Showing posts with label Worship with Deepam దీపారాధన दीपाराधना. Show all posts
Showing posts with label Worship with Deepam దీపారాధన दीपाराधना. Show all posts

కార్తీక పౌర్ణమి : అప్పుల బాధలు తీర్చే ఉసిరి దీపం.. Karthika Pournami: The Basil lamp that alleviates debts..



🌹🪔 కార్తీక పౌర్ణమి : అప్పుల బాధలు తీర్చే ఉసిరి దీపం.. పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేయండి.. 🪔🌹
ప్రసాద్ భరద్వాజ


🌹🪔 Karthika Pournami: The Basil lamp that alleviates debts.. On Pournami day, just do this one thing.. 🪔🌹
Prasad Bharadwaj


కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం, దీపం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ దీపారాధన ధనం, ఆరోగ్యం ఇస్తుంది.

ఈ దీపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ధన స్థిరత్వం ఉంటుంది. దీర్ఘకాలంగా వెంటాడుతున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఉసిరి దీపం ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే, జాతకంలోని గ్రహ దోషాలు, పితృ దోషాలు తొలగిపోతాయి. సకల పాపాలు హరిస్తాయి.


🪔 ఉసిరి దీపం విధానం 🪔

పౌర్ణమి రోజు సాయంకాలం ఈ దీపాన్ని వెలిగించాలి.

ఉసిరి సిద్ధం: పూజకు రెండు తాజా ఉసిరికాయలు తీసుకోండి. వాటిని శుభ్రంగా కడగాలి. వాటిని మధ్యలో కోసి, లోపలి గుజ్జును తీసేసి, గిన్నెలా తయారుచేయాలి.

దీపారాధన: ఈ ఉసిరి గిన్నెల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. కొత్త దూది వత్తిని ఆ నూనెలో ముంచి, ఉసిరి గిన్నెల్లో వేసి దీపం వెలిగించండి.

స్థానం: ఈ దీపాన్ని పూజా మందిరం ముందు లేదా తులసికోట దగ్గర పెట్టి పూజ చేయాలి. తులసికోట ముందు దీపం పెడితే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి.

దీపం ఆరిపోయే వరకు దానిని కదపకుండా చూడండి. పూజ తర్వాత నైవేద్యం సమర్పించి, హారతి ఇవ్వండి.


🌻 చేయకూడని పొరపాట్లు 🌻

ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు.

పగిలిన ఉసిరి: పొరపాటున కూడా పగిలిన, దెబ్బతిన్న లేదా పురుగులు పట్టిన ఉసిరికాయలు వాడకూడదు. తాజా ఉసిరిని మాత్రమే ఉపయోగించాలి. పువ్వొత్తిని నిలబెట్టేందుకు ఉసిరికాయను పైన కట్ చేయడం వంటివి చేయడం అపరాధం అని గుర్తించగలరు.

దీపాన్ని కదపడం: దీపం వెలిగించాక, అది పూర్తిగా ఆరిపోయే వరకు దానిని ఎట్టి పరిస్థితుల్లో కదపవద్దు. మధ్యలో ఆర్పకూడదు.

విసర్జన: దీపం పెట్టిన తర్వాత ఉసిరిని చెత్తబుట్టలో వేయకూడదు. మరుసటి రోజు ఉదయమే దానిని తీసుకుని, శుభ్రమైన నదిలో, పారే నీటిలో లేదా మట్టిలో విసర్జించండి.

🌹🌹🌹🌹🌹

కార్తీక మాసంలో ధన దీపం వెలిగించాల్సిందే Light Dhana Deepam in the month of Kartika



🌹 ధన దీపం Dhana Deepam : ఖర్చులు తగ్గి సంపద పెరగాలంటే.. కార్తీక మాసంలో ధన దీపం వెలిగించాల్సిందే..! ధన దీపం వెలిగించే విధానం.. 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Dhana Deepam: To reduce expenses and increase wealth.. you should light the Dhana Deepam in the month of Karthika..! How to light the Dhana Deepam.. 🌹

Prasad Bharadwaja



కార్తీక మాసంలో అఖండ ధన లాభం కలగటానికి, అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, ఖర్చులు తగ్గటానికి ధన దీపాన్ని లేదా లక్ష్మి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో తెలుసుకుందాం.

ఐశ్వర్యం కలగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, అప్పులు తీరిపోవాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, మొండి బాకీలు తొందరగా వసూలు కావాలన్నా కార్తీక మాసంలో తప్పకుండా ప్రతీ ఇంట్లో ధన దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో వచ్చే ఏ రోజైనా ధన దీపాన్ని వెలిగించుకోవచ్చు. లేదా ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే గురువారం లేదా శుక్రవారం రోజున ఈ ధన దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ ధనదీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం..

మీ ఇంట్లో పూజ గదిలో గజలక్ష్మి దేవి ఫోటో లేదా ధన లక్ష్మి దేవి ఫోటోకు దండం బొట్లు పెట్టి పీట ఏర్పాటు చేసుకోవాలి. పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, పీట మీద బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులు అష్టదళ పద్మం ముగ్గు. 8 దళాలున్న పద్మం ముగ్గు అంటే లక్ష్మీ దేవికి ఇష్టం. స్వస్తిక్ గుర్తు ముగ్గు కూడా లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి ఆ పీఠం మీద అష్ట దళ పద్మం ముగ్గు లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయండి.

అలా ముగ్గులు వేశాక పీట మీద ఒక రాగి లేదా ఇత్తడి పళ్లెం ఏర్పాటు చేయాలి. అందులో 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత రాగి లేదా ఇత్తడి పళ్లెంలో బియ్యాన్ని కుప్పలాగా పోయాలి. అందులో చిటికెడు పసుపు, కుంకుమ వేయాలి. ఒక గులాబీ పువ్వు కూడా పెట్టాలి. కొన్ని రూపాయి నాణెలు కనీసం 11 నాణెలు ఆ బియ్యంలో ఉంచాలి.

రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి. వాటికి కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి. రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉన్న బియ్యంలో మొదటి ప్రమిదను ఉంచాలి. అందులో మూడు యాలకులు, మూడు లవంగాలు, ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు పోయాలి. అలా పోసిన తర్వాత మొదటి ప్రమిదలో రెండవ చిన్న ప్రమిదను ఉంచాలి. ఆ రెండవ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి రెండూ లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ ఆగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే ధన దీపం లేదా లక్ష్మీ దీపం అని పిలుస్తారు.

🌹🌹🌹🌹🌹

దీపారాధన - दीपाराधना - Worship with Lamp

దీపారాధన


1 )ఒక_వత్తి : సామాన్య శుభం

2 )రెండు_వత్తులు : కుటుంబ సౌఖ్యం

3 )మూడు_వత్తులు : పుత్ర సుఖం

4 )ఐదు_వత్తులు : ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం , అభివృద్ధి.. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము..




1 )నెయ్యి : నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును .

2 )నువ్వుల_నూనె : నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును .

3 )ఆముదం : ఆముదముతో దీపారాధన చేసిన దేదీప్య మానమగు జీవితం , బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధి యగును..

4 )వేరుశెనగ_నూనె : వేరుశెనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య ఋణములు, దుఖం, చోర భయం, పీడలు మొదలగునవి జరుగును .

5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , ఇప్ప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన వారికి దేవీ అనుగ్రహం కలుగును .

6 ) వేప నూనె, నెయ్యి , ఇప్ప నూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం.., ఇలవేల్పులకు సంతృప్తి కలుగును .

7 ) ప్రతిరోజు దీపారాధన ఉదయం 4 గంటల నుండి 6 గంటలలోపు చేసిన సర్వ శుభములు, శాంతి కలుగును .




దీపాల_యొక్క_దిక్కుల_ఫలితములు


1 )తూర్పు : కష్టములు తొలగును , గ్రహ దోషములు పోవును..

2 )పశ్చిమ : అప్పుల బాధలు , గ్రహ దోషములు , శని దోషములు తొలగును..

3 )దక్షిణం : ఈ దిక్కున దీపము వెలిగించరాదు.. కుటుంబమునకు కష్టము కలుగును.

4 )ఉత్తరం : ధనాభివృద్ధి, కుటుంబము లో శుభ కార్యములు జరుగును .




దీప_వత్తుల_యొక్క_ఫలితములు

1)పత్తి:- పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును .

2)అరటినార :-ఆరటి నారతో దీపము వెలిగించినచో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును .

3)జిల్లేడి_నార:- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత, ప్రేత, పిశాచాల బాధలు ఉండవు.

4)తామర_నార :-పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును.. ధనవoతులు అగుదురు .

5) నూతన_పసుపు_వస్త్రము :- అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు..

6)నూతన_ఎరుపు_వస్త్రము :- పెళ్ళిళ్ళు అగును , గొడ్రాలికి సంతానము కల్గును.

7)నూతన_తెల్ల_వస్త్రము :- పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును..

సాయంత్ర సమయము లందు శ్రీ మహాలక్ష్మి కి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును .