🌹 18, AUGUST 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 18, AUGUST 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 18, AUGUST 2023 FRIDAY శుక్రవారం, బృగువాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 415 / Bhagavad-Gita - 415 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 01 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 01 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 261 / Agni Maha Purana - 261 🌹 
🌻. శివ పూజాంగ హోమ విధి - 6 / Mode of installation of the fire (agni-sthāpana) - 6 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 127 / DAILY WISDOM - 127 🌹 
🌻 6. ప్రపంచం సంపూర్ణత మీద ఆధారపడి ఉంది / 6. The World is Based on the Absolute 🌻
5) 🌹. శివ సూత్రములు - 129 / Siva Sutras - 129 🌹 
🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -1 / 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam -1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 18, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మళయాల నూతన సంవత్సరం, Malayalam New Year 🌻*

*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 05 🍀*

*09. ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా ।*
*పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ ॥*
*10. అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ ।*
*పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పూర్ణయోగలక్ష్య విశిష్టత - పూర్ణయోగ లక్ష్యం భగవత్సాక్షాత్కారం మాత్రమే కాదు, భగవచ్చేతన అభివ్యక్తికి యోగ్యమై భగవత్కర్మ సాధనమయ్యే రీతిగా బహిరంగ అంతర్జీవనమును భగవదంకితం గావించి పరివర్తన మొందించడం. మామూలు యమ నియమాదుల కంటె ఎంతో కఠినతరమైన అంతరంగిక శిక్షణ దీనికి కావలసి వుంటుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల విదియ 20:03:17 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 22:58:31
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: శివ 20:28:21 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బాలవ 06:49:32 వరకు
వర్జ్యం: 04:58:40 - 06:46:36
దుర్ముహూర్తం: 08:31:42 - 09:22:24
మరియు 12:45:15 - 13:35:58
రాహు కాలం: 10:44:49 - 12:19:54
గుళిక కాలం: 07:34:39 - 09:09:44
యమ గండం: 15:30:04 - 17:05:09
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44
అమృత కాలం: 15:46:16 - 17:34:12
సూర్యోదయం: 05:59:33
సూర్యాస్తమయం: 18:40:15
చంద్రోదయం: 07:22:30
చంద్రాస్తమయం: 20:03:40
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,
ధన ప్రాప్తి 22:58:31 వరకు తదుపరి
శుభ యోగం - కార్య జయం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 415 / Bhagavad-Gita - 415 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 01 🌴*

*01. అర్జున ఉవాచ*
*మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |*
*యత్త్వయోక్తం వచస్తేన మోహో(యం విగతో మమ ||*

*🌷. తాత్పర్యం : అర్జునుడు పలికెను: ఈ పరమరహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు కరుణచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది.*

*🌷. భాష్యము : శ్రీకృష్ణుడు సర్వకారణకారణుడని ఈ అధ్యాయము తెలియజేయును. ఎవని నుండి భౌతికవిశ్వములు ఉద్భవించునో అట్టి మహావిష్ణువునకు శైత్యము అతడే కారణము. అట్టి శ్రీకృష్ణుడు అవతారము కాదు. సర్వావతారములకు కారణుడైన అవతారి. ఈ విషయము గడచిన అధ్యాయమున విశదముగా వివరింపబడినది. ఇచ్చట అర్జునుడు తన మోహము తొలగిపోయినట్లుగా పలికినాడు. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని సామాన్యమానవునిగా లేక తన స్నేహితునిగా భావించక, సర్వమునకు కారణమైనవానిగా తెలియగలిగినాడు. అతడు పరమ్ ఉత్తేజితుడై తనకు కృష్ణుని వంటి గొప్ప స్నేహితుడు లభించినందులకు పరమానందభరితుడైనాడు. కాని తాను శ్రీకృష్ణుని సర్వకారణకారణునిగా అంగీకరించినను ఇతరులు ఆ విధముగా ఆంగీకరింపరేమోనని అతడు యోచింప నారంభించెను.*

*కనుకనే శ్రీకృష్ణుని దివ్యత్వమును సర్వులకు విశదపరచుటకు అతడు తన విశ్వరూపమును చూపుమని ఈ అధ్యాయమున శ్రీకృష్ణుని ప్రార్థించెను. వాస్తవమునకు శ్రీకృష్ణుని విశ్వరూపము గాంచినపుడు ఎవరైనను అర్జునుని వలె భీతి నొందెదరు. కాని కరుణాంతరంగుడైన ఆ భగవానుడు విశ్వరూపమును చూపిన పిమ్మట తన మూలరూపమును పొందియుండెను. “నీ హితము కొరకు నేనిది ఉపదేశించుచున్నాను” అని పలుమార్లు శ్రీకృష్ణుడు పలికిన విషయమును సంపూర్ణముగా అంగీకరించిన అర్జునుడు అంతయు శ్రీకృష్ణుని కరుణ చేతనే జరుగుచున్నదని కృతజ్ఞతాపూర్వకముగా ఇచ్చట పలుకుచున్నాడు. అనగా శ్రీకృష్ణుడు సర్వకారణకారణుడనియు మరియు సర్వుల హృదయమునందు పరమాత్మరూపమున వసించియున్నాడనియు అర్జునుడు ఇప్పుడు సంపూర్ణ నిశ్చయమునకు వచ్చెను.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 415 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 01 🌴*

*01. arjuna uvāca*
*mad-anugrahāya paramaṁ guhyam adhyātma-saṁjñitam*
*yat tvayoktaṁ vacas tena moho ’yaṁ vigato mama*

*🌷 Translation : Arjuna said: By my hearing the instructions You have kindly given me about these most confidential spiritual subjects, my illusion has now been dispelled.*

*🌹 Purport : This chapter reveals Kṛṣṇa as the cause of all causes. He is even the cause of the Mahā-viṣṇu, from whom the material universes emanate. Kṛiṣṇa is not an incarnation; He is the source of all incarnations. That has been completely explained in the last chapter. Now, as far as Arjuna is concerned, he says that his illusion is over. This means that Arjuna no longer thinks of Kṛṣṇa as a mere human being, as a friend of his, but as the source of everything. Arjuna is very enlightened and is glad that he has such a great friend as Kṛṣṇa, but now he is thinking that although he may accept Kṛṣṇa as the source of everything, others may not. So in order to establish Kṛṣṇa’s divinity for all, he is requesting Kṛṣṇa in this chapter to show His universal form.*

*Actually when one sees the universal form of Kṛṣṇa one becomes frightened, like Arjuna, but Kṛṣṇa is so kind that after showing it He converts Himself again into His original form. Arjuna agrees to what Kṛṣṇa has several times said: Kṛṣṇa is speaking to him just for his benefit. So Arjuna acknowledges that all this is happening to him by Kṛṣṇa’s grace. He is now convinced that Kṛṣṇa is the cause of all causes and is present in everyone’s heart as the Supersoul.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 261 / Agni Maha Purana - 261 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 75*

*🌻. శివ పూజాంగ హోమ విధి - 6 🌻*

*పిమ్మట బాలకుడైన అగ్ని యొక్క ముఖమునందున్న నేత్రత్రయస్థానమున మూడు నేత్రముల ఉద్ఘాటనము చేయుటకై, ఘృతపూర్ణ మగు స్రువముతో "ఓం హామగ్నయే స్విష్టకృతే స్వాహా" అను మంత్రమునుచ్చరించుచు నాల్గవ ఆహుతి ఇవ్వవలెను., "ఓం హాం హృదయాయ నమః" ఇత్యాద్యంగ మంత్రములు ఆరును ఉచ్చరించుచు ఆజ్యమును అభిమంత్రించి, ధేనుముద్రతో మేల్కొల్పవలెను. కవచమంత్రముచే (హుం) ఆచ్ఛాదించి, శరమంత్రముచే ఘృతబిందూత్‌క్షేపణము చేసి, అభ్యుక్షణశోధనములు చేయవలెను. శివస్యరూప డగు అగ్ని యొక్క ఐదు ముఖములకు అభిఘూరహోమము, అనుసంధానహోమము, ముఖముల ఏకీకరణమునకై చేయు హోమమును చేయవలెను.*

*"ఓం హాం సద్యోజాతాయ స్వాహా, ఓం హాం వామదేవాయ స్వాహా, ఓం హాం అఘోరాయ స్వాహా, ఓం హాం తత్పురుషాయ స్వాహా, ఓం హాం ఈశానాయ స్వాహా" అను ఐదు మంత్రములచే, ఐదు ముఖములకొరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అజ్యాహుతిచేసి, ఆ ముఖములను అభిఘారము చేసిన ఆజ్యముతో అప్లావితము చేయవలెను. ఇది ముఖాభి ఘార హోమము. పిమ్మట రెండేసి ముఖములకు ఒక ఆహుతి ఇవ్వవలెను. ఇది ముఖానుసంధానమహోమము. దానిని_"ఓం హాం సద్యోజాత వామదేవాభ్యాం స్వాహా, ఓం హాం వామదేవా ఘోరాభ్యాం స్వాహా, ఓం హాం అఘోరతత్పురుషాభ్యాం స్వాహా, ఓం హాం తత్పురుషేశానాభ్యాం స్వాహా" అను మంత్రములతో చేయవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 261 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 75*
*🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 6 🌻*

38. The fourth oblation should be offered with the sacrificial ladle filled with clarified butter. Oṃ hāṃ oblation to firegod for the offering of a right sacrifice. After having consecrated in the six parts of one’s body, (the fire god) should be invoked with the dhenumudrā (posture with the fingers representing a cow).

39. Having covered it with the armour, the clarified butter should be protected by the mantra of the shaft. The clarified butter should be purified by sprinkling water and offering a drop of it into the fire along with the hṛd (mantra).

40. The rites of uniting the mouths of the fire should be performed as follows. Oṃ hāṃ oblations to Sadyojāta. Oṃ hāṃ oblations to Vāmadeva. Oṃ hāṃ oblations to Aghora. Oṃ haṃ oblations to Tatpuruṣa. Oṃ hāṃ oblations to Īśāna. Thus with oblations to one by one, one should do the union of the (different) faces.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 127 / DAILY WISDOM - 127 🌹*
*🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 6. ప్రపంచం సంపూర్ణత మీద ఆధారపడి ఉంది 🌻*

*తత్వం, అనుభూతిక ప్రపంచం కంటే ఉన్నతమైనది అయినప్పటికీ, ఉన్నత సత్యం ఇక్కడికి తీసుకురావడానికి అనుభూతిక ప్రపంచ విషయాల సహాయాన్ని తీసుకుంటుంది. తత్వం అంతర్ప్రపంచం యొక్క భాష ఇక్కడ అర్థం కాదు కాబట్టి, ఆ సత్యం ఇక్కడ చెప్పడానికి స్థూల ప్రపంచ భాషలో మాట్లాడుతుంది. అతిమానవ జ్ఞానాన్ని మానవ స్థాయికి తీసుకురావడానికి స్థూల ప్రపంచ విషయాలను తత్వం ఉపయోగిస్తుంది.*

*తత్వంలో అంతర్లీనంగా ఉన్నత ప్రపంచ జ్ఞానం ఇమిడి ఉంటుంది. ఇది అర్థం చేసుకునే మనస్సుకు స్పష్టమైన అవగాహనను ఇస్తుంది. తత్వం జ్ఞానేంద్రియాలపై ఆధారపడినప్పటికీ అది ఇంద్రియాల ఆవల చూస్తుంది. అంతర్దృష్టి తత్వశాస్త్రం యొక్క మూలం, హేతువు దాని శరీరం. అంతర్దృష్టి అంటే కొంతమంది పాశ్చాత్య తత్వవేత్తలు చెప్పే ఇంద్రియ అంతర్దృష్టి కాదు. అఖండంతో అభిన్నమైన చైతన్యం యొక్క సమగ్ర అంతర్దృష్టి. ప్రపంచం సంపూర్ణతపై ఆధారపడి ఉంది; అది సంపూర్ణత యొక్క అభివ్యక్తి. ఇంద్రియాలకు జగత్తుగా కనిపించేది ప్రవహిస్తున్న, చలనంలో ఉన్న ఈ సంపూర్ణతే.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 127 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 6. The World is Based on the Absolute 🌻*

*Philosophy soars above empiricality, though it takes the help of empirical concepts and categories for the sake of proclaiming to the world the truths declared by intuition. It speaks to the world in the language of the world, for the language of intuition is unintelligible to the world of experience. The form and shape of philosophy has necessarily to depend on the stuff out of which the world of experience is made, on account of its having to perform the function of transmitting the knowledge of the super-mundane ideal to the realm of mundane values.*

*It has always within itself a living undercurrent of significance and implication which gives a vivid picture of the nature of the ultimate end to the understanding mind. Philosophy stands on the shoulders of the senses, but looks beyond them. Intuition is the soul of philosophy, and reason is its body. By intuition, again, we do not mean the sensory intuition of certain Western philosophers, but the integral intuition of Consciousness, which is non-different from the Absolute. The world is based on the Absolute; it is a manifestation of the Absolute. It is the Absolute flowing and moving that appears to the senses as the world.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 129 / Siva Sutras - 129 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -1 🌻*

*🌴. ఆత్మశుద్ధి త్యాగంలో నిమ్న జ్ఞానము నశించి నప్పుడు, యోగి, శివుని స్వప్నంగా ప్రపంచాన్ని మరియు అతని శరీరం ఏర్పడినట్లు అనుభవిస్తాడు. అతను తన మాయ స్వరూపాన్ని గ్రహించి, స్వచ్ఛమైన జ్ఞానంలో స్థిరపడతాడు. 🌴*

*విద్య - జ్ఞానం యొక్క సాధారణ స్వచ్ఛమైన రూపం (పూర్ణ స్వచ్ఛమైనది కాదు), శుద్ధ విద్య అని పిలుస్తారు; సంహారే – శోషణ; తదు – ఎందుకంటే; ఉత్త – ముందుకు వస్తున్నది; స్వప్న – స్వప్న స్థితి; దర్శనం - ఉద్భవిస్తున్నది. మనస్సు నేను (అహం) మరియు ఇది (ఇదం) రెండింటితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఉన్న ద్వంద్వ చైతన్యాన్ని శుద్ధ విద్య అంటారు. స్పృహ యొక్క తదుపరి దశకు దారితీసే ఈ జ్ఞానాన్ని గ్రహించే సమయంలో, మునుపటి దశ (ద్వంద్వ స్పృహ) కలగా మారి వెళ్లి పోతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 129 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam -1 🌻*

*🌴. When the knowledge is thus destroyed in the sacrifice of self-purification, the yogi experiences the world as a dream of Shiva and his body as a formation. He realizes their illusory nature and becomes established in pure knowledge.  🌴*

*Vidyā – pure form of knowledge (not purest), known as suddha vidyā; saṁhāre – absorption; tád – because; uttha – coming forth; svapna – dream state; darśanam – emerging. When the mind is associated with both I (aham­) and this (idam), the dual consciousness is known as suddha vidyā. At the time of absorption of this knowledge leading to the next stage of consciousness emerges, the previous stage (dual consciousness) passes off as a dream.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 470 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 470 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 

🌻 470. ‘సిద్ధేశ్వరి'- 2 🌻


సత్పురుషులు జీవితమున పురోగతి చెందుచుండగ వారు చేయు యజ్ఞార్థ కార్యమునకు చేదోడుగ సిద్దు లందింపబడును. అట్టివారు దివ్యకార్యములను నిర్విఘ్నముగ నిర్వర్తింతురు. స్వార్థపరులకు సిద్ధులు లభింపవు. తీవ్రమైన రజోగుణముతో తపస్సు చేసి సిద్ధులను వశము చేసుకొనువారు కలరు. వారికి సిద్ధులు సమయమునకు పనికి రావు. రావణునికి, కర్ణునికి సమయమునకు సిద్ధులు సహకరించలేదు. రామునికి, అర్జునునికి, హనుమంతునకు సిద్ధులు సహకరించుటయే గాక, అంటిపెట్టుకొని యున్నవి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻

🌻 470. 'Siddheshwari'- 2 🌻

As the virtuous men progress in life, to support their yagnya works they are bestowed with siddhis. They perform the divine works uninterruptedly. Selfish people do not get siddhas. There are those who do penance with intense auspiciousness and attain Siddhas. Siddhas don't come of use for them in the time of need. The Siddhas did not cooperate with Ravana and Karna at the required time. The Siddhas not only cooperated with Rama, Arjuna and Hanuman, but also remained with them.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 29. Trust / ఓషో రోజువారీ ధ్యానాలు - 29. నమ్మకం



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 29 / Osho Daily Meditations - 29 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 29. నమ్మకం 🍀

🕉. ఎటువంటి పరిస్థితిలోనూ మీరు అపనమ్మకం చెందకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ నమ్మకం ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి కారణం అయినప్పటికీ, నమ్మకుండా ఉండటం కంటే ఇది ఉత్తమం. 🕉


ప్రతి ఒక్కరూ ప్రేమిస్తున్నప్పుడు మరియు మిమ్మల్ని ఎవరూ మోసం చేయనప్పుడు నమ్మడం చాలా సులభం. కానీ ప్రపంచం మొత్తం మోసపూరితమైనప్పటికీ మరియు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మోసం చేయడానికి మొగ్గు చూపినప్పటికీ- మరియు మీరు విశ్వసించినప్పుడే వారు మిమ్మల్ని మోసం చేయగలిగినప్పటికి-అప్పుడు కూడా విశ్వసించండి. ఎట్టి పరిస్థితిలోనూ, నమ్మకంపై నమ్మకాన్ని కోల్పోకండి మరియు మీరు ఎప్పటికీ ఓడిపోరు, ఎందుకంటే విశ్వాసమే అంతిమ ముగింపు. ఇది మరిదేనీకీ సాధనంగా ఉండకూడదు, ఎందుకంటే దాని స్వంత అంతర్గత విలువ ఉంది. మీరు విశ్వసించగలిగితే, మీరు ఓపెన్‌గా ఉంటారు. ప్రజలు రక్షణగా మూసివేయబడతారు, తద్వారా ఎవరూ వారిని మోసగించలేరు లేదా వారి నుండి ప్రయోజనం పొందలేరు.

వారు మీ ప్రయోజనాన్ని పొందనివ్వండి! మీరు విశ్వసించడాన్ని కొనసాగించాలని పట్టుబట్టినట్లయితే, అప్పుడు ఒక అందమైన పుష్పించేది జరుగుతుంది, ఎందుకంటే అప్పుడు భయం ఉండదు. ప్రజలు మోసం చేస్తారనే భయం-కానీ మీరు దానిని అంగీకరించిన తర్వాత, భయం లేదు, కాబట్టి మీ తెరవడానికి ఎటువంటి అడ్డంకి లేదు. ఎవరైనా మీకు చేసే హాని కంటే భయం చాలా ప్రమాదకరమైనది. ఈ భయం మీ జీవితమంతా విషపూరితం కావచ్చు. కాబట్టి బహిరంగంగా ఉండండి మరియు అమాయకంగా, బేషరతుగా విశ్వసించండి. మీరు పుష్పిస్తారు, మరియు వారు మిమ్మల్ని కొంచెం మోసం చేయలేదని, కానీ వారు తమను తాము మోసం చేసుకుంటున్నారని తెలుసుకున్న తర్వాత మీరు పుష్పించేలా సహాయం చేస్తారు. ఆ వ్యక్తి మిమ్మల్ని విశ్వసిస్తూనే ఉంటే మీరు ఒక వ్యక్తిని అనంతంగా మోసం చేయలేరు. నమ్మకమే మిమ్మల్ని మళ్లీ మళ్లీ మీ వైపుకు తిప్పుకుంటుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 29 🌹

📚. Prasad Bharadwaj

🍀 29. Trust 🍀

🕉 Always remember that at no cost should you become mistrustful. Even if your trust allows others to deceive you, this is better than not to trust. 🕉


It is very easy to trust when everybody is loving and nobody is deceiving you. But even if the whole world is deceptive and everybody is bent on deceiving you-and they can only deceive you when you trust-then too, go on trusting. Never lose trust in trust, whatever the cost, and you will never be a loser, because trust in itself is the ultimate end. It should not be a means to anything else, because it has its own intrinsic value. If you can trust, you remain open. People become closed as a defense, so that nobody can deceive them or take advantage of them.

Let them take advantage of you! If you insist on continuing to trust, then a beautiful flowering happens, because then there is no fear. The fear is that people will deceive-but once you accept that, there is no fear, so there is no barrier to your opening. The fear is more dangerous than any harm anybody can do to you. This fear can poison your whole life. So remain open, and just trust innocently, unconditionally. You will flower, and you will help others to flower once they become aware that they have not been deceiving you a bit, but they have been deceiving themselves. You cannot go on deceiving a person endlessly if that person continues to trust you. The very trust will throw you back to yourself again and again.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 775 / Sri Siva Maha Purana - 775


🌹 . శ్రీ శివ మహా పురాణము - 775 / Sri Siva Maha Purana - 775 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 18 🌴

🌻. నారద జలంధర సంవాదము - 5 🌻


గజశ్రేష్ఠమగు ఐరావతమును నీవు ఇంద్రునివద్దనుండి తెచ్చుకొంటివి. ఓ మహావీరా! అశ్వశ్రేష్ఠమగు ఉచ్చైశ్శ్రవమను అశ్వమును సూర్యుని వద్దనుండి లాగు కొంటివి (35). నీవు కల్పవృక్షమును, కుబేరుని నిధులను, మరియు బ్రహ్మగారి హంసలను పూన్చిన విమానమును తెచ్చుకొంటివి (36). ఓ రాక్షసరాజా! ఈ విధముగా, స్వర్గము నందు భూమియందు పాతాళమునందు ఏయే శ్రేష్ఠవస్తువులు గలవో, అవి అన్నియూ నీ ఇంటిలో ప్రకాశించుచున్నవి (37). ఓ మహావీరా! గజములు, అశ్వములు మొదలగు వాటితో మిక్కిలి ప్రకాశించునది, వివిధమైనది, సంపూర్ణమైనది అగు నీ ఈ సమృద్ధిని గాంచి నేను ప్రసన్నుడనైతిని (38). ఓ జలంధరా! నీ గృహములో శ్రేష్ఠమగు భార్యారత్నము లేకున్నది. కావున నీవు విశేషించి స్త్రీ రత్నమును దోడ్కొని రావలెను (39). ఓ జలంధరా!గృహములో శ్రేష్ఠవస్తువులు అన్నీ ఉన్ననూ, భార్యారత్నము లేనిచో, అవి శోభిల్లవు. అవి వ్యర్థమగును. ఇది నిశ్చయము (40).

సనత్కుమారుడిట్లు పలికెను- మహాత్ముడగు నారదుని ఈ మాటలను విని ఆ రాక్షసరాజు మన్మథుని చే కల్లోల పరచబడిన మనస్సు గలవాడై ఇట్లు పలికెను (41).

జలంధరుడిట్లు పలికెను- ఓయీ నారదా! దేవర్షీ! మహాప్రభూ! నీకు నమస్కారము అగు గాక! అట్టి భార్యారత్నము ఎచ్చట గలదో ఇప్పుడు నాకు చెప్పుము (42). ఓ బ్రాహ్మణా! అట్టి స్త్రీ రత్నము బ్రహ్మాండములో ఎచ్చట నున్ననూ నేను దోడ్కొని రాగలను. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (43).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 775🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 18 🌴

🌻 The conversation between Nārada and Jalandhara - 5 🌻


35. O great hero, the most excellent of all elephants, Airāvata of lndra has been brought by you. The most excellent of all horses, Uccaiḥśravas[1] of the sun has been brought by you.

36. The celestial Kalpa tree has been brought by you; the treasures of Kubera and the aerial chariot of Brahmā yoked to swan have been brought by you.

37. Thus all excellent things available in heaven, earth and nether worlds, O great Daitya, flourish in your mansion in their entirety.

38. O great hero, I am highly delighted on seeing your great affluence consisting of diverse objects—elephant horse etc.

39. But O Jalandhara, your mansion is deficient in the most excellent of all ladies. You deserve to bring that.

40. O Jalandhara, one who possesses all excellent things but does not possess the most excellent of women does not shine. His life is rendered waste.


Sanatkumāra said:—

41. On hearing these words of Nārada the noble soul, the king of Daityas, with his mind excited by passion, spoke as follows—



Jalandhara said:—

42. “O celestial sage, O Nārada, obeisance be to you, O holy lord. Where is this most excellent of all ladies? Please tell me now.

43. Wherever it may be in the whole of this universe, if such a lady exists anywhere, I will bring her here. Truth, it is certainly the truth.”



Continues....

🌹🌹🌹🌹🌹



విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 814 / Vishnu Sahasranama Contemplation - 814


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 814 / Vishnu Sahasranama Contemplation - 814🌹

🌻814. అమృతవపుః, अमृतवपुः, Amr‌tavapuḥ🌻

ఓం అమృతవపుషే నమః | ॐ अमृतवपुषे नमः | OM Amr‌tavapuṣe namaḥ

మరణం మృతం తద్ధానం విష్ణోరసాఽమృతంవపుః ।
ప్రోచ్యతేఽమృత వపురిత్యుత్తమాగమ వేదిభిః ॥

మృతం అనగా మరణము. మృతము లేని అనగా మరణము లేని శరీరము ఎవనికి కలదో అట్టివాడు అమృత వపుః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 814🌹

🌻814. Amr‌tavapuḥ🌻

OM Amr‌tavapuṣe namaḥ


मरणं मृतं तद्धानं विष्णोरसाऽमृतंवपुः ।
प्रोच्यतेऽमृत वपुरित्युत्तमागम वेदिभिः ॥

Maraṇaṃ mr‌taṃ taddhānaṃ viṣṇorasā’mr‌taṃvapuḥ,
Procyate’mr‌ta vapurityuttamāgama vedibhiḥ.


Mr‌taṃ is maraṇam or death. Since He has a body which is not subject to death, He is called Amr‌tavapuḥ.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr‌tāṃśo’mr‌tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 222 / Kapila Gita - 222


🌹. కపిల గీత - 222 / Kapila Gita - 222 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 32 🌴

32. అర్థజ్ఞాత్సంశయచ్ఛేత్తా తతః శ్రేయాన్ స్వకర్మకృత్|
ముక్తసంగస్తతో భూయానదోగ్ధా ధర్మమాత్మనః॥


తాత్పర్యము : వారిలోను వర్ణాశ్రమోచిత ధర్మములను ఆచరించు వాడు ఎంతయో గొప్ప. అట్టి వారిలోను ఆసక్తి రహితముగా నిష్కామ భావముతో స్వధర్మములను ఆచరించు వాడు మిగుల శ్రేష్ఠుడు.

వ్యాఖ్య : అర్థ జ్ఞాన బ్రాహ్మణ అంటే సంపూర్ణ సత్యాన్ని సమగ్రంగా విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసి, బ్రహ్మం, పరమాత్మ మరియు భగవాన్ అనే మూడు విభిన్న దశల్లో సంపూర్ణ సత్యం సాక్షాత్కరింప బడుతుందని తెలిసిన వ్యక్తిని సూచిస్తుంది. ఎవరైనా ఈ జ్ఞానాన్ని కలిగి ఉండటమే కాకుండా సంపూర్ణ సత్యం గురించి ప్రశ్నించినట్లయితే, దాని అన్ని సందేహాలను నివృత్తి చేయగలిగితే, అతను ఉత్తమంగా పరిగణించబడతాడు. ఇంకా, స్పష్టంగా వివరించగల మరియు అన్ని సందేహాలను నిర్మూలించగల పండిత బ్రాహ్మణ-వైష్ణవుడు ఉండవచ్చు, కానీ అతను వైష్ణవ సూత్రాలను అనుసరించకపోతే, అతను ఉన్నత స్థాయిలో ఉండడు. ఒకడు అన్ని సందేహాలను నివృత్తి చేయగలగి, మరియు ఏకకాలంలో బ్రాహ్మణ లక్షణాలలో స్థితుడై ఉండాలి. అటువంటి వ్యక్తి, వేద శాసనాల ఉద్దేశ్యాన్ని తెలుసుకుని, వేద సాహిత్యాలలో నిర్దేశించిన సూత్రాలను ఉపయోగించ గలడు. తన శిష్యులకు ఆ విధంగా బోధించే వ్యక్తిని ఆచార్య అని పిలుస్తారు. ఒక ఆచార్యుని స్థానం ఏమిటంటే, అతను జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలనే కోరిక లేకుండా భక్తి సేవను అమలు చేసేవాడు.

అత్యున్నత పరిపూర్ణ బ్రాహ్మణుడు.. పరమ సత్యం యొక్క శాస్త్రాన్ని తెలియని వాడు, అటువంటి జ్ఞానాన్ని ఇతరులకు బోధించలేడు. అతను అధో దశలో ఉన్నాడు. భగవంతుని శాస్త్ర సూత్రాలను అర్థం చేసుకోవడమే కాకుండా బోధించగలవాడు రెండవ దశలో ఉంటాడు, మరియు కేవలం బోధించగల వాడు మాత్రమే కాకుండా అన్నింటినీ సంపూర్ణ సత్యంలో మరియు ప్రతిదానిలో సంపూర్ణ సత్యాన్ని చూసేవాడు అత్యున్నత తరగతిలో ఉంటాడు. ఒకరు నిజంగా వైష్ణవుడిగా మారినప్పుడు బ్రాహ్మణ పరిపూర్ణత యొక్క అత్యున్నత దశకు చేరుకుంటారు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 222 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 32 🌴

32. artha-jñāt saṁśaya-cchettā tataḥ śreyān sva-karma-kṛt
mukta-saṅgas tato bhūyān adogdhā dharmam ātmanaḥ


MEANING : Better than the brāhmaṇa who knows the purpose of the Vedas is he who can dissipate all doubts, and better than him is one who strictly follows the brahminical principles. Better than him is one who is liberated from all material contamination, and better than him is a pure devotee, who executes devotional service without expectation of reward.

PURPORT : Artha jña brāhmaṇa refers to one who has made a thorough analytical study of the Absolute Truth and who knows that the Absolute Truth is realized in three different phases, namely Brahman, Paramātmā and Bhagavān. If someone not only has this knowledge but is able to clear all doubts if questioned about the Absolute Truth, he is considered better. Further, there may be a learned brāhmaṇa-Vaiṣṇava who can explain clearly and eradicate all doubts, but if he does not follow the Vaiṣṇava principles, then he is not situated on a higher level. One must be able to clear all doubts and simultaneously be situated in the brahminical characteristics. Such a person, who knows the purpose of the Vedic injunctions, who can employ the principles laid down in the Vedic literatures and who teaches his disciples in that way, is called an ācārya. The position of an ācārya is that he executes devotional service with no desire for elevation to a higher position of life.

The highest perfectional brāhmaṇa is the Vaiṣṇava. A Vaiṣṇava who knows the science of the Absolute Truth but is not able to preach such knowledge to others is described as being in the lower stage, one who not only understands the principles of the science of God but can also preach is in the second stage, and one who not only can preach but who also sees everything in the Absolute Truth and the Absolute Truth in everything is in the highest class of Vaiṣṇavas. It is mentioned here that a Vaiṣṇava is already a brāhmaṇa; in fact, the highest stage of brahminical perfection is reached when one becomes a Vaiṣṇava..

Continues...


🌹 🌹 🌹 🌹 🌹


17 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 17, అగష్టు, AUGUST, 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, సింహ సంక్రాంతి, Chandra Darshan, Simha Sankranti 🌺

🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 18 🍀

35. అనీతమూలికాయంత్రో భక్తాభీష్టప్రదో మహాన్ |
శాంతాకారో మహామాయో మాహురస్థో జగన్మయః

36. బద్ధాసనశ్చ సూక్ష్మాంశీ మితాహారో నిరుద్యమః |
ధ్యానాత్మా ధ్యానయోగాత్మా ధ్యానస్థో ధ్యానసత్ప్రియః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : పూర్ణ యోగాధికారులు - యోగలక్ష్యసాధన ఎల్లప్పుడూ కష్టసాధ్యమే. పూర్ణయోగ లక్ష్య సాధన మరీ కష్టం. హృదయ అంతరమున ప్రేరణ కల్గిన వారికీ, ఏ చిక్కుల నైననూ _ అపజయము నైననూ సరే ఎదుర్కొన నిచ్చ గల వారికీ, సంపూర్ణమైన నిస్వార్థ, నిష్కామ, ఆత్మ సమర్పణ స్థితికి పురోగమించ గోరు సంకల్పం గల వారికి., ఇట్టి వారికే పూర్ణయోగం.🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల పాడ్యమి 17:37:53 వరకు

తదుపరి శుక్ల విదియ

నక్షత్రం: మఘ 19:59:12 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: పరిఘ 19:30:13 వరకు

తదుపరి శివ

కరణం: బవ 17:35:52 వరకు

వర్జ్యం: 06:28:30 - 08:16:34

మరియు 28:58:40 - 30:46:36

దుర్ముహూర్తం: 10:13:12 - 11:03:58

మరియు 15:17:49 - 16:08:35

రాహు కాలం: 13:55:19 - 15:30:30

గుళిక కాలం: 09:09:44 - 10:44:55

యమ గండం: 05:59:21 - 07:34:32

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45

అమృత కాలం: 17:16:54 - 19:04:58

సూర్యోదయం: 05:59:21

సూర్యాస్తమయం: 18:40:54

చంద్రోదయం: 06:34:20

చంద్రాస్తమయం: 19:30:32

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: ముసల యోగం - దుఃఖం

19:59:12 వరకు తదుపరి గద యోగం

- కార్య హాని , చెడు

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹