శివగీత - 23 / The Siva-Gita - 23

Image may contain: 3 people, text that says "Lord Rama"
🌹. శివగీత  - 23  / The Siva-Gita - 23 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 7 🌻

ఆత్మ న్యగ్నిం సమారోష్య - యాతే అగ్నేతి మంత్ర తం:,
భస్మా దాయాగ్ని రిత్యా ద్యై - ర్వి మృజ్యాం గాని సంస్పృశేత్?28

భస్మచ్చ న్నో ద్విజో వింద- మహా పాతక సంభ వై:,
పాపై ర్వి ముచ్యతే నిత్యం - ముచ్యతే న చ సంశయః  29

అగ్ని వీర్యం యతో భస్మ - వీర్య వాన్భ స్మ సంయుతః,
భస్మ స్నాన రతో విప్రో భస్మ - శాయీ జితేన్ద్రియా: 30

సర్వ పాప వినిర్ముక్తః - శివ సాయుజ్య మాప్నుయాత్,
ఏవం కురు మహారాజ - శివ నామ సహస్రకమ్ 31

ఇదంతు సంప్ర దాస్యామి - తేన సర్వ మవాప్స్యసి,
ఇత్యుక్త్యా ప్రద దౌతస్మై - శివ నామ సహస్రకమ్ 32

ఈ విభూతి వహ్ని వీర్య మగుటచేత సదా ఏ ద్విజ్నుడు ఇంద్రియ
 సంయమనము గలవాడై భస్మ స్నానాసక్తి యందుండి,  యా భస్మము లేనే పరుండి భస్మమును వీడి యుండడో  అట్టి వాడు సమస్త పాపముల నుండి విముక్తుడై  శివ సాయుజ్యమును బొందును.

 ఓయీ మహారాజా! రామచంద్రా! నీ వీ ప్రకారముగా ననుష్టిం చుము .
 శివ సహస్రనామములను నీకు బోధింతును. 

దీని ప్రభావము వలన నీవు సమస్త కోరికలను బొందగలవు. 

ఈ విధముగా నా అగస్త్య మహా మునీంద్రుడు ఉద్భవించి  శివ ప్రత్యక్ష దాయకమగు వేద సారాంశ శివ సహస్ర నామములను  శ్రీరామునకు బోధించిన వాడయ్యేను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 23 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
🌻 Viraja Deeksha Lakshana Yoga  - 7 🌻

Since this Vibhooti (holy ash) is Vahni­Veeryam, the one who subdues his senses, bathes his own body with this ash, sleeps in the ashes, and never leaves the ashes, such a person becomes freed of all kinds of sins and gets Sayujyam (becoming one) with Shiva. 

O great king Ramachandra! You follow this procedure.

 I would preach you Shivasahasranama (thousand names of Lord Shiva). With the effect of these divine names you can achieve all your dreams. Suta said: 

In this way that great sage preached Rama the thousand names of Shiva.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment