భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 229


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 229 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. గర్గమహర్షి 🌻


1. గర్గమహర్షి యదుకులానికి ఆచార్యుడు. ఆయ్న ఒకసారి కృష్ణుణ్ణీ లాలిస్తున్నటువంటి యశోదాదేవితో, “ఈ పిల్లవాడు ఎవరోకాదు, సాఖాత్తూ శ్రీమహావిష్ణువే! పరబ్రహ్మ వస్తువు.

2. రాధేశ్వరుడైన శ్రీకృష్ణుడు, గోలోకాధిపతి భర్గవుడు, శివుడు, నారాయణుడు, నరనారాయణులు, కపిలాది నారాయణావతరములు అన్ని కలిపి ఇతడు. ఈతడిలో లేని అంశలేదు. కపిల, శివ, నారాయణాంశలతో కూడిన ఈతడు గోలోకాధిపతి అయిన మాధవుడే! ఇదే అతడిని గురించిన పరమరహశ్యం” అని చెప్పాడు.

3. ఆయన ఇంకా కృష్ణుని గురించి, “ఇతడు పుట్టీపుట్టగానే దేవకీ వసుదేవులకు మాత్రమే నిజస్వరూపం చూపించాడు. ఇతడికి ప్రతీయుగంలోనూ వర్ణభేదము, నాంభేదము ఉంటాయి. కృత్యుగములో శ్వేతవర్ణుడుగాను, త్రేతలో రక్తవర్ణుడుగాను, ద్వాపరంలో పీతవర్ణుడుగాను ఉంటాడు. ఈ ద్వాపరంలో కృష్ణవర్ణం దాల్చటంచేత కృష్ణుడని పేరువచ్చింది” అని చెప్పాడు.

4. ఈ కృష్ణవర్ణంలో ఈ నామం అర్థమేమంటే – ‘క‘కారం బ్రహ్మవాచకం, ‘రు‘కారమేమో అనంత వాచకం, ‘ష‘కారమేమో శంకరవాచకం, ‘ణ‘కారమేమో ధర్మ వాచకం, ‘అ‘కారమేమో విష్ణువాచకం, ‘వి‘సర్గము నరనారాయణార్థవాచకం. ఇదీ అతడి నామముయొక్క నిర్మాణము.

5. ‘కృష్‘ అనేది నిర్వాణవచనము, కృష్ అంటే అంతర్థానమైపోవటమనేది, లయించటమనే అర్థం. ణ కారం మోక్షము; అరాకమేమో విమలాత్మ. అంటే ఆత్మనుగురించి చెప్పేది అకారము అని ఇంకొక అర్థం. కృష్ అనేది నిశ్చేష్ట వాచకం. ఏ పనీలేకుండా ఉండటం, నిష్క్రియుడై ఉండటమంటారు.

6. రకారమేమో భక్తి తాత్పర్యం; అకారమేమో ధాతృవాచకం, అంటే బ్రహ్మ(నిర్గుణ బ్రహ్మ). అంటే సర్వకార్యాలు(ఏ పనీ)చెయ్యకుండా ఉండటం నిష్క్రియత్వం. బ్రహ్మవస్తువు. అది మూడింటి యొక్క సంపుటి. కృష్ అనే శబ్దానికి కర్మను నిర్మూలచేస్తుందనే అర్థంకూడా ఉంది. ంకారమేమో దాస్యవృత్తిని చెపుతుంది. దాసోహం అని ఈశ్వరుడి దగ్గర చెప్పటం.

7. ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’ అని చెప్పభడింది కాబట్టి, ‘కృషి’ అంటే నిర్మూలనం; అకారమేమో ప్రాప్తి. ఆ కోరుకున్నది పొందటానికి అకారశబ్దం వర్తిస్తుంది. ఈ ప్రకారంగా సర్వశక్తివంతమైన ‘కృష్ణ’ శబ్దానికి ఉన్న అర్థ వివరించాడు గర్గమహర్షి. ఆ నామం ఉచ్చరిస్తేనే అధికమైన ఫలం లభిస్తుంది.

8. ముచికుందుడు అనేవాడు ఒకప్పుడు చిరకాలం దేవతలకు యుద్ధంలో సహాయంచేసి బ్రహంవరంచేత అంతులేని నిద్ర కావాలని వరం పొండాడు. అంత్య కాలంలో కృష్ణదర్శనంచేత ఆయనలో లయం అయ్యాడు.

9. ముచికుందానది కృష్ణలో కలుస్తుంది. ‘ముచికుంద’ పేరే ‘మూసీ’ నదిగా ప్రసిద్ధి చెందింది. మూసీనది హైదరాబాదులో బయలుదేరి నల్గిండ్జిల్లాలో వాడపల్లి అనే గ్రామం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది.

10. గోదావరి తీరంలో (పశ్చిమ గోదావరి జిల్లా) ‘గరగపర్రు’ గ్రామం గర్గుని ఆశ్రమమని, ఆయన పేరుమీదే ప్రసిద్ధి పొందింది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Feb 2021

No comments:

Post a Comment