శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 276 / Sri Lalitha Chaitanya Vijnanam - 276


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 276 / Sri Lalitha Chaitanya Vijnanam - 276 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀

🌻 276. 'భైరవీ' 🌻

పండ్రెండు సంవత్సరముల వయస్సు గల కన్యగ గోచరించు నది శ్రీమాత అని అర్థము.

భైరవ శబ్దము త్రిమూర్త్యాత్మక శబ్దమని ముందు నామములలో తెలుపబడినది భ, ర, వ వరుసగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సంకేతించు శబ్దములు.

భైరవి అనగా ఈ మూడు తత్త్వములు తానై యున్నది. తానే మూడైనది. మూడు మరల తానొకటిగ కాగలదు. మూడిటిని ఏర్పరచి వారికి కేంద్రముగ కూడ నిలబడగలదు. కావున ఈ విధముగ భైరవి నామము శ్రీపరముగను, భైరవ నామము శివ పరముగను తెలుపుదురు.

భైరవుని భార్య గనుక భైరవి అని కూడ అందురు. భీరువుల గుంపును కూడ భైరవి అందురు. భీరువులైన కన్యల గుంపు భైరవి అని మరియొక అర్థము. పండ్రెండు సంవత్సరముల వయస్సు గల కన్యలు భీరువులై యుందురని పెద్దలు తెలుపుదురు. వారి చిత్తములు ఇంకను కామ ప్రేరితములు కాక యుండును. ఇట్టి కన్యలు అత్యంత పవిత్రులు. పవిత్రతకు పూర్ణరూపములై వారు వెలుగొందుదురు.

పురాణములందు పార్వతి, అరుంధతి అనసూయ, శుచి, గౌరి, ఉమ నామములు భైరవ గుంపుగ తెలుపుదురు. క్లుప్తముగ కన్యా తత్త్వమునకు భైరవి పదమును వాడుదురు. నిజమగు ఆనందమునకు మనస్సు ఈ స్థితిని మరల పొందవలెనని యోగవిద్య సూచించును. సత్యకామము, ధర్మకామము తప్ప ఇతర కామములు ఈ స్థితి చేరిన వారి నంటవు. ఇట్టి వారిని కన్యాపుత్రులందురు. వీరి యందు దివ్యత్వము ప్రతిబింబించును.

భైరవ తంత్రము ద్వారా తాంత్రికులు ఈ స్థితిని పొందుటకు ప్రయత్నింతురు. సాత్త్వికులు సత్త్వగుణము నాశ్రయించి ఈ స్థితిని పొందుదురు. మార్గమేదైననూ శ్రీదేవి తత్త్వము తనయందు నిత్యము ప్రతిబింబించుటే జీవుల గమ్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 276 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀

🌻 Bhairavī भैरवी (276) 🌻


Wife of Bhairavā (Śiva) is Bhairavī. They are inseparable.

It is interesting to know about the Bhairava form of Śiva. Bha means sustenance of the universe, ra means the great dissolution and va means recreation. This form of Śiva is considered as one of His subtle forms and is beyond the essence of energy of Śaktī (not beyond Śaktī Herself) and is the manifestation of the Supreme Brahman. This is a stage beyond all the stages of consciousness. No tattva-s, no mantra-s, beyond OM, in fact Bhairava is beyond everything.

There is a series of yogic practices referred in Vijñānabhairava, a famous and ancient Kashmiri text on yoga (verse 24). ‘There are two points in our respiration. One is the outer space where exhalation ends and the other is the point within our respiratory system where the inhalation ends. In both these points, the breath takes rest for a split second. The rest does not mean that it stops for a split second, but remains in the form of Śaktī in a stage of suspended animation.

One should concentrate on this Śaktī to realize the Brahman. This Śaktī is called Bhairavī. This masterly interpretation also confirms the prakāśa and vimarśa aspect of the Brahman. Śaktī is moving up and down as prāṇa and therefore vimarśa form. Prakāśa is the static Self-illuminating Ātman within. This is the reason why yoga teaches on the concentration of breath.

The form of Bhairava that we see in temples is not the Bhairava discussed here. These forms of Bhairava are protectors of temples and the community living around temples.

In general it should be understood that the union of Śiva and Śaktī is known as vāc. Śiva is the meaning of a word and Śaktī is root of the word. It is also said that Śiva and Śaktī cannot be separated. They are united firmly like a word and its meaning. One cannot separate the meaning from the word. It is the same concept with Bhairava and Bhairavī.

A girl of twelve years is called as Bhairavī.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


06 Jun 2021

No comments:

Post a Comment