𝒕 𝒐𝒏 𝒉𝒊𝒔 𝒃𝒐𝒅𝒚.

𝑻𝒉𝒂𝒕 𝒘𝒂𝒔 𝒕𝒉𝒆 𝑩𝒖𝒍𝒍 𝑵𝒂𝒏𝒅𝒊 𝒘𝒉𝒐𝒎 𝑹𝒂𝒎𝒂 𝒃𝒆𝒉𝒆𝒍𝒅 𝒊𝒏 𝒇𝒓𝒐𝒏𝒕 𝒐𝒇 𝒉𝒊𝒎.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 19 / Sri Gajanan Maharaj Life History - 19 🌹

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 19 / Sri Gajanan Maharaj Life History - 19 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 4వ అధ్యాయము - 4 🌻*

తన ఈజీవిత విషాదావస్థ నుండి క్షమించి కాపాడమని పదేపదే భగవంతుడిని ప్రార్ధించాడు. 

పూర్తి పశ్చాత్తాపంతో ఇతను శ్రీగజానన్ దగ్గరకు వచ్చి ఆహారంమాని ఆయన ద్వారం దగ్గరే భగవన్నామస్మరణ చేసాడు. ఒకరోజు పూర్తిగా ఈవిధంగా చేసినతరువాత, నువ్వు చేస్తున్నపని సరికాదు. భగవంతుడిని ఇంతకు ముందు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు ? 

మనిషి మరణించిన తరువాత వైద్యుని పిలిచినట్టు, లేదా యవ్వనం అంతా అయిపోయిన తరువాత ముసలి తనంలో పెళ్ళి చేసుకున్నట్టు ఉంది. ప్రతిపని సరిఅయిన సమయంలో చెయ్యాలి, లేకపోతే దానికి ఫలితంఉండదు. ఇల్లు అంటుకున్నాక నుయ్యి తవ్వడం నిరుపయోగం. 

ఏ సంసారంకోసం జీవితం అంతా తాపత్రయం పడ్డావో వాళ్ళు నిన్ను ఒంటరిని చేసి పోయారు. శాశ్వతమయిన దానిని వదలి, అశాశ్వతమయిన విషయాలలో నీ సమయంపూర్తిగా వృధాచేసావు. దానికి బదులుగా ఇప్పుడు ఫలితాలను అనుభవించకుండా తప్పించుకోలేవు, కావున మొండితనం వదలి సమంజసంగా ఉండు అని శ్రీగజానన్ అన్నారు. 

మిగిలిన వాళ్ళు కూడా అతనికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరిని లక్ష్య పెట్టక తన నిరాహారత, భగవన్నామస్మరణ కొనసాగించాడు. మధ్యరాత్రి బాగాచీకటిగానూ, ఎవరూ చుట్టుపక్కల లేని సమయంలో శ్రీమహారాజు మాధవు తో ఒక తమాషా చేసారు. 

భయానకమయిన యమునిరూపం దాల్చి, మృత్యుదేవతగా పెద్దగా నోరుతెరచుకొని మాధవ్ దగ్గరకు ఆయన తినేలా దూసుకు వస్తారు. మాధవ్ మాటలుడిగి, భయభ్రాంతుడయి, దడదడ లాడుతున్న హృదయంతో పరిగెత్తడం మొదలు పెట్టాడు. అతని ఆపరస్థితిచూసి శ్రీమహారాజు తన మామూలు రూపుధారణ దాల్చి, ఇదేనా నీకు ఉన్న ధైర్యం ? 

నువ్వు మృత్యువుకి ఆహారంవంటి వాడివి అనిగుర్తు ఉంచుకో, అది నిన్ను ఇలానే కబళించి తీరుతుంది. నువ్వు రాబోయే కాలంలో దీనినుండి తప్పించుకోలేవు, యమలోకంలో గడపబోయే విషయంగూర్చి నేను నీకు ఇప్పుడు చూపించాను అని గట్టిగా అంటారు. యమలోకంనుండి దయచేసి నన్ను రక్షించండి, ఈజీవితంకూడా నాకువద్దు. 

నన్ను వైకుంఠం పంపించమని నాచివరి నివేదన. ఒకసారి మీరు నాకు నరకం చూపించారు కనుక మరలా నన్ను అక్కడకు పంపకండి. నేను చేసిన పాపాలగురించి పూర్తిగా నేను పరిచితుడను, అయినా మీరు తలచుకుంటే నన్ను వాటినుండి విముక్తి చేయడం కష్టంకాదు. 

బహుశ కొద్ది పుణ్యకార్యాలవల్ల నాకు మీ పాదాల దగ్గర ఉండే అదృష్టం కలిగింది, మరియు యోగులతో సంగమం చేసిన వాళ్ళు యమలోకం వెళ్ళలేరు అని మాధవ్ అంటాడు. భగవన్నామస్మరణ చేస్తూఉండు, నీకు మృత్యువు అతి దగ్గరలో ఉంది. ఇంకా బతకాలి అనిఉంటే చెప్పు నీజీవిత కాలం నేను పొడిగిస్తాను అని శ్రీమహారాజు అన్నారు. 

నేను ఏమాత్రం ఇంక జీవించ దలచుకోలేదు, ఇది అంతా మిధ్య కావున నన్ను ఏమాత్రం దీనిలో ఇక ఇరికించకండి అని మాధవ్ అంటాడు. తధాస్తు నీవు కోరినదే నీకు ఇస్తున్నాను. నీవు తిరిగి ఈ పృధ్విపై జన్మించవు అని శ్రీమహారాజు అంటారు. అటువంటి రహస్యమయిన సంభాషణ వారి ఇరువురి మధ్య అయింది. 

దీనిని వర్నించడానికి నాదగ్గర మాటలు కరువవుతాయి. మాదవ్ తన దైనిక జీవిత విషయాలుకూడా మరచి పోయాడు. దీనికి కారణం అతను ఉపవాసాలు చేయడమే అని ప్రజలు అనుకున్నారు. శ్రీగజానన్ మహారాజు పాదాలవద్ద మాధవ్ మరణించి, చివరికి ఈ జీవన్మరణ చక్రవ్యూహంనుండి తప్పించుకున్నాడు. 

శ్రీమహారాజుకు ఒకసారి వేదాలు వినాలని కోరిక కలిగి, ఇవి చదవగలిగే బ్రాహ్మణులను తెమ్మని తన భక్తులతో అంటారు. వేదాలు చదవగలిగేటు వంటి చదువుకున్న బ్రాహ్మణులు ఈకాలంలో దొరకడంలేదు అని భక్తులు అంటారు. 

అయినా సరే బ్రాహ్మణులు మరుసటి రోజు వస్తారు, మీరు అన్నీ తయారు చేయండి అని స్వామీజీ అంటారు. భక్తులు ఆనందపడి తయారు ప్రారంభించి 100 రూపాయలు విరాళం పోగుచేస్తారు. మరుసటిరోజు మధ్యాహ్నం సమయంలో ఒక గుంపు చదువుకున్న బ్రాహ్మణులు షేగాం వచ్చి శ్రీగజానన్ మహారాజు ఎదుట వేదం చదువుతారు. 

వారందరికి దక్షిణ ఇవ్వబడింది. తరువాత వారు వెళ్ళిపోయారు. యోగుల కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడు అని దీనినిబట్టి అర్థం అవుతుంది. బనకటలాల్, ఆ తరువాత అతని కుటుంబీకులు ప్రతి సంవత్సరం అదేరోజు ఈ వేద పఠనం కొనసాగిస్తున్నారు. 

శుభం భవతు
 4. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 19 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 4 - part 4 🌻*

Again and again he begged pardon from God and prayed for helping him out of the tragedy of his life. Full of repentance he came to Shri Gajanan and squatted at His doors fasting and chanting the name of God. 

After one full day of his fasting Shri Gajanan said, What you are doing is not proper. Why did you not remember God before this? It is just like calling a doctor after the death of patient or like marrying in old age, after spending one’s youth being a bachelor. 

Everything should be done in its proper time. Otherwise the action bears no fruits. There is no use digging a well when the house is on fire. The family for whom you toiled in your good days has left you alone. You wasted all your time attaining things that were transient and forgot the One truth which is eternal. 

Consequently, you now have to bear the results of your actions from which there is no escape. So do not be obstinate. Be reasonable. Other people also tried to persuade him but he ignored them all, kept up his fast and the chanting of “Narayan, Narayan”. 

To teach Madaho a lesson, Shri Gajanan played a trick on Madhao. At mid night when it was pitch dark, and nobody was near about, He changed His human form into a fearful form of Yama, the God of death, and with a big open jaw rushed towards Madhao, as if to eat him. 

Madhao was dumb founded and with a throbbing heart, started to run away. Looking at his condition, Shri Gajanan Maharaj regained His normal self and loudly said, Is this the boldness that you have got? 

Remember that you are the food of death, and it will swallow you like this only. What I have shown is an indication of future happening of Yamalok wherefrom you will not be able to run away”. 

Madhao replied, “Kindly save me from Yamalok. I do not want this life also. My last request to You is to send me to Vaikunth. You have already shown me Yamalok once, so do not send me there again. I am fully aware of my sins and if you wish, it is not difficult for You to free me from them. 

I am fortunate enough to be at your feet, probably because of some good deeds to my credit. The one who meets a saint during his lifetime cannot go to Yamalok”. Shri Gajanan Maharaj said, “Keep on chanting the name of Narayan, as your death is quite near now. 

If you still want to live, tell me and I will extend your life span. Madhao said, “I do not want to live any more. This world is all unreal and so kindly don’t let me get involved in its attractions”. Upon which, Shri Gajanan Maharaj said, TATHASTU - I give you what you want. 

You will not be reborn on this earth.” Such was the secret conversation between them, for which my words fall short to describe. Madhao lost all the worldly responses, people thought it to be the effect of his fasting. 

Madhao died at the feet of Shri Gajanan Maharaj and finally escaped the cycle of birth and death. Once Shri Gajanan Maharaj wished to listen to the Vedas and so asked the devotees to get some learned Brahmins for their recitation. 

The devotees said that learned Brahmins, able to recite Vedas, were not available their days. Swamiji however, asked them to go ahead with the making of the necessary preparations saying that the Brahmins would come the next day. 

The devotees were happy; they started the preparations and collected a sum of one hundred rupees for that purpose. The next day, at noontime, a team of learned Brahmins really arrived at Shegaon! They recited the Vedas before Shri Gajanan Maharaj. All of them were given Dakshina. 

Then they went away. This shows that Almighty God fulfils all the desires of the saints. Bankatlal, and now his descendants, continued this recitation of Vedas on that particular day every year. 

||SHUBHAM BHAVATU||
 Here ends Chapter Four

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

10-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 454 / Bhagavad-Gita - 454🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 242 / Sripada Srivallabha Charithamrutham - 242 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 122🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 144 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 58 / Sri Lalita Sahasranamavali - Meaning - 58 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 61 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 29🌹
8) 🌹. శివగీత - 27 / The Shiva-Gita - 27 🌹
9) 🌹. సౌందర్య లహరి - 69 / Soundarya Lahari - 69 🌹
10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము 1📚
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 368 / Bhagavad-Gita - 368🌹

12) 🌹. శివ మహా పురాణము - 194 🌹
13)  🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 70 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 65 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 81 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 12 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 30🌹
18) 🌹. అద్భుత సృష్టి - 2 🌹
19) 🌹 Seeds Of Consciousness - 142 🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 24🌹
21) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 9 🌹
21)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 454 / Bhagavad-Gita - 454 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -11 🌴*

11. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత: |
సర్వకర్మఫలత్యాగం తత: కురు యతాత్మవాన్ ||

🌷. తాత్పర్యం : 
అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో త్యాగము చేసి ఆత్మస్థితుడవగుట యత్నింపుము.

🌷. భాష్యము :
సాంఘిక, కుటుంబ, ధర్మపరిస్థితుల రీత్యా లేదా ఇతర ఆటంకముల కారణముగా మనుజుడు కృష్ణచైతన్య ప్రచారోద్యమ కార్యక్రమములందు సహాయానుభూతిని చూప సమర్థుడు కాకపోవచ్చును. అట్టి కార్యక్రమములలో ప్రత్యక్షముగా పాల్గొనినచో కుటుంబసభ్యుల నుండి నిషేధములు లేదా ఇతర కష్టములు సంప్రాప్తింపవచ్చును. 

అటువంటి కష్టము కలిగినవాడు తన కర్మల ద్వారా ప్రోగైన ధనమును ఏదేని ఓక మంచి కార్యమునకై ఉపయోగించవచ్చునని ఉపదేశింపబడినది. అట్టి విధానములు వేదములందు వివరింపబడినవి.

 వివిధములైన యజ్ఞములు మరియు విశేష పుణ్యకార్యములు (పూర్వకర్మఫలములను వినియోగించుటకు వీలు కలిగించెడి కొన్ని ముఖ్యకర్మలు) వాని యందు పెక్కుగలవు. 

ఆ విధముగా మనుజుడు క్రమముగా జ్ఞానస్థాయికి ఉద్ధరింపగలడు. కృష్ణపరకర్మల యందు అభిరుచి లేనివాడు సైతము కొన్నిమార్లు వైద్యశాలకో లేదా సాంఘికసంస్థకో తన కష్టార్జితమును దానము చేయుటను మనము గాంచుచుందుము. 

ఇట్టి దానము కూడ ఇచ్చట సమర్థింపబడినది. ఏలయన తన కర్మఫలములను త్యాగము చేయుటను అభ్యసించుట ద్వారా మనుజుడు క్రమముగా మనస్సును పవిత్రమొనర్చుకొనగలడు. 

అట్టి మనోపవిత్రత కలిగిన స్థితిలో అతడు కృషభక్తిరసభావనను అవగాహన చేసికొనుటకు సమర్థుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 454 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 11 🌴*

11. athaitad apy aśakto ’si
kartuṁ mad-yogam āśritaḥ
sarva-karma-phala-tyāgaṁ
tataḥ kuru yatātmavān

🌷 Translation : 
If, however, you are unable to work in this consciousness of Me, then try to act giving up all results of your work and try to be self-situated.

🌹 Purport :
It may be that one is unable even to sympathize with the activities of Kṛṣṇa consciousness because of social, familial or religious considerations or because of some other impediments. 

If one attaches himself directly to the activities of Kṛṣṇa consciousness, there may be objections from family members, or so many other difficulties. 

For one who has such a problem, it is advised that he sacrifice the accumulated result of his activities to some good cause. Such procedures are described in the Vedic rules. There are many descriptions of sacrifices and special functions for the full-moon day, and there is special work in which the result of one’s previous action may be applied. 

Thus one may gradually become elevated to the state of knowledge. It is also found that when one who is not even interested in the activities of Kṛṣṇa consciousness gives charity to some hospital or some other social institution, he gives up the hard-earned results of his activities. 

That is also recommended here because by the practice of giving up the fruits of one’s activities one is sure to purify his mind gradually, and in that purified stage of mind one becomes able to understand Kṛṣṇa consciousness. 

Of course, Kṛṣṇa consciousness is not dependent on any other experience, because Kṛṣṇa consciousness itself can purify one’s mind, but if there are impediments to accepting Kṛṣṇa consciousness, one may try to give up the results of his actions. 

In that respect, social service, community service, national service, sacrifice for one’s country, etc., may be accepted so that some day one may come to the stage of pure devotional service to the Supreme Lord. 

In Bhagavad-gītā (18.46) we find it is stated, yataḥ pravṛttir bhūtānām: if one decides to sacrifice for the supreme cause, even if he does not know that the supreme cause is Kṛṣṇa, he will come gradually to understand that Kṛṣṇa is the supreme cause by the sacrificial method.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 242 / Sripada Srivallabha Charithamrutham - 242 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

 అధ్యాయం 51           
*🌻. శ్రీపాదులు అంతర్హితులగుట 🌻*       

        ఆ రోజు హస్తా నక్షత్ర యుక్త అశ్వయుజ కృష్ణ ద్వాదశి. కృష్ణానదిలో స్నానంచేసి శ్రీపాదులు ధ్యానస్థులు అయ్యారు. నేను గాడిపొయ్యి వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాను. కాని ఎంతకూ వెలగడం లేదు. 

శ్రీపాదుల ఉత్తరువు ప్రకారం నేను ఇంకొక మారు స్నానంచేసి వచ్చాక వారు ఇలా చెప్పారు, "నాయనా! శంకరా! నేను గుప్తంగా ఉండే సమయం దగ్గరకు వచ్చింది. నేను కృష్ణానదిలో అంతర్ధానం అవుతాను. కాని అదృశ్యరూపంలో ఇక్కడ సంచరిస్తూనే ఉంటాను. నీవు రచించే శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం మహా పవిత్ర గ్రంథం. భక్తజనులకి అది కల్పతరువు కాగలదు. 

మనోమయ జగత్తును సరిచేయడానికి, ఇహ పరసాధ నాలను సమకూర్చడానికి ఈ గ్రంథ పఠనం ఎంతో ఉప యోగపడుతుంది. నీవు వ్రాసే సంస్కృత ప్రతి నా మహా సంస్థానంలో ఔదుంబర వృక్షం క్రింద అనేక నిలువుల లోతులలో శబ్దరూపమై నిలచి ఉంటుంది; కాని చర్మ శ్రోత్రాలకు ఆ దివ్యశబ్దాలు వినబడవు. దీని తెలుగు అనువాదం బాపనార్యుల వారి 33వ తరంలో వెలుగులోకి వస్తుంది. 

ఏ భాషలో చదివినా ఫలితాలు, నా రక్షణ ఒకే విధంగా ఉంటాయి. నీవు కన్న బిడ్డలా నాకు ఎంతో సేవ చేసావు. నా చెక్క పాదుకలని నీకు ఇస్తున్నాను. నా కోసం దుఃఖించకుండా ఇంకొక మూడు సంవత్సరాలు ఇక్కడే ఉండి, గ్రంథ రచన పూర్తి చేసుకొని, ఇదే అశ్వయుజ కృష్ణ ద్వాదశి రోజున నా పాదుకల వద్ద చదివి వినిపించు. ఆ రోజున నా దర్శనం కోసం వచ్చి ఈ చరితామృతాన్ని వినగలిగేవారు ఎంతో ధన్యులు. 

తేజో రూపంలో కనబడుతూ నీకు నేను అనేక యోగ రహస్యాలని బోధిస్తాను." అని చెప్పి వారు నదిలో అంతర్హితులయ్యారు. నేను తల్లిని కోల్పోయిన బిడ్డలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పోయాను. తరువాత స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటే శ్రీపాదుల తేజోమయ రూపం మనోనేత్రాల ముందు గోచరించింది.          

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 242 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 27
*🌴 Virupaksha darshan in Panchadeva Pahad 🌴*

*🌻 The speciality of Thursday 🌻*

Sri Dharma Gupta and I reached this side of Krishna. It was afternoon. It was Thursday also. 

That was the most sacred time of the afternoon of Thursday when Guru Sarvabhouma took ‘bhiksha’ at different places at the same time. Sripada asked us to build a ‘kuteer’ with dry grass at Panchadeva Pahad, that too, in one day. This area was not familiar to us. To build a house, a land was needed.

*🌻 The speciality of Panchadeva Pahad area 🌻*

Like aimless travellers, we were moving here and there. We entered into the fields of a farmer. He was building a ‘gosala’ for the sake of his cows. A platform was being constructed at an elevated place for the owner to sit. The owner of the field welcomed us cordially and gave food. We were hungry. We were hesitating whether we could eat food given by a ‘sudra’.  

The owner said, “Oh! You stole our cattle and sold them in other places, and you have come again with a mean intention to see if there are any more cattle to lift. Now you have a doubt whether to eat food given by a Sudra.” Thus, he curtly said. We understood.  

That owner was thinking us as thieves. We ate the food reluctantly. During the course of conversation, we came to know that his name was Virupaksha. After eating, we both were tied to two trees.  

I was a poor Brahmin. I lived on begging. I did not have any money. But Dharma Gupta had money. That farmer told his servants to take away money from him.  

*🌻 Sripada’s incomprehensible leelas 🌻*

We understood that it was no use telling them about us. By the orders of the owner of the land, we became prisoners not knowing what to do. Meanwhile some ‘Mylars’ came. In these ‘Mylars’ there is a sect called ‘ganga kavillu’.  

They will be carrying Sri Vasavee Kanyaka Parameswari peethas. They wear ‘tripundras’ (lines of vibhudi on fore head). With ‘je ghantas’ (victory bells) in their hands, they sing songs praising Sri Kanyaka Parameswari Devi.  

The ‘ganga kavillus’ keep water vessels in ‘kavillu’ and come at the time of marriages and other auspicious occasions and on the occasion of birth day of Sri Vasavee Matha.  

Apart from them, people called ‘veera musthis’ come with ‘prabhas’ (lighted sticks) tied around their waists shouting ‘jaya jaya’ and sounding ‘je ghantas’ in their hands.  

On those ‘prabhas’ one can see swords, armors and many more different war symbols. Along with ‘Mylars’, Veera Mushtis also came to that place.  

Some soldiers of Vishnu Vardhana King became Vasavee Matha’s disciples and along with ‘Bala Nagars’ fought with the soldiers loyal to Vishnuvardhana. The descendents of those soldiers who became devotees of Vasavee matha are called ‘Veera Mushtis’.  

Because, they offered their money and lives in that sacred war, vysya prabhus would honour them on auspicious occasions.

That farmer gave food to Mylars and Veera Mushtis and honoured them.  

Later, they released us and requested us to take part in the construction of ‘goshala’ (cow shed). We agreed. After the work was over, Virupaksha questioned me, ‘Do you know what ‘Mushti’ and ‘Veera Mushti’ are?’ I said that I did not know.  

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 122 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻 శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు 🌻*

సాందీపని మహర్షి యొక్క శిష్యునిగా చేరి శ్రీకృష్ణుడు నాలుగు వేదములను , ఆరు వేదాంగములతో అభ్యసించెను. మరియు అరువది నాలుగు విద్యలను గురువు వలన వినినంతనే పూర్తిగా గ్రహించెను.  

లోకమునకే గురువైన తాను మరియొక గురుని దగ్గర నేర్చుట మిగిలిన వారనుకరించి నేర్చుకొనుటకు మాత్రమే. కానిచో జగద్గురువగు తనకు ఇతరులు గురువులు కాగలరా !

ఇవి యన్నియు అతని లీలలు.

 దేహములు త్రిగుణముల వెలుగులని మరువని వారికి దేహసౌఖ్యము అప్రయత్నముగా సిద్ధించినను దాని బంధములు, దుఃఖములు కలుగవు.
.... ✍🏼. *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 𝑻𝒉𝒆 𝑴𝒂𝒔𝒕𝒆𝒓𝒔 𝒐𝒇 𝑾𝒊𝒔𝒅𝒐𝒎 - 𝑻𝒉𝒆 𝑱𝒐𝒖𝒓𝒏𝒆𝒚 𝑰𝒏𝒔𝒊𝒅𝒆 - 144 🌹*
*🌴 𝑫𝒆𝒂𝒍𝒊𝒏𝒈 𝒘𝒊𝒕𝒉 𝑶𝒃𝒔𝒕𝒂𝒄𝒍𝒆𝒔 - 6 🌴*
✍️ 𝑴𝒂𝒔𝒕𝒆𝒓 𝑬. 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂𝒎𝒂𝒄𝒉𝒂𝒓𝒚𝒂
📚 . 𝑷𝒓𝒂𝒔𝒂𝒅 𝑩𝒉𝒂𝒓𝒂𝒅𝒘𝒂𝒋

*🌻 𝑮𝒂𝒏𝒆𝒔𝒉𝒂 🌻*

𝑰𝒏 𝒕𝒉𝒆 𝑬𝒂𝒔𝒕𝒆𝒓𝒏 𝒕𝒓𝒂𝒅𝒊𝒕𝒊𝒐𝒏 𝑮𝒂𝒏𝒆𝒔𝒉𝒂, 𝒕𝒉𝒆 𝒆𝒍𝒆𝒑𝒉𝒂𝒏𝒕-𝒉𝒆𝒂𝒅𝒆𝒅 𝒈𝒐𝒅, 𝒊𝒔 𝒘𝒐𝒓𝒔𝒉𝒊𝒑𝒑𝒆𝒅 𝒂𝒔 𝒕𝒉𝒆 𝒆𝒏𝒆𝒓𝒈𝒚 𝒓𝒆𝒎𝒐𝒗𝒊𝒏𝒈 𝒐𝒃𝒔𝒕𝒂𝒄𝒍𝒆𝒔 𝒊𝒏 𝒍𝒊𝒇𝒆 𝒂𝒏𝒅 𝒉𝒆𝒍𝒑𝒊𝒏𝒈 𝒕𝒐 𝒄𝒍𝒆𝒂𝒓 𝒕𝒉𝒆 𝒎𝒊𝒏𝒅. 𝑶𝒃𝒔𝒕𝒂𝒄𝒍𝒆𝒔 𝒄𝒐𝒎𝒆 𝒂𝒃𝒐𝒖𝒕 𝒕𝒉𝒓𝒐𝒖𝒈𝒉 𝒘𝒓𝒐𝒏𝒈 𝒕𝒉𝒐𝒖𝒈𝒉𝒕𝒔, 𝒂𝒍𝒔𝒐 𝒕𝒉𝒓𝒐𝒖𝒈𝒉 𝒓𝒊𝒈𝒉𝒕 𝒕𝒉𝒐𝒖𝒈𝒉𝒕𝒔 𝒂𝒕 𝒕𝒉𝒆 𝒘𝒓𝒐𝒏𝒈 𝒎𝒐𝒎𝒆𝒏𝒕. 

𝑯𝒐𝒘𝒆𝒗𝒆𝒓, 𝒊𝒇 𝒕𝒉𝒆 𝒓𝒊𝒈𝒉𝒕 𝒕𝒉𝒐𝒖𝒈𝒉𝒕𝒔 𝒄𝒐𝒎𝒆 𝒂𝒕 𝒕𝒉𝒆 𝒓𝒊𝒈𝒉𝒕 𝒎𝒐𝒎𝒆𝒏𝒕, 𝒕𝒉𝒆 𝒑𝒍𝒂𝒏 𝒄𝒂𝒏 𝒃𝒆 𝒆𝒙𝒆𝒄𝒖𝒕𝒆𝒅 𝒔𝒖𝒄𝒄𝒆𝒔𝒔𝒇𝒖𝒍𝒍𝒚. 𝑮𝒂𝒏𝒆𝒔𝒉𝒂 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒄𝒐𝒔𝒎𝒊𝒄 𝒂𝒔𝒑𝒆𝒄𝒕 𝒐𝒇 𝑱𝒖𝒑𝒊𝒕𝒆𝒓, 𝒕𝒉𝒆 𝑳𝒐𝒓𝒅 𝒐𝒇 𝑳𝒐𝒗𝒆 𝒂𝒏𝒅 𝑾𝒊𝒔𝒅𝒐𝒎. 

𝑾𝒉𝒆𝒏 𝒘𝒆 𝒊𝒏𝒗𝒐𝒌𝒆 𝒉𝒊𝒎 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝒔𝒐𝒖𝒏𝒅 𝒐𝒇 𝑮𝑨𝑴, 𝒂 𝒕𝒓𝒂𝒏𝒔𝒇𝒐𝒓𝒎𝒂𝒕𝒊𝒐𝒏 𝒕𝒂𝒌𝒆𝒔 𝒑𝒍𝒂𝒄𝒆 𝒊𝒏 𝒖𝒔. 𝑶𝒖𝒓 𝒎𝒆𝒏𝒕𝒂𝒍 𝒑𝒂𝒕𝒕𝒆𝒓𝒏𝒔 𝒈𝒆𝒕 𝒓𝒆𝒔𝒕𝒓𝒖𝒄𝒕𝒖𝒓𝒆𝒅 𝒂𝒏𝒅 𝒕𝒉𝒆 𝒇𝒍𝒐𝒘 𝒐𝒇 𝒆𝒏𝒆𝒓𝒈𝒚 𝒄𝒂𝒏 𝒕𝒉𝒖𝒔 𝒄𝒊𝒓𝒄𝒖𝒍𝒂𝒕𝒆 𝒇𝒓𝒆𝒆𝒍𝒚. 

𝑰𝒕 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒆𝒙𝒑𝒆𝒓𝒊𝒆𝒏𝒄𝒆 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒔𝒆𝒆𝒓𝒔 𝒐𝒇 𝒂𝒏𝒄𝒊𝒆𝒏𝒕 𝒕𝒊𝒎𝒆𝒔 𝒕𝒉𝒂𝒕 𝒘𝒉𝒆𝒏 𝒂𝒏 𝒂𝒄𝒕𝒊𝒐𝒏 𝒔𝒕𝒂𝒓𝒕𝒔 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝒃𝒍𝒆𝒔𝒔𝒊𝒏𝒈 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒆𝒏𝒆𝒓𝒈𝒊𝒆𝒔 𝒐𝒇 𝑮𝒂𝒏𝒆𝒔𝒉𝒂’𝒔 𝒍𝒐𝒗𝒆 𝒂𝒏𝒅 𝒘𝒊𝒔𝒅𝒐𝒎, 𝒕𝒉𝒊𝒏𝒈𝒔 𝒘𝒊𝒍𝒍 𝒑𝒓𝒐𝒄𝒆𝒆𝒅 𝒖𝒏𝒅𝒊𝒔𝒕𝒖𝒓𝒃𝒆𝒅 𝒂𝒏𝒅 𝒎𝒐𝒓𝒆 𝒆𝒂𝒔𝒊𝒍𝒚 𝒇𝒊𝒏𝒅 𝒇𝒖𝒍𝒇𝒊𝒍𝒎𝒆𝒏𝒕.

🌻 🌻 🌻 🌻 🌻
𝑺𝒐𝒖𝒓𝒄𝒆𝒔 : 𝑴𝒂𝒔𝒕𝒆𝒓 𝑲.𝑷. 𝑲𝒖𝒎𝒂𝒓: 𝑺𝒂𝒕𝒖𝒓𝒏 / 𝑱𝒖𝒑𝒊𝒕𝒆𝒓 / 𝒏𝒐𝒕𝒆𝒔 𝒇𝒓𝒐𝒎 𝒔𝒆𝒎𝒊𝒏𝒂𝒓𝒔 / 𝑴𝒂𝒔𝒕𝒆𝒓 𝑬. 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂𝒎𝒂𝒄𝒉𝒂𝒓𝒚𝒂: 𝑻𝒉𝒆 𝒀𝒐𝒈𝒂 𝒐𝒇 𝑷𝒂𝒕𝒂𝒏𝒋𝒂𝒍𝒊.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 58 / Sri Lalita Sahasranamavali - Meaning - 58 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 109

528. సహస్రదళ పద్మస్థా - 
సహస్రార కమలములో ఉండునది.

529. సర్వవర్ణోప శోభితా - 
అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు, వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లునది.

530. సర్వాయుధ ధరా - 
అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండునది.

531. శుక్ల సంస్థితా - 
శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉండునది.

532. సర్వతోముఖీ - 
సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది.

🌻. శ్లోకం 110

533. సర్వౌదన ప్రీత చిత్తా -
 అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించునది.

534. యాకిన్యంబా స్వరూపిణీ - 
యాకినీ దేవతా స్వరూపములో ఉండునది.

535. స్వాహా - 
చక్కగా ఆహ్వానించునది.

536. స్వధా - 
శరీర ధారణ ప్రక్తియకు సంబంధించిన స్వాగత వచనము.

537. అమతిః - 
మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి.

538. మేధా -
 ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది.

539. శ్రుతిః - 
చెవులతో సంబంధము కలిగినది.

540. స్మృతిః - 
మరల మరల గుర్తుకు తెచ్చుకొను లక్షణము.

541. అనుత్తమా - 
తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేనిది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 58 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 58 🌻*

528 ) Sahasra dhala padhmastha -   
She who sits on thousand petalled lotus

529 ) Sarva varnopi shobitha -   
She who shines in all colours

530 ) Sarvayudha dhara -   
She who is armed with all weapons

531 ) Shukla samsthitha -   
She who is in shukla or semen

532 ) Sarvathomukhi -   
She who has faces everywhere

533 ) Sarvou dhana preetha chittha -   
She who likes all types of rice

534 ) Yakinyambha swaroopini -   
She who is named as “yakini”

535 ) Swaha -   
She who is personification of Swaha ( the manthra chanted during fire sacrifice )

536 ) Swadha -   
She who is of the form of Swadha

537 ) Amathi -   
She who is ignorance

538 ) Medha -  
 She who is knowledge

539 ) Sruthi -   
She who is Vedas

540 ) Smrithi -  
 She who is the guide to Vedas

541 ) Anuthama -   
She who is above all

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 61 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 36

*🌻. 36. అవ్యావృత భజనాత్‌ ॥ - 1 🌻*

పూర్వ సూత్రంలోని వ్యతిరిక్తాలను త్యాగం చేయడంతోపాటు, పొందవలసిన కల్యాణ గుణాలను పొందే ప్రయత్నం కూడా చెయాలి. నిరంతరం భగవంతుని భబించాలి. భగవల్రైరకంగా ఏది చేసినా అది భజనె అవతుంది. భక్తి కారణమైతే, భక్తి భావ ప్రకటనయే భజన. 

భజనాదులు సాధనలై భక్తిని పెంపొందిస్తాయి. భజనాదులు అనేక క్రియలుగా ఉన్నాయి. విసుగు కలగకుండా ఉందెటందుకు, వాటిని మార్చి మార్చి చేయడాన్ని అవ్యావృత భజన అంటారు.
 
అనగా తెంపు లేకుండా చేసిన సాధనలనె మరల మరల చక పద్ధతిగా చేయడం. 
 
సాధనను మనఃపూర్వకంగా ప్రీతితో చేయాలి. కూలి కొరకు చేసే పనిగా 
కాదు. ఎవరికోసమో చేసెదిగా కూడా కాదు అని పతంజలి యోగ సూత్రం.  
కొందరు భక్తులు ఇతరులచెత చేయించే పూజాదుల ఫలితం కూడా ఆ భక్తులకు రాదు. ఇతరులైనా భక్తితో చేయక కూలికి చేస్తే వారికి కూడా ఫలితం దక్కదు.  
 
ప్రహ్లాదుడు తన తండ్రితో వచించినట్లు భక్తి నవ విధములు.
 
తను హృద్భాషల సఖ్యమున్‌, శ్రవణమున్‌ దాసత్వమున్‌, వందనా 
రృనముల్‌, సేవయు, ఆత్మ లోనెరుకయున్‌ సంకిర్తనల్‌, చింతనం 
బను తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స 
జ్ఞనుదై యుండుట భద్రమంచు దలతున్‌ సత్యంబు దైత్వోత్తమా ! 
 
తా: హృదయ పూర్వకంగా చేసే భక్తి సాధనలు (1) సఖ్యం (2) శ్రవణం (3) దాసత్వం (4) వందనం (5) అర్చన (6) సేవ (7) ఆత్మ నివేదనం (8) సంకీర్తనం 
(9) చింతనం అని తొమ్మది విధాలు.

 వీటిని సర్వాత్ముడైన భగవంతుని నమ్ము, సజ్జనుడుగా ఉండి చేసినచో ఫలవంతమగును. 
 
ఈ విధమైన భజనలో ఏ ఒక్కటైనా సరిపోతుంది. కాని అలసట కలిగి నప్పుడు, లెక విసుగు పుట్టినప్పుడు ఈ తొమ్మిదిలో కొన్నింటిని మార్చి మార్చి చేయవచ్చు. భక్తి రసాస్వాదన నిరంతరం ఉండాలంటే ఈ తొమ్మిదె కాక మరి కొన్నింటిని, అనగా జప తపాదులను కూడా మార్చి మార్చి చేయవచ్చు. 

ఒకానొక భక్తి క్రియకు విరామమిచ్చి, మరొక భక్తి క్రియతో పూరిస్తే విశ్రాంతి లేకుండానే, ఉత్సాహంగా ఉంటుంది. భక్తి నాధనకు ఫలితం వచ్చిలోగా ఆపితే, రావలసిన ఫలితం జాష్యమవుతుంది. విరామ సమయంలో మళ్ళీ విషయ సంగత్వం కలిగితే ఇక తిరోగమనమే. అతడిక సాధనను పునః ప్రారంభించలేడు. 
 
అందువలన భక్తి సాధకుడు సంకీర్తన చేసి అలసిపోతే సంకీర్తన ఆపి, పురాణ, వేదాంత గ్రంథ పఠనం చేయాలి. మళ్ళీ పఠనానికి విరామ మిచ్చి వెంటనె ధ్యానానికి కూర్చోవాలి. ధ్యానం కుదరకపోతే సత్సంగం చేయాలి. అనగా వేదాంత చర్చ చేయాలి. 

ఒక క్రియలో ఉత్సాహం తగ్గగానె మరో క్రియ ప్రారంభించాలి. అదే విధంగా విరామం లేకుండా నిరంతరం ఏదో ఒక సాధన జరిగేలా చూచుకోవాలి. 

విరామమిస్తే పారిపోయిన అరిషడ్వర్దం పొంచిఉండి, అవకాశమిస్తే మళ్ళీ ప్రవేశిస్తుంది. అది తిష్ట వేస్తే రెండవసారి పారద్రోలడం కష్టతరమవుతుంది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 𝗚𝘂𝗿𝘂 𝗚𝗲𝗲𝘁𝗮 - 𝗗𝗮𝘁𝘁𝗮 𝗩𝗮𝗮𝗸𝘆𝗮 - 30 🌹*
✍️ 𝗦𝗿𝗶 𝗚𝗦 𝗦𝘄𝗮𝗺𝗶 𝗷𝗶 
📚. 𝗣𝗿𝗮𝘀𝗮𝗱 𝗕𝗵𝗮𝗿𝗮𝗱𝘄𝗮𝗷

*🌷 𝗘𝘃𝗲𝗿𝘆 𝗺𝗼𝗿𝗻𝗶𝗻𝗴 𝘂𝗽𝗼𝗻 𝘄𝗮𝗸𝗶𝗻𝗴 𝘂𝗽, 𝘃𝗶𝘀𝘂𝗮𝗹𝗶𝘇𝗲 𝗮 𝘄𝗵𝗶𝘁𝗲 𝗹𝗼𝘁𝘂𝘀 𝘄𝗶𝘁𝗵 𝗮 𝘁𝗵𝗼𝘂𝘀𝗮𝗻𝗱 𝗽𝗲𝘁𝗮𝗹𝘀 𝘂𝗽𝗼𝗻 𝘁𝗵𝗲 𝗵𝗲𝗮𝗱. 𝗩𝗶𝘀𝘂𝗮𝗹𝗶𝘇𝗲 𝗦𝗮𝗱𝗴𝘂𝗿𝘂 𝘀𝗲𝗮𝘁𝗲𝗱 𝗶𝗻𝘀𝗶𝗱𝗲 𝘁𝗵𝗲 𝘄𝗵𝗶𝘁𝗲 𝗹𝗼𝘁𝘂𝘀 𝗳𝗹𝗼𝘄𝗲𝗿. 🌷*

𝑾𝒆 𝒉𝒂𝒗𝒆 𝒍𝒆𝒂𝒓𝒏𝒆𝒅 𝒕𝒉𝒂𝒕 𝒃𝒊𝒍𝒍𝒊𝒐𝒏𝒔 𝒐𝒇 𝒅𝒆𝒔𝒊𝒓𝒆𝒔 𝒎𝒂𝒚 𝒃𝒆 𝒆𝒏𝒕𝒆𝒓𝒕𝒂𝒊𝒏𝒆𝒅 𝒃𝒚 𝒖𝒔. 𝑾𝒉𝒂𝒕𝒆𝒗𝒆𝒓 𝒅𝒆𝒔𝒊𝒓𝒆 𝒊𝒕 𝒎𝒂𝒚 𝒃𝒆, 𝒔𝒐𝒎𝒆𝒅𝒂𝒚 𝒊𝒕 𝒉𝒂𝒔 𝒕𝒐 𝒆𝒏𝒅. 𝑾𝒉𝒆𝒏 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆𝒔𝒆 𝒅𝒆𝒔𝒊𝒓𝒆𝒔 𝒂𝒓𝒆 𝒇𝒖𝒍𝒇𝒊𝒍𝒍𝒆𝒅, 𝒘𝒆 𝒘𝒊𝒍𝒍 𝒓𝒆𝒂𝒍𝒊𝒛𝒆 𝒕𝒉𝒂𝒕 𝒊𝒕 𝒊𝒔 𝒏𝒐𝒕 𝒕𝒉𝒆 𝒆𝒏𝒅 𝒐𝒇 𝒅𝒆𝒔𝒊𝒓𝒆𝒔. 𝑨 𝒏𝒆𝒘 𝒅𝒆𝒔𝒊𝒓𝒆 𝒔𝒑𝒓𝒐𝒖𝒕𝒔 𝒖𝒑. 𝑰𝒕 𝒔𝒖𝒇𝒇𝒆𝒓𝒔 𝒕𝒉𝒆 𝒔𝒂𝒎𝒆 𝒇𝒂𝒕𝒆. 

𝑬𝒂𝒄𝒉 𝒂𝒏𝒅 𝒆𝒗𝒆𝒓𝒚 𝒅𝒆𝒔𝒊𝒓𝒆 𝒈𝒆𝒕𝒔 𝒔𝒂𝒕𝒊𝒔𝒇𝒊𝒆𝒅, 𝒅𝒊𝒔𝒔𝒐𝒍𝒗𝒆𝒅 𝒂𝒏𝒅 𝒆𝒙𝒕𝒊𝒏𝒈𝒖𝒊𝒔𝒉𝒆𝒅. 𝑰𝒕 𝒘𝒊𝒍𝒍 𝒏𝒐𝒕 𝒓𝒆𝒎𝒂𝒊𝒏 𝒇𝒐𝒓𝒆𝒗𝒆𝒓. 𝑶𝒏𝒆 𝒃𝒚 𝒐𝒏𝒆 𝒂𝒔 𝒆𝒂𝒄𝒉 𝒂𝒏𝒅 𝒆𝒗𝒆𝒓𝒚 𝒅𝒆𝒔𝒊𝒓𝒆 𝒈𝒆𝒕𝒔 𝒇𝒖𝒍𝒇𝒊𝒍𝒍𝒆𝒅 𝒂𝒏𝒅 𝒅𝒆𝒔𝒕𝒓𝒐𝒚𝒆𝒅 𝒕𝒉𝒆 𝒗𝒆𝒓𝒚 𝒇𝒊𝒏𝒂𝒍 𝒘𝒊𝒔𝒉 𝒕𝒉𝒂𝒕 𝒘𝒆 𝒆𝒏𝒕𝒆𝒓𝒕𝒂𝒊𝒏 𝒘𝒊𝒍𝒍 𝒃𝒆 𝒕𝒉𝒆 𝒅𝒆𝒔𝒊𝒓𝒆 𝒇𝒐𝒓 𝒍𝒊𝒃𝒆𝒓𝒂𝒕𝒊𝒐𝒏.

𝑰𝒕 𝒐𝒏𝒍𝒚 𝒉𝒂𝒑𝒑𝒆𝒏𝒔 𝒂𝒇𝒕𝒆𝒓 𝒕𝒉𝒆 𝒇𝒖𝒍𝒇𝒊𝒍𝒍𝒎𝒆𝒏𝒕 𝒐𝒇 𝒆𝒂𝒄𝒉 𝒂𝒏𝒅 𝒆𝒗𝒆𝒓𝒚 𝒅𝒆𝒔𝒊𝒓𝒆. 𝒀𝒐𝒖 𝒘𝒊𝒍𝒍 𝒏𝒐𝒕 𝒆𝒏𝒕𝒆𝒓𝒕𝒂𝒊𝒏 𝒕𝒉𝒆 𝒔𝒂𝒎𝒆 𝒅𝒆𝒔𝒊𝒓𝒆 𝒂𝒈𝒂𝒊𝒏 𝒂𝒏𝒅 𝒂𝒈𝒂𝒊𝒏 𝒂𝒇𝒕𝒆𝒓 𝒊𝒕 𝒉𝒂𝒔 𝒂𝒍𝒓𝒆𝒂𝒅𝒚 𝒃𝒆𝒆𝒏 𝒔𝒂𝒕𝒊𝒔𝒇𝒊𝒆𝒅. 𝑨𝒔 𝒍𝒐𝒏𝒈 𝒂𝒔 𝒕𝒉𝒆 𝒔𝒏𝒂𝒌𝒆 𝒄𝒉𝒂𝒓𝒎𝒆𝒓 𝒊𝒔 𝒆𝒏𝒕𝒊𝒄𝒊𝒏𝒈 𝒚𝒐𝒖 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝒉𝒊𝒔𝒔𝒊𝒏𝒈 𝒔𝒏𝒂𝒌𝒆 𝒊𝒏𝒔𝒊𝒅𝒆 𝒕𝒉𝒆 𝒃𝒂𝒔𝒌𝒆𝒕, 𝒚𝒐𝒖 𝒂𝒓𝒆 𝒆𝒙𝒄𝒊𝒕𝒆𝒅 𝒂𝒏𝒅 𝒉𝒂𝒗𝒆 𝒕𝒉𝒆 𝒄𝒖𝒓𝒊𝒐𝒔𝒊𝒕𝒚 𝒕𝒐 𝒔𝒆𝒆 𝒊𝒕. 

𝑩𝒖𝒕 𝒐𝒏𝒄𝒆 𝒚𝒐𝒖 𝒉𝒂𝒗𝒆 𝒔𝒆𝒆𝒏 𝒘𝒉𝒂𝒕 𝒊𝒔 𝒊𝒏𝒔𝒊𝒅𝒆 𝒕𝒉𝒆 𝒔𝒏𝒂𝒌𝒆 𝒄𝒉𝒂𝒓𝒎𝒆𝒓’𝒔 𝒃𝒂𝒔𝒌𝒆𝒕, 𝒂𝒇𝒕𝒆𝒓 𝒚𝒐𝒖 𝒉𝒂𝒗𝒆 𝒉𝒆𝒂𝒓𝒅 𝒕𝒉𝒆 𝒉𝒊𝒔𝒔𝒊𝒏𝒈, 𝒂𝒏𝒅 𝒚𝒐𝒖𝒓 𝒄𝒖𝒓𝒊𝒐𝒔𝒊𝒕𝒚 𝒊𝒔 𝒔𝒂𝒕𝒊𝒔𝒇𝒊𝒆𝒅, 𝒚𝒐𝒖 𝒏𝒐 𝒍𝒐𝒏𝒈𝒆𝒓 𝒇𝒆𝒆𝒍 𝒊𝒏𝒕𝒆𝒓𝒆𝒔𝒕𝒆𝒅. 

𝒀𝒐𝒖 𝒎𝒐𝒗𝒆 𝒐𝒏. 𝑩𝒖𝒕 𝒖𝒏𝒕𝒊𝒍 𝒕𝒉𝒆𝒏, 𝒂𝒍𝒕𝒉𝒐𝒖𝒈𝒉 𝒚𝒐𝒖 𝒌𝒏𝒐𝒘 𝒕𝒉𝒂𝒕 𝒕𝒉𝒆𝒓𝒆 𝒊𝒔 𝒂 𝒔𝒏𝒂𝒌𝒆 𝒊𝒏𝒔𝒊𝒅𝒆 𝒕𝒉𝒆 𝒃𝒂𝒔𝒌𝒆𝒕, 𝒂𝒏𝒅 𝒚𝒐𝒖 𝒌𝒏𝒐𝒘 𝒘𝒉𝒂𝒕 𝒊𝒕 𝒍𝒐𝒐𝒌𝒔 𝒍𝒊𝒌𝒆, 𝒚𝒐𝒖 𝒔𝒕𝒊𝒍𝒍 𝒉𝒂𝒗𝒆 𝒕𝒉𝒆 𝒘𝒊𝒔𝒉 𝒕𝒐 𝒔𝒆𝒆 𝒊𝒕. 𝑶𝒏𝒆 𝒅𝒂𝒚 𝒕𝒉𝒆 𝒄𝒖𝒓𝒊𝒐𝒔𝒊𝒕𝒚 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒔𝒏𝒂𝒌𝒆 𝒂𝒏𝒅 𝒕𝒉𝒆 𝒔𝒏𝒂𝒌𝒆 𝒄𝒉𝒂𝒓𝒎𝒆𝒓 𝒘𝒊𝒍𝒍 𝒘𝒆𝒂𝒓 𝒐𝒇𝒇. 

𝑨𝒕 𝒕𝒉𝒂𝒕 𝒕𝒊𝒎𝒆 𝒊𝒇 𝒂𝒏𝒐𝒕𝒉𝒆𝒓 𝒔𝒏𝒂𝒌𝒆 𝒄𝒉𝒂𝒓𝒎𝒆𝒓 𝒄𝒐𝒎𝒆𝒔 𝒚𝒐𝒖𝒓 𝒘𝒂𝒚, 𝒚𝒐𝒖 𝒘𝒊𝒍𝒍 𝒏𝒐 𝒍𝒐𝒏𝒈𝒆𝒓 𝒔𝒉𝒐𝒘 𝒂𝒏𝒚 𝒊𝒏𝒕𝒆𝒓𝒆𝒔𝒕. 𝑻𝒉𝒊𝒔 𝒔𝒂𝒎𝒆 𝒑𝒓𝒐𝒄𝒆𝒔𝒔 𝒂𝒑𝒑𝒍𝒊𝒆𝒔 𝒕𝒐 𝒆𝒗𝒆𝒓𝒚 𝒔𝒊𝒏𝒈𝒍𝒆 𝒅𝒆𝒔𝒊𝒓𝒆 𝒖𝒏𝒕𝒊𝒍 𝒚𝒐𝒖 𝒓𝒆𝒂𝒄𝒉 𝒕𝒉𝒆 𝒇𝒊𝒏𝒂𝒍 𝒅𝒆𝒔𝒊𝒓𝒆 𝒇𝒐𝒓 𝒍𝒊𝒃𝒆𝒓𝒂𝒕𝒊𝒐𝒏, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒊𝒔 𝒇𝒓𝒆𝒆𝒅𝒐𝒎 𝒇𝒓𝒐𝒎 𝒂𝒍𝒍 𝒅𝒆𝒔𝒊𝒓𝒆𝒔. 𝑻𝒉𝒆𝒓𝒆𝒂𝒇𝒕𝒆𝒓 𝒕𝒉𝒆𝒓𝒆 𝒊𝒔 𝒏𝒐𝒕𝒉𝒊𝒏𝒈 𝒍𝒆𝒇𝒕 𝒕𝒐 𝒃𝒆 𝒔𝒂𝒕𝒊𝒔𝒇𝒊𝒆𝒅. 𝑻𝒐 𝒂𝒄𝒉𝒊𝒆𝒗𝒆 𝒕𝒉𝒊𝒔 𝒆𝒏𝒅, 𝒕𝒉𝒊𝒔 𝒇𝒓𝒆𝒆𝒅𝒐𝒎 𝒇𝒓𝒐𝒎 𝒅𝒆𝒔𝒊𝒓𝒆𝒔, 𝑮𝒖𝒓𝒖 𝒏𝒆𝒆𝒅𝒔 𝒕𝒐 𝒃𝒆 𝒄𝒐𝒏𝒕𝒆𝒎𝒑𝒍𝒂𝒕𝒆𝒅 𝒖𝒑𝒐𝒏.

𝑾𝒉𝒆𝒏 𝒂 𝒈𝒓𝒆𝒂𝒕 𝒕𝒓𝒆𝒂𝒔𝒖𝒓𝒆 𝒊𝒔 𝒄𝒐𝒎𝒊𝒏𝒈 𝒚𝒐𝒖𝒓 𝒘𝒂𝒚, 𝒘𝒐𝒖𝒍𝒅 𝒚𝒐𝒖 𝒃𝒆 𝒉𝒂𝒏𝒌𝒆𝒓𝒊𝒏𝒈 𝒂𝒇𝒕𝒆𝒓 𝒔𝒎𝒂𝒍𝒍 𝒄𝒉𝒂𝒏𝒈𝒆? 𝒀𝒐𝒖 𝒄𝒆𝒓𝒕𝒂𝒊𝒏𝒍𝒚 𝒘𝒐𝒖𝒍𝒅 𝒏𝒐𝒕. 

𝑭𝒐𝒓 𝒕𝒉𝒆 𝒃𝒆𝒏𝒆𝒇𝒊𝒕 𝒐𝒇 𝒕𝒉𝒐𝒔𝒆 𝒘𝒉𝒐 𝒂𝒓𝒆 𝒖𝒏𝒂𝒃𝒍𝒆 𝒕𝒐 𝒅𝒐 𝒕𝒉𝒆 𝒉𝒊𝒈𝒉𝒆𝒔𝒕 𝒕𝒚𝒑𝒆 𝒐𝒇 𝒎𝒆𝒅𝒊𝒕𝒂𝒕𝒊𝒐𝒏, 𝒕𝒉𝒆𝒚 𝒂𝒓𝒆 𝒏𝒐𝒘 𝒕𝒆𝒂𝒄𝒉𝒊𝒏𝒈 𝒖𝒔 𝒉𝒐𝒘 𝒕𝒐 𝒄𝒐𝒏𝒕𝒆𝒎𝒑𝒍𝒂𝒕𝒆 𝒖𝒑𝒐𝒏 𝑮𝒖𝒓𝒖 𝒘𝒉𝒐 𝒊𝒔 𝒊𝒏 𝒂𝒏 𝒐𝒓𝒅𝒊𝒏𝒂𝒓𝒚 (𝒉𝒖𝒎𝒂𝒏) 𝒇𝒐𝒓𝒎.

𝑽𝒆𝒓𝒔𝒆: 𝑷𝒓𝒂𝒕𝒂𝒔𝒔𝒊𝒓𝒂𝒔𝒊 ... 

𝑬𝒗𝒆𝒓𝒚 𝒎𝒐𝒓𝒏𝒊𝒏𝒈 𝒖𝒑𝒐𝒏 𝒘𝒂𝒌𝒊𝒏𝒈 𝒖𝒑, 𝒗𝒊𝒔𝒖𝒂𝒍𝒊𝒛𝒆 𝒂 𝒘𝒉𝒊𝒕𝒆 𝒍𝒐𝒕𝒖𝒔 𝒘𝒊𝒕𝒉 𝒂 𝒕𝒉𝒐𝒖𝒔𝒂𝒏𝒅 𝒑𝒆𝒕𝒂𝒍𝒔 𝒖𝒑𝒐𝒏 𝒕𝒉𝒆 𝒉𝒆𝒂𝒅. 𝑽𝒊𝒔𝒖𝒂𝒍𝒊𝒛𝒆 𝑺𝒂𝒅𝒈𝒖𝒓𝒖 𝒔𝒆𝒂𝒕𝒆𝒅 𝒊𝒏𝒔𝒊𝒅𝒆 𝒕𝒉𝒆 𝒘𝒉𝒊𝒕𝒆 𝒍𝒐𝒕𝒖𝒔 𝒇𝒍𝒐𝒘𝒆𝒓. 

𝑽𝒊𝒔𝒖𝒂𝒍𝒊𝒛𝒆 𝒄𝒍𝒆𝒂𝒓𝒍𝒚 𝒊𝒏 𝒕𝒉𝒆 𝒎𝒊𝒏𝒅’𝒔 𝒆𝒚𝒆, 𝒉𝒊𝒔 𝒇𝒆𝒆𝒕, 𝒂𝒏𝒅 𝒆𝒚𝒆𝒔, 𝒉𝒂𝒏𝒅𝒔 𝒔𝒉𝒐𝒘𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒈𝒆𝒔𝒕𝒖𝒓𝒆𝒔 𝒐𝒇 𝒑𝒓𝒐𝒕𝒆𝒄𝒕𝒊𝒐𝒏 𝒂𝒏𝒅 𝒃𝒆𝒏𝒆𝒇𝒊𝒄𝒆𝒏𝒄𝒆, 𝒂𝒏𝒅 𝒉𝒊𝒔 𝒑𝒆𝒂𝒄𝒆𝒇𝒖𝒍 𝒄𝒐𝒖𝒏𝒕𝒆𝒏𝒂𝒏𝒄𝒆. 

𝒀𝒐𝒖 𝒔𝒉𝒐𝒖𝒍𝒅 𝒉𝒂𝒗𝒆 𝒂 𝒗𝒆𝒓𝒚 𝒄𝒍𝒆𝒂𝒓 𝒎𝒆𝒏𝒕𝒂𝒍 𝒑𝒊𝒄𝒕𝒖𝒓𝒆 𝒐𝒇 𝒉𝒊𝒔 𝒇𝒆𝒆𝒕, 𝒉𝒊𝒔 𝒆𝒚𝒆𝒔, 𝒉𝒊𝒔 𝒉𝒂𝒏𝒅𝒔, 𝒉𝒊𝒔 𝒉𝒂𝒏𝒅 𝒈𝒆𝒔𝒕𝒖𝒓𝒆𝒔 𝒊𝒏𝒅𝒊𝒄𝒂𝒕𝒊𝒏𝒈 𝒑𝒓𝒐𝒕𝒆𝒄𝒕𝒊𝒐𝒏 𝒂𝒏𝒅 𝒊𝒏𝒗𝒊𝒕𝒂𝒕𝒊𝒐𝒏, 𝒂𝒔 𝒘𝒆𝒍𝒍 𝒂𝒔 𝒉𝒊𝒔 𝒆𝒏𝒕𝒊𝒓𝒆 𝒑𝒓𝒆𝒔𝒆𝒏𝒄𝒆. 

𝑻𝒉𝒂𝒕 𝒇𝒐𝒓𝒎 𝒔𝒉𝒐𝒖𝒍𝒅 𝒃𝒆𝒄𝒐𝒎𝒆 𝒇𝒊𝒙𝒆𝒅 𝒊𝒏 𝒕𝒉𝒆 𝒎𝒊𝒏𝒅 𝒘𝒉𝒆𝒓𝒆 𝒉𝒆 𝒊𝒔 𝒊𝒏𝒗𝒊𝒕𝒊𝒏𝒈 𝒚𝒐𝒖 𝒕𝒐 𝒂𝒑𝒑𝒓𝒐𝒂𝒄𝒉 𝒉𝒊𝒎 𝒂𝒏𝒅 𝒊𝒔 𝒐𝒇𝒇𝒆𝒓𝒊𝒏𝒈 𝒚𝒐𝒖 𝒑𝒓𝒐𝒕𝒆𝒄𝒕𝒊𝒐𝒏. 𝑳𝒆𝒕 𝒖𝒔 𝒑𝒓𝒐𝒄𝒆𝒆𝒅 𝒂𝒉𝒆𝒂𝒅. 

𝑪𝒐𝒏𝒕𝒊𝒏𝒖𝒆𝒔... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 27 / The Siva-Gita - 27 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము
*🌻. శివ ప్రాదుర్భావము - 3 🌻*

రౌద్రం పాశుపతం బ్రాహ్మం - కౌబేరం కులిశా నిలమ్,
భార్గవాది బహున్యప్త్రా - ణ్యయం ప్రాయుజ్క్త రాఘవః 17
తస్మిం స్తే జపి శస్త్రాణి - చాస్త్రాణ్య స్య మహీ పతే;,
విలీ నాని మహాభ్రస్య - కరకా ఇవ నీ రధౌ 18
తతః క్షణేన జజ్వాల - ధనుస్త స్య కారా చ్చ్యుతమ్,
తూణీ రం చాంగుళీ త్రాణం - గోది కాపి మహీ పతే: 19

శ్రీరాముడు వదలిన మహాస్త్రము లన్ని ఆ గొప్ప తేజస్సులో మహా సముద్ర మనబడిన వడ గండ్ల మాదిరి కరిగి పోయినట్లుగా లీనము లైన ఆ మీదట తృటి కాలములో శ్రీ రామ చంద్రుని ధనస్సు కూడా జారి (క్రింద నేలపై ) బడి భస్మ మైనది ,(బూడిద ) మరియు అమ్ముల పొదియు, హస్త కవచము ,గోదికము నేలపై బడి దగ్ధమైనవి.

తద్ద్రుష్ట్యా లక్ష్మణో భితై- పపాత భువి మూర్చితః,
అధాకిం చిత్కరో రామో - జానుభ్యా మవనిం గతః 20
మీలితాక్షో భయా విష్ట -శ్శంకరం శరణం గతః,
స్వరేణా ప్యుచ్చ రన్నుచ్చై - శ్శంభో ర్నామ సహస్రకమ్ 21
శివంచ దండవ ద్భూమౌ - ప్రణ నామ పునః పునః,
పునశ్చ పూర్వ వచ్చాసీ - చ్చబ్దో దిజ్మండలం స్వనన్ 22
చచాల వసుధా ఘోరం - పర్వతాశ్చ చ కంపిరే,
అధ క్షణేన శీతాంశు - శ్శీతలం తేజ ఆదదత్ 23
ఉన్మీలి తాక్షో రామస్తు - యావద్యా వత్ప్ర పశ్యతి,
తావద్ద దర్శ వృషభం - సర్వాలంకార సంయుతమ్ 24
పీయూష మధనో ద్భూత - నవనీత స్య పిండ వత్,
ప్రోత స్వర్ణం మరకత - చ్చాయా శృంగ ద్వాయాంచితమ్ 25
నీల రత్నేక్షణం - హ్రస్వ - కంట కంబల భూషితమ్,
రత్న పల్యాణ సంయుక్తం -నిబద్దం శ్వేత చామరై: 26

అది గాంచి సౌమిత్రి లక్ష్మణుడు భయపడి నేలబడి మూర్చిల్లెను. 

తరువాత శ్రీరాముడు దిగ్భ్రాంతుడై యేమియు తోచక భూమిపై మొకాళ్ళూని (మోకరిల్లి ) భయకంపితుడై కనులు మూసికొని ఉమాపతే నన్ను కాపాడు వాడని యెంచి గొంతెత్తి గట్టిగా వేద సార శివ సహస్రనామములను పటించుచు ముమ్మాటికి దీర్ఘ దండ నమస్కారములు సల్పెను.

ఇంతలోనే మొదటి మాదిరిగా దిక్కులు మారు మ్రోగ మహాధ్వని కలిగెను. ఆ ధ్వనికి భూమి మరియు పర్వతములు కూడా కదలినవి . రల తృటి కాలములోనే చంద్రుని శీతలము తేజస్సు అగుపడెను.

 శ్రీరాముడు తేరుకొని చూచులోపున, పాల సముద్రమును జిలుకు (తరచు ) చుండగా అందుండి ఉద్భవించిన వెన్న ముద్ద మాదిరి తెల్లగాను, బంగారు వన్నె గల తోక గలది,మరకత మణుల ననుకరించు కొమ్ములు కలది . ఇంద్రనీలము - మణులు కన్నులు గలది కారుచ కంటమున కంబలము కలది గంటారావలములతో దశ దిశలను బూరించు నది యగు నందీశ్వరుని చూచెను .
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 𝑻𝒉𝒆 𝑺𝒊𝒗𝒂-𝑮𝒊𝒕𝒂 - 27 🌹*
*🌴. 𝑫𝒊𝒂𝒍𝒐𝒈𝒖𝒆 𝒃𝒆𝒕𝒘𝒆𝒆𝒏 𝑹𝒂𝒎𝒂 𝒂𝒏𝒅 𝑳𝒐𝒓𝒅 𝑺𝒊𝒗𝒂 🌴*
✍️ 𝑨𝒚𝒂𝒍𝒂𝒔𝒐𝒎𝒂𝒚𝒂𝒋𝒖𝒍𝒂. 
📚. 𝑷𝒓𝒂𝒔𝒂𝒅 𝑩𝒉𝒂𝒓𝒂𝒅𝒘𝒂𝒋

𝑪𝒉𝒂𝒑𝒕𝒆𝒓 04 : 
*🌻 𝑺𝒉𝒊𝒗𝒂 𝑷𝒓𝒂𝒂𝒅𝒖𝒓𝒃𝒉𝒂𝒂𝒗𝒂𝒎 - 3 🌻*

𝑾𝒉𝒂𝒕𝒆𝒗𝒆𝒓 𝒎𝒊𝒔𝒔𝒊𝒍𝒆𝒔 𝑺𝒓𝒊 𝑹𝒂𝒎𝒂 𝒑𝒓𝒐𝒋𝒆𝒄𝒕𝒆𝒅 𝒊𝒏 𝒕𝒉𝒂𝒕 𝒃𝒓𝒊𝒍𝒍𝒊𝒂𝒏𝒕 𝒍𝒊𝒈𝒉𝒕, 𝒂𝒍𝒍 𝒕𝒉𝒐𝒔𝒆 𝒎𝒊𝒔𝒔𝒊𝒍𝒆𝒔 𝒗𝒂𝒏𝒊𝒔𝒉𝒆𝒅 𝒊𝒏𝒕𝒐 𝒕𝒉𝒂𝒕 𝒃𝒓𝒊𝒍𝒍𝒊𝒂𝒏𝒄𝒆 𝒂𝒔 𝒍𝒊𝒌𝒆 𝒂𝒔 𝒊𝒄𝒆 𝒄𝒖𝒃𝒆𝒔 𝒎𝒆𝒍𝒕 𝒊𝒏 𝒐𝒄𝒆𝒂𝒏𝒔. 

𝑰𝒏 𝒂𝒏𝒐𝒕𝒉𝒆𝒓 𝒇𝒆𝒘 𝒔𝒆𝒄𝒐𝒏𝒅𝒔 𝑹𝒂𝒎𝒂'𝒔 𝒃𝒐𝒘 𝒇𝒆𝒍𝒍 𝒅𝒐𝒘𝒏 𝒐𝒏 𝒊𝒕𝒔 𝒐𝒘𝒏 𝒂𝒏𝒅 𝒈𝒐𝒕 𝒓𝒆𝒅𝒖𝒄𝒆𝒅 𝒕𝒐 𝒂𝒔𝒉𝒆𝒔. 𝑨𝒍𝒔𝒐, 𝒉𝒊𝒔 𝒉𝒂𝒏𝒅 𝒔𝒉𝒊𝒆𝒍𝒅 𝒂𝒏𝒅 𝒐𝒕𝒉𝒆𝒓 𝒂𝒄𝒄𝒆𝒔𝒔𝒐𝒓𝒊𝒆𝒔 𝒕𝒐𝒐 𝒇𝒆𝒍𝒍 𝒅𝒐𝒘𝒏 𝒂𝒏𝒅 𝒈𝒐𝒕 𝒊𝒏𝒄𝒊𝒏𝒆𝒓𝒂𝒕𝒆𝒅.

𝑺𝒆𝒆𝒊𝒏𝒈 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆𝒔𝒆 𝒅𝒊𝒔𝒂𝒔𝒕𝒆𝒓𝒔 𝒉𝒂𝒑𝒑𝒆𝒏𝒊𝒏𝒈 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝑹𝒂𝒎𝒂, 𝑳𝒂𝒌𝒔𝒉𝒎𝒂𝒏𝒂 𝒕𝒓𝒆𝒎𝒃𝒍𝒆𝒅 𝒂𝒏𝒅 𝒇𝒆𝒍𝒍 𝒅𝒐𝒘𝒏 𝒖𝒏𝒄𝒐𝒏𝒄𝒊𝒐𝒖𝒔. 

𝑨𝒇𝒕𝒆𝒓 𝒕𝒉𝒂𝒕 𝑹𝒂𝒎𝒂 𝒊𝒏 𝒂 𝒄𝒐𝒏𝒇𝒖𝒔𝒆𝒅 𝒔𝒕𝒂𝒕𝒆 𝒖𝒏𝒂𝒃𝒍𝒆 𝒕𝒐 𝒕𝒉𝒊𝒏𝒌 𝒐𝒇 𝒂𝒏𝒚𝒕𝒉𝒊𝒏𝒈, 𝒌𝒏𝒆𝒍𝒕 𝒅𝒐𝒘𝒏 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒈𝒓𝒐𝒖𝒏𝒅 𝒘𝒊𝒕𝒉 𝒕𝒓𝒆𝒑𝒊𝒅𝒂𝒕𝒊𝒐𝒏, 𝒄𝒍𝒐𝒔𝒆𝒅 𝒉𝒊𝒔 𝒆𝒚𝒆𝒔 𝒂𝒏𝒅 𝒕𝒉𝒐𝒖𝒈𝒉𝒕 𝒕𝒉𝒂𝒕 𝒐𝒏𝒍𝒚 𝒕𝒉𝒆 𝒍𝒐𝒓𝒅 𝒐𝒇 𝑼𝒎𝒂 𝒘𝒐𝒖𝒍𝒅 𝒃𝒆 𝒄𝒂𝒑𝒂𝒃𝒍𝒆 𝒐𝒇 𝒑𝒓𝒐𝒕𝒆𝒄𝒕𝒊𝒏𝒈 𝒉𝒊𝒎. 

𝑾𝒊𝒕𝒉 𝒂𝒏 𝒖𝒑𝒓𝒊𝒔𝒆𝒅 𝒗𝒐𝒊𝒄𝒆 𝒉𝒆 𝒄𝒉𝒂𝒏𝒕𝒆𝒅 𝒕𝒉𝒆 𝒕𝒉𝒐𝒖𝒔𝒂𝒏𝒅 𝒏𝒂𝒎𝒆𝒔 𝒐𝒇 𝑺𝒉𝒊𝒗𝒂 𝒃𝒚 𝒐𝒇𝒇𝒆𝒓𝒊𝒏𝒈 𝒑𝒓𝒐𝒔𝒕𝒓𝒂𝒕𝒊𝒐𝒏𝒔 𝒊𝒏𝒕𝒆𝒓𝒎𝒊𝒕𝒕𝒆𝒏𝒕𝒍𝒚. 𝑰𝒏 𝒂 𝒘𝒉𝒊𝒍𝒆 𝑹𝒂𝒎𝒂 𝒉𝒆𝒂𝒓𝒅 𝒕𝒉𝒆 𝒔𝒂𝒎𝒆 𝒇𝒆𝒂𝒓𝒔𝒐𝒎𝒆 𝒔𝒐𝒖𝒏𝒅 𝒆𝒄𝒉𝒐𝒊𝒏𝒈 𝒊𝒏 𝒂𝒍𝒍 𝒅𝒊𝒓𝒆𝒄𝒕𝒊𝒐𝒏𝒔. 

𝑬𝒂𝒓𝒕𝒉 𝒂𝒏𝒅 𝒉𝒊𝒍𝒍𝒔 𝒂𝒍𝒔𝒐 𝒕𝒓𝒆𝒎𝒃𝒍𝒆𝒅 𝒅𝒖𝒆 𝒕𝒐 𝒕𝒉𝒂𝒕 𝒕𝒆𝒓𝒓𝒊𝒃𝒍𝒆 𝒏𝒐𝒊𝒔𝒆. 𝑻𝒉𝒆𝒏 𝒘𝒊𝒕𝒉𝒊𝒏 𝒂 𝒔𝒑𝒍𝒊𝒕 𝒔𝒆𝒄𝒐𝒏𝒅 𝑹𝒂𝒎𝒂 𝒐𝒃𝒔𝒆𝒓𝒗𝒆𝒅 𝒂 𝒄𝒐𝒐𝒍 𝒎𝒐𝒐𝒏𝒔𝒉𝒊𝒏𝒆 𝒆𝒗𝒆𝒓𝒚𝒘𝒉𝒆𝒓𝒆. 

𝑩𝒆𝒇𝒐𝒓𝒆 𝑹𝒂𝒎𝒂 𝒄𝒐𝒖𝒍𝒅 𝒖𝒏𝒅𝒆𝒓𝒔𝒕𝒂𝒏𝒅 𝒘𝒉𝒂𝒕 𝒊𝒕 𝒘𝒂𝒔, 𝒉𝒆 𝒇𝒐𝒖𝒏𝒅 𝒔𝒐𝒎𝒆𝒐𝒏𝒆 𝒘𝒉𝒐 𝒘𝒂𝒔 𝒂𝒔 𝒘𝒉𝒊𝒕𝒆 𝒂𝒔 𝒕𝒉𝒆 𝒄𝒓𝒆𝒂𝒎 𝒐𝒃𝒕𝒂𝒊𝒏𝒆𝒅 𝒅𝒖𝒓𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒄𝒉𝒖𝒓𝒏𝒊𝒏𝒈 𝒐𝒇 𝒎𝒊𝒍𝒌𝒚 𝒐𝒄𝒆𝒂𝒏, 

𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂 𝒈𝒐𝒍𝒅 𝒐𝒓𝒏𝒂𝒎𝒆𝒏𝒕𝒆𝒅 𝒕𝒂𝒊𝒍, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂 𝒑𝒂𝒊𝒓 𝒐𝒇 𝒉𝒐𝒓𝒏𝒔 𝒅𝒆𝒄𝒌𝒆𝒅 𝒘𝒊𝒕𝒉 𝒅𝒊𝒂𝒎𝒐𝒏𝒅𝒔, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒃𝒍𝒖𝒆 𝒈𝒆𝒎𝒔 𝒌𝒊𝒏𝒅 𝒐𝒇 𝒆𝒚𝒆𝒔, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂𝒏 𝒆𝒍𝒆𝒈𝒂𝒏𝒕 𝒄𝒐𝒗𝒆𝒓 𝒐𝒏 𝒊𝒕𝒔 𝒃𝒂𝒄𝒌, 

𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂 𝒈𝒆𝒎 𝒅𝒆𝒄𝒌𝒆𝒅 𝒓𝒐𝒑𝒆 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝒕𝒉𝒆 𝒏𝒆𝒄𝒌, 𝒂𝒏𝒅 𝒘𝒉𝒊𝒄𝒉 𝒘𝒂𝒔 𝒓𝒆𝒏𝒕𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒔𝒌𝒊𝒆𝒔 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝒔𝒘𝒆𝒆𝒕 𝒋𝒊𝒏𝒈𝒍𝒊𝒏𝒈 𝒏𝒐𝒊𝒔𝒆 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒃𝒆𝒍𝒍𝒔 𝒑𝒓𝒆𝒔𝒆𝒏𝒕 𝒐𝒏 𝒉𝒊𝒔 𝒃𝒐𝒅𝒚.

𝑻𝒉𝒂𝒕 𝒘𝒂𝒔 𝒕𝒉𝒆 𝑩𝒖𝒍𝒍 𝑵𝒂𝒏𝒅𝒊 𝒘𝒉𝒐𝒎 𝑹𝒂𝒎𝒂 𝒃𝒆𝒉𝒆𝒍𝒅 𝒊𝒏 𝒇𝒓𝒐𝒏𝒕 𝒐𝒇 𝒉𝒊𝒎.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 19 / Sri Gajanan Maharaj Life History - 19 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 4వ అధ్యాయము - 4 🌻*

తన ఈజీవిత విషాదావస్థ నుండి క్షమించి కాపాడమని పదేపదే భగవంతుడిని ప్రార్ధించాడు. 

పూర్తి పశ్చాత్తాపంతో ఇతను శ్రీగజానన్ దగ్గరకు వచ్చి ఆహారంమాని ఆయన ద్వారం దగ్గరే భగవన్నామస్మరణ చేసాడు. ఒకరోజు పూర్తిగా ఈవిధంగా చేసినతరువాత, నువ్వు చేస్తున్నపని సరికాదు. భగవంతుడిని ఇంతకు ముందు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు ? 

మనిషి మరణించిన తరువాత వైద్యుని పిలిచినట్టు, లేదా యవ్వనం అంతా అయిపోయిన తరువాత ముసలి తనంలో పెళ్ళి చేసుకున్నట్టు ఉంది. ప్రతిపని సరిఅయిన సమయంలో చెయ్యాలి, లేకపోతే దానికి ఫలితంఉండదు. ఇల్లు అంటుకున్నాక నుయ్యి తవ్వడం నిరుపయోగం. 

ఏ సంసారంకోసం జీవితం అంతా తాపత్రయం పడ్డావో వాళ్ళు నిన్ను ఒంటరిని చేసి పోయారు. శాశ్వతమయిన దానిని వదలి, అశాశ్వతమయిన విషయాలలో నీ సమయంపూర్తిగా వృధాచేసావు. దానికి బదులుగా ఇప్పుడు ఫలితాలను అనుభవించకుండా తప్పించుకోలేవు, కావున మొండితనం వదలి సమంజసంగా ఉండు అని శ్రీగజానన్ అన్నారు. 

మిగిలిన వాళ్ళు కూడా అతనికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరిని లక్ష్య పెట్టక తన నిరాహారత, భగవన్నామస్మరణ కొనసాగించాడు. మధ్యరాత్రి బాగాచీకటిగానూ, ఎవరూ చుట్టుపక్కల లేని సమయంలో శ్రీమహారాజు మాధవు తో ఒక తమాషా చేసారు. 

భయానకమయిన యమునిరూపం దాల్చి, మృత్యుదేవతగా పెద్దగా నోరుతెరచుకొని మాధవ్ దగ్గరకు ఆయన తినేలా దూసుకు వస్తారు. మాధవ్ మాటలుడిగి, భయభ్రాంతుడయి, దడదడ లాడుతున్న హృదయంతో పరిగెత్తడం మొదలు పెట్టాడు. అతని ఆపరస్థితిచూసి శ్రీమహారాజు తన మామూలు రూపుధారణ దాల్చి, ఇదేనా నీకు ఉన్న ధైర్యం ? 

నువ్వు మృత్యువుకి ఆహారంవంటి వాడివి అనిగుర్తు ఉంచుకో, అది నిన్ను ఇలానే కబళించి తీరుతుంది. నువ్వు రాబోయే కాలంలో దీనినుండి తప్పించుకోలేవు, యమలోకంలో గడపబోయే విషయంగూర్చి నేను నీకు ఇప్పుడు చూపించాను అని గట్టిగా అంటారు. యమలోకంనుండి దయచేసి నన్ను రక్షించండి, ఈజీవితంకూడా నాకువద్దు. 

నన్ను వైకుంఠం పంపించమని నాచివరి నివేదన. ఒకసారి మీరు నాకు నరకం చూపించారు కనుక మరలా నన్ను అక్కడకు పంపకండి. నేను చేసిన పాపాలగురించి పూర్తిగా నేను పరిచితుడను, అయినా మీరు తలచుకుంటే నన్ను వాటినుండి విముక్తి చేయడం కష్టంకాదు. 

బహుశ కొద్ది పుణ్యకార్యాలవల్ల నాకు మీ పాదాల దగ్గర ఉండే అదృష్టం కలిగింది, మరియు యోగులతో సంగమం చేసిన వాళ్ళు యమలోకం వెళ్ళలేరు అని మాధవ్ అంటాడు. భగవన్నామస్మరణ చేస్తూఉండు, నీకు మృత్యువు అతి దగ్గరలో ఉంది. ఇంకా బతకాలి అనిఉంటే చెప్పు నీజీవిత కాలం నేను పొడిగిస్తాను అని శ్రీమహారాజు అన్నారు. 

నేను ఏమాత్రం ఇంక జీవించ దలచుకోలేదు, ఇది అంతా మిధ్య కావున నన్ను ఏమాత్రం దీనిలో ఇక ఇరికించకండి అని మాధవ్ అంటాడు. తధాస్తు నీవు కోరినదే నీకు ఇస్తున్నాను. నీవు తిరిగి ఈ పృధ్విపై జన్మించవు అని శ్రీమహారాజు అంటారు. అటువంటి రహస్యమయిన సంభాషణ వారి ఇరువురి మధ్య అయింది. 

దీనిని వర్నించడానికి నాదగ్గర మాటలు కరువవుతాయి. మాదవ్ తన దైనిక జీవిత విషయాలుకూడా మరచి పోయాడు. దీనికి కారణం అతను ఉపవాసాలు చేయడమే అని ప్రజలు అనుకున్నారు. శ్రీగజానన్ మహారాజు పాదాలవద్ద మాధవ్ మరణించి, చివరికి ఈ జీవన్మరణ చక్రవ్యూహంనుండి తప్పించుకున్నాడు. 

శ్రీమహారాజుకు ఒకసారి వేదాలు వినాలని కోరిక కలిగి, ఇవి చదవగలిగే బ్రాహ్మణులను తెమ్మని తన భక్తులతో అంటారు. వేదాలు చదవగలిగేటు వంటి చదువుకున్న బ్రాహ్మణులు ఈకాలంలో దొరకడంలేదు అని భక్తులు అంటారు. 

అయినా సరే బ్రాహ్మణులు మరుసటి రోజు వస్తారు, మీరు అన్నీ తయారు చేయండి అని స్వామీజీ అంటారు. భక్తులు ఆనందపడి తయారు ప్రారంభించి 100 రూపాయలు విరాళం పోగుచేస్తారు. మరుసటిరోజు మధ్యాహ్నం సమయంలో ఒక గుంపు చదువుకున్న బ్రాహ్మణులు షేగాం వచ్చి శ్రీగజానన్ మహారాజు ఎదుట వేదం చదువుతారు. 

వారందరికి దక్షిణ ఇవ్వబడింది. తరువాత వారు వెళ్ళిపోయారు. యోగుల కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడు అని దీనినిబట్టి అర్థం అవుతుంది. బనకటలాల్, ఆ తరువాత అతని కుటుంబీకులు ప్రతి సంవత్సరం అదేరోజు ఈ వేద పఠనం కొనసాగిస్తున్నారు. 

శుభం భవతు
 4. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 19 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 4 - part 4 🌻*

Again and again he begged pardon from God and prayed for helping him out of the tragedy of his life. Full of repentance he came to Shri Gajanan and squatted at His doors fasting and chanting the name of God. 

After one full day of his fasting Shri Gajanan said, What you are doing is not proper. Why did you not remember God before this? It is just like calling a doctor after the death of patient or like marrying in old age, after spending one’s youth being a bachelor. 

Everything should be done in its proper time. Otherwise the action bears no fruits. There is no use digging a well when the house is on fire. The family for whom you toiled in your good days has left you alone. You wasted all your time attaining things that were transient and forgot the One truth which is eternal. 

Consequently, you now have to bear the results of your actions from which there is no escape. So do not be obstinate. Be reasonable. Other people also tried to persuade him but he ignored them all, kept up his fast and the chanting of “Narayan, Narayan”. 

To teach Madaho a lesson, Shri Gajanan played a trick on Madhao. At mid night when it was pitch dark, and nobody was near about, He changed His human form into a fearful form of Yama, the God of death, and with a big open jaw rushed towards Madhao, as if to eat him. 

Madhao was dumb founded and with a throbbing heart, started to run away. Looking at his condition, Shri Gajanan Maharaj regained His normal self and loudly said, Is this the boldness that you have got? 

Remember that you are the food of death, and it will swallow you like this only. What I have shown is an indication of future happening of Yamalok wherefrom you will not be able to run away”. 

Madhao replied, “Kindly save me from Yamalok. I do not want this life also. My last request to You is to send me to Vaikunth. You have already shown me Yamalok once, so do not send me there again. I am fully aware of my sins and if you wish, it is not difficult for You to free me from them. 

I am fortunate enough to be at your feet, probably because of some good deeds to my credit. The one who meets a saint during his lifetime cannot go to Yamalok”. Shri Gajanan Maharaj said, “Keep on chanting the name of Narayan, as your death is quite near now. 

If you still want to live, tell me and I will extend your life span. Madhao said, “I do not want to live any more. This world is all unreal and so kindly don’t let me get involved in its attractions”. Upon which, Shri Gajanan Maharaj said, TATHASTU - I give you what you want. 

You will not be reborn on this earth.” Such was the secret conversation between them, for which my words fall short to describe. Madhao lost all the worldly responses, people thought it to be the effect of his fasting. 

Madhao died at the feet of Shri Gajanan Maharaj and finally escaped the cycle of birth and death. Once Shri Gajanan Maharaj wished to listen to the Vedas and so asked the devotees to get some learned Brahmins for their recitation. 

The devotees said that learned Brahmins, able to recite Vedas, were not available their days. Swamiji however, asked them to go ahead with the making of the necessary preparations saying that the Brahmins would come the next day. 

The devotees were happy; they started the preparations and collected a sum of one hundred rupees for that purpose. The next day, at noontime, a team of learned Brahmins really arrived at Shegaon! They recited the Vedas before Shri Gajanan Maharaj. All of them were given Dakshina. 

Then they went away. This shows that Almighty God fulfils all the desires of the saints. Bankatlal, and now his descendants, continued this recitation of Vedas on that particular day every year. 

||SHUBHAM BHAVATU||
 Here ends Chapter Four

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 69 / Soundarya Lahari - 69 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

69 వ శ్లోకము

*🌴. సంగీతములో ప్రావీణ్యం, కార్యములలో జయం పొందుటకు 🌴*

శ్లో:69. గళే రేఖాస్తిస్రో గతిగమక గీతైకనిపుణే 
వివాహవ్యానద్ధ ప్రగుణగుణసంజ్ఖ్యా ప్రతిభువఃl 
విరాజన్తే నానావిధమధుర రాగాకరభువాం 
త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవతే ll 
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! సంగీత గతికి సంబంధించిన మార్గదేశి గతులను పాడుట యందు నిపుణరాలవు అగు తల్లీ ! నీ గళమున ముడుతలు లాగున ఉన్న మూడు భాగ్య రేఖలు వివాహ సమయమున మంగళ సూత్రము కట్టిన తరువాత వాని వద్ద పెక్కు పేటలు కలిపి పేనిన మూడు సూత్రములను జ్ఞప్తికి తెచ్చుచూ అనేక విధములయిన రాగములకు నిలయమయిన షడ్జమం, మధ్యమం, గాంధారమనే గ్రామముల ఉనికి కొఱకు ఏర్పాటు చేసిన సరి హద్దులా ప్రకాశించు చున్నది కదా! 

🌷. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయసం, తేనె, కొబ్బరి కాయ, తాంబూలము నివేదించినచో, సంగీతములో ప్రావీణ్యతను పొందగలరని, కార్యములలో ప్రయత్నం సఫలీకృతం అవగలదు అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹Soundarya Lahari - 69 🌹*
📚 Prasad Bharadwaj 

SLOKA - 69

*🌴 Mastery over Music and success in all works 🌴*

69. Gale rekhas thisro gathi-gamaka-gith'aika nipune Vivaha-vyanaddha-praguna-guna-samkhya-prahibhuvah; Virajanthe nana-vidha-madhura-ragakara-bhuvam Thrayanam gramanam sthithi-niyama-seemana iva the. 
 
🌻 Translation : 
She who is an expert in gathi, gamaka and geetha,the three lucky lines on your neck, perhaps remind one, of the number of the well tied manifold thread, tied during your marriage, and also remind of the place, in your pretty neck, where originates the three musical notes, of shadja, madhyama and gandhara. (the three major parts of karnatic classical music - procedure, undulations and song)

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 45 days, offering thambulam, honey, payasam and coconut as prasadam, it is believed that they will get mastery over music and can achieve success in all efforts.

🌻 BENEFICIAL RESULTS: 
Success in all endeavours, in case of women longevity of husbands, skill in music. 
 
🌻 Literal Results: 
Excellent sloka for instrumenatal as well as vocal musicians. Command over the three octaves in music, gains expertise in "gamakas" and musical technique. Gains vast musical repertoire. Ideal for performing artisites, capacity to produce magnetic, melodious and celestial music. Accumulation of neck ornaments.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹1. మనోవిజయము - మనసు వ్యాకులము చెందకుండటయే స్థితిప్రజ్ఞత్వము 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 1 📚
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

భగవంతుని మొట్టమొదటి శాసనము కశ్మలమును వీడమని. ''కుతస్త్వా కశ్మలమ్‌ ఇదమ్‌'' అని శ్రీకృష్ణుని ప్రశ్నించుచు తన దివ్యోపదేశమును అందించినాడు. 

శ్రీభగవా నువాచ :
 *కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితమ్‌ |* 
 *అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున || 2* 

కశ్మలం అనగా మనో వ్యాకులత్వము. అది మోహముచే కలుగును. దాని వలన శోకమేర్పడును. పిరికితన మావరించును. 

మనస్సు మలినము చెందినదై సమస్తమును గజిబిజి చేయును. అనాచార్యము నాదరించుట జరుగును. స్వర్గము అనగా సువర్గము. అనగా వైభవము నుండి పద్రోయును. అపకీర్తిని కట్టబెట్టును. ఎట్టి విపత్కర పరిస్థితుల యందును మనసు వ్యాకులము చెందకుండటయే స్థితి ప్రజ్ఞత్వము. 

భాగవతుల జీవితమున దీనిని ప్రస్పుటముగ గమనించ వచ్చును. సులభముగ, త్వరితగతిని మనసు చెదరువారు బలహీనులు. వారిచే ఎట్టి ఘనకార్యములు నిర్వర్తింపబడవు.

''అనార్యము, నరకము, అపకీర్తి కట్టబెట్టు మనోవ్యాకులము నిన్నెట్లా వరించినది?'' అని భగవంతుడు అర్జునుని (నరుని అనగా మనలను) ప్రశ్నించుచున్నాడు. 

మనోవ్యాకులము నుండి విముక్తి చెందుటకు మార్గమును బోధించుచున్నాడు. కనుకనే భగవద్గీతకు మనో విజయమని కూడ పేరు కలదు.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 368 / Bhagavad-Gita - 368 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 17 🌴

17. కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్ |
కేషు కేషు చ భావేషు చిన్త్యో(సి భగవన్మయా ||

🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! యోగీశ్వరా! నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలిసికొనగలను? ఓ దేవదేవా! ఏ యే రూపములందు నున్ను స్మరింపవలెను?

🌷. భాష్యము :
గడచిన అధ్యాయమునందు తెలుపబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణడు తన యోగమాయచే కప్పబడియుండును. కేవలము శరణాగతులైన మహాత్ములు మరియు భక్తులే అతనిని గాంచగలరు. 

ఇప్పుడు అర్జునుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుడు దేవదేవుడని సంపూర్ణముగా విశ్వసించినను, సామాన్యుడు సైతము ఏవిధముగా ఆ సర్వవ్యాపియైన భగవానుని అవగతము చేసికొనగలడో అట్టి సర్వసాధారణ పద్ధతిని తెలియగోరుచున్నాడు. 

యోగమాయచే కప్పబడినందున శ్రీకృష్ణుని సామాన్యజనులు (దానవులు మరియు నాస్తికులతో సహా) ఎరుగలేరు. కనుక వారి లాభము కొరకే అర్జునుడు ఈ ప్రశ్నలను అడుగుచున్నాడు. ఉన్నతుడైన భక్తుడు తన స్వీయావగాహన కొరకే గాక సమస్త మానవాళి అవగాహన కొరకై యత్నించును. 

కనుకనే భక్తుడును మరియు ఘనవైష్ణవుడును అగు అర్జునుడు కరుణాపూర్ణుడై తన ప్రశ్నచే భగవానుని సర్వవ్యాపకత్వమును సామాన్యుడు తెలియుటకు అవకాశమొసగుచున్నాడు. శ్రీకృష్ణుడు తనను ఆచ్చాదించియున్న యోగమాయకు ప్రభువైనందునే అర్జునుడు ఇచ్చట అతనిని “యోగిన్” అని ప్రత్యేకముగా సంబోధించినాడు. 

అట్టి యోగమాయ కారణముననే ఆ భగవానుడు సామాన్యునకు గోచరింపకుండుట లేక గోచరించుట జరుగుచుండును. కృష్ణుని యెడ ప్రేమలేని సామాన్యమానవుడు అతనిని గూర్చి సదా చింతనను గావింపలేడు. 

కనుక అతడు భౌతికభావనముననే చింతింపవలసియుండును. అర్జునుడు భౌతికప్రవృత్తి కలిగిన జనుల ఆలోచనాధోరణిని పరిగణనకు తీసికొనుచున్నాడు. ఇచ్చట “కేషు కేషు చ భావేషు” అను పదములు భౌతికప్రవృతిని (భావ మనగా భౌతికవిషయములు) సూచించును. 

భౌతికప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఆధ్యాత్మికముగా అవగాహన చేసికొనలేనందున భౌతికములైనవానిపై మనస్సును కేంద్రీకరించి, భౌతికప్రాతినిధ్యముల ద్వారా ఏవిధముగా శ్రీకృష్ణుడు వ్యక్తమగుచున్నాడో గాంచవలసినదిగా ఉపదేశింపబడుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 368 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 17 🌴

17. kathaṁ vidyām ahaṁ yogiṁs
tvāṁ sadā paricintayan
keṣu keṣu ca bhāveṣu
cintyo ’si bhagavan mayā

🌷 Translation : 
O Kṛṣṇa, O supreme mystic, how shall I constantly think of You, and how shall I know You? In what various forms are You to be remembered, O Supreme Personality of Godhead?

🌹 Purport :
As it is stated in the previous chapter, the Supreme Personality of Godhead is covered by His yoga-māyā. Only surrendered souls and devotees can see Him. 

Now Arjuna is convinced that his friend, Kṛṣṇa, is the Supreme Godhead, but he wants to know the general process by which the all-pervading Lord can be understood by the common man. 

Common men, including the demons and atheists, cannot know Kṛṣṇa, because He is guarded by His yoga-māyā energy. 

Again, these questions are asked by Arjuna for their benefit. The superior devotee is concerned not only for his own understanding but for the understanding of all mankind. 

So Arjuna, out of his mercy, because he is a Vaiṣṇava, a devotee, is opening for the common man the understanding of the all-pervasiveness of the Supreme Lord. 

He addresses Kṛṣṇa specifically as yogin because Śrī Kṛṣṇa is the master of the yoga-māyā energy, by which He is covered and uncovered to the common man. 

The common man who has no love for Kṛṣṇa cannot always think of Kṛṣṇa; therefore he has to think materially. Arjuna is considering the mode of thinking of the materialistic persons of this world. 

The words keṣu keṣu ca bhāveṣu refer to material nature (the word bhāva means “physical things”). 

Because materialists cannot understand Kṛṣṇa spiritually, they are advised to concentrate the mind on physical things and try to see how Kṛṣṇa is manifested by physical representations.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 194 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
43. అధ్యాయము - 18

*🌻. గుణనిధి సద్గతిని పొందుట - 1 🌻*

బ్రహ్మోవాచ |

శ్రుత్వా తథా స వృత్తాంతం ప్రాక్తనం స్వం వినింద్య చ | కాంచిద్దిశం సమాలో క్య నిర్య¸° దీక్షితాంగజః || 1

కియచ్చిరం తతో గత్వా యజ్ఞదత్తాత్మజస్స హి | దుష్టో గుణనిధిస్తస్థౌ గతోత్సాహో విసర్జితః || 2

చింతామవాప మహతీం క్వ యామి కరవాణి కిమ్‌ | నాహమభ్యస్త విద్యోsస్మి న చైవాతి ధనోsస్మ్యహమ్‌ || 3

దేశాంతరే యస్య ధనం స సద్యస్సుఖమేధతే | భయమస్తి ధనే చోరాత్స విఘ్న స్సర్వతోభవః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ దీక్షితపుత్రుడా వృత్తాంతమును విని తన పూర్వకర్మను నిందించుకొని ఏదో ఒక దిక్కున బయలు దేరెను (1). 

చాలసేపు అట్లు ప్రయాణించి, యజ్ఞదత్తపుత్రుడు దుష్టుడునగు గుణనిధి తంత్రిచే పరిత్యజింపబడి ఉత్సాహము లేనివాడై నిలబడెను (2). 

ఆతడు గొప్ప దుఃఖమును పొందెను. నేను ఎచటికి వెళ్లెదను? ఏమి చేయుదును? నేను విద్యలను విస్మరించితిని. నావద్ద ధనము కూడా అధికముగా లేదు (3). 

దేశాంతరమునందు ధనమున్న వానికి సుఖము వెనువెంటనే లభించును. ధనము ఉన్నచో చోరుల భయము తప్పదు. కాని ఇది అన్ని దేశములకు సమానమే (4).

యాజకస్య కులే జన్మ కథం మే వ్యసనం మహత్‌ | అహో బలీయాన్హి విధిః భావి కర్మాను సంధయేత్‌ || 5

భిక్షితుం నాధిగచ్ఛామి న మే పరిచితః క్వచిత్‌ | న చ పార్శ్వే ధనం కించిత్కిమత్ర శరణం భవేత్‌ || 6

సదానభ్యుదితే భానౌ ప్రసూర్మే మిష్టభోజనమ్‌ | దద్యా దద్యాత్ర కం యాచే న చేహ జననీ మమ || 7

దీక్షితుని గృహములో జన్మించిన నాకు తీవ్రమగు వ్యసనము లెట్లు అబ్బినవి ? ఆశ్చర్యము! విధి బలవత్తరమైనది. నేను ఇప్పుడు భావి కార్యమును గూర్చి ఆలోచించవలెను (5). 

యాచించుటకై నాకు పరిచితమైన వాడెవ్వడూ కానరాడు. నావద్ద ధనమేమియూ లేదు. ఈ పరిస్థితిలో నాకు శరణు యెవ్వరు? (6). 

తెల్లవారకుండగానే నాకు తల్లి మృష్టాన్న భోజనమునిడెడిది. ఆ నా తల్లి ఇచట లేదు. నేనిచట ఎవరిని యాచించదగును ?(7)

బ్రహ్మోవాచ |

ఇతి చింతయతస్తస్య బహుశస్తత్ర నారద | అతిదీనం తరోర్మూలే భానురస్తాచలం గతః || 8

ఏతస్మిన్నేవ సమయే కశ్చిన్మాహేశ్వరో నరః | సహోపహారానాదాయ నగరాద్బహిరభ్యగాత్‌ || 9

నానావిధాన్‌ మహాదివ్యాన్‌ స్వజనైః పరివారితః | సమభ్యర్చితు మీశానం శివరాత్రావుపోషితః || 10

శివాలయం ప్రవిశ్యాథ స భక్త శ్శివ సక్తధీః | యథోచితం సుచిత్తేన పూజయామాస శంకరమ్‌ || 11

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదా! ఇట్లు ఆతడు అచట చెట్టు మొదట్లో కూర్చుండి పరిపరివిధముల చింతిచుచుండగా సుర్యుడు అస్తమించెను (8). 

ఇదే సమయములో ఒక మహేశ్వర భక్తుడు నైవేద్యము కొరకు ఉపహారములను తీసుకొని నగరమునుండి బయటకు బయలుదేరెను. (9). 

అతని వద్ద గొప్ప దివ్యములైన అనేక విధిముల ఉపహారములు లుండెను. ఆతని బంధువులు ఆతనిని చుట్టు వారియుండిరి. ఆతడు శివరాత్రి నాడు ఉపవాసముండి శివుని ఆరాధించుటకు బయలు దేరెను (10). 

శివుని యందు లగ్నమైన మనస్సుగల ఆ భక్తుడు శివాలయమును ప్రవేశించి, పవిత్రమగు మనస్సుతో యథావిధిగా శంకరుని పూజించెను (11).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 70 🌹*
Chapter 19
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 The Father of Creation - 2 🌻*

The Avatar was gone for so long—1400 years. By the time he returned nobody could recognize him. He traveled throughout the world, and every person he met, he asked, "Do you recognize me? I was this one, and I was that one."

But the answer was invariably, "No, we do not recognize you. You could not possibly be him. Prove your claim to us, so we can recognize you, or we will denounce you for declaring this."
 
So, it becomes difficult for the Avatar to prove to mankind that he is the Father. 

He enters into seclusion, and now does not care whether humanity accepts him as their Father or not. He sees he cannot outwardly help humanity, so he helps inwardly by staying in seclusion.
 
Each time the Avatar comes, his children, in their ignorance, fail to accept him as their real Father. Mankind invariably opposes the Avatar, and though he does everything for their benefit, they cannot realize what he is doing. 

Thus the Avatar, the Father of creation, suffers because of the ignorance of his children. But, because of his Realization that he is everyone and everything, he never denies them. 

If the Avatar denied his being the Father of creation, he would never return and there would be no progress in human consciousness toward God. 
The Avatar suffers because of the ignorance of the world. His work is solely for the benefit of the world. 

The world did not accept him while he was physically on earth; and consequently, because his work had to be completed, Meher Baba spent his final days in seclusion.
 
If we accept Meher Baba as our Father, we will be able to receive of the treasure of his knowledge, which he has left to the world. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 65 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 27
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. దీక్షా విధి - 6 🌻*

ఓం సుగన్ధ తన్మాత్రే వియుజ్‌క్ష్వ హుం ఫట్‌ ఓం సంపాహి స్వాహా

ఓం స్వం స్వం యుజ్‌క్ష్వ ప్రకృత్యా

ఓం సుం హుం గన్ధతన్మాత్రే సంహర స్వాహా

తతః పూర్ణాహుతి శ్చైవముత్తరేషు ప్రయుజ్యతే |

ఓం రాం రసతన్మాత్రే

ఓం ఖేం రూపతన్మాత్రే

ఓం రం స్పర్శ తన్మాత్రే

ఓం ఐం శబ్దతన్మాత్రే

ఓం భం మనః

ఓం సోం అహఙ్కారః

ఓం నం బుద్ధౌ

ఓం ఓం ప్రకృతౌ

ఏకమూర్తావయం ప్రోక్తో దీక్షాయోగః సమాసతః |

ఏవమేవ ప్రయోగస్తు నవవ్యూహాదికే స్మృతః. 52

ఓం సుగన్ధతన్మాత్రే వియుజ్‌క్ష్వ హుం ఫట్‌ ఓం సంపాహి స్వాహా'' అనునది గంధతన్మాత్రా విమోజన మంత్రము. ''ఓం స్వం స్వం యుజ్‌క్ష్వప్రకృత్యా'' అనునది ప్రకృతి సంయోజన మంత్రము, ''ఓం సుం హుం గన్ధతన్మాత్రే సంహర స్వాహా' అనునది సంహార మంత్రము, పిమ్మట పూర్ణాహుతి చేయవలెను. మిగిలినవాటి విషయమున గూడ ఇట్లే చేయవలెను. ''ఓం రసతన్మాత్రే'' మొదలు ''ఓం ఓం ప్రకృతౌ'' అను దానివరకును ఉన్న ఎనిమిది యుత్తత్ర్పయోగాలలో ఉపయోగించు ఉమంత్రములు. ఇది ఏకమూర్తి విషయమున సంపూర్ణముగ చెప్పబడిన దీక్షా విధానము. నవవ్యూహాదికమునందు కూడ ప్రయోగ మిట్లే అని చెప్పబడినది.

దగ్ధ్వా పరస్మిన్‌ సందధ్యాన్నిర్వాణ ప్రకృతిం నరః | అవికారే సమాదధ్యాదీశ్వరే ప్రకీతిం నరః. 53

శోధయిత్వాథ భూతాని కర్మాఙ్గాని విశోధయేత్‌ | బుద్ధ్యాఖ్యాన్యథ తన్మాత్రం మనో జ్ఞానమఙ్కృతమ్‌. 54

నరుడు ప్రకృతిని దహించి దానిని పరమ నిర్వాణమునందు చేర్చవలెను. నరుడు ప్రకృతిని అవికారుఢగు ఈశ్వరునితో చేర్చవలెను. పిమ్మట భూతశుద్ధి చేసి బుద్ధ్యాఖ్యములగు కర్మాంగములను, పిమ్మట తన్మాత్రలను, మనస్సును జ్ఞానమును, అహంకారమును శోధించవలెను.

లిఙ్గాత్మానం విశోధ్యాన్తే ప్రకృతిం శోధయేత్పునః | పురుషం ప్రాకృతం శుద్ధమీశ్వరే ధామ్ని సంస్థితమ్‌. 55

స్వగోచరీకృతాశేషభోగం ముక్తౌ కృతాస్పరమ్‌ | ధ్యాయన్‌ పూర్ణాహుతిం దధ్యాద్దీక్షేయం త్వాధికారిణీ. 56

అంతమునందు లింగాత్మశోధనము చేసి మరల ప్రకృతి శోదనము చేయవలెను. పరిశుద్ధుడును, ఈశ్వరధామమున నున్న వాడును, అన్ని భోగములను తన గోచరముచేసికొనినవాడును, ముక్తియందు స్థితి సంపాదించినవాడును అగు ప్రాకృతీ పురుషుని ధ్యానించుచు పూర్ణాహుతిని ఇవ్వవలెను. ఇది అధికారికి సంబంధించిన దీక్షా విధానము.

అఙ్గెరారాధ్య మన్త్రస్య నీత్వా తత్త్వగణం నమమ్‌ | క్రమాదేవం విశోధ్యాన్తే సర్వసిద్ది సమన్వితమ్‌. 57

ధ్యాయన్‌ పూర్ణాహుతిం దద్యాద్దీక్షేయం సాధకీ స్మృతా.

మంత్రాంగములచే ఆరాధనచేసి తత్త్వముల సముదాయమును సమముగా నుండునట్లుచేసి ఈవిధముగ సక్రమముగా విశోధనముచేసి, అంతమునందు సర్వసిద్ధి సమన్వితుని ధ్యానించుచు పూర్ణాహుతి ఇవ్వవలెను, ఇది సాధకుడు చేయవలసిన దీక్షా పద్ధతి.

ద్రవ్యస్య వా న సంపత్తి రశక్తి ర్వాత్మనో యది. 58

ఇష్ట్వా దేవం యథాపూర్వం సర్వోపకరణాన్వితమ్‌ | సద్యో7ధివాస్య ద్వాదశ్యాం దీక్షయేద్దేశికోత్తమః. 59

ద్రవ్యములను కూర్చుకొనుటకు సామర్ధ్యము లేకపోయినచో? లేదా తనకు శక్తి లేకపోయినచో, దేశికోత్తముడు పూర్వము చెప్పినట్లు సర్వోపకరణసహితు డగు దేవుని ఆరాధించి వెంటనే శిష్యునకు ద్వాదశియందు దీక్ష ఇవ్వవలెను.

భక్తో వినీతః శారీర్తెర్గుణౖః సర్త్వెః సమన్వితః | శిష్యో నాతిధనీ యస్తు స్థణ్డిలేభ్యర్చ్య దీక్షయేత్‌. 60

భక్తుడును, వినయవంతుడును, సమస్తమైన శారీర గుణములు కలవాడును అగు విష్యుడు అధిక ధనవంతుడు కానిచో ఆతనికి స్థండిలాభ్యర్చన చేయించి దీక్ష ఇవ్వవలెను.

అధ్వానం నిఖిలం దైవం భౌతం వాధ్యాత్మికీ కృతమ్‌ | సృష్ట క్రమేణ శిష్యస్య దేహే ధ్యాత్వా తు దేశికః. 61

అష్టాష్టాహుతిభిః పూర్వం క్రమాత్సంతర్ప్య సృష్టిమాన్‌ | స్వమన్త్రైర్వాసుదేవాదీన్‌ జ్వలనాదీన్విసర్జయేత్‌. 62

గురువు, సమస్తమైన దైవమార్గమును గాని, ఆధ్యాత్మికముగా బావన చేయబడిన భౌతిక మార్గమునుగాని, శిష్యుని దేహముపై ధ్యానించి, ముందుగా వాసుదేవాది దేవతలను, అగ్ని మొదలైనవారిని, క్రమముగ వారి వారి మంత్రములతో ఎనిమిదేసి ఆహుతులచేత తృప్తిపరచి, విసర్జనము చేయవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 81 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అష్టావక్ర – సుప్రభ - 5 🌻*

27. ఉత్తమలోకాలలో – ఇంకాపైకి వెళితే విష్ణులోకం, శివలోకం ఉన్నాయని అంటున్నాం కదా! ఈశ్వరతత్వం ఎలా ఉంటుందని పురాణాలు, వేదాలు మనకు వర్ణించి చెప్పితే మనకు ఏభావాలు కలిగినవో, విష్ణుతత్వం ఎలా ఉంటుందని భావిస్తున్నామో – అటువంటి భావాలనే అక్కడికి వెళ్లి జీవుడనుభవిస్తున్నాడు.
అక్కడికివెళ్ళితే ఆ భావం, మూడు దశలలో ఉంటుంది. 

28..నేను విష్ణుసన్నిధికొచ్చేసాను అని జీవుడనుకుంటాడు. అదిగో విష్ణువు కనబడుతున్నాడనుకుంటాడు. అతడికి చర్మచక్షువులు లేవు కాబట్టి, అతడు ఈ కళ్ళతో చూచేటటువంటి లక్షణంకలిగిన ప్రపంచం కాదది. 

29. అలా విష్ణువుకు సమీపవర్తిని అయ్యాను అనుకుంటాడు. సాలోక్యం – సామీప్యం – సమీపంగా వెళ్లటము. ఆ తరువాత జీవుడికి నేనే విష్ణువును అనిపిస్తుంది. 

30. ఏ విష్ణువునైతే ఏ భావంతో ఏ రూపంలో పూజించి భజించాడో, ఉహించుకున్నాడో, అట్టితత్త్వం ఆ జీవుడు పొందుతాడు. తానే విష్ణుతో సారూప్యం పొందుతాడు. సారూప్యంలో అక్కడ కొంతకాలం ఉంటాడు. తరువాత ఆ జీవుడు సాయుజ్యం పొందుతాడు. తనుండక, విష్ణుతత్త్వంలో సాయుజ్యం పొందుతాడు. 

31. కాబట్టి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములు అనే నాలుగుస్థితులు లోకముల విషయంలో ఉన్నాయి.

32. సగుణంగా వర్ణించబడినట్టి ఉత్తమలోకాలలో ఇవి ఉన్నాయి. బ్రహ్మజ్ఞాని బ్రహ్మైక్యం పొందినప్పుడు ఏలోకమూలేదు. అతడక్కడ శరీరాన్ని వదిలిపెడతాడు. మరెక్కడా ఉండదు. భూలోకంనుంచే బ్రహ్మజ్ఞానంచేత బ్రహ్మైక్యం పొందుతాడు.

33. ఉత్తమలోకాలు అతడికి అవసరంలేదు. అటువంటి ఉత్తమమయిన అవకాశము కలిగిఉన్నటువంటిది భూలోకం! అందువల్లనే ఈ మహాత్ములైన మహర్షులందరూ ఇక్కడ పుట్టారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 12 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

*🌻 STANZA III - The Sowing of Love - 3 🌻*

24. A Time to blossom and a Time to bear fruit. Were not bounteous fruits being borne by those that had been blooming so luxuriantly, in accord with the Periods established for them? 

Yes, their fruits were fresh and fragrant. But at first they could be seen only by the Creator — the One who had sown the Seeds. His was the Hand that had generously scattered the Divine Seeds on the Earth. 

But some of them fell among thorns and were choked. Many fell in stony places... God was waiting for the harvest. He longed to see the Divine Fruit, for like would bear like unto Him, as an apple tree would bear an apple and a pear tree a pear. 

Thus, in everything, His Law would be obeyed. The Seed germinated and hastened to bear fruit. All the shoots were by now firmly established, showing strong stems. 

Only their fruit was still in question. And only as the fruit ripened was it possible to judge the results. But for that the Periods had not yet come. 

In the meantime, the fruit was absorbing everything granted to it by a generous world. And the roots, whether they were sunk into the darkness or into the Light, served to determine the fruit’s true value... 

Thus the Gods directed the Motion of the Wheel towards the New Period. 

And that was the Season of Reaping, designed to effect the final calculation of the ripened Divine Harvest.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 30 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. బ్రహ్మంగారి పై నేరారోపణ - 2 🌻* 

ముస్లిం మతస్తుడిని సిద్ధయ్యగా మార్చాడనే అభియోగం మోపడంతో వీరబ్రహ్మేంద్రస్వామికి నవాబు నుండి పిలుపు వచ్చింది. గురువుగారిమీద వచ్చిన ఆ నేరారోపణను తొలగించేందుకు సిద్ధయ్య బయల్దేరాడు.

మార్గమధ్యంలో అక్కడక్కడా చెట్ల కింద కూర్చున్న సిద్ధయ్య, ఎక్కువ సమయం ధ్యానంలో మునిగి వుండేవాడు. యోగముద్రలో ఉన్న సిద్ధయ్య వద్దకు ఎందరో బాటసారులు వచ్చి, తమ సందేహాలను బయటపెట్టేవారు. సిద్ధయ్య వారి సందేహాలను తెరచి, సలహా ఇస్తూండేవాడు.

సిద్ధయ్య దగ్గరకు ఎక్కువగా మహమ్మదీయ భక్తులు వస్తూండేవారు. వారికి తన బోధలతో హితోపదేశం చేస్తూ, వారి మనసులను మార్చి, తనవలె నుదుట బొట్టు, కాషాయములు రుద్రాక్షలు ధరింపచేస్తూండేవాడు.

సిద్ధయ్య జ్ఞానానికి, బోధనలకు ముగ్దులై, రెండు రోజులలోనే అనేకమంది మహ్మదీయులు హిందువులుగా మారిపోయారు.సిద్ధయ్య చేస్తున్న బోధనల గురించి, ముస్లింలు హిందువులుగా మారిపోవటం గురించి తెలుసుకున్న నవాబు సిద్దయ్యను తన సముఖమునకు పిలిపించాడు.

సిద్ధయ్య నవాబు దగ్గరకు వచ్చి నిర్భయంగా నిలబడ్డాడు. పైగా కాస్తయినా వినయం, విధేయతా ప్రదర్శించలేదు. అతని వైఖరి చూసి నవాబుకు కోపం వచ్చింది. సిద్ధయ్యకు ఉరిశిక్ష వేయాలన్నంత ఆగ్రహం కలిగినా, దాన్ని అణుచుకుని ముందుగా అతని ఉద్దేశ్యం తెలుసుకున్న తర్వాతే తానేం చేయాలో నిర్ణయించుకోవాలని భావించాడు.

“నువ్వు మహమ్మదీయుడవై వుండి, హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఎందుకు ఆరాధిస్తున్నావు? ఇది మహమ్మదీయ మతాన్ని విమర్శించటమే అవుతుంది. ఇది అల్లా పైన నీ అపనమ్మకాన్ని సూచిస్తోంది. ఇది మన మతాన్ని దూషించడమే! కాబట్టి నిన్ను కఠినంగా శిక్షించదలచుకున్నాను. దీనికి నీ జవాబు విన్న తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాను” అన్నాడు నవాబు.

నవాబు అంత తీవ్రంగా మాట్లాడినా సిద్ధయ్య అణువంత కూడా చలించలేదు. నవాబును చూసి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. దానితో అసలే కోపంగా వున్నా నవాబుకు ఆగ్రహం మరింత పెరిగింది. కానీ, అతన్ని శిక్షించేముందు విచారణ చేయాల్సి వున్నందు వల్ల సిద్ధయ్యతో ఇలా మాట్లాడాడు.

“నీకు మహత్తులు తెలుసని చెప్పుకుంటున్నావు కదా! సరే, ఇప్పుడు నువ్వేం మహత్తు చూపగలవో ప్రదర్శించు. లేకపోతే నీకు తగిన శిక్ష విధిస్తాను” అని హెచ్చరించాడు.

దానికి ప్రతిగా సిద్ధయ్య “మా గురువుగారి అనుజ్ఞ ప్రకారం నేను ఎలాంటి మహిమలూ చూపకూడదు. కానీ, మా గురువుగారి శక్తి తెలుసుకోవాలని మీరు కుతూహల పడుతున్నారు కాబట్టి, తప్పనిసరి పరిస్థితులలో నేను మీకు ఒక మహిమ చూపించనున్నాను. దానికోసం మీరు ఒక బండరాయిని తెప్పించి నా ఎదురుగా వుంచండి. మా గురువు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారి శక్తి ఏమిటో మీకు చూపుతాను” అన్నాడు.

వెంటనే నవాబు ఆలస్యం చేయకుండా తన భటులను పంపి ఒక పెద్ద కొండరాతిని తెప్పించాడు. “ఈ సభలో నేనేమైనా అతీత శక్తి ప్రదర్శిస్తే మీకు, సభలో వున్నవారికీ, కూడా ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం వుంది. కాబట్టి ఎక్కడన్నా ఖాళీ స్థలంలో బండరాయిని వుంచండి” అన్నాడు.

అందుకు ఒప్పుకున్న నవాబు రాతిని ఒక ఖాళీ ప్రదేశానికి తరలించాడు.

“ఇప్పుడు నీ శక్తిని, మీ బ్రహ్మంగారి శక్తిని ప్రదర్శించు” అని ఆదేశించాడు.

సిద్ధయ్య మనస్సులో గురుదేవుడైన బ్రహ్మంగారిని స్మరించి, తన కుడి చేతిని ఎత్తి ఆ బండరాయికి నమస్కారం చేశాడు. వెంటనే అక్కడున్న ప్రజలందరూ భయకంపితులయ్యే విధంగా, పెద్ద శబ్దంతో బండరాయి ముక్కలైపోయింది.

ఈ అద్భుత దృశ్యాన్ని నవాబుతో సహా, అక్కడ చేరిన ప్రజలందరూ చూశారు. ఎవ్వరికీ నోట మాట రాలేదు.

తర్వాత సిద్ధయ్య శాంతంగా నవాబు వేపు చూసి “అత్యంత శక్తిశాలి అయిన నా గురుదేవులను దోషిగా భావించి శిక్షించదలుచుకున్నారు. ఇప్పుడు చూశారు కదా ! ఆయన ఎంత శక్తివంతులో! ఒకవేళ ఆయనకు మీమీద ఆగ్రహం వస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి” అన్నాడు.

ఈ సంఘటనతో నవాబు భయపడి, తన తప్పును క్షమించమని అడిగాడు. తనకు కూడా జ్ఞానోపదేశం చేయాలని ప్రార్థించాడు. తాను నవాబుకు జ్ఞానోపదేశం చేయలేనని, అందుకు అర్హుడు తన గురువుగారేనని సిద్ధయ్య ఆయనకు నచ్చచెప్పాడు.

“వెంటనే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని తీసుకురమ్మని ” నవాబు సిద్దయ్యను కోరాడు.

“నేను కానీ, మీరు కానీ పిలిస్తే మా గురువుగారు రాలేరు. అందుకు తగిన సమయం రావాలి. అప్పుడు ఆయన వస్తారు. మీకు కూడా ఉపదేశం చేస్తారు” అని సిద్ధయ్య, నవాబుకు నచ్చచెప్పాడు.

ఆ తర్వాత సిద్ధయ్య నవాబు వద్ద సెలవు తీసుకుని, అక్కడి నుంచి బయల్దేరి తిరిగి కందిమల్లయ్యపల్లికి వెళ్ళిపోయాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 2 🌹*
 ✍. రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 2 🌻*
          
🌟 *మూల చైతన్యం మూడు విధాలుగా విభజించబడింది.*

*1. కాంతి*

*2. శబ్దం*

*3. శక్తి*

(మూలకాంతి, మూలశక్తి, మూలశబ్దం) గా సృష్టించబడ్డాయి. ఇవి అన్నీ ఆది చైతన్యంలోని విభాగాలే.
మూలశక్తికి మరోపేరే - *" ఆదిపరాశక్తి"*
ఆదిశక్తి నుండి సృష్టి, స్థితి, లయలు సృష్టించబడ్డాయి.

*1. సృష్టి - సన్ ఎనర్జీ - బ్రహ్మ - సృష్టికారకుడు -సృష్టికర్త -(సృష్టిప్రదాత)*

*2. స్థితి - మదర్ ఎనర్జీ - విష్ణు - స్థితికారకుడు - పోషణకర్త - (స్థితి ప్రదాత)*

*3. లయ - ఫాదర్ ఎనర్జీ - మహేశ్వర - లయకారకుడు - జ్ఞానకర్త (జ్ఞాన ప్రదాత)*

*1. యూనివర్సల్ ఫాదర్ ఎనర్జీ (తండ్రి ) - కాన్షియస్ నెస్ (ఎరుక)*

*2. యూనివర్సల్ మదర్ ఎనర్జీ (తల్లి) - లైఫ్ ఫోర్స్ (ప్రాణశక్తి)*

*3. యూనివర్సల్ సన్ ఎనర్జీ (కొడుకు) -మెటీరియల్ ఎనర్జీ (పదార్థం)*

ఈ మూడు శక్తులతోనే ఎన్నో యూనివర్సలనూ, గెలాక్సీలనూ, సోలార్ సిస్టమ్ లనూ మరి గ్రహాలనూ సృష్టించడం జరిగింది. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 146 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

As salt dissolves in water so does everything dissolve in pure being. Wisdom is eternally negating the unreal, to see the unreal is wisdom. Beyond this lies the inexpressible.

Elimination and purification, renunciation of all that is foreign to your nature is enough. All else is vanity.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 25 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 13 🌻*

ఒకరికి విద్యయందు ఆసక్తి వుంది. వరసగా చేస్తూనే పోతుంటాడు జీవితకాలం. ఎం ఎ లు, పిహెచ్ డి లు, ఎం ఫిల్ లు, ఎం ఎ లు, బి ఎ లు వాడికి తోచిన డిగ్రీలన్నీ చేస్తూ పోతుంటాడు. కొంతమంది వున్నారు. 

16 ఎం ఎ లు చేశానండీ అని చెప్పుకుంటాడు జీవితంలో. సత్యమే. కాని అది ప్రేయోమార్గము కదా. కొంతమంది ఏం చెప్పుకుంటారు? నేను సైకిల్ తొక్కుతూ ఈ వూరొచ్చానండి. ఇప్పుడు నేను 40 అంతస్థుల మేడ కట్టానండీ అంటాడు. 

అంటే ఆయన జీవితంలో ఆయన సాధించింది ఏమిటీ అని ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసినట్లయితే... మనం కూడా ప్రతిరోజూ ఏం చేయాలిట ఇప్పుడు. ఈ సింహావలోకనం చెయ్యాలి.

 ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలిట. నాకు పుట్టి బుద్ధి ఎరిగినప్పటినుంచీ, ఊహ వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకూ గత 30 ఏళ్ళలో, గత 40 ఏళ్ళలో, గత 50,60,70,80,100 ఏళ్ళల్లో సాధించినది ఏమిటి? అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన దగ్గర ఏమేమి కనబడుతున్నాయో, అవన్నీ కూడా భౌతికమైనటువంటి అంశములయినట్లయితే, అవన్నీ ఏమిటవీ? ప్రేయోమార్గములు. బంధదాయకములు. 

సుఖాన్ని ఇస్తుంది. బంధదాయకం అయినప్పటికీ కూడా సుఖాన్ని ఇస్తుంది. ఇందాక చెప్పా. శ్లేష్మములో పడిన ఈగ సుఖాన్ని పొందుతోంది. ఆహారాన్ని తింటోంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తోంది. కాని అందులోనే ప్రాణాన్ని కోల్పోయింది. 

శరీరము నేనుగా వున్నప్పుడు జర మరణ దుఃఖములు తప్పవు. ఆ జరామరణదుఃఖము శరీరానికే గాని నాకు కాదు అనేటటువంటి వివేకం పొందాలి అంటే ఆత్మవిచారణ చెయ్యాలి. 

ఈ బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యములు నావికావు, శరీరానివి అనేటటువంటి, శరీరంలోనే వుండి శరీరమునకు విలక్షణముగా వుండేటటువంటి స్థితిని సంపాదించాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 9 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 9 🌻*

22. పరాత్పరస్థితి యందు భగవంతుడు సత్యమందుగాని, మిథ్యయందుగాని, సాంతముగా గాని , అనంతముగా గాని ఎరుకలేక యున్నాడు.

23. సృష్టికి పూర్వమందేమియులేదు.
సర్వశక్తిమంతుడైన భగవంతుడే
'సర్వం'
అయి ఉండెను.

24. సృష్టికి పూర్వము భగవంతుడు మాత్రమే ఉండెను,కాని అతడు అంతర్నిహితముగా ఎరుకతో నుండెను.
అట్లే చైతన్యము, సృష్టి, వానిలో అంతర్నిహితమై యుండెను. 

25. అంతర్నిహితమైయున్న సృష్టి :--బీజము వంటిది.
ఆవిష్కారమైన సృష్టి :--వృక్షము వంటిది.

భగవంతుని
రెండవ పాత్ర. పరమాత్ముడు

26. పరమాత్మ స్థితి భగవంతుని అనంత గోచరస్థితి.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹