9-FEB-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 146🌹  
11) 🌹. శివ మహా పురాణము - 344🌹 
12) 🌹 Light On The Path - 97🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 229🌹 
14) 🌹 Seeds Of Consciousness - 293🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 168🌹
16) 🌹. శ్రీమద్భగవద్గీత - 23 / Bhagavad-Gita - 23 🌹 
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 24 / Lalitha Sahasra Namavali - 24🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasranama - 24 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -146 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 29

*🍀 27. సాన్నిధ్యము - తపస్సు, యజ్ఞముల భోక్తను నేను. సర్వలోకముల అధిపతులకు ఈశ్వరుడను నేను. సృష్టి యందు పుట్టిన సమస్త ప్రాణులకు సుహృదయుడను నేను. ఈ విధముగ నన్ను తెలుసు కొనిన వాడు శాశ్వతముగ శాంతిని పొందుచున్నాడు. సన్న్యాస స్థితికి చరమ గీతముగ భగవంతుడు ఈ వాక్యమును పలికినాడు. “నేను” అను అంతర్యామి ప్రజ్ఞగ అందరి హృదయములందు తా నున్నాడు. అట్టివాని చూచుట ప్రధానము. “కర్మ సన్న్యాసయోగము" అని నామ కరణము చేయుటలో గల ఔచిత్య మేమనగ, సత్సాధకుడు తన మనో బుద్ధి యింద్రియములను 'నేను' అను అంతర్యామి ప్రజ్ఞ యందు లగ్నము చేసియుండగ, అతని సమస్త కార్యములు యాంత్రికముగ సాగిపోవును. ఇదియే ఈ అధ్యాయ రహస్యము 🍀*


భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్ |
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి || 29

తపస్సు, యజ్ఞముల భోక్తను నేను. సర్వలోకముల అధిపతులకు ఈశ్వరుడను నేను. సృష్టి యందు పుట్టిన సమస్త ప్రాణులకు సుహృదయుడను నేను. ఈ విధముగ నన్ను తెలుసు కొనిన వాడు శాశ్వతముగ శాంతిని పొందుచున్నాడు. సన్న్యాస స్థితికి చరమ గీతముగ భగవంతుడు ఈ వాక్యమును పలికినాడు. 

“నేను” అను అంతర్యామి ప్రజ్ఞగ అందరి హృదయములందు తా నున్నాడు. అట్టివాని చూచుట ప్రధానము. అతడే సమస్తమునకు స్వామి. అతడే గమ్యము. అట్టి వానిని 'నేను'గ తనయందు, సర్వభూతముల యందు దర్శించుచు దేశమును, కాలమును బట్టి సంచరించువాడు సన్న్యాసి యని, అట్టి సన్న్యాసి శాంతియే ప్రధాన లక్షణముగ యుండునని తెలియ వలెను. 

ఈ అధ్యాయమునకు “కర్మ సన్న్యాసయోగము" అని నామ కరణము చేయుటలో గల ఔచిత్య మేమనగ, సత్సాధకుడు తన మనో బుద్ధి యింద్రియములను 'నేను' అను అంతర్యామి ప్రజ్ఞ యందు లగ్నము చేసియుండగ, అతని సమస్త కార్యములు యాంత్రికముగ సాగిపోవును. చేయుచున్నట్లనిపించదు. దీనికి
భక్తుల జీవితమున చాల ఉదాహరణలు గలవు. 

1. గోపికలు : గోపికల మనసు అహర్నిశలు శ్రీ కృష్ణుని యందే లగ్నమై యుండగ, వారి దైనందిన జీవితమంతయు అనాయాస ముగ సాగిపోయినది. అన్నిటియందు వారు కృష్ణుని దర్శించుటచే
కృష్ణ దర్శన మాధుర్యము గూడ నిరంతర ముండెడిది. 
2. సక్కుబాయి : ఈమెకు మానవ సాధ్యము కాని బరువు బాధ్యతలు అప్పచెప్పబడినను, కృష్ణ సాన్నిధ్యమున నుండుటచే, అసాధ్యము లన్నియు సుసాధ్యములైనవి. దుష్కరమైన కార్యములు
కూడ తాను చేసితినను భావనయే లేక ఫలించినవి. 
3. హనుమంతుని సముద్రోల్లంఘనము, నారదుని వీణా గానము కూడ ఈ కోవకు చెందినవే.

(మనసు కర్మల యందు లగ్నము కాక, దైవమునందు లగ్నమగుటచే కర్మలు అప్రయత్నముగను, అనాయాసముగను సాగునని తెలుపుట 'కర్మ సన్న్యాసయోగ' రహస్యము.)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 345 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
87. అధ్యాయము - 42

*🌻. దక్షుని ఉద్ధారము -3 🌻*

పరమేశ్వరుడవగు నీవు ఆత్మ తత్త్వము లోకములో ప్రవర్తిల్ల జేయుటకై విద్యను, తపస్సును, దీక్షను కలిగియున్న బ్రాహ్మణులను ముందుగా నీ ముఖము నుండి సృజించితివి (38). నీవు పశువుల కాపరి పశువులను పాలించు తీరున భక్తులను సర్వ విధముల ఆపదలనుండి రక్షించెదవు. మరియు ధర్మ మర్యాదలను పాలించె నీవు దుష్టులపై దండమును ప్రయోగించెదవు (39).

నేను చెడుమాటలనే బాణములతో పరమేశ్వరుని వేధించితిని. అయిననూ నీవు నన్ను అనుగ్రహించితివి. అటులనే మిక్కిలి దీనమగు ముఖములు గల ఈ దేవతలను అనుగ్రహించుము (40). హే దీనబంధూ!శంభో!భక్తవత్సలా! అట్టి నీవు భగవానుడవు. పరాత్పరుడవు. నీవు సృష్టించుకున్న నీ స్వరూపమైన ఈ విస్తారమైన బ్రహ్మండములో నీవు ఆనందరూపుడవై ఉన్నావు (41).

బ్రహ్మ ఇట్లు పలికెను -

లోకములకు మంగళములనిచ్చే మహా ప్రభుడగు మహేశ్వరుని దక్ష ప్రజాపతి ఈ తీరున వినయముతో నిండిన అంతకరణము గల వాడై స్తుతించి ఊరకుండెను (42). అపుడు విష్ణువు దోసిలి యొగ్గి నమస్కరించి కన్నీటితో బొంగురుపోయిన పలుకులతో ప్రసన్నమగు మనస్సుతో వృషభధ్వజుని స్తుతించెను (43).

విష్ణువు ఇట్లు పలికెను -

హే మహాదేవా!మహేశ్వరా! లోకములననుగ్రహించువాడా!దీనబంధో! దయానిధీ! పరబ్రహ్మ పరమాత్మవు నీవే (44). హే ప్రభో! సర్వ వ్యాపి, యథేచ్ఛా సంచారి, వేదములచే తెలియదగిన యశస్సు గలవాడు అగు నీవు అనుగ్రహమును చూపితివి. మేము పాపములను చేయునట్లు ఆ దక్షుడు చేసినాడు (45). 

నా భక్తుడగు ఈ దక్షుడు పూర్వములో నిన్ను నిందించినాడు. ఈతడు దుష్టుడు. కాని మహేశా! నీవు నిర్వికారుడవు. కాన నీవు ఆ దోషమును మన్నించుము (46). హే శంకరా! అజ్ఞానముచే నేను కూడ నీయందు అపరాధమును సలిపితిని. నేను దక్షుని పక్షమున నుండి నీ గణములకు అధ్యక్షుడగు వీరభద్రునితో యుద్ధమును చేసితిని (47). నాకు ప్రభువగు పరబ్రహ్మవు నీవే. హే సదాశివా! నేను నీ దాసుడను. నీవు అందరికీ తండ్రివి గాన, నీవు నన్ను కూడ సర్వదా రక్షించవలెను (48).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! నీవు స్వతంత్రుడవగు పరమాత్మవు.అద్వితీయ, అవ్యయ, పరమేశ్వరుడవు నీవే (49). హే ఈశ్వరా! దేవా! నీవు నీకు కలిగిన అవమానమును లెక్కించకుండగా నా కుమారునిపై అనుగ్రహమును చూపితివి. దక్షుని యజ్ఞమును ఉద్ధరించుము (50).

దేవేశా! నీవు ప్రసన్నుడవు కమ్ము. శాపముల నన్నిటినీ త్రోసిపుచ్చుము. జ్ఞాన స్వరూపుడవగు నీవే నన్నీ తీరున ప్రేరేపించితివి. దీనిని నివారించవలసినది నీవే. ఓ మహర్షీ! ఇట్లు నేను దోసిలియొగ్గి తలవంచి నమస్కరించి ఆ పరమ మహేశ్వరుని స్తుతించితిని (52).

  తరువాత ఇంద్రుడు మొదలగు లోకపాలురు, దేవతలు మంచి మనస్సు గలవారై, ప్రసన్నమైన ముఖ పద్మము గల శంకర దేవుని స్తుతించిరి (53). తరువాత ప్రసన్నమగు మనస్సు గల దేవతలందరు, ఇతరులు, సిద్ధులు, ఋషులు, ప్రజాపతులు శంకరుని ఆనందముతో స్తుతించిరి (54). మరియు ఉపదేవతలు, నాగులు, సభలో నున్న బ్రాహ్మణులు శివుని వేర్వేరుగా పరాభక్తితో నమస్కరించి స్తుతించిరి (55).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో దక్షదుఃఖ నిరాకరణ వర్ణనమనే నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 97 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 7 - THE 15th RULE
*🌻 15. Desire possessions above all. - 1 🌻*

 372. But those possessions must belong to the pure soul only, and be possessed therefore by all pure souls equally, and thus be the especial property of the/ whole only when united. Hunger for such possessions as can be held by the pure soul, that you may accumulate wealth for that united spirit of life which is your only true Self.

373. C.W.L. – The possessions which we are to desire are qualities which shall be of use to all humanity. Every victory we gain is to be gained for humanity, not for ourselves. The desire to possess must be one to possess with all others – a desire that all shall share the same inheritance. 

That is the old story of impersonality in another form. We see that beautifully illustrated in the lives of the Masters. I remember long ago feeling considerable wonder as to how it could be that the Masters appear without karma. They are even spoken of in some of the sacred books of the East as having risen above karma. 

I could not understand it, because karma is a law just as much as gravitation is. We might rise as far as the sun itself, but we should not get beyond gravitation; on the contrary we should feel it very much more strongly. 

It seemed to me just as impossible to escape from the law of cause and effect, since under its operation every person receives according to what he does. If the great Masters are all the time doing good on a scale which we cannot in the least hope to equal, and yet They make no karma, what then becomes of the stupendous result of all Their outpourings of energy?

374. Presently, after studying the problem, we began to see how it worked. If I describe what karma looks like clairvoyantly, it will perhaps help to make the matter more intelligible. The appearance of the working of the law of karma on higher planes is something as follows. 

Every man is the centre of an incredibly vast series of concentric spheres – some of them quite near, others reaching to a prodigious distance into the far empyrean. Every thought or word or action, whether good or bad, selfish or unselfish, sends out a stream of force which rushes towards the surfaces of these spheres. 

This force strikes the interior surface of one or other of the spheres at right angles to it, and is reflected back to the point from which it came. From which sphere it is reflected seems to depend upon the character of the force, and this also regulates the time of its return. 

The force which is generated by some actions strikes a sphere which is comparatively near at hand and flies back again very quickly, while other forces rush on almost to infinity and return only after many lives – why we cannot tell. 

All we know is that in any case they inevitably return, and they can return nowhere but to the centre from which they came forth.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 229 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. గర్గమహర్షి 🌻*

 1. గర్గమహర్షి యదుకులానికి ఆచార్యుడు. ఆయ్న ఒకసారి కృష్ణుణ్ణీ లాలిస్తున్నటువంటి యశోదాదేవితో, “ఈ పిల్లవాడు ఎవరోకాదు, సాఖాత్తూ శ్రీమహావిష్ణువే! పరబ్రహ్మ వస్తువు. 

2. రాధేశ్వరుడైన శ్రీకృష్ణుడు, గోలోకాధిపతి భర్గవుడు, శివుడు, నారాయణుడు, నరనారాయణులు, కపిలాది నారాయణావతరములు అన్ని కలిపి ఇతడు. ఈతడిలో లేని అంశలేదు. కపిల, శివ, నారాయణాంశలతో కూడిన ఈతడు గోలోకాధిపతి అయిన మాధవుడే! ఇదే అతడిని గురించిన పరమరహశ్యం” అని చెప్పాడు.

3. ఆయన ఇంకా కృష్ణుని గురించి, “ఇతడు పుట్టీపుట్టగానే దేవకీ వసుదేవులకు మాత్రమే నిజస్వరూపం చూపించాడు. ఇతడికి ప్రతీయుగంలోనూ వర్ణభేదము, నాంభేదము ఉంటాయి. కృత్యుగములో శ్వేతవర్ణుడుగాను, త్రేతలో రక్తవర్ణుడుగాను, ద్వాపరంలో పీతవర్ణుడుగాను ఉంటాడు. ఈ ద్వాపరంలో కృష్ణవర్ణం దాల్చటంచేత కృష్ణుడని పేరువచ్చింది” అని చెప్పాడు. 

4. ఈ కృష్ణవర్ణంలో ఈ నామం అర్థమేమంటే – ‘క‘కారం బ్రహ్మవాచకం, ‘రు‘కారమేమో అనంత వాచకం, ‘ష‘కారమేమో శంకరవాచకం, ‘ణ‘కారమేమో ధర్మ వాచకం, ‘అ‘కారమేమో విష్ణువాచకం, ‘వి‘సర్గము నరనారాయణార్థవాచకం. ఇదీ అతడి నామముయొక్క నిర్మాణము. 

5. ‘కృష్‘ అనేది నిర్వాణవచనము, కృష్ అంటే అంతర్థానమైపోవటమనేది, లయించటమనే అర్థం. ణ కారం మోక్షము; అరాకమేమో విమలాత్మ. అంటే ఆత్మనుగురించి చెప్పేది అకారము అని ఇంకొక అర్థం. కృష్ అనేది నిశ్చేష్ట వాచకం. ఏ పనీలేకుండా ఉండటం, నిష్క్రియుడై ఉండటమంటారు. 

6. రకారమేమో భక్తి తాత్పర్యం; అకారమేమో ధాతృవాచకం, అంటే బ్రహ్మ(నిర్గుణ బ్రహ్మ). అంటే సర్వకార్యాలు(ఏ పనీ)చెయ్యకుండా ఉండటం నిష్క్రియత్వం. బ్రహ్మవస్తువు. అది మూడింటి యొక్క సంపుటి. కృష్ అనే శబ్దానికి కర్మను నిర్మూలచేస్తుందనే అర్థంకూడా ఉంది. ంకారమేమో దాస్యవృత్తిని చెపుతుంది. దాసోహం అని ఈశ్వరుడి దగ్గర చెప్పటం.

7. ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’ అని చెప్పభడింది కాబట్టి, ‘కృషి’ అంటే నిర్మూలనం; అకారమేమో ప్రాప్తి. ఆ కోరుకున్నది పొందటానికి అకారశబ్దం వర్తిస్తుంది. ఈ ప్రకారంగా సర్వశక్తివంతమైన ‘కృష్ణ’ శబ్దానికి ఉన్న అర్థ వివరించాడు గర్గమహర్షి. ఆ నామం ఉచ్చరిస్తేనే అధికమైన ఫలం లభిస్తుంది.
    
8. ముచికుందుడు అనేవాడు ఒకప్పుడు చిరకాలం దేవతలకు యుద్ధంలో సహాయంచేసి బ్రహంవరంచేత అంతులేని నిద్ర కావాలని వరం పొండాడు. అంత్య కాలంలో కృష్ణదర్శనంచేత ఆయనలో లయం అయ్యాడు. 

9. ముచికుందానది కృష్ణలో కలుస్తుంది. ‘ముచికుంద’ పేరే ‘మూసీ’ నదిగా ప్రసిద్ధి చెందింది. మూసీనది హైదరాబాదులో బయలుదేరి నల్గిండ్జిల్లాలో వాడపల్లి అనే గ్రామం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది.

10. గోదావరి తీరంలో (పశ్చిమ గోదావరి జిల్లా) ‘గరగపర్రు’ గ్రామం గర్గుని ఆశ్రమమని, ఆయన పేరుమీదే ప్రసిద్ధి పొందింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 293 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 142. In the absence of the basic concept 'I am', there is no thought, no awareness, and no consciousness of one's existence. 🌻*

Understanding the importance of the basic concept 'I am' comes by constantly pondering on it. The more you dwell on it, the more you realize that 'yes, this is it'. On this 'I am' rests everything: 

All the thoughts that prevail, all the actions that you perform, the very awareness of your being, your existence; the 'I am'having gone all these go, like in the state of deep sleep or that period before the 'I am' arose.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 168 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 6 🌻*

650. సద్గురువు ప్రణతి, పునరావృత్తి ఆధ్యాత్మక మార్గముల ద్వారా, అభావమును యొక్క సంస్కారము లన్నింటిని జయించి, అభావమును కూడా లోపల కలిగియున్న సర్వమ్ తానేయని అనుభూతి నొందెను. సద్గురువు సృష్టి ధర్మమందున్నను, అది వాని నంటదు. 

651. మానవుడు భగవంతుడైన తరువాత ఇంక మానవుడుగా ఉండలేడు. అతడు మానవుని వలెనేవ జీవించవలనన్నెచో, అప్పటికప్పుడు అన్ని విధముల మానవ లక్షణములతో మానవుని వలెనే వ్యవహరించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 23 / Bhagavad-Gita - 23 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 23 🌴

23. యోత్స్యమానానవేక్షే(హం య ఏతే(త్ర సమాగతా: |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్దేర్యుద్దే ప్రియచికీర్షవ || 

🌷. తాత్పర్యం : 
దుష్టబుద్ధి గల ధృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.

🌷. భాష్యము : 
తన తండ్రియైన ధృతరాష్ట్రుని సహాయమున దుష్టప్రణాళిక ద్వారా పాండవుల రాజ్యమును దుర్యోధనుడు హరింప గోరేననుట బహిరంగ రహస్యము. అనగా దుర్యోధనుని పక్షమున చేరిన వారందరును అతని లక్షణమునలను పోలినవారే. 

యుద్ధరంభమునకు పూర్వము రణరంగమున వారిని అర్జునుడు గాంచదలిచెను. వారెవారా యని తెలిసికొనుటయే గాని వారితో శాంతి మంతనములు జరిపెడి భావన అర్జునునకు లేదు. తన చెంతనే శ్రీకృష్ణభగవానుడు ఉపస్థితుడై యున్నందున విజయమును గూర్చి సంపూర్ణ విశ్వాసమున్నను తాను తలపడవలసి యున్నవారి బలమును అంచనా వేయుటకు అర్జునుడు వారిని చూడగోరె ననుటయు ఒక ముఖ్యవిషయమే.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 23 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada 
📚 Prasad Bharadwaj 

🌴. Chapter 1 - Vishada yoga - 23 🌴

23. yotsyamānān avekṣe ’haṁ
ya ete ’tra samāgatāḥ
dhārtarāṣṭrasya durbuddher
yuddhe priya-cikīrṣavaḥ

🌷. Translation : 
Let me see those who have come here to fight, wishing to please the evil-minded son of Dhṛtarāṣṭra.

🌷. Purport :  
It was an open secret that Duryodhana wanted to usurp the kingdom of the Pāṇḍavas by evil plans, in collaboration with his father, Dhṛtarāṣṭra.

Therefore, all persons who had joined the side of Duryodhana must have been birds of the same feather. Arjuna wanted to see them on the battlefield before the fight was begun, just to learn who they were, but he had no intention of proposing peace negotiations with them. It was also a fact that he wanted to see them to make an estimate of the strength which he had to face, although he was quite confident of victory because Kṛiṣṇa was sitting by his side.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 24 / Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 24. దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా |*
*భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ‖ 24 ‖ 🍀

🍀 64) దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా - 
దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.

🍀 65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా - 
భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
📚. Prasad Bharadwaj 

*🌻 24. devarṣi-gaṇa-saṁghāta-stūyamānātma-vaibhavā |*
*bhaṇḍāsura-vadhodyukta-śaktisenā-samanvitā || 24 || 🌻*


🌻 64 ) Devarshi Gana - sangatha - stuyamanathma - vaibhava -   
She who has all the qualities fit to be worshipped by sages and devas

🌻 65 ) Bhandasura vadodyuktha shakthi sena samavitha -   
She who is surrounded by army set ready to kill Bandasura.

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasra Namavali - 24 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మిధునరాశి- ఆరుద్ర నక్షత్రం 4వ పాద శ్లోకం*

*🍀 24 . అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః*
*సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ‖ 24 ‖ 🍀*

🍀 218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.

🍀 219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.

🍀 220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.

🍀 221) న్యాయ: - సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు.

🍀 222) నేతా - జగత్తు యనెడి యంత్రమును నడుపువాడు.

🍀 223) సమీరణ: - ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు.

🍀 224) సహస్రమూర్ధా - సహస్ర శిరస్సులు గలవాడు.

🍀 225) విశ్వాత్మా - విశ్వమునకు ఆత్మయైనవాడు.

🍀 226) సహస్రాక్ష: - సహస్ర నేత్రములు కలవాడు.

🍀 227) సహస్రపాత్ - సహస్రపాదములు కలవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 24 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Midhuna Rasi, Arudra 4th Padam*

*🌻 24. agraṇīrgrāmaṇīḥ śrīmān nyāyō netā samīraṇaḥ |
sahasramūrdhā viśvātmā sahasrākṣaḥ sahasrapāt || 24 || 🌻*

🌻 218. Agraṇīḥ: One who leads all liberation-seekers to the highest status.

🌻 219. Grāmaṇīḥ: One who has the command over Bhutagrama or the collectivity of all beings.

🌻 220. Śrīmān: One more resplendent than everything.

🌻 221. Nyāyaḥ: The consistency which runs through all ways of knowing and which leads one to the truth of Non-duality.

🌻 222. Netā: One who moves this world of becoming.

🌻 223. Samīraṇaḥ: One who in the form of breath keeps all living beings functioning.

🌻 224. Sahasramūrdhā: One with a thousand, i.e. innumerable, heads.

🌻 225. Viśvātmā: The soul of the universe.

🌻 226. Sahasrākṣaḥ: One with a thousand or innumerable eyes.

🌻 227. Sahasrapāt: One with a thousand, i.e. innumerable legs.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


No comments:

Post a Comment