నిర్మల ధ్యానాలు - ఓషో - 27
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 27 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోడానికి ఏకైక మార్గం మనసును పక్కన పెట్టడమే. 🍀
దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోడానికి ఏకైక పూర్వరంగం మనసును పక్కన పెట్టడం. ధ్యానమంటే అదే. ఎప్పుడూ సందడి చేసే మనసును పక్కన పెట్టడానికి యిది వ్యూహం. హేతువుకు అందకుండా మనసు మాట్లాడుతూ పోతూ వుంటుంది. దాన్ని పక్కన పెట్టడానికి యిది మార్గం. ఆ మనసు ఏ పనీ లేకున్నా ఎప్పుడు బిజీగా వుంటుంది. హడావుడి పడుతూ వుంటుంది.
మనసుని నాశనం చెయ్యాలని నేను చెప్పడం లేదు. దాన్ని పక్కన పెట్టమని మాత్రమే చెబుతున్నా. అవసరమయినపుడు దాన్ని వుపయోగించుకోవచ్చు. అదెట్లాంటిదంటే గ్యారేజీలో నీ కారుని పార్కు చెయ్యడం లాంటిది. దాన్ని అవసరమయినపుడు అక్కడి నించీ బయటికి తియ్యొచ్చు. అప్పుడు నువ్వు అధికారిగా వుంటావు.
సాధారణంగా పరిస్థితి దీనికి భిన్నంగా వుంటుంది. కారు గ్యారేజిలోకి వెళ్ళడానికి ఒప్పుకోదు. 'నేను ఆగను, వెళుతూనే వుంటాను' అంటుంది. 'నువ్వు నడుపుతూనే వుండాలి' అని ఆదేశాలిస్తుంది. రోజులో యిరవైగంటలూ సాగుతూనే వుంటుంది. ఆగకుండా పరుగులు తీస్తూనే వుంటుంది. నువ్వు నిద్రపోతున్నపుడు కూడా మనసు సాగుతూనే వుంటుంది.
సాధారణంగా పసితనంలో ప్రారంభమయిన దాని మాటలు మరణపర్యంతం కొనసాగుతాయి. ఎవరో దాన్ని ధ్యానంతో ఆపే దాకా అది ఆగదు. ధ్యానంలో అడుగు పెట్టిన కొందరు మనసును ఆపుతారు. మనసనే మేఘాల వెనుక నున్న సూర్యుణ్ణి చూస్తారు. అంతిమ చైతన్య కాంతి దర్శిస్తారు. కేవల చైతన్యభానుణ్ణి చూస్తారు. దైవజ్ఞానాన్ని అందుకుంటారు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
06 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment