శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 276 / Sri Lalitha Chaitanya Vijnanam - 276

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 276 / Sri Lalitha Chaitanya Vijnanam - 276 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀

🌻 276. 'భైరవీ' 🌻

పండ్రెండు సంవత్సరముల వయస్సు గల కన్యగ గోచరించు నది శ్రీమాత అని అర్థము.

భైరవ శబ్దము త్రిమూర్త్యాత్మక శబ్దమని ముందు నామములలో తెలుపబడినది భ, ర, వ వరుసగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సంకేతించు శబ్దములు.

భైరవి అనగా ఈ మూడు తత్త్వములు తానై యున్నది. తానే మూడైనది. మూడు మరల తానొకటిగ కాగలదు. మూడిటిని ఏర్పరచి వారికి కేంద్రముగ కూడ నిలబడగలదు. కావున ఈ విధముగ భైరవి నామము శ్రీపరముగను, భైరవ నామము శివ పరముగను తెలుపుదురు.

భైరవుని భార్య గనుక భైరవి అని కూడ అందురు. భీరువుల గుంపును కూడ భైరవి అందురు. భీరువులైన కన్యల గుంపు భైరవి అని మరియొక అర్థము. పండ్రెండు సంవత్సరముల వయస్సు గల కన్యలు భీరువులై యుందురని పెద్దలు తెలుపుదురు. వారి చిత్తములు ఇంకను కామ ప్రేరితములు కాక యుండును. ఇట్టి కన్యలు అత్యంత పవిత్రులు. పవిత్రతకు పూర్ణరూపములై వారు వెలుగొందుదురు.

పురాణములందు పార్వతి, అరుంధతి అనసూయ, శుచి, గౌరి, ఉమ నామములు భైరవ గుంపుగ తెలుపుదురు. క్లుప్తముగ కన్యా తత్త్వమునకు భైరవి పదమును వాడుదురు. నిజమగు ఆనందమునకు మనస్సు ఈ స్థితిని మరల పొందవలెనని యోగవిద్య సూచించును. సత్యకామము, ధర్మకామము తప్ప ఇతర కామములు ఈ స్థితి చేరిన వారి నంటవు. ఇట్టి వారిని కన్యాపుత్రులందురు. వీరి యందు దివ్యత్వము ప్రతిబింబించును.

భైరవ తంత్రము ద్వారా తాంత్రికులు ఈ స్థితిని పొందుటకు ప్రయత్నింతురు. సాత్త్వికులు సత్త్వగుణము నాశ్రయించి ఈ స్థితిని పొందుదురు. మార్గమేదైననూ శ్రీదేవి తత్త్వము తనయందు నిత్యము ప్రతిబింబించుటే జీవుల గమ్యము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 276 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀

🌻 Bhairavī भैरवी (276) 🌻

Wife of Bhairavā (Śiva) is Bhairavī. They are inseparable.

It is interesting to know about the Bhairava form of Śiva. Bha means sustenance of the universe, ra means the great dissolution and va means recreation. This form of Śiva is considered as one of His subtle forms and is beyond the essence of energy of Śaktī (not beyond Śaktī Herself) and is the manifestation of the Supreme Brahman. This is a stage beyond all the stages of consciousness. No tattva-s, no mantra-s, beyond OM, in fact Bhairava is beyond everything.

There is a series of yogic practices referred in Vijñānabhairava, a famous and ancient Kashmiri text on yoga (verse 24). ‘There are two points in our respiration. One is the outer space where exhalation ends and the other is the point within our respiratory system where the inhalation ends. In both these points, the breath takes rest for a split second. The rest does not mean that it stops for a split second, but remains in the form of Śaktī in a stage of suspended animation.

One should concentrate on this Śaktī to realize the Brahman. This Śaktī is called Bhairavī. This masterly interpretation also confirms the prakāśa and vimarśa aspect of the Brahman. Śaktī is moving up and down as prāṇa and therefore vimarśa form. Prakāśa is the static Self-illuminating Ātman within. This is the reason why yoga teaches on the concentration of breath.

The form of Bhairava that we see in temples is not the Bhairava discussed here. These forms of Bhairava are protectors of temples and the community living around temples.

In general it should be understood that the union of Śiva and Śaktī is known as vāc. Śiva is the meaning of a word and Śaktī is root of the word. It is also said that Śiva and Śaktī cannot be separated. They are united firmly like a word and its meaning. One cannot separate the meaning from the word. It is the same concept with Bhairava and Bhairavī.

A girl of twelve years is called as Bhairavī.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

06 Jun 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 27

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 27 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోడానికి ఏకైక మార్గం మనసును పక్కన పెట్టడమే. 🍀

దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోడానికి ఏకైక పూర్వరంగం మనసును పక్కన పెట్టడం. ధ్యానమంటే అదే. ఎప్పుడూ సందడి చేసే మనసును పక్కన పెట్టడానికి యిది వ్యూహం. హేతువుకు అందకుండా మనసు మాట్లాడుతూ పోతూ వుంటుంది. దాన్ని పక్కన పెట్టడానికి యిది మార్గం. ఆ మనసు ఏ పనీ లేకున్నా ఎప్పుడు బిజీగా వుంటుంది. హడావుడి పడుతూ వుంటుంది.

మనసుని నాశనం చెయ్యాలని నేను చెప్పడం లేదు. దాన్ని పక్కన పెట్టమని మాత్రమే చెబుతున్నా. అవసరమయినపుడు దాన్ని వుపయోగించుకోవచ్చు. అదెట్లాంటిదంటే గ్యారేజీలో నీ కారుని పార్కు చెయ్యడం లాంటిది. దాన్ని అవసరమయినపుడు అక్కడి నించీ బయటికి తియ్యొచ్చు. అప్పుడు నువ్వు అధికారిగా వుంటావు.

సాధారణంగా పరిస్థితి దీనికి భిన్నంగా వుంటుంది. కారు గ్యారేజిలోకి వెళ్ళడానికి ఒప్పుకోదు. 'నేను ఆగను, వెళుతూనే వుంటాను' అంటుంది. 'నువ్వు నడుపుతూనే వుండాలి' అని ఆదేశాలిస్తుంది. రోజులో యిరవైగంటలూ సాగుతూనే వుంటుంది. ఆగకుండా పరుగులు తీస్తూనే వుంటుంది. నువ్వు నిద్రపోతున్నపుడు కూడా మనసు సాగుతూనే వుంటుంది.

సాధారణంగా పసితనంలో ప్రారంభమయిన దాని మాటలు మరణపర్యంతం కొనసాగుతాయి. ఎవరో దాన్ని ధ్యానంతో ఆపే దాకా అది ఆగదు. ధ్యానంలో అడుగు పెట్టిన కొందరు మనసును ఆపుతారు. మనసనే మేఘాల వెనుక నున్న సూర్యుణ్ణి చూస్తారు. అంతిమ చైతన్య కాంతి దర్శిస్తారు. కేవల చైతన్యభానుణ్ణి చూస్తారు. దైవజ్ఞానాన్ని అందుకుంటారు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

06 Jun 2021

వివేక చూడామణి - 84 / Viveka Chudamani - 84

🌹. వివేక చూడామణి - 84 / Viveka Chudamani - 84🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 20. శరీర బంధనాలు - 10 🍀

291. ఈ బ్రహ్మములో విశ్వమంతా ప్రతిబింబముగా, అద్దములో కనిపించే నగరము వలె ఉన్నది. బ్రహ్మమైన నీవు, ఈ విషయాన్ని గ్రహించి నీ జీవితమును ఉన్నతము చేసుకొనుము.

292. ఏదైతే నిజమో, వ్యక్తి యొక్క ఆది లేక మూల సారమో, ఆ విజ్ఞానము బ్రహ్మానంద స్థితి ఒక్కటే అయినది. రెండవది లేనిది. అయిన ఆ బ్రహ్మము మాత్రమే. ఆకారానికి, క్రియలకు అతీతమైన ఆ బ్రహ్మాన్ని పొందినవాడు, తన యొక్క తప్పుడు శరీరమును అనగా నటనలతో కూడిన శరీరమును వేరుగా భావించి తాను ధరించిన వేషమును (మాస్క్) వదలివేయును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 84 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 20. Bondages of Body - 10 🌻

291. That in which there is this reflection of the universe, as of a city in a mirror – that Brahman art thou; knowing this thou wilt attain the consummation of thy life.

292. That which is real and one’s own primeval Essence, that Knowledge and Bliss Absolute, the One without a second, which is beyond form and activity – attaining That one should cease to identify oneself with one’s false bodies, like an actor giving up his assumed mask.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

06 Jun 2021

దేవాపి మహర్షి బోధనలు - 95

🌹. దేవాపి మహర్షి బోధనలు - 95 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 76. హృదయ సమర్పణ 🌻

ధ్యానమున జీవుడు "తానుండుట” అనగనేమో తెలియుటకు ప్రయత్నించును. అది తెలియుట సత్యమును తెలియుటయే. ఈ ప్రయత్నమునకు మహత్తరమగు విఘ్నము భయము. భయము జీవుని ఆవరించినచో యిక అతడు పెరుగుట కవకాశము లేదు. అంతకు మునుపు పొందిన వృద్ధికూడ భయకారణముచే అక్కరకు రాదు.

మమ్ముల ననుసరించువారు మాపై విశ్వాసముంచి భయమును వదలవలెను. భయపడు వానికి హృదయము కుంచించుకొని పోవును. ఊపిరితిత్తులు కూడ చిన్నవగును. శ్వాస పూర్ణముగ జరుగక, ఆయాసము వచ్చును. ఆయాసము భయమునకు దారితీయును. భయము మరింత పెరుగును. ఊపిరి అందని స్థితి కలుగును. దానితో మరణభయము కలుగును. ఇదంతయు భయము వలననే.

మాపై విశ్వాసము పెంచుకొన్నచో భయము మిమ్ములను చేరదు. సద్గురువు నిర్భయమును నీ హృదయము నుండి అందించ గలడు. విశ్వాసము హృదయమును తెరువగలదు. అందుండి మీకు సమస్తమును అందించగలడు. అందులకే భరతదేశమున హృదయ మును దైవమునకు, గురువునకు అర్పించు సంప్రదాయమేర్పడినది. హృదయ సమర్పణమునకు విశ్వాసము ప్రధానము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

06 Jun 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 414, 415 / Vishnu Sahasranama Contemplation - 414, 415

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 414 / Vishnu Sahasranama Contemplation - 414🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻414. వాయుః, वायुः, Vāyuḥ🌻

ఓం వాయవే నమః | ॐ वायवे नमः | OM Vāyave namaḥ

వాయుః, वायुः, Vāyuḥ

వాతి గంధం కరోతీతి వాయు శబ్దేన బోధ్యతే ।
పుణ్యో గంధః పృథివ్యాం చేత్యచ్యుతః స్వయమీరణాత్ ॥

గంధమును ఏర్పరచును. తానే గంధముగా ఏర్పడును. కావున 'వా' అనుధాతువునుండి ఈ అర్థములో 'వాయుః' అను శబ్దము ఏర్పడును.

:: శ్రీమద్బగవద్గీత - విజ్ఞాన యోగము ::

పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ॥ 9 ॥

నేను భూమియందు సుగంధమును, అగ్నియందు ప్రకాశమును, సమస్తప్రాణులయందు ప్రాణమును, తాపసులయందు తపస్సును అయియున్నాను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 414🌹

📚. Prasad Bharadwaj

🌻414. Vāyuḥ🌻

OM Vāyave namaḥ

Vāti gaṃdhaṃ karotīti vāyu śabdena bodhyate,
Puṇyo gaṃdhaḥ pr̥thivyāṃ cetyacyutaḥ svayamīraṇāt.

वाति गंधं करोतीति वायु शब्देन बोध्यते ।
पुण्यो गंधः पृथिव्यां चेत्यच्युतः स्वयमीरणात् ॥

One who is the cause of smell. Blows; carries the smell.

Śrīmad Bagavad Gīta - Chapter 7

Puṇyo gandhaḥ pr̥thivyāṃ ca tejaścāsmi vibhāvasau,
Jīvanaṃ sarvabhūteṣu tapaścāsmi tapasviṣu. 9.

:: श्रीमद्बगवद्गीत - विज्ञान योग ::

पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ ।
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥ ९ ॥

I am also the sweet fragrance in the earth; I am the brilliance in the fire and the life in all beings; and I am the austerity of the ascetics.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

Continues....

🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 415 / Vishnu Sahasranama Contemplation - 415🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻415. అధోక్షజః, अधोक्षजः, Adhokṣajaḥ🌻

ఓం అధోక్షజాయ నమః | ॐ अधोक्षजाय नमः | OM Adhokṣajāya namaḥ

అధోభూతే హ్యక్షగణే ప్రత్యగ్రూపప్రవాహితే ।
జాయతే తస్య విజ్ఞానం తేనాధోక్షజ ఉచ్యతే ॥
ద్యౌరక్షం పృథివీ చాధః తయోర్యస్మాదజాయత ।
మధ్యే వైరాజరూపేణ ఇత్యధోక్షజ ఉచ్యతే ॥
అధో న క్షీయతే జాతు యస్మాత్తస్మాదధోక్షజః ।
ఇతి వ్యాసేన మునినా సూక్తేరుద్యోగ పర్వణి ॥

ఇంద్రియ సమూహము అంతర్ముఖముగా ప్రసరింపజేయబడగా, ఆ పరమాత్మ విషయకమయిన జ్ఞానము జనించును. కావున అతడు అధోక్షజః అనబడును. చిత్తము అంతర్ముఖమైనపుడు మాత్రమే సాధకునకు పరమాత్మ సాక్షాత్కారమగును.

ద్యుల్లోకము అక్షం అనబడును; పృథివి అధః అనబడును. ఆ రెంటి నడుమ పరమాత్ముడే విరాట్పురుష రూపమున ఆవిర్భవించెను. అందువలన అధః అక్ష అనబడు ద్యుపృథివులనడుమ జనించుటచే అధోక్షజః అనబడును.

ఎన్నడును తన స్థితినుండి క్రిందకి దిగజారి క్షయమునందనివాడు అని మహాభారత ఉద్యోగపర్వమున చెప్పబడిన వచనము ప్రమాణము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 415🌹

📚. Prasad Bharadwaj

🌻415. Adhokṣajaḥ🌻

OM Adhokṣajāya namaḥ

Adhobhūte hyakṣagaṇe pratyagrūpapravāhite,
Jāyate tasya vijñānaṃ tenādhokṣaja ucyate.
Dyaurakṣaṃ pr̥thivī cādhaḥ tayoryasmādajāyata,
Madhye vairājarūpeṇa ityadhokṣaja ucyate.
Adho na kṣīyate jātu yasmāttasmādadhokṣajaḥ,
Iti vyāsena muninā sūkterudyoga parvaṇi.

अधोभूते ह्यक्षगणे प्रत्यग्रूपप्रवाहिते ।
जायते तस्य विज्ञानं तेनाधोक्षज उच्यते ॥
द्यौरक्षं पृथिवी चाधः तयोर्यस्मादजायत ।
मध्ये वैराजरूपेण इत्यधोक्षज उच्यते ॥
अधो न क्षीयते जातु यस्मात्तस्मादधोक्षजः ।
इति व्यासेन मुनिना सूक्तेरुद्योग पर्वणि ॥

Adhaḥ stands for the earth; akṣam is the sky; ja is to be born. He who incarnated as the Virāt Puruṣa extending from the earth to the sku is Adhokṣajaḥ.

Knowledge of Him arises only when the sense organs which always have the outwardly tendency are turned inward. Hence , He is said to be Adhokṣajaḥ.

He who does not decline. He is Adhokṣajaḥ because He undergoes no degeneration from His original nature vide the Udyoga parva of Mahā Bhārata.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥
Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

06 Jun 2021

6-JUNE-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-46 / Bhagavad-Gita - 1-46 🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 614 / Bhagavad-Gita - 614 - 18-25🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 414 415  / Vishnu Sahasranama Contemplation - 414, 415🌹
4) 🌹 Daily Wisdom - 121🌹
5) 🌹. వివేక చూడామణి - 84🌹
6) 🌹Viveka Chudamani - 84🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 84🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 27🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 275 / Sri Lalita Chaitanya Vijnanam - 275🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 46 / Bhagavad-Gita - 46 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 46 🌴*

46. యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ: |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||

🌷. తాత్పర్యం : 
నిరాయుధుడు మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు.

🌷. భాష్యము :
 క్షత్రియ యుద్ధనియమము ననుసరించి నిరాయుధుడైనవానిని మరియు యుద్ధమును చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. అటువంటి పరిస్థితిలో శత్రువులు దాడిచేసినప్పటికిని తాను మాత్రము యుద్ధము చేయబోనని అర్జునుడు నిర్ణయించుకొనినాడు. ప్రతిపక్షమువారు ఎంత సమరోత్సాహముతో నున్నారో అతడు పట్టించుకొనలేదు. శ్రీకృష్ణభగవానుని ఘనభక్తుడైన కారణమున కలిగినట్టి మృదుహృదయమే ఆ లక్షణములకు కారణమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 46 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

*🌴 Chapter 1 - Vishada Yoga - 46 🌴*

46. yadi mām apratīkāram
aśastraṁ śastra-pāṇayaḥ
dhārtarāṣṭrā raṇe hanyus
tan me kṣema-taraṁ bhavet

🌷 Translation : 
Better for me if the sons of Dhṛtarāṣṭra, weapons in hand, were to kill me unarmed and unresisting on the battlefield.

🌷 Purport : 
It is the custom – according to kṣatriya fighting principles – that an unarmed and unwilling foe should not be attacked. Arjuna, however, decided that even if attacked by the enemy in such an awkward position, he would not fight. He did not consider how much the other party was bent upon fighting. All these symptoms are due to soft-heartedness resulting from his being a great devotee of the Lord.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 614 / Bhagavad-Gita - 614 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 25 🌴*

25. అనుబన్ధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్య తే ||

🌷. తాత్పర్యం : 
శాస్త్రనిర్దేశములను నిరసించి భవిష్యత్బంధమును గాని, పరహింసను, పరదుఃఖమును గాని లెక్కపెట్టక భ్రాంతియందు ఒనర్చబడు కర్మలు తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును.

🌷. భాష్యము :
మనుజుడు తాను చేయు కర్మలకు ప్రభుత్వమునకు గాని, యమదూతలకు గాని జవాబుదారి కావలసివచ్చును. బాధ్యతారహితముగా ఒనర్చబడు కర్మ సర్వదా విధ్వంసకరమే కాగలదు. ఏలయన అట్టి కర్మ శాస్త్రనిర్దేశములైన ధర్మనియమములను సమూలముగా నశింపజేయును. 

అటువంటి బాధ్యతారహిత కర్మలు సదా హింస పైననే ఆధారపడియుండి పరులకు దుఃఖమునే కలిగించును. స్వానుభవముపై ఆధారపడి ఒనర్చబడు అట్టి బాధ్యతారహిత కర్మలు నిక్కము భ్రాంతిమయములే. అట్టి భ్రాంతిమయ కర్మ తమోగుణఫలమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 614 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 25 🌴*

25. anubandhaṁ kṣayaṁ hiṁsām anapekṣya ca pauruṣam
mohād ārabhyate karma yat tat tāmasam ucyate

🌷 Translation : 
That action performed in illusion, in disregard of scriptural injunctions, and without concern for future bondage or for violence or distress caused to others is said to be in the mode of ignorance.

🌹 Purport :
One has to give account of one’s actions to the state or to the agents of the Supreme Lord called the Yamadūtas. Irresponsible work is destructive because it destroys the regulative principles of scriptural injunction. 

It is often based on violence and is distressing to other living entities. Such irresponsible work is carried out in the light of one’s personal experience. This is called illusion. And all such illusory work is a product of the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 414, 415 / Vishnu Sahasranama Contemplation - 414, 415 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻414. వాయుః, वायुः, Vāyuḥ🌻*

*ఓం వాయవే నమః | ॐ वायवे नमः | OM Vāyave namaḥ*

*వాయుః, वायुः, Vāyuḥ*

వాతి గంధం కరోతీతి వాయు శబ్దేన బోధ్యతే ।
పుణ్యో గంధః పృథివ్యాం చేత్యచ్యుతః స్వయమీరణాత్ ॥

గంధమును ఏర్పరచును. తానే గంధముగా ఏర్పడును. కావున 'వా' అనుధాతువునుండి ఈ అర్థములో 'వాయుః' అను శబ్దము ఏర్పడును.

:: శ్రీమద్బగవద్గీత - విజ్ఞాన యోగము ::
పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ॥ 9 ॥

నేను భూమియందు సుగంధమును, అగ్నియందు ప్రకాశమును, సమస్తప్రాణులయందు ప్రాణమును, తాపసులయందు తపస్సును అయియున్నాను.
సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 414🌹*
📚. Prasad Bharadwaj

*🌻414. Vāyuḥ🌻*

*OM Vāyave namaḥ*

Vāti gaṃdhaṃ karotīti vāyu śabdena bodhyate,
Puṇyo gaṃdhaḥ pr̥thivyāṃ cetyacyutaḥ svayamīraṇāt.

वाति गंधं करोतीति वायु शब्देन बोध्यते ।
पुण्यो गंधः पृथिव्यां चेत्यच्युतः स्वयमीरणात् ॥

One who is the cause of smell. Blows; carries the smell.

Śrīmad Bagavad Gīta - Chapter 7
Puṇyo gandhaḥ pr̥thivyāṃ ca tejaścāsmi vibhāvasau,
Jīvanaṃ sarvabhūteṣu tapaścāsmi tapasviṣu. 9.

:: श्रीमद्बगवद्गीत - विज्ञान योग ::
पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ ।
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥ ९ ॥

I am also the sweet fragrance in the earth; I am the brilliance in the fire and the life in all beings; and I am the austerity of the ascetics.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 415 / Vishnu Sahasranama Contemplation - 415🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻415. అధోక్షజః, अधोक्षजः, Adhokṣajaḥ🌻*

*ఓం అధోక్షజాయ నమః | ॐ अधोक्षजाय नमः | OM Adhokṣajāya namaḥ*

అధోభూతే హ్యక్షగణే ప్రత్యగ్రూపప్రవాహితే ।
జాయతే తస్య విజ్ఞానం తేనాధోక్షజ ఉచ్యతే ॥
ద్యౌరక్షం పృథివీ చాధః తయోర్యస్మాదజాయత ।
మధ్యే వైరాజరూపేణ ఇత్యధోక్షజ ఉచ్యతే ॥
అధో న క్షీయతే జాతు యస్మాత్తస్మాదధోక్షజః ।
ఇతి వ్యాసేన మునినా సూక్తేరుద్యోగ పర్వణి ॥

ఇంద్రియ సమూహము అంతర్ముఖముగా ప్రసరింపజేయబడగా, ఆ పరమాత్మ విషయకమయిన జ్ఞానము జనించును. కావున అతడు అధోక్షజః అనబడును. చిత్తము అంతర్ముఖమైనపుడు మాత్రమే సాధకునకు పరమాత్మ సాక్షాత్కారమగును.

ద్యుల్లోకము అక్షం అనబడును; పృథివి అధః అనబడును. ఆ రెంటి నడుమ పరమాత్ముడే విరాట్పురుష రూపమున ఆవిర్భవించెను. అందువలన అధః అక్ష అనబడు ద్యుపృథివులనడుమ జనించుటచే అధోక్షజః అనబడును.

ఎన్నడును తన స్థితినుండి క్రిందకి దిగజారి క్షయమునందనివాడు అని మహాభారత ఉద్యోగపర్వమున చెప్పబడిన వచనము ప్రమాణము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 415🌹*
📚. Prasad Bharadwaj

*🌻415. Adhokṣajaḥ🌻*

*OM Adhokṣajāya namaḥ*

Adhobhūte hyakṣagaṇe pratyagrūpapravāhite,
Jāyate tasya vijñānaṃ tenādhokṣaja ucyate.
Dyaurakṣaṃ pr̥thivī cādhaḥ tayoryasmādajāyata,
Madhye vairājarūpeṇa ityadhokṣaja ucyate.
Adho na kṣīyate jātu yasmāttasmādadhokṣajaḥ,
Iti vyāsena muninā sūkterudyoga parvaṇi.

अधोभूते ह्यक्षगणे प्रत्यग्रूपप्रवाहिते ।
जायते तस्य विज्ञानं तेनाधोक्षज उच्यते ॥
द्यौरक्षं पृथिवी चाधः तयोर्यस्मादजायत ।
मध्ये वैराजरूपेण इत्यधोक्षज उच्यते ॥
अधो न क्षीयते जातु यस्मात्तस्मादधोक्षजः ।
इति व्यासेन मुनिना सूक्तेरुद्योग पर्वणि ॥

Adhaḥ stands for the earth; akṣam is the sky; ja is to be born. He who incarnated as the Virāt Puruṣa extending from the earth to the sku is Adhokṣajaḥ.

Knowledge of Him arises only when the sense organs which always have the outwardly tendency are turned inward. Hence , He is said to be Adhokṣajaḥ.

He who does not decline. He is Adhokṣajaḥ because He undergoes no degeneration from His original nature vide the Udyoga parva of Mahā Bhārata.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 121 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 30. Our Actions Determine the Future🌻*

The resultant force of an action has one’s future determined by it. Patanjali, in his Yoga Sutras, says that the class of society into which one is born, the length of life which one is to live, and the nature of the experiences through which one has to pass, are all determined by the residual potency of past actions. These potencies become active in this life itself or in a life to come. 

A famous verse proclaims: “The nature of one’s life, action, wealth, education and death are all fixed up even when one is in the womb of the mother.” Human effort has a relative value and forms a part of this universal law of self-completeness, displaying the manner in which the impersonal reality behaves when it is cast in the moulds of personality and individuality. 

The doctrine of karma, therefore, is not a belief in fatalism as is often wrongly supposed, but the enunciation of a scientific law that operates inexorably and impartially everywhere in the universe, like the principle of gravitation. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 84 / Viveka Chudamani - 84🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 20. శరీర బంధనాలు - 10 🍀*

291. ఈ బ్రహ్మములో విశ్వమంతా ప్రతిబింబముగా, అద్దములో కనిపించే నగరము వలె ఉన్నది. బ్రహ్మమైన నీవు, ఈ విషయాన్ని గ్రహించి నీ జీవితమును ఉన్నతము చేసుకొనుము. 

292. ఏదైతే నిజమో, వ్యక్తి యొక్క ఆది లేక మూల సారమో, ఆ విజ్ఞానము బ్రహ్మానంద స్థితి ఒక్కటే అయినది. రెండవది లేనిది. అయిన ఆ బ్రహ్మము మాత్రమే. ఆకారానికి, క్రియలకు అతీతమైన ఆ బ్రహ్మాన్ని పొందినవాడు, తన యొక్క తప్పుడు శరీరమును అనగా నటనలతో కూడిన శరీరమును వేరుగా భావించి తాను ధరించిన వేషమును (మాస్క్) వదలివేయును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 84 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 20. Bondages of Body - 10 🌻*

291. That in which there is this reflection of the universe, as of a city in a mirror – that Brahman art thou; knowing this thou wilt attain the consummation of thy life.

292. That which is real and one’s own primeval Essence, that Knowledge and Bliss Absolute, the One without a second, which is beyond form and activity – attaining That one should cease to identify oneself with one’s false bodies, like an actor giving up his assumed mask.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 95 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 76. హృదయ సమర్పణ 🌻*

ధ్యానమున జీవుడు "తానుండుట” అనగనేమో తెలియుటకు ప్రయత్నించును. అది తెలియుట సత్యమును తెలియుటయే. ఈ ప్రయత్నమునకు మహత్తరమగు విఘ్నము భయము. భయము జీవుని ఆవరించినచో యిక అతడు పెరుగుట కవకాశము లేదు. అంతకు మునుపు పొందిన వృద్ధికూడ భయకారణముచే అక్కరకు రాదు. 

మమ్ముల ననుసరించువారు మాపై విశ్వాసముంచి భయమును వదలవలెను. భయపడు వానికి హృదయము కుంచించుకొని పోవును. ఊపిరితిత్తులు కూడ చిన్నవగును. శ్వాస పూర్ణముగ జరుగక, ఆయాసము వచ్చును. ఆయాసము భయమునకు దారితీయును. భయము మరింత పెరుగును. ఊపిరి అందని స్థితి కలుగును. దానితో మరణభయము కలుగును. ఇదంతయు భయము వలననే. 

మాపై విశ్వాసము పెంచుకొన్నచో భయము మిమ్ములను చేరదు. సద్గురువు నిర్భయమును నీ హృదయము నుండి అందించ గలడు. విశ్వాసము హృదయమును తెరువగలదు. అందుండి మీకు సమస్తమును అందించగలడు. అందులకే భరతదేశమున హృదయ మును దైవమునకు, గురువునకు అర్పించు సంప్రదాయమేర్పడినది. హృదయ సమర్పణమునకు విశ్వాసము ప్రధానము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 27 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోడానికి ఏకైక మార్గం మనసును పక్కన పెట్టడమే. 🍀*

దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోడానికి ఏకైక పూర్వరంగం మనసును పక్కన పెట్టడం. ధ్యానమంటే అదే. ఎప్పుడూ సందడి చేసే మనసును పక్కన పెట్టడానికి యిది వ్యూహం. హేతువుకు అందకుండా మనసు మాట్లాడుతూ పోతూ వుంటుంది. దాన్ని పక్కన పెట్టడానికి యిది మార్గం. ఆ మనసు ఏ పనీ లేకున్నా ఎప్పుడు బిజీగా వుంటుంది. హడావుడి పడుతూ వుంటుంది. 

మనసుని నాశనం చెయ్యాలని నేను చెప్పడం లేదు. దాన్ని పక్కన పెట్టమని మాత్రమే చెబుతున్నా. అవసరమయినపుడు దాన్ని వుపయోగించుకోవచ్చు. అదెట్లాంటిదంటే గ్యారేజీలో నీ కారుని పార్కు చెయ్యడం లాంటిది. దాన్ని అవసరమయినపుడు అక్కడి నించీ బయటికి తియ్యొచ్చు. అప్పుడు నువ్వు అధికారిగా వుంటావు.

సాధారణంగా పరిస్థితి దీనికి భిన్నంగా వుంటుంది. కారు గ్యారేజిలోకి వెళ్ళడానికి ఒప్పుకోదు. 'నేను ఆగను, వెళుతూనే వుంటాను' అంటుంది. 'నువ్వు నడుపుతూనే వుండాలి' అని ఆదేశాలిస్తుంది. రోజులో యిరవైగంటలూ సాగుతూనే వుంటుంది. ఆగకుండా పరుగులు తీస్తూనే వుంటుంది. నువ్వు నిద్రపోతున్నపుడు కూడా మనసు సాగుతూనే వుంటుంది. 

సాధారణంగా పసితనంలో ప్రారంభమయిన దాని మాటలు మరణపర్యంతం కొనసాగుతాయి. ఎవరో దాన్ని ధ్యానంతో ఆపే దాకా అది ఆగదు. ధ్యానంలో అడుగు పెట్టిన కొందరు మనసును ఆపుతారు. మనసనే మేఘాల వెనుక నున్న సూర్యుణ్ణి చూస్తారు. అంతిమ చైతన్య కాంతి దర్శిస్తారు. కేవల చైతన్యభానుణ్ణి చూస్తారు. దైవజ్ఞానాన్ని అందుకుంటారు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 276 / Sri Lalitha Chaitanya Vijnanam - 276 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।*
*పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀*

*🌻 276. 'భైరవీ' 🌻* 

పండ్రెండు సంవత్సరముల వయస్సు గల కన్యగ గోచరించు నది శ్రీమాత అని అర్థము.
భైరవ శబ్దము త్రిమూర్త్యాత్మక శబ్దమని ముందు నామములలో తెలుపబడినది భ, ర, వ వరుసగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సంకేతించు శబ్దములు. 

భైరవి అనగా ఈ మూడు తత్త్వములు తానై యున్నది. తానే మూడైనది. మూడు మరల తానొకటిగ కాగలదు. మూడిటిని ఏర్పరచి వారికి కేంద్రముగ కూడ నిలబడగలదు. కావున ఈ విధముగ భైరవి నామము శ్రీపరముగను, భైరవ నామము శివ పరముగను తెలుపుదురు.

భైరవుని భార్య గనుక భైరవి అని కూడ అందురు. భీరువుల గుంపును కూడ భైరవి అందురు. భీరువులైన కన్యల గుంపు భైరవి అని మరియొక అర్థము. పండ్రెండు సంవత్సరముల వయస్సు గల కన్యలు భీరువులై యుందురని పెద్దలు తెలుపుదురు. వారి చిత్తములు ఇంకను కామ ప్రేరితములు కాక యుండును. ఇట్టి కన్యలు అత్యంత పవిత్రులు. పవిత్రతకు పూర్ణరూపములై వారు వెలుగొందుదురు. 

పురాణములందు పార్వతి, అరుంధతి అనసూయ, శుచి, గౌరి, ఉమ నామములు భైరవ గుంపుగ తెలుపుదురు. క్లుప్తముగ కన్యా తత్త్వమునకు భైరవి పదమును వాడుదురు. నిజమగు ఆనందమునకు మనస్సు ఈ స్థితిని మరల పొందవలెనని యోగవిద్య సూచించును. సత్యకామము, ధర్మకామము తప్ప ఇతర కామములు ఈ స్థితి చేరిన వారి నంటవు. ఇట్టి వారిని కన్యాపుత్రులందురు. వీరి యందు దివ్యత్వము ప్రతిబింబించును. 

భైరవ తంత్రము ద్వారా తాంత్రికులు ఈ స్థితిని పొందుటకు ప్రయత్నింతురు. సాత్త్వికులు సత్త్వగుణము నాశ్రయించి ఈ స్థితిని పొందుదురు. మార్గమేదైననూ శ్రీదేవి తత్త్వము తనయందు నిత్యము ప్రతిబింబించుటే జీవుల గమ్యము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 276 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀*

*🌻 Bhairavī भैरवी (276) 🌻*

Wife of Bhairavā (Śiva) is Bhairavī. They are inseparable. 

It is interesting to know about the Bhairava form of Śiva. Bha means sustenance of the universe, ra means the great dissolution and va means recreation. This form of Śiva is considered as one of His subtle forms and is beyond the essence of energy of Śaktī (not beyond Śaktī Herself) and is the manifestation of the Supreme Brahman. This is a stage beyond all the stages of consciousness. No tattva-s, no mantra-s, beyond OM, in fact Bhairava is beyond everything. 

There is a series of yogic practices referred in Vijñānabhairava, a famous and ancient Kashmiri text on yoga (verse 24). ‘There are two points in our respiration. One is the outer space where exhalation ends and the other is the point within our respiratory system where the inhalation ends. In both these points, the breath takes rest for a split second. The rest does not mean that it stops for a split second, but remains in the form of Śaktī in a stage of suspended animation.  

One should concentrate on this Śaktī to realize the Brahman. This Śaktī is called Bhairavī. This masterly interpretation also confirms the prakāśa and vimarśa aspect of the Brahman. Śaktī is moving up and down as prāṇa and therefore vimarśa form. Prakāśa is the static Self-illuminating Ātman within. This is the reason why yoga teaches on the concentration of breath. 

The form of Bhairava that we see in temples is not the Bhairava discussed here. These forms of Bhairava are protectors of temples and the community living around temples. 

In general it should be understood that the union of Śiva and Śaktī is known as vāc. Śiva is the meaning of a word and Śaktī is root of the word. It is also said that Śiva and Śaktī cannot be separated. They are united firmly like a word and its meaning. One cannot separate the meaning from the word. It is the same concept with Bhairava and Bhairavī.

A girl of twelve years is called as Bhairavī.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹