వివేక చూడామణి - 17./ Viveka Chudamani - 17


🌹. వివేక చూడామణి - 17./ Viveka Chudamani - 17 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. బంధనాలు - 2 🍀

71. నేను ఇప్పుడు, నీవు ఏమి తెలుసుకోవలసి ఉన్నదో చెప్పుచున్నాను. నీవు ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించవలెను. జాగ్రత్తగా విని నీవేమి చేయాలో నిర్ణయించుకొనుము.

72. సప్త ధాతువులతో కూడిన ఈ శరీరము అనగా చర్మము, చర్మము పై ఉన్న పొర, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మజ్జ మరియు శరీర భాగాలైన కాళ్ళు, ఊరువులు, చాతి, చేతులు, వీపు మరియు తల, వీటన్నింటితో ఈ శరీరము నిర్మింపబడినది.

73. మాయా నిర్మితమై 'నేను' 'నాది' అని పిలువబడుతూ ఈ శరీరము మొత్తము యోగులచే వర్ణింపబడినది. ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి అనునవి మూల భూతములు. ఈ మూల భూతములచే శరీరము రూపొందినది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 17 🌹

✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj


🌻 Attachments - 2 🌻


71. Now I am going to tell thee fully about what thou oughtst to know –the discrimination between the Self and the non-Self. Listen to it and decide about it in thy mind.

72. Composed of the seven ingredients, viz. marrow, bones, fat, flesh, blood, skin and cuticle, and consisting of the following limbs and their parts –legs, thighs, the chest, arms, the back and the head:

73. This body, reputed to be the abode of the delusion of ‘I and mine’, is designated by sages as the gross body. The sky, air, fire, water and earth are subtle elements.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


09 Feb 2021

No comments:

Post a Comment