శ్రీ లలితా సహస్ర నామములు - 24 / Sri Lalita Sahasranamavali - Meaning - 24

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 24 / Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 24. దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా |
భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ‖ 24 ‖ 🍀

🍀 64) దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా -

దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.

🍀 65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా -

భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹

📚. Prasad Bharadwaj

🌻 24. devarṣi-gaṇa-saṁghāta-stūyamānātma-vaibhavā |
bhaṇḍāsura-vadhodyukta-śaktisenā-samanvitā || 24 || 🌻

🌻 64 ) Devarshi Gana - sangatha - stuyamanathma - vaibhava - 

She who has all the qualities fit to be worshipped by sages and devas

🌻 65 ) Bhandasura vadodyuktha shakthi sena samavitha -

She who is surrounded by army set ready to kill Bandasura.

Continues.....

🌹 🌹 🌹 🌹 🌹

09 Feb 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 168

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 168 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 6 🌻

650. సద్గురువు ప్రణతి, పునరావృత్తి ఆధ్యాత్మక మార్గముల ద్వారా, అభావమును యొక్క సంస్కారము లన్నింటిని జయించి, అభావమును కూడా లోపల కలిగియున్న సర్వమ్ తానేయని అనుభూతి నొందెను. సద్గురువు సృష్టి ధర్మమందున్నను, అది వాని నంటదు.

651. మానవుడు భగవంతుడైన తరువాత ఇంక మానవుడుగా ఉండలేడు. అతడు మానవుని వలెనేవ జీవించవలనన్నెచో, అప్పటికప్పుడు అన్ని విధముల మానవ లక్షణములతో మానవుని వలెనే వ్యవహరించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

09 Feb 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 229

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 229 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గర్గమహర్షి 🌻

1. గర్గమహర్షి యదుకులానికి ఆచార్యుడు. ఆయ్న ఒకసారి కృష్ణుణ్ణీ లాలిస్తున్నటువంటి యశోదాదేవితో, “ఈ పిల్లవాడు ఎవరోకాదు, సాఖాత్తూ శ్రీమహావిష్ణువే! పరబ్రహ్మ వస్తువు.

2. రాధేశ్వరుడైన శ్రీకృష్ణుడు, గోలోకాధిపతి భర్గవుడు, శివుడు, నారాయణుడు, నరనారాయణులు, కపిలాది నారాయణావతరములు అన్ని కలిపి ఇతడు. ఈతడిలో లేని అంశలేదు. కపిల, శివ, నారాయణాంశలతో కూడిన ఈతడు గోలోకాధిపతి అయిన మాధవుడే! ఇదే అతడిని గురించిన పరమరహశ్యం” అని చెప్పాడు.

3. ఆయన ఇంకా కృష్ణుని గురించి, “ఇతడు పుట్టీపుట్టగానే దేవకీ వసుదేవులకు మాత్రమే నిజస్వరూపం చూపించాడు. ఇతడికి ప్రతీయుగంలోనూ వర్ణభేదము, నాంభేదము ఉంటాయి. కృత్యుగములో శ్వేతవర్ణుడుగాను, త్రేతలో రక్తవర్ణుడుగాను, ద్వాపరంలో పీతవర్ణుడుగాను ఉంటాడు. ఈ ద్వాపరంలో కృష్ణవర్ణం దాల్చటంచేత కృష్ణుడని పేరువచ్చింది” అని చెప్పాడు.

4. ఈ కృష్ణవర్ణంలో ఈ నామం అర్థమేమంటే – ‘క‘కారం బ్రహ్మవాచకం, ‘రు‘కారమేమో అనంత వాచకం, ‘ష‘కారమేమో శంకరవాచకం, ‘ణ‘కారమేమో ధర్మ వాచకం, ‘అ‘కారమేమో విష్ణువాచకం, ‘వి‘సర్గము నరనారాయణార్థవాచకం. ఇదీ అతడి నామముయొక్క నిర్మాణము.

5. ‘కృష్‘ అనేది నిర్వాణవచనము, కృష్ అంటే అంతర్థానమైపోవటమనేది, లయించటమనే అర్థం. ణ కారం మోక్షము; అరాకమేమో విమలాత్మ. అంటే ఆత్మనుగురించి చెప్పేది అకారము అని ఇంకొక అర్థం. కృష్ అనేది నిశ్చేష్ట వాచకం. ఏ పనీలేకుండా ఉండటం, నిష్క్రియుడై ఉండటమంటారు.

6. రకారమేమో భక్తి తాత్పర్యం; అకారమేమో ధాతృవాచకం, అంటే బ్రహ్మ(నిర్గుణ బ్రహ్మ). అంటే సర్వకార్యాలు(ఏ పనీ)చెయ్యకుండా ఉండటం నిష్క్రియత్వం. బ్రహ్మవస్తువు. అది మూడింటి యొక్క సంపుటి. కృష్ అనే శబ్దానికి కర్మను నిర్మూలచేస్తుందనే అర్థంకూడా ఉంది. ంకారమేమో దాస్యవృత్తిని చెపుతుంది. దాసోహం అని ఈశ్వరుడి దగ్గర చెప్పటం.

7. ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’ అని చెప్పభడింది కాబట్టి, ‘కృషి’ అంటే నిర్మూలనం; అకారమేమో ప్రాప్తి. ఆ కోరుకున్నది పొందటానికి అకారశబ్దం వర్తిస్తుంది. ఈ ప్రకారంగా సర్వశక్తివంతమైన ‘కృష్ణ’ శబ్దానికి ఉన్న అర్థ వివరించాడు గర్గమహర్షి. ఆ నామం ఉచ్చరిస్తేనే అధికమైన ఫలం లభిస్తుంది.

8. ముచికుందుడు అనేవాడు ఒకప్పుడు చిరకాలం దేవతలకు యుద్ధంలో సహాయంచేసి బ్రహంవరంచేత అంతులేని నిద్ర కావాలని వరం పొండాడు. అంత్య కాలంలో కృష్ణదర్శనంచేత ఆయనలో లయం అయ్యాడు.

9. ముచికుందానది కృష్ణలో కలుస్తుంది. ‘ముచికుంద’ పేరే ‘మూసీ’ నదిగా ప్రసిద్ధి చెందింది. మూసీనది హైదరాబాదులో బయలుదేరి నల్గిండ్జిల్లాలో వాడపల్లి అనే గ్రామం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది.

10. గోదావరి తీరంలో (పశ్చిమ గోదావరి జిల్లా) ‘గరగపర్రు’ గ్రామం గర్గుని ఆశ్రమమని, ఆయన పేరుమీదే ప్రసిద్ధి పొందింది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

09 Feb 2021

శ్రీ శివ మహా పురాణము - 345

🌹 . శ్రీ శివ మహా పురాణము - 345 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

87. అధ్యాయము - 42

🌻. దక్షుని ఉద్ధారము -3 🌻

పరమేశ్వరుడవగు నీవు ఆత్మ తత్త్వము లోకములో ప్రవర్తిల్ల జేయుటకై విద్యను, తపస్సును, దీక్షను కలిగియున్న బ్రాహ్మణులను ముందుగా నీ ముఖము నుండి సృజించితివి (38). నీవు పశువుల కాపరి పశువులను పాలించు తీరున భక్తులను సర్వ విధముల ఆపదలనుండి రక్షించెదవు. మరియు ధర్మ మర్యాదలను పాలించె నీవు దుష్టులపై దండమును ప్రయోగించెదవు (39).

నేను చెడుమాటలనే బాణములతో పరమేశ్వరుని వేధించితిని. అయిననూ నీవు నన్ను అనుగ్రహించితివి. అటులనే మిక్కిలి దీనమగు ముఖములు గల ఈ దేవతలను అనుగ్రహించుము (40). హే దీనబంధూ!శంభో!భక్తవత్సలా! అట్టి నీవు భగవానుడవు. పరాత్పరుడవు. నీవు సృష్టించుకున్న నీ స్వరూపమైన ఈ విస్తారమైన బ్రహ్మండములో నీవు ఆనందరూపుడవై ఉన్నావు (41).

బ్రహ్మ ఇట్లు పలికెను -

లోకములకు మంగళములనిచ్చే మహా ప్రభుడగు మహేశ్వరుని దక్ష ప్రజాపతి ఈ తీరున వినయముతో నిండిన అంతకరణము గల వాడై స్తుతించి ఊరకుండెను (42). అపుడు విష్ణువు దోసిలి యొగ్గి నమస్కరించి కన్నీటితో బొంగురుపోయిన పలుకులతో ప్రసన్నమగు మనస్సుతో వృషభధ్వజుని స్తుతించెను (43).

విష్ణువు ఇట్లు పలికెను -

హే మహాదేవా!మహేశ్వరా! లోకములననుగ్రహించువాడా!దీనబంధో! దయానిధీ! పరబ్రహ్మ పరమాత్మవు నీవే (44). హే ప్రభో! సర్వ వ్యాపి, యథేచ్ఛా సంచారి, వేదములచే తెలియదగిన యశస్సు గలవాడు అగు నీవు అనుగ్రహమును చూపితివి. మేము పాపములను చేయునట్లు ఆ దక్షుడు చేసినాడు (45).

నా భక్తుడగు ఈ దక్షుడు పూర్వములో నిన్ను నిందించినాడు. ఈతడు దుష్టుడు. కాని మహేశా! నీవు నిర్వికారుడవు. కాన నీవు ఆ దోషమును మన్నించుము (46). హే శంకరా! అజ్ఞానముచే నేను కూడ నీయందు అపరాధమును సలిపితిని. నేను దక్షుని పక్షమున నుండి నీ గణములకు అధ్యక్షుడగు వీరభద్రునితో యుద్ధమును చేసితిని (47). నాకు ప్రభువగు పరబ్రహ్మవు నీవే. హే సదాశివా! నేను నీ దాసుడను. నీవు అందరికీ తండ్రివి గాన, నీవు నన్ను కూడ సర్వదా రక్షించవలెను (48).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! నీవు స్వతంత్రుడవగు పరమాత్మవు.అద్వితీయ, అవ్యయ, పరమేశ్వరుడవు నీవే (49). హే ఈశ్వరా! దేవా! నీవు నీకు కలిగిన అవమానమును లెక్కించకుండగా నా కుమారునిపై అనుగ్రహమును చూపితివి. దక్షుని యజ్ఞమును ఉద్ధరించుము (50).

దేవేశా! నీవు ప్రసన్నుడవు కమ్ము. శాపముల నన్నిటినీ త్రోసిపుచ్చుము. జ్ఞాన స్వరూపుడవగు నీవే నన్నీ తీరున ప్రేరేపించితివి. దీనిని నివారించవలసినది నీవే. ఓ మహర్షీ! ఇట్లు నేను దోసిలియొగ్గి తలవంచి నమస్కరించి ఆ పరమ మహేశ్వరుని స్తుతించితిని (52).

తరువాత ఇంద్రుడు మొదలగు లోకపాలురు, దేవతలు మంచి మనస్సు గలవారై, ప్రసన్నమైన ముఖ పద్మము గల శంకర దేవుని స్తుతించిరి (53). తరువాత ప్రసన్నమగు మనస్సు గల దేవతలందరు, ఇతరులు, సిద్ధులు, ఋషులు, ప్రజాపతులు శంకరుని ఆనందముతో స్తుతించిరి (54). మరియు ఉపదేవతలు, నాగులు, సభలో నున్న బ్రాహ్మణులు శివుని వేర్వేరుగా పరాభక్తితో నమస్కరించి స్తుతించిరి (55).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో దక్షదుఃఖ నిరాకరణ వర్ణనమనే నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

09 Feb 2021

గీతోపనిషత్తు -146

🌹. గీతోపనిషత్తు -146 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 29

🍀 27. సాన్నిధ్యము - తపస్సు, యజ్ఞముల భోక్తను నేను. సర్వలోకముల అధిపతులకు ఈశ్వరుడను నేను. సృష్టి యందు పుట్టిన సమస్త ప్రాణులకు సుహృదయుడను నేను. ఈ విధముగ నన్ను తెలుసు కొనిన వాడు శాశ్వతముగ శాంతిని పొందుచున్నాడు. సన్న్యాస స్థితికి చరమ గీతముగ భగవంతుడు ఈ వాక్యమును పలికినాడు. “నేను” అను అంతర్యామి ప్రజ్ఞగ అందరి హృదయములందు తా నున్నాడు. అట్టివాని చూచుట ప్రధానము. “కర్మ సన్న్యాసయోగము" అని నామ కరణము చేయుటలో గల ఔచిత్య మేమనగ, సత్సాధకుడు తన మనో బుద్ధి యింద్రియములను 'నేను' అను అంతర్యామి ప్రజ్ఞ యందు లగ్నము చేసియుండగ, అతని సమస్త కార్యములు యాంత్రికముగ సాగిపోవును. ఇదియే ఈ అధ్యాయ రహస్యము 🍀

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్ |
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి || 29

తపస్సు, యజ్ఞముల భోక్తను నేను. సర్వలోకముల అధిపతులకు ఈశ్వరుడను నేను. సృష్టి యందు పుట్టిన సమస్త ప్రాణులకు సుహృదయుడను నేను. ఈ విధముగ నన్ను తెలుసు కొనిన వాడు శాశ్వతముగ శాంతిని పొందుచున్నాడు. సన్న్యాస స్థితికి చరమ గీతముగ భగవంతుడు ఈ వాక్యమును పలికినాడు.

“నేను” అను అంతర్యామి ప్రజ్ఞగ అందరి హృదయములందు తా నున్నాడు. అట్టివాని చూచుట ప్రధానము. అతడే సమస్తమునకు స్వామి. అతడే గమ్యము. అట్టి వానిని 'నేను'గ తనయందు, సర్వభూతముల యందు దర్శించుచు దేశమును, కాలమును బట్టి సంచరించువాడు సన్న్యాసి యని, అట్టి సన్న్యాసి శాంతియే ప్రధాన లక్షణముగ యుండునని తెలియ వలెను.

ఈ అధ్యాయమునకు “కర్మ సన్న్యాసయోగము" అని నామ కరణము చేయుటలో గల ఔచిత్య మేమనగ, సత్సాధకుడు తన మనో బుద్ధి యింద్రియములను 'నేను' అను అంతర్యామి ప్రజ్ఞ యందు లగ్నము చేసియుండగ, అతని సమస్త కార్యములు యాంత్రికముగ సాగిపోవును. చేయుచున్నట్లనిపించదు. దీనికి

భక్తుల జీవితమున చాల ఉదాహరణలు గలవు.

1. గోపికలు : గోపికల మనసు అహర్నిశలు శ్రీ కృష్ణుని యందే లగ్నమై యుండగ, వారి దైనందిన జీవితమంతయు అనాయాస ముగ సాగిపోయినది. అన్నిటియందు వారు కృష్ణుని దర్శించుటచే

కృష్ణ దర్శన మాధుర్యము గూడ నిరంతర ముండెడిది.

2. సక్కుబాయి : ఈమెకు మానవ సాధ్యము కాని బరువు బాధ్యతలు అప్పచెప్పబడినను, కృష్ణ సాన్నిధ్యమున నుండుటచే, అసాధ్యము లన్నియు సుసాధ్యములైనవి. దుష్కరమైన కార్యములు

కూడ తాను చేసితినను భావనయే లేక ఫలించినవి.

3. హనుమంతుని సముద్రోల్లంఘనము, నారదుని వీణా గానము కూడ ఈ కోవకు చెందినవే.

(మనసు కర్మల యందు లగ్నము కాక, దైవమునందు లగ్నమగుటచే కర్మలు అప్రయత్నముగను, అనాయాసముగను సాగునని తెలుపుట 'కర్మ సన్న్యాసయోగ' రహస్యము.)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

09 Feb 2021

9-FEB-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 146🌹  
11) 🌹. శివ మహా పురాణము - 344🌹 
12) 🌹 Light On The Path - 97🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 229🌹 
14) 🌹 Seeds Of Consciousness - 293🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 168🌹
16) 🌹. శ్రీమద్భగవద్గీత - 23 / Bhagavad-Gita - 23 🌹 
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 24 / Lalitha Sahasra Namavali - 24🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasranama - 24 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -146 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 29

*🍀 27. సాన్నిధ్యము - తపస్సు, యజ్ఞముల భోక్తను నేను. సర్వలోకముల అధిపతులకు ఈశ్వరుడను నేను. సృష్టి యందు పుట్టిన సమస్త ప్రాణులకు సుహృదయుడను నేను. ఈ విధముగ నన్ను తెలుసు కొనిన వాడు శాశ్వతముగ శాంతిని పొందుచున్నాడు. సన్న్యాస స్థితికి చరమ గీతముగ భగవంతుడు ఈ వాక్యమును పలికినాడు. “నేను” అను అంతర్యామి ప్రజ్ఞగ అందరి హృదయములందు తా నున్నాడు. అట్టివాని చూచుట ప్రధానము. “కర్మ సన్న్యాసయోగము" అని నామ కరణము చేయుటలో గల ఔచిత్య మేమనగ, సత్సాధకుడు తన మనో బుద్ధి యింద్రియములను 'నేను' అను అంతర్యామి ప్రజ్ఞ యందు లగ్నము చేసియుండగ, అతని సమస్త కార్యములు యాంత్రికముగ సాగిపోవును. ఇదియే ఈ అధ్యాయ రహస్యము 🍀*

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్ |
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి || 29

తపస్సు, యజ్ఞముల భోక్తను నేను. సర్వలోకముల అధిపతులకు ఈశ్వరుడను నేను. సృష్టి యందు పుట్టిన సమస్త ప్రాణులకు సుహృదయుడను నేను. ఈ విధముగ నన్ను తెలుసు కొనిన వాడు శాశ్వతముగ శాంతిని పొందుచున్నాడు. సన్న్యాస స్థితికి చరమ గీతముగ భగవంతుడు ఈ వాక్యమును పలికినాడు. 

“నేను” అను అంతర్యామి ప్రజ్ఞగ అందరి హృదయములందు తా నున్నాడు. అట్టివాని చూచుట ప్రధానము. అతడే సమస్తమునకు స్వామి. అతడే గమ్యము. అట్టి వానిని 'నేను'గ తనయందు, సర్వభూతముల యందు దర్శించుచు దేశమును, కాలమును బట్టి సంచరించువాడు సన్న్యాసి యని, అట్టి సన్న్యాసి శాంతియే ప్రధాన లక్షణముగ యుండునని తెలియ వలెను. 

ఈ అధ్యాయమునకు “కర్మ సన్న్యాసయోగము" అని నామ కరణము చేయుటలో గల ఔచిత్య మేమనగ, సత్సాధకుడు తన మనో బుద్ధి యింద్రియములను 'నేను' అను అంతర్యామి ప్రజ్ఞ యందు లగ్నము చేసియుండగ, అతని సమస్త కార్యములు యాంత్రికముగ సాగిపోవును. చేయుచున్నట్లనిపించదు. దీనికి
భక్తుల జీవితమున చాల ఉదాహరణలు గలవు. 

1. గోపికలు : గోపికల మనసు అహర్నిశలు శ్రీ కృష్ణుని యందే లగ్నమై యుండగ, వారి దైనందిన జీవితమంతయు అనాయాస ముగ సాగిపోయినది. అన్నిటియందు వారు కృష్ణుని దర్శించుటచే
కృష్ణ దర్శన మాధుర్యము గూడ నిరంతర ముండెడిది. 
2. సక్కుబాయి : ఈమెకు మానవ సాధ్యము కాని బరువు బాధ్యతలు అప్పచెప్పబడినను, కృష్ణ సాన్నిధ్యమున నుండుటచే, అసాధ్యము లన్నియు సుసాధ్యములైనవి. దుష్కరమైన కార్యములు
కూడ తాను చేసితినను భావనయే లేక ఫలించినవి. 
3. హనుమంతుని సముద్రోల్లంఘనము, నారదుని వీణా గానము కూడ ఈ కోవకు చెందినవే.

(మనసు కర్మల యందు లగ్నము కాక, దైవమునందు లగ్నమగుటచే కర్మలు అప్రయత్నముగను, అనాయాసముగను సాగునని తెలుపుట 'కర్మ సన్న్యాసయోగ' రహస్యము.)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 345 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
87. అధ్యాయము - 42

*🌻. దక్షుని ఉద్ధారము -3 🌻*

పరమేశ్వరుడవగు నీవు ఆత్మ తత్త్వము లోకములో ప్రవర్తిల్ల జేయుటకై విద్యను, తపస్సును, దీక్షను కలిగియున్న బ్రాహ్మణులను ముందుగా నీ ముఖము నుండి సృజించితివి (38). నీవు పశువుల కాపరి పశువులను పాలించు తీరున భక్తులను సర్వ విధముల ఆపదలనుండి రక్షించెదవు. మరియు ధర్మ మర్యాదలను పాలించె నీవు దుష్టులపై దండమును ప్రయోగించెదవు (39).

నేను చెడుమాటలనే బాణములతో పరమేశ్వరుని వేధించితిని. అయిననూ నీవు నన్ను అనుగ్రహించితివి. అటులనే మిక్కిలి దీనమగు ముఖములు గల ఈ దేవతలను అనుగ్రహించుము (40). హే దీనబంధూ!శంభో!భక్తవత్సలా! అట్టి నీవు భగవానుడవు. పరాత్పరుడవు. నీవు సృష్టించుకున్న నీ స్వరూపమైన ఈ విస్తారమైన బ్రహ్మండములో నీవు ఆనందరూపుడవై ఉన్నావు (41).

బ్రహ్మ ఇట్లు పలికెను -

లోకములకు మంగళములనిచ్చే మహా ప్రభుడగు మహేశ్వరుని దక్ష ప్రజాపతి ఈ తీరున వినయముతో నిండిన అంతకరణము గల వాడై స్తుతించి ఊరకుండెను (42). అపుడు విష్ణువు దోసిలి యొగ్గి నమస్కరించి కన్నీటితో బొంగురుపోయిన పలుకులతో ప్రసన్నమగు మనస్సుతో వృషభధ్వజుని స్తుతించెను (43).

విష్ణువు ఇట్లు పలికెను -

హే మహాదేవా!మహేశ్వరా! లోకములననుగ్రహించువాడా!దీనబంధో! దయానిధీ! పరబ్రహ్మ పరమాత్మవు నీవే (44). హే ప్రభో! సర్వ వ్యాపి, యథేచ్ఛా సంచారి, వేదములచే తెలియదగిన యశస్సు గలవాడు అగు నీవు అనుగ్రహమును చూపితివి. మేము పాపములను చేయునట్లు ఆ దక్షుడు చేసినాడు (45). 

నా భక్తుడగు ఈ దక్షుడు పూర్వములో నిన్ను నిందించినాడు. ఈతడు దుష్టుడు. కాని మహేశా! నీవు నిర్వికారుడవు. కాన నీవు ఆ దోషమును మన్నించుము (46). హే శంకరా! అజ్ఞానముచే నేను కూడ నీయందు అపరాధమును సలిపితిని. నేను దక్షుని పక్షమున నుండి నీ గణములకు అధ్యక్షుడగు వీరభద్రునితో యుద్ధమును చేసితిని (47). నాకు ప్రభువగు పరబ్రహ్మవు నీవే. హే సదాశివా! నేను నీ దాసుడను. నీవు అందరికీ తండ్రివి గాన, నీవు నన్ను కూడ సర్వదా రక్షించవలెను (48).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! నీవు స్వతంత్రుడవగు పరమాత్మవు.అద్వితీయ, అవ్యయ, పరమేశ్వరుడవు నీవే (49). హే ఈశ్వరా! దేవా! నీవు నీకు కలిగిన అవమానమును లెక్కించకుండగా నా కుమారునిపై అనుగ్రహమును చూపితివి. దక్షుని యజ్ఞమును ఉద్ధరించుము (50).

దేవేశా! నీవు ప్రసన్నుడవు కమ్ము. శాపముల నన్నిటినీ త్రోసిపుచ్చుము. జ్ఞాన స్వరూపుడవగు నీవే నన్నీ తీరున ప్రేరేపించితివి. దీనిని నివారించవలసినది నీవే. ఓ మహర్షీ! ఇట్లు నేను దోసిలియొగ్గి తలవంచి నమస్కరించి ఆ పరమ మహేశ్వరుని స్తుతించితిని (52).

  తరువాత ఇంద్రుడు మొదలగు లోకపాలురు, దేవతలు మంచి మనస్సు గలవారై, ప్రసన్నమైన ముఖ పద్మము గల శంకర దేవుని స్తుతించిరి (53). తరువాత ప్రసన్నమగు మనస్సు గల దేవతలందరు, ఇతరులు, సిద్ధులు, ఋషులు, ప్రజాపతులు శంకరుని ఆనందముతో స్తుతించిరి (54). మరియు ఉపదేవతలు, నాగులు, సభలో నున్న బ్రాహ్మణులు శివుని వేర్వేరుగా పరాభక్తితో నమస్కరించి స్తుతించిరి (55).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో దక్షదుఃఖ నిరాకరణ వర్ణనమనే నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 97 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 7 - THE 15th RULE
*🌻 15. Desire possessions above all. - 1 🌻*

 372. But those possessions must belong to the pure soul only, and be possessed therefore by all pure souls equally, and thus be the especial property of the/ whole only when united. Hunger for such possessions as can be held by the pure soul, that you may accumulate wealth for that united spirit of life which is your only true Self.

373. C.W.L. – The possessions which we are to desire are qualities which shall be of use to all humanity. Every victory we gain is to be gained for humanity, not for ourselves. The desire to possess must be one to possess with all others – a desire that all shall share the same inheritance. 

That is the old story of impersonality in another form. We see that beautifully illustrated in the lives of the Masters. I remember long ago feeling considerable wonder as to how it could be that the Masters appear without karma. They are even spoken of in some of the sacred books of the East as having risen above karma. 

I could not understand it, because karma is a law just as much as gravitation is. We might rise as far as the sun itself, but we should not get beyond gravitation; on the contrary we should feel it very much more strongly. 

It seemed to me just as impossible to escape from the law of cause and effect, since under its operation every person receives according to what he does. If the great Masters are all the time doing good on a scale which we cannot in the least hope to equal, and yet They make no karma, what then becomes of the stupendous result of all Their outpourings of energy?

374. Presently, after studying the problem, we began to see how it worked. If I describe what karma looks like clairvoyantly, it will perhaps help to make the matter more intelligible. The appearance of the working of the law of karma on higher planes is something as follows. 

Every man is the centre of an incredibly vast series of concentric spheres – some of them quite near, others reaching to a prodigious distance into the far empyrean. Every thought or word or action, whether good or bad, selfish or unselfish, sends out a stream of force which rushes towards the surfaces of these spheres. 

This force strikes the interior surface of one or other of the spheres at right angles to it, and is reflected back to the point from which it came. From which sphere it is reflected seems to depend upon the character of the force, and this also regulates the time of its return. 

The force which is generated by some actions strikes a sphere which is comparatively near at hand and flies back again very quickly, while other forces rush on almost to infinity and return only after many lives – why we cannot tell. 

All we know is that in any case they inevitably return, and they can return nowhere but to the centre from which they came forth.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 229 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. గర్గమహర్షి 🌻*

 1. గర్గమహర్షి యదుకులానికి ఆచార్యుడు. ఆయ్న ఒకసారి కృష్ణుణ్ణీ లాలిస్తున్నటువంటి యశోదాదేవితో, “ఈ పిల్లవాడు ఎవరోకాదు, సాఖాత్తూ శ్రీమహావిష్ణువే! పరబ్రహ్మ వస్తువు. 

2. రాధేశ్వరుడైన శ్రీకృష్ణుడు, గోలోకాధిపతి భర్గవుడు, శివుడు, నారాయణుడు, నరనారాయణులు, కపిలాది నారాయణావతరములు అన్ని కలిపి ఇతడు. ఈతడిలో లేని అంశలేదు. కపిల, శివ, నారాయణాంశలతో కూడిన ఈతడు గోలోకాధిపతి అయిన మాధవుడే! ఇదే అతడిని గురించిన పరమరహశ్యం” అని చెప్పాడు.

3. ఆయన ఇంకా కృష్ణుని గురించి, “ఇతడు పుట్టీపుట్టగానే దేవకీ వసుదేవులకు మాత్రమే నిజస్వరూపం చూపించాడు. ఇతడికి ప్రతీయుగంలోనూ వర్ణభేదము, నాంభేదము ఉంటాయి. కృత్యుగములో శ్వేతవర్ణుడుగాను, త్రేతలో రక్తవర్ణుడుగాను, ద్వాపరంలో పీతవర్ణుడుగాను ఉంటాడు. ఈ ద్వాపరంలో కృష్ణవర్ణం దాల్చటంచేత కృష్ణుడని పేరువచ్చింది” అని చెప్పాడు. 

4. ఈ కృష్ణవర్ణంలో ఈ నామం అర్థమేమంటే – ‘క‘కారం బ్రహ్మవాచకం, ‘రు‘కారమేమో అనంత వాచకం, ‘ష‘కారమేమో శంకరవాచకం, ‘ణ‘కారమేమో ధర్మ వాచకం, ‘అ‘కారమేమో విష్ణువాచకం, ‘వి‘సర్గము నరనారాయణార్థవాచకం. ఇదీ అతడి నామముయొక్క నిర్మాణము. 

5. ‘కృష్‘ అనేది నిర్వాణవచనము, కృష్ అంటే అంతర్థానమైపోవటమనేది, లయించటమనే అర్థం. ణ కారం మోక్షము; అరాకమేమో విమలాత్మ. అంటే ఆత్మనుగురించి చెప్పేది అకారము అని ఇంకొక అర్థం. కృష్ అనేది నిశ్చేష్ట వాచకం. ఏ పనీలేకుండా ఉండటం, నిష్క్రియుడై ఉండటమంటారు. 

6. రకారమేమో భక్తి తాత్పర్యం; అకారమేమో ధాతృవాచకం, అంటే బ్రహ్మ(నిర్గుణ బ్రహ్మ). అంటే సర్వకార్యాలు(ఏ పనీ)చెయ్యకుండా ఉండటం నిష్క్రియత్వం. బ్రహ్మవస్తువు. అది మూడింటి యొక్క సంపుటి. కృష్ అనే శబ్దానికి కర్మను నిర్మూలచేస్తుందనే అర్థంకూడా ఉంది. ంకారమేమో దాస్యవృత్తిని చెపుతుంది. దాసోహం అని ఈశ్వరుడి దగ్గర చెప్పటం.

7. ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’ అని చెప్పభడింది కాబట్టి, ‘కృషి’ అంటే నిర్మూలనం; అకారమేమో ప్రాప్తి. ఆ కోరుకున్నది పొందటానికి అకారశబ్దం వర్తిస్తుంది. ఈ ప్రకారంగా సర్వశక్తివంతమైన ‘కృష్ణ’ శబ్దానికి ఉన్న అర్థ వివరించాడు గర్గమహర్షి. ఆ నామం ఉచ్చరిస్తేనే అధికమైన ఫలం లభిస్తుంది.
    
8. ముచికుందుడు అనేవాడు ఒకప్పుడు చిరకాలం దేవతలకు యుద్ధంలో సహాయంచేసి బ్రహంవరంచేత అంతులేని నిద్ర కావాలని వరం పొండాడు. అంత్య కాలంలో కృష్ణదర్శనంచేత ఆయనలో లయం అయ్యాడు. 

9. ముచికుందానది కృష్ణలో కలుస్తుంది. ‘ముచికుంద’ పేరే ‘మూసీ’ నదిగా ప్రసిద్ధి చెందింది. మూసీనది హైదరాబాదులో బయలుదేరి నల్గిండ్జిల్లాలో వాడపల్లి అనే గ్రామం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది.

10. గోదావరి తీరంలో (పశ్చిమ గోదావరి జిల్లా) ‘గరగపర్రు’ గ్రామం గర్గుని ఆశ్రమమని, ఆయన పేరుమీదే ప్రసిద్ధి పొందింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 293 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 142. In the absence of the basic concept 'I am', there is no thought, no awareness, and no consciousness of one's existence. 🌻*

Understanding the importance of the basic concept 'I am' comes by constantly pondering on it. The more you dwell on it, the more you realize that 'yes, this is it'. On this 'I am' rests everything: 

All the thoughts that prevail, all the actions that you perform, the very awareness of your being, your existence; the 'I am'having gone all these go, like in the state of deep sleep or that period before the 'I am' arose.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 168 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 6 🌻*

650. సద్గురువు ప్రణతి, పునరావృత్తి ఆధ్యాత్మక మార్గముల ద్వారా, అభావమును యొక్క సంస్కారము లన్నింటిని జయించి, అభావమును కూడా లోపల కలిగియున్న సర్వమ్ తానేయని అనుభూతి నొందెను. సద్గురువు సృష్టి ధర్మమందున్నను, అది వాని నంటదు. 

651. మానవుడు భగవంతుడైన తరువాత ఇంక మానవుడుగా ఉండలేడు. అతడు మానవుని వలెనేవ జీవించవలనన్నెచో, అప్పటికప్పుడు అన్ని విధముల మానవ లక్షణములతో మానవుని వలెనే వ్యవహరించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 23 / Bhagavad-Gita - 23 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 23 🌴

23. యోత్స్యమానానవేక్షే(హం య ఏతే(త్ర సమాగతా: |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్దేర్యుద్దే ప్రియచికీర్షవ || 

🌷. తాత్పర్యం : 
దుష్టబుద్ధి గల ధృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.

🌷. భాష్యము : 
తన తండ్రియైన ధృతరాష్ట్రుని సహాయమున దుష్టప్రణాళిక ద్వారా పాండవుల రాజ్యమును దుర్యోధనుడు హరింప గోరేననుట బహిరంగ రహస్యము. అనగా దుర్యోధనుని పక్షమున చేరిన వారందరును అతని లక్షణమునలను పోలినవారే. 

యుద్ధరంభమునకు పూర్వము రణరంగమున వారిని అర్జునుడు గాంచదలిచెను. వారెవారా యని తెలిసికొనుటయే గాని వారితో శాంతి మంతనములు జరిపెడి భావన అర్జునునకు లేదు. తన చెంతనే శ్రీకృష్ణభగవానుడు ఉపస్థితుడై యున్నందున విజయమును గూర్చి సంపూర్ణ విశ్వాసమున్నను తాను తలపడవలసి యున్నవారి బలమును అంచనా వేయుటకు అర్జునుడు వారిని చూడగోరె ననుటయు ఒక ముఖ్యవిషయమే.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 23 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada 
📚 Prasad Bharadwaj 

🌴. Chapter 1 - Vishada yoga - 23 🌴

23. yotsyamānān avekṣe ’haṁ
ya ete ’tra samāgatāḥ
dhārtarāṣṭrasya durbuddher
yuddhe priya-cikīrṣavaḥ

🌷. Translation : 
Let me see those who have come here to fight, wishing to please the evil-minded son of Dhṛtarāṣṭra.

🌷. Purport :  
It was an open secret that Duryodhana wanted to usurp the kingdom of the Pāṇḍavas by evil plans, in collaboration with his father, Dhṛtarāṣṭra.

Therefore, all persons who had joined the side of Duryodhana must have been birds of the same feather. Arjuna wanted to see them on the battlefield before the fight was begun, just to learn who they were, but he had no intention of proposing peace negotiations with them. It was also a fact that he wanted to see them to make an estimate of the strength which he had to face, although he was quite confident of victory because Kṛiṣṇa was sitting by his side.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 24 / Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 24. దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా |*
*భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ‖ 24 ‖ 🍀

🍀 64) దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా - 
దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.

🍀 65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా - 
భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
📚. Prasad Bharadwaj 

*🌻 24. devarṣi-gaṇa-saṁghāta-stūyamānātma-vaibhavā |*
*bhaṇḍāsura-vadhodyukta-śaktisenā-samanvitā || 24 || 🌻*

🌻 64 ) Devarshi Gana - sangatha - stuyamanathma - vaibhava -   
She who has all the qualities fit to be worshipped by sages and devas

🌻 65 ) Bhandasura vadodyuktha shakthi sena samavitha -   
She who is surrounded by army set ready to kill Bandasura.

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasra Namavali - 24 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మిధునరాశి- ఆరుద్ర నక్షత్రం 4వ పాద శ్లోకం*

*🍀 24 . అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః*
*సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ‖ 24 ‖ 🍀*

🍀 218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.

🍀 219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.

🍀 220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.

🍀 221) న్యాయ: - సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు.

🍀 222) నేతా - జగత్తు యనెడి యంత్రమును నడుపువాడు.

🍀 223) సమీరణ: - ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు.

🍀 224) సహస్రమూర్ధా - సహస్ర శిరస్సులు గలవాడు.

🍀 225) విశ్వాత్మా - విశ్వమునకు ఆత్మయైనవాడు.

🍀 226) సహస్రాక్ష: - సహస్ర నేత్రములు కలవాడు.

🍀 227) సహస్రపాత్ - సహస్రపాదములు కలవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 24 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Midhuna Rasi, Arudra 4th Padam*

*🌻 24. agraṇīrgrāmaṇīḥ śrīmān nyāyō netā samīraṇaḥ |
sahasramūrdhā viśvātmā sahasrākṣaḥ sahasrapāt || 24 || 🌻*

🌻 218. Agraṇīḥ: One who leads all liberation-seekers to the highest status.

🌻 219. Grāmaṇīḥ: One who has the command over Bhutagrama or the collectivity of all beings.

🌻 220. Śrīmān: One more resplendent than everything.

🌻 221. Nyāyaḥ: The consistency which runs through all ways of knowing and which leads one to the truth of Non-duality.

🌻 222. Netā: One who moves this world of becoming.

🌻 223. Samīraṇaḥ: One who in the form of breath keeps all living beings functioning.

🌻 224. Sahasramūrdhā: One with a thousand, i.e. innumerable, heads.

🌻 225. Viśvātmā: The soul of the universe.

🌻 226. Sahasrākṣaḥ: One with a thousand or innumerable eyes.

🌻 227. Sahasrapāt: One with a thousand, i.e. innumerable legs.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 204 / Sri Lalitha Chaitanya Vijnanam - 204

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 204 / Sri Lalitha Chaitanya Vijnanam - 204 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖

🌻 204. 'సర్వమంత్ర స్వరూపిణీ' 🌻

సర్వమంత్రముల రూపము శ్రీదేవియే అని అర్థము.

మంత్ర మనగా మననము చేయుకొలదీ రక్షించునది అని అర్థము. మంత్రము శబ్ద స్వరూపము. శబ్దము శ్రీదేవి స్వరూపమే. ఏ దేవతా రూపమైననూ శ్రీదేవి వలననే ఏర్పడినది. నామము శబ్దమునుండి ఏర్పడినదే.

నామ రూపములతో కలది మంత్రదేవత. అట్టి దేవతకు ఆధారము శ్రీదేవియే. మన వాజ్మయమున ఏడుకోట్ల మంత్రములు గలవని తెలుపబడినది. అన్ని మంత్రములూ శ్రీదేవి రూపములే అని తెలియవలెను.

బంగారు ఆభరణములు ఎన్ని యున్ననూ వానికి మూలము బంగారమే కదా! అట్లే మంత్ర రూపములు, మంత్రములు ఎన్ని యున్ననూ అవి అన్నియూ శ్రీదేవి రూపములే.

ప్రకృతియైన శ్రీదేవి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది అష్ట దిక్పాలకులు, నవగ్రహములు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, పంచభూతములు, జీవులు ఏర్పడినవి. వీనియందు దేని నారాధించిననూ దానికి మూలము శ్రీదేవియే. శ్రీదేవి ఆరాధనము ఈ విధముగ అన్ని ఆరాధనములకు మూలమై యున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 204 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Sarva-mantra-svarūpiṇī सर्व-मन्त्र-स्वरूपिणी (204) 🌻

She is the embodiment of all mantra-s. This is one of the reasons why tantra śāstra is based on Her various forms, as mantra-s have vital role in tantric rituals. It is said that all the mantra-s are placed around the Pañcadaśī mantra, which is the centre of all mantra-s.

This nāma could also be interpreted this way. There are fifty one letters in Sanskrit. All these fifty one letters are twined together in the form of a garland and worn by Her. So any mantra has to originate from these alphabets. This is the reason for addressing Her as Sarva-mantra-svarūpiṇī. This nāma and the next one are extensions of the previous nāma.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

09 Feb 2021

జ్ఞానవాహిక .. నిశ్శబ్ద ధ్యానం

🌹. జ్ఞానవాహిక .. నిశ్శబ్ద ధ్యానం 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

భయాన్ని ప్రేమగా మార్చేందుకు ధ్యానం :

సుఖాసనంగా సౌకర్యంగా కూర్చుని మీ ఒడిలో మీ కుడి చేతిని ఎడమ చేతి కింద పెట్టండి. ఈ కూర్చునే విధానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ కుడి చెయ్యి ఎడమ మెదడుతోను, ఎడమ చెయ్యి కుడి మెదడుతోను అనుసంధానమై ఉంటాయి. భయం ఎప్పుడూ ఎడమ మెదడు నుంచి ధైర్యం ఎప్పుడూ కుడి మెదడు నుంచి పుడతాయి.

ఎడమ మెదడు కారణానికి జన్మస్థానం, కారణం ఎపుడూ పిరికిదే. అందుకే ధైర్యము, తెలివితేటలు ఉన్న వ్యక్తి మీకు ఎక్కడా కనిపించడు. ఎందుకంటే ధైర్యమున్న వ్యక్తికి తెలివితేటలుండవు. అదంతే. కుడి మెదడు సహజ జ్ఞానంతో ఉంటుంది.

అందుకే అది కేవలం ప్రతీకాత్మకంగా ఉంటుంది. అనుబంధం, ఒక నిర్దిష్టమైన అనుబంధంలోకి ప్రవేశ పెడుతుంది. అందుకే కుడి చేతిని ఎడమ చేతి కింద ఉంచి రెండు చెతుల బొటనవేళ్లు కలుసుకొనేలా చేసి హాయిగా కళ్ల మూసుకొని విశ్రాంతిగా కూర్చుని ఎడమ దవడను కాస్త వదులుగా ఉండేలా చేసి నోటితో గాలి పీల్చడం ప్రారంభించండి. ముక్కుతో గాలి పీల్చకండి.

ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి బలవంతాలు ఉండకూడదు. అపుడు పాత పద్ధతిలో ఉంటే మనసు పని చెయ్యడం మానేస్తుంది. ఇది ఒక నూతన శ్వాస పద్ధతి. మీరు దీనిని సులభంగా అలవాటు చేసుకోవచ్చు.

మీరు ముక్కుతో గాలి పీల్చుకోకపోతే అది మీ మెదడుకు ఉల్లాసానివ్వదు. ఎందుకంటే నోటితో గాలి నేరులో రొమ్ములోకి వెళ్లిపోతుంది. ముక్కుతో గాలి పీల్చుకొనేటపుడు ప్రతి నలబై నిముషాలకు ముక్కు రంధ్రాలు ఒకదాని తరువాత మరొకటి బాధ్యతను స్వీకరించి మీ మెదడు రెండు పక్కల ఉల్లాస మర్దనాలు నిరంతరం కొనసాగిస్తూ ఉంటాయి. అందుకే మీ ముక్కులో శ్వాస క్రియ అటు ఇటు మారుతూ ఉంటుంది.

కాబట్టి నేను చెప్పినట్లు హాయిగా సుఖాసనంలో కూర్చుని నోటితో గాలిని పీల్చండి. ముక్కుకు రెండు రంధ్రాలు ఉంటాయి కనుక అది ద్వంద్వంగా పని చేస్తుంది. అందుకే ముక్కుతో గాలి పీల్చుకునేటపుడు మీకు తెలియకుండానే మీ స్థితి అటు ఇటు మారుతూ ఉంటుంది.

కానీ, నోటితో ఎంతసేపు గాలి పీల్చినా మీ స్థితిలోకాని, దాని పని తీరులో కాని ఎలాంటి మార్పు ఉండదు. అందువల్ల అంతా నేరుగా, సవ్యంగా, ఎలాంటి ద్వంద్వం లేకుండా, చాల నిశ్శబ్దంగా సాగిపోతుంది. దాని వల్ల మీ శక్తులు నూతన మార్గంలో ప్రవహించడం ప్రారంభిస్తాయి. కనుక మీరు ప్రతిరోజు కేవలం నలభై నిముషాల పాటు ఏమీ చెయ్యకుండా చాలా నిశ్శబ్దంగా కూర్చోండి.

ఒకవేళ వీలుపడితే ఆ సమయాన్ని అరవై నిముషాలకు పెంచే ప్రయత్నం చేయండి. అలా చేస్తే మీకు మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రతి రోజూ అలా చెయ్యండి. సృజనాత్మకంగా చేసేందుకు మీ దారిలో లభించిన ప్రతి అవకాశాన్ని చక్కగా అందుకుని ఆనందించండి. ఎపుడూ ఎదో ఒక పని చేసే జీవితాన్ని ఎంచుకోండి తప్ప ఎప్పుడూ పారిపోకండి. వెనుకంజ వేయకండి. నిర్భయాన్వేషణలో...

జీవితంలో ఎవరైనా భయపడతారు, భయపడాలి. జీవితం అలాగే ఉంటుంది. కేవలం ధైర్యమున్నంత మాత్రాన మీరు నిర్భయులైనట్లు కాదు. ఎందుకంటే, తన భయాన్ని అణచుకోవడం ద్వారా మనిషి నిర్భయుడుగా కనిపిస్తాడే కానీ, నిజానికి, అతడు నిర్భయుడు కాడు. తన భయాలను అంగీకరించిన వాడే నిర్భయుడవుతాడు.

అది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు. అది కేవలం జీవిత వాస్తవాలను గమనిస్తూ, ‘‘భయాలన్నీ సహజమే’’ అని తెలుసుకోవడం. అప్పుడే ఎవరైనా తన భయాలను అంగీకరిస్తారు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹

09 Feb 2021

దేవాపి మహర్షి బోధనలు - 27

🌹. దేవాపి మహర్షి బోధనలు - 27 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 18. సూర్య చంద్రులు 🌻

సూర్యుని కిరణములు సరాసరి భూమిపై పడుచుండును. అవే సూర్యుని కిరణములు చంద్రునిపై ప్రతిబింబించి భూమికి చంద్ర కిరణములుగ చేరును. కిరణముల రూపమున జీవులే రెండు విధములుగా భూమిని చేరుచున్నారు. కొందరు సూటిగా సూర్యుని నుండి భూమికి చేరగా, కొందరు చంద్రుని మార్గమున భూమికి చేరుచున్నారు.

ఇందు మొదటి వారిని సూర్యవంశపు రాజులని, రెండవ వారిని చంద్రవంశపు రాజులని ప్రాచీన గ్రంథములు పేర్కొనుచున్నవి. సూర్యుడు ఆత్మకు ప్రతీక, చంద్రుడు మనస్సునకు ప్రతీక.

ఆత్మజ్ఞానము కలవారు సూర్యవంశము వారు. మనో విజ్ఞానము కలవారు చంద్రవంశము వారు. మొదటి వారిది దేవయాన పథము అందురు. ఈ పథమున చావు పుట్టుకలు లేవు. రెండవది పితృయాన పథము అందురు. ఈ పథమున జీవులు పుట్టుచు చచ్చుచునుందురు.

మొదటిది అర్చిర్ మార్గమనియు, రెండవది ధూమ్ర మార్గమని కూడ పెద్దలు బోధించినారు. ఈ సూత్రమును వివరించునదే శర్మిష్ఠ - దేవయాని కథగ తెలుపబడినది. దేవయాన పథము ఆత్మజ్ఞాన పథము. శర్మిష్ఠ పితృయాన పథమునకు సంకేతము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

09 Feb 2021

వివేక చూడామణి - 17./ Viveka Chudamani - 17

🌹. వివేక చూడామణి - 17./ Viveka Chudamani - 17 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. బంధనాలు - 2 🍀

71. నేను ఇప్పుడు, నీవు ఏమి తెలుసుకోవలసి ఉన్నదో చెప్పుచున్నాను. నీవు ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించవలెను. జాగ్రత్తగా విని నీవేమి చేయాలో నిర్ణయించుకొనుము.

72. సప్త ధాతువులతో కూడిన ఈ శరీరము అనగా చర్మము, చర్మము పై ఉన్న పొర, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మజ్జ మరియు శరీర భాగాలైన కాళ్ళు, ఊరువులు, చాతి, చేతులు, వీపు మరియు తల, వీటన్నింటితో ఈ శరీరము నిర్మింపబడినది.

73. మాయా నిర్మితమై 'నేను' 'నాది' అని పిలువబడుతూ ఈ శరీరము మొత్తము యోగులచే వర్ణింపబడినది. ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి అనునవి మూల భూతములు. ఈ మూల భూతములచే శరీరము రూపొందినది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 17 🌹

✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj

🌻 Attachments - 2 🌻

71. Now I am going to tell thee fully about what thou oughtst to know –the discrimination between the Self and the non-Self. Listen to it and decide about it in thy mind.

72. Composed of the seven ingredients, viz. marrow, bones, fat, flesh, blood, skin and cuticle, and consisting of the following limbs and their parts –legs, thighs, the chest, arms, the back and the head:

73. This body, reputed to be the abode of the delusion of ‘I and mine’, is designated by sages as the gross body. The sky, air, fire, water and earth are subtle elements.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

09 Feb 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 278, 297 / Vishnu Sahasranama Contemplation - 278, 279

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 278 / Vishnu Sahasranama Contemplation - 278, 279 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻278. బుద్ధః, बुद्धः, Buddhaḥ🌻

ఓం బుద్ధాయ నమః | ॐ बुद्धाय नमः | OM Buddhāya namaḥ

బుద్ధః, बुद्धः, Buddhaḥ

ధర్మజ్ఞానాద్యుపేతత్వాద్విష్ణు ర్బుద్ధ ఇతీర్యతే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు ఉత్తమ లక్షణములు సమృద్ధిగా గల విష్ణువు బుద్ధుడుగా పిలువబడతాడు.

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::

వ. ...అప్రబోధంబువలన ద్వైపాయనుండు, బాషాండ సమూహంబు వలన బుద్ధ దేవుండును, శనైశ్చరునివలనఁ గల్కియునై, ధర్మరక్షణ పరుండైన మహావతారుండు నన్ను రక్షించుఁగాత!... (307)

అజ్ఞానం నుండి కృష్ణద్వైపాయణుడు కాపాడుగాక! పాషాండుల నుండి బుద్ధదేవుడు కాపాడునుగాక! కలిరూపుడైన శనినుండి కల్కిమూర్తి నన్ను కాపాడునుగాక!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 278🌹

📚. Prasad Bharadwaj

🌻278. Buddhaḥ🌻

OM Buddhāya namaḥ

Dharmajñānādyupetatvādviṣṇu rbuddha itīryate / धर्मज्ञानाद्युपेतत्वाद्विष्णु र्बुद्ध इतीर्यते Lord Viṣṇu richly endowed with such great qualities like dharma or righteousness, jñāna or wisdom and vairāgya i.e., dispassion is Buddhaḥ.

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 8

Dvaipāyano bhagavānprabodhādbuddhastu pāṣaṇḍagaṇāpramādāt,
Kalkiḥ kaleḥ kālamalātprapātu dharmāvanāyorukr̥tāvatāraḥ. (19)

:: श्रीमद्भागवत - षष्ठ स्कन्धे, अष्टमोऽध्यायः ::

द्वैपायनो भगवान्प्रबोधाद्बुद्धस्तु पाषण्डगणाप्रमादात् ।
कल्किः कलेः कालमलात्प्रपातु धर्मावनायोरुकृतावतारः ॥ १९ ॥

May He in His incarnation as Vyāsadeva protect me from all kinds of ignorance resulting from the absence of Vedic knowledge. May Lord Buddhadeva protect me from activities opposed to Vedic principles and from laziness that causes one to madly forget the Vedic principles of knowledge and ritualistic action. May Kalkideva, the Supreme God, who appeared (is to appear) as an incarnation to protect religious principles, protect me from the dirt of the age of Kali.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ।
बुद्धस्स्पष्टाक्षरो मन्त्र श्चन्द्रांशुर्भास्करद्युतिः ॥ ३० ॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
బుద్ధస్స్పష్టాక్షరో మన్త్ర శ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦ ॥

Ojastejodyutidharaḥ prakāśātmā pratāpanaḥ ।
Buddhasspaṣṭākṣaro mantra ścandrāṃśurbhāskaradyutiḥ ॥ 30 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 279 / Vishnu Sahasranama Contemplation - 279🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻279. స్పష్టాఽక్షరః, स्पष्टाऽक्षरः, Spaṣṭā’kṣaraḥ🌻

ఓం స్పష్టాఽక్షరాయ నమః | ॐ स्पष्टाऽक्षराय नमः | OM Spaṣṭā’kṣarāya namaḥ

స్పష్టాఽక్షరః, स्पष्टाऽक्षरः, Spaṣṭā’kṣaraḥ

ఉదాత్తం స్పష్టమోకారరూపమక్షరమస్యహి ।

తస్మాత్స్పష్టాక్షర ఇతి బుధైస్సంకీర్త్యతే హరిః॥

ఉదాత్తము అనగా స్పష్టము అగు ఓంకారము అను అక్షరము ఎవనికి వాచకముగా లేదా తన్ను చెప్పునదిగా కలదో అట్టి హరి స్పష్టాఽక్షరః.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 279🌹

📚. Prasad Bharadwaj

🌻279. Spaṣṭā’kṣaraḥ🌻

OM Spaṣṭā’kṣarāya namaḥ

Udāttaṃ spaṣṭamokārarūpamakṣaramasyahi,
Tasmātspaṣṭākṣara iti budhaissaṃkīrtyate hariḥ.

उदात्तं स्पष्टमोकाररूपमक्षरमस्यहि ।
तस्मात्स्पष्टाक्षर इति बुधैस्संकीर्त्यते हरिः ॥

Since Hari is marked by clear utterances of the syllable OM / ॐ in an accented tone, He is called Spaṣṭā’kṣara.

Śrīmad Bhāgavata - Canto 12, Chapter 6

Tato’bhūttrivr̥doṃkāro yo’vyaktaprabhavaḥ svarāṭ,
Yattalliṅgaṃ bhagavato brahmaṇaḥ paramātmanaḥ. (39)

From that transcendental subtle vibration arose the oḿkāra composed of three sounds. The oḿkāra has unseen potencies and manifests automatically within a purified heart. It is the representation of the Absolute Truth in all three of His phases — the Supreme Personality, the Supreme Soul and the supreme impersonal truth.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ।
बुद्धस्स्पष्टाक्षरो मन्त्र श्चन्द्रांशुर्भास्करद्युतिः ॥ ३० ॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
బుద్ధస్స్పష్టాక్షరో మన్త్ర శ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦ ॥

Ojastejodyutidharaḥ prakāśātmā pratāpanaḥ ।
Buddhasspaṣṭākṣaro mantra ścandrāṃśurbhāskaradyutiḥ ॥ 30 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

09 Feb 2021

9-FEB-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 634 / Bhagavad-Gita - 634🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 278, 279 / Vishnu Sahasranama Contemplation - 278, 279🌹
3) 🌹 Daily Wisdom - 53🌹
4) 🌹. వివేక చూడామణి - 17🌹
5) 🌹Viveka Chudamani - 17🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 27🌹
7)  🌹. జ్ఞానవాహిక .. నిశ్శబ్ద ధ్యానం 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 204 / Sri Lalita Chaitanya Vijnanam - 204 🌹 
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 545 / Bhagavad-Gita - 545🌹 
🌹. సప్త మహర్షులు - సప్త ఋషి మండలము 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 634 / Bhagavad-Gita - 634 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 51 🌴*

51. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ |
శబ్దాదీన్ విషయాం స్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ||

🌷. తాత్పర్యం : 
బుద్ధిచే పవిత్రుడైనందునను మరియు రాగద్వేషముల నుండి విడివడియున్న కారణముగా ఇంద్రియార్థములను త్యజించి దృఢనిశ్చయముచే మనోనిగ్రహము కలిగియున్నందునను ఏకాంతస్థానమున వసించువాడును, 

🌷. భాష్యము :
బుద్ధిచే పవిత్రుడైనపుడు మనుజుడు సత్త్వగుణమునందు స్థితుడగును. ఆ విధముగా అతడు మనస్సును నియమింపగలిగి సదా సమాధిస్థితుడు కాగలడు. ఇంద్రియార్థముల యెడ ఆసక్తుడు కానటువంటి అతడు తన కర్మల యందు రాగద్వేషములకు దూరుడగును. 

అటువంటి అనాసక్త మనుజుడు సహజముగా ఏకాంతప్రదేశ వాసమునే కోరుచు, మితముగా భుజించును, దేహము, మనస్సు చేయు కర్మలను నియమించుచుండును. దేహమును ఆత్మగా భావింపనందున అతడు మిథ్యాహంకారమునకు దూరుడై యుండును. అదేవిధముగా పలు విషయవస్తువుల సేకరణ ద్వారా అతడు దేహమును తృప్తిపరుచుట వాంచింపడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 634 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 51 🌴*

51. buddhyā viśuddhayā yukto
dhṛtyātmānaṁ niyamya ca
śabdādīn viṣayāṁs tyaktvā
rāga-dveṣau vyudasya ca

🌷 Translation : 
Being purified by his intelligence and controlling the mind with determination, giving up the objects of sense gratification, being freed from attachment and hatred, one who lives in a secluded place,

🌹 Purport :
When one is purified by intelligence, he keeps himself in the mode of goodness. Thus one becomes the controller of the mind and is always in trance. He is not attached to the objects of sense gratification, and he is free from attachment and hatred in his activities. 

Such a detached person naturally prefers to live in a secluded place, he does not eat more than what he requires, and he controls the activities of his body and mind. He has no false ego because he does not accept the body as himself. Nor has he a desire to make the body fat and strong by accepting so many material things.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 278 / Vishnu Sahasranama Contemplation - 278, 279 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻278. బుద్ధః, बुद्धः, Buddhaḥ🌻*

*ఓం బుద్ధాయ నమః | ॐ बुद्धाय नमः | OM Buddhāya namaḥ*

బుద్ధః, बुद्धः, Buddhaḥ

ధర్మజ్ఞానాద్యుపేతత్వాద్విష్ణు ర్బుద్ధ ఇతీర్యతే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు ఉత్తమ లక్షణములు సమృద్ధిగా గల విష్ణువు బుద్ధుడుగా పిలువబడతాడు.

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
వ. ...అప్రబోధంబువలన ద్వైపాయనుండు, బాషాండ సమూహంబు వలన బుద్ధ దేవుండును, శనైశ్చరునివలనఁ గల్కియునై, ధర్మరక్షణ పరుండైన మహావతారుండు నన్ను రక్షించుఁగాత!... (307)

అజ్ఞానం నుండి కృష్ణద్వైపాయణుడు కాపాడుగాక! పాషాండుల నుండి బుద్ధదేవుడు కాపాడునుగాక! కలిరూపుడైన శనినుండి కల్కిమూర్తి నన్ను కాపాడునుగాక!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 278🌹*
📚. Prasad Bharadwaj 

*🌻278. Buddhaḥ🌻*

*OM Buddhāya namaḥ*

Dharmajñānādyupetatvādviṣṇu rbuddha itīryate / धर्मज्ञानाद्युपेतत्वाद्विष्णु र्बुद्ध इतीर्यते Lord Viṣṇu richly endowed with such great qualities like dharma or righteousness, jñāna or wisdom and vairāgya i.e., dispassion is Buddhaḥ.

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 8
Dvaipāyano bhagavānprabodhādbuddhastu pāṣaṇḍagaṇāpramādāt,
Kalkiḥ kaleḥ kālamalātprapātu dharmāvanāyorukr̥tāvatāraḥ. (19)

:: श्रीमद्भागवत - षष्ठ स्कन्धे, अष्टमोऽध्यायः ::
द्वैपायनो भगवान्प्रबोधाद्बुद्धस्तु पाषण्डगणाप्रमादात् ।
कल्किः कलेः कालमलात्प्रपातु धर्मावनायोरुकृतावतारः ॥ १९ ॥

May He in His incarnation as Vyāsadeva protect me from all kinds of ignorance resulting from the absence of Vedic knowledge. May Lord Buddhadeva protect me from activities opposed to Vedic principles and from laziness that causes one to madly forget the Vedic principles of knowledge and ritualistic action. May Kalkideva, the Supreme God, who appeared (is to appear) as an incarnation to protect religious principles, protect me from the dirt of the age of Kali.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ।बुद्धस्स्पष्टाक्षरो मन्त्र श्चन्द्रांशुर्भास्करद्युतिः ॥ ३० ॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।బుద్ధస్స్పష్టాక్షరో మన్త్ర శ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦ ॥

Ojastejodyutidharaḥ prakāśātmā pratāpanaḥ ।Buddhasspaṣṭākṣaro mantra ścandrāṃśurbhāskaradyutiḥ ॥ 30 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 279 / Vishnu Sahasranama Contemplation - 279🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻279. స్పష్టాఽక్షరః, स्पष्टाऽक्षरः, Spaṣṭā’kṣaraḥ🌻*

*ఓం స్పష్టాఽక్షరాయ నమః | ॐ स्पष्टाऽक्षराय नमः | OM Spaṣṭā’kṣarāya namaḥ*

స్పష్టాఽక్షరః, स्पष्टाऽक्षरः, Spaṣṭā’kṣaraḥ

ఉదాత్తం స్పష్టమోకారరూపమక్షరమస్యహి ।
తస్మాత్స్పష్టాక్షర ఇతి బుధైస్సంకీర్త్యతే హరిః॥

ఉదాత్తము అనగా స్పష్టము అగు ఓంకారము అను అక్షరము ఎవనికి వాచకముగా లేదా తన్ను చెప్పునదిగా కలదో అట్టి హరి స్పష్టాఽక్షరః.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 279🌹*
📚. Prasad Bharadwaj 

*🌻279. Spaṣṭā’kṣaraḥ🌻*

*OM Spaṣṭā’kṣarāya namaḥ*

Udāttaṃ spaṣṭamokārarūpamakṣaramasyahi,
Tasmātspaṣṭākṣara iti budhaissaṃkīrtyate hariḥ.

उदात्तं स्पष्टमोकाररूपमक्षरमस्यहि ।
तस्मात्स्पष्टाक्षर इति बुधैस्संकीर्त्यते हरिः ॥

Since Hari is marked by clear utterances of the syllable OM / ॐ in an accented tone, He is called Spaṣṭā’kṣara.

Śrīmad Bhāgavata - Canto 12, Chapter 6

Tato’bhūttrivr̥doṃkāro yo’vyaktaprabhavaḥ svarāṭ,

Yattalliṅgaṃ bhagavato brahmaṇaḥ paramātmanaḥ. (39)

From that transcendental subtle vibration arose the oḿkāra composed of three sounds. The oḿkāra has unseen potencies and manifests automatically within a purified heart. It is the representation of the Absolute Truth in all three of His phases — the Supreme Personality, the Supreme Soul and the supreme impersonal truth.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ।बुद्धस्स्पष्टाक्षरो मन्त्र श्चन्द्रांशुर्भास्करद्युतिः ॥ ३० ॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।బుద్ధస్స్పష్టాక్షరో మన్త్ర శ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦ ॥

Ojastejodyutidharaḥ prakāśātmā pratāpanaḥ ।Buddhasspaṣṭākṣaro mantra ścandrāṃśurbhāskaradyutiḥ ॥ 30 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 53 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 22. The Whole World is Active 🌻*

The whole world is active when even a single event takes place at any point in space, just as the whole body is active even if a little thorn is to prick the sole of the foot. It is not a local effect merely; it is the entire body-organism getting energised into the requisite action. 

The whole world becomes aware of even the wisp of a wind, the fall of a leaf or even the movement of a bird, and this is not merely a gospel that you hear in the New Testament, the sermon of the Buddha, or the Upanishad; it is a scientific fact. 

This is a great revelation which came to Seers of such profundity as the Upanishads, for instance, where we are awakened to the fact of a cosmic interconnection of things, which sets itself into motion at the time of the occurrence of any event, perception, or whatever it is. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 17 🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. బంధనాలు - 2 🍀*

71. నేను ఇప్పుడు, నీవు ఏమి తెలుసుకోవలసి ఉన్నదో చెప్పుచున్నాను. నీవు ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించవలెను. జాగ్రత్తగా విని నీవేమి చేయాలో నిర్ణయించుకొనుము.

72. సప్త ధాతువులతో కూడిన ఈ శరీరము అనగా చర్మము, చర్మము పై ఉన్న పొర, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మజ్జ మరియు శరీర భాగాలైన కాళ్ళు, ఊరువులు, చాతి, చేతులు, వీపు మరియు తల, వీటన్నింటితో ఈ శరీరము నిర్మింపబడినది.

73. మాయా నిర్మితమై 'నేను' 'నాది' అని పిలువబడుతూ ఈ శరీరము మొత్తము యోగులచే వర్ణింపబడినది. ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి అనునవి మూల భూతములు. ఈ మూల భూతములచే శరీరము రూపొందినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 17 🌹* 
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj 

*🌻 Attachments - 2 🌻*

71. Now I am going to tell thee fully about what thou oughtst to know –the discrimination between the Self and the non-Self. Listen to it and decide about it in thy mind.

72. Composed of the seven ingredients, viz. marrow, bones, fat, flesh, blood, skin and cuticle, and consisting of the following limbs and their parts –legs, thighs, the chest, arms, the back and the head:

73. This body, reputed to be the abode of the delusion of ‘I and mine’, is designated by sages as the gross body. The sky, air, fire, water and earth are subtle elements.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 27 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 18. సూర్య చంద్రులు 🌻*

సూర్యుని కిరణములు సరాసరి భూమిపై పడుచుండును. అవే సూర్యుని కిరణములు చంద్రునిపై ప్రతిబింబించి భూమికి చంద్ర కిరణములుగ చేరును. కిరణముల రూపమున జీవులే రెండు విధములుగా భూమిని చేరుచున్నారు. కొందరు సూటిగా సూర్యుని నుండి భూమికి చేరగా, కొందరు చంద్రుని మార్గమున భూమికి చేరుచున్నారు. 

ఇందు మొదటి వారిని సూర్యవంశపు రాజులని, రెండవ వారిని చంద్రవంశపు రాజులని ప్రాచీన గ్రంథములు పేర్కొనుచున్నవి. సూర్యుడు ఆత్మకు ప్రతీక, చంద్రుడు మనస్సునకు ప్రతీక. 

ఆత్మజ్ఞానము కలవారు సూర్యవంశము వారు. మనో విజ్ఞానము కలవారు చంద్రవంశము వారు. మొదటి వారిది దేవయాన పథము అందురు. ఈ పథమున చావు పుట్టుకలు లేవు. రెండవది పితృయాన పథము అందురు. ఈ పథమున జీవులు పుట్టుచు చచ్చుచునుందురు. 

మొదటిది అర్చిర్ మార్గమనియు, రెండవది ధూమ్ర మార్గమని కూడ పెద్దలు బోధించినారు. ఈ సూత్రమును వివరించునదే శర్మిష్ఠ - దేవయాని కథగ తెలుపబడినది. దేవయాన పథము ఆత్మజ్ఞాన పథము. శర్మిష్ఠ పితృయాన పథమునకు సంకేతము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. జ్ఞానవాహిక .. నిశ్శబ్ద ధ్యానం 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

భయాన్ని ప్రేమగా మార్చేందుకు ధ్యానం :

సుఖాసనంగా సౌకర్యంగా కూర్చుని మీ ఒడిలో మీ కుడి చేతిని ఎడమ చేతి కింద పెట్టండి. ఈ కూర్చునే విధానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ కుడి చెయ్యి ఎడమ మెదడుతోను, ఎడమ చెయ్యి కుడి మెదడుతోను అనుసంధానమై ఉంటాయి. భయం ఎప్పుడూ ఎడమ మెదడు నుంచి ధైర్యం ఎప్పుడూ కుడి మెదడు నుంచి పుడతాయి.

ఎడమ మెదడు కారణానికి జన్మస్థానం, కారణం ఎపుడూ పిరికిదే. అందుకే ధైర్యము, తెలివితేటలు ఉన్న వ్యక్తి మీకు ఎక్కడా కనిపించడు. ఎందుకంటే ధైర్యమున్న వ్యక్తికి తెలివితేటలుండవు. అదంతే. కుడి మెదడు సహజ జ్ఞానంతో ఉంటుంది. 

అందుకే అది కేవలం ప్రతీకాత్మకంగా ఉంటుంది. అనుబంధం, ఒక నిర్దిష్టమైన అనుబంధంలోకి ప్రవేశ పెడుతుంది. అందుకే కుడి చేతిని ఎడమ చేతి కింద ఉంచి రెండు చెతుల బొటనవేళ్లు కలుసుకొనేలా చేసి హాయిగా కళ్ల మూసుకొని విశ్రాంతిగా కూర్చుని ఎడమ దవడను కాస్త వదులుగా ఉండేలా చేసి నోటితో గాలి పీల్చడం ప్రారంభించండి. ముక్కుతో గాలి పీల్చకండి.

ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి బలవంతాలు ఉండకూడదు. అపుడు పాత పద్ధతిలో ఉంటే మనసు పని చెయ్యడం మానేస్తుంది. ఇది ఒక నూతన శ్వాస పద్ధతి. మీరు దీనిని సులభంగా అలవాటు చేసుకోవచ్చు.

మీరు ముక్కుతో గాలి పీల్చుకోకపోతే అది మీ మెదడుకు ఉల్లాసానివ్వదు. ఎందుకంటే నోటితో గాలి నేరులో రొమ్ములోకి వెళ్లిపోతుంది. ముక్కుతో గాలి పీల్చుకొనేటపుడు ప్రతి నలబై నిముషాలకు ముక్కు రంధ్రాలు ఒకదాని తరువాత మరొకటి బాధ్యతను స్వీకరించి మీ మెదడు రెండు పక్కల ఉల్లాస మర్దనాలు నిరంతరం కొనసాగిస్తూ ఉంటాయి. అందుకే మీ ముక్కులో శ్వాస క్రియ అటు ఇటు మారుతూ ఉంటుంది.

కాబట్టి నేను చెప్పినట్లు హాయిగా సుఖాసనంలో కూర్చుని నోటితో గాలిని పీల్చండి. ముక్కుకు రెండు రంధ్రాలు ఉంటాయి కనుక అది ద్వంద్వంగా పని చేస్తుంది. అందుకే ముక్కుతో గాలి పీల్చుకునేటపుడు మీకు తెలియకుండానే మీ స్థితి అటు ఇటు మారుతూ ఉంటుంది. 

కానీ, నోటితో ఎంతసేపు గాలి పీల్చినా మీ స్థితిలోకాని, దాని పని తీరులో కాని ఎలాంటి మార్పు ఉండదు. అందువల్ల అంతా నేరుగా, సవ్యంగా, ఎలాంటి ద్వంద్వం లేకుండా, చాల నిశ్శబ్దంగా సాగిపోతుంది. దాని వల్ల మీ శక్తులు నూతన మార్గంలో ప్రవహించడం ప్రారంభిస్తాయి. కనుక మీరు ప్రతిరోజు కేవలం నలభై నిముషాల పాటు ఏమీ చెయ్యకుండా చాలా నిశ్శబ్దంగా కూర్చోండి. 

ఒకవేళ వీలుపడితే ఆ సమయాన్ని అరవై నిముషాలకు పెంచే ప్రయత్నం చేయండి. అలా చేస్తే మీకు మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రతి రోజూ అలా చెయ్యండి. సృజనాత్మకంగా చేసేందుకు మీ దారిలో లభించిన ప్రతి అవకాశాన్ని చక్కగా అందుకుని ఆనందించండి. ఎపుడూ ఎదో ఒక పని చేసే జీవితాన్ని ఎంచుకోండి తప్ప ఎప్పుడూ పారిపోకండి. వెనుకంజ వేయకండి. నిర్భయాన్వేషణలో...

జీవితంలో ఎవరైనా భయపడతారు, భయపడాలి. జీవితం అలాగే ఉంటుంది. కేవలం ధైర్యమున్నంత మాత్రాన మీరు నిర్భయులైనట్లు కాదు. ఎందుకంటే, తన భయాన్ని అణచుకోవడం ద్వారా మనిషి నిర్భయుడుగా కనిపిస్తాడే కానీ, నిజానికి, అతడు నిర్భయుడు కాడు. తన భయాలను అంగీకరించిన వాడే నిర్భయుడవుతాడు. 

అది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు. అది కేవలం జీవిత వాస్తవాలను గమనిస్తూ, ‘‘భయాలన్నీ సహజమే’’ అని తెలుసుకోవడం. అప్పుడే ఎవరైనా తన భయాలను అంగీకరిస్తారు.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 204 / Sri Lalitha Chaitanya Vijnanam - 204 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |*
*సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖*

*🌻 204. 'సర్వమంత్ర స్వరూపిణీ' 🌻*

సర్వమంత్రముల రూపము శ్రీదేవియే అని అర్థము. 

మంత్ర మనగా మననము చేయుకొలదీ రక్షించునది అని అర్థము. మంత్రము శబ్ద స్వరూపము. శబ్దము శ్రీదేవి స్వరూపమే. ఏ దేవతా రూపమైననూ శ్రీదేవి వలననే ఏర్పడినది. నామము శబ్దమునుండి ఏర్పడినదే. 

నామ రూపములతో కలది మంత్రదేవత. అట్టి దేవతకు ఆధారము శ్రీదేవియే. మన వాజ్మయమున ఏడుకోట్ల మంత్రములు గలవని తెలుపబడినది. అన్ని మంత్రములూ శ్రీదేవి రూపములే అని తెలియవలెను. 

బంగారు ఆభరణములు ఎన్ని యున్ననూ వానికి మూలము బంగారమే కదా! అట్లే మంత్ర రూపములు, మంత్రములు ఎన్ని యున్ననూ అవి అన్నియూ శ్రీదేవి రూపములే. 

ప్రకృతియైన శ్రీదేవి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది అష్ట దిక్పాలకులు, నవగ్రహములు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, పంచభూతములు, జీవులు ఏర్పడినవి. వీనియందు దేని నారాధించిననూ దానికి మూలము శ్రీదేవియే. శ్రీదేవి ఆరాధనము ఈ విధముగ అన్ని ఆరాధనములకు మూలమై యున్నది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 204 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Sarva-mantra-svarūpiṇī सर्व-मन्त्र-स्वरूपिणी (204) 🌻*

She is the embodiment of all mantra-s. This is one of the reasons why tantra śāstra is based on Her various forms, as mantra-s have vital role in tantric rituals. It is said that all the mantra-s are placed around the Pañcadaśī mantra, which is the centre of all mantra-s. 

This nāma could also be interpreted this way. There are fifty one letters in Sanskrit. All these fifty one letters are twined together in the form of a garland and worn by Her. So any mantra has to originate from these alphabets. This is the reason for addressing Her as Sarva-mantra-svarūpiṇī. This nāma and the next one are extensions of the previous nāma. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సప్త మహర్షులు - సప్త ఋషి మండలము 🌹*
(అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం)
📚. ప్రసాద్ భరద్వాజ 

సప్త ఋషులు అనబడేవారు ఒక గణం. ఆ గణంలో ఏడుగురు ఋషులుంటారు. ప్రతి మన్వంతరంలో ఒక గణం ఉంటుంది. మహాప్రళయానికి ముందయితే 14 మన్వంతరాలుంటాయి కనుక 98 మండి సప్తర్షులు ఉంటారు! బ్రహ్మ మానస పుత్రులయిన ఇప్పటి వైవస్వత మన్వంతరంలోని సప్తర్షులు వరుసగా - మరీచి, అంగీరస, అత్రి, పులస్త్య, వశిష్ట, పులహ, క్రతువులు.

మనది కర్మభూమి అయిన ఋషిభూమి. ఈ జగత్తును పాలించేది రాజులయిన, వారిని తమ సలహాలతో, శిక్షణలతో ముందుకు నడిపించేది వారివారి గురువులయిన ఋషులే! అంతేకాదు, మానవాఌకికూడా ఋజువర్తన, సత్ప్రవర్తనలకు మార్గం నిర్దేశించిందికూడా మహనీయులయిన ప్రాచీన ఋషులే. అందుకే మానవజాతి వీరికేంతో ఋణపడి ఉంది. మనుష్య జన్మనేట్టిన ప్రతి ఒక్కరూ పితృ ఋణం, మాతృ ఋణం, గురు ఋణం (ఋషిఋణం), దైవ ఋణాలను తప్పక తీర్చుకోవాలని మన శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి.

సప్తఋషిగణంలోని ఏడుగురు మహర్షులు వరుసగా కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్టుడు, జమదగ్ని - ఇది మరొక క్రమం. తమ అమోఘ తపఃశక్తితో, నియమ నిష్ఠలతో మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించి, వినువీధిలో "సమ్ప్తఋషి మండలం" గా వేలుగుసోబగులు గుప్పిస్తున్న ఈ మహనీయ, ఋషిపుంగవుల గురించి కొంతయిన తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం.

1. కశ్యపుడు సూర్యుని మానస పుత్రుడైన మరీచి తనయుడు. దక్షుని కుమార్తెలయిన అదితి, దితి మొదలయిన పన్నెండు మందిని పెళ్లాడి, సృష్టిని వృద్ధి చేసిన ఇతనికి దేవదానవులు, నరులు, మృగాలు, పశు, పక్షి, వృక్షాదులను కూడా ఇతని సంతతిగానే పేర్కొంటారు. విష్ణువు వామనవతారంలో ఇతనికి పుత్రుడుగా జన్మించాడు. అలాగే, రామకృష్ణావతారాల్లో కూడా కశ్యపుడే దశరథుడుగా, వసుదేవుడుగా జన్మించాడని మన పురాణోక్తి! ధర్మ ప్రబోధం గావించే "కశ్యపధర్మసూత్రాలు", క్షమాగుణాన్ని చాటిచెప్పే "కశ్యపగీత"ను రచించిందీ ఇతనే.

2. అత్రి బ్రహ్మ మానస పుత్రుడు, మహాసాధ్వి అయిన అనసూయ భర్త, మరియు ఘోర తపస్సుతో త్రిమూర్తుల అంశలో చంద్ర, దత్తాత్రేయ, దుర్వాసులను కుమారులుగా పొందాడు. దేవదానవ యుద్ధంలో, చంద్రుడు రాహువుచేత కబళించబదాగా, సూర్యుడు పాలిపోవడంతో జగత్తంతా అంధకారమయిన తరుణంలో, అత్రి, సూర్యునికి ధైర్యానిస్తూ, చంద్రుడి, సూర్యుడి శరీరాలు., నక్షత్రాలు గావించి, ప్రకాశాన్ని తిరిగి రప్పించాడు. రామాయణ కాలంలో, తన ఆశ్రమానికి వచ్చిన సీతారామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చి, అతని ధర్మ పత్ని అయిన అనసూయ సీతమ్మకు నూతన వస్తాభరణాలను ఇచ్చి, పతివ్రతాధర్మ సూక్ష్మాలను ఎరుక పరిచింది. అత్రి మహాముని, "అత్రి సంహిత", "అత్రిస్మృతి", అనే రచనలు చేసాడు. అత్రిస్మృతి కాలక్రమంలో "అత్రేయధర్మ శాస్త్రం"గా జగద్విఖ్యాతి నొందింది.

3. భరద్వాజుడు 
దేవగురువైన బృహస్పతి కుమారుడు. అతన్ని మరుత్తులు పెంచి, భరతునికి అప్పగించారు. భరతునిచే స్వీకరించబడిన వాడు కనుక "భరద్వాజుడు"గా పిలువబడ్డాడు. గంగానదీ తీరంలో ఆశ్రమవాసియైన ఈయన, సీతారామలక్ష్మణులకు అరణ్యవాస సమయంలో ఆతిథ్యమిచ్చాడు. అదే విధంగా, రాముణ్ణి వెదుకుతూ వచ్చిన భరతునికీ, అతని పరిజనులకూ గొప్పగా విందు నొసగి, రాముడు చనిన దిక్కును తెలిపాడు. రావణ వధానంతరం తిరుగు ప్రయాణంలో కూడా వారికి ఆతిథ్య మిచ్చాడు. ఈయన వ్రాసిన 'భారద్వాజస్మృతి' అనే శాస్త్రం - వసిష్ఠాది మహర్షుల కోరిక మేరకు - ఏయే కర్మలను, ఎప్పుడెలా ఆచరించాలో వివరిస్తుంది.

4. విశ్వామిత్రుడు 
తండ్రి గాధి అనంతరం రాజయి, వేటకు వెళ్ళినప్పుడు, విశిష్ఠాశ్రమానికి వేలడం, అక్కడ ఉన్న కామధేనువును కోరటం, వశిష్ఠుడు నిరాకరించడం, కదనానికి దిగి భంగపడడం జరిగిన తరువాత, వశిష్ఠుని అమోఘమైన తపఃశక్తిని చూచి, రాజ్యాన్ని త్యజించి, ఘోర తపస్సు చేసి, మహేంద్రుడు పంపిన మేనక యౌవన-సౌందర్యానికి దాసోహమని, శకుంతల జన్మకు కారణమయ్యి, తప్పు తెలుసుకొని, తిరిగి ఘోర తపస్సు గావించి, తీవ్ర క్షామాన్ని అనుభవించి, పడరాని పట్లు పడి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసి, సత్యవ్రతుడనే రాజును బొందితో స్వర్గానికి పంపబోయి, సాధ్యం కాక, త్రిశంకు స్వర్గాన్నే స్రుష్టించి, వసిష్ఠునిచేత 'బ్రహ్మర్షి' అని పిలిపించుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి, వెతలు అనుభవించి, కోపాన్ని జయించి, చివరకు ఆయనచే 'బ్రహ్మర్షి' అని అనిపించుకొని తృప్తి చెందాడు. విశ్వామిత్రుడే రామలక్ష్మణులకు ఎన్నో శాస్త్రాలు, మంత్ర విద్యలు ఉపదేశించి, ఎందరో దుష్ట రాక్షసులను సంహారం చేహించాడు. అలాగే మిథిలకు వాళ్ళను తోడ్కొని పోయి సీతారామ కళ్యాణానికి హేతువయ్యాడు. సంధ్యావందన గాయత్రీ మంత్రాన్ని ప్రపంచానికి బహూకరించిన ఇతడు 'విశ్వామిత్ర స్మృతి' అనే గ్రంథాన్ని రచించాడు.

5. గౌతముడు 
ప్రచేతసుని మానస పుత్రుడు. 'తను చల్లే విత్తనాలు వెంటనే మొలచి పంట పండా'లని ప్రార్థిస్తూ, బ్రహ్మను స్మరిస్తూ, గొప్ప తపస్సు చేసాడు. వర్షాభావంతో, క్షామం ఏర్పడినప్పుడు, ప్రజలకు తను స్వయంగా వంది, అన్నదానం చేసి, రక్షించాడు. అసూయాపరులైన కొందరు మునులు, గౌతముని సంపదను చూసి, ఒక గోవును అతని పొలంలోకి పంపగా, పైరు మేస్తున్న గోవున అదిలించటానికి ఒక దర్భను మంత్రించి వదలగా, గోవు మరణిస్తుంది. మునులు అతనమీద గోహత్య పాతక దోషం వెయ్యగా, గౌతముడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి, మెప్పించి, అయన జటాజూటంలో ఉన్న గంగను ఆవుప ప్రోక్షించగా, అది బ్రతకటమే కాకుండా, నీటిబిందువులు పడినచోట ఒక నది పుట్టగా, దానికి "గౌతమీ' అని, గోవును బ్రతికించింది కావున 'గోదావరి' అని పేర్లు వచ్చాయి. గౌతముడు, ధర్మ సూత్రాలు, న్యాయ శాస్త్రం, 'గౌతమ సంహిత' అనే జ్యోతిష శాస్త్ర గ్రంథాన్ని రచించాడు.

6. వసిష్ఠుడు 
పరమ పతివ్రతా శిరోమణి అయిన అరుంధతి భర్త. సూర్యవంశ క్షత్రియులకు గురువై, శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నులకు జాతవివాహాది శుభ కర్మలను జరిపించాడు. అశ్రమాని వచ్చిన విశ్వామిత్రునికి అన్నం పెట్టిన పాపానికి, కామధేనువును అపహరించబోగా గుణపాఠం నేర్పాడు. అకారణాలవల్ల అనేక కష్టాలను, కాల పరీక్షలను, ఓర్పుతో, ధైర్యంతో, ఎదుర్కొని, చివరికి ధర్మం, శాంతం, సత్యగుణాలే విజయానికి సోపానాలని జగత్తుకు చాటి చెప్పిన జితేంద్రియుడు, సత్యస్వరూపుడు, ధర్మమూర్తి. హరిశ్చంద్రుని కీర్తి చిరస్థాయిగా నిల్పినవాడు. శ్రీరాముణ్ణి ధర్మపథంలో నడిపినవాడు ఇతడే. ఇతడు ప్రపంచలహిరి, వసిష్ఠధనుర్వేద సంహిత, వసిష్ఠ స్మృతి అనే గ్రంథాలను వ్రాసాడు.

7. జమదగ్ని సత్యవతీఋచీకుల పుత్రుడు. రేణుకాదేవిని పెళ్ళాడాడు. గొప్ప తపశ్శాలి అయినా, రేణుక మనస్సులో జరిగిని తడబాటును ఒకరోజు గ్రహించగానే, ఆగ్రహంతో ఆమెను వధించమని పుత్రులను అజ్ఞాపించాడు. అయిదుగురు పుత్రులలో చివరివాడైన పరసురాముడు పరశువుతో తల్లిని వధించి, తిరిగి తండ్రి ఇచ్చిన వర ప్రభావంతో ఆమెను బ్రతికిస్తాడు. అధికార మదంతో, దురహంకారి అయిన రాజు కార్తవీర్యార్జునుడు తన తండ్రిని మరియు సోదరులను చంపినందుకు అతణ్ణి హతమార్చి, ఆ రక్తంతో తర్పణంతో జమదగ్ని పునర్జీవితుడౌతాడు..జమదగ్ని తన అమోఘ తపఃశక్తితో సప్తఋషి మండలంలో స్థానం పదిలపరచుకున్నాడు.

ఈ సప్త మహా ఋషుల ప్రస్తావన రామాయణంలో కూడా చూడవచ్చు. ముఖ్యంగా రత్నాకరుడు వాల్మీకిగా మారటానికి కారణభూతులవుతారు. అతనికి ప్రాయశ్చిత్త మార్గాన్ని చూపించి తరింపచేసి, రామనామ జపాన్ని బోధించి, వాల్మీకిగా మారుస్తారు. దివ్య తేజస్సుతో, కొన్నేళ్ళ తపస్సు తరువాత, క్రమ్ముకున్న వాల్మీకం నుండి బయటకు దివ్య తేజస్సుతో, ఋషిగా మారి వచ్చిన వాల్మీకిని సప్త మహర్షులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పవిత్రమైన, ఆదికావ్యమైన రామాయణ రచనకు అతన్ని నియోగిస్తారు.

ఈ సప్త ఋషులు, మన పురాణగాథల్లో, మన దివ్య సంస్కృతికి గుర్తులుగా నింగిలో నక్షత్ర రూపులై శాశ్వత మహోన్నతులుగా ప్రఖ్యాతి గడించి, నిలిచిపోయారు.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఆధ్యాత్మికసందేశాలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 545 / Bhagavad-Gita - 545 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 8 🌴*

08. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరమ్ |
అపరస్పరమ్బూతం కిమన్యత్ కామహైతుకమ్ ||

🌷. తాత్పర్యం : 
ఈ జగము అసత్యమనియు, ఆధారములేనిదనియు, నియామకుడెవ్వడును దీనికి లేడనియు, సంగమాభిలాష చేతనే ఉత్పన్నమైనట్టి దీనికి కామము తప్ప వేరొక్కటి కారణము కాదనియు వారు పలుకుదురు.

🌷. భాష్యము :
అసురస్వభావులు ఈ జగమును భ్రాంతి యని నిర్ణయింతురు. దీనికి కార్యకారణములు గాని, నియామకుడుగాని, ప్రయోజనముకాని లేవనియు సర్వము మిథ్యయనియు వారు భావింతురు. ఈ జగత్తు భౌతిక చర్య, ప్రతిచర్య వలన యాదృచ్చికముగా ఏర్పడినదని పలుకుదురే కాని ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై భగవానునిచే సృష్టింపబడినదని వారు భావింపజాలరు. ఈ జగత్తు దానంతట అదే వచ్చియున్నందున దాని వెనుక భగవానుడు ఒకడున్నాడని నమ్మవలసిన అవసరము లేదనెడి తమ స్వంత సిద్ధాంతమును వారు కలిగియుందురు. 

వారి ఆత్మ మరియు భౌతికపదార్థము (అనాత్మ) నడుమగల వ్యత్యాసమును గమనింపరు. అదేవిధముగా దివ్యాత్మను (భగవానుని) కూడా వారు అంగీకరింపఋ. వారి ఉద్దేశ్యమున సమస్తమును పదార్థమే. అనగా సమస్త విశ్వము అజ్ఞానమయమేనని వారి భావము. సమస్తము శూన్యమేయనియు మరియు కనిపించునదంతటికి మన అజ్ఞానమే కారణమనియు వారు తలతురు. నిజమునకు అస్తిత్వము లేనటువంటి పెక్కింటిని మనము స్వప్నము నందు సృష్టించినట్లుగా, వైవిధ్యముగల సృష్టులన్నియు అజ్ఞానము యొక్క ప్రదర్శనయేనని వారు నిశ్చయముగా పలుకుదురు. 

కాని మేల్కాంచినంతనే అదియంతయు స్వప్నమేయని మనము గుర్తింతురు. దానవస్వభావులు జీవితము స్వప్నము వంటిదే యని పలికెను, ఆ స్వప్నమును అనుభవించుటలో అతి ప్రవీణులై యుందురు. తత్కారణముగా జ్ఞానమార్జించుటకు బదులు తమ స్వప్ననగర మందే మరింతగా వారు బంధింపబడుచుందురు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 545 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 08 🌴*

08. asatyam apratiṣṭhaṁ te
jagad āhur anīśvaram
aparaspara-sambhūtaṁ
kim anyat kāma-haitukam

🌷 Translation : 
They say that this world is unreal, with no foundation, no God in control. They say it is produced of sex desire and has no cause other than lust.

🌹 Purport :
The demonic conclude that the world is phantasmagoria. There is no cause and effect, no controller, no purpose: everything is unreal. They say that this cosmic manifestation arises due to chance material actions and reactions. They do not think that the world was created by God for a certain purpose. They have their own theory: that the world has come about in its own way and that there is no reason to believe that there is a God behind it. 

For them there is no difference between spirit and matter, and they do not accept the Supreme Spirit. Everything is matter only, and the whole cosmos is supposed to be a mass of ignorance. According to them, everything is void, and whatever manifestation exists is due to our ignorance in perception. They take it for granted that all manifestation of diversity is a display of ignorance, just as in a dream we may create so many things which actually have no existence. 

Then when we are awake we shall see that everything is simply a dream. But factually, although the demons say that life is a dream, they are very expert in enjoying this dream. And so, instead of acquiring knowledge, they become more and more implicated in their dreamland.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

సప్త మహర్షులు - సప్త ఋషి మండలము Sapta Maharishis - Sapta Rishi Mandal

సప్త మహర్షులు - సప్త ఋషి మండలము

(అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం)

సప్త ఋషులు అనబడేవారు ఒక గణం. ఆ గణంలో ఏడుగురు ఋషులుంటారు. ప్రతి మన్వంతరంలో ఒక గణం ఉంటుంది. మహాప్రళయానికి ముందయితే 14 మన్వంతరాలుంటాయి కనుక 98 మండి సప్తర్షులు ఉంటారు! బ్రహ్మ మానస పుత్రులయిన ఇప్పటి వైవస్వత మన్వంతరంలోని సప్తర్షులు వరుసగా - మరీచి, అంగీరస, అత్రి, పులస్త్య, వశిష్ట, పులహ, క్రతువులు.

మనది కర్మభూమి అయిన ఋషిభూమి. ఈ జగత్తును పాలించేది రాజులయిన, వారిని తమ సలహాలతో, శిక్షణలతో ముందుకు నడిపించేది వారివారి గురువులయిన ఋషులే! అంతేకాదు, మానవాఌకికూడా ఋజువర్తన, సత్ప్రవర్తనలకు మార్గం నిర్దేశించిందికూడా మహనీయులయిన ప్రాచీన ఋషులే. అందుకే మానవజాతి వీరికేంతో ఋణపడి ఉంది. మనుష్య జన్మనేట్టిన ప్రతి ఒక్కరూ పితృ ఋణం, మాతృ ఋణం, గురు ఋణం (ఋషిఋణం), దైవ ఋణాలను తప్పక తీర్చుకోవాలని మన శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి.

సప్తఋషిగణంలోని ఏడుగురు మహర్షులు వరుసగా కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్టుడు, జమదగ్ని - ఇది మరొక క్రమం. తమ అమోఘ తపఃశక్తితో, నియమ నిష్ఠలతో మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించి, వినువీధిలో "సమ్ప్తఋషి మండలం" గా వేలుగుసోబగులు గుప్పిస్తున్న ఈ మహనీయ, ఋషిపుంగవుల గురించి కొంతయిన తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం.

1. కశ్యపుడు సూర్యుని మానస పుత్రుడైన మరీచి తనయుడు. దక్షుని కుమార్తెలయిన అదితి, దితి మొదలయిన పన్నెండు మందిని పెళ్లాడి, సృష్టిని వృద్ధి చేసిన ఇతనికి దేవదానవులు, నరులు, మృగాలు, పశు, పక్షి, వృక్షాదులను కూడా ఇతని సంతతిగానే పేర్కొంటారు. విష్ణువు వామనవతారంలో ఇతనికి పుత్రుడుగా జన్మించాడు. అలాగే, రామకృష్ణావతారాల్లో కూడా కశ్యపుడే దశరథుడుగా, వసుదేవుడుగా జన్మించాడని మన పురాణోక్తి! ధర్మ ప్రబోధం గావించే "కశ్యపధర్మసూత్రాలు", క్షమాగుణాన్ని చాటిచెప్పే "కశ్యపగీత"ను రచించిందీ ఇతనే.

2. అత్రి బ్రహ్మ మానస పుత్రుడు, మహాసాధ్వి అయిన అనసూయ భర్త, మరియు ఘోర తపస్సుతో త్రిమూర్తుల అంశలో చంద్ర, దత్తాత్రేయ, దుర్వాసులను కుమారులుగా పొందాడు. దేవదానవ యుద్ధంలో, చంద్రుడు రాహువుచేత కబళించబదాగా, సూర్యుడు పాలిపోవడంతో జగత్తంతా అంధకారమయిన తరుణంలో, అత్రి, సూర్యునికి ధైర్యానిస్తూ, చంద్రుడి, సూర్యుడి శరీరాలు., నక్షత్రాలు గావించి, ప్రకాశాన్ని తిరిగి రప్పించాడు. రామాయణ కాలంలో, తన ఆశ్రమానికి వచ్చిన సీతారామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చి, అతని ధర్మ పత్ని అయిన అనసూయ సీతమ్మకు నూతన వస్తాభరణాలను ఇచ్చి, పతివ్రతాధర్మ సూక్ష్మాలను ఎరుక పరిచింది. అత్రి మహాముని, "అత్రి సంహిత", "అత్రిస్మృతి", అనే రచనలు చేసాడు. అత్రిస్మృతి కాలక్రమంలో "అత్రేయధర్మ శాస్త్రం"గా జగద్విఖ్యాతి నొందింది.

3. భరద్వాజుడు దేవగురువైన బృహస్పతి కుమారుడు. అతన్ని మరుత్తులు పెంచి, భరతునికి అప్పగించారు. భరతునిచే స్వీకరించబడిన వాడు కనుక "భరద్వాజుడు"గా పిలువబడ్డాడు. గంగానదీ తీరంలో ఆశ్రమవాసియైన ఈయన, సీతారామలక్ష్మణులకు అరణ్యవాస సమయంలో ఆతిథ్యమిచ్చాడు. అదే విధంగా, రాముణ్ణి వెదుకుతూ వచ్చిన భరతునికీ, అతని పరిజనులకూ గొప్పగా విందు నొసగి, రాముడు చనిన దిక్కును తెలిపాడు. రావణ వధానంతరం తిరుగు ప్రయాణంలో కూడా వారికి ఆతిథ్య మిచ్చాడు. ఈయన వ్రాసిన 'భారద్వాజస్మృతి' అనే శాస్త్రం - వసిష్ఠాది మహర్షుల కోరిక మేరకు - ఏయే కర్మలను, ఎప్పుడెలా ఆచరించాలో వివరిస్తుంది.

4. విశ్వామిత్రుడు తండ్రి గాధి అనంతరం రాజయి, వేటకు వెళ్ళినప్పుడు, విశిష్ఠాశ్రమానికి వేలడం, అక్కడ ఉన్న కామధేనువును కోరటం, వశిష్ఠుడు నిరాకరించడం, కదనానికి దిగి భంగపడడం జరిగిన తరువాత, వశిష్ఠుని అమోఘమైన తపఃశక్తిని చూచి, రాజ్యాన్ని త్యజించి, ఘోర తపస్సు చేసి, మహేంద్రుడు పంపిన మేనక యౌవన-సౌందర్యానికి దాసోహమని, శకుంతల జన్మకు కారణమయ్యి, తప్పు తెలుసుకొని, తిరిగి ఘోర తపస్సు గావించి, తీవ్ర క్షామాన్ని అనుభవించి, పడరాని పట్లు పడి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసి, సత్యవ్రతుడనే రాజును బొందితో స్వర్గానికి పంపబోయి, సాధ్యం కాక, త్రిశంకు స్వర్గాన్నే స్రుష్టించి, వసిష్ఠునిచేత 'బ్రహ్మర్షి' అని పిలిపించుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి, వెతలు అనుభవించి, కోపాన్ని జయించి, చివరకు ఆయనచే 'బ్రహ్మర్షి' అని అనిపించుకొని తృప్తి చెందాడు. విశ్వామిత్రుడే రామలక్ష్మణులకు ఎన్నో శాస్త్రాలు, మంత్ర విద్యలు ఉపదేశించి, ఎందరో దుష్ట రాక్షసులను సంహారం చేహించాడు. అలాగే మిథిలకు వాళ్ళను తోడ్కొని పోయి సీతారామ కళ్యాణానికి హేతువయ్యాడు. సంధ్యావందన గాయత్రీ మంత్రాన్ని ప్రపంచానికి బహూకరించిన ఇతడు 'విశ్వామిత్ర స్మృతి' అనే గ్రంథాన్ని రచించాడు.

5. గౌతముడు ప్రచేతసుని మానస పుత్రుడు. 'తను చల్లే విత్తనాలు వెంటనే మొలచి పంట పండా'లని ప్రార్థిస్తూ, బ్రహ్మను స్మరిస్తూ, గొప్ప తపస్సు చేసాడు. వర్షాభావంతో, క్షామం ఏర్పడినప్పుడు, ప్రజలకు తను స్వయంగా వంది, అన్నదానం చేసి, రక్షించాడు. అసూయాపరులైన కొందరు మునులు, గౌతముని సంపదను చూసి, ఒక గోవును అతని పొలంలోకి పంపగా, పైరు మేస్తున్న గోవున అదిలించటానికి ఒక దర్భను మంత్రించి వదలగా, గోవు మరణిస్తుంది. మునులు అతనమీద గోహత్య పాతక దోషం వెయ్యగా, గౌతముడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి, మెప్పించి, అయన జటాజూటంలో ఉన్న గంగను ఆవుప ప్రోక్షించగా, అది బ్రతకటమే కాకుండా, నీటిబిందువులు పడినచోట ఒక నది పుట్టగా, దానికి "గౌతమీ' అని, గోవును బ్రతికించింది కావున 'గోదావరి' అని పేర్లు వచ్చాయి. గౌతముడు, ధర్మ సూత్రాలు, న్యాయ శాస్త్రం, 'గౌతమ సంహిత' అనే జ్యోతిష శాస్త్ర గ్రంథాన్ని రచించాడు.

6. వసిష్ఠుడు పరమ పతివ్రతా శిరోమణి అయిన అరుంధతి భర్త. సూర్యవంశ క్షత్రియులకు గురువై, శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నులకు జాతవివాహాది శుభ కర్మలను జరిపించాడు. అశ్రమాని వచ్చిన విశ్వామిత్రునికి అన్నం పెట్టిన పాపానికి, కామధేనువును అపహరించబోగా గుణపాఠం నేర్పాడు. అకారణాలవల్ల అనేక కష్టాలను, కాల పరీక్షలను, ఓర్పుతో, ధైర్యంతో, ఎదుర్కొని, చివరికి ధర్మం, శాంతం, సత్యగుణాలే విజయానికి సోపానాలని జగత్తుకు చాటి చెప్పిన జితేంద్రియుడు, సత్యస్వరూపుడు, ధర్మమూర్తి. హరిశ్చంద్రుని కీర్తి చిరస్థాయిగా నిల్పినవాడు. శ్రీరాముణ్ణి ధర్మపథంలో నడిపినవాడు ఇతడే. ఇతడు ప్రపంచలహిరి, వసిష్ఠధనుర్వేద సంహిత, వసిష్ఠ స్మృతి అనే గ్రంథాలను వ్రాసాడు.

08 Feb 2021