శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 548 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 548 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 548. 'విమర్శరూపిణీ’ - 1 🌻

విమర్శరూపిణి శ్రీమాత అని అర్థము. విమర్శ ప్రధాన లక్షణము వికాసము కలిగించుట. శ్రీమాత అగ్రాహ్యమైన తత్త్వమును ప్రకాశింప జేయును గనుక ఆమెను విమర్శ రూపిణి అందురు. విమర్శ అనగా దూషణ భూషణములుగావు. విప్పి జెప్పునది విమర్శ. వికాసము కలిగించునది విమర్శ. గుహ్యమగు విషయమును ప్రకటింపజేయునది విమర్శ. పరతత్వము లేక బ్రహ్మము పెరుగుటకు సాధ్యపడనిది. అట్టి తత్త్వమునకు ప్రతినిధియై, ప్రధానమై శ్రీమాత ప్రకాశించును. ఆమె ప్రకాశమే మనయందు ఎరుకవలె పనిచేయును. ఎరుక వలననే యెరుగుట కలుగుచున్నది. ఇట్లు ఎరుకకు మూలమై శ్రీమాత ప్రకాశించును గనుక ఆమెను ఎరుగుట పరోక్షముగ తత్వము నెరుగుటయే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 548. 'Vimarsharupini' - 1 🌻


It means Srimata is Vimarsarupini. The main characteristic of reflection is to develop. Srimata is seen as a form of reflection because she brings to light incomprehensible philosophy. Reflection does not mean insulting. Reflection is unraveling and explaining. Reflection builds knowledge. Reflection is what reveals the hidden. Paratatva or Brahman cannot grow. Shrimata shines as the representative and chief of that philosophy. Her radiance works like awareness in us. It is because of awareness that knowing comes. As the mother shines as the source of awareness, knowing her is indirectly knowing the philosophy.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

కామ్యఫలం - జ్ఞానఫలం / Fruit of Lust - Fruit of Wisdom


🌹 కామ్యఫలం - జ్ఞానఫలం / Fruit of Lust - Fruit of Wisdom 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

కర్మల వల్ల లభించేది కామ్యఫలం. జ్ఞానం వల్ల లభించేది జ్ఞానఫలం. అయితే, కామ్యఫలం త్వరగా లభిస్తుంది, కానీ జ్ఞానఫలం అంత త్వరగా లభించదు. అందుకే, జ్ఞానఫలం కోసం వేచిచూసే ఓర్పు లేక, ఎక్కువ మంది త్వరగా లభించే కామ్యఫలాలకోసం పరుగులు పెడుతుంటారు.

సంసార కూపం నుంచి బయట పడేందుకు “జ్ఞానమే” ఏకైక మార్గం. “కామ్యకర్మలు - కర్మఫలాలు” అనేవి గానుగెద్దు లాగా, ఏతంబావిలాగా రాకడ -పోకడలు గలిగి, విసుగూ - విరామం లేకుండా పుట్టుకకు - మరణానికీ కారణమౌతూ, సంసారచక్రం నుంచి బయట పడనీయవు.

🌹🌹🌹🌹🌹



🌹 Fruit of Lust - Fruit of Wisdom 🌹

Prasad Bhardwaj


Fruit of desire is the result of Actions. Fruit of Wisdom is obtained by Knowledge. However, the fruit of Actions is quick, but the fruit of Wisdom is not so quick. That is why, without the patience to wait for the fruits of knowledge, most people run for the fruits of actions motivated by desires that are available quickly.

Knowledge is the only way to get out of the ocean of bondage. 'Actions and their consequences' are like Bull driven Oil Pit; with constant coming and going, becoming and unbecoming, non-stop, causing perpetual birth and death cycles, and thus don't allow to get out of the cycle of bondage.

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 80 Siddeshwarayanam - 80


🌹 సిద్దేశ్వరయానం - 80 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 బృందావన భక్తుడు 🏵


ఆరువందల సంవత్సరాల క్రింద శ్రీకృష్ణచైతన్య మహాప్రభువు బృందావనధామం వచ్చి రాధాకృష్ణులు తమ లీలలను ఎక్కడ ప్రదర్శించారో ఆ ప్రదేశాల సన్నింటిని గుర్తించి భక్తులకు తెలియజేశారు. అంతకుముందు కొన్ని స్థలాలు మాత్రమే ప్రజలకు తెలుసు. చైతన్యస్వామి అనుగ్రహం వల్ల ఇప్పుడు అన్నీ తెలుసుకొనే అవకాశం ప్రజలకు లభించింది. ఆయన తన భక్తులైన గోస్వాములను బృందావనధామంలో నివసించి రాధాకృష్ణులను సేవించవలసినదిగాను వారికి సంబంధించిన సాహిత్యాన్ని సృష్టించ వలసినదిగాను ఆదేశించారు. తత్ఫలితంగా రూపగోస్వామి సనాతనగోస్వామి మొదలైన మహనీయులు బృందావన నివాసులైనారు.

శ్లో॥ ఆరాధ్యోభగవాన్ ప్రజేశతనయః తద్దామ బృందావనం రమ్యాకాచిదుపాసనా ప్రజవధూవర్గేణయాకల్పితా శ్రీమద్భాగవతం ప్రమాణ మమలం ప్రేమా పుమర్ధోమహాన్ శ్రీ చైతన్యమహాప్రభో ర్మతమిదం తత్రాదరోనః పరః

ఈ అనంత సృష్టిలో పరమారాధ్యుడు నంద నందనుడైన గోవిందుడొక్కడే. ఆయన నివాసము బృందావనము. గోపికలు మధురభక్తితో చేసిన సాధనయే అన్నింటికంటే శ్రేష్ఠమైన ఉపాసనామార్గము. దీనిని తెలిపే శ్రీమద్ భాగవతమే పరమ ప్రామాణిక గ్రంథము. పురుషార్ధములు సామాన్యంగా నాలుగు చెప్పబడినవి. ధర్మార్థకామమోక్షములు. అయిదవది ప్రేమ. ఇదియే ఉత్తమమైనది గొప్పది. ఇదియే చైతన్యమహాప్రభువు యొక్క మతము. దీనియందే మాకు ఆదరము. దీనిని మించినది లేదు.

ఈ భావనతో, భజనలతో, తపస్సుతో బృందావన ధామం పులకించుపోతూ ఉంటుంది. గోస్వాములలో రూప గోస్వామి, న నాతనగోస్వామి ప్రముఖులు. పూర్వాశ్రమంలో వారు సోదరులు. సనాతనగోస్వామి ఆశ్రమం దగ్గర ఒక గృహస్థ భక్తుడు నివసిస్తూ ఆశ్రమంలో తన శక్తి కొద్ది ఆర్థికంగా, హార్ధికంగా సేవచేసేవాడు. యమునా తీరంలోని యోగులను భక్తిప్రపత్తులతో పూజిస్తూ ఉండేవాడు. ఒకరో జతడు రూపగోస్వామి ఆశ్రమంలో ఉండగా అక్కడకు ఒక హిమాలయయోగి వచ్చాడు. ఆ యోగి మంత్రసిద్ధుడని గంగాతీరంలో ఆయన చేసిన కాళీసాధన వల్ల జగన్మాత కాళీదేవి సాక్షాత్కరించి దీర్ఘాయువును, దివ్యశక్తులను ప్రసాదించిందని, రూపగోస్వామికి ఆయనకు జన్మాంతర సంబంధమేదో ఉండటం వల్ల ఇక్కడకు అప్పుడప్పుడు వస్తుంటారని విన్నాడు.

కాళీదేవి విగ్రహమొకటి ఆయన దగ్గర ఉన్నది. అది ప్రాణవంతమైన మూర్తియని, పెరుగుతూ ఉంటుందని విని ఆశ్చర్యపడినాడు. అదీగాక ఇప్పటికే ఆయన వయస్సు దాదాపు మూడు వందల సంవత్సరాలని తెలిసినప్పుడు దిగ్భ్రాంతి కలిగింది. తానుకూడా అలా కావచ్చునా? కాగలడా? రూపగోస్వామి దయవల్ల ఆ సిద్ధునితో పరిచయం బకలిగింది. అది సన్నిహితమైన అనుబంధానికి దారితీసింది. ఒక వైపు సనాతనగోస్వామి వాత్సల్యము, రాధాకృష్ణుల పై భక్తి మరొకవైపు సిద్ధశక్తులను సాధించాలనే తీవ్రమైన కోరిక. ఈ స్థితిలో ఉంటూనే కాళీసిద్దుని ఆశ్రయించాడు.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 541: 14వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 541: Chap. 14, Ver. 17

 

🌹. శ్రీమద్భగవద్గీత - 541 / Bhagavad-Gita - 541 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 17 🌴

17. సత్త్వాత్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమొహౌ తమసో భవతో అజ్ఞానమేవ చ ||


🌷. తాత్పర్యం : సత్త్వగుణము నుండి వాస్తవజ్ఞానము వృద్దినొందును. రజోగుణము నుండి లోభము వృద్ధినొందగా, తమోగుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, భ్రాంతి యనునవి వృద్దినొందుచున్నవి.

🌷. భాష్యము : ప్రస్తుత నాగరికత జీవుల నిజస్వభావమునకు అనుకూలమైనది కానందున కృష్ణభక్తిభావనము ఉపదేశించబడుచున్నది. కృష్ణభక్తిభావన ద్వారా సమాజమునందు సత్త్వగుణము వృద్దినొందును. ఆ విధముగా సత్త్వగుణము వృద్ధియైనప్పుడు జనులు యథార్థదృష్టిని పొంది విషయములను యథాతథముగా గాంచగలుగుదురు. తమోగుణము నందు జనులు పశుప్రాయులై దేనిని కూడా స్పష్టముగా అవగాహన చేసికొనలేరు. ఉదాహరణమునకు ఒక జంతువును వధించుట ద్వారా అదే జంతువుతో తరువాతి జన్మలో వధింపబడవలసి వచ్చునని తమోగుణము నందు జనులు ఎరుగజాలరు. వాస్తవజ్ఞానమునకు సంబంధించిన విద్య జనుల వద్ద లేనందునే వారట్లు బాధ్యతా రహితులగుచున్నారు.

ఇట్టి బాధ్యతా రాహిత్యమును నివారించుటకు జనులందరికినీ సత్త్వగుణవృద్దికై విద్య తప్పనిసరియై యున్నది. సత్త్వగుణము నందు వాస్తవముగా విద్యావంతులైనప్పుడు వారు స్థిరబుద్ధిగలవారై యథార్థజ్ఞానమును సంపాదింతురు. అపుడు వారు ఆనందభాగులు మరియు జీవితమున సఫలురు కాగలరు. జగమంతయు ఆ రీతి సుఖభాగులు మరియు జయశీలూరు కాకున్నను, ప్రజలలో కొద్దిశాతమైనను కృష్ణభక్తిభావనను వృద్ధిచేసికొని సత్త్వగుణములో నిలిచినచో ప్రపంచమునందు శాంతి మరియు అభ్యుదయములకు అవకాశమేర్పడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 541 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 17 🌴

17. sattvāt sañjāyate jñānaṁ rajaso lobha eva ca
pramāda-mohau tamaso bhavato ’jñānam eva ca


🌷 Translation : From the mode of goodness, real knowledge develops; from the mode of passion, greed develops; and from the mode of ignorance develop foolishness, madness and illusion.

🌹 Purport : Since the present civilization is not very congenial to the living entities, Kṛṣṇa consciousness is recommended. Through Kṛṣṇa consciousness, society will develop the mode of goodness. When the mode of goodness is developed, people will see things as they are. In the mode of ignorance, people are just like animals and cannot see things clearly. In the mode of ignorance, for example, they do not see that by killing one animal they are taking the chance of being killed by the same animal in the next life. Because people have no education in actual knowledge, they become irresponsible. To stop this irresponsibility, education for developing the mode of goodness of the people in general must be there. When they are actually educated in the mode of goodness, they will become sober, in full knowledge of things as they are.

Then people will be happy and prosperous. Even if the majority of the people aren’t happy and prosperous, if a certain percentage of the population develops Kṛṣṇa consciousness and becomes situated in the mode of goodness, then there is the possibility for peace and prosperity all over the world. Otherwise, if the world is devoted to the modes of passion and ignorance, there can be no peace or prosperity. In the mode of passion, people become greedy, and their hankering for sense enjoyment has no limit. One can see that even if one has enough money and adequate arrangements for sense gratification, there is neither happiness nor peace of mind. That is not possible, because one is situated in the mode of passion. If one wants happiness at all, his money will not help him; he has to elevate himself to the mode of goodness by practicing Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹

🌹 15, JUNE 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 15, JUNE 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 541 / Bhagavad-Gita - 541 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 52 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 52 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 80 🌹
🏵 బృందావన భక్తుడు - 1 🏵
4) 🌹 కామ్యఫలం - జ్ఞానఫలం 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 548 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 1 🌹 
🌻 548. 'విమర్శరూపిణీ’ - 1 / 548. 'Vimarsharupini' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 541 / Bhagavad-Gita - 541 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 17 🌴*

*17. సత్త్వాత్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |*
*ప్రమాదమొహౌ తమసో భవతో అజ్ఞానమేవ చ ||*

*🌷. తాత్పర్యం : సత్త్వగుణము నుండి వాస్తవజ్ఞానము వృద్దినొందును. రజోగుణము నుండి లోభము వృద్ధినొందగా, తమోగుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, భ్రాంతి యనునవి వృద్దినొందుచున్నవి.*

*🌷. భాష్యము : ప్రస్తుత నాగరికత జీవుల నిజస్వభావమునకు అనుకూలమైనది కానందున కృష్ణభక్తిభావనము ఉపదేశించబడుచున్నది. కృష్ణభక్తిభావన ద్వారా సమాజమునందు సత్త్వగుణము వృద్దినొందును. ఆ విధముగా సత్త్వగుణము వృద్ధియైనప్పుడు జనులు యథార్థదృష్టిని పొంది విషయములను యథాతథముగా గాంచగలుగుదురు. తమోగుణము నందు జనులు పశుప్రాయులై దేనిని కూడా స్పష్టముగా అవగాహన చేసికొనలేరు. ఉదాహరణమునకు ఒక జంతువును వధించుట ద్వారా అదే జంతువుతో తరువాతి జన్మలో వధింపబడవలసి వచ్చునని తమోగుణము నందు జనులు ఎరుగజాలరు. వాస్తవజ్ఞానమునకు సంబంధించిన విద్య జనుల వద్ద లేనందునే వారట్లు బాధ్యతా రహితులగుచున్నారు.*

*ఇట్టి బాధ్యతా రాహిత్యమును నివారించుటకు జనులందరికినీ సత్త్వగుణవృద్దికై విద్య తప్పనిసరియై యున్నది. సత్త్వగుణము నందు వాస్తవముగా విద్యావంతులైనప్పుడు వారు స్థిరబుద్ధిగలవారై యథార్థజ్ఞానమును సంపాదింతురు. అపుడు వారు ఆనందభాగులు మరియు జీవితమున సఫలురు కాగలరు. జగమంతయు ఆ రీతి సుఖభాగులు మరియు జయశీలూరు కాకున్నను, ప్రజలలో కొద్దిశాతమైనను కృష్ణభక్తిభావనను వృద్ధిచేసికొని సత్త్వగుణములో నిలిచినచో ప్రపంచమునందు శాంతి మరియు అభ్యుదయములకు అవకాశమేర్పడును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 541 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 17 🌴*

*17. sattvāt sañjāyate jñānaṁ rajaso lobha eva ca*
*pramāda-mohau tamaso bhavato ’jñānam eva ca*

*🌷 Translation : From the mode of goodness, real knowledge develops; from the mode of passion, greed develops; and from the mode of ignorance develop foolishness, madness and illusion.*

*🌹 Purport : Since the present civilization is not very congenial to the living entities, Kṛṣṇa consciousness is recommended. Through Kṛṣṇa consciousness, society will develop the mode of goodness. When the mode of goodness is developed, people will see things as they are. In the mode of ignorance, people are just like animals and cannot see things clearly. In the mode of ignorance, for example, they do not see that by killing one animal they are taking the chance of being killed by the same animal in the next life. Because people have no education in actual knowledge, they become irresponsible. To stop this irresponsibility, education for developing the mode of goodness of the people in general must be there. When they are actually educated in the mode of goodness, they will become sober, in full knowledge of things as they are.*

*Then people will be happy and prosperous. Even if the majority of the people aren’t happy and prosperous, if a certain percentage of the population develops Kṛṣṇa consciousness and becomes situated in the mode of goodness, then there is the possibility for peace and prosperity all over the world. Otherwise, if the world is devoted to the modes of passion and ignorance, there can be no peace or prosperity. In the mode of passion, people become greedy, and their hankering for sense enjoyment has no limit. One can see that even if one has enough money and adequate arrangements for sense gratification, there is neither happiness nor peace of mind. That is not possible, because one is situated in the mode of passion. If one wants happiness at all, his money will not help him; he has to elevate himself to the mode of goodness by practicing Kṛṣṇa consciousness.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 80 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 బృందావన భక్తుడు 🏵*

*ఆరువందల సంవత్సరాల క్రింద శ్రీకృష్ణచైతన్య మహాప్రభువు బృందావనధామం వచ్చి రాధాకృష్ణులు తమ లీలలను ఎక్కడ ప్రదర్శించారో ఆ ప్రదేశాల సన్నింటిని గుర్తించి భక్తులకు తెలియజేశారు. అంతకుముందు కొన్ని స్థలాలు మాత్రమే ప్రజలకు తెలుసు. చైతన్యస్వామి అనుగ్రహం వల్ల ఇప్పుడు అన్నీ తెలుసుకొనే అవకాశం ప్రజలకు లభించింది. ఆయన తన భక్తులైన గోస్వాములను బృందావనధామంలో నివసించి రాధాకృష్ణులను సేవించవలసినదిగాను వారికి సంబంధించిన సాహిత్యాన్ని సృష్టించ వలసినదిగాను ఆదేశించారు. తత్ఫలితంగా రూపగోస్వామి సనాతనగోస్వామి మొదలైన మహనీయులు బృందావన నివాసులైనారు.*

*శ్లో॥ ఆరాధ్యోభగవాన్ ప్రజేశతనయః తద్దామ బృందావనం రమ్యాకాచిదుపాసనా ప్రజవధూవర్గేణయాకల్పితా శ్రీమద్భాగవతం ప్రమాణ మమలం ప్రేమా పుమర్ధోమహాన్ శ్రీ చైతన్యమహాప్రభో ర్మతమిదం తత్రాదరోనః పరః*

*ఈ అనంత సృష్టిలో పరమారాధ్యుడు నంద నందనుడైన గోవిందుడొక్కడే. ఆయన నివాసము బృందావనము. గోపికలు మధురభక్తితో చేసిన సాధనయే అన్నింటికంటే శ్రేష్ఠమైన ఉపాసనామార్గము. దీనిని తెలిపే శ్రీమద్ భాగవతమే పరమ ప్రామాణిక గ్రంథము. పురుషార్ధములు సామాన్యంగా నాలుగు చెప్పబడినవి. ధర్మార్థకామమోక్షములు. అయిదవది ప్రేమ. ఇదియే ఉత్తమమైనది గొప్పది. ఇదియే చైతన్యమహాప్రభువు యొక్క మతము. దీనియందే మాకు ఆదరము. దీనిని మించినది లేదు.*

*ఈ భావనతో, భజనలతో, తపస్సుతో బృందావన ధామం పులకించుపోతూ ఉంటుంది. గోస్వాములలో రూప గోస్వామి, న నాతనగోస్వామి ప్రముఖులు. పూర్వాశ్రమంలో వారు సోదరులు. సనాతనగోస్వామి ఆశ్రమం దగ్గర ఒక గృహస్థ భక్తుడు నివసిస్తూ ఆశ్రమంలో తన శక్తి కొద్ది ఆర్థికంగా, హార్ధికంగా సేవచేసేవాడు. యమునా తీరంలోని యోగులను భక్తిప్రపత్తులతో పూజిస్తూ ఉండేవాడు. ఒకరో జతడు రూపగోస్వామి ఆశ్రమంలో ఉండగా అక్కడకు ఒక హిమాలయయోగి వచ్చాడు. ఆ యోగి మంత్రసిద్ధుడని గంగాతీరంలో ఆయన చేసిన కాళీసాధన వల్ల జగన్మాత కాళీదేవి సాక్షాత్కరించి దీర్ఘాయువును, దివ్యశక్తులను ప్రసాదించిందని, రూపగోస్వామికి ఆయనకు జన్మాంతర సంబంధమేదో ఉండటం వల్ల ఇక్కడకు అప్పుడప్పుడు వస్తుంటారని విన్నాడు.*

*కాళీదేవి విగ్రహమొకటి ఆయన దగ్గర ఉన్నది. అది ప్రాణవంతమైన మూర్తియని, పెరుగుతూ ఉంటుందని విని ఆశ్చర్యపడినాడు. అదీగాక ఇప్పటికే ఆయన వయస్సు దాదాపు మూడు వందల సంవత్సరాలని తెలిసినప్పుడు దిగ్భ్రాంతి కలిగింది. తానుకూడా అలా కావచ్చునా? కాగలడా? రూపగోస్వామి దయవల్ల ఆ సిద్ధునితో పరిచయం బకలిగింది. అది సన్నిహితమైన అనుబంధానికి దారితీసింది. ఒక వైపు సనాతనగోస్వామి వాత్సల్యము, రాధాకృష్ణుల పై భక్తి మరొకవైపు సిద్ధశక్తులను సాధించాలనే తీవ్రమైన కోరిక. ఈ స్థితిలో ఉంటూనే కాళీసిద్దుని ఆశ్రయించాడు.*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 కామ్యఫలం - జ్ఞానఫలం / Fruit of Lust - Fruit of Wisdom 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*కర్మల వల్ల లభించేది కామ్యఫలం. జ్ఞానం వల్ల లభించేది జ్ఞానఫలం. అయితే, కామ్యఫలం త్వరగా లభిస్తుంది, కానీ జ్ఞానఫలం అంత త్వరగా లభించదు. అందుకే, జ్ఞానఫలం కోసం వేచిచూసే ఓర్పు లేక, ఎక్కువ మంది త్వరగా లభించే కామ్యఫలాలకోసం పరుగులు పెడుతుంటారు.*

*సంసార కూపం నుంచి బయట పడేందుకు “జ్ఞానమే” ఏకైక మార్గం. “కామ్యకర్మలు - కర్మఫలాలు” అనేవి గానుగెద్దు లాగా, ఏతంబావిలాగా రాకడ -పోకడలు గలిగి, విసుగూ - విరామం లేకుండా పుట్టుకకు - మరణానికీ కారణమౌతూ, సంసారచక్రం నుంచి బయట పడనీయవు.*
🌹🌹🌹🌹🌹

*🌹 Fruit of Lust - Fruit of Wisdom 🌹*
*Prasad Bhardwaj*

*Fruit of desire is the result of Actions. Fruit of Wisdom is obtained by Knowledge. However, the fruit of Actions is quick, but the fruit of Wisdom is not so quick. That is why, without the patience to wait for the fruits of knowledge, most people run for the fruits of actions motivated by desires that are available quickly.*

*Knowledge is the only way to get out of the ocean of bondage. 'Actions and their consequences' are like Bull driven Oil Pit; with constant coming and going, becoming and unbecoming, non-stop, causing perpetual birth and death cycles, and thus don't allow to get out of the cycle of bondage.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 548 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 548 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*

*🌻 548. 'విమర్శరూపిణీ’ - 1 🌻*

*విమర్శరూపిణి శ్రీమాత అని అర్థము. విమర్శ ప్రధాన లక్షణము వికాసము కలిగించుట. శ్రీమాత అగ్రాహ్యమైన తత్త్వమును ప్రకాశింప జేయును గనుక ఆమెను విమర్శ రూపిణి అందురు. విమర్శ అనగా దూషణ భూషణములుగావు. విప్పి జెప్పునది విమర్శ. వికాసము కలిగించునది విమర్శ. గుహ్యమగు విషయమును ప్రకటింపజేయునది విమర్శ. పరతత్వము లేక బ్రహ్మము పెరుగుటకు సాధ్యపడనిది. అట్టి తత్త్వమునకు ప్రతినిధియై, ప్రధానమై శ్రీమాత ప్రకాశించును. ఆమె ప్రకాశమే మనయందు ఎరుకవలె పనిచేయును. ఎరుక వలననే యెరుగుట కలుగుచున్నది. ఇట్లు ఎరుకకు మూలమై శ్రీమాత ప్రకాశించును గనుక ఆమెను ఎరుగుట పరోక్షముగ తత్వము నెరుగుటయే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 548 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini  ॥112 ॥ 🌻*

*🌻 548. 'Vimarsharupini' - 1 🌻*

*It means Srimata is Vimarsarupini. The main characteristic of reflection is to develop. Srimata is seen as a form of reflection because she brings to light incomprehensible philosophy. Reflection does not mean insulting. Reflection is unraveling and explaining. Reflection builds knowledge. Reflection is what reveals the hidden. Paratatva or Brahman cannot grow. Shrimata shines as the representative and chief of that philosophy. Her radiance works like awareness in us. It is because of awareness that knowing comes. As the mother shines as the source of awareness, knowing her is indirectly knowing the philosophy.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj