1) 🌹 శ్రీమద్భగవద్గీత - 450 / Bhagavad-Gita - 450🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 238 / Sripada Srivallabha Charithamrutham - 238🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 118🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 140🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 54 / Sri Lalita Sahasranamavali - Meaning - 54 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 57🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 25🌹
8) 🌹. శివగీత - 23 / The Shiva-Gita - 23🌹
9) 🌹. సౌందర్య లహరి - 65 / Soundarya Lahari - 65🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 364 / Bhagavad-Gita - 364🌹
11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 190🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 66 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 62 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 77 🌹
15) 🌹 Seeds Of Consciousness - 142 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 80🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 26🌹
18) 🌹 Twelve Stanzas from the Book of Dzyan - 9🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 20🌹
19) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 5 🌹
20)
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 450 / Bhagavad-Gita - 450 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -06, 07 🌴*
06. యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పతా: |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్తే ఉపాసతే ||
07. తేషామహం సముద్ధ ర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామి న చిరాత్పార్థ మయ్యావేశిచేతసామ్ ||
🌷. తాత్పర్యం :
కాని ఓ పార్థా! సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింతలేక నాకు భక్తులై, మనస్సును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు, నా భక్తియుత సేవలో నన్ను అర్చించెడివారిని శీఘ్రమే జనన, మరణమను సంసారసాగరము నుండి ఉద్ధరింతును.
🌷. భాష్యము :
పరమభాగ్యుశాలురైన భక్తులు శ్రీకృష్ణభగవానునిచే అతిశీఘ్రముగా భవసాగరము నుండి తరింపజేయబడుదురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.
భగవానుడు అత్యంత ఘనుడని మరియు జీవుడు అతనికి సేవకుదనియు తెలిసికొనగలిగే జ్ఞానమునకు శుద్ధభక్తియోగమున మనుజుడు అరుదెంచును. శ్రీకృష్ణభగవానునికి సేవను గూర్చుటయే జీవుని నిజధర్మము. అతడట్లు చేయనిచో మాయను సేవింపవలసివచ్చును.
పూర్వము తెలుపబడినట్లు భక్తియోగము చేతనే శ్రీకృష్ణభగవానుఇ సంపూర్ణతత్త్వము అవగతము కాగలదు. కనుక ప్రతియొక్కరు పూర్ణముగా భక్తియుతులు కావలెను. కృష్ణుని పొందు నిమిత్తమై అతని యందే మనస్సును పూర్ణముగా లగ్నము చేయవలెను.
కృష్ణుని కొరకే కర్మనొనరింపవలెను. కర్మయేదైనను సరియే దానిని కేవలము కృష్ణుని కొరకే ఒనరింపవలెను. భక్తియోగము ప్రమాణమదియే. దేవదేవుని సంతృప్తిపరచుటకన్నను అన్యమైనదేదియును భక్తుడు సాధింపగోరడు.
శ్రీకృష్ణుని ప్రియమును గూర్చుటయే తన జీవితకార్యముగా భావించెడి అతడు ఆ భగవానుని సంతృప్తికొరకు కురుక్షేత్ర రణరంగమునందలి అర్జునుని వలె దేనినైనను త్యాగము చేయగలడు. అట్టి ఈ భక్తియోగము యొక్క పద్ధతి అత్యంత సులభమైనది.
మనుజుడు తన కార్యములను ఒనరించును, అదే సమయమున హరే కృష్ణ హర కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రము జపించవలెను.
అట్టి మహామంత్రోచ్చారణము అతనిని దేవదేవుడైన శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షితుని చేయును.
ఆ విధముగా నియుక్తుడైన శుద్ధభక్తుని శీఘ్రమే భవసాగరము నుండి ఉద్ధరింతునని శ్రీకృష్ణుడు ఇచ్చట ప్రతిజ్ఞ చేయుచున్నాడు.
*🌹 Bhagavad-Gita as It is - 450 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 12 - Devotional Service - 06, 07 🌴*
06. ye tu sarvāṇi karmāṇi
mayi sannyasya mat-parāḥ
ananyenaiva yogena
māṁ dhyāyanta upāsate
07. teṣām ahaṁ samuddhartā
mṛtyu-saṁsāra-sāgarāt
bhavāmi na cirāt pārtha
mayy āveśita-cetasām
🌷 Translation :
But those who worship Me, giving up all their activities unto Me and being devoted to Me without deviation, engaged in devotional service and always meditating upon Me, having fixed their minds upon Me, O son of Pṛthā – for them I am the swift deliverer from the ocean of birth and death.
🌹 Purport :
It is explicitly stated here that the devotees are very fortunate to be delivered very soon from material existence by the Lord.
In pure devotional service one comes to the realization that God is great and that the individual soul is subordinate to Him. His duty is to render service to the Lord – and if he does not, then he will render service to māyā.
As stated before, the Supreme Lord can be appreciated only by devotional service. Therefore, one should be fully devoted. One should fix his mind fully on Kṛṣṇa in order to achieve Him.
One should work only for Kṛṣṇa. It does not matter in what kind of work one engages, but that work should be done only for Kṛṣṇa. That is the standard of devotional service.
The devotee does not desire any achievement other than pleasing the Supreme Personality of Godhead. His life’s mission is to please Kṛṣṇa, and he can sacrifice everything for Kṛṣṇa’s satisfaction, just as Arjuna did in the Battle of Kurukṣetra.
The process is very simple: one can devote himself in his occupation and engage at the same time in chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare.
Such transcendental chanting attracts the devotee to the Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 238 / Sripada Srivallabha Charithamrutham - 238 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 47
*🌻. శ్రీపాదుల మాతృభక్తి 🌻*
శ్రీపాద శ్రీవల్లభ దర్బారులో భోజనం సమృద్ధిగా, అక్షయంగా వస్తూనే ఉంది. అందరం తినగా మిగిలినది కృష్ణా నదిలో జలచరాలకు వేసారు. వాటికి కూడా శ్రీపాదుల ప్రసాదం లభించింది.
శ్రీపాదులవారి పనులన్ని అసాధారణంగాను, రోమాంచకంగాను ఉంటాయి అని శ్రేష్ఠిగారు తెల్పినపుడు, శ్రీచరణులు దానికి జవాబు చెప్తూ, "నానుండి వెలువడే ఒక చిన్న కిరణాన్నే ఈ భూమి తట్టుకోలేదు.
అందుకనే నన్ను నేను మాయలో దాచుకుంటూ, అవసరమని తోచిన పుడు మాత్రమే లీలలను ప్రదర్శిస్తాను. తాతా! నేను ఎత్త లేని బరువు, పరిష్కరించలేని సమస్య, ఈయలేని వరము, చేయలేని కార్యము ఈ సృష్టిలో లేవు.
పీఠికాపురం నుండి మిమ్మల్ని ఇక్కడకు ఇలా రప్పించడం చాలా చిన్న విష యం," అని వివరించారు. తరువాత ముగ్గురు అమ్మమ్మలు ప్రేమతో వారికి హల్వా, పెరుగు, వెన్న తినిపించారు.
వాళ్ళు శ్రీపాదులను పెండ్లి కుమారుడిగా చూడాలన్న తమ కోరికను వెల్లడించారు.
దానికి వారు కల్కి అవతారంగా శంబల గ్రామంలో జన్మించినపుడు సింహళంలో పద్మావతి అనే పేరున జన్మించిన అనఘాలక్ష్మిని వివాహం చేసుకుంటా నని, దానిని వాళ్ళు తప్పక చూడగల్గుతారని హామీ ఇచ్చారు. రాజశర్మ, "నాయనా! నీవు దత్త ప్రభువని తెలి యక ఏదయినా అపరాధం చేసినట్లయితే క్షమించమ,"ని ప్రార్థించారు.
"నాన్నా! నేను మీ బిడ్డను. తండ్రి బిడ్డను క్షమించమని అడగడం ఎంత విడ్డూరం! మీరు వాత్సల్యం కురిపిస్తూ నా అభివృద్ధికి తోడ్పడాలే తప్ప ఇలాంటివి మాట్లాడకూడదు," అని సమాధాన పరిచారు.
*🌻. దివ్య శిశువులు ఇరువురు 🌻*
పెళ్ళికొడుకుగా చూడవలసిన కుమారుని యతీశ్వరునిగా చూస్తున్నందుకు కళ్ళనీళ్ళు పెట్టుకున్న తల్లి ధ్యాసను మరలుస్తూ, "అమ్మా! నాకు ఆకలిగా ఉందని అనసూయా మాత దగ్గరకు వెళ్ళితే నాకంటె ముందు ఆ రాక్షసి వాసవి అక్కడ చేరి అమ్మ వద్ద పాలన్ని తాగేసి, నీవు సుమతీ మాత దగ్గరకి తొందరగా వెళ్ళి పాలు తాగు, లేదా ఆ పాలు కూడా నేనే తాగేస్తాను అని బెదిరిస్తుంది, చూడమ్మా!" అంటూ పసిపాపలా మారిపోయారు.
సుమతి ఆ శిశువును తన ఒడిలోకి తీసుకొని స్తన్యం ఇస్తూ, ప్రేమగా వాసవీ! అంటు పిలిచారు. మరుక్షణమే పూర్తిగా శ్రీపాదుల లాగే ఉన్న పసిపాప సుమతి ఒడిలోకి వచ్చింది సుమతీ మాత ఇద్దరు పిల్లలకుచెరోవైపు స్తన్యపానం ఇస్తూ తన దుఃఖ మంతా మరిచిపోయింది.
విన్నపాలు వినవలె....
వచ్చినవారిలో వెంకయ్య అనే పంటకాపు ఉన్నారు అతని యింటి దగ్గరే శ్రీపాదులు అన్ని వర్ణాలవారికి దత్తదీక్షను ఇచ్చారు.
"ఇంతటి దివ్యలీల జరిగిన ఈ దర్బారు ప్రదేశం, దీనికి ఆనుకొని ఉన్న విశాల భూభాగం విశ్వవిఖ్యాతి పొందాలి," అని వెంకయ్య తన కోరిక వ్యక్తం చేసారు. భవిష్య త్తులో పక్కా భవన నిర్మాణం జరుగుతుందని, అందులో గోశాల కూడా ఉంటుందని శ్రీపాదులు చెప్పారు.
నా కన్నుల ముందే జరిగిన ఈ లీలని నేను యథాతథంగా వ్రాస్తున్నానే తప్ప ఇందులో ఏ రకమైన అతిశయోక్తి లేదు. తరువాత కొంతసేపటికి మళ్ళీ అందరం మగతలోకి జారుకున్నాం. కనులు తెరిచి చూస్తే శ్రీపాదులు, నేను, ఆ సన్యాసి తప్ప మిగిలిన ఎవ్వరూ లేరు. వాళ్ళని ఏదైనా రాక్షసమాయ బలి తీసుకుందా? అని నాకు భయం వేసింది.
శ్రీపాదులు ఇలా తెలిపారు, "నా సన్నిధిలో ఏ రాక్షసమాయ పని చేయదు. వారందరిని తిరిగి క్షేమంగా పీఠికాపురం చేర్చాను. నన్ను ఎవరు ఏ భావంతో సేవిస్తారో వారిని ఆ విధంగానే నేను తరింపచేస్తాను."
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
సశేషం
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 238 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 26
*🌻 The indicators of end of kali yugam 🌻*
Pithru devathas are not the elders who died. They are the janyu devathas who receive the fruits of ‘shraadha’ and give higher states to the departed souls. They do not have any birth.
Yogi sees the yoga chakras in his body as the six seasons in the external year. In one year, there are 12 ‘pournamis’ and 12 ‘amavasyas’. Learn that these 24 parvas are the 24 letters of Gayathri chadassu.
Narayana, who is ‘kala swaroopa’ is worshipped as ‘samvatsara purusha’ by some people. This vidya is called Dwadasakshari vidya. There are 12 letters in the mantra, one letter for each month. Learn that these following are the indicators of end of Yuga.
Rivers and streams overflow and cause endless damage. The earth keeps moving with earthquakes often, reminding the pralayam Sun, Moon etc over step their orbits.
In the day, there will be darkness and Sun is not seen. Seeing frightful comets in the sky is also an indicator. At the end part of Dwapara yugam, the Kali purusha who is the lord of Kali yuga did intense penance in an island in the western sea.
All these things were made known by Veda Vyasa Maharshi in his ‘Bhavishya Purana’.
*🌻 Birth of Mleccha race 🌻*
Seeing Veda mantras, yajnas and tapas everywhere, the Kali purusha prayed with extreme grief. “Prabhu! Dharma is raging everywhere like agnihotra. How can I spread my influence? In accordance with the promise given to you, I have to spread my Yuga dharma. It appears impossible to me.”
Then the Lord of Universe showed Kali an island in the west sea. There He showed Adam and Eve (Aadamudu and Havyavathi) who are the root couple of mleccha race. He created a beautiful garden for their play.
In reality, they both are born together i.e. brother and sister. Kali entered there in the form of a serpant and incited unjust lust between them and encouraged them to beget children. Then they became fallen from dharma and their divine powers disappeared.
From these couple mleccha race which was the root of Kali dharma emerged. In the last part of Dwapara Yugam i.e. 2800 years before the end of Dwapara Yuga, their children started multiplying in the mleccha desam. It was mentioned in the ‘Prathi sarga parvam’ of Bhavishya Purana.
Adam and Eve who were created at Neelachalam, took the fruit of sin and produced children who would abuse the arya dharma and eat everything and would not follow tradition.
I have to take Kalki avathar and destroy crores of people fallen from dharma and establish Satya Yuga again. This is my programme in the distant future.
Then Dharma Gupta said, ‘Swami! I have a desire for many days to learn the story of Sri Vasavee Parameswari avathar from you. Please tell me.’ Sri Charana, with a pleasing lotus face, said smiling.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 118 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ
*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 3 🌻*
జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంతకాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించేవారు విష్ణుధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు. వీరు కాలస్వరూపుడగు వాసుదేవుని మంద్రజాలంలో పరవశిస్తుంటారు.
ఇట్టి వారి ద్వారా వాసుదేవుడు తన సాన్నిధ్యాన్ని వ్యక్తం చేయడంతో, వీరిని చేరినవారికి ఆనందం, శాంతి కలుగుతాయి. ఇదియే సత్యం కాని, మొత్తం లోకంతా ఒక్కసారిగా విష్ణుధర్మావలంబులు కావడం జరుగదు.
అసలు తనను తానే ఉద్ధరించుకోలేని నరుడు లోకాన్ని ఉద్ధరిస్తాననడం పిచ్చిమాత్రమే. ఆ దృక్పథమే రోగ గ్రస్తమగు మనోవైఖరి.
జీవులకు యోగక్షేమాలను ప్రసాదించేది వారి వారి కర్మలను బట్టి వాసుదేవుడే కాని ఇంకెవరూ కాదు. మనం చేయవలసినది, అందులకే ఆ స్వామిని ప్రార్థిస్తూ, ఆర్తులగు జీవులకు మనవంతు సేవనందించడమే.
ఆ దిశలో తమ ద్వారా ఈ పని అవడమే కాని, తమ వలన కాదని మరచిపోరాదు. తమ ద్వారా వాసుదేవుడు ఎంత, ఏ విధంగా చేయ సంకల్పిస్తాడో అదే జరుగుతుంది.
అపుడు లోకకల్యాణానికై మనం చేసే సేవ అంతర్యామి ఆరాధనమై, వానికి ప్రీతి గొల్పుతుంది. మనల్ని ఉద్ధరిస్తుంది.
శ్రీకృష్ణుడు, ఏసుక్రీస్తు, మున్నగు అవతారమూర్తులే లోకకల్యాణమునకై తమ వంతు కర్తవ్యాన్ని మాత్రమే ఆచరించామని తృప్తిగా భావించారు. కావున తేలినదేమనగా లోకోద్ధరణ భావము బంధము.
లోకకల్యాణమునకై కర్తవ్యాచరణము మోక్షము, మనకుఆదర్శము. ఇందు మనం నిలబడేట్లు మన గురువులు మనలను ఆశీర్వదింతురుగాక..
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Journey Inside - 140 🌹*
*🌴 Dealing with Obstacles - 2 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
*🌻 Occasions for Growth - 2 🌻*
A severe obstacle forces us to think deeper, more focused, so that we can hit upon a creative thought and perhaps even touch the planes of intuition.
An idea can flash forth and give a solution. This is the reward of the obstacle. Therefore Master DK says: “Let pain bring due reward of Light and Love.”
The wisdom teachings explain that the obstacles on our way are nothing but the things we neglected in the past. What we are neglecting today is a problem of the future.
Whatever we neglect, negate or repress today, will come back to be solved by us. If we neglect health today, we undergo sickness tomorrow. If we don’t care for riches today, we encounter poverty tomorrow.
If we neglect people today, we encounter non-cooperation tomorrow. Thus every obstacle challenges us to stop, think, rectify and proceed.
If we don’t observe these fundamental things, we work against our knowledge, in spite of all our knowledge. The biggest hurdle on the way are we ourselves, the personality. It carries variety of personal thoughts, desires and emotions.
It is like a big block, which prevents the soul to express through the body. Essentially we are the soul, the person. The personality, however, is the shadow of the soul, an aggregate of qualities.
When we don’t put into practice our knowledge we get from the wisdom teachings, we remain caught in the structures of the personality.
The aim isn’t to destroy the personality, but to adjust it to the demands of the soul. Then the radiance of the soul and its magnetic impact can express through the personality.
🌻 🌻 🌻 🌻 🌻
Sources : Master K.P. Kumar: Saturn / Jupiter / notes from seminars / Master E. Krishnamacharya: The Yoga of Patanjali.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 54 / Sri Lalita Sahasranamavali - Meaning - 54 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్లోకం 101
491. కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా -
కాళరాత్రి మొదలైన పన్నెండి మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
492. స్నిగ్థౌదన ప్రియా -
నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.
493. మహావీరేంద్ర వరదా -
శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.
494. రాకిణ్యంబా స్వరూపిణీ -
రాకిణీ దేవతా స్వరూపిణి.
🌻. శ్లోకం 102
495. మణిపూరాబ్జనిలయా -
మణిపూర పద్మములో వసించునది.
496. వదనత్రయ సంయుతా -
మూడు ముఖములతో కూడి యుండునది.
497. వజ్రాదికాయుధోపేతా -
వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
498. డామర్యాదిభిరావృతా -
డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 54 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 54 🌻*
491 ) Kala rathryadhi Shakthi youga vrudha -
She who is surrounded by Shakthis like Kalarathri. Kanditha, Gayathri, ….etc
492 ) Sniggdowdhana priya -
She who likes Ghee mixed rice
493 ) Maha veerendra varadha -
She who gives boons to great heroes or She who gives boons to great sages
494 ) Rakinyambha swaroopini -
She who has names like rakini
495 ) Mani poorabja nilaya -
She who lives in ten petalled lotus
496 ) Vadana thraya samyudha -
She who has three faces
497 ) Vajradhikayudhopetha -
She who has weapons like Vajrayudha
498 ) Damaryadhibhi ravrutha - She who is surrounded by Goddess like Damari
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 57 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రథమాధ్యాయం - సూత్రము - 33, 34
*🌻. 33. తస్మాత్ సైవ గ్రాహ్యా ముముక్షుభిః 🌻*
పరాభక్తి అంటె ఆత్మానుభూతి, అనగా మోక్షమేనని గ్రహించాలి.
మోక్షమంటే పరమ ప్రేమ రూపం. పరాభక్తి గురించి ఇంతవరకు వివరించిన ప్రకారం అది ఉత్తమోత్తమం. పరాభక్తిని ఇంతకంటే తక్కువదనుకోవడం అజ్ఞానమవుతుంది.
*🌻 34. తస్యాః సాధనాని గాయంత్యాచార్యాః - 1 🌻*
పరాభక్తి సిద్ధించడానికి ముందుగా చేయవలసిన సాధనల గురించి
ఆచార్యులైన న్వానుభవం ఉన్న పురుషులు వేదాలలో, ఇతిహాసాలలో, బుక్కుల్లో శోకాలతో గానం చెశారు.
ఆచార్యులంటేె తాము తరించడమే గాక ఇతరులను తరింపజెయ గలిగిన భాగవతోత్తములు. భక్తులను తరింపజేయటం కోసం సత్సంకల్పం, కృప కలవారు. వారు గురు శిష్య పరంపరంగా, గ్రంథరూపంగా భావి తరాలకు అందించినవారు.
కనుక వారి స్వానుభవాన్ని వారు తెలియచేసే సాధనా మార్తాన్ని మనం
విశ్వసించాలి. వారు పలికినా, గానం చేసినా, అవన్నీ వారు పరవశంలో ఉన్నప్పుడు వెలువడినవే. కవి గాని వారు కవిత్వం చెప్తారు. నృత్యం రాకపోయినా నర్తిస్తారు. పాడటం రాదు, అయినా గానం చేస్తారు. అవన్నీ దైవ ప్రేరణవల్ల జరుగుతాయి.
అవి స్వంతంగా వారు తెలియజేసినవి కాదు. “పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామ భద్రుండట, నె పలికిన భవహరమగునట” అన్నట్లు వెలువడుతాయి.
కనుక ఆచార్య పురుషుల గుణగణాలను, వారి చర్యలను, ఆ చర్యల వెనుక ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించగలగాలి. వారు గానం చేసిన పలుకుల తాత్పర్యం తెలుసుకోవాలి. వారు ఒక్కొక్కనారి మనం చెయవలసిన సాధనలను సూటిగా చెప్తారు.
అందులో అందరికీ సమానంగా సరిపోయేవి ఉంటాయి. మరికొన్ని తప్పనిసరిగా చేయ వలసినవి ఉంటాయి. మరి కొన్నిటిలో మాత్రం మనం ఎంపిక చెసుకొని ఆచరించే స్వెచ్చ ఉంటుంది. లక్ష్య సాధన మాత్రం అందరికీ ఒక్కటే.
కాని ఉపాయాలు భిన్న భిన్నాలుగా ఉంటాయి. ఆ ఉవాయాలను ఎంచుకోవడంలోనె మనకు స్వెచ్చ ఉంటుంది. క్రితం జన్మలో మనం చేసినట్టి నాధన ఎ మార్గంగా ఉన్నదో, అదే కొనసాగించడానికి మనకు ప్రియంగా ఉంటుంది. సులభంగా కూడా ఉంటుంది.
ఈ క్రమంలో ఇతరులకు తేలికైన మార్గాలు మనకు కష్టతరంగా ఉంటాయి. అందువలన కొందరు సాధకులు నిర్ణయించిన మార్గాలు సర్వులకు విలయ్యెవి కాదు. అనగా నాధనా మార్గాలు ప్రమాణం కాదు. అవి ఉపాయాలు. కాని ఆచార్యులు ప్రమాణాన్ని తెలుపుతారు.
ఆచార్యుల పలుకులనె విశ్వసించాలి. ఎందుకంటే అవన్నీ వారి న్వానుభవం నుండి వెలువడినవి గనుక.
శాస్తెష్పియానె వసు నిశ్చితో నృణాం
క్షేమస్య సధ్యగ్విమృశేషు హేతుః ।
అసంగ ఆత్మ వ్యతిరిక్త ఆత్మన్
దృధారతి ర్పహ్మణ్ నిర్గుణే చయా ॥।
తాః; బంధ రాహిత్యం, పరమానందాస్వాదన అనేవి ముక్త స్థితికి లక్షణాలు. పిటిని ముముక్షువు అయినవాడు త్యాగంతో కూడిన భగవత్సేవా పరుదై లౌకిక విషయాలందు అసంగబుద్ధి కలిగి తత్ రూవాన్ని స్వరూపంగా అనగా భగవంతునిగా అనుష్టించదడంవంట సహజమైన మార్తాన్ని, భగవత్ర్రేమను అందవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 25 🌹*
✍️ Sri GS Swami ji
📚. Prasad Bharadwaj
*🌻. Offering Service to Guru is Important in Sadhana 🌻*
Deepaka continued his dedicated service to his Guru without any boredom, and without taking a single break. Veda Dharma continued to show his irritation towards him, not only in private, but in public as well.
He reeled off a list of false complaints against his disciple to all the outsiders, blaming Deepaka for lack of patience, short temper, lack of respect and regard, negligence, and incompetence. Deepaka was blamed if he ever stepped out.
Guru was tormenting Deepaka but gave the reverse impression to others that he was being ill-treated by his disciple. The more his Guru complained, the more Deepaka loved him.
Deepaka’s fame spread to all the four corners for his sincerity, patience, and unwavering devotion to Guru.
People spoke, not about the Guru, but about the disciple who, in spite of the stench that extended over the entire street, tolerated it, and served his Guru with steadfast love and extraordinary care.
Even Lord Viswanatha of Kasi learned about Deepaka’s exemplary service to Guru. He stepped out from the Jyotirlinga (in the temple) and stood before Veda Dharma’s hut and lovingly called out, “Deepaka!”
Deepaka responded to the call with a pleading tone, “O Lord of all the worlds, please lower your voice. My Guru is resting. Please do not disturb the peace here.
I prostrate to you, please do not disturb my Guru’s sleep.” Visveswara (the Lord of the Universe) felt extremely pleased with this reply.
He said, “Deepaka, I am thrilled to learn of your devotion to Guru. I am offering you a boon. Name your wish.”
Deepaka responded reverentially, “O Lord, I am grateful to you beyond measure for your compassion. I do not require any boon. You please speak with my Guru. Unless he bids, I take no decisions. Without his suggestion, I will not ask for anything. You please wait outside until he wakes up.”
Lord Siva got angry at Deepaka’s arrogance that his offer of a boon was being dismissed so lightly. He said, “I am giving you one last chance. Will you accept my boon or not?”
Deepaka begged, “O Lord of the Universe, please do not be angry. Under no circumstance will I ask for any boon without the approval of my Guru. After he wakes up, as he commands, I will act. I never act on my own accord. No matter how angry you may get, it does not matter.”
Lord Siva, feeling insulted, said, “If that be the case, I am not going to leave you alone. I will keep watching you.” He proceeded to see Lord Vishnu and appeared before him, vowing to see to the end of this matter.
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 23 / The Siva-Gita - 23 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 7 🌻
ఆత్మ న్యగ్నిం సమారోష్య - యాతే అగ్నేతి మంత్ర తం:,
భస్మా దాయాగ్ని రిత్యా ద్యై - ర్వి మృజ్యాం గాని సంస్పృశేత్?28
భస్మచ్చ న్నో ద్విజో వింద- మహా పాతక సంభ వై:,
పాపై ర్వి ముచ్యతే నిత్యం - ముచ్యతే న చ సంశయః 29
అగ్ని వీర్యం యతో భస్మ - వీర్య వాన్భ స్మ సంయుతః,
భస్మ స్నాన రతో విప్రో భస్మ - శాయీ జితేన్ద్రియా: 30
సర్వ పాప వినిర్ముక్తః - శివ సాయుజ్య మాప్నుయాత్,
ఏవం కురు మహారాజ - శివ నామ సహస్రకమ్ 31
ఇదంతు సంప్ర దాస్యామి - తేన సర్వ మవాప్స్యసి,
ఇత్యుక్త్యా ప్రద దౌతస్మై - శివ నామ సహస్రకమ్ 32
ఈ విభూతి వహ్ని వీర్య మగుటచేత సదా ఏ ద్విజ్నుడు ఇంద్రియ
సంయమనము గలవాడై భస్మ స్నానాసక్తి యందుండి, యా భస్మము లేనే పరుండి భస్మమును వీడి యుండడో అట్టి వాడు సమస్త పాపముల నుండి విముక్తుడై శివ సాయుజ్యమును బొందును.
ఓయీ మహారాజా! రామచంద్రా! నీ వీ ప్రకారముగా ననుష్టిం చుము .
శివ సహస్రనామములను నీకు బోధింతును.
దీని ప్రభావము వలన నీవు సమస్త కోరికలను బొందగలవు.
ఈ విధముగా నా అగస్త్య మహా మునీంద్రుడు ఉద్భవించి శివ ప్రత్యక్ష దాయకమగు వేద సారాంశ శివ సహస్ర నామములను శ్రీరామునకు బోధించిన వాడయ్యేను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 23 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 03 :
*🌻 Viraja Deeksha Lakshana Yoga - 7 🌻*
Since this Vibhooti (holy ash) is VahniVeeryam, the one who subdues his senses, bathes his own body with this ash, sleeps in the ashes, and never leaves the ashes, such a person becomes freed of all kinds of sins and gets Sayujyam (becoming one) with Shiva.
O great king Ramachandra! You follow this procedure.
I would preach you Shivasahasranama (thousand names of Lord Shiva). With the effect of these divine names you can achieve all your dreams. Suta said:
In this way that great sage preached Rama the thousand names of Shiva.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 15 / Sri Gajanan Maharaj Life History - 15 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 3వ అధ్యాయము - 5 🌻*
శ్రీమహారాజు ధర్శనానికి కొంతమంది షేగాంరావడం జరిగింది. శ్రీగజానన్ అసమయంలో నిద్రపోతూఉన్నారు. ఆయనను ఆనిద్రనుండి లేపడానికి ఎవరూ సాహసించరు.
ఈవచ్చిన వ్యక్తులకు త్వరగా వెళ్ళిపోవాలని ఉంది, కానీ శ్రీమహారాజు దర్శనం కూడా చేసుకోవాలని ఉంది. వీరు విఠోబాను కలసి, విఠోబా మాకు త్వరగాతిరిగి వెళ్ళి పోవాలనిఉంది, కానీ దానికి ముందు శ్రీమహారాజు దర్శనం మాకుకావాలి.
ఆయన శిష్యులందరిలో నువ్వే శ్రీమహారాజుకు అతి ప్రియమయిన, చేరువైన, తెలివైన వాడవు కావున శ్రీమహారాజును నిద్రలేపు, మేముదర్శనంచేసుకుంటాము అని అన్నారు.
ఈ విధమయిన వీరి నివేదనకి, విఠోబా పొంగిపోయి వెంటనే వెళ్ళి శ్రీమహారాజును నిద్రలేపుతాడు. వచ్చిన వాళ్ళకి దర్శనం అయితేఅయింది కానీ విబాకి ముప్పు తెచ్చింది. ఒక కర్రతో శ్రీగజానన్ విఠోబాను తీవ్రంగా కొట్టి, ఓరి మూర్ఖుడా, నువ్వు ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టావు, దీనిని సహిస్తూ ఉంటే భగవంతుని ముందు నేను తప్పుచేసిన వాడిని అవుతాను. కనుక నిన్ను నేను శిక్షించవలసిందే.
మధిరను పానకంగా పరిగణించరాదు, విషాన్ని తాకకూడదు మరియు దొంగలను స్నేహితులుగా చేయరాదు అని శ్రీమహారాజు అంటూ, ఆ కర్రతో మరల ఆయన విఠోబాను వెళ్ళగొట్టారు. ఆవిధంగా పారిపోయిన విఠోబా ఎప్పటికి తిరిగి రాలేదు.
నిజమయిన యోగులు ఈవిధంగా ప్రవర్తిస్తారు. కపట సన్యాసులు, కొంతమంది స్వార్ధపరుల సహాయంతో అమాయక ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. ఇది సంఘవిద్రోహక చర్య. సమాజం నుండి ఇటువంటి వారిని వెలివేసేందుకు నిజమయిన యోగులు ఎప్పుడూ ప్రయత్నిస్తూఉంటారు.
పతివ్రత అయిన ఇల్లాలు, ఒక భోగం మనిషి ఇరుగు పొరుగుగా ఉంటే ఇష్టపడదు. బంగారంనగలు అల్యుమినియం నగలతో ఉండడానికి ఇష్టపడవు. చెడుబుద్ధి కలవారిని యోగులు స్వీకరించినా వారికి ప్రాధాన్యత ఇవ్వరు.
వీరి పూర్వజన్మ వృత్తాంతం యోగులకు తెలుసు కాబట్టి ఏవిధంగా అయితే మల్లె మొక్కలు, ముళ్ళమొక్కలు ఒకేనేలమీద పెరిగినా వాటికి ఉండే ప్రాధాన్యతలో తేడాఉందో అదేవిధంగా యోగులు అందరినీ కాపాడుతున్నా ప్రతివారికి ఇచ్చే విలువ వేరేగానే ఉంటుంది.
విఠోబా చాలాదురదృష్టవంతుడు. యోగీశ్వరుని పాదాల స్పర్శ తగిలినా, దురదృష్ట వశాత్తు పోగొట్టుకున్నాడు. అతను యోగి గొప్పతనం అర్ధంచేసుకోలేకపోయాడు. అదికనుక అతను తెలిసికొనిఉంటే దైవిక భోగం పొందిఉండేవాడు. అతను కల్పవృక్షం క్రిందకూర్చుని ఒక గుళకరాయిని కోరుకున్నాడు లేదా కామధేనువునుండి ఒక కొబ్బరి కాయకోరుకున్నాడు.
యోగుల సహచర్యంలో ఎవ్వరూ ఇలాచెయ్యరాదు. భక్తులందరినీ ఈ గజానన్ విజయగ్రంధం రక్షించుగాక.
శుభం భవతు.
3. అధ్యాయము సంపూర్ణము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 15 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 3 - part 5 🌻*
It so happened that some people came to Shegaon for the Darshan of Shri Gajanan Maharaj .
At that time Shri Gajanan was sleeping, and no body could dare wake Him up. These people were in hurry to go, but at the same time wanted the Darshan of Shri Gajanan Maharaj .
They approached Vithoba and said, “Vithoba, we are in hurry to go back and want the Darshan of Shri Gajanan Maharaj before going. Amongst all the disciples, you are the most intelligent, nearer and dearer to Shri Gajanan Maharaj .
So kindly wake him up and let us have his Darshan.” This request flattered Vithoba and he immediately went and woke up Shri Gajanan Maharaj . The people got the Darshan, but it invited calamity for Vithoba.
Shri Gajanan got a stick and thrashed Vithoba severely with it and said, “You rascal, you have started business here, and if I tolerate you, I shall be guilty before God.
So I must punish you: Wine should not be treated as a sweet drink, poison should not be touched, and thieves should not be made friends.” Saying so, He knocked him again with the stick. Vithoba ran away and never returned again.
This is how the real saints behave. Hypocrites pose as saints, with the help of selfish people, and misguide the public. This is an antisocial act. Real saints will always try to eliminate such elements from society.
A chaste lady will not like a prostitute as a neighbor; gold will not like the ornaments of aluminium. Saints may accept bad people, but will not give them importance.
It is so because the saints realise that these people are sufferers because of their sins of previous life. It is just like the earth, which allows a prickly-pear to grow along with Mogra.
Mogra and prickly-pear are both the children of earth but they get different treatment. So also the saints will offer protection to all but have different values to individuals. Vithoba was most unfortunate.
He got the touch of a Saint’s feet, but unfortunately lost the same. He failed to understand the greatness of a saint. Had he realised it, he would have attained divine pleasure.
By sitting under the Kalpavriksha he desired for an ordinary pebble or asked for a coconut shell from Kamdhenu.
Nobody, in association with saint, should do like this. May this Gajanan Vijay Granth be a saviour to all devotees.
||SHUBHAM BHAVATU||
Here ends Chapter Three
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సౌందర్య లహరి - 65 / Soundarya Lahari - 65 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
65 వ శ్లోకము
*🌴. సర్వ కార్యములలో జయం కొరకు, వాక్శుద్ధి 🌴*
శ్లో: 65. రణే జిత్వాదైత్యానపహృతశిరస్త్రైః కవచిభిర్ని వృత్తైశ్ఛణ్దాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః
విశాఖేన్ద్రోపేన్ద్రై శ్శశివిశద కర్పూర శకలాః*
విలీయ న్తే మాత స్తవ వదన తామ్బూలకబళాః
🌻. తాత్పర్యం :
అమ్మా ! సమరమున రాక్షసులను జయించి వచ్చి తలపాగాలను తొలగించి , కవచములని తొలగించని వారునూ చండుడు అను ప్రమధునిచే అనుభవింపదగిన హర నిర్మాల్యమునందు విముఖులయిన వారునూ అగు కుమారస్వామి, ఇంద్రుడు,విష్ణువు మొదలగువారిచే చంద్రుని వలె స్వచ్ఛమయిన, నిర్మలములు అయిన నీ ముఖమునందలి తాంబూలపు ముద్దలు గ్రహించబడు చున్నవి. కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె నివేదించినచో సర్వ కార్యములలో జయం, వాక్శుద్ధి లభించును అని చెప్పబడింది.
*🌹 SOUNDARYA LAHARI - 65 🌹*
📚. Prasad Bharadwaj
Sloka - 65
*🌴 Victory in all worjs and Control over Words 🌴*
65. Rane jithva'daithyan apahrutha-sirastraih kavachibhir Nivrittais Chandamsa-Tripurahara-nirmalva-vimukhaih; Visakh'endr'opendraih sasi-visadha-karpura-sakala Viliyanthe maatas tava vadana-tambula-kabalah.
🌻 Translation :
Oh mother of the world, the lords Subrahmanya, Vishnu and Indra, returning and resting after the war with asuras have removed their head gear, and wearing the iron jackets, are not interested in the left over, after the worship of Shiva ,which belongs to chandikeswara, and are swallowing with zest, the half chewed betel, from your holy mouth, which has the camphor as white as the moon.
🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering honey as prasadam, it is believed that they will be achieve success in all efforts.
🌻 BENEFICIAL RESULTS:
Success in life, promotes intelligence.
🌻 Literal Results:
Influence in high circles and among prominent people.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 364 / Bhagavad-Gita - 364 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 12, 13 🌴
12. అర్జున ఉవాచ
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ||
13. ఆహుస్త్వామృషయ: సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాస: స్వయం చైవ బ్రవీషి మే ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు
ఇట్లు పలికెను: నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్త్వమువు,
శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుకలేనివాడవు, ఘనమైనవాడవు
అయియున్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహాఋషులందరును
నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధ్రువపరచియున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే
విషయమున నాకు తెలియజేయుచున్నావు.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు
ఈ రెండు శ్లోకములలో ఆధునిక తత్త్వవేత్తలకు ఒక అవకాశమొసగుచున్నాడు.
భగవానుడు జీవాత్మకు భిన్నుడని ఇచ్చట స్పష్టముగ విశదమగుటచే అందులకు కారణము.
ఈ
అధ్యాయపు ముఖ్యమైన నాలుగుశ్లోకములను శ్రవణము చేసినంతనే అర్జునుడు
సర్వసందేహముల నుండి ముక్తుడై శ్రీకృష్ణుని పూర్ణపురుషోత్తముడైన ఆదిదేవునిగా
అంగీకరించెను. కనుకనే అతడు “నీవే పరబ్రహ్మమువు మరియు ఆదిదేవుడవు” అని
ప్రకటించెను. సమస్తము తన నుండియే ఉద్భవించినదనియు మరియు దేవ, మనుష్యాది
జీవులందరును తన పైననే ఆధారపడినవారనియు శ్రీకృష్ణుడు పూర్వమే
ప్రకటించియున్నాడు.
కాని వారు అజ్ఞానకారణముగా
తమనే పరతత్త్వముగా భావించుచు తాము దేవదేవునికి ఆధీనులము కామని భావింతురు.
అట్టి అజ్ఞానము భక్తియుతసేవ ద్వారా సంపూర్ణముగా తొలగునని శ్రీకృష్ణభగవానుడు
గడచిన శ్లోకములలో వివరించియున్నాడు.
ఇప్పుడు ఆ
భగవానుని కరుణచే అర్జునుడు వేదానుసారముననే అతనిని పరతత్త్వముగా
అంగీకరించుచున్నాడు. అనగా శ్రీకృష్ణుడు తన స్నేహితుడు కనుక అతనిని
పరతత్త్వమనియు, దేవదేవుడనియు అర్జునుడు ముఖస్తుతి చేయుటలేదు. కేవలము
వేదానుసారమే అతడట్లు కీర్తించెను. అర్జునుడు ఈ రెండు శ్లోకములలో
పలికినదంతయు వేదములచే నిర్దారింపబడినది.
భక్తియుతసేవను
చేపట్టినవాడే శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనగలడుగాని ఇతరులు అందుకు
సమర్థులు కారని వేదములు ద్రువీకరించుచున్నవి. అనగా అర్జునుడు పలికిన
ప్రతిపదము కూడా వేదనిర్దేశముచే సమర్థింపబడుచున్నది.
పరబ్రహ్మము
సర్వమునకు ఆశ్రయస్థానమని కేనోపనిషత్తు నందు తెలుపబడినది. అందుకు
తగినట్లుగా శ్రీకృష్ణుడు సమస్తము తననే ఆశ్రయించియున్నదని పూర్వమే
పలికియున్నాడు. సర్వమునకు ఆధారభూతుడైన భగవానుడు తననే సదా చింతించువానికి
మాత్రమే అనుభూతుడగునని ముండకోపనిషత్తు ధ్రువపరచుచున్నది.
అట్లు
కృష్ణుని గూర్చి సదా చింతించుటయే నవవిధభక్తిమార్గములలో ఒకటైన స్మరణము.
శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ ద్వారానే మనుజుడు తన నిజస్థితినెరిగి
భౌతికదేహము నుండి విడివడగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 364 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 12, 13 🌴
12. arjuna uvāca
paraṁ brahma paraṁ dhāma
pavitraṁ paramaṁ bhavān
puruṣaṁ śāśvataṁ divyam
ādi-devam ajaṁ vibhum
13. āhus tvām ṛṣayaḥ sarve
devarṣir nāradas tathā
asito devalo vyāsaḥ
svayaṁ caiva bravīṣi me
🌷 Translation :
Arjuna
said: You are the Supreme Personality of Godhead, the ultimate abode,
the purest, the Absolute Truth. You are the eternal, transcendental,
original person, the unborn, the greatest. All the great sages such as
Nārada, Asita, Devala and Vyāsa confirm this truth about You, and now You
Yourself are declaring it to me.
🌹 Purport :
In
these two verses the Supreme Lord gives a chance to the Māyāvādī
philosopher, for here it is clear that the Supreme is different from the
individual soul.
Arjuna, after hearing the
essential four verses of Bhagavad-gītā in this chapter, became
completely free from all doubts and accepted Kṛṣṇa as the Supreme
Personality of Godhead. He at once boldly declares, “You are paraṁ
brahma, the Supreme Personality of Godhead.”
And
previously Kṛṣṇa stated that He is the originator of everything and
everyone. Every demigod and every human being is dependent on Him. Men
and demigods, out of ignorance, think that they are absolute and
independent of the Supreme Personality of Godhead.
That
ignorance is removed perfectly by the discharge of devotional service.
This has already been explained in the previous verse by the Lord. Now,
by His grace, Arjuna is accepting Him as the Supreme Truth, in
concordance with the Vedic injunction.
It
is not that because Kṛṣṇa is Arjuna’s intimate friend Arjuna is
flattering Him by calling Him the Supreme Personality of Godhead, the
Absolute Truth. Whatever Arjuna says in these two verses is confirmed by
Vedic truth.
Vedic injunctions affirm that only
one who takes to devotional service to the Supreme Lord can understand
Him, whereas others cannot. Each and every word of this verse spoken by
Arjuna is confirmed by Vedic injunction.
In the
Kena Upaniṣad it is stated that the Supreme Brahman is the rest for
everything, and Kṛṣṇa has already explained that everything is resting
on Him.
The Muṇḍaka Upaniṣad confirms that the
Supreme Lord, in whom everything is resting, can be realized only by
those who engage constantly in thinking of Him.
This
constant thinking of Kṛṣṇa is smaraṇam, one of the methods of
devotional service. It is only by devotional service to Kṛṣṇa that one
can understand his position and get rid of this material body.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 191 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴*
42. అధ్యాయము - 17
*🌻. గుణనిధి చరిత్ర - 4 🌻*
గృహేsపి శిష్యాన్ పశ్యైతాన్ పితుస్తే వినయోచితాన్ | రాజాపి శ్రోష్యతి యదా తవ దుశ్చేష్టితం సుత || 29
శ్రద్దాం విహాయ తే తాతే వృత్తిలోపం కరిష్యతి | బాలచేష్టితమేవైత ద్వదంత్యద్యాపి తే జనాః || 30
అనంతరం హరిష్యంతి యుక్తాం దీక్షిత తామిహ | సర్వేsప్యాక్షారయిష్యంతి తవ తాతం చ మామపి || 31
మాతుశ్చరింత్రం తనయో ధత్తే దుర్భాషణౖరితి | పితాపి తే న పాపీయాన్ శ్రుతిస్మృతి పథానుగః || 32
మన ఇంటిలో గల నీ తండ్రి గారి శిష్యులను, వారి వినయమును చూడము. కుమారా! నీ చెడు ప్రవృత్తిని గురించి రాజు గారికి తెలియగలదు (29).
అపుడు
వారికి నీ తండ్రి యందు శ్రద్ధ తొలగి పోయి, మన జీవికకు ముప్పు రాగలదు.
జనులీనాటికీ నీచేష్టలను చిన్న కుర్రవాని చేష్టలనియే భావించుచున్నారు (30).
కాని వారు కొద్ది కాలములోనే మీ తండ్రిగారి దీక్షితత్వమును రద్దు చేయగలరు. జనులందరు తండ్రిని, నన్ను కూడ నిందించెదరు (31).
'తల్లి
శీలము కుమారునకు సంక్రమించును' ఇత్యాది దుర్భాషలాడెదరు. శ్రుతిస్మృతులు
విధించిన మార్గములో జీవించు నీ తండ్రి పాపము నెరుంగడు (32).
తదంఘ్రి లీన మనసో మమ సాక్షీ మహేశ్వరః | న చర్తు స్నాతయాపీహ ముఖం దుష్టస్య వీక్షితమ్ || 33
అహో బలీయాన్స విధిర్యేన జాతో భవానితి | ప్రతిక్షణం జనన్యేతి శిక్ష్యమాణోsతి దుర్మతిః|| 34
న తత్యాజ చ తద్ధర్మం దుర్బోధో వ్యసనీ యతః | మృగయా మద్యపైశున్యా నృత చౌర్య దురోదరైః || 35
స వారదారై ర్వ్యసనైరేభిః కోత్ర న ఖండితః | యద్యన్మధ్య గృహే పశ్యేత్తత్త న్నీత్వా సుదుర్మతిః || 36
అర్పయేద్ద్యూతకారాణాం సకుప్యం వసనాదికమ్ |
నేను
ఆయన పాదములయందు లగ్నమైన మనస్సు గలదానను. నాకు మహేశ్వరుడు సాక్షి. నేను
ఋతుస్నానమును చేసిన తరువాత దుష్టుల ముఖమునైననూ చుడలేదు (33).
నీవు
నా కుమారుడవగుట విధి బలీయమనుటకు నిదర్శనము. ఈ విధిముగా ఆ తల్లి ఆతనికి
ఎన్నో సార్లు బోధించిననూ, అతి దుష్టుడగు ఆతడు తన చెడు తిరుగుళ్లను వీడలేదు
(34).
వ్యసనములకు బానిసయైన వ్యక్తికి బోధించుట దుస్సాధ్యము. వేట , మద్యపానము, కొండెములు చెప్పుట, అసత్యమును పలుకుట, చౌర్యము, జూదము (35),
వేశ్యాగమనము అను వ్యసనములచే పతితుడు కాని వాడెవ్వడు? దుష్టుడగు నాతడు ఇంటిలో కనబడిన వస్తువులనన్నిటినీ (36),
గిన్నెలు వస్త్రములతో సహా, జూదగాళ్లకు అర్పించెడివాడు.
న్యస్తాం రత్నమయీం గేహే కరస్య పితురూర్మికా మ్ || 37
చోరయిత్వై కదాదాయ దురోదరకరేsర్పయత్ | దీక్షితేన పరిజ్ఞాతో దైవాద్ద్యూతకృతః కరే || 38
ఉవాచ దీక్షితస్తం చ కుతో లబ్దా త్వయోర్మికా | పృష్టస్తేనాథ నిర్బంధాదసకృత్తమువాచ సః || 39
మామాక్షిపసి విప్రోచ్చైః కిం మయా చౌర్యకర్మణా | లబ్ధా ముద్రా త్వదీయేన పుత్రేణౖవ సమర్పితా || 40
మమ మాతుర్హి పూర్వేద్యుర్జిత్వా నీతో హి శాటకః | న కేవలం మమైవై త దంగులీయం సమర్పితమ్ || 41
ఒకనాడు, ఆతడు, తండ్రి తన వ్రేలి రత్నపు ఉంగరమును ఇంటిలో నుంచగా (37)
దానిని అపహరించి జూదగానికి అర్పించెను. దైవ వశమున దీక్షితుడు ఆ జూదగానిచేతికి గల తన ఉంగరమును గుర్తించి ఆతనితో నిట్లు పలికెను. (38)
నీకీ ఉంగరము ఎక్కడ నుంచి వచ్చినది? ఆయన వానిని నిర్బంధముతో అనేక పర్యాయములిట్లు ప్రశ్నించగా, ఆతడిట్లనెను (39).
హే
విప్ర! నన్ను బలముగా ప్రశ్నించుచున్నావు. నేను చౌర్యము చేసి ఈ ఉంగరమును
సంపాదించితి ననుకొంటివా? దీనిని నీ కుమారుడే నాకు ఇచ్చినాడు (40).
ఆతడు నాకు సమర్పించినది ఈ ఉంగరము మాత్రమే కాదు. మొన్న ఆతడు తన తల్లియొక్క చీరను జూదములో పోగొట్టుకొనెను (41).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 66 🌹*
Chapter 18
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj
*🌻 Though He Suffers He Forgives - 3 🌻*
The
Avatar works to remove the heap of thorns that are produced by
unnatural actions so that the path toward Truth can become clear.
Whenever he is met with
resentment
as he works to remove the thorns of unnaturalness, he suffers. His
nature is mercy; he comes on earth to forgive all. He forgives
individuals by changing them, and this is a sanskaric change, and
since he is always met with resentment, he suffers.
Though he suffers as a result of one's resistance and resentment, his work does not fail.
Sanskaras
are wiped out. People change because of his forgiveness, for his
forgiveness was in his actions that removed their thorns.
To
wipe out the heaps of entangled thorns in the world, to forgive the
sins of mankind, the Avatar has to work infinitely, and because he is
met with resentment and resistance from the whole world, he suffers
infinitely and thus he is crucified.
It is
the world's resentment of him that is his crucifixion, and this means
his work is finished. By his suffering crucifixion from the resentment
of mankind, the world's resistance is wiped away in his forgiveness.
When
the world's resistance is wiped out, mankind will see Meher Baba as the
way to the path of Truth. The time of the world turning to him, and
receiving his forgiveness, is the time of his manifestation.
This
means that mankind rids itself of its own unnatural tendencies. In
order to Forgives the sins of the world, and manifest as its Savior, the
Avatar has to work and suffer crucifixion.
But
though he is crucified, he never punishes anyone. At last through his
own crucifixion, the All-Merciful knows his work of forgiveness is
finished.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 62 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 27
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. దీక్షా విధి - 3 🌻*
శిఖాన్తసంమితం సూత్రం పాదాఙ్గష్ఠాది షడ్గుణమ్ | కన్యయా కర్తితం రక్తం పునస్తత్త్రిగుణీకృతమ్. 23
యస్యాం సంలీయతే విశ్వం యయా వశ్వం ప్రసూయతే |
ప్రకృతిం ప్రక్రియాభేదైః సంస్థితాం తత్ర చిన్తయేత్. 24
పాదాంగుష్ఠము
మొదలు శిఖ వరకు పొడవు గల ఆరు పేట్ల ఎఱ్ఱటి దారమును కన్యచేత భేదింపచేసి,
మరల దానిని మూడు పేటలు చేసి, దానిపై, ఏ ప్రకృతిలో విశ్వము లీనమగునో,
దేనినుండి జనించునో అట్టి ప్రకృతిని వివిధ ప్రక్రియలతో భావన చేయవలెను.
తేన ప్రాకృతికాన్ పాశాన్ గ్రథిత్వాతత్త్వసంఖ్యాయా | కృత్వాశరావేతత్సూత్రం కుణ్డపార్శ్వే నిధాయతు.
తతస్తత్త్వాని సర్వాణి ధ్యత్వా శిష్యతనౌ న్యసేత్ | సృష్టిక్రమాత్ప్రకృత్యాది పృథివ్యన్తాని దేశికః 26
ఆ
సూత్రముతో, ఎన్ని తత్త్వము లున్నవో అన్ని ప్రాకృతికపాశములను ముడివేసి,
దానిని మూకుడులో అగ్ని కుండపార్శ్వమునందుంచి, గురువు, ప్రకృతి మొదలు పృథివి
వరకున ఉన్న ఆ తత్త్వములను స్పష్టిక్రమానుసారము ధ్యానించుచు శిష్యుని
శరీరముపై న్యాసము చేయవలెను.
తత్త్రెకధా పఞ్చధా స్యాద్ధశ ద్వాదశధాపి వా| వాతవ్యః సర్వభేదేన గ్రథితస్తత్త్వచిన్తకైః 27
అఙ్గైః పఞ్చభిరధ్వానం నిఖిలం వికృతిక్రమాత్ | తన్మాత్రాత్మని సంహృత్య మాయాసూత్రే పశోస్తనౌ. 28
వికృతుల
క్రమము ప్రకారము నిఖిలమార్గమును పంచాంగములతో, తన్మాత్రాత్మకమగు
మాయాసూత్రమైన పశువు శరీరమునందు ఉపసంహరించి, తత్త్వచింతకులు అచట ఐదు, పది,
లేదా పండ్రెండు విధములచే ఆ గ్రథితమైన సూత్రమున పర్వ భేదముచే ఇవ్వవలెను.
ప్రకృతిర్లిఙ్గశక్తిశ్చ కర్తా బుద్ధి స్తథామనః| పఞ్చ తన్మాత్రబుద్ధ్యాఖ్యం కర్మాఖ్యం భూతపఞ్చకమ్. 29
ధ్యాయేచ్చ ద్వాదశాత్మానం సూత్రే దేహే తథేచ్ఛయా| హుత్వా సంపాతవిధినా సృష్టేః సృష్టిక్రమేణ తు. 30
ఏకైకశతహోమేన దత్త్వా పూర్ణాహుతిం తతః| శరావే సంపుటీకృత్య కుంభేశాయ నివేదయేత్. 31
తన
ఇచ్ఛననుసరించి, సూత్రమునందును, దేహమునందును - ప్రకృతి, లింగశక్తి కర్త,
బుద్ధి, మనస్సు తన్మాత్రలు, జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములు పంచభూతములు -
వీటినన్నింటిని, ద్వాదశాత్మను ధ్యానించవలెను.
సృష్ట్యనులోమవిలోమ
క్రమములచే ఒక్కొక్క శతము హోమములు చేసి, పిమ్మట పూర్ణాహుతి ఇచ్చి, మూకుడులో
సంపుటముగా చేసి, కుంభీశునకు నివేదనము చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 77 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. అష్టావక్ర – సుప్రభ - 1 🌻*
వంశము: ఏక పాదుడు (తండ్రి), సుజాత (తల్లి)
భార్య(లు): సుప్రభ
కుమారులు/కుమార్తెలు:
కాలము: త్రేత, ద్వాపర యుగం,
భౌగోళిక ప్రాంతములు: హిమాలయాలు, కదంబవనం, ద్వారక
నదులు:
బోధనలు/గ్రంధాలు: అష్ఠావక్రసంహిత, అష్ఠావక్రగీత
🌻. జ్ఞానం:
1.
“అష్ఠావక్రసంహిత” అది నిర్గుణమైన బ్రహ్మ వస్తువును ప్రతిపాదిస్తుంది. ఒక
మార్గం, గమ్యస్థానం ఏమీ ఉండవని ప్రతిపాదన. ఎందుకు ఉండదు అంటే,
“బ్రహ్మవస్తువును చేరటానికి నీవు బ్రహ్మేతర పదార్ధమయితే నీవు ఎన్నడూ
చేరలేవు. బ్రహ్మేతర పదార్ధం కాకపోతే నువ్వు బ్రహ్మవే అన్నమాట. అప్పుడిక
చేరటమనేది లేదు” అని అర్ధం.
2. మిధ్యాభూతమయిన
శరీరము, మిధ్యాభూత మయినటువంటి మనస్సు, ఇంద్రియములు ఇవేవో మనను
బాధిస్తున్నట్లు ఒక భావన; వీటితో సాధనతో మనుష్యుడు ఈశ్వరుడనే
గమ్యస్థానానికి చేరుకోవడం ఇవన్నికూడా మిథ్య అయినప్పుడు, సర్వసాధనలు
మిథ్యమాత్రమే అవుతాయి.
3. ‘అష్ఠావక్రసంహిత’లో కూడా గమ్యస్థానాలే లేవని, అంతా బ్రహ్మమయమే అని ఆయన చెప్పాడు.
రాధాదేవి అంటే ఎవరు? ఒక సిద్ధాంతం ఎలా ఉందంటే – కృష్ణుడు కేవలం విష్ణు అంశమాత్రమే కాదు.
4.
గోలోకాధిపతియైన రాధాకృష్ణులిద్దరు ఉన్నారు. వాళ్లిద్దరూ పరాశక్తి,
పరమపురుషుడు. విష్ణువు గోలోకానికి క్రిందుగా ఉండేటువంటి విష్ణులోకాన్ని
పరిపాలిస్తాడు. అన్ని లోకాలపైన గోలోకం ఉంది.
5.
అక్కడ పరమపురుషుడు, పరతత్వమైనటువంటి ప్రకృతి ఈఇద్దరూ కృష్ణుడు, రాధ అనే
రూపాలలో ఉంటారు. ఆ గోలోకం సమస్త దేవతలకు, జీవులకు గమ్యస్థానము.
6..అక్కడ
ఆ లోకంలో ఉన్న కృష్ణుడి యొక్క అంశయే ఈ ద్వాపరాయుగంలోని కృష్ణుడుకాని,
విష్ణువు కాదు అని ఆ సిద్ధాంతం. విష్ణువుయొక్క అవతారమే బలరాముడే! అందుకనే
ఎనిమిదో అవతారంగా బలరాముడే అవతరించాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 9 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴*
*🌻 STANZA II - The Knowledge of the Heart - 4 🌻*
19.
The Sun, too, was endeavouring to give all that he could. He tirelessly
warmed the ever-cooling Hearts in his rays of Love. The Sun wished to
apply the full force of his energizing currents to restore human souls
to Life. He did not blame people for having lost the Gift — their
ability to love. For the Star himself, the most important thing was
Love.
Therefore, he kept on blazing with
greater and greater fervour, so that the Fire- breathing Warmth of his
Heart would be enough for all... He was ready to enter into every breast
and ascend from the depths of the Earth in the form of billions of tiny
lights, which would scatter like stars and delight Eternity with their
munificent currents of Love.
But to that end
it was necessary to find such people capable of accepting the mighty
Warmth of Heaven, unafraid of being burnt alive in the Fire-breathing
Flame of Love. To become the Sun — this was something only man could
wish for. So, day by day, the Sun circled the Earth in search of him...
The
Gods were turning the Wheel and winding up the mainspring, which was
merging with the powerful spirals of the new currents being sent to the
Sun’s aid.
They were proclaiming the beginning of a New Era, which would be experienced under the Sign of Fiery Love.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మనోశక్తి - Mind Power - 80 🌹*
*Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. Q 77:-- సౌర వర్ణ వ్యవస్థ - 1 🌻*
*(system of solar spectrum)*
Ans :--
1) సౌరవ్యవస్థ అనగా సూర్యుడు, సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు అని అర్థం.
ఈ విశ్వంలో ఎన్నో కోటానుకోట్ల సౌరవ్యవస్థలు ఉన్నాయి. అందులో మానవుడు ఒక సౌరవ్యవస్థ ను మాత్రమే కనుగొన్నాడు.
2) ఒక సౌరవ్యవస్థకు సంబంధించిన కొన్ని లక్షల వర్ణవ్యవస్థలను మన అతీంద్రియాల ద్వారా మనం చూడవచ్చు.
3)
ఒక సౌరవ్యవస్థ లో విద్యుదయస్కాంత తరంగాలు ఒక range లో ఉంటాయి. మనము ఇతర
జంతుజాతి ఒక సౌరవ్యవస్థలో ఒక range లో ఉన్న విద్యుదయస్కాంత తరంగాల వలయంలో
ఉన్నాము.
4) వేరే range లో,వేరే విద్యుదయస్కాంత
తరంగాల వలయంలో ఉన్న జీవజాతులు,వాటి దేహాలు మనకు కనిపించవు. మానవుడు
కనిపెట్టిన ఏ శాస్త్రపరికరాలు వాటిని పసిగట్టలేవు.
5) భూమి యొక్క చైతన్యశక్తి range ని బట్టి భూమిపై జీవించే జీవరాసులు, వాటి అణువుల నిర్మాణం, కాంతి విలువలు ఉంటాయి.
6) ఒక్కొక్క సౌరవర్ణవ్యవస్థలో ఒక్కొక్క range కి తగ్గ విద్యుదయస్కాంత తరంగాల వలయాలు ఉంటాయి.
7)
ఒక్క భూమి మీదే కొన్ని కోట్ల సౌరవర్ణవ్యవస్థలు వున్నప్పుడు ఒక galaxy లో
ఎన్ని ఉంటాయో ఆలోచించండి. ఇది మన మానవుని ఇంటెలిజెన్స్ కి అందేది కాదు.
8)
ఒక సౌరవర్ణవ్యవస్థ లో ఈ వ్యవస్థ కు తగ్గట్టు చైతన్యశక్తి,కోడ్ లాంగ్వేజ్
ఉంటాయి. ఎలా అయితే ఇండియాలో ప్రతి స్టేట్ కి language ఉన్నట్లు, అలాగే
ప్రతి లోకానికి దానికి సంబంధించి లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లోకానికి సంబంధించిన
information అంతా code language రూపంలో ఆకాశిక్ record లో పొందుపరచబడి
ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 5 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 5 🌻*
10. ఉండి “లేని” స్థితి (శూన్యము, ఆకాశము, అభావము)
లేకుండి “ఉన్న” స్థితి (సృష్టి) ఆభాసము.
ఉదా:-
* క్షీరములలో - పెరుగు, మజ్జిగ, వెన్న, నేయి అంతర్నిహితమై యుండి, బాహ్యమునకు లేకున్నవి.
* తంత్రిలో - శబ్దము అంతర్షిహితమై లేనట్టుగా ఉన్నది.
* చెకుముకి జాతిలో - అగ్ని అంతర్షిహితమైలేనట్టుగా ఉన్నది.
* విత్తనములో - వృక్షము అంతర్షిహితమై లేనట్టుగా ఉన్నది.
* వీర్యకణములో - సర్వాంగ సుందరమైన స్థూలశరీరము అంతర్నిహితమై
లేనట్టుగా ఉన్నది.
* గ్రామఫోను రికార్డులో - సంగీతము, వాద్యధ్వనులు అంతర్నిహితములై
లేనట్లుగా ఉన్నవి.
11. పరాత్పర స్థితిలో - సమస్తము అభావమై ఉన్నవి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 142 🌹*
✍️ Nisargadatta Maharaj
📚. Prasad Bharadwaj
*🌻 HOW AM I TO KNOW IF THERE IS ANY PROGRESS IN MY SPIRITUAL SEARCH? 🌻*
One of the foreign visitors, who had been coming to Maharaj for quite some time, began quietly:
Perhaps
I am speaking from a body-mind identity but there is a question, a
problem, which has been troubling me for so long that I cannot keep it
bottled up any longer.
I have talked about it
to some of the seekers here and I know that they too have the same
problem. However, now I am not speaking for them but only for myself.
The problem is: How am I to know if there is any progress in my spiritual search?
Occasionally,
particularly during meditation, I do have a glimpse of what I am
searching for, but only a glimpse and that too only on rare occasions.
How am I to know if I am progressing?
Maharaj :
The problem apparently is about 'progress'. Now, who is to make the
progress, and progress towards what? I have said this repeatedly and
untiringly that you are the Conscious Presence, the animating
consciousness which gives sentience to phenomenal objects; that you are
not a phenomenal object, which is merely an appearance in the
consciousness of those who perceive it.
How
can an 'appearance' make any 'progress' towards any objective? Now,
instead of letting this basic apperception impregnate your very being,
what you do is to accept it merely as an ideological thesis and ask the
question.
How can a conceptual appearance know whether it is making any conceptual progress towards its conceptual liberation?
Maharaj took a match box in his hand and held it up. He asked: Is this you? Of course not.
Does
it need time to understand this? Apperception of this fact is
immediate, is it not? Why then should it take time to apperceive that
you are not the phenomenal object called the body-mind?
Remember, you are the animating consciousness that gives sentience to the phenomenal objects.
Please understand, said Maharaj, that apperception is prior to the arrival of consciousness which is the basis of intellect.
Apperception
is not a matter of gradual practice. It can only happen by itself
instantaneously — there are no stages in which deliberate progress is
made. There is no 'one' to make any progress.
Perhaps,
one wonders, could it be that the surest sign of 'progress' — if one
cannot give up the concept — is a total lack of concern about 'progress'
and an utter absence of anxiety about anything like 'liberation', a
sort of' 'hollowness' in one's being, a kind of looseness, an
unvolitional surrender to whatever might happen?
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 26 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. హైదరాబాద్ నవాబుకు వినిపించిన కాలజ్ఞానం - 1 🌻*
అప్పుడు
బ్రహ్మంగారు జోస్యం చెప్పారు. అదే జగత్ప్రసిద్ధమైన కాలజ్ఞానం. నేను శ్రీ
వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగటానికి
ముందు అనేక ఉత్పాతాలు, విపరీత సంఘటనలు కనిపిస్తాయి.
కాశీ
అవతల గండకీనదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి. మనుషులతో మాట్లాడతాయి.
నదుల్లో దేవతా విగ్రహాలు దొరకటం ఎన్నోసార్లు జరుగుతూనే ఉంది కదా! అలా
వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అనేక వాక్కులు ఇప్పటికి ఎన్నో జరిగి, యదార్థ
సంఘటనలుగా కళ్ళముందు నిలిచాయి.
ప్రయాగ తీర్థంలో చాలామంది మరణించగా, కొద్దిమంది బతుకుతారు.
ప్రయాగ హిందువులకుపుణ్యతీర్థము. ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారు అని దీనికి అర్థం అయి వుండవచ్చు.
సరస్వతీ దేవిని దుకాణాలలో అమ్ముతారు.
చదువుకోవడం
కంటే చదువు కొనడమే జరుగుతోంది. నిజంగానే విద్య అమ్మకపు వస్తువు అయింది.
కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణుల్ని చేసే స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. అదీ
వీలవకుంటే తిన్నగా వెళ్ళి సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా
పుష్కలంగా ఉన్నట్టు ఎన్నోసార్లు వార్తలు వింటున్నాం. కనుక బ్రహ్మంగారు
చెప్పినట్లు సరస్వతిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు.
మూసీనది
పొంగి నగరాన్ని ముంచేస్తుంది. ఆ వరదలలో ప్రజలు మరణిస్తారు.అనంతరం నీ
వంశీయులు ఈ పట్టణాన్ని తిరిగి బాగు చేస్తారు. నీ సామ్రాజ్యమున గల అడవులు
ఫలవంతంగా మారతాయి.పల్లెలు పట్నాలుగా మారతాయి. చంద్రమతీ దేవి కళలు
తొలగిపోతాయి.
హైదరాబాదు విషయంలో ఈ వాక్కు రూఢి
అయింది. 1908 లో మూసీ నదికి వరదలు వచ్చాయి. 6వ నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్
సమక్షంలో దానికి పరిష్కారం దొరికింది. హైదరాబాదు నగరం తిరిగి బాగుపడింది. ఆ
తర్వాత పెను వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా పోయింది. మరి
బ్రహ్మంగారి మాటలు అక్షర సత్యాలు అయినట్లే కదా!
స్త్రీలు పర పురుషులతో యదేఛ్చగా తిరుగుతారు.
ఈ
విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే స్త్రీ, పురుషులలో
కామ వాంఛ పెరిగి, వావి వరుసలు మాయమైపోతాయని అర్థం. తనను తాను
తెలుసుకోగలిగిన యోగులకే నా దర్శనమవుతుంది.
ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు.
ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే కలగదు. ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతోంది. మున్ముందు తులం బంగారం లక్షకు చేరుతుంది.
ఇప్పటి
పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘ కాలం కూడా అక్కరలేదు అనిపిస్తోంది.
బహుశా వందేళ్ళ తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి మాటలు నిజమై ముత్యమంత బంగారం
కూడా దొరక్కపోవచ్చు.
సశేషం
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 20 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 8 🌻*
నచికేతా!
ప్రపంచములో ఎక్కువమందిని ఆకర్షించునటువంటిన్ని, ఎక్కువమంది
కోరుకొనునటువంటిన్ని పుత్ర-పౌత్రులను, ప్రియమును కలుగజేయు స్త్రీలను, ధన
కనక వస్తు వాహనములను, ఎన్నింటినో నీకిచ్చెదనని నిన్ను మాటిమాటికి
ప్రలోభపెట్టినను నీవు వాటినన్నిటిని వదలిపెట్టితివి. నీ బుద్ధి
చాతుర్యమునకు ఆశ్చర్యపడుచుంటిని.
అధిక
సంఖ్యాకులగు సామాన్య మానవులు ధన కనక వస్తు వాహనములను సంపాదించవలెననెడి
వ్యామోహములో పడి దుఃఖముల పాలగుచున్నారు. నీవు వానిని కోరవైతివి.
వానిలోనుండు దోషములను గుర్తించిన నీ జన్మ ధన్యము. సంసారిక సుఖములకు లోబడని
నీ వంటివారే ఆత్మ జ్ఞానమునకు అర్హులు.
ఇతరత్రములైనటువంటి జగద్వ్యాపారములకు సంబంధించినటువంటి వాటి యందు ఆసక్తి
ఎవరికైతే వుందో, ఆ మోహం ఎవరికైతే వుందో వారికి ఈ ఆత్మ విషయైక జ్ఞానమునందు
ఆసక్తి కలుగదు. అంటే అర్ధం ఏమిటటా? ప్రతి జీవికి కూడా, జీవులందరికీ కూడా,
సామాన్యధర్మం ఏమిటంటే వారివారి ఇంద్రియములు ఇంద్రియ విషయములందు ఆసక్తి
కలిగి ప్రవర్తించుట. ఇది సామాన్య విషయం.
కాని
మానవుడికి ఒక్కడికే ఈ ఇంద్రియాలను జయించ గలిగేటటువంటి సమర్ధత ఉంది. ఎట్లా?
అంటే అవి కోరినటువంటివాటిని వాటికి అందివ్వనివ్వకుండా, అందనీయకుండా,
అందించకుండా, నిరసిస్తూ తగుమాత్రముగా - దీనికి ఒక ఉపమానం చెప్తారు.
ఒక సింహాన్ని స్వాధీనపరచు కోవాలనుకోండి. ఎట్లా స్వాధీనపరచుకుంటావు అనేది
చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఇంద్రియములు ఎటువంటివట? ఆ సింహము వంటివట. వాటిని
స్వాధీనపరచుకోవాలి అంటే ఒక జూలో గానీ, ఒక సర్కస్ లో గానీ వాటిని
స్వాధీనపరచుకుంటారు.
సింహాలని, పులులని ఇలాంటి
క్రూరమృగాలని కూడా స్వాధీనపరచుకుంటారు. ఎట్లా స్వాధీనపరచుకుంటారట? వాటిని
పూర్తిగా ఆకలికి గురిచేస్తారు. అవి ఆకలితో నకనకనకలాడేట్లు చేస్తారు. చేసి,
కొద్దిపాటి ఆహారాన్ని పెడతారు. ఎందుకనిట అంటే పూర్తిగా ఆహారం పెట్టకపోతే
చనిపోతాయి.
కాబట్టి కొద్దిపాటి ఆహారం పెడతారు. ఆ
కొద్దిపాటి ఆహారంతో వాటికి సంతృప్తి కలుగదు. తీవ్రమైన అసంతృప్తి కూడా
కలుగుతుంది. అట్లా తీవ్రమైన అసంతృప్తికి లోనైనప్పుడు వాటికి
శిక్షణనిస్తారు. అంటే ఒక స్టూల్ ఎక్కి ఏనుగు కూర్చోవాలి. ఒక స్టూల్ ఎక్కి
సింహం కూర్చోవాలి. ఒక రింగ్ లో నించి పులి దూకాలి. అట్లా దూకేటట్లుగా
వాటిని కొడతారు.
వాటికి సంజ్ఞారూపకంగా సూచిస్తాడు. వాటికి మార్గ నిర్దేశం చేస్తాడు. అట్లా శిక్షణకి అవి లొంగితేనే వాటికి ఆహారం పెడుతాడు.
ఈ
రకంగా ఒక యమనియమాదులతో కూడినటువంటి శిక్షణకు లోనయ్యేట్లుగా ఇంద్రియములను
మనం స్వాధీనపరచుకోవాలి. అందువల్లనే యమనియమాలకి అత్యంత ప్రాధాన్యత
ఇవ్వబడింది.
ఆ రకంగా ఇంద్రియాలను
స్వాధీనపరచుకోవాల్సిన అవసరం వుంది. అట్లా ఎవరైతే ఇంద్రియములను
స్వాధీనపరచుకున్నారో, ఆ ఇంద్రియ జయం, జితేంద్రియత్వం కలిగిందో, వాళ్ళు
సంసారసుఖము నుంచి బయటపడతారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹