విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు , Happy Vijayadashami – DasaPapa Hara Dasami


https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2284515389001596


🌹. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

----------


🌹 శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రం – భావార్థ సహితం

SRI DURGA'S 32 SACRED NAMES With MEANING 🌹

https://youtu.be/oe7_KQzQf_I

శ్రీ దుర్గాదేవి యొక్క ఈ 32 నామావళిని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో నిత్యం పారాయణం చేసే వారికి భయాలు, ఆపదలు, దుఃఖాలు, విఘ్నాలు తొలగి, మనశ్శాంతి, ఆత్మబలం, ధైర్యం మరియు అమ్మవారి దివ్యరక్షణ లభిస్తాయి. తప్పక వీక్షించండి.
🌹🌹🌹🌹🌹



దసరా రోజు పాలపిట్టను (నీలకంఠ పక్షి) చూడటం ఎందుకు శుభప్రదంగా భావిస్తారు (Sighting a 'Palapitta' bird (Indian Roller/Blue Jay bird) considered auspicious on the day of Dussehra)


🌹 దసరా రోజు పాలపిట్టను (నీలకంఠ పక్షి) చూడటం ఎందుకు శుభప్రదంగా భావిస్తారు..!! పాలపిట్ట ను వీడియో చూడండి.🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

పురాణాల ప్రకారం పాలపిట్ట (నీలకంఠ పక్షి) చాలా శుభకరమైనదిగా భావిస్తారు. ఈ పక్షిని చూసిన తర్వాత శ్రీరాముడు రావణుడిపై జరిపిన యుద్ధంలో విజయం సాధించాడని పురాణాలు చెబుతున్నాయి. రావణుడిని శ్రీరాముడు సంహరించిన తర్వాత, బ్రాహ్మణుడిని చంపిన పాపం అతనిపై మోపబడిందని చెబుతారు. తన పాపాలకు పశ్చాత్తాపం చెందడానికి అతను లక్ష్మణుడితో కలిసి పరమేశ్వరుడిని పూజించాడు. అందుకు శివుడు సంతోషించి నీలకంఠ పక్షి రూపంలో రాముడు, లక్ష్మణునికి దర్శనమిస్తాడు. అందువల్ల దసరా పవిత్ర సందర్భంగా నీలకంఠ పక్షిని చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు.

అరణ్య వాసం ముగించుకుని పాండవులు తిరిగి వెళ్లేటప్పుడు ఆయుధాలు తీసుకుని వెళ్తున్నప్పుడు పాలపిట్ట ఎదురుపడింది. ఆ తర్వాత కౌరవులతో జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. అందుకే పాల పిట్ట ఎదురుపడితే అన్నింటా విజయం చేకూరుతుందనే విశ్వాసం అప్పటి నుంచి ఇప్పటి వరకు సంప్రదాయంగా కొనసాగుతోంది. విజయానికి ప్రతీకగా పాలపిట్టను చూసే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.

🌹🌹🌹🌹🌹

విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు, Happy Vijayadashami – DasaPapa Hara Dasami



🌹. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


------------


🌹 శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రం – భావార్థ సహితం SRI DURGA'S 32 SACRED NAMES With MEANING🌹

https://youtu.be/oe7_KQzQf_I



శ్రీ దుర్గాదేవి యొక్క ఈ 32 నామావళిని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో నిత్యం పారాయణం చేసే వారికి భయాలు, ఆపదలు, దుఃఖాలు, విఘ్నాలు తొలగి, మనశ్శాంతి, ఆత్మబలం, ధైర్యం మరియు అమ్మవారి దివ్యరక్షణ లభిస్తాయి. తప్పక వీక్షించండి.

🌹🌹🌹🌹🌹





నవ దుర్గల ఆరాధన - దశమ దుర్గ – అపరాజితా దేవి – రాజరాజేశ్వరీ దేవి – మహాదుర్గాదేవి (Worship of the Nava Durgas (Nine Durgas) – The Tenth Durga – Aparajita Devi – Rajarajeswari Devi – Maha Durga Devi)


🌹🔱 10. నవ దుర్గల ఆరాధన - దశమ దుర్గ – అపరాజితా దేవి – రాజరాజేశ్వరీ దేవి – మహాదుర్గాదేవి - ప్రార్థనా శ్లోకాలు, విజయదశమి విశిష్టత, దసరా సాధనాపర విశిష్టత, శమీ వృక్ష ప్రార్థన 🔱🌹

🕉. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🕉

✍️ ప్రసాద్ భరద్వాజ


ఆరాధనా దినం: పదవ రోజు – విజయదశమి

సంప్రదాయ రంగు: ఎరుపు

విజయదశమి చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున అపరాజితా దేవిని విజయప్రదాయినిగా ఆరాధించే సంప్రదాయం ఉంది.

అపరాజిత అంటే ఎవరూ జయించలేనిది, పరాజయం ఎరుగనిది అని అర్థం. రాజరాజేశ్వరీ దేవి సమస్త జగత్తుకు అధిష్ఠానశక్తిగా, మహాదుర్గాదేవి ధర్మరక్షకురాలిగా ఆరాధించబడుతుంది. ఈ మూడు నామాలను మీ ప్రాంతీయ ఆరాధనా సంప్రదాయానికి అనుగుణంగా ఒకే అలంకార విభాగంలో స్మరించవచ్చు.


🌼 అపరాజితా దేవి విజయ ప్రార్థనా శ్లోకం

హారేణ తు విచిత్రేణ భాస్వత్కనకమేఖలా ।
అపరాజితా భద్రరతా కరోతు విజయం మమ ॥

భావం: దివ్యమైన ఆభరణాలతో ప్రకాశిస్తూ, శుభాలను ప్రసాదించే అపరాజితా దేవి నాకు విజయాన్ని, కార్యసిద్ధిని, క్షేమాన్ని అనుగ్రహించుగాక.

అలంకారం: రాజరాజేశ్వరీ దేవి – మహాదుర్గాదేవి

విజయదశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరీ స్వరూపంలో కిరీటం, దివ్యాభరణాలు, పుష్పమాలలు, కుంకుమతో అలంకరించి, మహాదుర్గాదేవి విజయప్రదాయిని రూపాన్ని స్మరిస్తారు. ఈ అలంకారం ధర్మవిజయం, శక్తి, పరాక్రమం, ఆధ్యాత్మిక పరిపూర్ణతకు ప్రతీకగా భావించబడుతుంది.


🌼 రాజరాజేశ్వరీ గాయత్రీ మంత్రం

ఓం రాజరాజేశ్వర్యై విద్మహే శ్రీభవాన్యై చ ధీమహి ।
తన్నో దేవీ ప్రచోదయాత్ ॥

భావం: జగన్మాత రాజరాజేశ్వరీదేవిని ధ్యానిస్తూ, ఆమె దివ్యజ్ఞానం మా బుద్ధిని సన్మార్గంలో నడిపించి, ఆత్మవికాసానికి దోహదపడాలని ప్రార్థిస్తున్నాము.


🌼 మహాదుర్గాదేవి స్తుతి

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ॥

భావం: సమస్త మంగళాలకు మూలమైనదానా, భక్తుల ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చేదానా, శరణు కోరినవారిని రక్షించేదానా, గౌరీదేవీ! నారాయణీ! నీకు నమస్కారాలు.

నైవేద్యం: పులిహోర, చక్కెర పొంగలి, లడ్డూలు లేదా కుటుంబ సంప్రదాయానుసారమైన ప్రసాదం.


🌷. విజయదశమి పండుగ విశిష్టత 🌷

దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయ బడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము.

విజయదశమి పండుగ అపరాజిత పేరు మీద వస్తుంది. పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి, విజయదశమి అయింది. పాండవులు శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. విజయదశమి రోజు పరాజయం లేని అపరాజితాదేవిని .. శ్రీచక్ర అధిష్టాన దేవత... షోడశ మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ విజయదుర్గను ... శ్రీ రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అమ్మవారు పరమశాంత స్వరూపంతో, సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా, మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని, ఆది పరాశక్తి... రాజరాజేశ్వరి దేవిగా శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ, చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి, ఒక చేతితో అభయ ముద్రతో దర్శనమిస్తుంది.


🍀. దసరా సాధనాపర విశిష్టత 🍀

దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే ’’దశ హర‘’ అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా. పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకోవాలి.

'శమీపూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. శమీ వృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి , రావణుని సహరించి విజయము పొందినాడు.

తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట' (నీలకంఠ పక్షి)ని చూచే ఆచారం కూడా ఉన్నది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.


🍀. శమీ వృక్ష ప్రార్థన

శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌
శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్‌

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.


🌷. శ్రీ విజయ దుర్గా స్తోత్రము 🌷

దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ |

దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ 1

దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా |

దుర్గమజ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా 2

దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణి |

దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా 3

దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ |

దుర్గమోహ దుర్గమతా దుర్గమార్ధ స్వరూపిణి 4

దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ |

దుర్గమార్గీ దుర్గమతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ ౫

దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణీ

నామావళిమిమాం యస్తు దుర్గాయా మమ మానవః ౬

పఠెేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః

🌹 🌹 🌹 🌹 🌹