దేవాపి మహర్షి బోధనలు - 95
🌹. దేవాపి మహర్షి బోధనలు - 95 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 76. హృదయ సమర్పణ 🌻
ధ్యానమున జీవుడు "తానుండుట” అనగనేమో తెలియుటకు ప్రయత్నించును. అది తెలియుట సత్యమును తెలియుటయే. ఈ ప్రయత్నమునకు మహత్తరమగు విఘ్నము భయము. భయము జీవుని ఆవరించినచో యిక అతడు పెరుగుట కవకాశము లేదు. అంతకు మునుపు పొందిన వృద్ధికూడ భయకారణముచే అక్కరకు రాదు.
మమ్ముల ననుసరించువారు మాపై విశ్వాసముంచి భయమును వదలవలెను. భయపడు వానికి హృదయము కుంచించుకొని పోవును. ఊపిరితిత్తులు కూడ చిన్నవగును. శ్వాస పూర్ణముగ జరుగక, ఆయాసము వచ్చును. ఆయాసము భయమునకు దారితీయును. భయము మరింత పెరుగును. ఊపిరి అందని స్థితి కలుగును. దానితో మరణభయము కలుగును. ఇదంతయు భయము వలననే.
మాపై విశ్వాసము పెంచుకొన్నచో భయము మిమ్ములను చేరదు. సద్గురువు నిర్భయమును నీ హృదయము నుండి అందించ గలడు. విశ్వాసము హృదయమును తెరువగలదు. అందుండి మీకు సమస్తమును అందించగలడు. అందులకే భరతదేశమున హృదయ మును దైవమునకు, గురువునకు అర్పించు సంప్రదాయమేర్పడినది. హృదయ సమర్పణమునకు విశ్వాసము ప్రధానము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
06 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment