🌷. శ్రీ శివ మహా పురాణము - 62 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
🌴. విద్యేశ్వర సంహితా 🌴
అధ్యాయము - 17
🌻. ప్రణవ, పంచాక్షరీ మంత్రముల మహిమ - శివలోక వైభవము - 9 🌻
సాధకః పంచలక్షాంతే శివప్రీత్యర్థమేవ హి || 129
మహాభిషేకం నైవేద్యం కృత్వా భక్తాంశ్చ పూజయేత్ | పూజయా శివభక్తస్య శివః ప్రీతతరో భవేత్ || 130
శివస్య శివభక్తస్య భేధో నాస్తి శివో హి సః | శివస్వరూప మంత్రస్య ధారణాచ్ఛివ ఏవ హి || 131
శివభక్త శరీరే హి శివే తత్పరమో భవేత్ | శివభక్తాః క్రియాస్సర్వా వేద సర్వక్రియాం విదుః || 132
యావద్యావ చ్ఛివం మంత్రం యేన జప్తం భ##వేత్ క్రమాత్ | తావద్వై శివసాన్నిధ్యం తస్మిన్ దేహే న సంశయః || 133
సాధకుడు శివుని ప్రీతి కొరకు మాత్రమే అయిదు లక్షల జపమును పూర్తి చేసి (129),
మహాభిషేకమును, నైవేద్యమును చేసి, భక్తులను పూజించవలెను. శివభక్తుని పూజించినచో, శివుడు మిక్కిలి సంతసించును (130).
శివునకు, శివభక్తునకు తేడా లేదు. శివభక్తుడు శివుని స్వరూపమగు మంత్రమును జపించుట వలన శివుడే యగును (131).
శివభక్తుని శరీరములో శివుడు ఉండును. కాన, శివభక్తుని శ్రద్ధతో ఆరాధించవలెను. శివభక్తులకు లౌకిక, వైదిక క్రియలన్నియూ జ్ఞాతములే (132).
భక్తుడు ఎంత అధికముగా శివమంత్రమును జపించునో, అంత అధికముగా అతని దేహములో శివుని సన్నిది ఉండుననుటలో సందియము లేదు (133).
దేవీలింగం భ##వేద్రూపం శివభక్తి స్త్రియస్తథా | యావన్మంత్రం జపే ద్దేవ్యాస్తావత్సాన్నిధ్యమస్తి హి || 134
శివం సంపూజయేద్దీమాన్స్వయం వై శివరూపభాక్ | స్వయం చైవ శివో భూత్వా పరాం శక్తిం ప్రపూజయేత్ || 135
శక్తిం బేరం చ లింగం చ హ్యాలేఖ్యా మాయయా యజేత్ | శివలింగం శివం మత్వా స్వాత్మానం శక్తిరూపకమ్ || 136
శివలింగం నాదరూపం బిందురూపం తు శక్తికమ్ | ఉపప్రధాన భావేన అన్యోన్యసక్త లింగకమ్ || 137
పూజయేచ్చ శివం శక్తిం స శివో మూలభావనాత్ |
శివభక్తురాలగు స్త్రీ దేవీ స్వరూప యగును. ఆమె ఎంత అధికముగా శివమంత్రమును జపించునో, ఆమె యందు దేవీసాన్నిధ్యము అంత అధికముగా నుండును (134).
బుద్ధిమంతుడు స్వయముగా శివరూపుడై శివుని పూజించవలెను. భక్తుడు తనను తాను శివునిగా భావన చేసి పరాశక్తిని పూజించవలెను (135).
దేవిని, శివుని మూర్తిని, లింగమును, మరియు శివుని చిత్రపటమును నిష్కపట భావనతో ఆరాధించవలెను. భక్తుడు తనను శక్తిరూపముగా భావన చేసి, శివలింగము నందు శివుని పూజించవలెను (136).
శివలింగము నాదరూపము. శక్తి బిందురూపము. శివశక్తులు రెండు, పరస్పరము ప్రధాన, గుణ (అప్రధాన) భావముతో కలసి యుందురు (137).
ఇట్లు శివుని, శక్తిని పుజించు భక్తుడు, మూలమును భావన చేయుట వలన, శివస్వరూపుడగును.
శివభక్తాన్ శివమంత్ర రూపకాన్ శివరూపకాన్ || 138
షోడశైరుపచారైశ్చ పూజయే దిష్టమాప్నుయాత్ | యేన శుశ్రూషణాద్యైశ్చ శివభక్తస్య లింగినః || 139
ఆనందం జనయే ద్విద్వాన్ శివః ప్రీతతరో భ##వేత్ | శివభక్తాన్ సపత్నీకాన్ పత్న్యా సహ సమాదరాత్ || 140
పూజయే ద్భోజనాద్యైశ్చ పంచ వా దశ వా శతరమ్ | ధనే దేహే చ మంత్రే చ భావనాయా మవంచకః || 141
శివశక్తి స్వరూపేణ న పునర్జాయతే భువి| శివమంత్ర భావనచే శివస్వరూపులైన శివభక్తులను (138),
షోడశోపచారములతో పూజించు భక్తుడు అభీష్టమును పొందును. విద్వాంసుడు శివస్వరూపుడగు శివభక్తునకు శుశ్రూష చేసి (139),
ఆనందమును కలిగించవలెను. అట్లు చేయుట వలన శివుడు మిక్కిలి సంతసించును. భక్తుడు భార్యతో గూడి భార్యాసమేతులగు శివభక్తులను ఆదమరముతో (140),
అయిదుగురిని, గాని, పదిమందిని గాని, లేక వందమందిని గాని భోజనాదులతో పూజించవలెను. ధనములో గాని, కాయకష్టములో గాని, మంత్రములో గాని, భావన యందు గాని లోటు రానీయకూడదు (141).
అట్టి భక్తుడు శివశక్తి స్వరూపుడై భూలోకము నందు మరల జన్మించడు.
నాభేరధో బ్రహ్మ భాగమాకంఠం విష్ణుభాగకమ్ || 142
ముఖం లింగమితి ప్రోక్తం శివభక్త శరీరకమ్ | మృతాన్ దాహాది యుక్తాన్వా దాహాది రహితాన్మృతాన్ || 143
ఉద్దిశ్య పూజయే దాది పితరం శివమేవ హి | పూజాం కృత్వాది మాతుశ్చ శివభక్తాంశ్చ పూజయేత్ || 144
పితృలోకం సమాసాద్య క్రమాన్ముక్తో భ##వేన్మృతః |
శివభక్తుని శరీరములో పాదము నుండి నాభి వరకు బ్రహ్మభాగమనియు, నాభి నుండి కంఠము వకరు విష్ణుభాగమనియు (142),
ముఖము లింగమనియు చెప్పబడినది. మరణించిన వాని దేహమును దహించినా, లేక ఖననాదులను చేసినా (143),
అది పిత యగు శివుని, ఆది మాత యగు శక్తిని, శివభక్తులను పూజించవలెను (144).
అపుడు మరణించిన జీవుడు పితృలోకమును పొంది, క్రమముగా మోక్షమును పొందును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment