🍀 14 - SEPTEMBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

🌹🍀 14 - SEPTEMBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 12,బుధవారం, సెప్టెంబరు 2022 సౌమ్య వాసరే WEDNESDAY 🌹
2) 🌹 కపిల గీత - 70 / Kapila Gita - 70 🌹 సృష్టి తత్వము - 26
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 109 / Agni Maha Purana - 109 🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 244 / Osho Daily Meditations - 244 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 404 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 404 - 1 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹14, September 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : మహా భరణి, పంచమి శ్రద్ధ, Maha Bharani, Panchami Shraddha 🌺*

*🍀. నారాయణ కవచం - 18 🍀*

*26. త్వం తిగ్మధారాసివరారిసైన్య మీశప్రయుక్తో మమ ఛింధి ఛింధి |*
*చక్షూంషి చర్మన్ శతచంద్ర ఛాదయ ద్విషామఘోనాం హర పాపచక్షుషామ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మంచివాడు మరణించడం, అపజయం పొందడం - చెడ్డవాడు జీవించడం, విజయం పొందడం… వీటిని బట్టి ఈశ్వరతత్వం చెడ్డదన వలసినదేనా ? అవి మన పరమ శ్రేయస్సు కొరకే సంప్రాప్తం అయ్యాయి. మన చిత్తవృత్తులు మనలను వివేక భ్రష్టులను చెయ్యడం వలన, వాటి కిష్టం కాని ప్రతిదీ చెడ్డదని భావించడం మనకు పరిపాటి అయిపోయింది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: కృష్ణ చవితి 10:27:14 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: అశ్విని 06:58:07 వరకు
తదుపరి భరణి
యోగం: ధృవ 06:17:45 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: బాలవ 10:29:14 వరకు
వర్జ్యం: 02:54:20 - 04:31:48
మరియు 17:00:48 - 18:41:16
దుర్ముహూర్తం: 11:47:03 - 12:36:05
రాహు కాలం: 12:11:34 - 13:43:29
గుళిక కాలం: 10:39:39 - 12:11:34
యమ గండం: 07:35:48 - 09:07:43
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:35
అమృత కాలం: 27:03:36 - 28:44:04
సూర్యోదయం: 06:03:52
సూర్యాస్తమయం: 18:19:16
చంద్రోదయం: 21:11:28
చంద్రాస్తమయం: 09:27:29
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
మృత్యు యోగం - మృత్యు భయం
06:58:07 వరకు తదుపరి కాల యోగం
 - అవమానం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 70 / Kapila Gita - 70🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 26 🌴*

*26. కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణమ్
శాన్తఘోరవిమూఢత్వమితి వా స్యాదహఙ్కృతేః

*ఈ అహంకారానికే కర్తృత్వం (నేను చేస్తున్నాను), కరణత్వం (నా ఇంద్రియములతో చేస్తున్నాను), కార్యత్వం (నేను చేస్తే పని అవుతుంది). దీనికే మరో మూడు పేర్లు శాంతం (ప్రకాశకత్వం- ఒక వస్తువును చూపుట), ఘోరత్వము (చిత్త విక్షేపము, ఒకే సారి ఎన్నో ఆలోచనలు రావడం), మూఢత్వం (ఇది ఫలానా అని తెలియకపోవడం). ఈ మూడూ అహంకారానికి ఉంటాయి.*

*సత్త్వగుణ సంబంధము చేత శాంతత్వము, రాజస గుణ సంబంధము వలన ఘోరత్వము, తామస గుణ సంబంధము వలన మూఢత్వము, అనునవియును దీని లక్షణములే.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 70 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 26 🌴*

*26. kartṛtvaṁ karaṇatvaṁ ca kāryatvaṁ ceti lakṣaṇam*
*śānta-ghora-vimūḍhatvam iti vā syād ahaṅkṛteḥ*

*kartṛtvam—being the doer; karaṇatvam—being the instrument; and kāryatvam—being the effect.*
*This false ego is characterized as the doer, as an instrument and as an effect. It is further characterized as serene, active or dull according to how it is influenced by the modes of goodness, passion and ignorance.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 109 / Agni Maha Purana - 109 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 34*

*🌻. హోమ విధి - అగ్ని కార్య కథనము - 3🌻*

వర్ధనిలో కూడ బంగారు ముక్క ఉంచవలెను. దానిపై అస్త్రపూజ చేసి, దాని ఎడమ భాగమున, సమీపమునందే వాస్తులక్ష్మీ-భూవినాయకులను పూజింపవలెను. సంక్రాంత్యాదికాలములందు ఈ విధముగనే శ్రీమహావిష్ణువు స్నానాభిషేకముల ఏర్పాటు చేయవలెను. 

మండపము యొక్క కోణములందును, దిక్కులందును ఎనిమిది కలశములను, మధ్యయందు ఒక కలశమును- మొత్తము భద్రములు లేని తొమ్మిది కలశములు-ఉంచి, వాటిలో పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, పంచగవ్యములు వేయవలెను. పూర్వాదికలశములలో పైన చెప్పిన పస్తువులను, అగ్నికోణాదులందలి కలశములలో ఆ ద్రవ్యములతో పాటు పంచామృతయుక్తజలమును వేయవలెను. పెరుగు, పాలు, తేనె, వేడినీళ్ళు- ఇవి పాద్యాంగములు.

కమలములు, శ్యామాకము, దూర్వాదలములు, విష్ణుక్రాన్తోషధి అను నాలుగు వస్తులతో కూడిన జలము పాద్య మని చెప్పబడును, అర్ఘ్యమునకు కూడ ఎనిమిది అంగములు చెప్పబడినవి. అర్ఘముకొరకు యవలు, గంధము, ఫలములు, అక్షతలు, కుశలు, ఆవాలు, పుష్పములు, తిలలు సమకూర్చుకొనవలెను. జాతీ-లవంగ-కంకోలములతో కూడిన జలమును ఆచమనీయముగా ఇవ్వవలెను. 

ఇష్టదేవతకు, మూలమంత్రము చదువుచు, పంచామృతస్నానము చేయించవలెన. మధ్య నున్న కలశమునుండి శుద్ధోదకమును గ్రహించి దేవుని శిరముపై చల్లవలెను. కలశనుండి వచ్చు జలమును, కూర్చాగ్రమును స్పృశింపవలెను. పిమ్మట శుద్ధోదకముతో పాద్య-అర్ఘ్య-ఆచమనీయములు సమర్పింపవలెను. వస్త్రముచే దేవతామూర్తిని తుడిచి, వస్త్రధారణము చేయించి, సవస్త్రకముగ మండలముమీదికి దీసికొని వెళ్ళవలెను. 

అచట బాగుగా పూజచేసి, ప్రాణాయామపూర్వకముగ కుండాదులలో హోమము చేయవలెను. (హవనవిధానము) : రెండు చేతులు కడిగికొని, అగ్నికుండమునందు గాని, చేదిపై గాని మూడు పూర్వాగ్రరేఖలు గీయవలెను. వాటిని దక్షిణమునుండి ప్రారంభించి, ఉత్తరము వైపు గీయవలెను. మరల వాటిపై మూడు ఉత్తరాగ్రరేఖలు గీయవలెను. (వీటిని కూడ కుడినుండి ప్రారంభించి ఎడమకు గీయవలెను).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 109 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 34*
*🌻 Mode of performing oblation - 3 🌻*

17. One should worship the goddess of the building and the presiding deity of obstacles near it. In the same way, one should arrange for the consecration of Viṣṇu on the days of movement (of the sun from one stellar place to another), and other days (of importance).

18. Nine dentless jars full of water should be placed in the nine corners. One should offer water for washing the feet, arghya for rinsing the mouth and the pañcagavya.

19. The five sweet things, water etc. (are placed) in the east, north-east etc. The curd, milk, honey and hot water are the four constituents for the worship of the feet.

20. The lotus, śyāmāka (a kind of grain), dūrvā (grass) and the consort of Viṣṇu are for the worship of the feet. Together with barley seeds, perfumes, fruits and unbroken rice, this is spoken as constituting the eight articles for the worship of the feet.

21. The kuśa (grass), flowers of white mustard, sesamum (are) the articles (used) for adoration. One should offer waters for rinsing the mouth together with cloves and kaṅkola (berries).

22. One should bathe the deity with the five sweet materials along with (the recitation of) the principal mystic syllable. One should pour pure water on the head of the deity from the central pot.

23. The worshipper should touch water poured from the pitcher and the tip of the kūrcha (bunch of kuśa grass). One should offer pure water for washing the feet and arghya for sipping.

24. After having wiped the body with a cloth, the deity (adorned) with a cloth should be taken to the altar. Having worshipped him there, one should offer oblations in the sacrificial pit after having controlled breath.

25. Having washed hands, three lines running towards the east from the south to the north and three running towards the north are drawn.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 244 / Osho Daily Meditations - 244 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 244. ధర్మం 🍀*

*🕉. ప్రజలు మేలు చేసే వారుగా ఉంటారు. అది నిజమైన ధర్మం కాదు -- మభ్యపెట్టుకోవడం. 🕉*
 
*మంచి పనులు చేయడం గౌరవాన్ని తెస్తుంది, అది మీకు మంచి అహంభావాన్ని ఇస్తుంది. ఇది మీరు ముఖ్యమైన వ్యక్తి అని మీకు అనిపించేలా చేస్తుంది:, ప్రపంచంలోని దృష్టిలో మాత్రమే కాకుండా దేవుని దృష్టిలో కూడా అనుకుంటారు. మీరు చేసిన అన్ని మంచి పనులను మీరు చూపించి, భగవంతుడిని కూడా మీరు నిటారుగా నిలబడి ఎదుర్కొంటారు. ఇది మనం చూపించే అహంకారం, కానీ భక్తి తత్వం, మతతత్వం అహంకారమైనది కాదు.*

*మతపరమైన వ్యక్తి అనైతికమని కాదు, కానీ అతను నైతికత లేని వాడుగా ఉంటాడు. అతనికి స్థిరమైన పాత్ర అంటూ వుండదు. అతని పాత్ర ప్రవహించేదిగా ఉంటుంది, సజీవంగా ఉంటుంది, క్షణం క్షణం మారిపోతూ ఉంటుంది. అతను స్థిరమైన వైఖరి, ఆలోచన లేదా భావజాలం ప్రకారం కాకుండా పరిస్థితులకు ప్రతిస్పందిస్తాడు; అతను కేవలం తన స్పృహ నుండి స్పందిస్తాడు. అతని స్పృహ మాత్రమే అతని పాత్ర. ఇతర పాత్రలు ఏవీ అతనికి ఉండవు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 244 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 244. VIRTUE 🍀*

*🕉. People become do-gooders. That is not true virtue-- is a camouflage. 🕉*
 
*Doing good things brings respectability, it gives you a good ego feeling. It makes you feel that you are somebody important:, significant-not only in the eyes of the world but also in the eyes of God-that you can stand upright, even encountering God; you can show all the good deeds that you have done.*

*It is egoistic, and religiousness cannot be egoistic. Not that a religious person is immoral, but he is not moral--he is amoral. He has no fixed character. His character is liquid, alive, moving moment to moment. He responds to situations not according to a fixed attitude, idea, or ideology; he simply responds out of his consciousness. His consciousness is his only character, there is no
other character.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 404 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 404 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀*

*🌻 404. 'భక్తహార్ద తమోభేద భానుమత్ భానుసంతతిః' - 1 🌻* 

*భక్తుల హృదయములందుండు తమస్సును భేదించుటలో సూర్యుని వలెనూ, సూర్యకిరణముల పరంపరవలెనూ నుండునది శ్రీమాత అని అర్ధము. సత్త్వ రజస్తమో గుణములలో తమస్సు నీచమైనది. అనగా అథమ గుణము. తమస్సు అనగా అజ్ఞానమను చీకటి. అది జీవులలో బద్దకముగను, మొద్దు నిద్రగను, మరుపుగను, అశ్రద్దగను, నిర్లక్ష్యముగను, తిండిపోతు తనముగను గోచరించును. ఈ అలవాట్లకు లొంగినవారు అజ్ఞానమను చీకటి యందు పెనగులాడు చుందురు. కుంభకర్ణుడు దీనికి ఉదాహరణము.*

*తమోగుణము ప్రధానముగ నున్నప్పుడు దివ్య విషయముల యందు అనాసక్తియే కాక నిరాదరణ కూడ యుండును. హేళన భావ ముండును. ఇట్టివారు వెలుగును కూడ నిరాకరింతురు. వీరికి సూర్యుని వెలుగు సరిపడదు. సూర్య కాంతిలో తిరుగాడునప్పుడు త్వరితముగ అలసిపోవుదురు. ఉదయించు సూర్యుని కాంతికి వీరెన్నడునూ ఉన్ముఖులు కాలేరు. ఆ సమయమున వీరిని నిద్రాదేవి ఆవరించి యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 404 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih
Shivaduti shivaradhya shivamurtishivankari ॥ 88 ॥ 🌻*

*🌻 404. 'Bhaktaharda Tamobheda Bhanumat Bhanusantatih' - 1 🌻*

*It means that Sri Mata is like the Sun and the sunrays which will break the tamas in the hearts of disciples. Tamas is the lowest among the trigunas namely sattva rajas and tamas qualities. That means it is the worst. Tamas means ignorance and darkness. It expresses itself as laziness, the dull, sleepy, forgetful, heedless, negligent, the gluttonous among living beings. Those who succumb to these habits wallow in the darkness of ignorance. Kumbhakarna is an example of this.*

*When tamas is dominant, there is not only apathy but also disdain for divine things. There shall be a sense of sarcasm towards things. These people deny also the light. They cannot tolerate the Sun light. They get tired quickly when walking in the sunlight. They might never have seen the sunrise or the morning sunrays. At that time sleep would be covering them.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 240


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 240 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దేవుడు ఒక వ్యక్తి, అన్న భావాన్ని వదిలిపెట్టు. ఎక్కడో పై లోకంలో వున్నాడన్న భావాన్ని వదిలిపెట్టు. దేవుడంటే సమస్తమైన అస్తిత్వం. అది జీవితానికి మరో పేరు. జీవితాన్ని వీలయినంత సంపూర్ణంగా జీవించు. 🍀


నీ మతం భయం నించి బయట పడింది కాదు. ప్రేమ నించి బయటపడింది, వేరయింది. నరకానికి భయపడకు. నరకమన్నది లేదు. ఎప్పుడూ లేదు. మానవజాతిని మభ్యపెట్టడానికి పన్నిన వల అది. అది శతాబ్దాలుగా జరుగుతోంది. అట్లాగే స్వర్గమన్నది కూడా లేదు. స్వర్గ నరకాలు ఒక రకమైనవి వున్నాయి. అవి మానసికమయినవి. అవి నీలో వున్నాయి. ఎక్కడో లేవు. పాతాళంలో, ఆకాశంలో లేవు. వాటికి ఎట్లాంటి భౌగోళిక ఆవరణం లేదు.

స్వర్గనరకాల ఆలోచనల్ని వదిలిపెట్టు. అదంతా చెత్తా చెదారం. దేవుడు ఒక వ్యక్తి, అన్న భావాన్ని వదిలిపెట్టు. ఎక్కడో పై లోకంలో వున్నాడన్న భావాన్ని వదిలిపెట్టు. దేవుడంటే సమస్తమైన అస్తిత్వం. అది జీవితానికి మరో పేరు. జీవితాన్ని ప్రేమించు. జీవితాన్ని ఆరాధించు. జీవితాన్ని వీలయినంత సంపూర్ణంగా జీవించు. జీవితానికి నిన్ను నువ్వు సమర్పించుకో. అప్పుడు గొప్ప ఆనందం మొదలవుతుంది. దానికి ఆరంభముంటుంది కానీ అంతముండదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 340 - 5. మతపర చైతన్యంలోకి ప్రవేశించడం / DAILY WISDOM - 340 - 5. Entering Religious Consciousness


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 340 / DAILY WISDOM - 340 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻 5. మతపర చైతన్యంలోకి ప్రవేశించడం🌻


ఎవరైనా ఏ స్థాయిలో అయినా మత పరమైన చైతన్యంలోకి ప్రవేశించి నప్పుడు పూర్తిగా వేరే స్థాయికి తీసుకు వెళ్ళబడతారు. ఆత్మ ఒక అమితానంద స్థితిలో ఉంటుంది. అప్పుడు వారు ఒక ఆనంద సముద్రంలో తేలుతూ ఉంటారు. ఎందుకంటే నిమ్న జగత్తులలో బంధింప బడిన దానిని పూర్ణత్వం ఉన్నతత్వం వైపు లాగుతుంది. తన కవచాల నుంచి వ్యక్తిత్వం వేరు చేయబడుతుంది.

ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదుగుతున్న ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడంలో మనం ఎన్ని చిత్రాలు లేదా వర్ణనలను ఉపయోగించినప్పటికీ, ఆ పదాలతో ఆత్మను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా తప్ప మతం యొక్క సార్వత్రిక కోణాన్ని ఆవిష్కరించడానికి ఏ ప్రవక్త ప్రయత్నించలేదు. విశ్వ వ్యాపకమైన దాన్ని గ్రహించడం కేవలం విశ్వ వ్యాప్తమైన దాని ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 340 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻 5. Entering Religious Consciousness🌻


When one enters the religious consciousness, in any degree whatever, one gets transported totally. The soul is in a state of rapture. One is then in a large sea of delight because the whole that is above is trying to pull one out from the lower levels in which one is encased. It is as if the pith of one's individuality is being drawn out of its shell.

Whatever image or description we can employ in understanding this process of the rise of one's being into the levels of religion, we will find that words cannot touch the spirit. No prophet has endeavoured to describe the universal dimension of religion in its essentiality, except in terms of the requirements of a particular time historically, or of a place geographically. The universal can be comprehended only by itself.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 623 / Sri Siva Maha Purana - 623


🌹 . శ్రీ శివ మహా పురాణము - 623 / Sri Siva Maha Purana - 623 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 10 🌴

🌻. తారకాసుర వధ - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

శత్రు సంహారకుడగు కుమారస్వామి ఆ వీరభద్రుని ఆపి, శివుని పాదపద్మములను తారకుని వధించుటకు సంకల్పించెను (1). అపుడు మహాతేజస్వి, మహాబలశాలి యగు కార్తికేయుడు గర్జించి, పెద్ద సైన్యముతో కూడిన వాడై కోపముతో యుద్దమునకు సన్నధ్ధుడాయెను (2).

అపుడు దేవతలు, గణములు జయజయ ధ్వానములను చేసిరి. దేవర్షులు తమకు సమ్మతమైన వాక్కులతో అదే సమయములో స్తోత్రమును పలికిరి (3). అపుడు తారక కుమారులకు మిక్కిలి సహింప శక్యము కానిది, సర్వప్రాణులకు పెద్ద భయమును కలిగించునది అగు మహాయుద్ధము జరిగెను (4).

ఓ మునీ! అందరు మహాశ్చర్యముతో చూచుచుండగా ఆ ఇద్దరు వీరులు శక్తులను చేతబట్టి ఒకరితో నొకరు యుధ్ధమును చేసిరి (5). వారిద్దరి దేహములకు శక్తి ప్రహారములచే గాయములయ్యెను. మహాబలురగు వారు గొప్ప సాధనములు గలవారై ఒకరిపై నొకరు సింహములవలె లంఘించిరి (6). వైతాలిక, ఖేచర, పాపంత ఇత్యాది యుద్ధగతులను చేపట్టి శక్తితో శక్తిని కొట్టుచూ వారు యుద్ధమును చేసిరి (7). మహాబలపరా క్రమవంతులు, మహావీరులనగు వారిద్దరు ఈ యుక్తులతో పరస్పరము కొట్టుకొనుచూ అద్భుతమగు యుద్ధమును చేసిరి (8).

యుధ్ధపండితులగు వారిద్దరు ఒకరినొకరు వధించగోరి మహాబలమును ప్రదర్శిస్తూ యుద్ధములో శక్తిధారలతో కొట్టుకొనిరి (9). ఒకరినొకరు శిరస్సుపై, కంఠమునందు, తొడలయందు, మోకాళ్లపై, నడుముపై, వక్షస్థ్సలముపై, వెనుక భాగమునందు ఛేదించుకొనిరి(10). అనేకరకముల యుద్ధములలో దక్షులగు వారిద్దరు మహాబలము గలవారై ఒకరొనొకరు సింహరించగోరి యుద్ధము చేయుచూ బిగ్గరగా సంహనాదములను చేసిరి (11). దేవతలు, గంధర్వులు, కిన్నరులు అందరు ప్రేక్షకులైరి. ఈ యుద్ధములో విజేతలెవరు? అని వారిలో వారు చర్చించు కొనిరి (12).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 623🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 10 🌴

🌻 Jubilation of the gods at the death of Tāraka - 1 🌻



Brahmā said:—

1. After preventing Vīrabhadra, Kumāra, the slayer of enemies, desired the destruction of Tāraka after remembering the lotuslike feet of Śiva.

2. Then the powerful Kārttikeya of great splendour roared. Angrily he got ready for the fight. He was surrounded by a vast army.

3. Shouts of victory were raised by the gods and the Gaṇas. He was eulogised by the celestial sages with pleasing words.

4. The fight between Tāraka and Kumāra was terrific and unbearable. All the living beings were afraid.

5. O sage, even as all the persons stood gazing wonderingly, both of them fought each other with spears in their hands.

6. Each was wounded in the heart by the other with the spear. Each tried to escape from the other’s. thrust. Both were equally strong like two lions. Both were fully equipped for the fight.

7. They fought and hit each other’s spear taking recourse to the mantras Vaitālika, Khecaraka, Prāptika etc.[1]

8. With these mantras they were possessed of magical properties. They wonderfully fought each other using their full strength and exploits.

9. They were equally good adepts in fighting. Each wanted to kill the other. They utilised all their power. With the edges of spears they hit each other.

10. They hit or cut each other’s head, neck, thighs, knees, hips, heart, chest and the back.

11. They continued the fight swaggering and vaunting with heroic words. They were experts in different tactics of warfare. They were equally strong. They desired to kill each other.

12. All the gods Gandharvas and Kinnaras stood as mere onlookers. “Who will win this battle?” they asked each other.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 661 / Vishnu Sahasranama Contemplation - 661


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 661 / Vishnu Sahasranama Contemplation - 661🌹

🌻661. బ్రహ్మణ్యః, ब्रह्मण्यः, Brahmaṇyaḥ 🌻

ఓం బ్రహ్మణ్యాయ నమః | ॐ ब्रह्मण्याय नमः | OM Brahmaṇyāya namaḥ


తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మ సంజ్ఞితమ్।
తేభ్యో హితత్వాద్బ్రహ్మణ్య ఇతి విష్ణుః సమీర్యతే ॥

తపస్సు, వేదములు, విప్రులు, జ్ఞానము - ఇవి బ్రహ్మ అను సంజ్ఞ కలవి. వీనికి హితము కలిగించువాడుగనుక విష్ణువు బ్రహ్మణ్యః అని చెప్పబడును.


:: ఋగ్వేదాన్తర్గత ఆత్మ బోధోపనిషత ::

...బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూధనః ।
బ్రహ్మణ్యః పుణ్డరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుతః... ॥ 2 ॥


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 661🌹

🌻661. Brahmaṇyaḥ 🌻

OM Brahmaṇyāya namaḥ

तपो वेदाश्च विप्राश्च ज्ञानं च ब्रह्म संज्ञितम् ।
तेभ्यो हितत्वाद्ब्रह्मण्य इति विष्णुः समीर्यते ॥

Tapo vedāśca viprāśca jñānaṃ ca brahma saṃjñitam,
Tebhyo hitatvādbrahmaṇya iti viṣṇuḥ samīryate.

Austerity, the Vedas, sages and wisdom are indicated by the word Brahma. As Lord Viṣṇu is beneficial to them, He is called Brahmaṇyaḥ.


:: ऋग्वेदान्तर्गत आत्म बोधोपनिषत ::

...ब्रह्मण्यो देवकीपुत्रो ब्रह्मण्यो मधुसूधनः ।
ब्रह्मण्यः पुण्डरीकाक्षो ब्रह्मण्यो विष्णुरच्युतः... ॥ २ ॥


Ātmabodhopaniṣat

...Brahmaṇyo devakīputro brahmaṇyo madhusūdhanaḥ,
Brahmaṇyaḥ puṇḍarīkākṣo brahmaṇyo viṣṇuracyutaḥ.... 2.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr‌dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

శ్రీమద్భగవద్గీత - 262: 06వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 262: Chap. 06, Ver. 29

 

🌹. శ్రీమద్భగవద్గీత - 262 / Bhagavad-Gita - 262 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 29 🌴

29. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన: ||


🌷. తాత్పర్యం :

నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును గాంచును. ఆత్మదర్శియైన అట్టివాడు దేవదేవుడైన నన్నే నిక్కముగా సర్వత్రా గాంచును.

🌷. భాష్యము :

సర్వుల హృదయములలో పరమాత్మ రూపున స్థితుడై యున్న శ్రీకృష్ణభగవానుని గాంచగలిగినందున కృష్ణభక్తిరసభావితుడైన యోగి నిజమైన ద్రష్ట యనబడును. “ఈశ్వర: సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి”. శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపములో శునక హృదయము నందును మరియు బ్రహ్మణుని హృదయమునందును నిలిచి యుండును. ఆ భగవానుడు నిత్యముగా భౌతికముగా ప్రభావితుడు కాడనియు పూర్ణయోగి ఎరిగి యుండును. ఆ విధముగా భౌతికత్వముచే ప్రభావితము కాకుండుటయే భగవానుని దివ్యమైన తటస్థ స్వభావమై యున్నది. పరమాత్మతో పాటు జీవాత్మయు హృదయమందు నిలిచియున్న పరమాత్మ వలె అది ఎల్లరి హృదయములలో నిలిచియుండలేదు.

ఇదియే జీవాత్మ మరియు పరమాటం నడుమ గల భేదము. నిజమైన యోగాభ్యాసము నందు నియుక్తుడు కానివాడు ఈ విషయమున స్పష్టముగా గాంచలేదు. బాహ్యమునను జీవులు సదా భగవానుని శక్తి యందే నిలిచి యుందురు. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు ఆధ్యాత్మికశక్తి (ఉత్తమము), భౌతికశక్తి (అల్పము) యను రెండు శక్తులను శ్రీకృష్ణభగవానుడు ప్రధానముగా కలిగియుండును. జీవుడు ఉత్తమశక్తి అంశయైన అల్పమైన భౌతికశక్తిచే బద్ధుడై యుండును. ఈ విధముగా అతడు సర్వదా భగవానుని శక్తి యందున్నట్టివాడే. అనగా జీవుడు భగవానుని యందే ఏదో ఒక విధముగా స్థితిని కలిగియున్నట్టివాడే యగుచున్నాడు.

జీవులు తమ కర్మఫలముల ననుసరించి వివిధస్థితుల యందున్నప్పటికిని ఆన్ని పరిస్థితుల యందును వారు శ్రీకృష్ణభగవానుని దాసులే యని గాంచగలిగినందున యోగి సమదర్శియై యుండును. భౌతికశక్తి యందు నిలిచినపుడు జీవుడు ఇంద్రియములను సేవించును. కాని అదే జీవుడు ఆధ్యాత్మికశక్తి యందు నిలిచినప్పుడు మాత్రము ప్రత్యక్షముగా భగవానుని సేవించును. ఈ విధముగా రెండు పరిస్థితుల యందును అతడు భగవానుని దాసుడే. ఇట్టి సమత్వ వీక్షణము కృష్ణభక్తిభావనాపూర్ణుడైన వ్యక్తి యందు పూర్ణముగా నుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 262 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 29 🌴

29. sarva-bhūta-stham ātmānaṁ sarva-bhūtāni cātmani
īkṣate yoga-yuktātmā sarvatra sama-darśanaḥ


🌷 Translation :

A true yogī observes Me in all beings and also sees every being in Me. Indeed, the self-realized person sees Me, the same Supreme Lord, everywhere.

🌹 Purport :

A Kṛṣṇa conscious yogī is the perfect seer because he sees Kṛṣṇa, the Supreme, situated in everyone’s heart as Supersoul (Paramātmā). Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe ’rjuna tiṣṭhati. The Lord in His Paramātmā feature is situated within both the heart of the dog and that of a brāhmaṇa. The perfect yogī knows that the Lord is eternally transcendental and is not materially affected by His presence in either a dog or a brāhmaṇa. That is the supreme neutrality of the Lord. The individual soul is also situated in the individual heart, but he is not present in all hearts.

That is the distinction between the individual soul and the Supersoul. Outwardly, also, every living being is situated in the energy of the Lord. As will be explained in the Seventh Chapter, the Lord has, primarily, two energies – the spiritual (or superior) and the material (or inferior). The living entity, although part of the superior energy, is conditioned by the inferior energy; the living entity is always in the Lord’s energy. Every living entity is situated in Him in one way or another.

The yogī sees equally because he sees that all living entities, although in different situations according to the results of fruitive work, in all circumstances remain the servants of God. While in the material energy, the living entity serves the material senses; and while in the spiritual energy, he serves the Supreme Lord directly. In either case the living entity is the servant of God. This vision of equality is perfect in a person in Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


13 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹13, September 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, చతుర్థి శ్రద్ధ, Chaturthi Shraddha, Sankashti Chaturthi🌻

🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 4 🍀


4. శోకాన్వితాం జనకజాం కృతవానశోకాం
ముద్రాం సమర్ప్య రఘునందన- నామయుక్తాం.

హత్వా రిపూనరిపురం హుతవాన్ కృశానౌ
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మనం అజ్ఞాన బంధంలో తగుల్కొని వున్నప్పుడు కూడా మనలోని భగవంతుడు మనకు అండగా వుండి నడిపిస్తూనే వున్నాడు. అయితే, గమ్యస్థానం చేరుకోడం నిశ్చయమే అయినా. అది చుట్టుత్రోవలు. ప్రక్కత్రోవలు, పట్టిన అనంతరం చేరుకోడ మవుతుంది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: కృష్ణ తదియ 10:39:36 వరకు

తదుపరి కృష్ణ చవితి

నక్షత్రం: రేవతి 06:36:23 వరకు

తదుపరి అశ్విని

యోగం: వృధ్ధి 07:35:52 వరకు

తదుపరి ధృవ

కరణం: విష్టి 10:41:36 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 08:31:01 - 09:20:07

రాహు కాలం: 15:16:00 - 16:48:03

గుళిక కాలం: 12:11:55 - 13:43:58

యమ గండం: 09:07:50 - 10:39:53

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:35

అమృత కాలం: -

సూర్యోదయం: 06:03:46

సూర్యాస్తమయం: 18:20:05

చంద్రోదయం: 20:32:31

చంద్రాస్తమయం: 08:33:38

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మీనం

శుభ యోగం - కార్య జయం 06:36:23

వరకు తదుపరి అమృత యోగం

- కార్య సిధ్ది

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹