శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 204 / Sri Lalitha Chaitanya Vijnanam - 204
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 204 / Sri Lalitha Chaitanya Vijnanam - 204 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖
🌻 204. 'సర్వమంత్ర స్వరూపిణీ' 🌻
సర్వమంత్రముల రూపము శ్రీదేవియే అని అర్థము.
మంత్ర మనగా మననము చేయుకొలదీ రక్షించునది అని అర్థము. మంత్రము శబ్ద స్వరూపము. శబ్దము శ్రీదేవి స్వరూపమే. ఏ దేవతా రూపమైననూ శ్రీదేవి వలననే ఏర్పడినది. నామము శబ్దమునుండి ఏర్పడినదే.
నామ రూపములతో కలది మంత్రదేవత. అట్టి దేవతకు ఆధారము శ్రీదేవియే. మన వాజ్మయమున ఏడుకోట్ల మంత్రములు గలవని తెలుపబడినది. అన్ని మంత్రములూ శ్రీదేవి రూపములే అని తెలియవలెను.
బంగారు ఆభరణములు ఎన్ని యున్ననూ వానికి మూలము బంగారమే కదా! అట్లే మంత్ర రూపములు, మంత్రములు ఎన్ని యున్ననూ అవి అన్నియూ శ్రీదేవి రూపములే.
ప్రకృతియైన శ్రీదేవి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది అష్ట దిక్పాలకులు, నవగ్రహములు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, పంచభూతములు, జీవులు ఏర్పడినవి. వీనియందు దేని నారాధించిననూ దానికి మూలము శ్రీదేవియే. శ్రీదేవి ఆరాధనము ఈ విధముగ అన్ని ఆరాధనములకు మూలమై యున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 204 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Sarva-mantra-svarūpiṇī सर्व-मन्त्र-स्वरूपिणी (204) 🌻
She is the embodiment of all mantra-s. This is one of the reasons why tantra śāstra is based on Her various forms, as mantra-s have vital role in tantric rituals. It is said that all the mantra-s are placed around the Pañcadaśī mantra, which is the centre of all mantra-s.
This nāma could also be interpreted this way. There are fifty one letters in Sanskrit. All these fifty one letters are twined together in the form of a garland and worn by Her. So any mantra has to originate from these alphabets. This is the reason for addressing Her as Sarva-mantra-svarūpiṇī. This nāma and the next one are extensions of the previous nāma.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment