శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 548 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 548 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 548. 'విమర్శరూపిణీ’ - 1 🌻

విమర్శరూపిణి శ్రీమాత అని అర్థము. విమర్శ ప్రధాన లక్షణము వికాసము కలిగించుట. శ్రీమాత అగ్రాహ్యమైన తత్త్వమును ప్రకాశింప జేయును గనుక ఆమెను విమర్శ రూపిణి అందురు. విమర్శ అనగా దూషణ భూషణములుగావు. విప్పి జెప్పునది విమర్శ. వికాసము కలిగించునది విమర్శ. గుహ్యమగు విషయమును ప్రకటింపజేయునది విమర్శ. పరతత్వము లేక బ్రహ్మము పెరుగుటకు సాధ్యపడనిది. అట్టి తత్త్వమునకు ప్రతినిధియై, ప్రధానమై శ్రీమాత ప్రకాశించును. ఆమె ప్రకాశమే మనయందు ఎరుకవలె పనిచేయును. ఎరుక వలననే యెరుగుట కలుగుచున్నది. ఇట్లు ఎరుకకు మూలమై శ్రీమాత ప్రకాశించును గనుక ఆమెను ఎరుగుట పరోక్షముగ తత్వము నెరుగుటయే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 548. 'Vimarsharupini' - 1 🌻


It means Srimata is Vimarsarupini. The main characteristic of reflection is to develop. Srimata is seen as a form of reflection because she brings to light incomprehensible philosophy. Reflection does not mean insulting. Reflection is unraveling and explaining. Reflection builds knowledge. Reflection is what reveals the hidden. Paratatva or Brahman cannot grow. Shrimata shines as the representative and chief of that philosophy. Her radiance works like awareness in us. It is because of awareness that knowing comes. As the mother shines as the source of awareness, knowing her is indirectly knowing the philosophy.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment