శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 178 / Sri Lalitha Chaitanya Vijnanam - 178


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 178 / Sri Lalitha Chaitanya Vijnanam - 178 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖


🌻 178. 'నిర్భేదా' 🌻

శివుని కంటి భేదము కాదని, జ్ఞాన అజ్ఞాన భేదము లేదని, తెలియజేయు నామమిది.

ఉద్భవించిన తత్వమే శ్రీమాత. అవ్యక్తము యొక్క మొదటి వ్యక్త స్థితియే శ్రీమాత. దర్శన మిచ్చుట కామెయే అధిపతి. అనుభూతి నిచ్చునది కూడ శ్రీపతయే. తత్త్వము అవ్యక్తమనియు, నాక్కున కందనిదనియు, తర్కింప వీలు కానిదనియు, దానిని గూర్చి తెలియుట అసాధ్యమనియు, అందు మునిగిన వారికి తానుండక అదియే యుండుననియూ, కావున తత్త్వమున ఉండుటయే కాని అనుభూతి లేదనియూ, అది శివమనియు పలుకుదురు. అది శివమైనపుడు ఆమె 'శివా'. శివుడే అగుపించిన, 'శివా' యగును. అతని ప్రథమ రూపమే ఆమె. ఆమెకును ఆయనకు భేదమే లేదు. యోగనిద్ర యందును, శివము మేల్కాంచినప్పుడు అతడే యున్నాడు కదా!

నిద్రయుందున్నవాడు వేరు, మేల్కాంచినవాడు వేరా? శివునికిని శ్రీమాతకును భేదమును చూచువారు తెలియనివారు. వారిది అభేద స్థితి. చూచువారిది భేదస్థితి. ఆమె శివునితో కూడియున్నది అనుట కూడ పూర్ణ సత్యము కాదు. ఆమె రూపమున నున్నది శివుడే. ఆమెగ గోచరించుచున్నాడు. అతడు మేల్కాంచినపుడు ఆమె యగుచున్నాడు. జీవులు కూడ నిద్రయందున్నప్పుడు శివతియే. అది సత్య స్థితి.

మేల్కాంచినప్పుడు “శివా" స్థితిని పొందుచున్నారు. అది చైతన్య స్థితి, జీవునికి, శివునికి భేద మొక్కటియే. శివునిది యోగనిద్ర, జీవునిది మొద్దునిద్ర.

శివుడు త్రిగుణాతీతుడు, జీవుడు త్రిగుణాత్మకుడు, శ్రీమాతకు జ్ఞానులు, అజ్ఞానులు అను భేదము కూడ లేదు. జీవులందరూ ఆమె బిడ్డలే. అందువలన అందరియందామెకు ప్రేమయే యుండును. అందరి ఉద్దారణకూ తోడ్పడును, వారియందు భేదములను కూడ ఆమె నిర్మూలించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 178 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Nirbhedā निर्भेदा (178) 🌻

She is without differences. Possibly this difference could mean the difference between Her and Śiva. That is why, it is said that wise men do not find any difference between Śiva and Śaktī. Their unified form is known as the Brahman and there is no difference between them.

The qualities of this unified form are being described in this Sahasranāma. Though all the nāma-s in this Sahasranāma addresses Lalitāmbikā, it should not be construed that they are addressed to Her in Her individual capacity. They are addressed to the Śiva-Śaktī combine.

Saundarya Laharī says that neither Śiva nor Śaktī can act, without depending on each other. Kūrma Purāṇa says that the Supreme Śaktī is infinite, devoid of all differences and destroyer of all differences (described in the next nāma).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2021

No comments:

Post a Comment