1) 🌹 శ్రీమద్భగవద్గీత - 608 / Bhagavad-Gita - 608🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 226, 227 / Vishnu Sahasranama Contemplation - 226, 227 🌹
3) 🌹 Daily Wisdom - 27 🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 161 🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 182 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 1 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 178 / Sri Lalita Chaitanya Vijnanam - 178 🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 519 / Bhagavad-Gita - 519 🌹
10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 123 🌹
11) 🌹. శివ మహా పురాణము - 323 🌹
12) 🌹 Light On The Path - 76 🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 208 🌹
14) 🌹 Seeds Of Consciousness - 272 🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 147 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 03 / Lalitha Sahasra Namavali - 03 🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 03 / Sri Vishnu Sahasranama - 03 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 608 / Bhagavad-Gita - 608 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 25 🌴*
25. అనుబన్ధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్య తే ||
🌷. తాత్పర్యం :
శాస్త్రనిర్దేశములను
నిరసించి భవిష్యత్బంధమును గాని, పరహింసను, పరదుఃఖమును గాని లెక్కపెట్టక
భ్రాంతియందు ఒనర్చబడు కర్మలు తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును.
🌷. భాష్యము :
మనుజుడు
తాను చేయు కర్మలకు ప్రభుత్వమునకు గాని, యమదూతలకు గాని జవాబుదారి
కావలసివచ్చును. బాధ్యతారహితముగా ఒనర్చబడు కర్మ సర్వదా విధ్వంసకరమే కాగలదు.
ఏలయన అట్టి కర్మ శాస్త్రనిర్దేశములైన ధర్మనియమములను సమూలముగా నశింపజేయును.
అటువంటి
బాధ్యతారహిత కర్మలు సదా హింస పైననే ఆధారపడియుండి పరులకు దుఃఖమునే
కలిగించును. స్వానుభవముపై ఆధారపడి ఒనర్చబడు అట్టి బాధ్యతారహిత కర్మలు
నిక్కము భ్రాంతిమయములే. అట్టి భ్రాంతిమయ కర్మ తమోగుణఫలమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 608 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 25 🌴*
25. anubandhaṁ kṣayaṁ hiṁsām anapekṣya ca pauruṣam
mohād ārabhyate karma yat tat tāmasam ucyate
🌷 Translation :
That
action performed in illusion, in disregard of scriptural injunctions,
and without concern for future bondage or for violence or distress
caused to others is said to be in the mode of ignorance.
🌹 Purport :
One
has to give account of one’s actions to the state or to the agents of
the Supreme Lord called the Yamadūtas. Irresponsible work is destructive
because it destroys the regulative principles of scriptural injunction.
It is often based on violence and is distressing to other
living entities. Such irresponsible work is carried out in the light of
one’s personal experience. This is called illusion. And all such
illusory work is a product of the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 226, 227 / Vishnu Sahasranama Contemplation - 226, 227 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻226. సహస్రాక్షః, सहस्राक्षः, Sahasrākṣaḥ🌻
ఓం సహస్రాక్షాయ నమః | ॐ सहस्राक्षाय नमः | OM Sahasrākṣāya namaḥ
సహస్రాక్షః, सहस्राक्षः, Sahasrākṣaḥ
సహస్రాణి అక్షిణి - అక్షాణి వా - యస్య వేలకొలది కన్నులు లేదా అసంఖ్యాకములైన ఇంద్రియములు ఎవనికి కలవో అట్టివాడు.
:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::
అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోఽనన్తరూపమ్ ।
నాన్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ॥ 16 ॥
ప్రపంచాధిపతీ!
జగద్రూపా! మిమ్ము సర్వత్ర అనేక హస్తములు, ఉదరములు, ముఖములు, నేత్రములు
గలవానినిగను, అనంతరూపులుగను నేను చూచుచున్నాను. మఱియు మీ యొక్క మొదలుగానీ,
మధ్యము గానీ, తుదను గానీ నేను గాంచజాలకున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 226🌹
📚. Prasad Bharadwaj
🌻226. Sahasrākṣaḥ🌻
OM Sahasrākṣāya namaḥ
Sahasrāṇi
akṣiṇi - akṣāṇi vā - yasya / सहस्राणि अक्षिणि - अक्षाणि वा - यस्य The
One who has thousand eyes or the One with countless sensory organs.
Śrīmad Bhagavad Gīta - Chapter 11
Aneka bāhūdaravaktranetraṃ paśyāmi tvāṃ sarvato’nantarūpam,
Nāntaṃ na madhyaṃ na punastavādiṃ paśyāmi viśveśvara viśvarūpa. (16)
I
see You as possessed of numerous arms, bellies, mouths and eyes; as
having infinite forms of all around. O Lord of the Universe, O Cosmic
Person, I see not Your limit nor the middle, nor again the beginning!
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अग्रणीर्ग्रामणीश्श्रीमान्न्यायो नेता समीरणः ।
सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षस्सहस्रपात् ॥ २४ ॥
అగ్రణీర్గ్రామణీశ్శ్రీమాన్న్యాయో నేతా సమీరణః ।
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్ ॥ ౨౪ ॥
Agraṇīrgrāmaṇīśśrīmānnyāyo netā samīraṇaḥ ।
Sahasramūrdhā viśvātmā sahasrākṣassahasrapāt ॥ 24 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 227 / Vishnu Sahasranama Contemplation - 227🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻227. సహస్రపాత్, सहस्रपात्, Sahasrapāt🌻
ఓం సహస్రపదే నమః | ॐ सहस्रपदे नमः | OM Sahasrapade namaḥ
సహస్రపాత్, सहस्रपात्, Sahasrapāt
సహస్రాణి పాదాః అస్య వేలకొలది అనగా అసంఖ్యాకములైన పాదములు గలవాడు.
:: పురుష సూక్తమ్ ::
సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ।
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠ ద్దశాంగులమ్ ॥ 1 ॥
విరాట్పురుషుడుగా
పరమాత్ముడు వేలకొలది శిరములూ, కన్నులూ, ఇంద్రియములూ, పాదములూ కలవాడు. ఆతడే
భూమిని అన్ని వైపులను చుట్టి బ్రహ్మాండమునకు పది అంగుళములను మించి వేదాది
వాక్కులకు అతీతుడుగాను ఉన్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 227🌹
📚. Prasad Bharadwaj
🌻227. Sahasrapāt🌻
OM Sahasrapade namaḥ
Sahasrāṇi pādāḥ / सहस्राणि पादाः One with a thousand i.e., innumerable legs.
Puruṣa Sūktam
Sahasra śīrṣā puruṣaḥ sahasrākṣaḥ sahasrapāt,
Sa bhūmiṃ viśvato vr̥tvā atyatiṣṭha ddaśāngulam. (1)
:: पुरुष सूक्तम् ::
सहस्र शीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् ।
स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठ द्दशान्गुलम् ॥ १ ॥
He,
the Cosmic Lord, the Puruṣa, with a thousand or innumerable heads, a
thousand or countless eyes, a thousand legs i.e., infinite number of
legs pervading all of the universe, still extends ten angulams or inches
beyond.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अग्रणीर्ग्रामणीश्श्रीमान्न्यायो नेता समीरणः ।
सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षस्सहस्रपात् ॥ २४ ॥
అగ్రణీర్గ్రామణీశ్శ్రీమాన్న్యాయో నేతా సమీరణః ।
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్ ॥ ౨౪ ॥
Agraṇīrgrāmaṇīśśrīmānnyāyo netā samīraṇaḥ ।
Sahasramūrdhā viśvātmā sahasrākṣassahasrapāt ॥ 24 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 27 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 27. No Human Being can Claim to be Omniscient 🌻*
Even
the highest intellectual perception belongs only to the realm of
relativity. No human being can claim to be omniscient and so he has no
occasion to rejoice at his profits or grieve at his losses here.
The
real is not this; the attainment of That alone can liberate the soul
from sorrow. Even death is not a bar in the process of the realisation
of Truth. Death is a reshuffling of consciousness to adjust and adapt
itself to a different order of life. The love for the knowledge of the
Self cares not for such insignificant phenomena as the birth and the
destruction of the body.
The need for the higher illumination is
more serious a matter than the birth and the death of the overcoat, and
the quest for the Absolute should be undertaken even sacrificing the
dearest object, fearless of even the greatest pain and loss that may
have to be encountered in the world.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 161 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 91 🌻*
నాయనా!
నీ జీవితంలో నీవు ఏమి సాధించావు నాయనా? అనే ప్రశ్న నలభై ఏళ్ళు దాటిన దగ్గర
నుంచీ వస్తుంది. నలభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచీ గృహస్థాశ్రమము మీద
ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. ప్రశ్నలు వస్తే, వెనక్కి తిరిగి చూస్తే, ఇవే
కనబడుతూ ఉంటాయి. ఘట శరావాదులు, అంటే, మన ఇంట్లో ఒక వేయి గిన్నెలు
ఉన్నాయండి. మా ఇంట్లో ఒక పది సోఫాలున్నాయండి. మా ఇంట్లో పది అంతస్థులు
ఉన్నాయండి. మా ఇంట్లో పది కిలోల బంగారం ఉందండి. మాకు పది మంది కుటుంబ
సభ్యులున్నారండి.
ఈ రకంగా అనేకత్వ నానాత్వ భ్రాంతికి చెందినటువంటి
సమస్త వస్తూపజాలము యొక్క విశేషములన్నింటిని చెప్పుతూ, అవి తానే
అయిఉన్నట్లుగా భ్రాంతి చెందుతూ వాటితో తాదాత్మ్యతను పొంది, అవే సుఖమును
ఇస్తున్నాయనేటటువంటి భ్రమకు గురై, మోహాన్ని చెంది, గృహస్థాశ్రమాన్ని
గడిపేశావు. గడపగా, గడపగా, గడపగా, గడపగా ఏమైందంటే... వ్యామోహం
క్షీణించిపోయింది, ఇంద్రియాలు అశక్తమైపోయాయి, వృద్ధాప్యం వచ్చేసింది.
ఇప్పుడు ఈశ్వరా, ఈశ్వరా, ఈశ్వరా అంటుంటాడు. ఎందుకని? అశక్తత చేత. కాళ్ళు
సహకరించడం లేదు నాయనా, నడవాలంటే, నీ దేవాలయానికి రావాలంటే. కాబట్టి, ఇక్కడి
నుంచే ఓ నమస్కారం.
నీ నామ స్మరణ చేయాలంటే, బుద్ధి నిలకడగా ఉండడం
లేదు నాయనా, కాబట్టి, తోచినప్పుడు చేస్తా, ఈశ్వరా నీకో నమస్కారం. కాబట్టి
వృద్ధాప్యంలో ఈ రకమైనటువంటి అవస్థలను అన్నిటిని ఏకరువు పెట్టుకుంటూ ఉంటాడు.
ఇంకా ఏమి అడుగుతూ ఉంటాడు? ఇంకా ఎప్పటికయ్యా? నన్ను తీసుకుపోయేది నువ్వు
అని అడుగుతూ ఉంటాడు.
జీవితకాలమంతానేమో వస్తూపలబ్ధికై శ్రమించి,
కాంక్షాయుతంగా జీవించి, దాచుకున్నటువంటి వస్తువులు, తయారు చేసుకున్నటువంటి
సంసారం, తయారు చేసుకున్నటువంటి జగత్ భ్రాంతి, తనకు చిట్టచివరి కాలంలో
ఉపయోగపడకపోయేటప్పటికి, ఆ చివరి కాలంలో, ఈశ్వరా ఈశ్వరా అని పలవరిస్తాడు.
మరి
ఈ జీవన ప్రయాణం అంతా, ఆ జీవన పర్యంతమూ, తాను చేసినటువంటి కర్మ
సహితమైనటువంటి, విశేషములన్నీ, ప్రయత్నములన్నీ, వెంటనే విడిచిపెడుతాయా?
విడువవు కదా! ఆయా కర్మ భ్రాంతి మమకార రూపంలో, అహంకార రూపంలో, అభిమాన
రూపంలో, అజ్ఞానరూపంలో, అవిద్యా రూపంలో, మోహ రూపంలో సూక్ష్మ శరీరాన్ని
ఆశ్రయించి ఉంటాయి.
ఇవన్నీ కలిపితే, రజోగుణ, తమోగుణ సముదాయ
సంబంధంతో కలిపిన సూక్ష్మ శరీరం. మరి ఆయా సందర్భోచితమైనటు వంటి స్థితులు
కలుగుగా, వృద్ధాప్యమందు సదా సాధించినవి, సదా సాధించ వలసినటువంటి వాటి యందు
ఆకాంక్ష, చింత.
కాంక్ష ఏమైపోయింది ఇప్పుడు వృద్ధాప్యంలో? చింతగా
మారిపోయింది. ఇంకా అది అలా అవ్వలేదు, ఇంకా ఇలా అవ్వలేదు, ఇంకా వాడు ఇల్లు
కట్టుకోలేదు, వాడు పెళ్ళి చేసుకోలేదు, ఇంకా మనవడు స్థిరపడలేదు, ఇంకా
మునిమనవడు స్థిరపడలేదు, ఇంకా ఆ దేశాన్ని చూడలేదు, ఇంకా ఈ దేశాన్ని చూడలేదు.
ఇంకా ఆ రకమైన భ్రాంతి పొందలేదు, ఇంకా ఈ రకమైన భ్రాంతి పొందలేదు.
అది
భ్రాంతి అనేటటువంటి దానిని నిజవస్తు స్థితిని గుర్తించలేక, అదే సత్యమని
మిడత వలె దీపం ముందు పరిభ్రమిస్తూ కడకు రెక్కలు కాలి, ఆ దీపం చేతనే
మృత్యువుకు గురై పోవుచున్నాడు. ఈ రకంగా మృత్యుపాశంలో చిక్కుకున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 182 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
174
We
talked about Fire yesterday. We discussed that Fire gives light and
heat. In the nights, he exists in the form of heat. He makes the seeker
adhere to truth. He bestows concentration for worship of the Atman. He
ensures that the person’s objectives are fulfilled. He removes the
obstacles to faith and trust.
He fills us with strength, faith
and courage. When we concentrate on the radiant form, we achieve
concentration. Residing in the body, the Fire God detects diseases early
and sends us signals. He provides good health. Even though Fire God can
consume everything by burning them, he is untouched by impurity.
Fire
is everywhere. There is nowhere he is not. Even though he is
everywhere, he is in the form of dormant fire in some places. We just
said that there is no place where there is no Fire. He is in the form of
dormant fire. For instance, sometimes, the piece of wood seems to have
been burnt, but it has fire inside.
One must lead a life of
cleanliness, untouched by impurity just like Fire. He must be radiant
with the power of penance. He must accept whatever is given to him.
He
must stand by those who seek refuge in him and those who place trust in
him. He should do good to them. All living beings are subject to birth
and death. Birth and death are for the body, not for the soul. The body
is impermanent. We see that the soul alone is permanent.
Fire has
no form. It takes on the form of the object it is burning. In the same
vein, one should consume food only for universal welfare, not for greed.
A seeker should sometimes be introverted like Fire. In other instances,
he must be extroverted. The qualities of Fire, one greater than the
other, are amazing.
Avadhoota Swamy said to King Yadu that he
learned all these qualities from Fire. When a seeker imbibes the
qualities of Fire and undertakes spiritual discipline, he will receive
results quickly.
Next, Moon. While revealing his 24 Gurus to King
Yadu, Avadhoota Swamy talked about Moon. Vedas proclaim the Moon as
Parabrahman.
They say that the Moon is the Parabrahman who is
the essence of all living beings. Because Moon is filled with nectar and
bliss, viewing it gives us joy. Children are happy seeing the Moon.
Elders feel peaceful seeing the Moon. Because Moon rules over the mind,
he cures diseases of the mind (psychological disorders). He eliminates
those diseases.
In the Bhagavad Gita, the Lord says,
“Nakshatraayaaham Shashi”. The Lord is saying, “I am also the Moon who
rules over all the stars”. That Moon (the Lord) said that he is the Moon
that rules over all the stars.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 1 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. 1. కర్తవ్యము - 1 🌻*
పరహితము
నొనర్చుట, దివ్యత్వమునకు చేరువగుట అనునవి సత్సాధకునకు కల్గు రెండు నిరంతర
భావములు. గమ్యము చేరువరకు అనగా సత్యమును తెలియు వరకు ఆ సత్యము తానే అని
తెలియు వరకు సత్సాధకుడు పరితృప్తి చెందడు. తాను చేయు పర'హిత' కార్యములు,
ధ్యానాదికములు అత్యల్పముగా తోచుచుండును.
తాను చేయు సాధన కాని,
కార్యములు గాని చెప్పుకొనుటకు సిగ్గుపడు చుండును. జీవన విధానమును అన్ని
విధములుగా దివ్యత్వము వైపునకు మరల్చు కొనుటకు కృషి సలుపుచుండును.
అనగా
కుటుంబము నందు, వృత్తియందు సంఘపరమైన కార్యముల యందు, దైవమును, ధర్మమును
జొప్పించు చుండును. చేయుచున్నది చాలదని ఆరాటపడుచుండును. చేయవలసినది
మిక్కుటముగ నున్నదని భావించు చుండును.
సాధనయందు సోమరితనము చోటు
చేసుకొన్నచో తానిప్పటికే చాలా చేసితినని, చేయుచుంటినని తన శక్తి
సామర్థ్యముల మేరకు పనిచేయుచుంటినని తృప్తి చెందుట, గర్వపడుటగా నుండును.
రోజునగల ఇరువది నాలుగు గంటలలో ఒకటి, రెండు గంటలు మాస్టరుగారి కార్యముల
నొనర్చి చాలా చేయుచుంటినని భ్రమపడు చుండును.
తనకున్న కుటుంబపరమైన
బాధ్యతలు అంతకన్న సాధనకుగాని, పరహిత కార్యమునకు గాని అనుమతించనని తనకు తానే
సర్ది చెప్పుకొను చుండును. కుటుంబ సభ్యులతో తాను మెలగు విధానమును
ప్రేమపూరితమైన యుక్తితో నిర్వర్తించు కొనిన గృహము నందే మిక్కుటముగా
అంతర్ముఖముగను, బహిర్ముఖముగను కార్యము లను నిర్వర్తించుకొన గలుగును.
తన భ్రమ తనకు సత్య మనిపించుట వలన సాధనకు కొంత సమయమే కేటాయించుట చేయుచుండును. ఇది సోమరితనము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 178 / Sri Lalitha Chaitanya Vijnanam - 178 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |*
*నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖*
*🌻 178. 'నిర్భేదా' 🌻*
శివుని కంటి భేదము కాదని, జ్ఞాన అజ్ఞాన భేదము లేదని, తెలియజేయు నామమిది.
ఉద్భవించిన
తత్వమే శ్రీమాత. అవ్యక్తము యొక్క మొదటి వ్యక్త స్థితియే శ్రీమాత. దర్శన
మిచ్చుట కామెయే అధిపతి. అనుభూతి నిచ్చునది కూడ శ్రీపతయే. తత్త్వము
అవ్యక్తమనియు, నాక్కున కందనిదనియు, తర్కింప వీలు కానిదనియు, దానిని గూర్చి
తెలియుట అసాధ్యమనియు, అందు మునిగిన వారికి తానుండక అదియే యుండుననియూ, కావున
తత్త్వమున ఉండుటయే కాని అనుభూతి లేదనియూ, అది శివమనియు పలుకుదురు. అది
శివమైనపుడు ఆమె 'శివా'. శివుడే అగుపించిన, 'శివా' యగును. అతని ప్రథమ రూపమే
ఆమె. ఆమెకును ఆయనకు భేదమే లేదు. యోగనిద్ర యందును, శివము మేల్కాంచినప్పుడు
అతడే యున్నాడు కదా!
నిద్రయుందున్నవాడు వేరు, మేల్కాంచినవాడు వేరా?
శివునికిని శ్రీమాతకును భేదమును చూచువారు తెలియనివారు. వారిది అభేద స్థితి.
చూచువారిది భేదస్థితి. ఆమె శివునితో కూడియున్నది అనుట కూడ పూర్ణ సత్యము
కాదు. ఆమె రూపమున నున్నది శివుడే. ఆమెగ గోచరించుచున్నాడు. అతడు
మేల్కాంచినపుడు ఆమె యగుచున్నాడు. జీవులు కూడ నిద్రయందున్నప్పుడు శివతియే.
అది సత్య స్థితి.
మేల్కాంచినప్పుడు “శివా" స్థితిని పొందుచున్నారు.
అది చైతన్య స్థితి, జీవునికి, శివునికి భేద మొక్కటియే. శివునిది యోగనిద్ర,
జీవునిది మొద్దునిద్ర.
శివుడు త్రిగుణాతీతుడు, జీవుడు
త్రిగుణాత్మకుడు, శ్రీమాతకు జ్ఞానులు, అజ్ఞానులు అను భేదము కూడ లేదు.
జీవులందరూ ఆమె బిడ్డలే. అందువలన అందరియందామెకు ప్రేమయే యుండును. అందరి
ఉద్దారణకూ తోడ్పడును, వారియందు భేదములను కూడ ఆమె నిర్మూలించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 178 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Nirbhedā निर्भेदा (178) 🌻*
She
is without differences. Possibly this difference could mean the
difference between Her and Śiva. That is why, it is said that wise men
do not find any difference between Śiva and Śaktī. Their unified form
is known as the Brahman and there is no difference between them.
The
qualities of this unified form are being described in this
Sahasranāma. Though all the nāma-s in this Sahasranāma addresses
Lalitāmbikā, it should not be construed that they are addressed to Her
in Her individual capacity. They are addressed to the Śiva-Śaktī
combine.
Saundarya Laharī says that neither Śiva nor Śaktī can
act, without depending on each other. Kūrma Purāṇa says that the
Supreme Śaktī is infinite, devoid of all differences and destroyer of
all differences (described in the next nāma).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 519 / Bhagavad-Gita - 519 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 02 🌴*
02. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్దా విషయప్రవాలా: |
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబన్ధీని మనుష్యలోకే ||
🌷. తాత్పర్యం :
ఈ
వృక్షశాఖలు ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్థ్వ, అధోముఖములుగా
వ్యాపించియున్నవి. దీని చిగుళ్ళే ఇంద్రియార్థములు, అధోముఖముగను ఉన్నత ఈ
వృక్షపు వ్రేళ్ళు మనుష్యలోకపు కామ్యకర్మలకు సంబంధించినవై యున్నవి.
🌷. భాష్యము :
ఈ
శ్లోకమునందు అశ్వత్థవృక్ష వర్ణనము మరికొంత ఒసగబడినది. సర్వదిక్కుల యందు
వ్యాపించియున్న దాని శాఖల అధోభాగమున మానవులు మరియు అశ్వములు, గోవులు,
శునకములు మొదలగు జంతువులు స్థితిని కలిగియున్నవి.
జీవులు ఈ విధముగా
అధోభాగమున నిలిచియుండగా, వృక్షపు ఊర్థ్వభాగమున దేవతలు, గంధర్వులవంటి
ఉన్నతజీవులు స్థితిని కలిగియున్నారు. వృక్షము నీటిచే పోషింపబడునట్లు, ఈ
సంసారవృక్షము త్రిగుణములచే పోషింపబడును.
తగినంత నీరు లేనందున కొంత
భూభాగము బీడుపడుటయు, వేరొక భూభాగము పచ్చగా నుండుటయు మనకు గోచరమగునట్లు,
ప్రకృతిగుణముల పరిమాణము మరియు ప్రాబల్యము ననుసరించి వివిధములైన జీవజాతులు
వ్యక్తమగుచుండును.
సంసారవృక్షపు చిగుళ్ళే ఇంద్రియార్థములుగా
పరిగణింపబడినవి. వివిధగుణముల వృద్ది వలన వివిధ ఇంద్రియములు కలుగుచుండ, ఆ
ఇంద్రియముల ద్వారా మనము వివిధ ఇంద్రియార్థముల ననుభవింతురు. ఈ విధముగా
ఇంద్రియార్థములను కూడియుండెడి కర్ణములు, నాసిక, నయనాది ఇంద్రియములే
సంసారవృక్షశాఖాగ్రములు.
శబ్ద, రూప, స్పర్శాది ఇంద్రియార్థములే
చిగుళ్ళు. వృక్షపు ఉపమూలములే వివిధ దుఃఖములు, ఇంద్రియభోగముల ఫలములైన
ఆసక్తి, అనాసక్తులు. సర్వదిక్కులా వ్యాపించియుండు ఈ ఉపమూలముల నుండియే
ధర్మాధర్మములకు సంబంధించిన ప్రవృత్తులు కలుగుచున్నవి. ఈ వృక్షపు
యథార్థమూలము బ్రహ్మలోకము నందుండగా, ఇతర ఉపమూలములు మర్త్యలోకము నందున్నవి.
ఊర్థ్వలోకములందు
పుణ్యకర్మల ఫలముల ననుభవించిన పిదప జీవుడు ఈ మర్త్యలోకమున కరుదెంచి, తిరిగి
ఊర్థ్వలోకములకు ఉద్ధరింపబడుటకు తన కర్మల నారంభించును. కనుకనే ఈ
మర్త్యలోకము కర్మక్షేత్రముగ పరిగణింపబడుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 519 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 15 - Purushothama Yoga - 02 🌴*
02. adhaś cordhvaṁ prasṛtās tasya śākhā
guṇa-pravṛddhā viṣaya-pravālāḥ
adhaś ca mūlāny anusantatāni
karmānubandhīni manuṣya-loke
🌷 Translation :
The
branches of this tree extend downward and upward, nourished by the
three modes of material nature. The twigs are the objects of the senses.
This tree also has roots going down, and these are bound to the
fruitive actions of human society.
🌹 Purport :
The
description of the banyan tree is further explained here. Its branches
spread in all directions. In the lower parts, there are variegated
manifestations of living entities – human beings, animals, horses, cows,
dogs, cats, etc.
These are situated on the lower parts of the
branches, whereas on the upper parts are higher forms of living
entities: the demigods, Gandharvas and many other higher species of
life. As a tree is nourished by water, so this tree is nourished by the
three modes of material nature.
Sometimes we find that a tract of
land is barren for want of sufficient water, and sometimes a tract is
very green; similarly, where particular modes of material nature are
proportionately greater in quantity, the different species of life are
manifested accordingly.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -123 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 7
*🍀. 6. సోపానములు - యోగము - యోగయుక్తుడైనవాడు పరిశుద్ధమైన హృదయము గల వాడగును. సమస్త ప్రాణికోటి యందును ఒకే ఆత్మ యున్నదని తెలిసినవాడు. ఇట్టి జ్ఞానము గలవాడు పనులాచరించు చున్నప్పుడు గూడ బంధమున పడడు. యోగయుక్తు డనగ విచక్షణ (బుద్ధితో నిష్కామముగ కర్తవ్యముల నాచరించుచు, త్యాగనిరతితో జీవించుచు నుండును. అట్టి వానిని 'విజితాత్ము'డని దైవము సంబోధించు చున్నాడు. నిత్యము భగవత్స్మరణము నందుండువాడే (మననము చేయువాడె) ముని యని తెలుపబడినది. “విశ్వం విష్ణుః " అని పలుకుట సులభమే. తెలియుట శ్రద్ధాళువునకు మాత్రమే అనుభవైకము. 🍀*
7. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియః |
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నది న లిప్యతే 7 ||
యోగయుక్తుడైనవాడు పరిశుద్ధమైన హృదయము గల వాడగును. మనోవికారములను జయించిన వాడగును. ఇంద్రియములను జయించిన వాడగును. సమస్త ప్రాణికోటి యందును ఒకే ఆత్మ యున్నదని తెలిసినవాడు. ఇట్టి జ్ఞానము గలవాడు పనులాచరించు చున్నప్పుడు గూడ బంధమున పడడు.
యోగయుక్తు డనగ విచక్షణ (బుద్ధితో నిష్కామముగ కర్తవ్యముల నాచరించుచు, త్యాగనిరతితో జీవించుచు నుండు వాడని ముందు అధ్యాయము లందలి సారాంశము గ్రహించినచో తెలియును. అట్టివాడు యింద్రియ వినియోగము విచక్షణతో గావించును. కావున జితేంద్రియు డగును.
ఇంద్రియ వ్యాపారములు శమించినపుడు మనసునకు పూర్ణమగు జయమే లభించును. అట్టి మనసు కామబద్ధము కాదు గనుక, బుద్ధియను వెలుగును ప్రతిబింబింపజేయుచు పూర్ణచంద్రునివలె యుండును. కామము మితిమీరినపుడే మనసునకు హెచ్చుతగ్గు లుండును. కామము విచక్షణకు లోనుగ పనిచేయుచుండుట వలన మనసు నకు స్థిరము కలుగును. వికారములు చెందక యుండును. అట్టి వానిని 'విజితాత్ము'డని దైవము సంబోధించు చున్నాడు. నిర్మలమగు మనసు కలిగినవానికి హృదయము విశుద్ధమై యుండును. పరిశుద్ధమై యుండును.
పరిశుద్ధమగు హృదయము, ప్రశాంతమగు మనస్సు, విధేయులైన యింద్రియములు గల జీవుడు నిర్వర్తించు కార్యములు క్రమబద్ధముగ నుండును. అందు ఫలాసక్తి లేదు. ఫలితముల యందు ఆకర్షణయు లేదు. చేయుట యందు వక్రతయు లేదు. అట్టి వానిని కర్మలెట్లు బంధించగలవు? బంధించలేవు. వాని కనుదిన కర్మాచరణము ఆనందమే. వానికాచరణమే ఆనందము. అట్టివాడు యోగయుక్తుడు.
యోగయుక్తుడైన వాడు, భగవత్స్మరణమున కూడ యుండునని ముందు శ్లోకమున దైవము తెలిపినాడు. పై తెలిపిన నియమములకు మననము కూడ తోడైనచో అన్ని జీవుల యందు తన యందున్నవాడే యున్నాడని తెలియును. ఇది ఒక చక్కని సోపానక్రమము.
1. విచక్షణ - ఇంద్రియములు నిబద్ధత - జితేంద్రియుడు
2. నిష్కామ కర్మ - మనసు ప్రశాంతత చెందుట - విజితాత్మ
3. యజ్ఞార్థ కర్మ - మనసు నిర్మల మగుట - విశుద్ధాత్మ
4. సన్న్యాసము - రాగద్వేషములు మనస్సు విడచుట - యోగము
5. మననము - అన్నిజీవులయందలి ఆత్మను దర్శించుట - ముక్తస్థితి.
అధ్యాయముల యందలి సూత్రములను పూసకెక్కించి నట్లుగ అమర్చుకొనుచు, అవగాహన చేసుకొనుచు శ్రద్ధాళువగు ఆత్మ సాధకుడు ముందుకు సాగవలెను. నిత్యము భగవత్స్మరణము నందుండువాడే (మననము చేయువాడె) ముని యని తెలుపబడినది.
అట్లు స్మరణము చేయుట వలన అన్నిటియందు మూలముగ నున్న బ్రహ్మమును పొందగలడని కూడ తెలుప బడుచున్నది. అనగా అన్నిటి యందలి దైవము దర్శించినవాడు మననము ఫలించిన వాడే యగుచున్నాడు.
మననము జరుగుటకు హృదయ నైర్మల్యము, మనో ప్రశాంతత ఆధారమై యున్నవి. మనోప్రశాంతతకు కామము లేని కర్తవ్య కర్మ, విచక్షణ ఆధారములై యున్నవి.
ఇటుకమీద యిటుక పేర్చి యిల్లు కట్టినట్లు, ఈ వరుస క్రమమును గ్రహించి అట్లాచరించి పురోగతి చెందవలెనే గాని, మరియొక మార్గము లేదు. సరాసరిగ అందరి ఆత్మలయందు వసించియున్న దైవమును చూచుట వీలుపడదు. “విశ్వం విష్ణుః " అని పలుకుట సులభమే. తెలియుట శ్రద్ధాళువునకు మాత్రమే అనుభవైకము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 323 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
81. అధ్యాయము - 36
*🌻. విష్ణు వీర భద్ర సంవాదము - 3 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఇట్లు పలికి గణాధ్యక్షుడగు వీర భద్రుడు కోపముతో కూడిన వాడై, ఆ దేవతలనందరినీ వెనువెంటనే వాడి బాణములతో కొట్టెను (35). ఇంద్రుడు మొదలగు లోకపాలకులందురు ఆ బాణములచే కొట్టబడినవారై పది దిక్కులకు పారిపోయిరి (36).
లోకపాలకులు, దేవతలు పారిపోగానే వీరభద్రుడు గణములతో కూడి యజ్ఞశాల సమీపముకు వచ్చెను (37). అపుడా ఋషులందరు భయపడి విష్ణువును వేగముగా సమీపించి, ఆయనతో విన్నపము చేయగోరి, నమస్కరించి ఇట్లు పలికిరి (38).
ఋషులు ఇట్లు పలికిరి -
ఓ దేవదేవా!లక్ష్మీపతీ!సర్వేశ్వరా!మహాప్రభూ! దక్షుని యజ్ఞమును రక్షింపుము. యజ్ఞము నీ స్వరూపమే అనుటలో సందియము లేదు. (39). యజమాని నీ స్వరూపమే. యజ్ఞములోని అంగములు నీస్వరూపమే. యజ్ఞమును రక్షించువాడవు నీవే. కావున, నీవు యజ్ఞమును నిశ్చయముగా రక్షింపుము. నీవుతక్క మరియొక రక్షకుడు లేడు (40).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆ మహర్షుల ఈ మాటలను విని విష్ణువు యుద్ధమును చేయగోరెను. కాని ఆ వీరభద్రునితో యుద్ధమునకు భయపడెను (41). చతుర్భుజుడగు విష్ణువు నాల్గు భుజములలో చక్రము మొదలగు ఆయుధములను ధరించి యుద్ధమునకు సన్నద్ధుడాయెను. మహాబలుడగు విష్ణువు దేవ గణములతో గూడి యజ్ఞ వాటిక నుండి బయటకు వచ్చెను (42). అనేక గణములతో గూడి,చేత శూలమును ధరించియున్న వీరభద్రుడు యుద్దమును చేయగోరి సంసిద్ధుడైన మహా ప్రభుడగు విష్ణువును చూచెను (43).
ఆయన ను చూడగనే పాపిని చూచిన యమునకు వలె, ఏనుగును చూచిన సింహమునకు వలె, వీరభద్రుని కనుబొమలు ముడిపడెను (44). ఆ విధముగా యుద్ధ సన్నద్ధుడగు విష్ణువును చూచి, శత్రువులను సంహరించువాడు, వీరులగు గణములతో కూడియున్న వాడు అగు వీరభద్రుడు కోపించి వేగముగా నిట్లు పలికెను (45).
వీరభద్రుడిట్లు పలికెను-
ఓరీ హరీ! నీ వీనాడు మహాదేవుని శపథమును ఎట్లు ఉల్లంఘించగల్గితివి ? నీ మనస్సులో గర్వము గలదు. నీకు ఏమి అయెను ? (46). శ్రీ రుద్రుని శపథమును ఉల్లంఘించు శక్తి నీకు గలదా ఏమి ? నీవెవడవు ? ముల్లోకములలో నిన్ను రక్షించువాడు గలడా? (47).
నీ విచటకు వచ్చుటలో గల కారణమును మేము తెలియకున్నాము. నీవు దక్షుని యత్రమునకు రక్షకుడవు ఎట్లు అయితివో చెప్పుము (48). దాక్షాయణి ఏమి చేసినదో నీవు చూడలేదా ?దధీచుని పలుకులను నీవు వినలేదా ?(49).
నీవుకూడా ఈ దక్షయజ్ఞమునందు యజ్ఞభాగముకొరకు వచ్చినాము హే మహాబాహో నీకు కూడా నేను యజ్ఞభాగమునిచ్చెదను (50) హే హరీ! నేను నీవక్షస్థ్సలమును చీల్చివేసెదను. ఈనాడు నిన్ను రక్షించుటకు నీ సమీపమునకు వచ్చువాడెవ్వడు గలడు? (51) నేను నిన్ను నేలపై పడవేసి , అగ్నితో దగ్ధుని చేసి, దగ్ధుడవగు నిన్ను ఈ నాడు శీఘ్రముగా పిండి చేసెదను(52)
ఓరీ హరీ! దురాచారా! నీవు మహేశన్వరునకు ద్రోహము తలపెట్టిన అధముడవు. పావనమగు శ్రీరుద్రుని మహిమను నీవు ఎరుంగవా? (53) హే మహాబాహొ! నీవు ఆ మహిమను ఎరింగియూ యుద్దమును చేయగోరి ఎదుట నిలబడితివి,. నీవు నా ఎదుట నిలబడగల్గినచో, నేను నీచే ఆ మహిమను వల్లె వేయించెదను(54)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 76 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 5 - THE 6th RULE
*🌻 6. Kill out desire for sensation. - Learn from sensation and observe it - 7 🌻*
300. Our attitude towards these things is very much that which we should take towards the troubles of little children.
A child breaks a doll and is in a tempest of tears and a passion of regret over it; we do all we can to sympathize with that child, but we are quite philosophical, we do not share the passion of regret. We are not in despair because a doll is broken or because this or that small matter may have happened in the school-life of the child.
We realize that there is a future, and that as compared to that future all these little matters are only temporary and not of great importance, although they are tremendously so to the child. We should be failing in our duty if we did not give the sympathy, but we should be foolish if we felt as much as that child felt – we should ourselves be acting in a childish manner.
It is exactly the same with the man who is learning to adopt a philosophical attitude. He sympathizes with the people who are so passionately upset over these things, but he himself is not disturbed. Just as one says to the child:
“Oh, well, never mind, it will be all right by and by,” so we should like to say to those who are surging under these emotions: “If you would only believe it, everything will come right and all will go well.” If we say that, we are considered unsympathetic, but it is absolutely true. We often find it difficult to avoid wonder as to how people can be so blind.
We see them surging wildly about things that do not matter in the least. They are often people with splendid possibilities, but they do not see them, and they allow themselves to be overwhelmed by mad surges of desire. We did the same thing ourselves thousands of years ago, perhaps.
Therefore we learn to be patient, understanding that it is a stage in evolution, though a very undesirable stage. So those of us who are still in danger of yielding to emotions of that sort must pull ourselves up and say: “Twenty lives ago this was perhaps excusable, but now, the time for it is past.”
If in every-day life we see a man of mature age throwing away all his time in pleasure we know that that may have been all very well twenty years ago, but now he ought to be thinking about the more serious things of life.
In the same way we ought to have risen to a level where our emotions are the higher emotions, where we have the one great idea of the work that God wills us to do.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 208 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. చ్యవనమహర్షి-సుకన్య - 5 🌻*
23. ధర్మశాస్త్రం ఏది చెపుతోందో, దానిని నిర్మొహమాటంగా అలా చూచినప్పుడు, మహర్షులు చెప్పిన వాక్యాలకు సంబంధించిన ధర్మములు వాళ్ళు ఎంత నిష్కర్షగా చెప్పారో తెలుస్తుంది. “బ్రహ్మక్షత్రం, బ్రహ్మక్షత్రం, బ్రహ్మక్షత్రం” అని, రెండు లక్షణములూ ఎవరియందైనా ఉండవచ్చు.
24. క్షాత్రం అనే లక్షణంచేత, అంటే ఆ లక్షణంవలనే క్షత్రియుడవుతాడు. అతడికి వేదవిహితమయిన ధర్మములన్నీ చెప్పబడ్డాయి. ఉపనయనాది సంస్కారములన్నీ క్షత్రియుని యందున్నాయి.
25. బ్రాహ్మణుడికి ఏ సంస్కృతి ఉందో, అదంతా క్షత్రియుడికీ ఉంది. బ్రాహ్మణుడికి మాత్రమే గల యాజనము తప్ప, మిగిలినవన్నీ ఇద్దరికీ సమానంగానే ఉన్నాయి. ఈ ప్రకారంగా అప్పుడు వర్ణవ్యవస్థ ఉంది. వ్యాసమహర్షి పరాశరుడి కుమారుడు. మరి అతని తల్లి సత్యవతి? కాని ఆయన బ్రాహ్మణుడిగానే చెల్లుబడి అయ్యాడు మనకు.
26. అంటే లక్షణము చేతనే బ్రాహ్మణత్వం ఉంది అని అర్థం. తపస్సులందరికీ సామాన్యమే! అందరికీ ఉండేటటువంటి ఆధ్యాత్మికసంపద తపోబలం. తపోధనం ఉన్నంతవరకు వాళ్ళకు వర్ణాది విభేదములు లేనేలేవు.
27. వాళ్ళు ఎవరిననుగ్రహిస్తే వాళ్ళు, వాళ్ళ వర్ణంలో చేరినవాళ్ళే. అట్లాంటి స్వతంత్రులు మహర్షులు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. సామాన్యుడు అస్వతంత్రుడై తన వర్ణధర్మాన్ని అనుసరించి చక్కగా వెళితేనే వాడు క్షేమంగా ఉంటాడు.
28. కాని తపోబలం చేత అన్నిటినీ అతిక్రమించిన ఉత్తముడు అయినవాడికి ఏ ధర్మములూ వర్తించవు. అతడే ధర్మాలన్నిటికీ శాసనకర్త అవుతాడు. మహర్షుల చరిత్రలన్నీకూడా వారు అటువంటి శాసనకర్తలే తప్ప; ఒక సంప్రదాయంలో నిబంధించబడిన (అందులోని నిబంధనలకు లోబడిన) సామాన్యవ్యక్తులు కాదు అనే చెబుతున్నాయి.
29. వారు చెప్పిన ధర్మ శాస్త్రాలే మనకు ఇప్పటికీ జీవనసూత్రాలు. వారు ఏది ధర్మమని చెపుతున్నారో అది మనం అనుసరిస్తున్నాం తప్ప, వాళ్ళ కోసం చెప్పబడినటు వంటి ధర్మాలంటూ ఏమీ లేవు. మహర్షుల అంత స్వతంత్రులని వాళ్ళను గురించి మనం గుర్తుపెట్టుకోవాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 272 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 121. Conviction is the only technique and the Guru's only initiation is: "you are not the body but only the 'I am' without words". 🌻*
The many people who have read a lot and moved from Guru to Guru have found that 'initiation' and 'technique' are commonly transmitted from Guru to their disciples.
Expecting something quite similar, they are taken aback when they come upon a true Guru who says that conviction is the only technique.
And what is that conviction about? It is that I am not the body, but only the knowledge 'I am' without words, which he says is the only initiation.
This is something very basic, simple and straightforward and the beauty of it is that it does not conform to any conventional religion.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 147 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 26 🌻*
591. మానవుడిప్పుడు "అహంబ్రహ్మాస్మి" స్థితితో పాటు అనంత జ్ఞాన శక్త్యానందముల అనుభవమును పొందుచుండును. బ్రహ్మానందమయుడై యుండును.
భగవంతుని అద్వైత స్థితి :
592. భగవంతుని ఏకత్వ స్థితి నిర్వివాదాంశమైనది. లోక ప్రసిధ్ధ మతములన్నింటికి ఇది పునాది. ఆధ్యాత్మిక శిక్షణకు ఇది గమ్యస్థానము సిద్ధాంతములో భగవంతుని ఈయేకత్వస్థితిని అంగీకరించుటకు ప్రజాసామాన్యమునకు విశేషాధికామున్నది.
కాని దానిని గురించి పరిశోధించు వారు మాత్రము బహు కొలదిమంది యుందురు.అది సులువైనది, కష్టమైనది, సార్వజనీనముగా తౌహీద్ ను గురించి, ధర్మోపదేపీఠము నుండి, ఉపన్యాస వేదిక నుఃడి మాట్లాడుట చాలా సులువుగా ఉండును. కానీ దీనిని సాధించుట బహుకష్టము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 3 / Sri Lalita Sahasranamavali - Meaning - 3 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 3. మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా |*
*నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా ‖ 3 ‖🍀*
10) మనో రూపేక్షు కోదండా :
మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.
11) పంచతన్మాత్ర సాయకా :
ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.
12) నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా :
తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 3 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 3. manorūpekṣu-kodaṇḍā pañcatanmātra-sāyakā |*
*nijāruṇa-prabhāpūra-majjadbrahmāṇḍa-maṇḍalā || 3 || 🌻*
10) Mano Rupeshu Kodanda -
She who has the bow of sweet cane which is her mind-in one of her left hands
11) Pancha than mathra sayaka -
She who has five bows of touch , smell, hearing, taste and sight
12) Nijaruna prabha poora majjath brahmanda mandala -
She who makes all the universe immerse in her red colour which is like the sun in the dawn
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 3 / Sri Vishnu Sahasra Namavali - 3 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*అశ్వని నక్షత్ర తృతీయ పాద శ్లోకం*
*🍀 3. యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |*
*నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ‖ 3 ‖ 🍀*
🍀 18) యోగ: -
యోగము చే పొందదగిన వాడు.
🍀 19) యోగ విదాంనేతా -
యోగ విదులకు ప్రభువైన వాడు.
🍀 20) ప్రధాన పురుషేశ్వర: -
ప్రకృతి పురుషులకు అధినేత.
🍀 21) నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.
🍀 22) శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.
🍀 23) కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.
🍀 24) పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 3 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka For Aswini 3rd Padam*
*🌻 3. yōgō yōgavidāṁ netā pradhānapuruṣeśvaraḥ |*
*nārasiṁhavapuḥ śrīmān keśavaḥ puruṣōttamaḥ || 3 || 🌻*
🌻 18) Yogah –
The Lord Who is Realized Through Yoga
🌻 19) Yoga-vidaam Neta –
The Lord Who is the Leader of All Those Who Know Yoga
🌻 20) Pradhana-Purusheshwara –
The One Who is the Lord of Nature and Beings
🌻 21) Narasimha Vapuh –
The Lord Whose Form is Man-Lion
🌻 22) Shriman –
The Lord Who is Always With Sri (Lakshmi)
🌻 23) Keshava –
The Lord Who has Beautiful Locks of Hair
🌻 24) Purushottama –
The Supreme Controller
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹