🌹. శివగీత - 27 / The Siva-Gita - 27 🌹

🌹. శివగీత - 27 / The Siva-Gita - 27 🌹
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము
*🌻. శివ ప్రాదుర్భావము - 3 🌻*

రౌద్రం పాశుపతం బ్రాహ్మం - కౌబేరం కులిశా నిలమ్,
భార్గవాది బహున్యప్త్రా - ణ్యయం ప్రాయుజ్క్త రాఘవః 17
తస్మిం స్తే జపి శస్త్రాణి - చాస్త్రాణ్య స్య మహీ పతే;,
విలీ నాని మహాభ్రస్య - కరకా ఇవ నీ రధౌ 18
తతః క్షణేన జజ్వాల - ధనుస్త స్య కారా చ్చ్యుతమ్,
తూణీ రం చాంగుళీ త్రాణం - గోది కాపి మహీ పతే: 19

శ్రీరాముడు వదలిన మహాస్త్రము లన్ని ఆ గొప్ప తేజస్సులో మహా సముద్ర మనబడిన వడ గండ్ల మాదిరి కరిగి పోయినట్లుగా లీనము లైన ఆ మీదట తృటి కాలములో శ్రీ రామ చంద్రుని ధనస్సు కూడా జారి (క్రింద నేలపై ) బడి భస్మ మైనది ,(బూడిద ) మరియు అమ్ముల పొదియు, హస్త కవచము ,గోదికము నేలపై బడి దగ్ధమైనవి.

తద్ద్రుష్ట్యా లక్ష్మణో భితై- పపాత భువి మూర్చితః,
అధాకిం చిత్కరో రామో - జానుభ్యా మవనిం గతః 20
మీలితాక్షో భయా విష్ట -శ్శంకరం శరణం గతః,
స్వరేణా ప్యుచ్చ రన్నుచ్చై - శ్శంభో ర్నామ సహస్రకమ్ 21
శివంచ దండవ ద్భూమౌ - ప్రణ నామ పునః పునః,
పునశ్చ పూర్వ వచ్చాసీ - చ్చబ్దో దిజ్మండలం స్వనన్ 22
చచాల వసుధా ఘోరం - పర్వతాశ్చ చ కంపిరే,
అధ క్షణేన శీతాంశు - శ్శీతలం తేజ ఆదదత్ 23
ఉన్మీలి తాక్షో రామస్తు - యావద్యా వత్ప్ర పశ్యతి,
తావద్ద దర్శ వృషభం - సర్వాలంకార సంయుతమ్ 24
పీయూష మధనో ద్భూత - నవనీత స్య పిండ వత్,
ప్రోత స్వర్ణం మరకత - చ్చాయా శృంగ ద్వాయాంచితమ్ 25
నీల రత్నేక్షణం - హ్రస్వ - కంట కంబల భూషితమ్,
రత్న పల్యాణ సంయుక్తం -నిబద్దం శ్వేత చామరై: 26

అది గాంచి సౌమిత్రి లక్ష్మణుడు భయపడి నేలబడి మూర్చిల్లెను. 

తరువాత శ్రీరాముడు దిగ్భ్రాంతుడై యేమియు తోచక భూమిపై మొకాళ్ళూని (మోకరిల్లి ) భయకంపితుడై కనులు మూసికొని ఉమాపతే నన్ను కాపాడు వాడని యెంచి గొంతెత్తి గట్టిగా వేద సార శివ సహస్రనామములను పటించుచు ముమ్మాటికి దీర్ఘ దండ నమస్కారములు సల్పెను.

ఇంతలోనే మొదటి మాదిరిగా దిక్కులు మారు మ్రోగ మహాధ్వని కలిగెను. ఆ ధ్వనికి భూమి మరియు పర్వతములు కూడా కదలినవి . రల తృటి కాలములోనే చంద్రుని శీతలము తేజస్సు అగుపడెను.

 శ్రీరాముడు తేరుకొని చూచులోపున, పాల సముద్రమును జిలుకు (తరచు ) చుండగా అందుండి ఉద్భవించిన వెన్న ముద్ద మాదిరి తెల్లగాను, బంగారు వన్నె గల తోక గలది,మరకత మణుల ననుకరించు కొమ్ములు కలది . ఇంద్రనీలము - మణులు కన్నులు గలది కారుచ కంటమున కంబలము కలది గంటారావలములతో దశ దిశలను బూరించు నది యగు నందీశ్వరుని చూచెను .
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 𝑻𝒉𝒆 𝑺𝒊𝒗𝒂-𝑮𝒊𝒕𝒂 - 27 🌹*
*🌴. 𝑫𝒊𝒂𝒍𝒐𝒈𝒖𝒆 𝒃𝒆𝒕𝒘𝒆𝒆𝒏 𝑹𝒂𝒎𝒂 𝒂𝒏𝒅 𝑳𝒐𝒓𝒅 𝑺𝒊𝒗𝒂 🌴*
✍️ 𝑨𝒚𝒂𝒍𝒂𝒔𝒐𝒎𝒂𝒚𝒂𝒋𝒖𝒍𝒂. 
📚. 𝑷𝒓𝒂𝒔𝒂𝒅 𝑩𝒉𝒂𝒓𝒂𝒅𝒘𝒂𝒋

𝑪𝒉𝒂𝒑𝒕𝒆𝒓 04 : 
*🌻 𝑺𝒉𝒊𝒗𝒂 𝑷𝒓𝒂𝒂𝒅𝒖𝒓𝒃𝒉𝒂𝒂𝒗𝒂𝒎 - 3 🌻*

𝑾𝒉𝒂𝒕𝒆𝒗𝒆𝒓 𝒎𝒊𝒔𝒔𝒊𝒍𝒆𝒔 𝑺𝒓𝒊 𝑹𝒂𝒎𝒂 𝒑𝒓𝒐𝒋𝒆𝒄𝒕𝒆𝒅 𝒊𝒏 𝒕𝒉𝒂𝒕 𝒃𝒓𝒊𝒍𝒍𝒊𝒂𝒏𝒕 𝒍𝒊𝒈𝒉𝒕, 𝒂𝒍𝒍 𝒕𝒉𝒐𝒔𝒆 𝒎𝒊𝒔𝒔𝒊𝒍𝒆𝒔 𝒗𝒂𝒏𝒊𝒔𝒉𝒆𝒅 𝒊𝒏𝒕𝒐 𝒕𝒉𝒂𝒕 𝒃𝒓𝒊𝒍𝒍𝒊𝒂𝒏𝒄𝒆 𝒂𝒔 𝒍𝒊𝒌𝒆 𝒂𝒔 𝒊𝒄𝒆 𝒄𝒖𝒃𝒆𝒔 𝒎𝒆𝒍𝒕 𝒊𝒏 𝒐𝒄𝒆𝒂𝒏𝒔. 

𝑰𝒏 𝒂𝒏𝒐𝒕𝒉𝒆𝒓 𝒇𝒆𝒘 𝒔𝒆𝒄𝒐𝒏𝒅𝒔 𝑹𝒂𝒎𝒂'𝒔 𝒃𝒐𝒘 𝒇𝒆𝒍𝒍 𝒅𝒐𝒘𝒏 𝒐𝒏 𝒊𝒕𝒔 𝒐𝒘𝒏 𝒂𝒏𝒅 𝒈𝒐𝒕 𝒓𝒆𝒅𝒖𝒄𝒆𝒅 𝒕𝒐 𝒂𝒔𝒉𝒆𝒔. 𝑨𝒍𝒔𝒐, 𝒉𝒊𝒔 𝒉𝒂𝒏𝒅 𝒔𝒉𝒊𝒆𝒍𝒅 𝒂𝒏𝒅 𝒐𝒕𝒉𝒆𝒓 𝒂𝒄𝒄𝒆𝒔𝒔𝒐𝒓𝒊𝒆𝒔 𝒕𝒐𝒐 𝒇𝒆𝒍𝒍 𝒅𝒐𝒘𝒏 𝒂𝒏𝒅 𝒈𝒐𝒕 𝒊𝒏𝒄𝒊𝒏𝒆𝒓𝒂𝒕𝒆𝒅.

𝑺𝒆𝒆𝒊𝒏𝒈 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆𝒔𝒆 𝒅𝒊𝒔𝒂𝒔𝒕𝒆𝒓𝒔 𝒉𝒂𝒑𝒑𝒆𝒏𝒊𝒏𝒈 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝑹𝒂𝒎𝒂, 𝑳𝒂𝒌𝒔𝒉𝒎𝒂𝒏𝒂 𝒕𝒓𝒆𝒎𝒃𝒍𝒆𝒅 𝒂𝒏𝒅 𝒇𝒆𝒍𝒍 𝒅𝒐𝒘𝒏 𝒖𝒏𝒄𝒐𝒏𝒄𝒊𝒐𝒖𝒔. 

𝑨𝒇𝒕𝒆𝒓 𝒕𝒉𝒂𝒕 𝑹𝒂𝒎𝒂 𝒊𝒏 𝒂 𝒄𝒐𝒏𝒇𝒖𝒔𝒆𝒅 𝒔𝒕𝒂𝒕𝒆 𝒖𝒏𝒂𝒃𝒍𝒆 𝒕𝒐 𝒕𝒉𝒊𝒏𝒌 𝒐𝒇 𝒂𝒏𝒚𝒕𝒉𝒊𝒏𝒈, 𝒌𝒏𝒆𝒍𝒕 𝒅𝒐𝒘𝒏 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒈𝒓𝒐𝒖𝒏𝒅 𝒘𝒊𝒕𝒉 𝒕𝒓𝒆𝒑𝒊𝒅𝒂𝒕𝒊𝒐𝒏, 𝒄𝒍𝒐𝒔𝒆𝒅 𝒉𝒊𝒔 𝒆𝒚𝒆𝒔 𝒂𝒏𝒅 𝒕𝒉𝒐𝒖𝒈𝒉𝒕 𝒕𝒉𝒂𝒕 𝒐𝒏𝒍𝒚 𝒕𝒉𝒆 𝒍𝒐𝒓𝒅 𝒐𝒇 𝑼𝒎𝒂 𝒘𝒐𝒖𝒍𝒅 𝒃𝒆 𝒄𝒂𝒑𝒂𝒃𝒍𝒆 𝒐𝒇 𝒑𝒓𝒐𝒕𝒆𝒄𝒕𝒊𝒏𝒈 𝒉𝒊𝒎. 

𝑾𝒊𝒕𝒉 𝒂𝒏 𝒖𝒑𝒓𝒊𝒔𝒆𝒅 𝒗𝒐𝒊𝒄𝒆 𝒉𝒆 𝒄𝒉𝒂𝒏𝒕𝒆𝒅 𝒕𝒉𝒆 𝒕𝒉𝒐𝒖𝒔𝒂𝒏𝒅 𝒏𝒂𝒎𝒆𝒔 𝒐𝒇 𝑺𝒉𝒊𝒗𝒂 𝒃𝒚 𝒐𝒇𝒇𝒆𝒓𝒊𝒏𝒈 𝒑𝒓𝒐𝒔𝒕𝒓𝒂𝒕𝒊𝒐𝒏𝒔 𝒊𝒏𝒕𝒆𝒓𝒎𝒊𝒕𝒕𝒆𝒏𝒕𝒍𝒚. 𝑰𝒏 𝒂 𝒘𝒉𝒊𝒍𝒆 𝑹𝒂𝒎𝒂 𝒉𝒆𝒂𝒓𝒅 𝒕𝒉𝒆 𝒔𝒂𝒎𝒆 𝒇𝒆𝒂𝒓𝒔𝒐𝒎𝒆 𝒔𝒐𝒖𝒏𝒅 𝒆𝒄𝒉𝒐𝒊𝒏𝒈 𝒊𝒏 𝒂𝒍𝒍 𝒅𝒊𝒓𝒆𝒄𝒕𝒊𝒐𝒏𝒔. 

𝑬𝒂𝒓𝒕𝒉 𝒂𝒏𝒅 𝒉𝒊𝒍𝒍𝒔 𝒂𝒍𝒔𝒐 𝒕𝒓𝒆𝒎𝒃𝒍𝒆𝒅 𝒅𝒖𝒆 𝒕𝒐 𝒕𝒉𝒂𝒕 𝒕𝒆𝒓𝒓𝒊𝒃𝒍𝒆 𝒏𝒐𝒊𝒔𝒆. 𝑻𝒉𝒆𝒏 𝒘𝒊𝒕𝒉𝒊𝒏 𝒂 𝒔𝒑𝒍𝒊𝒕 𝒔𝒆𝒄𝒐𝒏𝒅 𝑹𝒂𝒎𝒂 𝒐𝒃𝒔𝒆𝒓𝒗𝒆𝒅 𝒂 𝒄𝒐𝒐𝒍 𝒎𝒐𝒐𝒏𝒔𝒉𝒊𝒏𝒆 𝒆𝒗𝒆𝒓𝒚𝒘𝒉𝒆𝒓𝒆. 

𝑩𝒆𝒇𝒐𝒓𝒆 𝑹𝒂𝒎𝒂 𝒄𝒐𝒖𝒍𝒅 𝒖𝒏𝒅𝒆𝒓𝒔𝒕𝒂𝒏𝒅 𝒘𝒉𝒂𝒕 𝒊𝒕 𝒘𝒂𝒔, 𝒉𝒆 𝒇𝒐𝒖𝒏𝒅 𝒔𝒐𝒎𝒆𝒐𝒏𝒆 𝒘𝒉𝒐 𝒘𝒂𝒔 𝒂𝒔 𝒘𝒉𝒊𝒕𝒆 𝒂𝒔 𝒕𝒉𝒆 𝒄𝒓𝒆𝒂𝒎 𝒐𝒃𝒕𝒂𝒊𝒏𝒆𝒅 𝒅𝒖𝒓𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒄𝒉𝒖𝒓𝒏𝒊𝒏𝒈 𝒐𝒇 𝒎𝒊𝒍𝒌𝒚 𝒐𝒄𝒆𝒂𝒏, 

𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂 𝒈𝒐𝒍𝒅 𝒐𝒓𝒏𝒂𝒎𝒆𝒏𝒕𝒆𝒅 𝒕𝒂𝒊𝒍, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂 𝒑𝒂𝒊𝒓 𝒐𝒇 𝒉𝒐𝒓𝒏𝒔 𝒅𝒆𝒄𝒌𝒆𝒅 𝒘𝒊𝒕𝒉 𝒅𝒊𝒂𝒎𝒐𝒏𝒅𝒔, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒃𝒍𝒖𝒆 𝒈𝒆𝒎𝒔 𝒌𝒊𝒏𝒅 𝒐𝒇 𝒆𝒚𝒆𝒔, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂𝒏 𝒆𝒍𝒆𝒈𝒂𝒏𝒕 𝒄𝒐𝒗𝒆𝒓 𝒐𝒏 𝒊𝒕𝒔 𝒃𝒂𝒄𝒌, 

𝒘𝒉𝒊𝒄𝒉 𝒉𝒂𝒅 𝒂 𝒈𝒆𝒎 𝒅𝒆𝒄𝒌𝒆𝒅 𝒓𝒐𝒑𝒆 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝒕𝒉𝒆 𝒏𝒆𝒄𝒌, 𝒂𝒏𝒅 𝒘𝒉𝒊𝒄𝒉 𝒘𝒂𝒔 𝒓𝒆𝒏𝒕𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒔𝒌𝒊𝒆𝒔 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝒔𝒘𝒆𝒆𝒕 𝒋𝒊𝒏𝒈𝒍𝒊𝒏𝒈 𝒏𝒐𝒊𝒔𝒆 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒃𝒆𝒍𝒍𝒔 𝒑𝒓𝒆𝒔𝒆𝒏𝒕 𝒐𝒏 𝒉𝒊𝒔 𝒃𝒐𝒅𝒚.

𝑻𝒉𝒂𝒕 𝒘𝒂𝒔 𝒕𝒉𝒆 𝑩𝒖𝒍𝒍 𝑵𝒂𝒏𝒅𝒊 𝒘𝒉𝒐𝒎 𝑹𝒂𝒎𝒂 𝒃𝒆𝒉𝒆𝒍𝒅 𝒊𝒏 𝒇𝒓𝒐𝒏𝒕 𝒐𝒇 𝒉𝒊𝒎.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment