🌹 19, JULY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 19, JULY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 19, JULY 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 208 / Kapila Gita - 208🌹 
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 18 / 5. Form of Bhakti - Glory of Time - 18 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 800 / Vishnu Sahasranama Contemplation - 800 🌹 
🌻800. సువర్ణబిన్దుః, सुवर्णबिन्दुः, Suvarṇabinduḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 761 / Sri Siva Maha Purana - 761 🌹
🌻. దేవాసుర యుధ్ధము - 2 / The battle of the gods - 2 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 015 / Osho Daily Meditations - 015 🌹 
🍀 15.  ప్రత్యేక భయం / 15. THE SPECIAL FEAR 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 465 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 465 - 1 🌹 
🌻465. 'క్షోభిణీ' - 1 / 465. 'Kshobhini' - 1 🌻
7) 🌹. సంకట నాశన గణేశ స్తోత్రము - సంపూర్ణ అర్ధము 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 19, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan 🌺*

*🍀. శ్రీ గజానన స్తోత్రం - 03 🍀*

*అమేయరూపం హృది సంస్థితం తం బ్రహ్మాహమేకం భ్రమనాశకారమ్ |*
*అనాదిమధ్యాంతమపారరూపం గజాననం భక్తియుతా భజామః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఈశ్వరుని కోసం తక్కిన సర్వమూ వదిలే పద్ధతి - పూర్ణయోగ లక్ష్యసాధనకు మార్గం నివిధ సాధకులకు వేర్వేరుగా ఉండవచ్చును. కేవలం ఈశ్వరునే అనుసరించడం కోసం తక్కిన సర్వమునూ వదలి వేయడం ఒక మార్గం. వదిలి వేయడమంటే దేనినిగాని యేవగించు కోడమని అర్థంకాదు. తన ముఖ్యలక్ష్య మందు నిమగ్నం కావడమే దాని ఆశయం. లక్ష్యసిద్ధి కలిగిన మీదట సకల సంబంధాలనూ సత్యధర్మ మందు ప్రతిష్ఠించుకోడం సుకర మౌతుందనే భావం దానిలో ఇమిడి వుంటుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల విదియ 28:31:09 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: పుష్యమి 07:58:08 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: వజ్ర 10:24:14 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: బాలవ 15:20:23 వరకు
వర్జ్యం: 22:20:56 - 24:08:48
దుర్ముహూర్తం: 11:56:13 - 12:48:22
రాహు కాలం: 12:22:17 - 14:00:06
గుళిక కాలం: 10:44:29 - 12:22:17
యమ గండం: 07:28:52 - 09:06:41
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 00:49:44 - 02:36:48
సూర్యోదయం: 05:51:03
సూర్యాస్తమయం: 18:53:32
చంద్రోదయం: 06:57:21
చంద్రాస్తమయం: 20:17:30
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 07:58:08 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 208 / Kapila Gita - 208 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 18 🌴*

*18. ఆధ్యాత్మికానుశ్రవణాన్నామసంకీర్తనాచ్చ మే|*
*ఆర్జవేనార్యసంగేన నిరహంక్రియయా తథా॥*

*తాత్పర్యము : బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన శాస్త్రములను వినుచుండవలెను. భగవన్నామముసు ఉచ్చైస్స్వరముతో కీర్తింపవలెను. సరళ స్వభావము గలిగి, అహంకారరహితుడై సత్పురుషుల సాంగత్యమును చేయవలెను.*

*వ్యాఖ్య : భగవంతుని నామాన్ని ధైర్యముగా సంకీర్తన చేయాలంటే నిజాయితీ కలగాలి. మనసులో ఏముందో అది మాట్లాడాలి, అదే చెప్పాలి. మనసులో ఏమంకుంటామో దాన్నే మాట్లాడి దాన్నే చేయాలి. అలాంటి వారే పరమాత్మ నామాన్ని కీర్తన చేయగలరు. "నేను కూడా భగవన్నామాన్ని సంకీర్తన చేస్తున్నారు" అని నా చుట్టూ ఉన్న వారు అనుకోవాలని చేసే కీర్తన, లేదా "భగవన్నామ సంకీర్తన చేస్తే నాకు కూడా సౌకర్యాలు వస్తాయి" అనే భావనతో చేసేది ఆర్జవం కాదు. ఆర్జవం అంటే మనోవాక్కాయేషు ఏకరూపతా. అది ఎలా కలుగుతుంది? పెద్దలతో కలిసి ఉండటం వలన కలుగుతుంది (ఆర్జవేనార్య సఙ్గేన). అలా జరగాలంటే ముందు మనకన్నా వారు పెద్దలూ అని ఒప్పుకోవాలి. అంటే అహంకారం పోవాలి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 208 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 5. Form of Bhakti - Glory of Time - 18 🌴*

*18. ādhyātmikānuśravaṇān nāma-saṅkīrtanāc ca me*
*ārjavenārya-saṅgena nirahaṅkriyayā tathā*

*MEANING : A devotee should always try to hear about spiritual matters and should always utilize his time in chanting the holy name of the Lord. His behavior should always be straightforward and simple, and although he is not envious but friendly to everyone, he should avoid the company of persons who are not spiritually advanced.*

*PURPORT : In order to advance in spiritual understanding, one has to hear from authentic sources about spiritual knowledge. One can understand the reality of spiritual life by following strict regulative principles and by controlling the senses. To have control it is necessary that one be nonviolent and truthful, refrain from stealing, abstain from sex life and possess only that which is absolutely necessary for keeping the body and soul together. One should not eat more than necessary, he should not collect more paraphernalia than necessary, he should not talk unnecessarily with common men, and he should not follow the rules and regulations without purpose. He should follow the rules and regulations so that he may actually make advancement.*

*There are eighteen qualifications mentioned in Bhagavad-gītā, among which is simplicity. One should be without pride; one should not demand unnecessary respect from others, and one should be nonviolent. A devotee should not be proud of his acquisitions. The symptoms of a devotee are meekness and humility. Although spiritually very advanced, he will always remain meek and humble, as Kavirāja Gosvāmī and all the other Vaiṣṇavas have taught us by personal example. Caitanya Mahāprabhu taught that one should be humbler than the grass on the street and more tolerant than the tree. One should not be proud or falsely puffed up. In this way one will surely advance in spiritual life.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 800 / Vishnu Sahasranama Contemplation - 800🌹*

*🌻800. సువర్ణబిన్దుః, सुवर्णबिन्दुः, Suvarṇabinduḥ🌻*

*ఓం సువర్ణ బిందవే నమః | ॐ सुवर्ण बिंदवे नमः | OM Suvarṇa biṃdave namaḥ*

సువర్ణసదృశాబిన్దవోఽఙ్గాన్యస్య హరేరితి ।
బిన్దుర్వాశోభనో వర్ణః యస్మిన్ మన్త్ర స్తదాత్మకః ॥
సువర్ణబిన్దురిత్యుక్తస్సవేదార్థవిశారదైః ।
ఆ ప్రణఖాత్సర్వమేవ సువర్ణ ఇతి వేదతః ॥

*బంగరుతో చేసిన అవయవములను పోలు అవయవములు ఈతనికి కలవు.*

*'ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః' (ఛాందోగ్యోపనిషత్ 1.6.6) - 'నఖాగ్రము వరకును అంతయును బంగారమే' అను శ్రుతివచనము ఇందు ప్రమాణము.*

*శోభనమగు 'ఓ' అను వర్ణమును, 'మ్‍' బిందువును ఏ ప్రణవరూప మంత్రమునందు కలవో అట్టి మంత్రము తన స్వరూపముగా కలవాడు. ప్రణవ రూపుడును, ప్రణవమునకు అర్థమును అగువాడు పరమాత్ముడు అని భావము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 800🌹*

*🌻800. Suvarṇabinduḥ🌻*

*OM Suvarṇa biṃdave namaḥ*

सुवर्णसदृशाबिन्दवोऽङ्गान्यस्य हरेरिति ।
बिन्दुर्वाशोभनो वर्णः यस्मिन् मन्त्र स्तदात्मकः ॥
सुवर्णबिन्दुरित्युक्तस्सवेदार्थविशारदैः ।
आ प्रणखात्सर्वमेव सुवर्ण इति वेदतः ॥

Suvarṇasadr‌śābindavo’ṅgānyasya hareriti,
Bindurvāśobhano varṇaḥ yasmin mantra stadātmakaḥ.
Suvarṇabindurityuktassavedārthaviśāradaiḥ,
Ā praṇakhātsarvameva suvarṇa iti vedataḥ.

*His limbs are golden in hue vide the śruti 'Āpraṇakhāt sarva eva suvarṇaḥ' / 'आप्रणखात् सर्व एव सुवर्णः' (Chāndogyopaniṣat 1.6.6) - having a golden hued body up to the nails.*

*Or He whose mantra - the letters and bindu are auspicious. So Suvarṇabinduḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥
సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥
Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 761 / Sri Siva Maha Purana - 761 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 16 🌴*
*🌻. దేవాసుర యుధ్ధము - 1 🌻*

*జ్ఞానస్వరూపుడవు, పరమాత్మవు అగునీవు శ్రీకృష్ణరూపమును దాల్చి, రాధతో గూడి విమరిస్తూ అనేక లీలలను వెలయించితివి. అట్టి నీకు నమస్కారము (10). ఓ లక్ష్మీ పతీ! జినరూపములో, బుద్ధరూపములో నిగూఢమగు అవతారమును దాల్చిన నీవు వేదములను నిందించి యోగాచార్యుడవైతివి. అట్టి నీకు నమస్కారము (11). అనంతశక్తి స్వరూపుడవగు నీవు కల్కి రూపమును దాల్చి వ్లేుచ్ఛుల నంతమొందించి సద్ధర్మమును స్థాపించెదవు. అట్టి నీకు నమస్కారము (12).*

*ఓ ప్రభూ! మహాత్ముడగు కపిలుని రూపము దాల్చి సాంఖ్యాచార్యుడవై సాంఖ్యయోగమును దేవహూతికి బోధించిన నీకు నమస్కారము (13). ఏ జ్ఞానముచే అంతఃకరణము మిక్కిలి ప్రసన్నమగునో అట్టి పరమజ్ఞానమును బోధించువాడు, సృష్ఠిస్థితిలయకర్త, జ్ఞానస్వరూపుడు అగు పరమహంసకు నమస్కారము (14). సర్వజనుల హితమును గోరి వేదములను విభజించి పురాణములను రచించిన వేదవ్యాసుడు నీ స్వరూపమే. అట్టి నీకు నమస్కారము (15). ఓ ప్రభూ! ఈ తీరున నీవు మత్స్యాది అవతారములను దాల్చి భక్తుల కార్యమును చేయుటకు సంసిద్ధుడ వగుచుందువు. సృష్టిస్థితిలయములకు కారణమైన పరబ్రహ్మవు నీవే.నీకు నమస్కారము (16). తన దాసుల కష్టములను పోగొట్టి సుఖములను, శుభములను ఇచ్చువాడు, పచ్చని వస్త్రమును ధరించువాడు, పాపములను పోగొట్టు వాడు, గరుడుడు వాహనముగా గలవాడు అగు నీకు నమస్కారము. క్రియలన్నిటినీ చేయు ఒకే ఒక కర్తవు నీవే. శరణు పొందదగిన నీకు అనేక నమస్కారములు (17).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 761🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 16 🌴*

*🌻 The battle of the gods - 2 🌻*

10. Obeisance to you of hidden knowledge; to Kṛṣṇa the great Ātman; the sportive paramour of Rādhā; Obeisance to him of diverse divine sports.

11. Obeisance to the preceptor of Yoga; Obeisance to you, O lord of Lakṣmī, of the form of Jaina and Bauddha; to you of hidden body and features and the censurer of the Vedas.

12. Obeisance to you of the form of Kalki; the destroyer of outcastes[2], Obeisance to him of infinite power and who establishes good virtue.

13. Obeisance to you of the form of Kapila of great soul and who expounded the doctrines of Sāṃkhya and Yoga to Devahūtī; O lord, obeisance to you the preceptor of Sāṃkhya.

14. Obeisance to great yogin and saint who expounds the great wisdom. Obeisance to the creator of the form of knowledge whereby the soul is delighted.

15. Obeisance to you of the form of Vedavyāsa who classified the Vedas and who wrote the Purāṇas for the welfare of the worlds.

16. Obeisance to you who are ready to perform the task of the devotees through incarnations of Fish etc. O lord, obeisance to you of the form of Brahman, the cause of creation, sustenance and annihilation.

17. Obeisance to the destroyer of the distress of your servants; the bestower of auspicious happiness. Obeisance to you wearing yellow robes, having Garuḍa for your vehicle[3]. Obeisance to the performer of all rites. Obeisance to the sole doer. Obeisance to the one worthy of being resorted to.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 15 / Osho Daily Meditations  - 15 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 15.  ప్రత్యేక భయం 🍀*

*🕉. ఇది ఖచ్చితంగా ఏమిటో మీకు తెలియనప్పుడు ఇది మంచి రకమైన భయం. మీరు ఏదో తెలియని అంచున ఉన్నారని దీని అర్థం. 🕉*

*మీ భయానికి ఏదైనా వస్తువు ఉన్నప్పుడు, అది సాధారణ భయం. ఒకరు మరణానికి భయపడతారు - ఇది చాలా సాధారణ భయం సహజమైనది; దాని గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు. వృద్ధాప్యం లేదా వ్యాధికి భయపడటం, అనారోగ్యం - ఇవి సాధారణ భయాలు, సాధారణమైనవి, రోజువారీవి. ప్రత్యేక భయం ఏమిటంటే, మీరు దాని కోసం ఒక వస్తువును కనుగొనలేనప్పుడు, అది ఎటువంటి కారణం లేకుండా లేనప్పుడు. అది నిజంగా భయపడేలా చేస్తుంది! కారణం కనుక్కోగలిగితే మనసు తృప్తి చెందుతుంది. ఎందుకు అని మీరు సమాధానం చెప్పగలిగితే, మనసుకు తగులుకోవడానికి కొంత వివరణ ఉంటుంది. అన్ని వివరణలు విషయాలు వివరించడానికి సహాయపడతాయి, అవి మరేమీ చేయవు.* 

*కానీ మీరు హేతుబద్ధమైన వివరణను కలిగి ఉంటే, మీరు సంతృప్తిగా భావిస్తారు. ఎందుకు అని అడగకుండా విషయాన్ని అలాగే చూడటం మంచిది. ఏదో తెలియని విషయం మీ చుట్టూ తిరుగుతోంది, అది ప్రతి అన్వేషకుడి చుట్టూ తిరుగుతుంది. ప్రతి అన్వేషకుడూ అనుభవించవలసిన భయం ఇది. నేను మీకు వివరణలు ఇవ్వడానికి కాదు, మిమ్మల్ని అందులోకి నెట్టడానికి ఉన్నాను. నేను మానసిక విశ్లేషకుడిని కాదు -- నేను అస్తిత్వవాదిని. ప్రేమ, భయం, కోపం, దురాశ, హింస, కరుణ, ధ్యానం, అందం మొదలైనవాటిని వీలైనన్ని విషయాలను మీరు అనుభవించగలిగేలా చేయడమే నా ప్రయత్నం. మీరు ఈ విషయాలను ఎంత ఎక్కువగా అనుభవిస్తే, మీరు అంత ధనవంతులు అవుతారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 15 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 15. THE SPECIAL FEAR 🍀*

*🕉  It's a good kind of fear when you don't know what exactly it is. It simply means that you are on the verge of something unknown.  🕉*

*When your fear has some object, it is an ordinary fear. One is afraid of death--it is a very ordinary fear instinctive; there's nothing special about it. Being afraid of old age or disease, illness-these are ordinary fears, common, garden variety. The special fear is when you cannot find an object for it, when it is there for no reason at all. That makes one really scared! If you can find a reason, the mind is satisfied. If you can answer why, the mind has some explanation to cling to. All explanations help things to be explained away, they don't do anything else.*

*But once you have a rational explanation, You feel satisfied. It is better to see the thing as it is without asking why. Something unknown is hovering around you, as it is going to hover around every seeker.  This is the fear every seeker has to pass through. I am not here to give you explanations but to push you into it. I am not a psychoanalyst -- I am an existentialist. My effort is to make you capable of experiencing as many things as possible-love, fear, anger, greed, violence, compassion, meditation, beauty, and so forth. The more you experience these things, the richer you become.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 465 - 1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 465  - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।*
*కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*

*🌻465. 'క్షోభిణీ' - 1 🌻* 

*సంక్షోభము కలిగించునది శ్రీమాత అని అర్థము. పరమేశ్వరుని సహితము క్షోభింపజేయునది శ్రీమాత. ఇక జీవుల మాట చెప్పనేల? బ్రహ్మాదులనైననూ క్షోభింప జేయగలదు. ఆమె అనుగ్రహము లేనిచో జీవులకు క్షోభ తప్పదు. తప్పించుకొన వీలు పడదు. దీర్ఘము, గంభీరము అగు సమాధి యందున్న పరమేశ్వరుని సృష్టికి ఉన్ముఖమగునట్లు శ్రీమాత కలత పరచును. ఇది ఆమె క్షోభిణీ తత్వము. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని, విశ్వామిత్రుని ఆగ్రహము రూపమున క్షోభింప చేసినది. అతని నూరుగురు కుమారులను విశ్వామిత్రుడు సంహరింపగ వశిష్ఠుడు క్షోభ చెంది మరల తపస్సున కుపక్రమించెను. తపస్సు చేయుచున్న విశ్వామిత్ర మహర్షిని మేనక రూపమున క్షోభ కలిగించెను. అట్లే సీత రూపమున రావణుని, రావణుని రూపమున రాముని, కైక రూపమున దశరథుని క్షోభింప చేసినది. ఇట్లు ఎన్ని ఉదాహరణలైన చెప్పవచ్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 465 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika*
*Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*

*🌻465. 'Kshobhini' - 1 🌻*

*Shrimata is the one who causes crisis. Shrimata puts even the Lord in crisis. What about living creatures? She can put Brahma and others deities in crisis. If there is no grace of her, there will be misery for the living beings. Can't escape. Shrimata turns the Parameshwara who is in a long and solemn meditation, towards the creation. This is her Kshobhini philosophy. Vashishtha, who was a Brahmarshi, was angered by Vishvamitra. After Vishvamitra killed his 100 sons, Vashishtha was distraught and again went into penance. Vishwamitra, who was doing penance, was troubled in the form of Menaka. Similarly, she troubled Ravana in the form of Sita, troubled Rama in the form of Ravana, and troubled Dasharatha in the form of Kaika. Any number of examples can be given this way.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. సంకట నాశన గణేశ స్తోత్రము - సంపూర్ణ అర్ధము 🌹*

*ఎంతటి కష్టాలైనా తొలగించే మహామహిమాన్వితమైన సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతిరోజూ కనీసం 4 సార్లు అయినా, 6 నెలలు పాటు భక్తి శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది.*

*మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం.*

*ఈ సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి.*

*🌻. సంకట_నాశన_గణేశ_స్తోత్రం 🌻*

*నారద ఉవాచ*

*ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |*
*భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || 1 ||*

*ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |*
*తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||*

*లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |*
*సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || 3 ||*

*నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకమ్ |*
*ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||*

*ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |*
*న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || 5 ||*

*విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |*
*పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||*

*జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |*
*సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||*

*అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹*
*తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||*

*ఇతి సంకట నాశన గణేశ సంపూర్ణం*

*దేవతలందరికంటే ముందుగా పూజిపబడే వాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను.*

*ప్రధమ నామం : వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు)*

*ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు)*

*తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు)*

*చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు)*

*పంచమ నామం: లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు)*

*షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు)*

*సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు)*

*అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు)*

*నవమ నామం: ఫాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు)*

*దశమ నామం: వినాయక (విఘ్నములకు నాయకుడు)*

* ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి)*

*ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు)*

*ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును.*

*ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాలపాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు.*

*ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 114 : 2-07. Mātrkā chakra sambodhah - 17 / శివ సూత్రములు - 114 : 2-07. మాతృక చక్ర సంబోధః - 17


🌹. శివ సూత్రములు - 114 / Siva Sutras - 114 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 17 🌻

🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴


అచ్చులు మరియు హల్లులు కాకుండా, కొన్ని అక్షరాలను ఉభయాక్షరములు అంటారు. య, ర, ల మరియు వ ఈ వర్గంలోకి వస్తాయి. ఈ నాలుగు అక్షరాలు శివుని చుట్టుముట్టిన ఆరు కవచాలను ఏర్పరుస్తాయి. తద్వారా అతని స్వాభావిక వైభవాన్ని నిష్ణాతులైన ఆత్మలు గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఆ ఆరు కవచాలు కాల, విద్య, రాగ, కాల, నియతి మరియు మాయ. వాటిని కనుకా అని కూడా అంటారు. కాల కాలాన్ని సూచిస్తుంది, గతం యొక్క కొలమానం, వర్తమానం యొక్క ఆనందాన్ని ఇస్తుంది మరియు భవిష్యత్తు కోసం నిల్వ ఉన్న వాటిని కలిగి ఉంటుంది. కర్మని నియమబద్థీకరించడం నియతి చేస్తుంది. కాల చర్యను ప్రేరేపిస్తుంది, విద్య తెలివికి బాధ్యత వహిస్తుంది. ఇంద్రియ అవగాహనలకు రాగం బాధ్యత వహిస్తుంది. సంశయం, అజ్ఞానం మరియు భ్రాంతిని మాయ ప్రేరేపిస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 114 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-07. Mātrkā chakra sambodhah - 17 🌻

🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴


Apart from vowels and consonants, some letters are known as semi-vowels. Ya, ra, la and va (य र ल व) fall under this category. These four letters give rise to six coverings that surround Śiva, blocking His inherent splendour to be perceived by nescient souls. The six coverings are kalā, vidyā, rāga, kāla, niyati and māyā. They are also known as kañuca. Kāla refers to time, a measurement of past, gives enjoyment of the present and contains what is in store for the future. Niyati is responsible in fixing the order and sequence of karma. While kalā induces action, vidyā is responsible for intelligence. Rāga is responsible for sensory perceptions and māyā is responsible for inducing doubt, ignorance and illusion.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 378


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 378 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నీ శాశ్వతత్వాన్ని గుర్తించడానికి హృదయమే మార్గం. ఒకసారి మరణం లేదని గుర్తించిన క్షణం జీవితం మారిపోతుంది. జీవితంలోకి అపూర్వ లక్షణాలు అడుగు పెడతాయి. 🍀


నువ్వు ఎంతగా 'తల'కు అతుక్కుని వుంటే అంతగా హృదయాన్ని మరచిపోతావు. దేవుడు హృదయం గుండా తెలుస్తాడు. సత్యం హృదయం ద్వారా తెలిసి వస్తుంది. హృదయం అస్తిత్వాన్ని గ్రహించడానికి ఆరంభం. సముద్ర అనుభవానికి బిందువు. మనిషి శాశ్వతమైన వాడు.

వాస్తవానికి మరణం లేదు. కానీ దాన్ని 'మేథ'తో గుర్తించడం ఎలా? అది హృదయమార్గం. నీ శాశ్వతత్వాన్ని గుర్తించడానికి హృదయమే మార్గం. ఒకసారి మరణం లేదని గుర్తించిన క్షణం జీవితం మారిపోతుంది. జీవితంలోకి అపూర్వ లక్షణాలు అడుగు పెడతాయి. అవి నాట్యం, గానం, కవిత్వం, ఉత్సవం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 112 : 21. The Study of Man is the Study of Consciousness / నిత్య ప్రజ్ఞా సందేశములు - 112 : 21. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం యొక్క అధ్యయనం



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 112 / DAILY WISDOM - 112 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 21. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం యొక్క అధ్యయనం 🌻


జీవిత ప్రక్రియలు, స్థూలంగా చెప్పాలంటే, రాజకీయాలు, ప్రపంచ చరిత్ర, సామాజిక శాస్త్రం, నీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, సౌందర్యశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం రంగాలలో అధ్యయనం చేయబడినవి. మనిషితో అనుసంధానించబడిన ప్రతి జీవితపు కోణం ఈ రూపురేఖలలోనే గ్రహించబడవచ్చు. అయితే ఇదంతా చైతన్యానికి సంబంధించినదై ఉండాలి; లేకపోతే, అవి అధ్యయన అంశాలుగా లేదా అనుభవ వస్తువులుగా కూడా ఉండవు.

కాబట్టి మనిషి సమస్య అంతా చైతన్యం యొక్క సమస్య. మనిషి యొక్క అధ్యయనం చైతన్యం. చైతన్యాన్ని విభజించడం సాధ్యం కాదు కాబట్టి చైతన్య భాగాలు అనేవి ఉండవు. కాబట్టి చైతన్యం అవిభాజ్య కాబట్టి, జీవితం అంతా ఈ అనంత చైతన్యం తనలో తాను ఆడిన ఆట అనే చెప్పవచ్చు. ఉనికి మరియు చైతన్యాన్ని గుర్తించడం కంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 112 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 21. The Study of Man is the Study of Consciousness 🌻


The processes of life are, broadly speaking, those which are studied in the fields of politics, world history, sociology, ethics, economics, aesthetics, psychology, biology, chemistry, physics and astronomy. Everything connected with man can be said to be comprehended within this outline of the framework of life’s activity. But all this has to be related to consciousness; else, they would not exist even as subjects of study or objects of experience.

The problem of man is therefore the problem of consciousness. The study of man is the study of consciousness. Since it is impossible to conceive a real division of consciousness within itself, it is also not possible to imagine that there can be real objects of consciousness. If there are no such real objects, the whole of life would be a drama played by consciousness within itself in the realm of its infinite compass. There cannot be a greater joy than the identification of existence and consciousness.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 247 / Agni Maha Purana - 247


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 247 / Agni Maha Purana - 247 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 74

🌻. శివ పూజా విధి వర్ణనము - 3 🌻


ఈ భూతశుద్ధికి సంబంధించిన విశేషవివరణము వినుము. భూమండల స్వరూపము చతుష్కోణాకారము. దాని రంగు సువర్ణము వలె పచ్చగా ఉండును. అది కఠిన ముగ నుండుటయే గాక వజ్రచిహ్నముతోను, 'హాం' అను తన బీజముతోను కూడికొని యున్నది. దీనిలో 'నివృత్తి' అను కళ ఉన్నది. (శరీరమున పాదములు మొదలు మోకాళ్లవరకును భూమండల మున్నది.) ఈ విధమున పాదములు మొదలు శిరస్సువరకు శరీరమునందు పంచమహాభూతముల భావన చేయవలెను. ఈ విధముగ పంచగుణయుక్తము లగు వాయు - భూ మండలముల చింతకన చేయవలెను.

జలస్వరూపము అర్ధచంద్రాకారము. అది ద్రవస్వరూపము. చంద్రమండలమయము. దానివర్ణము ఉజ్జ్వలము. అది రెండు కమలములచే చిహ్నితము. 'హ్రీం' బీజముతో కూడినది. ''ప్రతిష్ఠా'' అను కల గలది. వామదేవ-తత్పురుషమంత్రములతో సంయుక్తమగు జలతత్త్వము నాలుగు గుణములతో కూడినది. దానిని ఈ విధముగ (మోకాళ్లు మొదలు పాదాల వరకు) చింతనము చేయుచు వహ్ని స్వరూపమునందు లీనముచేసి శోధన చేయవలెను. అగ్ని మండలము త్రికోణాకారము. రంగు ఎరుపు. (అది నాభినుండి హృదయమువరకును ఉండును). అది స్వస్తికచిహ్నయుక్తము. దానియందు 'హూం' బీజము అంకిత మై యుండును. అది విద్యాకలాస్వరూప మైనది. దాని మంత్రము అఘోరమంత్రము. ఇది మూడు గుణములతో కూడిన జలభూతము. ఈ విధముగ భావించి అగ్ని తత్త్వమును శోధించవలెను. వాయుమండలము షట్కోణాకారము (హృదయము మొదలు కనుబొమ్మలవరకును ఉండునది) అది ఆరు బిందువులచే చిహ్నితమైనది. రంగు నలుపు. 'హైం' బీజము తోడను, సద్యోజాతమంత్రముతోడను యుక్తమై యున్న అది శాంతికలాస్వరూపమైనది. దానిలో రెండు గుణములున్నవి. అది పృథ్వీభూతము. ఈ విధముగ భావన చేసి వాయుతత్త్వమును శోధింపవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 247 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 74

🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 3 🌻

17. One should merge the earth, wind, water, fire and sky, one into the other without any deviation in the order. You hear about it now!

18. The principle of earth is hard, of yellowish colour and bears the mark of thunderbolt. Then its destruction is wrought by the subtle mantra of the soul (namely) hauṃ.

19. The entire body from foot to head should be contemplated as a four-sided figure, and the principle of wind should be meditated therein by five stretches of retention of breath.

20. This principle which has been established with the principal syllable hrīṃ should be contemplated as of half-crescent-shaped in a liquid state, white in colour, beautiful and impressed with (the figure of) the lotus.

21. The reverential principle of fire which is causeless and which is the end of men, should be purified by four stretches of retention of breath along with the Rāma mantra.

22. The orb of fire should be conceived as three-sided, red (in colour), marked with (the sign of) svastika and as the form of knowledge and endowed with the principal syllable hūṃ.

23. The principle of water should be purified by means of three stretches of awful minuteness. The orb of wind (principle) (should be conceived) as marked with six dots.

24. It should be meditated as composed of tranquility, black in colour and endowed with the principal syllable of hrīṃ (and purified) by two stretches (of retention of breath). The principle of earth should be purified.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 400: 10వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 400: Chap. 10, Ver. 28

 

🌹. శ్రీమద్భగవద్గీత - 400 / Bhagavad-Gita - 400 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 28 🌴

28. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్ప: సర్పాణామస్మి వాసుకి: ||

🌷. తాత్పర్యం : నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మథుడను మరియు సర్పములలో వాసుకుని అయి యున్నాను.

🌷. భాష్యము : నిక్కముగా మహాత్తరమగు ఆయుధమైన వజ్రాయుధము శ్రీకృష్ణుని శక్తికి ప్రాతినిధ్యము వహించును. ఆధ్యాత్మిక జగము నందలి కృష్ణలోకమున ఎప్పుడు కోరినను, ఎంత కోరినను క్షీరము నొసగగల గోవులు అసంఖ్యాకములుగా కలవు. అటువంటి గోవులు ఈ భౌతికజగమున లేవు. అవి కృష్ణలోకమున ఉన్నట్లుగా మాత్రము పేర్కొనబడినది.

“సురభి” నామము గల ఆ గోవులను శ్రీకృష్ణభగవానుడు పెక్కింటిని కలిగియుండి వానిని గాంచుట యందు నిమగ్నుడై యుండుననియు తెలుపబడినది. సత్సాంతానము కొరకై కలిగెడి కామవాంఛ కందర్పుడు కనుక అతడు శ్రీకృష్ణుని ప్రతినిధి. కొన్నిమార్లు మైథునక్రియ కేవలము ఇంద్రియభోగము కొరకే ఒనరింపబడుచుండును. అదియెన్నడును కృష్ణునికి ప్రాతినిధ్యము వహింపదు. కేవలము సత్సాంతానప్రాప్తికై ఒరరింపబడెడిదే కందర్పునిగా పిలువబడి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 400 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 28 🌴

28. āyudhānām ahaṁ vajraṁ dhenūnām asmi kāma-dhuk
prajanaś cāsmi kandarpaḥ sarpāṇām asmi vāsukiḥ


🌷 Translation : Of weapons I am the thunderbolt; among cows I am the surabhi. Of causes for procreation I am Kandarpa, the god of love, and of serpents I am Vāsuki.

🌹 Purport : The thunderbolt, indeed a mighty weapon, represents Kṛṣṇa’s power. In Kṛṣṇaloka in the spiritual sky there are cows which can be milked at any time, and they give as much milk as one likes. Of course such cows do not exist in this material world, but there is mention of them in Kṛṣṇaloka. The Lord keeps many such cows, which are called surabhi. It is stated that the Lord is engaged in herding the surabhi cows. Kandarpa is the sex desire for presenting good sons; therefore Kandarpa is the representative of Kṛṣṇa. Sometimes sex is engaged in only for sense gratification; such sex does not represent Kṛṣṇa. But sex for the generation of good children is called Kandarpa and represents Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹



18 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 18, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : అధిక మాసం ప్రారంభం, Adhik Maas Begins🌻

🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 12 🍀

24. ధ్యాతా ధ్యేయో జగత్సాక్షీ చేతా చైతన్యవిగ్రహః |
జ్ఞానదః ప్రాణదః ప్రాణో జగత్ప్రాణః సమీరణః

25. విభీషణప్రియః శూరః పిప్పలాశ్రయసిద్ధిదః |
సిద్ధః సిద్ధాశ్రయః కాలః కాలభక్షకపూజితః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : అహంకార పూర్వక ప్రేమ కూడదు - పూర్ణయోగ సాధనలో అహంకార పూర్వకమైన ప్రేమకు తావులేదు. ఆహంకారం దెబ్బతిన్నా, అసంతృప్తి చెందినా ప్రేమించడం మాని వేయడం, లేక కక్షపూని ద్వేషించడం – ఇదీ అహంకార పూర్వక ప్రేమ స్వభావం. నిక్కమైన ప్రేమకు మూలంలో సుస్థిరైక్యం భాసిస్తుంది. కామప్రవృత్తి కాలుష్యాలను సాధకుడు తనలో నిలువనీయ రాదనేది వేరుగ చెప్పనక్కరలేదు. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల పాడ్యమి 26:11:04 వరకు

తదుపరి శుక్ల విదియ

నక్షత్రం: పుష్యమి 31:58:20 వరకు

తదుపరి ఆశ్లేష

యోగం: హర్షణ 09:35:14 వరకు

తదుపరి వజ్ర

కరణం: కింస్తుఘ్న 13:05:33 వరకు

వర్జ్యం: 14:07:20 - 15:54:24

దుర్ముహూర్తం: 08:27:18 - 09:19:30

రాహు కాలం: 15:37:58 - 17:15:50

గుళిక కాలం: 12:22:13 - 14:00:05

యమ గండం: 09:06:27 - 10:44:20

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48

అమృత కాలం: 24:49:44 - 26:36:48

సూర్యోదయం: 05:50:42

సూర్యాస్తమయం: 18:53:43

చంద్రోదయం: 06:04:28

చంద్రాస్తమయం: 19:36:30

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: వర్ధమాన యోగం -

ఉత్తమ ఫలం 31:58:20 వరకు

తదుపరి ఆనంద యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹