Showing posts with label Phalguna Masam (Falgun/ Phagan). Show all posts
Showing posts with label Phalguna Masam (Falgun/ Phagan). Show all posts

శ్రీ శీతలా దేవి అష్టకం - భావార్థ సహితం / Sri Sheetala Devi Ashtakam - with Meaning (a YT Video)


https://youtu.be/_edkoCrK5G0

🌹 శ్రీ శీతలా దేవి అష్టకం - భావార్థ సహితం
Sri Sheetala Devi Ashtakam -  with Meaning 🌹

🌻 శీతలాష్టమీ ప్రత్యేకం 🌻

🍀 శ్రీ శీతలా దేవి అష్టకం (శీతలాష్టకం) భయంకరమైన అంటువ్యాధులు, జ్వరాలు, చర్మ వ్యాధులు, సర్వ రోగాల నుండి విముక్తి పొందడానికి మహాదేవుడు పార్వతీదేవికి ఉపదేశించిన మహా శక్తివంతమైన స్తోత్రం. శీతలాష్టకం చదవడం, వినడం వల్ల చర్మ వ్యాధులు, అంటువ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధా భక్తులతో వినడం, పఠించడం వల్ల అన్ని ఉపద్రవాలు తొలగి, గొప్ప మంగళం కలుగుతుంది. శీతలా సప్తమి, అష్టమి రోజులలో, ముఖ్యంగా హోలీ పండుగ తర్వాత, ఈ స్తోత్ర పఠనం చాలా విశేషం. 🍀

గానం, స్వరకర్త, ప్రచురణ : ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



ఫాల్గున కృష్ణ అష్టమీ - శీతలాష్టమీ - బసోడా పూజా - శ్రీ శీతలా దేవి అష్టకం / Phalguna Krishna Ashtami - Sheetala Ashtami - Basoda Puja - Sri Sheetala Devi Ashtakam



Facebookhttps://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2090528338400303

🌹 ఫాల్గున కృష్ణ అష్టమీ - శీతలాష్టమీ - బసోడా పూజా శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹 Phalguna Krishna Ashtami - Shitalashtami - Basoda Puja Greetings to everyone 🌹
Prasad Bharadwaj


హోళీ పండుగ తర్వాత వచ్చే సప్తమి, అష్టమి తిధులను శీతలా సప్తమి, శీతలా అష్టమిగా వ్యవహారిస్తారు.

The Saptami and Ashtami days after the Holi festival are celebrated as Shitala Saptami and Shitala Ashtami.


శీతల అష్టమిని 'బసోడా పూజ' అని కూడా పిలుస్తారు. నేడు శీతలా దేవి వ్రతం ఆచరించటం ద్వారా అనేక వ్యాధుల నుండి విముక్తులు అవుతారు అని నమ్ముతారు.

Shitala Ashtami is also known as 'Basoda Puja'. It is believed that by observing the fast of Shitala Devi on this day, one gets free from many diseases.


శీతలా మాతా గాడిదపై ఆశీనురాలై, ఒక చేతితో చీపురు, ఇంకో చేతిలో కుండ పట్టుకొని దర్శనం ఇస్తుంది.

శీతలా అష్టమి వేడుకలు ఉత్తర భారత రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్ మరియు ఉత్తర ప్రదేశ్లలో భక్తులు ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. ఈ సందర్భంగా భారీ ఉత్సవం నిర్వహించబడుతుంది మరియు అనేక సంగీత కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు.

శీతలా అష్టమి నాడు సాంప్రదాయాల ప్రకారం కుటుంబాలు వంట కోసం అగ్నిని వెలిగించరు అందువల్ల వారు ఒక రోజు ముందుగానే ఆహారాన్ని తయారుచేస్తారు. ముందు రోజు వండిన ఆహారాన్ని మాత్రమే శీతలా దేవికి నివేదించే ప్రత్యేకమైన ఆచారం ఉంది.

భక్తులు ఉదయాన్నే లేచి, సూర్యోదయానికి ముందు స్నానం చేస్తారు. వారు శీతలా దేవి ఆలయాన్ని సందర్శించి, దేవతను 'హల్ది', 'బజ్రా' తో పూజిస్తారు. అనంతరం వారు 'బసోద వ్రత కథ' వింటారు. 'రాబ్రీ', 'పెరుగు' మరియు ఇతర ముఖ్యమైన నైవేద్యాలను శీతలా దేవికి సమర్పిస్తారు. వారి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. సిద్ధం చేసిన ఆహారాన్ని శీతలా దేవీ కి నివేదిస్తారు. దీనిని వారు 'బసోడా' అని పిలుస్తారు. అర్పించిన ఆహారాన్ని స్వీకరిస్తారు మరియు ఇతర భక్తులకు కూడా పంచుతారు. ఈ రోజున 'శీతలాష్టకం' చదవడం కూడా అనుకూలంగా భావిస్తారు.


💧 శ్రీ శీతలా దేవి అష్టకం 💧
💧 Sri Shitala Devi Ashtakam 💧

అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః

అనుష్టుప్ ఛన్దః శీతలా దేవలా దేవతా

లక్ష్మీర్బీజం – భవానీశక్తిః

సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః




ఈశ్వర ఉవాచ

వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్|

మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్||

వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్|

యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్||

శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః|

విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి||

యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః|

విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే||

శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ|

ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్||

శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్|

విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ||

గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్|

త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్||

నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే|

త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్||

మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్|

యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే||

అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా|

విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే||

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః|

ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్||

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా|

శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః||

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః|

శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః||

ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్|

తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే||

శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్|

దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై||

ఇతి శ్రీస్కన్దపురాణే శీతలాష్టకం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹

అమలకీ - రంగ్ భరి ఏకాదశి - ఫాల్గుణ ఏకాదశి శుభాకాంక్షలు Greetings on Amalaki, Rang Bhari Ekadashi, Phalguna Ekadashi


Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2081043466015457


🌹 అమలకీ - రంగ్ భరి ఏకాదశి - ఫాల్గుణ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹
🌿 🔱 ఉసిరి చెట్టులో కొలువైన హరిహరుల అనుగ్రహం - విశిష్టత - వ్రత కథ 🔱🌿
✍️ ప్రసాద్‌ భరధ్వాజ

🌹 Amalaki - Rang Bhari Ekadashi - Happy Phalguna Ekadashi to everyone 🌹
🌿 🔱 The blessing of Hariharu, who grew in the amla tree - Speciality - Story of the fast 🔱🌿
✍️ Prasad Bharadwaj



సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అయితే, ఫాల్గుణ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. దీనినే 'అమలకీ ఏకాదశి' లేదా 'రంగ్ భరి ఏకాదశి' అని పిలుస్తారు. ప్రకృతిని, పరమాత్మను అనుసంధానించే అద్భుతమైన పర్వదినం ఇది. భక్తి, వైరాగ్యం, మోక్షాలకు ప్రతీకగా అమలకి ఏకాదశిని చెబుతారు.

✨ ఏకాదశి విశిష్టత: ఉసిరి ఎందుకు పవిత్రం?

'అమలకి' అంటే సంస్కృతంలో ఉసిరి అని అర్థం. పురాణాల ప్రకారం, సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుని కన్నీటి చుక్కల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని చెబుతారు. ఈ చెట్టులో శ్రీమహావిష్ణువు సకల దేవతలతో కలిసి కొలువై ఉంటాడు. అందుకే ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల కోటి పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇది కేవలం విష్ణువుకే కాదు, శివపార్వతులకు కూడా అత్యంత ప్రియమైన రోజు.

📅 ముహూర్తం మరియు శుభ యోగాలు

ఈ ఏడాది ఫిబ్రవరి 27, శుక్రవారం నాడు అమాలకీ ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఆకాశంలో అరుదైన గ్రహస్థితులు, నాలుగు శుభ యోగాలు కలవడం విశేషం.

1. సర్వార్థ సిద్ధి యోగం
2. రవి యోగం
3. ఆయుష్మాన్ యోగం
4. సౌభాగ్య యోగం

ఈ పవిత్ర యోగాల సమయంలో చేసే దానధర్మాలు, జపతపాలు వెయ్యి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి.

తిథి ప్రారంభం: ఫిబ్రవరి 27, తెల్లవారుజామున 12:33 గంటలకు.
తిథి ముగింపు: ఫిబ్రవరి 27, రాత్రి 10:32 గంటలకు.
పారణ (వ్రత విరమణ): ఫిబ్రవరి 28, ఉదయం 6:47 నుండి 9:06 గంటల లోపు.

🌸 రంగ్ భరి ఏకాదశి: శివపార్వతుల వైభవం

కాశీ క్షేత్రంలో ఈ రోజును 'రంగ్ భరి ఏకాదశి' గా జరుపుకుంటారు. పార్వతీ దేవిని వివాహం చేసుకున్న తర్వాత, పరమశివుడు ఆమెను మొదటిసారి కాశీకి తీసుకువచ్చిన రోజు ఇదేనని పురాణ గాథ. అందుకే ఈ రోజున భక్తులు శివపార్వతులకు రంగుల పొడి (గులాల్) సమర్పించి సంబరాలు చేసుకుంటారు. వైకుంఠవాసుడిని, కైలాసవాసుడిని ఏకకాలంలో స్మరించుకునే అరుదైన సందర్భం ఇది.

📝 పూజా విధానం - మీరు అనుసరించాల్సిన నియమాలు

ఈ రోజున భక్తులు పాటించాల్సిన విధివిధానాలు ఇలా ఉన్నాయి:

ఉసిరి పూజ : ఉదయాన్నే స్నానం చేసి, సంకల్పం చెప్పుకుని ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేయాలి. చెట్టుకు నీరు సమర్పించి, ఏడు ప్రదక్షిణలు చేయడం శుభకరం.

మంత్ర జపం: "ఓం నమో భగవతే వాసుదేవాయ" లేదా "విష్ణు సహస్రనామ పారాయణం" చేయడం వల్ల మనస్సు ప్రశాంతత పొందుతుంది.

నైవేద్యం: ఉసిరితో చేసిన పదార్థాలు, పండ్లు, సగ్గుబియ్యం పాయసం వంటి సాత్విక ఆహారాన్ని భగవంతుడికి నివేదించాలి.

అమలకీ ఏకాదశి మనకు ఇచ్చే సందేశం ఒక్కటే - ప్రకృతిని గౌరవించడం ద్వారానే పరమాత్మను చేరుకోగలం. ఈ పవిత్ర దినాన ఉసిరి మొక్కను నాటడం లేదా దానం చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని పెద్దల మాట. - ప్రసాద్‌ భరధ్వాజ

📖 అమలకీ ఏకాదశి వ్రత కథ

పూర్వం చైత్రరథుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ విష్ణు భక్తుడు. అతని రాజ్యంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ధర్మబద్ధంగా జీవించేవారు. ఆ రాజ్యంలో ఎవరూ పేదవారు లేరు, అందరూ ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించేవారు.

ఒకసారి ఫాల్గుణ మాసంలో అమలకీ ఏకాదశి వచ్చింది. రాజు తన ప్రజలందరితో కలిసి నది తీరంలో ఉన్న ఒక ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తిని, ఉసిరి చెట్టును షోడశోపచారాలతో పూజించి, రాత్రంతా జాగరణ చేస్తూ హరినామ స్మరణ చేయసాగారు.

🏹 వేటగాడికి కలిగిన మోక్షం

అదే సమయంలో ఒక ఆకలితో ఉన్న వేటగాడు అక్కడికి వచ్చాడు. వాడు అనేక పాపాలు చేసినవాడు, క్రూరుడు. ఆహారం కోసం వెతుకుతూ వచ్చిన ఆ వేటగాడు, రాజు మరియు ప్రజలు చేస్తున్న పూజను చూసి ఆశ్చర్యపోయాడు. ఆకలిగా ఉన్నప్పటికీ, అక్కడ జరుగుతున్న భజనలు, పురాణ పఠనం వింటూ అక్కడే ఉండిపోయాడు. తెలియకుండానే ఆ రాత్రంతా వాడు కూడా జాగరణ చేశాడు.

కొన్నాళ్లకు ఆ వేటగాడు మరణించి, తన పుణ్యఫలం వల్ల తర్వాతి జన్మలో ఒక గొప్ప రాజుగా (వసురథుడు) జన్మించాడు. ఒకరోజు అతను అడవిలో దారి తప్పి స్పృహ కోల్పోయాడు. అప్పుడు కొందరు శత్రువులు అతడిని చంపడానికి ప్రయత్నించగా, అతని శరీరం నుండి ఒక దివ్య శక్తి (దేవత) ఉద్భవించి శత్రువులందరినీ సంహరించింది.

అతను మేల్కొన్న తర్వాత, "నన్ను రక్షించిన ఆ శక్తి ఎవరు?" అని ఆలోచిస్తుండగా, ఆకాశవాణి ఇలా పలికింది: "ఓ రాజా! గత జన్మలో నీవు తెలియకుండానే చేసిన 'అమలకీ ఏకాదశి' వ్రత పుణ్యమే నిన్ను నేడు రక్షించింది." అప్పటి నుండి ఆ రాజు మరింత భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించి, చివరకు మోక్షాన్ని పొందాడు.

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

ఫాల్గుణ మాసం ప్రాముఖ్యత / Importance of Phalguna month


🌹 ఫాల్గుణ మాసం ప్రాముఖ్యత 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Importance of Phalguna month 🌹
Prasad Bharadwaja



సూర్యతేజస్సుతో ప్రభావితమైన ప్రకృతిలో కాలాలు,ఋతువులు, మాసాలు,తిథులు, అహోరాత్రములు మొదలగునవి ఏర్పడుతున్నాయి, ప్రకృతిలో ఆకురాలే కాలం, నిర్మలాకాశంలో చక్కటి శీతల పవనాలు,ఆహ్లాద వాతావరణం ఆరోగ్యపు సిరులు చిగురులు తొడిగే కాలం,వసంతం అంకురించే కాలము పచ్చదనము పరిమళించే కాలం ఆద్యంతమూ ఆనందభరితమైన,లౌకిక ఆధ్యాత్మిక సమ్మళితమైన అనుభూతులను పంచే కాలం అదే ఫాల్గుణ మాస శుభతరుణం

---------------------------------------

షడృతువులలో అఖరిదైన శిశిర ఋతువులలో రెండవది,మాసాలలో చివరిది ఫాల్గుణం,ఈ మాసంలో రవి సాధారణంగా మీనరాశిలో ప్రవేశిస్తాడు,ఈ రాశిలో ఉన్న సూర్యరశ్ముల ఫలితంగా మానవుల మనస్సు సంకల్ప వికల్పాలపై పరిగెడుతుంది, కామోద్రేకం వలన మానసికానందం తగ్గి మానవుడు ఆవేశానికి లోనవుతాడు,ఆ సమయంలో మనో నిగ్రహం కావలి,దానిని అభ్యాస వైరాగ్యాలతో సాధించుటకు అనువైన మాసం ఫాల్గుణము, వినీలాకాశంలో శ్వేతవర్ణంతో దండాకారంగా ప్రకాశిస్తున్న రెండు నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణీ నక్షత్రం, అందు ప్రధమం పూర్వ పల్గుణీ (పుబ్బ) ద్వితీయం ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) పాండవ మధ్యముడు అర్జునుడు ఈ నక్షత్రం నాడు జన్మించుట వలన ఫల్గుణుడయ్యాడు, పూర్ణిమ నాడు ఫల్గుణీ నక్షత్రం ఉన్న చాంద్రమాసంను ఫల్గుణ మాసమని పిలుస్తారు,ఈ మాసవ శిశిర ఋతువుకు వీడ్కొలు చెప్తూ వసంతాగమనానికి ఆహ్వానం పలుకుటకు స్వాగత ద్వారం వంటిది, ఫల+గుణ = ఫాల్గుణంలో చేసిన దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి, కావుననే ఫాల్గుణం విశిష్టమైనది,దివ్య ప్రభావం కలిగినది,అందుకే ప్రాముఖ్యత పొందింది.

-------------------------------------

విష్ణు సహస్రనామాలలో శిశిరఃశర్వరీ కరః నారాయణునకు ఒక నామం కలదు, నారాయణుడు ఈ సమాసంలో గోవిందనామంతో నియామకుడు,ఈ కారణంచే ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని చెబుతారు,ఫల్గుణీ నక్షత్రం దేవతా గణం,పూర్వ ఫల్గుణీ నక్షత్రానికి సూర్యడు"ఆర్యముడు" అనే పేరుతో దేవతగా ఉంటాడు,ఈయన అధిక తేజస్సు కలవాడు కావున దేవతలందరూ అనుసరించి ఉంటారు ఫాల్గుణ మాసంలో ఎన్నో వ్రతాలాచరించాలని శాస్త్ర వచనం.

---------------------------------------

ఫాల్గుణం ఆహ్లాద వాతావరణంలో బ్రహ్మీ ముహూర్త వేళలో క్రియాశీలమైన సంధ్యాకాలం దేవతార్చనలకు పవిత్రమైన మాసం, ఫాల్గుణం ఆధ్యాత్మికమయం, తపోమయం, ఆరోగ్యమయం, విజ్ఞానమయం,ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు చేసే వ్రతం ప్రయోవ్రతమంటారు,ఈ పన్నెండు దినాలు నదీస్నానమాచరించాలి, పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు, ఫాల్గుణ శుద్ధ చవితిని "తిల"చతుర్థి అంటారు, దీనినే పుత్రగణపతి వ్రతమని,శాంత చతుర్థీ వ్రతమని అంటారు,ఈ రోజున ఉపవాసం చేసి తిలాన్నంతో గణపతి హోమం చేసి అతిథులు భుజించిన తరువాత హోమం చేసినవారు తినాలి,దీని వలన సర్వవిఘ్నాలు తొలగిపోతాయి,ఈరోజున పుత్రగణపతి వ్రతమాచరించిన వారికి సత్సంతానం కలుగుతుంది.

---------------------------------------

శుద్ధ పంచమినాడు అనంత పంచమి వ్రతం చేయాలి,ఈనాడు గణేశుని అర్చించి నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తినాలి,సప్తమి నాడు అర్కసంపుట సప్తమి ఆచరించాలి,ఉషోదయ కాల స్నానానంతరం సూర్యునకు అర్ఘ్యమివ్వాలి, సూర్యనమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్, కావున ఆరోగ్యం కొరకు సూర్యుని ప్రార్థించాలి.

---------------------------------------

ఈ మాసంలో లక్ష్మీదేవిని, సీతామాతను షోడశోపచారాలతో పూజించాలి, ప్రదోషకాలంలో దీపారాధన చేసిన వారికి సౌభాగ్యం, సంపద చేకూరుతుంది, లలితా కాంతి దేవి వ్రతమాచరించాలి,నవమి నాడు ఆనంద నవమి అని శ్రీలక్ష్మీ నారాయణులను తులసి దళాలతో మందార పుష్పాలతో అర్చించాలి, మీన సంక్రమణం మతత్రయ ఏకాదశి, అమలకీ ఏకాదశి,ధాత్రి ఏకాదశి,అమృత ఏకాదశి అని పిలుస్తారు,ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను పూజించి ఉపవాసం, జాగరణం చెయ్యాలి, ఉసిరిక చెట్టు క్రింద శ్రీలక్ష్మీ నారాయణులను పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి, ఈ రోజున చేసిన వ్రతాల వలన వేలకొలది గోదానాలు చేసిన ఫలితా కలుగుతుంది,శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి, దీన్ని నృసింహ ద్వాదశి అంటారు, శ్రీనృసింహస్వామిని అర్చిస్తే సర్వ విఘ్నాలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది, ఈ రోజున చేసే గంగానది స్నానం అత్యంత మహిమాన్విత ఫలితాన్నిస్తుంది,శుద్ధ త్రయోదశి రోజున గ్రామక్షేమం కొరకు మన్మధ విగ్రహ దహనం చేస్తారు, శుద్ధ చతుర్దశి నాడు శ్రీమహేశ్వర వ్రతమాచరించాలి,ఈ నెలలో హోళి పండుగ నిర్వహిస్తారు,పూర్ణిమను హోళికా పూర్ణిమ అని, మదన పూర్ణిమ అని,హోళి అని,'హోల'అని, కామదహనమని వ్యవహరిస్తారు,ఈ రోజు ఉదయాన్నే ఎండిన పిడకలు రాశిగా పోసి అగ్నిని రగిల్చి దానిలో రాక్షస పీడ పోయేందుకు హోళికా అనే ఒక విధమైన శక్తిని ఆవహింపజేసి "శ్రీహోళికాయైనమః"అని పూజించి మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ "వందితాసి సురేంద్రణే బ్రహ్మణా శంకరేణ ఛ అతస్త్వాం పాహినోదేవి భూతే భూతి ప్రధోభవ"అని చదవాలి.




---------------------------------------

హోళి పసుపుకు,పసుపు పరిమళానికి ప్రతీక,నీటిలో కలిపిన ద్రవాన్ని" వసంతం"అని అంటారు.

---------------------------------------

వసంతాలాడుకోవడం వసంతమాసానికి స్వాగతం చెప్పడమే, పూర్ణిమ సాయంత్రం నృత్యగీత వాద్యాలతో బాలకృష్ణుని లేదా రాధాకృష్ణులను ఊయలలో ఉంచి ఆరాధించి డోలాత్సవం జరపాలి,ఇలా చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దల నమ్మకం.

-------------------------------------

ఈ పూర్ణిమనాడు మధురైలో శ్రీమీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం, తమిళనాట శివపార్వతుల కళ్యాణం జరుపుతారు,ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి గోమయంతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకొని తూర్పు ముఖంగా కూర్చొని ఒక ముత్తెదువచే వందన తిలకం,నీరాజనం పొంది కొత్త చందనంతో కూడిన మామిడి పూవును భక్షించడం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం.

---------------------------------------

బహుళ ఏకాదశిని విజయైకాదశి,పాప విమోచన ఏకాదశి అని అంటారు,ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను అర్చించి ఉపవాసముండి నియమ బద్ధంగా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభఫలితాలు కలుగుతాయి,బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి కావున ఆయన కీర్తనలు పాడి స్మరించుకోవాలి.

--------------------------------------

బహుళ అమావాస్య కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కనుక దీనిని కొత్త అమవాస్య అంటారు,ఈరోజు దేవ, పితృ ఆరాధనలు చేయడం శ్రేష్ఠం,పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి, అన్నదానం చెయ్యాలి, పాండవులు ఈ మాసంలోనే జన్మించారు, ఈ మాసంలో క్షీరసాగరమథనం జరిగింది అయ్యప్పస్వామి అవతరణ,ఈ మాసంలోనే జరిగింది,ఈమాసంలో చేసే ప్రతి దానం గోవిందునికి ప్రీతి కలిగిస్తుంది,ఈ మాసం నారాయణునికి ప్రీతికరం,భక్తులందరికీ పావనం,ముక్తిదాయకం అందుకే ఫాల్గుణం ప్రాముఖ్యం.

🌹🌹🌹🌹🌹

ఫాల్గుణ మాసం 2026 విశిష్టత - పండుగలు Phalguna Month 2026 - Festivals - Holidays


🌹 ఫాల్గుణ మాసం 2026 విశిష్టత - పండుగలు - పర్వదినాలు 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Phalguna Month 2026 Speciality - Festivals - Holidays 🌹
Prasad Bharadwaja


తెలుగు పంచాంగం ప్రకారం చూస్తే.. తెలుగు మాసాల్లో ఫాల్గుణ మాసం చివరిది అంటే 12వ మాసం. ఈ మాసం తర్వాత వచ్చే చైత్ర మాసంతో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. మాఘమాసం ముగిసిన వెంటనే వచ్చే ఈ ఫాల్గుణ మాసం వేసవికి ఆరంభంగా పేర్కొంటారు. ఈ ఫాల్గుణ మాసం శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసంగా. ఈ ఫాల్గుణ మాసంలో పయో వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించి శ్రీమహావిష్ణువుకు క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవత పురాణంలో పేర్కొనబడింది. పూర్వం ఆదితి ఈ పయో వ్రతాన్ని ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది ఫాల్గుణ మాసం 2026 ప్రారంభం తేదీ మరియు ముగింపు తేదీలు తెలుసుకుందాం..

ఫిబ్రవరి 18 ఫాల్గుణ శుద్ధ పాడ్యమి: ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం (శ్రీమహావిష్ణువుకి ఇష్టమైన పయో వ్రతం) ప్రారంభం.


ఫిబ్రవరి 19 ఫాల్గుణ శుద్ధ విదియ:

చంద్ర దర్శనం

ఫిబ్రవరి 21 ఫాల్గుణ శుద్ధ చవితి: దుండి గణపతి పూజ

ఫిబ్రవరి 27 ఫాల్గుణ శుద్ధ ఏకాదశి: అమలక ఏకాదశి

ఫిబ్రవరి 28 ఫాల్గుణ శుద్ధ ద్వాదశి: నృసింహ ద్వాదశి

మార్చి 2 ఫాల్గుణ శుద్ధ చతుర్దశి/ పౌర్ణమి: హోళికా పౌర్ణమి,

మార్చి 3 ఫాల్గుణ పౌర్ణమి : హోలీ

మార్చి 4 ఫాల్గుణ బహుళ పాడ్యమి: వసంతోత్సవం

మార్చి 7 ఫాల్గుణ బహుళ చవితి: సంకష్టహర చతుర్థి

మార్చి 14 ఫాల్గుణ బహుళ ఏకాదశి: పాపవిమోచన ఏకాదశి, మీన సంక్రమణం

మార్చి 15 ఫాల్గుణ బహుళ ద్వాదశి: అన్నమాచార్య వర్ధంతి

మార్చి 17 ఫాల్గుణ బహుళ చతుర్దశి: మాస శివరాత్రి, తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మార్చి 18 ఫాల్గుణ బహుళ అమావాస్య: ఫాల్గుణ మాసం ముగుస్తుంది.

🌹 🌹 🌹 🌹 🌹