సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 5

Image result for madame blavatsky secret doctrine
🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 5 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃 నాల్గవ స్థితి 🍃

192. విశ్వం యొక్క బీజం దైవీ శక్తులుగా విడిపోవటం 'గుప్తవిద్య' ద్వారా తెలుపబడింది. వీరందరూ ఒకే శక్తి యొక్క అభివృద్ధి చెందుతున్న శక్తులు. వీరు ప్రకటింపబడిన విశ్వములకు మార్గములు తెలిపినారు. నిర్మాణ కర్తలు, మార్గదర్శకులు. ప్రకృతి యొక్క పరిమాణ క్రమమును సమన్వయ పరుస్తూ ఒకే నియమాన్ని, ప్రకృతిలోని విభిన్న నియమాలుగా అభివృద్ధి చెందిస్తారు. వీరికి గుప్తవిద్యలో విశిష్ఠ పేర్లు ఇవ్వబడ్డాయి. భారతీయులు వీరినే దేవతలుగా పేర్కొంటారు.

193. మానవులందరు ఈ దేవతల యొక్క శిక్షణకు అనుగుణంగా నడుచుకుంటూ, మొదలు చివర అనేది లేని సృష్టిని, సంఖ్యలేని స్థితి నుండి ఒకే సంఖ్య స్థితికి చేరుటను గమనించాలి.

194. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము అనే సవ్యమార్గాలలో చనిపోయిన వారు దివ్య లోకాలు చేరి తిరిగి భూమిపై జన్మిస్తారు.

195. కామం, రాత్రి, కృష్ణపక్షం, దక్షణాయనములో చనిపోయిన వారు అధో లోకాలు చేరి తదుపరి భూమిపై స్థావర జంగమాలుగా జన్మిస్తారు.

196. శుక్లపక్షంలో మరణించినవారు, ఊర్ధ్వలోకాలు చేరి తదుపరి జన్మరాహిత్య స్థితికి చేరిన, కృష్ణపక్షము లోని వారు పునర్జన్మ పొందుతారు.

197. గుప్త విద్యలో అగ్నిని 2 రకాలుగా వర్ణిస్తారు. మొదటిది ఆకార రహిత అగ్ని. ఇది ఆధ్యాత్మిక సూర్యునిలో అంతర్గతంగా దాగి ఉంటుంది. రెండవ అగ్ని 7 రకములుగా విశ్వము మరియు సూర్య మండలములలో వ్యాపించివుంది.

198. జ్ఞానాగ్ని వలన ఈ మాయామయ జగత్తులోని కర్మలన్ని దగ్ధమై పోతాయి. అందువల్ల వాటిని పొందిన వారిని 'అగ్నిపునీతులు' అంటారు.

199. దేవతలు, పితరులు, ఋషులు, సురులు, అసురులు, దైత్యులు, ఆదిత్యులు, దానవులు, గంధర్వులు మొదలగు వారు అనేకత్వములతో నిర్మాణ కర్తలుగా ఏర్పడతారు. వీటన్నింటిని ప్రాకృత శక్తులుగా గమనించాలి. మానవులు ఇందులో చేరరు.

200. పవిత్ర జంతువులు, గుప్తవిద్యలు జీవిత పరిణామ క్రమములో ప్రముఖ పాత్ర వహిస్తాయి. సాధారణముగా ఇవి దేవతాశక్తులకు వాహనములుగా లేక ప్రకృతిలోని గుణాలు, ధర్మాలు, సిద్ధాంతములకు గుర్తుగా వ్యవహరిస్తాయి.
ఉదా: కుక్క : కాలము, వేదములు, విశ్వాసము.
నక్క: జిత్తుల మారి తనము.
ఆవు: పవిత్రత
ఎద్దు: ధర్మము
కాకి: పితరులు
ఖగోళ శాస్త్రంలో ఈ పవిత్ర జంతువులు రాశి చక్రము యొక్క సంకేతాలుగా మారుతాయి.

201. ప్రకృతిలోని తెలివిగల శక్తుల వర్ణన మానవ జాతి విభజనకు వీలుగా ఉన్నది.

202. వాక్కు, శబ్దము యొక్క రహస్య స్వభావాలను తెల్పుతుంది. ఇది దైవాలోచన యొక్క పరిణామము. మన ఆలోచనలు, మన వాక్కులు నిత్యం మనం ఉన్న పరిస్థితులను నిర్మిస్తూ ఉంటాయి.

203. ఒక శబ్దం ఉచ్ఛరించినపుడు ఒక ఆలోచన మేల్కొనబడి, వర్తమానంలోకి తీసుకొని రాబడుతుంది. మానవ వాక్కు, ఆకర్షణ శక్తి, రహస్య ప్రపంచంలో జరిగే ప్రతి దానికి మూలము.

204. ఒక నామాన్ని ఉచ్ఛరించుట వలన, ఒక ప్రాణాన్ని నిర్వచించుటయె గాక తద్వారా ఒకటి లేక అనేక రహస్య మయ శక్తులకు లోనుకావటం జరుగుతుంది.

205. ప్రతి వ్యక్తి మాట అతనికి తెలియకుండానే, వరముగానో శాపముగానో పరిణమిస్తుంది. అందువలన ఈనాటి ఆలోచన, మాటల యొక్క శక్తుల అవగాహన లేకపోవుట మనకు చాలా చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

206. మనస్సు, శ్వాస, వాక్కు 7 ఇంద్రియముల సంయోగమే, సప్త విధములైన శబ్ద సైన్యములు.

207. సాధారణముగా వ్యక్తి మనస్సు భోగలాలసతో ఉంటుంది. కాని ఆధ్యాత్మిక మనస్సు లేక సామాజిక మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది.

208. సృష్టి నిర్మాణ క్రమంలో దైవీ శక్తులు ఏర్పడిన తరువాత, అరూప స్థితి నుండి మెల్లమెల్లగా స్వరూప స్థితికి నిర్మాణ కార్యక్రమములు మొదలవుతాయి. 209. ప్రకృతిలో నిరంతరము విశ్వధూళి ఆకాశములో నాలుగు భూతములుగా; భూమి, నీరు, అగ్ని, వాయువులుగా ఏర్పడి చుక్కలు, రేఖలు, త్రిభుజములు, ఘనములు, వృత్తములుగా చివరికి గోళములుగా ఏర్పడి వివిధ ఆకృతులను సమీకరించుకుంటున్నది. దీనికి విరామము లేదు.

210. ప్రకృతిలో అన్ని రకములుగా మార్పు చెందగలిగే రహస్యమయ తత్త్వము ''స్వభావాత్‌'' అని పిలువబడినది. ఈ రహస్య తత్త్వము మారుతూ మారుతూ చివరికి అంతులేని '0' గా ఏర్పడుచున్నది. అదే శూన్యము. సంఖ్యలకు '0' చేర్చినపుడు ఆ సంఖ్య యొక్క విలువ వ్యక్తమవుతుంది.

211. 9 అంకెల తరువాత 10వ అంకెలో '1' ఏకత్వము '0' శూన్యముగా సర్వస్వానికి ప్రతీక అయినది.

212. '10' లో '1' లేకపోయిన శూన్యము.
'10' లో '0' లేకపోయిన ఏకత్వము. అంతా ఒకటే. అదే 'సనాత్‌'.

213. అనంతాకాశమును 'అదితి' లేక చీకటి అని పిలిచారు. ఆ 'అదితి' కి 8 మంది కుమారులు జన్మించారు. అందులోని 7 తో 'అదితి' దేవతల దగ్గరకు వచ్చింది. కాని 8 వది అయిన సూర్యుని వదలివేసింది. ఆ 7గురు పుత్రులను 'ఆదిత్యులు' అంటారు. ఆ 7 మానవులకు నివాస స్థానములయి 7 గ్రహాలుగా పిలువబడుచున్నవి.

214. ఈ 7 గ్రహములు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఒక సమతా స్థితిలో ఏర్పడినపుడు జరిగే దివ్య శక్తుల ప్రభావము ఆయా వ్యక్తుల జన్మ స్థితిపై ఉంటుంది.

215. మానసిక ఉచ్ఛ స్థితిలో విశ్వమానవులు కక్ష్యలోవున్న ఆదర్శ ప్రపంచాన్ని ప్రళయ కాలం తరువాత, ఈ గ్రహాలు ఇతర దేవతా శక్తుల సహాయముతో క్రమ పద్ధతిలో క్రింది తలానికి (భూమి) దించటానికి ప్రయత్నిస్తారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹