🌹 . శ్రీ శివ మహా పురాణము - 177 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
39. అధ్యాయము - 14
🌻. శివపూజ - 10 🌻
యదా చోచ్చాటనం దేహే జాయతే కారణం వినా || 75
యత్ర కుత్రాపి వా ప్రేమ దుఃఖం చ పరివర్థితమ్ | స్వగృహే కలహో నిత్యం యదా చైవ ప్రజాయతే || 76
తద్ధారాయాం కృతాయాం వై సర్వం దుఃఖం విలీయతే | శత్రూణాం తాపనార్థం వై తైలాధారా శివోపరి || 77
కర్తవ్యా సుప్రయత్నేన కార్య సిద్ధిర్ధ్రువం భవేత్ | వాసితేనైవ తైలేన భోగవృద్ధిః ప్రజాయతే || 78
శరీరములో కారణము లేకుండా ఉద్వేగము కలిగినప్పుడు (75),
ఏదో ఒక వస్తువుపై లేక వ్యక్తిపై ప్రేమ కలిగి దుఃఖము పెరిగినప్పుడు, ఇంటిలో నిత్యము కొట్లాటలు బయలుదేరినప్పుడు (76),
అట్టి ధారతో అభిషేకించినచో దుఃఖములన్నియు తొలగిపోవును. శత్రువులను తపింపజేయ గోరు వ్యక్తి శివునిపై తైలధారతో (77)
ప్రయత్నపూర్వకముగా అభిషేకించినచో, తప్పక కార్యసిద్ధి కలుగను. సువాసన నూనెతో అభిషేకించినచో భోగములు వర్ధిల్లును (78).
సార్షపేనైవ తైలేన శత్రునాశో భవేద్ధ్రువమ్ | మధునా యక్ష్మరాజో వై గచ్ఛేచ్చ శివపూజనాత్ || 79
ధారా చేక్షురసస్యాపి సర్వానందకరీ శివే | ధారా గంగాజలసై#్యవ భుక్తిముక్తి ఫలప్రదా || 80
ఏతాస్సర్వాశ్చ యాః ప్రోక్తా మృత్యుంజయ సముద్భవాః | తత్రాయుత ప్రమాణం హి కర్తవ్యం తద్విధానతః || 81
కర్తవ్యం బ్రాహ్మణానాం చ భోజ్యం వై రుద్ర సంఖ్యయా | ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ పృష్టోsహం మునీశ్వర|| 82
ఏతద్వై సఫలం లోకే సర్వకామహితావహమ్ |
ఆవాల నూనెతో అభిషేకించినచో, శత్రువులు నిశ్చయముగా నశించెదరు. తేనెతో శివుని అభిషేకించి పూజించినచో, దీర్ఘవ్యాధి తొలగిపోవును (79).
శివునకు చెరుకురసముతో అభిషేకించినచో సర్వా నందములు కలుగును. గంగా జలధారతో అభిషేకించినచో భుక్తి, ముక్తి కలుగును (80).
ఈ అభిషేకములనన్నిటినీ పదివేల మృత్యుంజయ జపము పూర్తియగు వరకు చేయవలెనని విధి (81).
అభిషేకానంతరము పదకొండు మంది బ్రాహ్మణులకు భోజనమునడవలెను. ఓమునిశ్రేష్ఠా! నీవు అడిగిన దానిని అంతయూ నీకు చెప్పితిని (82).
ఈ జ్ఞానమును విన్న మానవుడు ఈ లోకములో సర్వకామనలను, హితములను పొందును.
స్కందోమాసహితం శంభుం సంపూజ్య విధినా సహ || 83
యత్ఫలం లభతే భక్త్యా తద్వదామి యథాశ్రుతమ్ | అత్ర భుక్త్వాఖిలం సౌఖ్యం పుత్ర పౌత్రాభిశ్శుభమ్ || 84
తతో యాతి మహేశస్య లోకం సర్వసుఖావహమ్ | సూర్యకోటి ప్రతీకాశైర్విమానై స్సర్వకామగైః || 85
రుద్ర కన్యాసమాకీర్ణైర్గేయవాద్య సమన్వితైః | క్రీడతే శివభూతశ్చ యావదాభూతసంప్లవమ్ || 86
తతో మోక్షమవాప్నోతి విజ్ఞానం ప్రాప్య చావ్యయమ్ || 87
ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రథమ ఖండే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సృష్ట్యుపాఖ్యానే శివపూజా విధాన వర్ణనం నామ చతుర్దశోsధ్యాయః (14).
స్కందునితో, పార్వతితో కూడియున్న శంభుని యథావిధిగా భక్తితో పూజించిన వానికి కలుగు ఫలమును నేను విన్న మేరకు చెప్పెదను. అట్టివాడు ఈ లోకములో పుత్రులతో, పౌత్రులతో కూడిన మంగళకరములగు సౌఖ్యములనన్నిటినీ అనుభవించి (84),
ఆ తరువాత సర్వసుఖముల నొసగు మహేశుని లోకమును పొందును. అచట శివస్వరూపుడై, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే, యథేచ్ఛా సంచారము గల (85),
రుద్ర కన్యలతో నిండియున్న గానముతో వాద్యములతో అలరారే విమానములనధిష్ఠించి, మహా ప్రలయము వరకు క్రీడించును (86).
తరువాత వినాశరహితమగు విజ్ఞానమును పొంది, మోక్షమును పొందును (87).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సృష్ట్యుపాఖ్యానమనే మొదటి ఖండమునందు శివపూజావర్ణనమనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment